రామలింగేశ్వరస్వామి ఆలయం. ~ దైవదర్శనం

రామలింగేశ్వరస్వామి ఆలయం.

* జనమేజయుడు చక్రవర్తి ప్రతిష్టించిన శివలింగం....
* మహిమాన్వితమైన రామలింగేశ్వరస్వామి ఆలయం...
* కనువిందు చేసే ఆలయ శిఖరంపై కలశం....
.
.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో, గిద్దలూరు పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్యవోలు గ్రామంలో వెలిసిన రామలింగేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైంది. ఆరవ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నా యి. శైవులైన చాళుక్యులు ఆంధ్రప్రదేశ్‌లో అనేక శివాలయాలను నిర్మించారు. వాటిలో రామలింగేశ్వరస్వా మి ఆలయం ప్రసిద్ధిగాంచినది. అపురూపమైన చాళుక్యుల వాస్తుశిల్పం రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రతి ఫలిస్తుంది. ఇది ప్రాచీనతతోబాటు విశిష్టత చాటుకుంటూ ప్రసిద్ధ దేవాలయంగా నిలిచింది.
.
.
ఆలయ చరిత్ర...
పాండవుల మనుమడు జనమేజయుడు ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. ఇక్కడ చాళుక్య శైలిలో నిర్మించబడిన రామలింగేశ్వర ఆలయంలో పాటు భీమలింగేశ్వర ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. వీటిని జాతీయ వారసత్వ సంపదగా భారత ప్రభుత్వం ప్రకటించింది.
గర్భగుడి గోడలకు ఉన్న గూళ్ళలో ఈశ్వరుని విగ్రహం, లింగోద్భవ మూర్తి, దుర్గాదేవి ప్రతిమలు ఉన్నాయి. గర్భగుడి మధ్యభాగంలో రామలింగేశ్వర రూపమైన శివలింగం ఉంది. శిఖరంపై కలశం కనువిందు చేస్తుంది. గుడి చాలా ఎత్తుగా ఉంటుంది.
.
.
దేవాలయంలో పెద్ద మండపం, గర్భగుడి, అంతరాళం ఉన్నాయి. గుడికి దక్షిణాన నాలుగు చేతులున్న దేవతా మూర్తి ఉంది. అంతరాళం శిఖరంపై రాతి కలశం ఉంది. ప్రాచీనతను చాటే మండపంలో నాలుగు స్తంభాలు ఉన్నాయి. వాటిపై అలరించే శిల్పాలున్నాయి. దేవాలయ మధ్యభాగంలో నటరాజ విగ్రహం ఉంది.
సత్యవోలు రామలింగేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో ఆరు దేవాలయాలు ఉన్నాయి. అన్ని గుడులూ శైవ ఆలయాలే కావడం విశేషం. ఈ దేవాలయాలు అన్నిటిలో పెద్దది భీమ లింగేశ్వరస్వామి ఆలయం. దీని ముఖద్వారం తూర్పుది క్కుకు ఉంటుంది. మహా మండపానికి మూడు దిక్కులా అంటే తూర్పు, పశ్చిమ, దక్షిణ దిక్కుల గుండా భక్తులు వచ్చిపోయే సౌకర్యం ఉంది.

రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని చుట్టుపక్కలవారే కాకుండా, ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చి దర్శించుకుం టారు. మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో రామలింగేశ్వర స్వామి ఆలయం మరీ కిటకిటలాడుతుంది.

సత్యవోలు రామలింగేశ్వరస్వామి దేవాలయ వాస్తు శిల్ప కళ మహానంది ఆలయాన్ని తలపిస్తుంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List