దృవ నక్షత్రాలు. ~ దైవదర్శనం

దృవ నక్షత్రాలు.

ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, రోహిణి నక్షత్రాలు. స్ధిరమైన పనులు చేయుటకు పనికివస్తాయి. నూతన కార్యములు కాకుండా ఉన్నవి. ఉదా:-గృహ నిర్మాణం, ఉద్యోగం.


చరనక్షత్రాలు:- స్వాతి,పునర్వసు,శ్రవణం,ధనిష్ఠ,శతభిషనక్షత్రాలు చర నక్షత్రాలు. ఈ నక్షత్రాలలో యాత్రలు, విద్యా, వాహన చోదనం, వివాహం, గృహారంభం, నూతన కార్యములు.


ఉగ్ర నక్షత్రాలు:- భరణి,  మఖ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభాద్ర నక్షత్రాలు ఉగ్ర నక్షత్రాలు. ఈ నక్షత్రాలుశుభ కార్యాలకు మంచిది కాదు. ఆయుధాలప్రయోగానికి, మందులు తయారు చేయటానికి పనికివస్తాయి.


మిశ్రమ నక్షత్రాలు:- విశాఖ, కృత్తిక నక్షత్రాలు. ఇవిమిశ్రమ నక్షత్రాలు.ఇవి యజ్ఞ క్రియలు,దేవాలయకార్యములు చేయుటకు మంచివి. నిప్పు, బాంబులు,పేలుడు పదార్ధాలు చేయుటకు మంచిది.


క్షిప్ర నక్షత్రాలు:- అశ్విని, హస్త, పుష్యమి, అభిజిత్నక్షత్రాలు క్షిప్ర నక్షత్రాలు.విద్యారంభానికి, అమ్మకాలకి,ఔషదాలు తీసుకొనుటకు, పనిలో సత్ఫలితాలు ఇచ్చేవాటికి, వెంటనే జరిగే పనులకు ఈ నక్షత్రాలు మంచివి.


మృదు నక్షత్రాలు:- మృగశిర, రేవతి, చిత్త, అనురాధనక్షత్రాలు మృదునక్షత్రాలు. ఇవి లలిత కళలు, స్నేహంచేయటానికి,నూతన వస్త్రాలు కొనటానికి దరించటానికి, దౌత్య కార్యాలకు, వివాహములకు మంచిది.


దారుణ నక్షత్రాలు:- మూల, జ్యేష్ఠ, ఆశ్లేష, ఆరుద్రనక్షత్రాలు దారుణ నక్షత్రాలు. ఈ నక్షత్రాలు హింస,దొంగతనం, ఆందోళన కార్యములకు, ఎదుటివారినిజయించటానికి, తాంత్రిక విద్యలకు, చేతబడులుచేయటానికి, ఇతరులపైన ప్రభావం చూపటానికి పనికివస్తాయి.


ఊర్ధ్వముఖ నక్షత్రాలు:- ఆరుద్ర, పుష్యమి, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రోహిణి , ఉత్తరాత్రయ నక్షత్రాలు వీటిదృష్టి ఆకాశం వైపుకు ఉంటుంది.కాబట్టి రాచకార్యాలకు, వ్యవహారాలకు, గృహప్రవేశాలకు,దనుర్విద్యలకు,విమాన చోదనం,గృహనిర్మాణం,విత్తనాలు చల్లుటకు, దేవాలయ నిర్మాణాలు, రాకెట్ ప్రయోగాలకు మంచివి.


అధోముఖ నక్షత్రాలు:- మూల, ఆశ్లేష, విశాఖ, కృత్తిక, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాబాద్ర నక్షత్రాలు వీటి దృష్టిక్రింది వైపుకు ఉంటుంది. బావులు త్రవ్వటానికి, నాగలిపట్టుటకు, పునాదులు త్రవ్వటానికి పనికి వస్తాయి.


తిర్యఙ్మఖ నక్షత్రాలు:- మృగశిర, రేవతి, చిత్త, అనురాధ, హస్త, స్వాతి, పునర్వసు, అశ్విని, జ్యేష్ఠ ఇవిరోడ్లు వేయుటకు, ముందుకు సాగే వాటికి, ద్వజ స్తంభప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠలకు మంచిది.


పంచక నక్షత్రాలు:- ధనిష్ఠ, స్టాభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, శుభకార్యాలకు మంచిది. క్రూరకర్మలు ప్రారంభించుటకు, సాహస కార్యములకు ఈనక్షత్రాలు పనికి రావు.


గండ నక్షత్రాలు:- ఆశ్లేష, మఖ, జ్యేష్ఠ, మూల, రేవతి, అశ్వని నక్షత్రాలలో శిశువు జన్మించిన విశేషంగా గ్రహశాంతులు చేయవలెను
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List