ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని అతి పెద్ద దేవాలయం లింగరాజ దేవాలయం. లింగానికి రాజైన శివుని గుడి ఇది. ఇక్కడ శివుణ్ణి త్రిభువనేశ్వరుడనే పేరుతో పూజిస్తారు. దీనిని 1100 ఏళ్ల క్రితం నిర్మించారు. దీని ఎత్తు 180 అడుగులు. కళింగుల నిర్మాణశైలికి ఈ కట్టడం అద్దం పడుతుంది. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ సోమ వంశీయుడయిన కేసరి అనే రాజు 11వ శతాబ్దంలో నిర్మించి ఉంటాడని భావిస్తున్నారు. చారిత్రక ఆధారాలను బట్టి కేసరి తన రాజధానిని జైపూర్ నుంచి భువనేశ్వర్‌కి మార్చినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయం నాల్గు భాగాలుగా ఉంటుంది. వీటిలో ప్రధాన ఆలయం, యజ్ఞశాల, భోగ మండపం, నాట్యశాలలు ఉంటాయి.
No comments:
Post a Comment