March 2019 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

శివుడి స్వయంగా శుక్ర గ్రహాం గా వెలసిన ఆలయం.

(ఇక్కడ మిగతా 8 నవగ్రహ ఆలయాలు ఉన్నాయి.)
కంనూర్‌ (వీనస్‌ లేదా లార్డ్‌ శుక్ర కోసం) పరిసరాలలో తిరునల్లార్‌ (శని కోసం), సూర్యనార్‌ కోయిల్‌ (సూర్యుడు లేదా లార్డ్‌ సూర్య), తిరువెంకడు (బుధుడు లేదా లార్డ్‌ బుధ), తిరునగశ్వేరం (లార్డ్‌ రాహు), తిన్గాలుర్‌ (చంద్రుడు లేదా లార్డ్‌ చంద్రన్‌ కోసం), కీజ్హె్పరుమ్పల్లం (లార్డ్‌ కేతు)గా ఉన్నాయి.
అన్ని ఆలయాలలో కాకపోయినా... చాలా ఆలయాల్లో ప్రధాన ఆలయంతో పాటు నవగ్రహాలను కూడా మనం చూస్తూవుంటాం. అలా కాకుండా మనదేశంలో కొన్ని చోట్ల నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ నవగ్రహాల్లో ప్రత్యేకంగా శనీశ్వరునికి అనేక ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే శుక్రుడికి ఓ ఆలయం వుండడం చాలా అరుదైన విషయమనే చెప్పాలి. నవగ్రహాలతో పాటు శుక్రునికి అరుదైన ఆలయం తమిళనాడులోని తంజావూరు జిల్లా కంజనూర్‌లో ఉన్నది.
కావేరీ నది యొక్క ఉత్తర తీరం, కుంభ కోణం నగరం ఉత్తర తూర్పు నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది ఈ ప్రదేశం. ఈ ప్రదేశంలో అగ్నీశ్వరార్‌ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. అగ్నీశ్వరార్‌ స్వామి ఆలయం శివునికి అంకితం చేయబడి, శుక్ర గ్రహం కోసం ప్రార్థనకు ప్రముఖ ప్రదేశంగా ఉన్నది. ఈ ఆలయం కావేరి డెల్టా యొక్క 9 నవగ్రహ ఆలయాలలో ఒకటిగా పేరొందింది. అనేక చిన్న కొండలు ఎత్తు 100-150 అడుగుల గలవి కంజనూర్‌ ఉత్తరాన చూడవచ్చు.
అగ్నీశ్వరార్‌ స్వామి ఆలయంలో అధ్యక్షుని విగ్రహంగా అగ్నీశ్వరార్‌ ఉంది. ఈ దేవాలయం శివుడిని స్వయంగా శుక్ర గ్రహానికి ఉదాహరణగా చెప్పబడింది. ఈ నవగ్రహ ఆలయం సమీపంలో సూర్యనార్‌ కోయిల్‌ ఉంది. ఈ ఆలయం సూర్యునికి అంకితం చేయబడింది. సంప్రదాయం ప్రకారం, యాత్రికులు దక్షిణ ద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించాక శివపార్వతుల విగ్రహాలను కుడివైపున, గణేషుని విగ్రహం ఎడమ వైపున ఉంచుతారు. ఆలయ నిర్మాణం ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది తూర్పు దిశాభిముఖంగా 5 అంతస్తుల గోపురంతో ఎంతో అద్భుతంగా వుంటుంది.
ఎలా వెళ్ళాలి?
కుంభకోణం రైల్వే స్టేషన్‌, త్రిచి జంక్షన్‌లు కంజనూర్‌కు సమీప, ప్రధాన రైల్వే స్టేషన్లు. సందర్శకులు కంజనూర్‌ చేరుకోవడానికి కుంభకోణం లేదా త్రిచి నుండి ఒక బస్సు లేదా టాక్సీ ద్వారా కూడా వెళ్లవచ్చు.

Share:

తిరువన్నాపురం...శౌరి రాజ పెరుమాళ్.

(ఈ క్షేత్రంలో మూలమూర్తి శ్రీకృష్ణుడికి తలకు శిరోజాలు కలవు)
(Thirukannapuram Sowriraja Perumal Temple)
తమిళనాడు కుంభకోణం దగ్గర తిరువన్నాపురం లో’’ శౌరి రాజ పెరుమాళ్’’ ఆలయం లోని కృష్ణుడికి తల వెంట్రుకలు ఉండటం వింత. శౌరి అంటే శిరోజాలు అనీ అర్ధం ఉంది కనుక జుట్టుపెంచుకొన్న దేవుడు అని కూడా అర్ధం. నిలబడిన కృష్ణ మూర్తి దివ్య దర్శనం భక్తులకు పులకింత నిస్తుంది. ఈ ప్రాంతపు రాజు మాధవ స్వామికి నిత్యం పూల దండలు భటులతో పంపేవాడు భటులు వాటిని కొన్నిటిని దొంగతనం గా అమ్ముకొనే వారు .రాజుకు అనుమానం వచ్చి స్వయం గా ఆలయం లో నిగ్గు తెల్చాలనుకొన్నాడు అర్చకుడు రంగ భట్టార్ కంగారు పడి పరమాత్మ పై భారం వేశాడు ఒక హారం అల్లించి స్వామి మేడలో వేస్శాడు రాజు వచ్చి చూశాడు అందులో ఒక వెంట్రుక కనీ పించి రాజు మండి పడ్డాడు .భక్తుడైన పూజారిని రక్షించే భారం భక్త వరదుడి పై పడింది .ఇంకోరోజు రాజు వచ్చి చూస్తె విగ్రహానికి వెంట్రుకలు కనిపించాయి .అప్పటి నుంచి శౌరి రాజ పెరుమాళ్ అయ్యాడు స్వామి.
స్థలపురాణం ప్రకారం వేరోక కథ కలదు...
శ్రీమహావిష్ణువుకి సంబంధించిన కొన్ని క్షేత్రాల్లో మూలమూర్తికి శిరోజాలు కనిపించిన విషయాన్ని విశేషంగా ప్రస్తావిస్తూ స్థలపురాణంగా వివిధ కథనాలు వినిపిస్తూ వుంటాయి. అయితే ఆయా రాజుల చరిత్రతో ఈ సంఘటనలు ముడిపడివుండటం వలన, అవి మహిమాన్వితమైన సంఘటనలుగానే చరిత్రలో మిగిలిపోయాయి. అలాంటి సంఘటన ఒకటి తమిళనాడు ప్రాంతంలోని 'తిరువన్నాపురం'లో జరిగినట్టుగా చెప్పబడుతోంది.
శ్రీకృష్ణుడికి నిత్య ధూప దీపాలు నిర్వహించే అర్చకుడు స్వామివారికి పరమభక్తుడిగా ఉండేవాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు.
అయితే కుంభకోణం నుంచి స్వామివారి కోసం రాజుగారు రోజుకొక పూలమాలను ప్రత్యేకంగా కట్టించి పంపించేవాడు. అందంగా వుండే ఆ పూలమాలికను తను ధరిస్తానంటూ చిన్న భార్య గారాలుపోవడంతో ఆ అర్చకుడు కాదనలేకపోతాడు. ఒకరోజున స్వామివారిని దర్శించుకోవడానికి రాజుగారు స్వయంగా వస్తున్నాడనే విషయం పూజారికి తెలుస్తుంది. దాంతో వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆ రోజు ఉదయం రాజుగారు పంపించిన పూలదండను భార్య దగ్గర నుంచి తీసుకువస్తాడు.
రాజుగారు ఆలయానికి రాగానే పూజచేసి, స్వామివారి పూలదండను స్వీకరించమని అందజేస్తాడు. ఆ పూలదండకి స్త్రీ శిరోజం వుండటం చూసిన రాజుగారు దానిని గురించి ప్రశ్నిస్తాడు. కంగారుపడిపోయిన పూజారి, స్వామివారి విగ్రహానికే శిరోజాలు ఉన్నట్టుగా చెబుతాడు. మరునాడు ఉదయం ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి తాను గర్భగుడిలోకి వచ్చి చూస్తాననీ, అతను చెప్పినది అసత్యమైతే తగిన శిక్ష తప్పదని వెళ్లిపోతాడు. తనని ఈ గండం నుంచి గట్టెక్కించమంటూ ఆ పూజారి స్వామివారి పాదాలను ఆశ్రయిస్తాడు.
మరునాడు ఉదయం రాజుగారు వచ్చి గర్భాలయంలో గల మూలమూర్తిని పరిశీలిస్తాడు. కృష్ణుడి విగ్రహానికి సహజమైనటువంటి శిరోజాలు వుండటం చూసి ఆశ్చర్యపోతాడు. స్వామివారికి
శౌరి ( తమిళంలో 'శిరోజాలు' ) రాజ పెరుమాళ్ గా నామకరణం చేస్తూ, ఆయన మహిమను జనసామాన్యంలోకి తీసుకువెళతాడు. తనని రక్షించిన దైవానికి ఆ పూజారి కృతజ్ఞతలు తెలుపుకోవడమే కాకుండా, ఆ తరువాత అలాంటి తప్పులు జరగకుండా నడచుకున్నాడు. అప్పట్లో స్వామివారికి శిరోజాలు మొలిచిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయని చెప్పుకుంటూ వుంటారు.

Share:

“హోలీ”

మీ జీవితం వర్ణశోభితం కావాలని ...
మిత్రులందరికి హోలీ శుభాకాంక్షలు...
కాముని పున్నమి రోజే “హోలీ” ...
ఆనందకరమైన హోలీ .. శ్రీ కృష్ణరాసలీలల కేళి ...

.
.
ఈ రోజు హొలీ పండుగ. మన భారతదేశం వివిధరకాల ఆచారాలు, సాంప్రదాయాలకు విలువ నిచ్చే దేశం. మన దేశంలో జరుపుకొనే సరదా పండుగల్లో హొలీ ముఖ్యమైన పండుగ. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఈ పండుగని ఆనందోత్సహాలతో అన్ని వయసుల వారు జరుపుకుంటారు వసంతకాలం రాకకు గుర్తుగా పకృతి అంతా
పచ్చపచ్చగా అగుపిస్తూ సుందరంగా కనులవిందు చేస్తుంది. ఒకరిపై ఒకరు పిచికారీలతో రంగులు చిమ్ముకుంటూ సరదాగా ఆడి పాడుకుంటారు. హొలీ అంటే కామదహనం.
.
హోలీ పండగ వసంతాగమనాన్ని తెలియజేస్తుంది. ఈ పండగను మనదేశంలో పలురాష్ట్రాలలోని ప్రజలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసు కుంటారు. ముఖ్యంగా, నగరాలలో వివిధ ప్రాంతాల నుండి ఉద్యోగ ధర్మంగా వచ్చిన ప్రజలు ఉంటారు. అందరూ కలిసి మెలిసి మెలుగుతూ సంఘీభావంతో, ఆనందంతో, జరుపుకోవడం కనిపిస్తుంది.హోలీ పండగ ఈనాటిది కాదు. దక్షయజ్ఞంలో అవమానానికి గురైన సతీదేవి హిమవంతునికి పుత్రికయై జన్మించి, శివుడినే పతిగా పొందగోరి, అనునిత్యమూ ఆయననే పూజిస్తూ, సపర్యలు చేస్తూ ఉండేది.
.
లోకకళ్యాణార్థం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయదలచిన దేవతలు మన్మథుని సహాయం కోరగా, అతడు శివుడిపై పూలబాణాన్ని కురిపిస్తాడు.ఈ విషయాన్ని దివ్య దృష్టితో చూసిన పరమేశ్వరుడు కోపగించి, తన మూడవ నేత్రాన్ని తెరచి, మన్మధుడిని భస్మం చేస్తాడు.రతీదేవి రోదించగా, జాలిపడిన పార్వతీ దేవి కోరిక మేరకు మన్మధుడు ఆ శరీర రూపంతో, సజీవుడయ్యేట్లుగా వరాన్ని ప్రసాదిస్తాడు.ఆరోజు ''ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. అదే కాముని పున్నమిగా జరుపుతున్నాం.
.
పూర్వం రఘుమహారాజు కాలంలో 'దాండ అనే ఒక రాక్షసి ఉండేదట! అది లోక కంటకురాలై, రాజ్యంలోని శిశువులను పట్టుకొని తినేస్తూ ఉండేదట! ప్రజలంతా వెళ్లి రాజుగారికి మొర పెట్టుకోగా, ఆయన వెళ్లి మునీశ్వరులను ప్రార్థిం చాడట. ఆమె ఒక బాలగ్రహం అనీ, ఆమెకి మంట అంటే భయం అనీ, ఆమె మరణం మంటల వల్లనే జరుగుతుందని చెప్పారట.రాజుగారి ఆజ్ఞమేరకు ఊరినిండా మంటలు వెయ్యగా, భయంతో కేకలు వేస్తూ, ఆ రాక్షసి మరణించిందట. ఆరోజున మంటలో పిడకలువేసి, ప్రజ్వలింపజేసి, ప్రదక్షిణం చెయ్యాలని ధర్మసింధువు, నిర్ణయ సింధువుల్లో హేమాద్రి పండితుడు తెలియజేశాడు.
.
ఇంకొక కథ ప్రకారం, హిరణ్యకశిపుని సోదరి, హోలిక అనీ, ఆమె ''ప్రహ్లాదుడి వల్లనే తన అన్నగారు చనిపోయేరనే కోపంతో, ప్రహ్లాదుడిని మంటల్లో తోయించిందని, కానీ, ఆమంటలు పిల్ల వాడిని ఏమీ చేయక, ఆ హోళికనే దహించి వేశా యని, అంటూ చెడుపై మంచి సాధించిన గుర్తుగా ఈ హోళీని జరుపుకుంటారు. వేరే కథ ఏమి టంటే, ఎంత చెప్పినా హారి భక్తి మానని ప్రహ్లాదు డిని హిరణ్య కశిపుడే మంటల్లో పడేయించితే, అతడి మేనత్తయైన హోలిక పిల్లవాడిని ఒళ్లో పెట్టుకొని మంటల్లో కూర్చుందని, అష్టసిద్ధులూ ఉన్న ఆమెను మంటలు ఏవీ చెయ్యవు కాబట్టి, పిల్లవాడు క్షేమంగా అగ్ని నుండి బైటపడ్డాడని, పండగ చేసుకున్నారట!
.
ఇవన్నీ ఇలా ఉండగా, ద్వాపరయుగంలో తన నెచ్చెలియైన రాధ తనకంటే తెల్లగా ఉందని, తాను నల్లగా ఉన్నానని, అలిగి, తన తల్లియైన యశో దమ్మ వద్ద వాపోయేడట, చిన్నికృష్ణుడు. అయితే ఒక పని చెయ్యి, రాధ శరీరం నిండా రంగులు పూసెయ్యి అని సలహా ఇచ్చి నవ్వుకుందట యశోద! తల్లి సలహా ప్రకారం రాధను పట్టుకొని, రంగునీళ్లను కుమ్మరించాడట కృష్ణుడు. మరిరాధ ఊరుకుంటుందా? తానూ కన్నయ్యపై వసంతాన్ని జల్లింది. అలా మొదలైన ఈ వేడుక, స్నేహితులు, బంధువులు, ప్రేమికులు, తెలిసినవారు, తెలియని వారు అందరూ ఒకరిపై ఒకరు రంగులు జల్లు కొంటూ, రంగుల్ని పూసుకుంటూ వేడుక చేసుకునే స్థాయికి చేరింది.
.
ఈ 'కామ దహనాన్ని కొన్ని చోట్ల చలిమంటలుగా వ్యవహరిస్తారు. ఇంకా, కొన్నాళ్లకు పండగ వస్తుం దనగానే, కట్టెలు, పిడకలు దుంగలు, చెత్త, చెదారం పోగు చేసి ఉంచుతారు. పిల్లలు, పెద్దలు, అందరూ సంతోషంతో కేరింతలు కొడుతూ, మంట చుట్టూ తిరుగుతూ ఆనందిస్తారు.కాముని పున్నమిగా, డోలికోత్సవంగా ఫాల్గుణోత్సవంగా పిలుస్తూ జరుపుకుంటారు. కామదహనం పేరుతో చేసే ఉత్సవంలో ఎంతో ఆధ్యాతికత దాగి ఉంది. ''కామాన్ని అంటే కోరికని, దహించివేసి (పోగొ ట్టుకొని) అందరూ సోదరభావంతో, వాత్సల్య, అభిమానాలతో, కులాతీత, మతాతీత, జీవితాన్ని గడపడమే, మానవజన్మకు చరితార్థం అనేది ఆంతర్యం. కొన్ని ప్రాంతాల్లో ఈసీజన్‌కి అను గుణంగా పండిన పంటలతో, అంటే శనగపప్పు, గోధుమలు వగైరాలతో, బొబ్బట్లు చేసి మంటల్లో వేస్తారు.
.
ప్రకృతి ప్రసాదించినవి ప్రకృతికి సమర్పించడమే ఇందులోని సందేశం. పితృ దేవతలను సంతృప్తి పరచి, హోలికా భూమికి నమస్కరిస్తే, సర్వ దుఃఖాలు తొలగుతాయని, శుభం కలుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా ఈ పండగ ఉత్తర భారతంలో చాలా ప్రాచుర్యం పొంది, క్రమక్రమంగా అన్ని ప్రాంతాలకూ విస్తరించి, రంగుల పండుగగా ఆచరింపబడు తోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాయలసీమల్లోనూ వైభవోపేతంగా జరుపబడు తోంది. సంస్కృతీ సాంప్రదాయాల మేళవింపుగా, భిన్నత్వంలో ఏకత్వం గోచరిస్తూ సర్వ మానవ సౌభ్రాతృత్వానికి దారితీస్తోంది.
.
మహారాష్ట్రలో హోళిక దిష్టిబొమ్మను మంటలో వేసి, దహనం చేస్తారు. ప్రొద్దున్న నుండి రాత్రి వరకూ మంటలను వేసి మహిళలు ప్రత్యేకంగా తీపి పిండివంటలను చేసి నైవేద్యం సమర్పిస్తారు. మణిపూర్‌లో, వారంరోజుల పాటు ఈ ఉత్సవాలు జరిపి, చివరిరోజున కృష్ణుడి ఆలయం వరకూ ఊరేగింపుతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, వెళ్లి పండగ చేస్తారు. ఇలా వయో భేదాలు మరచి, కులమతాలకు అతీతంగా సుఖసంతోషాలతో జీవితాలు సాగాలనే ఆకాంక్షతో జరుపుకునే సంబరం ఈ పండగ...

https://www.facebook.com/rb.venkatareddy
Share:

రామలింగేశ్వర ఆలయం.

విజయనగర సామ్రాజ్య ఆరంభ దశలో విద్యారణ్యులు నారాయణ భట్టు అనే పండితుడిని పినాకిని నది ప్రాంతంలో సంచరించమని ఆదేశించారు. అప్పటికే భాస్కర క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ప్రాంతంలో తాళఫలవృక్షాలు ప్రాంతంలో అధికంగా ఉండడంతో తాటి పల్లెగా నారయనభట్టులు నామకరణం చేశారని చరిత్ర చెబుతోంది. అది తాడిపత్రిగా రూపాంతరం చెందింది. రాయల కాలానికి ముందు జైన సామంత రాజు ఉదయాదిత్యుడు 1199 లో ఇక్కడ పాలన చేసినట్లు దేవాలయ శిలా శాసనంలో ఉంది.
కాశీ క్షేత్రాన్ని తలపించే విధంగా 1460 – 1475 మధ్య కాలంలో ఈ దేవాలయాన్ని తాడిపత్రి పాలకుడు తిమ్మ నాయుని కుమారుడు రామలింగనాయకుడు నిర్మించాడు. ఖజురహో తరహాలో అద్భుత శిల్ప సంపదతో తీర్చిదిద్దారు. శివలింగం చుట్టూ ఎప్పుడు నీరు ఉబికి వస్తుండటంతో బుగ్గ రామలింగేశ్వరస్వామిగా ప్రసిద్ధికెక్కాడు. అభిముఖంగా పెన్నానది,, వెనుక శ్మశానం ఉండడంతో రెండో కాశి క్షేత్రంగా వాసికెక్కింది. కారణంతరాల వాళ్ళ ఆలయ గోపురాలు అసంపూర్తిగా వదిలేసారు. ఇప్పటికి అత్యంత ఎత్తులో ఉన్న శివలింగం చుట్టూ నీరు ఉబికి రావడం విస్మయం గొలిపే అంశం.
రామలింగేశ్వరుని విగ్రహం నీటి బుగ్గలలో దొరికినందున ఈ స్వామి బుగ్గరామేశ్వరుడై నాడు. అమ్మ వారు పార్వతీదేవి. రామలింగేశ్వర ఆలయాన్నీ చూస్తే ఈ స్థలం దేవాలయాల భూమియా! అన్న ఆశ్చర్య ఆనందాలు మదిలో నింపుకుని వస్తారు. ఎంతటి అసాధారణ శిల్పగరిమ! దేవాలయాలలోని అద్భుతమైన శిల్పసంపద, గట్టిగా మాట్లాడితే హోయసల దేవాలయాలయిన హళీబీడు, బేలూరు శిల్పాలని మురిపిస్తాయని చెప్పవచ్చును.
ఈ ఆలయ ప్రకారాలు సువి శాలమైనవి. ఆనాటి రాజుల కళాభిరుచీ, ఆ అమర శిల్పుల నిర్మాణ వైచిత్రీ సుస్ప ష్టంగా ఈ ఆలయాలలో దర్శించి పరవశిస్తాము. ఈ కట్ట డాలు పునాదుల నుంచే ఉత్తమ చిత్ర నిర్మాణాలతో అసామాన్యాలుగా గోచరిస్తాయి. రామలింగని ఆలయం పినాకినీ తీరాన ఉన్నది. ఆలయానికి గల ఉత్తర, దక్షిణ, పశ్చిమ గోపు రాలు శిథిలాలైనాయి. రామలింగేశ్వర లింగం భూమిలో నుంచీ చొచ్చుకొని వచ్చినట్లుంటుంది. రామలింగని ఎదురుగా నంది ఉన్నది. నందికి చేరువలో ఉన్న గోపురం నుంచి చూస్తే నిర్మలంగా ప్రవహించే పినాకిని కన్నుల విందుగా కనిపిస్తుంది. వర్షాకాలంలో పై నుంచీ కురిసిన గంగ గలగలా పారుతూ పెన్నలో కలుస్తుంది. మితిమీరిన వర్షా లొస్తే పినాకిని గంగానాథుని కలవటానికి గుడిలోకి ప్రవ హించి వస్తుంది. ఈ ఆలయాలు శిథిలావస్థలో ఉన్నా కళావై భవం మాత్రం చెక్కు చెదర్లేదు. విజయనగర చక్రవర్తుల శిల్ప కళా సంపదకు తాడిపత్రి ఆలయాలు నిలువెత్తు నిదర్శనాలు, గీటురాళ్లూను.

Share:

నాడీ జ్యోస్యం తెలియజేసే వైదీశ్వరన్ కోయిల్.


తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో ఉన్న ఒక గ్రామం. చిదంబరానికి, కుంభకోణానికి మధ్యలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్, శీర్కాళ్ గొప్ప క్షేత్రాలు. వైదీశ్వరన్ కోయిల్, శీర్కాలి రెందు, కేవలం 8 కి.మీ. దూరం ఉన్న ప్రక్క ప్రక్క ఊళ్ళు. వైదీశ్వరన్ కోయిల్ ఉత్తర తమిళనాడు వారికి చాలా ముఖ్యమైన పవిత్రస్థలం. ఒకానొక ముని తనకు గొప్ప జబ్బు చేయగా పరమేశ్వరుని గూర్చి ఎంతో భక్తితో తపస్సు చేయగా శంకరుడు ఒక వైద్యుని రూపంలో ప్రత్యక్షమై, అతని జబ్బు నయం చేశాడమొ స్థల పురాణం. ఈ ప్రాంతం వారు ఇంట్లో ఎవరికీ ఏ జబ్బు చేసినా, ఈ వైదీశ్వరునికి మొక్కుకుంటారు. ఊరు మాత్రం అతిచిన్న పల్లెటూరు. అయినా దేవాలయం మాత్రం ఎన్నడూ భక్తులతో నిండి ఉంటుంది. ఈ మధ్య ఈ ఊరికి చెందిన 'నాడీగ్రంథ' జ్యోతిష్కులు అన్నిచోట్ల వెలియడంతో ఈ ఊరికి జ్యోతిషం చెప్పించుకుంటానికి వచ్చేవారు ఎక్కువ అయ్యారు. వైదీశ్వరన్ కోయిల్ కు శీర్కాలి మధ్యదూరం కేవలం ఐదు మైళ్ళు. తమిళులందరికి శిర్కాలి చాలా పవిత్రమైన యాత్రాస్థలం. తమిళులకు ఈ దేవాలయం సంస్కృతిక కేంద్రం లాంటిది. ఈ ఊరిని గూర్చి వారందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. గొప్ప శివభక్తాచార్యుడు 'జ్ఞాన సంబంధర్' ఈ శిర్కాలిలోనే జన్మించారు. ఈ సంబందర్ పసికూనగా ఉన్నప్పుడు పార్వతీదేవి స్వయంగా తన స్తన్యమిచ్చి ఆ పిల్లవాని ఆకలి తీర్చింది. ఆ తరువాత నుంచి ఆ పిల్లవాడు అమిత జ్ఞానవంతుదై చిన్నతనం నుండే గొప్ప శివభక్తుడై శివతత్వాన్ని అందరకూ ప్రభోదిస్తూ కేవలం పదహారు సంత్సరాలు మాత్రమే జీవించి, తనువూ చాలించారు. అయితే, ఆ పదహారు సంవత్సరాల లోపునే అయన అనేక వేల కీర్తనలు రచించారు. అందులో దాదాపు నాలుగు వందల కృతులు.
మనయొక్క భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసే తాళపత్ర గ్రంథాలు భారతదేశంలో కొన్ని కుటుంబాల వద్ద ఉన్నాయి. ఆ కుటుంబాలు వాటిని వంశ పరంపరగా, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాయి. "శివపార్వతుల" సంభాషణగా, సిద్ధులందించిన ఈ విజ్ఞాన నిధిని "నాడీ జ్యోతిష్యం" అంటారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడులోని 'చిదంబరం' పట్టణానికి దగ్గర గల 'వైదీశ్వరన్ కోయిల్' అనే గ్రామంలో కొన్ని కుటుంబాల వద్ద ఈ తాళపత్రాలు ఉన్నాయి. ఈ తాళపత్రాలనే నాడీ పత్రాలు అంటారు. ఇప్పుడు మనకు లభిస్తున్న తాళపత్రాలు కొన్ని మాత్రమే. కనుక అందరి వృత్తాంతాలు ఈ నాడీ పత్రాలలో ఉండవు. కొన్ని తాళపత్ర గ్రంథాలను ఆనాటి తంజావూరు మహారాజు 'రెండవ షర్ఫోజి'వారు 'సరస్వతీ మహల్' గ్రంథాలయంలో ఉంచగా, వాటిని బ్రిటిషు వారు స్వాధీన పరుచుకొన్నట్టు తెలుస్తున్నది. బ్రిటిషు వారి నుంచి వాటిని సంపాదించి కొందరు విదేశీయులు వీటితో వ్యాపారం చేస్తున్నారు. ఈ నాడీ 'జోస్య' విధానం మొదట వ్యక్తి తన చేతి బొటన వేలిముద్ర ఇవ్వాలి. దీని ఆధారంగా నిపుణులు తాళపత్ర గ్రంథాలను పరిశీలించి ఆ వ్యక్తి వివరాలను తెలియజేస్తారు, అవి సరిపోలితే తదుపరి పరిశీలన ప్రారంభిస్తారు. ఆ లభించిన వారికి తండ్రి పేరు, తల్లి పేరుతో సహా పుత్రుల, భార్య పేరు తెలియజేయటం కూడా అబ్బురపరచే విషయం. ఇందులో కూడా నేడు కొందరు నకిలీ నాడిజోస్యులు ప్రవేశించి శాస్త్రాన్ని వ్యాపారపరంగా వాడుకుంటున్నారు.

Share:

పూరి జగన్నాధస్వామి గుడిని తలపిస్తున్న శ్రీవేణుగోపాలస్వామి ఆలయం.


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఈశాన్య సరిహద్దులో ఉన్నది. జిల్లా ముఖ్యపట్టణమైన శ్రీకాకుళం. మెళియాపుట్టి గ్రామములొ వున్న శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయం ఒక దర్శనీయ ప్రదేశము. ఈ గుడి జిల్లాలో రెండవ పెద్ద గుడి. ఈ గుడి పూరి జగన్నాధస్వామి గుడిని తలపిస్తుంది. ఈ గ్రామమునకు ఆనుకుని మహేంద్రతనయ నది ప్రవహిస్తుంది. గ్రామమునకు కొద్దిదూరమున ఇంజమ్మకొండ వుంది. ఈకొండపైన ఒక గుహవుంది. ఈ గుహలో కొన్ని దేవతామూర్తుల విగ్రహములు వున్నవి.
ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఒక పవిత్ర పుణ్య స్థలం. పూర్వం దేవతలు ఈ గుడిని నిర్మించారు అని ఇక్కడి ప్రజల నమ్మకము. ఇక్కడ మాఘ పౌర్ణమి నాడు ప్రత్యేకమైన పూజలుమహోత్సవాలు మరియు అన్నదానం జరుగుతాయి. ఈ ఆలయంలోని శ్రీ వేణుగోపాలస్వామి పిలిస్తే పలుకుతాడని భక్తులు విశ్వసిస్తారు. అయితే ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఈ విగ్రహం నీలమేఘ ఛాయలో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేతుడై పూజలు అందుకుంటూ వున్నాడు. ఇక్కడి దేవాలయ కుడ్యాలపై రామాయణ ఘట్టాలు అందంగా చెక్కబడి ఉన్నాయి. తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంటాయి. ప్రతి యేడు మాఘ శుద్ధ నవమి నుంచి బహుళ పాడ్యమి వరకూ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వేలసంఖ్యలో వచ్చిన ప్రజలు స్వామివారిని దర్శించుకుంటారు.

Share:

వధువరులకు చుడవాలిసినవి.

వధువరులకు మొదట చుడవాలిసినవి
1. నాడి కూటమి
ఆది నాడి 
అంత్య నాడి
మద్య నాది
వధువరులకు ఇదరికి ఒకటే నాడి అవ్వకూడదు. గుణాలు - 8
2. రాశి కూటమి
గుణాలు - 7
వధువు నుంచి వరుడికి చూడాలి. అందులో ఇదరిది షష్ఠటాష్టకం కాకూడదు. ద్వాదశం కాకూడదు, నవమ్ పంచకం కాకూడదు.
షష్ఠటాష్టకం 2 రకాలు :
శుభ షష్ఠటాష్టకం - ప్రీతీ షష్ఠటాష్టకం
అశుభ షష్ఠటాష్టకం - మృత్యు షడస్టకమ్
శుభ షష్ఠటాష్టకం - ప్రీతీ షష్ఠటాష్టకం - దోషం లేదు
షష్ఠటాష్టకం చూసే విధానం :
వధువు కి చంద్రుడు ఎ రాశి లో ఉన్నాడు, వరుడు కి చంద్రుడు ఎ రాశి లో ఉన్నాడు చూసి వధువు నుంచి వరుడుకీ లేకించాలి. ఒకవేళ ఎ రాశులలో షష్ఠటాష్టకం పడిన పరవాలేదు, దోషం లేదు.
అశుభ షష్ఠటాష్టకం - మృత్యు షడస్టకమ్ - చెడు జరుగుతుంది.
వధువు నుంచి వరుడుకీ 6, 8 రాసులు అవ్వకూడదు.
3. ద్విర్ద్వాదసి 2 రకాలు - వధువు నుంచి వరుడుకీ 2,12/5,9/6,8.
సుభ ద్విర్ద్వాదసి
అశుభ ద్విర్ద్వాదసి
సుభ ద్విర్ద్వాదసి - దోషం లేదు
అశుభ ద్విర్ద్వాదసి
4. గ్రహమైత్రి
గుణాలు - 5
మిత్ర గ్రహాలు
శత్రు గ్రహాలు
సమాన గ్రహాలు - శత్రువు లు కాదు అలాగని మిత్రులు కాదు. మిగతావి కుదిరితే అంటే రాశి కూటమి & నాడి కూటమి బాగుంటే సమాన గ్రహాలు అయిన పరవాలేదు.
వధువరుల రాశి అధిపతులు శత్రువు అయితే చేయకూడదు.
ప్రేమించుకునే వాలకి / మేనరికం / తెలిసిన /కావలిసిన వాళ్ళకి తప్పకుండ చేసుకోవాలి అనుకునపుడు రాసి కూటమి కలవనప్పుడు/ గ్రహ మైత్రి కుదరకపోయినా, నవాంస లో ఇదరికి వుండే నవాంస చక్రం లో చంద్రుడు వరుడు కి నవాంస లో మిత్రత్వం వున్నా పర్వాలేదు.
5. గణ కూటమి
గుణాలు - 6
దేవా గణం
మనుష్య గణం
రాక్షసి గణం
రాక్షసి గణం - మనుష్య గణం - అస్సలు చేయకూడదు.
వధువరుల లో ఒకరిది కింద ల వున్నా పరవాలేదు
ఘార్గ మహర్షి చెపిన స్లోకలో ఇలా వుంది:
గ్రహమైత్రి , రాశి కూటమి , నాడి కూటమి బాగుండి, జాతక చక్రం లో మిగతా దోషాలు ఏమి లేకుండా వుంటే మనుష్య గణం-రాక్షసి గణం అయిన పరవాలేదు.
దాస కూటాలు ఉనాయి
అష్ట కూటము లు చూస్తారు
వర్న్ కూటమి
యోని కూటమి
తార కూటమి
వస్య కూటమి
గ్రహమైత్రి , రాశి కూటమి , నాడి కూటమి కచితంగా కలవాలి. మిగతా కూటమి లో దోషాలు వున్నా పర్వాలేదు.
వధు వరులకి కళత్ర స్థానం 7(సప్తమ స్థానం)
అమ్మాయి కి కళత్ర స్థానం లో భర్త / అబ్బాయి కి కళత్ర స్థానం లో భార్య స్థానం లో దోషం ఉండకూడదు , పాప గ్రహాలు ఉండకూడదు . అ స్థానాదిపతి దుస్థానలో ఉండకూడదు.
మన: కారకుడు చంద్రుడు ఎకడ వునాడు చూసి ఎడారికి ఇది సరిపోతుంద లేదా.
గణ మెలనె పట్టిక - చూసేటపుడు ముందుగ నాడి కూటమి, రాశి కూటమి, గ్రహమైత్రి. వీటి పాఇంట్లు చూసి తరువాత మిగిలిన కూటమి చూసుకోవాలి .
ఇవి కూడా చుస్కోవాలి
అయిషు
వైదవ్య యోగాలు
వివాహేతర సంబందాలు ఉంటాయ
ఆరోగ్యం
రవి , చంద్రుడు , కుజుడు కూడా చూస్తే చాల మంచిది.
రవి బలవంతుడై, ఉచ్ఛస్థానం లోకాని . సప్తమ స్థానం లో కానీ, లగ్న స్థానం, వక్క్ స్థానం.
చంద్రుడు - ఇదరికి బాలన్స్ అయేలా చూడాలి.
సమ సప్తకం - ఇదరికి ఒకలా రాసి నుంచి ఒకలకి , ఒకలా లగ్నం నుంచి ఒకలకి ఎదురు ఎదురుగా వుండడడం. దానివల్ల దోషం లేదు అని చెప్తూ వుంటారు కానీ ,
కుంభ రాశి - సింహ రాశి సమ సప్తకాలే అవుతాయి కానీ ఇదరికి పరమ శత్రుత్వం. ఇలా వున్దడ్డం వల్ల కుంభ రాశి వాళ్ళు సింహ రాశి వారికీ ఎప్పుడు బయపడుతూ వుంటారు.

Share:

రామతీర్థం.

విజయనగరం పట్టణానికి ఈశాన్యంగా 12 కి.మీ. దూరంలో చంపావతీ నదీ సమీపంలో శ్రీరామతీర్థం వుంది. శ్రీ రామచంద్రుడు ... శివుడిని ఎంతగా ఆరాధిస్తాడో, శివుడు అంతగా ఆయనను ప్రేమిస్తాడు. పురాణాలలో సైతం ఈ విషయం స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది. రావణాసురుడిని సంహరించడానికి అవసరమైన శక్తి కోసం శివుడి గురించి తపస్సు చేసిన రాముడు, రావణ వధ అనంతరం ఆ పాపం అంటకుండా వుండటం కోసం వివిధ ప్రదేశాల్లో కోటి శివలింగాలను ప్రతిష్ఠించాడు.

(Ramatheertham Sri Rama Temple In Vizianagaram)

ఆ క్రమంలో రాముడు ఈ ప్రదేశంలో నెలకొని ఉన్న సదాశివుడిని దర్శించాడు. ఈ ప్రదేశంలో ఓ కోనేరును తవ్వించి ఆ నీటితో ఇక్కడి శివుడికి అభిషేకం చేశాడు. రాముడు ఇక్కడ కోనేరును తవ్వించిన కారణంగానే ఈ ప్రాంతానికి 'రామతీర్థం' అనే పేరు వచ్చినట్టు స్థల పురాణం చెబుతోంది. రాముడు దర్శించిన నాటినుంచి ఇక్కడి స్వామివారు 'మోక్ష రామలింగేశ్వరుడు' గా పూజలు అందుకుంటున్నాడు.
'రామతీర్థం' గా చెప్పబడుతోన్న ఇక్కడి కోనేరులోని మట్టిని నుదుటిపై పెట్టుకుంటే విభూతి రాసుకున్నట్టుగానే ఉండటం గురించి విశేషంగా చెప్పుకుంటారు. ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకాలో వెలసిన ఈ క్షేత్రం నేటికీ భక్తులను తరింపజేస్తూనే వుంది. శివాలయంలో పార్వతీ అమ్మవారు దక్షనాభిముఖంగా కొలువుదీరగా, ఆ పక్కనే గంగాదేవి కూడా దర్శనమిస్తుంది.
ఈ అమ్మవారి అనుగ్రహాన్ని ఆశిస్తూ భక్తులు ప్రతి యేటా చైత్ర మాసంలో జాతర జరుపుతారు. అయితే ఈ జాతరలో జంతుబలులు కనిపించవు. శివయ్యకి గంగమ్మ అలా మాట ఇవ్వడమే అందుకు కారణమని చెబుతారు. ఇక మోక్ష రామలింగేశ్వరుడికి కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. మహా శివరాత్రి రోజున శివపార్వతులకు కల్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది.
ఇక్కడ వెలిసిన శ్రీసీతారామ స్వామి తనను దర్శించిన భక్తుల కోర్కెలను తీర్చుతాడని నమ్మకం. రెండో భద్రాద్రిగా పేరొందిన ఈ రామతీర్థం రామస్వామి దేవస్థానం నిత్యం భక్తులు, పర్యాటకుల సందడితో కళకళలాడుతూ వుంటుంది.
ప్రధానంగా భీష్మ ఏకాదశినాడు స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. దీన్నే దేవుడి పెళ్లి అని కూడా అంటారు. ఈ దేవుడి పెళ్లి అనంతరం ఈ ప్రాంతవాసులు వివాహాలు జరిపేందుకు ముహూర్తాలు పెట్టుకుంటారు.
అలాగే జిల్లాలనుంచే గాక పక్కన వున్న ఒడిశా, మధ్యప్రదేశ్‌, రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో పండుగ వాతావరణం నెల కొంటుంది.
ఈ దేవ స్థానానికి ఏటా కోటిరూపాయల ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ఈ దేవస్థానానికి దేవా దాయశాఖ అధికారులు అసిస్టెంట్‌ కమిషనర్‌ హోదాకలిగిన ఉద్యోగిని కార్యనిర్వహణాధికారిగా నియ మించారు.
రామతీర్థం దేవస్థానంను 16వ శతాబ్దంలో అప్పటి విజయనగర రాజవంశీయుడు పూసపాటి సీతా రామచంద్రగజపతి నిర్మించారని చరిత్ర చెబుతోంది. పూర్తిగా అటవీ ప్రాంతంగా వున్న ఈ స్థలంలో నీటి అడుగున సీతారాముల విలావిగ్రహాలు లభించడంతో ఈ ప్రాంతానికి రామతీర్థం అని పేరు వచ్చినట్లు చెబుతుంటారు.
రామతీర్ధంలో భూమికి సమాంతరంగా తెల్లటి రాతి పరుపు వుంటుంది దీన్ని శ్వేతాచలం అని పిలుస్తారు. ఈ రాతి పరుపుపైన ఎలాంటి పునాదులు లేకుండా రాతిపలకల పేర్పుతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. శతాబ్దాలు దాటినా ఎంతమాత్రం చెక్కు చెదరలేదు. అలాగే శ్వేతా చలపతి పక్కనే 500 అడుగుల ఎత్తులో పెద్ద నల్లటి రాతికొండ వుంది. దీన్ని నీలాచలం అనిపిలుస్తారు.
రాముని గుడిలో శివరాత్రి పూజలు...
ప్రధానంగా భక్తులు శివరాత్రినాడు శివుని దర్శనానికి వెళతారు. కానీ ఇక్కడ మాత్రం శివరాత్రికి సీతారాములను దర్శించుకునేందుకు భక్తులు అధికంగా తరలివస్తారు. ఇందుకు కారణంగా పెద్ద పురాణ గాథే వుంది. శివభక్తుడైన రావణాసురుని రాముడు చంపిన కారణంగా ఆ పాప నివృత్తికి శ్రీరాముడు శివరాత్రినాడు ఉపవాసంతో శివుడికి పూజలు చేసాడని, అందువల్లే శివరాత్రినాడు ఉప వాసంతో ఉన్న శ్రీరాముని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.
బోడి కొండపై కోదండరాముని ఆలయం వెనుక వున్న నీటి మడుగులో ఏడాది పొడుగున నీటి నిల్వలు వుండడం విశేషంగా చెప్పవచ్చు. మండువేసవిలో సైతం అదే స్థాయిలో నీరు వుంటుంది.

Share:

సిద్ధ యోగి పుంగవుడు ''మౌన స్వామి''.

ఆంధ్రప్రదేశ్ లోని పూర్వం గుంటూరుజిల్లా ఇప్పటి ప్రకాశంజిల్లాలోని చీరాల వద్దగల నూనెవారిపాలెంలో 1868 వైశాఖశుద్ధ చతుర్ధినాడు అచ్యుతుని బాపనయ్య సీతమ్మల మూడవ కుమారుడుగా జన్మించారు మౌన స్వామి. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు పిచ్చయ్య. బాపనయ్యగారి బంధువులు అచ్యుతుని లక్ష్మీనరసయ్య, సుందరమ్మలు పిచ్చయ్యను దత్తత తీసుకొని శివయ్య అని పేరు మార్చి పెంచి విద్యాబుద్ధులు నేర్పించారు. వయసు రాగానే శివయ్యకు కామేశ్వరమ్మతో వివాహం జరిపించారు.ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. శివయ్యకు నాగభూషణం అనే కుమారుడు, లక్ష్మీనరసమ్మ, సుందరమ్మ అనే కుమార్తెలు కలిగారు. 1903 లో పెద్దకుమార్తెకు ఆ తర్వాత రెండవ కుమార్తెకు, అదే కాలంలో కుమారునకు ఉపనయనం చేశారు.
.
చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక చింతన, దేవి ఉపాసన నిత్యకృత్యాలు శివయ్యకు. అబ్కారీ డిపార్ట్మెంట్లో కొంతకాలం , రాజముండ్రిలో ప్లీడరు గుమస్తాగా కొంతకాలం ,ఒక వ్యాపారస్తుని దగ్గర కొంతకాలం ఉద్యోగం చేశారు. ఆ రోజుల్లోనే ఒక భైరాగితో పరిచయమైంది. అప్పుడు బాహ్య జగత్తునుండి అంతర్జగత్తులోకి ద్రుష్టి మళ్ళింది. 1906 డిసెంబరులో అప్పటిదాకా 12 సంవత్సరాలుగా రాజముండ్రిలో సంసారంతో ఉన్న శివయ్య అన్ని లౌకికబంధాలు తెంచుకొని హిమాలయాల వైపు ప్రయాణించారు . అక్కడ నైమిశారణ్యంలో పర్వత గుహల దగ్గర 'వెంకటాచలం పంతులు' అనే తెలుగు వృద్ధ యోగితో భగవంతుని కృపతో పరిచయం అయింది . వారికి సేవచేసి కొన్ని నెలల పాటు వారి అనుగ్రహాన్ని పొంది ఆకలిదప్పులు లేని, విషజంతువులచే బాధనొందని విద్యను పొందారు. అక్కడ నుండి హిమాలయాలకు ప్రయాణం సాగించారు.
.
హిమాలయాలలో అచ్యుతానందసరస్వతి అనే మహాసిద్ధుని ఆశ్రమం కనిపించింది. ఆ స్వామి దత్తాత్రేయుని సంప్రదాయానికి చెందిన యోగి. దశమహావిద్యల మూలదేవత సిద్దేశ్వరీదేవిని పరశురాముని అనుగ్రహంతో సాక్షత్కరించుకొన్న వాడు. అచ్యుతానందసరస్వతీస్వామి శివయ్యకు సన్యాసదీక్షను ఇచ్చి 'శివచిదానంద సరస్వతి' అని యోగపట్టా ప్రసాదించాడు. ఆ ఆశ్రమంలోనే తపస్సు చేసుకుంటుండే నిఖిలేశ్వరానంద,విశుద్ధానంద ఆ ఆశ్రమానికి వచ్చారు. వారితో కలసి సాధన చేశారు శివచిదానందస్వామి.
.
అచటి నుండి గురువుల ఆజ్ఞతో శివచిదానందస్వామి దేశ సంచారం చేస్తూ దత్తభక్తులైన వాసుదేవానందసరస్వతి కలిశారు. వారిని టెంబేస్వామి' అని కూడా పిలుస్తారు. వారు శివచిదానందస్వామికి యోగరహస్యాలు చెప్పి సిద్ధపురుషులుగా తయారు చేశారు. శివచిదానందస్వామి 'మౌన స్వామి'గా ప్రసిద్ధి నందటానికి రెండు కారణాలు చెపుతారు. ఒకసారి స్వామి కాశ్మీరులో పర్యటన చేస్తుండగా అక్కడి వృద్ధపండితుల విద్వద్గోష్టిలో వివాదాస్పదమైన కొన్ని సందేహాలకు సమాధానం చెప్పి వారి కోపానికి కారణమైనారు. ఈ విషయం తెలిసిన గురువుగారు శివచిదానందను మౌనంగా ఉండమన్నారు. మరొక కారణం ఒకసారి వృద్ధాచల సమీపారణ్యంలో తపస్సు చేస్తుండగా కోపావిష్టులైనారు. తన కోపం కారణంగా ఇతరులకు కష్టం కలగవచ్చునని గ్రహించి స్వచ్ఛందంగా 'మౌనవ్రతం' స్వీకరించారు. అప్పటినుండి సంజ్ఞలద్వారానో, లిఖితపూర్వకంగానో తన అభిప్రాయాలను వెల్లడిస్తుండేవారు. ఎప్పుడూ పెదవి విప్పి మాట్లాడేవారు కాదు. అందువల్లనే వారిని 'మౌన స్వామి' అని సమస్త ప్రజానీకం పిలవడం ప్రారంభించింది. అయితే స్వామి వారు ఒకసారి మాత్రం మాట్లాడారు జిల్లెళ్ళమూడి అమ్మతో ఆమెకు 7 ఏండ్ల వయస్సులో.
.
అమ్మ బాల్యంలో తాతమ్మ మరిడమ్మగారితో కలిసి చీరాల వెళ్ళింది. ఆ సమయంలో మౌన స్వామివారు నూనె పానకాలుగారి తోటలో విడిది చేసి ఉన్నారు.తాతమ్మతో కలసి అమ్మ మౌన స్వామిని చూడటానికి వెళ్ళింది. చూచి అందరు తిరిగి వచ్చారు. మరుసటి రోజు అమ్మ ఒక్కతే వారి వద్దకు వెళ్ళింది. స్వామి వద్ద నుండి అందరూ భోజనాలకు వెళ్ళిన సమయం చూచుకొని దొడ్డి వాకిలిగుండా స్వామివారి వద్దకు వెళ్ళింది. అమ్మను చూచి స్వామి దగ్గరకు పిలిచారు. అమ్మ స్వామిని మౌనమంటే ఏమిటి? అని అడిగింది. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండటానికి మౌనం ఆధారం అన్నారు స్వామి. మీరుమన్నవలో వేసిన యంత్రం రాజరాజేశ్వరీ యంత్రమా? రాజ్యలక్ష్మీయంత్రమా? అని అడిగింది నీకాసందేహం ఎందుకొచ్చింది? అన్నారు స్వామి. 
.
ఆ ఊళ్ళో ఒక్కళ్ళు రాజరాజేశ్వరి అనీ, మరొకరు రాజ్యలక్ష్మీ అని అనుకుంటున్నారు అన్నది అమ్మ. రాజరాజేశ్వరీ యంత్రమే అన్నారు స్వామి. మీరు అసలు మాట్లాడతారో మాట్లాడరో అనుకుంటూ వచ్చాను అన్నది అమ్మ. నిన్ను చూడగానే మాట్లాడాలనిపించిందమ్మా! ఇంకొకటి గూడా అనిపిస్తున్నదమ్మా! నీవు దేదీప్యమానంగా వెలిగిపోతూ దర్శనమిస్తున్నావు నేనెవరికీ చెప్పను గాని నీవెవరు? అన్నారు. అప్పుడు అమ్మ అదిసరే గాని మీరు అందరికీ బాలమంత్రం ఇస్తుంటారా? అని అడిగింది. స్వామి ఆమాట పట్టించుకోకుండా నీ రాక చాల గోప్యంగా ఉంచుకుంటానమ్మా! నీతో మాట్లాడినట్లు తెలిస్తే వీరంతా ప్రాణాలు తీస్తారు. నేను మౌనం ప్రత్యేక సాధనగా పెట్టుకోలేదు. కొన్ని అవసరాలు అలా కల్పించినవి అన్నారు. మీరు బాల చెప్పిన వాళ్ళందరికీ నేను ఆజపం చేపుతానన్నది అమ్మ. స్వామీ ఆశ్చర్యపోయి అమ్మను చూస్తూ అక్కడున్న రుద్రాక్షమాలను అటునుండి ఇటూ, ఇటు నుండి అటు త్రిప్పుతూ ధన్యోస్మి అని. అజపమంటే ఏమిటమ్మా? అన్నారు. నోటితో ఉచ్చరించనిది అన్నది అమ్మ. అటువంటి దాన్ని ఎట్లా చెపుతావు? అన్నారు. చెప్పటమంటూ వచ్చినపుడు మాటలు లేకుండా ఎట్లా ఉంటాయి. చెప్పేటప్పుడు మాటలతో చెప్పినా చేసేటప్పుడు మాటలు లేకుండా చేసేది అన్నది అమ్మ. స్వామి ఎవరో వస్తున్న అలికిడికాగానే వెళ్ళమ్మా వెళ్ళు అన్నారు అమ్మను. ఎందుకువెళ్ళటం అన్నది అమ్మ. నా నిష్ఠకు భంగం అన్నారు స్వామి. నిష్ఠ అంటే ఏమిటి స్వామి ? అని అడిగింది అమ్మ. నిష్ఠ అంటే అనుష్టానం అన్నారు స్వామి. ఇంతలో బయట నుండి తలుపులు తట్టటంతో అమ్మ మరొక వైపు నుండి బయటకు వచ్చింది.
.
ఇలా అమ్మకు మౌన స్వామికి మహత్తరమైన సంభాషణ జరిగింది. అమ్మ ఆ చిన్నప్పుడే మన్నవలో రాజ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్ళినపుడు అమ్మవారి క్రింద వున్న యంత్రం మౌన స్వామి వేశారు అన్నారు. అందుకని అమ్మ మౌన స్వామిని ఆ యంత్రాన్ని గూర్చి ప్రశ్నించింది. తను చెప్పింది సత్యమని ఋజువు చేసింది. ఆ రోజులలో స్వామివారు చీరాల ,బాపట్ల , మన్నవ , రాజమండ్రి ప్రాంతాలలో సంచరించి నట్లు కొన్ని చోట్ల దేవతా ప్రతిష్టలు చేసినట్లు దాఖలాలున్నాయి.
.
కుర్తాళం స్వామి దత్తమఠాన్ని నెలకొల్పారు. స్వామివారు ఎన్నో మహిమలు చూపించారని వారి జీవితచరిత్ర చదివిన వారికి అర్ధమౌతుంది. తమిళనాడు గవర్నరు ఇంగ్లీషు దొర తన సతీమణితో స్వామి దర్శనానికి రాగా రెండు గులాబీ దండలు యాపిలు పండ్లు సృష్టించి ఇచ్చారు. ఇసుక పట్టుకుంటే బంగారుమయ్యే సువర్ణవిద్య స్వామి కరతలామలకం. మౌన స్వామి మహాయోగసిద్ధుడు. 23. 12. 1943 పుష్యశుద్ధ పాడ్యమినాడు సిద్ధిపొందారు. వారి తర్వాత వచ్చిన పీఠాధిపతులలో శ్రీ శివచిదానంద భారతీస్వామి. శ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామి అమ్మవద్దకు వచ్చిన మహనీయులు.

Share:

శ్రీకృష్ణుడు వెన్న ముద్దలు దొంగిలించడంలోని దేవ రహస్యం..!


* వెన్న తిన్న గోపాలుడు భక్తులకు ఆజ్ఞానం, జ్ఞానోపదేశం ...
* బాల్యంలోనే తన లీలల ద్వారా శ్రీకృష్ణు తత్వన్ని బోధించిన గోపాలుడు...
.
.
హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాధలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సాంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను, పశువులకాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గొపికల మనసు దొచుకున్నవాదిగాను యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి.
.
మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణుపురాణం - ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్త్వాన్ని తెలిసికోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు.
.
ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగిలిస్తూ వెన్న దొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్న ముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట. వెన్న జ్జానికి సంకేతంగా చెపుతుంటారు మన పెద్దలు. శ్రీకృష్ణుని తత్వం చాలా గొప్పది. బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు.వున్న ముద్దలు ఎక్కువ తినేవాడు. వెన్న జ్ఞానానికి సంకేతం.
.
వెన్న నల్లని కుండలలో కదా ఉండేది. మృణ్మయ రూపమైన మనుష్యశరీరమే మృత్తికా రూపమైన వెన్నకుండ,మన మనస్సే కుండ లోని వెన్న ఆజ్ఞానికి సంకేతం నల్లని కుండ మనస్సే వెలుగుకు,విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని ఆజ్ఞానమనే చీకటిని తోలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు.
.
యదా యదా హి ధర్మస్య జ్జానిర్భవతి భారత..!
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం..!
శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోరులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిధి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం, శ్రావణ బహుళ అష్టమి తిథి.

Share:

శ్రీ తిలబండేశ్వర మహాదేవ్.


2500 సం"ల స్వయంభూ శ్రీ తిలబండేశ్వర మహాదేవ్,వారణాసి.సంవత్సరానికి నువ్వుగింజ అంత వృద్దిచెందుతూ వుంటుందిట.ప్రస్తుతం 3.5 అడుగులు వుంది.భూమిలో 30 అడుగులుందిట.అంటే ఎన్ని యుగాల నుండి ఈ స్వామి వృద్దిచెందుతూ వున్నారో ఈ శివ లింగాన్ని ముట్టుకుంటే రాయి లాగా కాకుండా మృదువుగా ఉంటుంది అంటారు..హరహరమహదేవ!

https://www.facebook.com/rb.venkatareddy
Share:

మాధవ సరోవరం శ్రీ కృష్ణదేవాలయం.


ఉడిపి కర్ణాటక రాష్ట్రంములోని ఒక జిల్లా. మంగుళూరుకు 60 కి.మీ దూరంలో ఉంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని, అద్వితీయ అనుభవాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చే క్షేత్రం ఉడిపి. పశ్చిమ కనుమలలో అందమైన ప్రకృతి వడిలో ఉంది. ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో మెదటి స్థానం కలిగి ఉన్నది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడిపిని సందర్శిస్తారు.
ఈ కృష్ణదేవాలయం , విగ్రహం ఏర్పాటు వెనుక ఎన్నో గాధలు ఉన్నాయి. గోపీ చందనం పూతతో ఉన్న ద్వారకలోని శ్రీ కృష్ణవిగ్రహం ఒకటి మిగతా కలపతో పాటు ఒక ఓడలో కలిసిపోయింది. ఆ ఓడ పశ్చిమ తీరం వైపు ప్రయాణిస్తోంది. ఇంతలో తుఫాను రాగా ఆ ఓడ పశ్చిమతీరంలోగల 'మాల్పె' పట్టణం వద్ద చిక్కుకుపోయింది. ఉడిపిలో తపస్సు చేస్తున్న మధ్వాచార్యులు తన దివ్యదృష్టితో ఈ ఓడ గురించి తెలుసుకుని తన వద్ద ఉన్న కాషాయ కండువాను ఊపగా తుఫాను శాంతించింది. ఓడ తీరాన్ని చేరిన తర్వాత విషయం తెలుసుకున్న ఓడ కెప్టెన్‌ మధ్వాచార్యుల వద్దకు వచ్చి సాష్టాంగ పడి ఆయన చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా ఏదైనా కోరుకోమని అడిగాడు. ఆ ఓడలో చందన పూతతో ఉన్న కృష్ణవిగ్రహం ఒకటి ఉంది దానిని ఇమ్మని మధ్వాచార్యులు కోరారు. తర్వాత ఆయన దీన్ని సరస్సులో శుభ్రం చేసి, అభిషేకించిన అనంతరం మఠంలో ప్రతిష్టించారు.
మరో కథనం ప్రకారం, తుఫానులో చిక్కుకున్న ఓడతో పాటు కృష్ణవిగ్రహం కూడా నీళ్లలో మునిగింది. కొన్నేళ్ల తరువాత ఉడిపి వచ్చిన మధ్వాచార్యులు తన దివ్యదృష్టితో సముద్రంలో మునిగిన కృష్ణవిగ్రహాన్ని కనుగుని ఉడిపి తీసుకువచ్చి సంక్రాంతి నాడు ప్రతిష్టించారని చెబుతారు. కృష్ణ విగ్రహానికి అభిషేకం చేయించిన సరస్సును ఇప్పుడు 'మాధవ సరోవరం ' గా పిలుస్తున్నారు. కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్టించిన గుడిని ఉడిపి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని మధ్వాచార్యులు 13వ శతాబ్ధంలో లేదా 16వ శతాబ్ధంలో ప్రతిష్టించినట్లు చెబుతారు.
భక్తులు కిటికీ గుండా కృష్ణుణ్ణి దర్శించుకోవడానికి గల కారణాలపై మరో కథనం ఉంది. వాధిరాజు పాలనలో కనకదాస అనే భక్తుడు కృష్ణునికి మహాభక్తుడు. ఎలాగైనా ఉడిపి కృష్ణుణ్ణి దర్శించుకోవాలని అతను తహతహలాడుతుండేవాడు. కాని అతను కడజాతి వాడు కనుక అతన్ని పూజారులు గుడిలోకి అనుమతించలేదు. అప్పుడు అనుగ్రహించిన కృష్ణుడు తన విగ్రహం వెనుక వైపున గోడకు చిన్న కన్నం ఏర్పాటు చేసి వెనుకకు తిరిగి భక్తుడైన కనకదాసకు దర్శనమిచ్చి కరుణించాడు. అప్పటి నుంచి ఆ కిటికీకి 'కనకనకిండి ' అనే పేరు వచ్చింది. అయితే అక్కడ నుంచే కృష్ణుణ్ణి దర్శనం ముగ్ధమనోహరంగా లభిస్తుండడం మరో విశేషం.
ఉత్తర ద్వారంద్వారా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడి వైపు దేవాలయకార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది.
ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీనిద్వారా గర్భగుడిలో ప్రవేశం పిఠాధిఫతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండిచే తాపడం పెట్టపడిన నవరంధ్రాల కిటికీ నుండి చేసుకోవచ్చు. గర్భగుడికి కుడి వైపు ముఖ్యప్రాణ దేవత (హనుమంతుడు), వామభాగాన గరుడ దేవడు ఉన్నరు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు ప్రదక్షణం చేసినట్లైతే ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది.
ఇక్కడ ఉదయం 5 నుంచి ఎన్నో పూజలు, సేవలు మొదలవుతాయి. మధ్య నవమి, రామ నవమి, నృసింహ జయంతి, భాగీరథ జన్మదినం, కృష్ణలీలోత్సవం, గణేష్ చతుర్థి, అనంత చతుర్థి, సుబ్రహ్మణ్య షష్టి, నవరాత్రి, దసరా, హోలి, వసంత పూజ, జాగరణ సేవ, తులసీ పూజ, లక్షదీపోత్సవం, ధనుపూజ ఇంక ఎన్నో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
ముఖ్యంగా మకర సంక్రాంతి నాడు ఏడు రోజులు సప్తోత్సవం పేర ఉత్సవాలను నిర్వహిస్తారు. ఎనిమిదో రోజున ఇక్కడ నిర్వహించే చర్నోత్సవ సేవలో కొన్ని వేల మంది భక్తులు పాల్గొని తరిస్తారు.
ప్రతీ రెండేళ్లకోసారి పర్యోత్సవం నిర్వహిస్తారు. ఈ రెండు ఉత్సవాలను చుడ్డానికి భక్తులు ప్రత్యేకంగా దేశ విదేశాల నుంచి వస్తుంటారు. ఇక్కడ బంగారు రథంలో శ్రీకృష్ణునికి నిర్వహించే ఉత్సవం చూసి తీరాల్సిందే. ఈ రథంలో ఊరేగుతున్న కృష్ణుడు నిజంగా దివి నుంచి భువికి దిగివచ్చి మరీ ఊరేగుతున్నాడా అన్నంత అనుభూతిని అందిస్తుంది.

Share:

మహోన్నతమైన శక్తిగా "ఓంకారం".

* మానవాళి శ్రేయస్సు కొరకే అవతారాలు ఎత్తిన పరమ శివుడు..
* శివునికి ఎన్ని అవతారాలు ఉన్నాయో మీకు తెలుసా..?
.
.
మహాశివుడు హిందువులకి ఉన్న ముఖ్యమైన దేవుళ్ళలో ఒకరు. "శైవులు" లేదా మహాశివుని భక్తులు ఆయనను ఒక మహోన్నతమైన శక్తిగా కొలుస్తారు."ఓంకారం" లేదా అస్థిత్వానికి ముందునుండి ఉనికిలో ఉన్న శబ్ధమే మహా శివుని మూలం అని చెబుతారు.
.
మొట్టమొదటి దైవ రూపం ఎమిటి అన్నదానిపై హిందూ పురాణాలు కూడా తరచూ వివాధపూరితమైన చర్చగానే మిగిలినా, శైవులు మాత్రం మహాశివుడినే మొట్టమొదటి దైవ రూపంగా నమ్ముతారు. ఈ విశ్వంలొ మొట్టమొదటి మరియు అత్యంత శక్తివంతమైన దేవుడిగా నమ్మబడే మహాశివుడు, నిరాకారుడు , లింగాకారుడు మరియు అనంతుడు.
.
సృష్టిలొని పంచ భూతాలైన పృధ్వి , గాలి , నీరు ,అగ్ని, ఆకాశాలకు పరమ శివుడు అధ్యక్షుడు. ప్రకృతిలొని ఈ రూపాలు అన్ని కలిపితే శివ లింగం అని అంటారు.
.
సాదారణంగా మనకు దశావతారాలు లేదా విష్ణువు యొక్క 10 అవతారాల గురించి తెలుసు. కానీ శివునికి అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా? 
దేవుని యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశపూర్వకంగా భూమిపై మానవ రూపంలో ఉంటాయి. సాధారణంగా అవతారం ప్రధాన ఉద్దేశ్యం చెడును నాశనం చేయటం మరియు మానవుల యొక్క జీవితాన్ని సులభతరం చేయటానికి ఉంటుంది. శివుని గురించి మాట్లాడితే, మాకు 19 అవతారాలలో చాలా కొన్ని మాత్రమే తెలుసు. శివుని యొక్క ప్రతి అవతారం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది.
శివుని యొక్క19 అవతారాలలో ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం మరియు మానవాళి శ్రేయస్సే అంతిమ ఉద్దేశ్యంగా కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఆ అవతారాల గురించి తెలుసుకుందాం .
.
పిప్లాద్ అవతారం: ..
శివుడు మహర్షి దధీచి ఇంటిలో పిప్లాద్ గా జన్మించెను. అయితే పిప్లాద్ జన్మించటానికి ముందే మహర్షి దధీచి ఇంటిని వదిలి వెళ్ళిపోయెను. పిప్లాద్ పెరిగిన తర్వాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళటానికి కారణం శని యొక్క చెడు ప్రభావం అని తెలుసుకొనెను. అందువలన పిప్లాద్ అతని ఖగోళ నివాసం నుండి శనిని క్షీణించమని శపించెను.
తర్వాత అతని పరిస్థితిపై శివుడు జాలిపడి క్షమించేను. అయితే 16 సంవత్సరాల లోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకుడదని చెప్పెను. అందువల్ల శివడుని పిప్లాద్ రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకుంటారు.
.
నంది అవతారం: ..
నంది లేదా ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శివుడిని నంది రూపంలో పూజిస్తారు. శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడుగా ఉంటారని పరిగణిస్తారు. ఎద్దు లేదా నంది నాలుగు చేతులతో ఉంటుంది. రెండు చేతులు కలిపి ఉంటాయి మరో రెండు చేతుల్లో గొడ్డలి మరియు జింక పట్టుకొని ఉంటారు.
.
వీరభద్ర అవతారం:..
సతీ దేవి దక్ష యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తరువాత,శివుడికి చాలా కోపం వచ్చింది. శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకను త్రెంపి మైదానంలోకి విసిరెను. ఆ వెంట్రుక నుండి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించెను.
ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన అవతారం. అతను పుర్రెల దండ ధరించి, భయానకమైన ఆయుధాలు పట్టుకొని మరియు మూడు మండుతున్న కళ్ళతో ఒక డార్క్ దేవుడుగా కనపడతారు. శివుడు యొక్క ఈ అవతారంలోనే యజ్ఞం వద్ద దక్షుని యొక్క తలను త్రెంచబడింది.
.
భైరవ అవతారం:..
శివుడు,బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్యం పోరాట సమయంలో ఈ అవతారం పట్టింది. బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్దం చెప్పిన సమయంలో,శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికేను. బ్రహ్మ తల నరకటం వలన బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంది. అప్పుడు శివుడు బ్రహ్మ పుర్రె పట్టుకొని పన్నెండు సంవత్సరాల పాటు బిక్షాటన చేసెను. ఈ రూపంలోనే శివుడు అన్ని శక్తిపీఠాలకు కాపలా ఉంటారని చెప్పుతారు.
.
అశ్వత్థామ అవతారం: ..
క్షీరసాగర మథన సమయంలో శివుడు ప్రాణాంతకమైన విషంను తీసుకొనెను. అతని గొంతులో విషం మండటం ప్రారంభమైంది.లార్డ్ విష్ణువు శివుని నుండి విషం బయటకు రాకుండా వరం ఇచ్చెను. అప్పుడు శివుడు విష్ణువుకి భూలోకంలో ద్రోణ కుమారుడుగా పుట్టుతావని వరం ఇచ్చెను. మొత్తం క్షత్రియులను చంపుతావని చెప్పెను. అందువలన విష్ణువు అశ్వత్థామగా జన్మించెను.
.
శరభ అవతారం :..
శరభ అవతారంలో శివుడు ఒక భాగం పక్షి,మరొక భాగం సింహ రూపంలో ఉంటుంది. శివ పురాణం ప్రకారం, విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవటానికి శివుడు శరభ అవతారం ఎత్తెను .
.
గ్రిహపతి అవతారం: ..
శివుడు విశ్వనర్ అనే బ్రాహ్మణుడు ఇంట కొడుకుగా జన్మించెను. విశ్వనర్ అతని కొడుకుకు గ్రిహపతి అనే పేరు పెట్టెను. గ్రిహపతికి 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడని నారదుడు అతని తల్లితండ్రులకు చెప్పెను. అందువలన,గ్రిహపతి మరణంను జయించేందుకు కాశీకి వెళ్ళెను. గ్రిహపతి శివుని అనుగ్రహం చేత మృత్యువును జయించెను.
.
దుర్వాస అవతారం: ..
శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి ఈ రూపాన్ని ధరించెను. దుర్వాస గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం కలవారని ప్రసిద్ది గాంచారు.

హనుమాన్ అవతారం: ..
హనుమంతుడు శివుడి అవతారాలలో ఒకటి. రాముడు రూపంలో ఉన్న విష్ణువుకు సేవ చేయటానికి శివుడు హనుమాన్ రూపంలో అవతరించారు.

వృషభ అవతారం :..
సముద్ర మంథనం తర్వాత, ఒకసారి విష్ణువు పాతాళలోకం వెళ్ళెను. అక్కడ అతను అందమైన మహిళలు పట్ల తీవ్రమైన మొహాన్ని కలిగి ఉండెను. విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక మంది కుమారులు జన్మించారు.
కానీ అతని కుమారులు అందరూ చాలా క్రూరముగా మరియు వికృతముగా ఉండేవారు. వారు మొత్తం దేవతలను మరియు మానవులను వేదించటం ప్రారంభించారు. అప్పుడు లార్డ్ శివ ఎద్దు లేదా వృషభ రూపంలో విష్ణు మూర్తి యొక్క కుమారులను చంపివేసెను.
అప్పుడు విష్ణువు ఎద్దుతో పోరాటానికి వచ్చెను. కానీ ఎద్దును పరమేశ్వరుని అవతారం అని గుర్తించిన తర్వాత,అతను అతని నివాసం తిరిగి వెళ్ళిపోయెను.
.
యతినాథ్ అవతారం: ..
ఒకప్పుడు ఆహుక్ అనే గిరిజనుడు ఉండేవాడు. అతను,అతని బార్య శివుని యొక్క భక్తులు. ఒక రోజు శివుడు యతినాథ్ రూపంలో వారికీ దర్శనం ఇచ్చెను. అయితే వారి గుడిసె ఇద్దరు పడుకోవటానికి మాత్రమే సరిపోతుంది. అందువల్ల ఆహుక్ బయట పడుకొని యతినాథ్ ను లోపల పడుకోమని చెప్పెను.
దురదృష్టవశాత్తు ఆహుక్ రాత్రి సమయంలో ఒక క్రూర మృగంచే చంపబడ్డాడు.ఉదయం, ఆహుక్ చనిపోయినట్లు కనుకొని, తను కూడా చనిపోవాలని నిర్ణయించుకొనెను. అప్పుడు శివుడు అతని నిజ రూపంలో కనిపించి పునర్జన్మ లో ఆమె మరియు ఆమె భర్త నల మహారాజు మరియు దమయంతిలుగా జన్మిస్తారని చెప్పెను. అప్పుడు వారు శివునిలో ఐక్యం అయ్యారు .
.
కృష్ణ దర్శన్ అవతారం :..
శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను ఈ లోకానికి తెలియచేయడానికి ఈ అవతారం జరిగింది.
.
భిక్షువర్య అవతారం :..
శివుని యొక్క ఈ అవతారం మానవులను అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడటానికి జరిగెను.
.
సురేశ్వర్ అవతారం: ..
శివుడు ఒకసారి భక్తులను పరీక్షించడానికి ఇంద్ర రూపంలో వచ్చెను. అందువల్ల ఈ అవతారంను సురేశ్వర్ అవతారం అని చెప్పుతారు.
.
కిరీట్ లేదా వేటగాడు అవతారం :..
అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు ఒక వేటగాడు లేదా కిరీట్ రూపంలో వచ్చెను. దుర్యోధనుడు అర్జునుడుని చంపటానికి మూక అనే రాక్షసుణ్ణి పంపెను. మూక ఒక పంది రూపంలో వచ్చెను. అర్జునుడు తన ధ్యానంలో లీనమై ఉండగా,తన ఏకాగ్రతను భంగపరస్తూ అకస్మాత్తుగా బిగ్గరగా ఒక శబ్దం వచ్చెను. అప్పుడు కళ్ళు తెరచి మూకను చూసేను. అర్జునుడు మరియు వేటగాడు ఒకేసారి పంది మీద బాణాలను వేసెను. ఇద్దరు కలిపి పందిని ఓడించెను. అర్జునుడుతో ఒక ద్వంద్వ యుద్ధం కోసం వేటగాడు రూపంలో ఉన్న శివుడు సవాలు విసిరెను. అప్పుడు శివుడు అర్జునుడు యొక్క శౌర్యంను మెచ్చి పాశుపత అస్త్రంను బహుమతిగా ఇచ్చెను.
.
సుంతన్ తారక అవతారం: ..
శివుడు పార్వతిని వివాహం చేసుకోవటానికి ఆమె తండ్రి హిమాలయా నుండి అనుమతి కోసం ఈ అవతారం ఎత్తేను.

బ్రహ్మచారి అవతారం: ..
పార్వతి ఆమె భర్త పరమశివుని పొందడానికి ప్రార్థన చేసే సమయంలో,శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి ఈ అవతారం జరిగెను.
.
యక్షేశ్వర్ అవతారం: ..
శివుడు దేవతల యొక్క మనస్సులలోకి వచ్చిన తప్పుడు అహంను తొలగించటానికి ఈ అవతారం జరిగేను.
.
అవధూత్ అవతారం: ..
ఇంద్రుని యొక్క అహంకారంను తగ్గించటానికి శివుడు ఈ అవతారంను తీసుకున్నారు.

Share:

నేల క్రింద చారిత్రాత్మక అద్భుత శివలింగం.

తమిళనాడు వెల్లూర్ కోటలో జలకందేస్వర దేవాలయం నేలమాళిగలో అయిదు అడుగుల అద్భుత శివాలింగాన్ని దర్శించటానికి వేలాది భక్తులు నిత్యం వస్తారు. వేలూరి వీరప్ప నాయక్ కొడుకు చిన్ని బొమ్మినాయక్ అనే వేలూరి బొమ్మి రాజు ఈ దేవాలయాన్ని కోటనూ 1566లో నిర్మించాడు. ఇక్కడ శివుడను జలకంఠీశ్వర గా పూజిస్తారు. ఒక గోపురం ఉన్నది . ఆలయంనకు రెండు ప్రాంగణాలు ఉన్నాయి, మరియు చుట్టూ సంవృత మార్గం మరియు ఉప ఆలయాలలో గర్భగుడి కలిగి ఉంది. ఈ ఆలయంను విజయనగర శైలిలో నిర్మించారు. జలకందేస్వరార్ ఆలయం యొక్క ప్రవేశద్వారం, అంటే అర్ధం "నీటిలో నివసిస్తున్న శివుడు" ను పెద్ద చెక్క గేట్లతో కలిగి సుదీర్ఘ గోపురంతో నిర్మించబడింది మరియు తామర పుష్పాలు వంటి ఇనుముతో చేసినా శిల్పాలు ఉన్నాయి.
అంతేకాకుండా, మీరు ప్రధాన హాల్ లోపల మరియు స్వామి సంనతి యొక్క కొన్ని అద్భుతమైన శాసనాలు చూస్తారు. ప్రధాన ద్వారం వద్ద అత్యంత శిల్పాలతో అలంకరించిన స్తంభాలను చూడవచ్చు. ఆలయంలో స్తంభాలు మరియు పై కప్పు లను చెక్కిన నగీషీలు చాలా నైపుణ్యంతో ఉన్నాయి.ఈ అలయంనకు పలర్ నది ద్వారా ఒక భూగర్భ మార్గం ఉన్నది.

Share:

కాలకూటా విషాన్ని త్రాగి సకల సృష్టిని రక్షించిన పరమ శివుడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నందు గల 'సత్యవేడు'కు దగ్గరలో గల క్షేత్రం ఇది. అరుణానదీ తీరంలో గల ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'పల్లికొండేశ్వరాలయం'. శివశైవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో గరళం త్రాగిన శివుడు పరుండి యుంటే బయట ఏకాంతంగా నంది ఉంటుంది. స్వయంభూ శివలింగంతో పాటు స్వయంభూ గణపతి విగ్రహం కలదు. స్కాంద పురాణ శివరహస్య ఖండంలో శివుడు హాలాహలం మ్రింగి విశ్రమించి నందున 'కాలకూటానన'క్షేత్రంగా ఇది వర్ణించబడింది. నిదురించే శివుని చుట్టూ బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు.
రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి క్లేశాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి "ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండండి. వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం(పాల సముద్రం చిలకండి) జరపండి" అని చెబుతాడు. "ఆ మథనానికి కవ్వంగా మందరగిరి ని వాడండి. త్రాడు గా వాసుకి ని వినియోగించండి. ఆ మథన సమయం లో అమృతం పుడుతుంది. దానిని మీరు ఆరగించి, క్లేశాలు వారికి మిగల్చండి" అని విష్ణువు సెలవిస్తాడు.
ఆమాటలు విని, దేవతలు ఆనందించి వారివారి గృహాలకు వెళ్ళిపోతారు. కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందుకువస్తుంటే బలి చక్రవర్తి వారిని వారిస్తాడు. ఆ తరువాత అలా కాలం వెళ్లబుచ్చుతున్న సమయం లో ఒకరోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీరసాగర మథనం జరిపితే అమృతం పుడుతుందని, అమృతం సేవిస్తే మృత్యువు దరి చేరదని చెబుతాడు. దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మథనానికి ముందుకు వస్తారు.
మందరగిరిని త్రవ్వి తీసుకొని రాగా అది మహాభారమైనదై క్రింద పడబోతే శ్రీ మహా విష్ణువు గరుడారూఢుడై వచ్చి, మందరగిరిని క్షీర సాగరము లో వదిలాడు. వాసుకి ని ప్రార్థించి వాసుకి కి అమృతం లో భాగమిస్తామని చెప్పి, ఒప్పించి దాని రజ్జుగా చేసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ఆలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగ వైపు నడిచారు. దానితో రాక్షసులు కోపించి తోక వైపు నిలబడి చిలికే నీచులమా అని అనగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు. ఆ విధంగా చిలుకుతుండగా ఆ మంధరగిరి క్రిందనిలిచే ఆధారము లేక క్షీరసాగరము లోనికి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారము ఎత్తి, ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకొన్నాడు. మంధరగిరి తో మథనం జరుపుతుండగా విపరీతమైన రొద వచ్చింది. ఆరొద కు ఎన్నో జీవరాశులు మరణించాయి.
అలా చిలుకుతుండగా ముందు హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానవులకు తోచక బ్రహ్మ వద్దకు వెళ్తారు. బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడ నుండి కైలాసం లో ఉన్న శివుడి వద్దకు వెళ్ళి, క్షీరసాగర మథనం జరుపుతుండగా వచ్చినదానిని అగ్రతాంబూలం గా స్వీకరించుమని ప్రార్థించగా శివుడు హాలాహలం అని గ్రహించి పార్వతి తో సేవించమంటావా అని అడుగగా సకల సృష్టిని రక్షించడానికి సేవించమని చెబుతుంది. అప్పుడు శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠం లో ఉంచుకొన్నాడు. గరళాన్ని కంఠం లో ఉంచుకోవడం వల్ల గరళకంఠుడు అయ్యాడు. కాని, గరళం శివుని లో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది. శివుని కఠిన యొక్క మెడ నీలం గా మారడం తల తిరగడం వలన పరమశివుడు కొద్దిసేపు పార్వతీ దేవి ఒడిలో పడుకున్నట్లుగా ఇక్కడ విగ్రహం ఉంటుంది.

Share:

శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పలివెల తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామము. పలివెల రాజమండ్రికి 50 కి.మీ., కాకినాడకు 90 కి.మీ. మరియు అమలాపురానికి 25 కి.మీ. దూరంలో కలదు. ఈ గ్రామము లొ శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం కలదు.ఇక్కడ శివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవం విశేషం.
"పలివెల" అను పేరు ఈ గ్రామానికి రావడం గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
పౌరాణిక గాధ ననుసరించి, క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమ్రుతలింగాన్ని రాక్షసులు ఒక 'పల్వలము' (గొయ్యి)లో దాచారు. అగస్త్యమహాముని ఆ అమ్రుతలింగాన్ని పరమేశ్వరితో సహా అక్కడే ప్రతిష్ఠించాడు. ఆ పల్వలమే కాలక్రమేణా పలివెలగా మారింది.
ఈ ప్రాంతాన్ని పూర్వకాలములో పల్లవులు పాలించుట వలన "పల్లవ" నండి "పలివెల" అయిందని అంటారు.
ఇక్కడి శివలింగ ప్రతిష్థ అగస్త్య మహర్షి ద్వారా జరిగింది అని ప్రతీతి. ఈ దేవాలయములొని కళ్యాణ మండపాన్ని11 వ శతాబ్దం లొ రాజరాజ నరేంద్రుడు జీర్ణోద్ధారణ చేశాడని చెబుతారు. ఈ ఆలయ కళ్యణ మండపములో వేదిని అల్లాదరెడ్డి క్రీ.శ 1416లో కట్టించి ఈ మండపమునకు కొత్త రూపాన్ని ఇచ్చినట్లు ఈ మండపములోనే శాసనము ఉంది. అగస్త్యమహర్షి శివ పార్వతుల కళ్యాణం చూడవలెనని కొరికతో కౌశిక నది ఒడ్డున శివలింగ ప్రతిష్థ చేశాడు. దక్ష యజ్ఞానికి పూర్వం ఇంద్రాది దేవతలు మరియు హిమవంతుడు అగస్త్య మహర్షి పార్వతి కళ్యాణాని కి వస్తే ప్రళయం వస్తుంది అని భావించి విశ్వంభరుడుని అగస్త్య మహర్షి వద్దకు పంపుతారు. అగస్త్య మహర్షి తన దివ్యదృష్టి తో శివ పార్వతుల కళ్యాణం వీక్షించగా శివ పార్వతులు మధుపర్కాలలో కనిపిస్తారు. అగస్త్య మహర్షి శివుని ప్రార్దించగా శివుడు ప్రత్యక్షమై వరాన్ని కొరుకోమనగా అగస్త్య మహర్షి శివపార్వతులను ఒకే పీఠంపై అనుగ్రహించమని కోరుతాడు. ఇదే ఇక్కడ విశేషం. వేరే ఎక్కడ శివ పార్వతులు ఒకే పీఠం మీద కనపడరు. మొదట ఈ క్షేత్రం లొ శివుడు లోల అగస్త్య లింగేశ్వరుని గా తరువాత కొప్పులింగేశ్వర స్వామి గా పూజలందుకొంటున్నాడు.
శ్రీనాథుడు ని కాలంలొ అగస్త్య లింగేశ్వరునిగా పూజలందుకొన్నట్లుశ్రీనాథుడు శ్లొకాన్ని వ్రాశాడు. ఈయన తన కాశీఖండము, భీమఖండము మరియు శివరాత్రి మహాత్మ్యములలో ఈ స్వామిని కొప్పయ్య, కొప్పులింగడు అని గొప్పగా వర్ణిస్తూ, ఈస్వామే తన ఇంటి ఇలవేల్పని చెప్పాడు. ఈ కాలానికే చెందిన అజ్జరపు పేరయలింగ కవి కూడా తన "ఒడయనంబి విలాసం"లో ఈ స్వామిని గురించి వర్ణిస్తూ, ఇప్పటి ఈ చిన్న గ్రామమును ఒక గొప్ప పట్టణముగా చెపుతూ ఇంద్రుడు ఒక్కసారి ఇక్కడికి వస్తే తన స్వర్గాన్ని మరిచిపోతాడని అన్నాడు. ఈ సాహిత్యాధారాల వలన క్రీ.శ 14వ శతాబ్దంనాటికే పలివెల గొప్ప పట్టణమని, ఇక్కడ వేంచేసి ఉన్న కొప్పులింగేశ్వరుని ఆలయము ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమని తెలుస్తోంది.
చారిత్రక ఆధారాలు: ఈ ఆలయములో అనేక శాసనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ లభించిన వానిలో పురాతనమైనది క్రీ.శ 1170 కి చెందింది. ఇది ఒక ప్రముఖ కవి యొక్క దాన శాసనము. ఇంకా కాకతీయ ప్రతాపరుద్రునికి చెందిన శాసనము, రెడ్డిరాజులకు చెందిన శాసనాలే కాక ముస్లిం రాజైన కుతుబ్-ఉల్-ముల్క్ కు చెందిన దానశాసనము ఉండడం విశేషం. ప్రస్తుతము క్రీ.శ 15వ శతాబ్దము వరకూ శాసనాలు లభించాయి. పిఠాపురం రాజావారి పాలనలో కూడా పలివెల ఒక ప్రత్యేకమైన ఠాణాగా ఉండేది. ఈ ఆధారాల వలన క్రీ.శ.10వ శతాబ్ధం నుండి కూడా రాజులు, ప్రముఖులు, సామాన్య ప్రజలు ఆలయపోషణ చేసినట్లు తెలుస్తోంది. ప్రతాపరుద్రుని కాలంలొ ఆలయ జీర్ణొద్దారణ జరిగినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. ముస్లింల దండయాత్రల సమయం లొ నంది తల విరిగి పడింది దానిని ఇప్పుడు అతికించడం జరిగింది.
అక్కడి ప్రజల కథ ప్రకారం ఒకప్పుడు ఒక వెలనాటి పూజారి ఈ శివలింగారాధన శక్తి వంచన లేకుండా చేస్తూ ఉండెవాడు. కాని అ పూజారికి ఒక దురలవాటు ఉండేది. ఆయన కు ఒక వేశ్య తొ సంబంధం ఉండేది. ఆ పూజారి మీద ఆరాజ్యపు రాజు కి చాలా పిర్యాదులు అందుటూ ఉండేవి. ఇది గమనించి ఒక రోజు ఆరాజ్యపు రాజు స్వామి దర్శనానికి రాగా ఆ పూజారి స్వామి ప్రసాదాన్ని రాజు కు ఇస్తాడు. ఆ ప్రసాదం లొ ఒక వెంట్రుక కనిపిస్తుంది. రాజు ప్రశ్నించగా మా శివునకు జటాజూటం ఉన్నదని రాజు కి తెలిపుతాడు. రాజు పూజారిని జటాజుటం చూపించమనగా పూజారి ఆ రోజు స్వామి కి ప్రత్యేక అలంకారంలో ఉన్నారు కాబట్టి మరుసటి రోజు వచ్చి చూస్తే స్వామివారి జటాజూటం కన్పిస్తుంది అని ఆ పూజారి చెప్పగా ఆ రాజు ఆ రోజుకి నిష్క్రమించి తరువాత రోజు రావడానికి అంగీకరిస్తాడు. కాని శివవింగం మీద జాటాజుటం కనిపించకపోతే ఆ పుజారి తల తీయించి వేస్తాను అని చెప్తాడు. ఆ రోజు రాత్రంతా శివలింగానికి పూజలు చేసి మహాదేవుడిని తనను కాపాడమని వేడుకోంటాడు. తరువాత రోజు రాజు దర్శనానికి వచ్చి చూస్తే శివలింగాన్ని చూస్తే జటాజూటం కనిపిస్తుంది. ఆఆరాజుకి ఆ జటాజుటం నిజమో కాదో అని సంశయం కలిగి జటాజుటాన్ని లాగి చుస్తాడు, శివ లింగం నుంచి నెత్తురు వస్తుంది, వెంటనే రాజుకు కంటి చూపు పోతుంది. అప్పుడు ఆ రాజు శివామహాదేవా అని వేడుకొనగా ఆరాజుకు కంటి చూపు వస్తుంది. ఆ రరాజు తన సామ్రాజ్యంలో జుటుగపాడు (ఇప్పటి రావులపాలెం మండలం లొని ఒక గ్రామం) అనే గ్రామాన్ని మాన్యంగా రాజు ప్రకటిస్తాడు. ఇప్పటికి కూడా శివలింగము కు జాటాజూటం ఉంది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ పవిత్రక్షేత్రంలొ కొప్పులింగేశ్వరుడు గా పరమ శివుడు భక్తుల దర్శనం ఇచ్చి దర్శనం చేసుకొన్న వారిని మహాదేవుడు తరింపజేస్తున్నాడు. ఆంధ్రపదేశ్ పురావస్తుశాఖ ఈ గుడిలో ఉన్న రాజగోపురం, స్వామిమందిరం, కొన్ని స్తంభాలు పై ఉన్న శిల్పాలు ను పరిరక్షిస్తోంది.
ఈ ఆలయమును తూర్పున కౌసికి, దక్షిణమున సాంఖ్యాయని, పడమర వశిష్ఠ, ఉత్తరాన మాండవి మరియు పల్వల అను అంతర్వాహినిగా ఉన్న ఐదు నదులు చుట్టి ఉన్న ప్రదేశములో నిర్మించినట్లు చెబుతారు. ఈనాడు కూడా కౌసికి, వసిష్ఠలతో పాటు గర్భగుడిలో వర్షాకాలములో నీరు నిండుటచే పల్వలను కూడా చూడవచ్చును. ఇటీవల గర్భ్గగ్రుహమును గ్రానైటు రాయి పరచి బాగు చేశారు.
ఈ ఆలయము పలివెల మధ్యలో నాలుగెకరాల సువిశాల ప్రాంగణములో, ఒక దానిలో ఒకటి గా ఉన్న రెండు ఎత్తైన ప్రాకారాలతో, చుట్టూ వీధులతో రాజసంగా ఉంటుంది. ఈ ప్రాంగణములో ప్రధానాలయము, ఎన్నో మండపాలు, పరివార దేవతాలయాలు ఉన్నాయి. ఈ మండపాలలో చాళుక్యుల మరియు రెడ్డిరాజుల వాస్తు సాంప్రదాయాలను చూడవచ్చును. ఈ ప్రాంగణములోని మండపాలు అందలి శిల్పాలలో క్రీ.శ 10వ శతాబ్ధము నుండి క్రీ.శ 17వ శతాబ్ధము మధ్యకాల వాస్తు-శిల్ప పరిణామమును చూడవచ్చును.
ఈ ఆలయములో వివిధ శిల్పాలు కనువిందు చేస్తాయి. ఇవి వేంగి(తూర్పు)చాళుక్యుల మరియు రెడ్డిరాజుల కాలంనాటి శిల్పలక్షణాలు కలిగి ఉన్నాయి. గర్భగుడిలో ప్రతిష్టించబడిన లింగమునకు ముందువైపున అగ్రభాగములో చతురస్రాకారములో ఒక పొడుచుకువచ్చిన భాగము ఉంది. దీనినే కొప్పు అంటారు. ఇందువలననే ఈ స్వామి కొప్పులింగేశ్వరుడుగా ప్రసిద్ధిగాంచాడు. ఈయనకు ప్రక్కనే పార్వతీదేవి (ఉమాదేవి) ప్రతిష్టించబడి ఉంది. ఈమెకు ఉన్న ప్రభామండలమునకు రెండు వైపులా గణపతి మరియు కుమారస్వామి కూడా ఉన్నారు. సాధారణంగా శైవాలయాలలోని గర్భగుడిలో ప్రధానంగా లింగము ఉండి, అమ్మవారు ఒక ప్రక్కగా ఉంటుంది, లేక ప్రత్యేకంగా ప్రతిష్టించబడి ఉంటుంది. ఇంక వినాయకుడు, కుమారస్వాములు వేరేగా పరివారదేవతాలయాలలో ఉంటారు. కానీ ఇక్కడ స్వామివారు మరియు అమ్మవారు ప్రక్క ప్రక్కనే ఒకే పీఠంపై ఉన్నట్లుగా ఉన్నారు. అందువలననే ఈ స్వామిని ఉమాకొప్పులింగేశ్వరుడు అంటారు. ఈవిధముగా ఆది దంపతులు సకుటుంబ సమేతంగా గర్భగుడిలోనే ఒకే పీఠంపై వేంచేసి దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. ప్రాంగణములో వినాయకుడు, కుమారస్వామి, భైరవుడు, చండికేశ్వరస్వామి మరియు పాపవిమోచన స్వాములు ప్రత్యేకముగా ప్రతిష్టించబడి భక్తుల పూజలందుకుంటున్నారు.
వివిధ మండపాలపై ఉన్న శిల్పాలు అతి మనోహరంగానూ ఆలోచింపజేసీవిగానూ ఉన్నాయి. ఈ మొత్తము శిల్పసంపదను నాలుగు ప్రధాన వర్గాలుగా వర్గీకరించవచ్చును. అవి శైవము, వైష్ణవము, సాంఘీకము మరియు ఇతరములు. శైవములో శివ-పార్వతుల వివిధ రూపాలు-వృషభారూఢమూర్తి, లింగోధ్భవమూర్తి, నటరాజు, అర్ధనారీశ్వరుడు మొదలైన అనేకరూపాలేకాక పురాణగాథలైన కిరాతార్జునీయం, మృగవ్యధ మొదలగు గాథలు కూడా ఉన్నాయి. వైష్ణవ శిల్పాలలో కృష్ణుడు, లక్ష్మీదేవి ఇంకా రామాయణ గాధలు ఉన్నాయి.

Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List