ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఈశాన్య సరిహద్దులో ఉన్నది. జిల్లా ముఖ్యపట్టణమైన శ్రీకాకుళం. మెళియాపుట్టి గ్రామములొ వున్న శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయం ఒక దర్శనీయ ప్రదేశము. ఈ గుడి జిల్లాలో రెండవ పెద్ద గుడి. ఈ గుడి పూరి జగన్నాధస్వామి గుడిని తలపిస్తుంది. ఈ గ్రామమునకు ఆనుకుని మహేంద్రతనయ నది ప్రవహిస్తుంది. గ్రామమునకు కొద్దిదూరమున ఇంజమ్మకొండ వుంది. ఈకొండపైన ఒక గుహవుంది. ఈ గుహలో కొన్ని దేవతామూర్తుల విగ్రహములు వున్నవి.
ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఒక పవిత్ర పుణ్య స్థలం. పూర్వం దేవతలు ఈ గుడిని నిర్మించారు అని ఇక్కడి ప్రజల నమ్మకము. ఇక్కడ మాఘ పౌర్ణమి నాడు ప్రత్యేకమైన పూజలుమహోత్సవాలు మరియు అన్నదానం జరుగుతాయి. ఈ ఆలయంలోని శ్రీ వేణుగోపాలస్వామి పిలిస్తే పలుకుతాడని భక్తులు విశ్వసిస్తారు. అయితే ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఈ విగ్రహం నీలమేఘ ఛాయలో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేతుడై పూజలు అందుకుంటూ వున్నాడు. ఇక్కడి దేవాలయ కుడ్యాలపై రామాయణ ఘట్టాలు అందంగా చెక్కబడి ఉన్నాయి. తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంటాయి. ప్రతి యేడు మాఘ శుద్ధ నవమి నుంచి బహుళ పాడ్యమి వరకూ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వేలసంఖ్యలో వచ్చిన ప్రజలు స్వామివారిని దర్శించుకుంటారు.
No comments:
Post a Comment