February 2019 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

వేద మార్గం చూపిన ఆధునిక మహర్షి స్వామి దయానంద సరస్వతి 195 జయంతి.

జననం అంటే ఏమిటి?
మృత్యువు అంటే ఏమిటి?
జనన మరణాల మధ్య సాగే జీవిత మంటే ఏమిటి?
మనిషి లక్ష్యం ఏమిటి?
మనిషి మనిషిగా బతకాలంటే అతని లక్షణాలు ఎలా ఉండాలి?
మనిషిగా అతని బాధ్యతలు ఏమిటి?
అతని జీవన ప్రయాణం ఎలా సాగాలి?
ప్రశ్నతో ప్రారంభమై... సమాధానాల అన్వే షణలో నిరంతరంగా సాగిన సత్యశోధనా యాత్ర మహర్షి జీవితం !

గుజరాత్‌లోని టంకారాలో సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో 1824 ఫిబ్రవరి 12న జన్మించిన మూలశంకరుడు చిన్నతనం నుండీ సత్యాన్వేషే ! దయారాం అని ముద్దుగా పిలవబడే ఈ బాలుడే తర్వాత మహర్షి స్వామి దయానంద సరస్వతిగా ఖ్యాతి గాంచాడు.

ఆ రోజు శివరాత్రి !

తండ్రితో కలసి చిన్నారి మూలశంకరుడుకూడా శివాలయానికి వెళ్లాడు. తెల్లవార్లూ పూజ జరుగు తోంది. అర్థరాత్రి అయ్యేకొద్దీ ఒక్కరొక్కరుగా నిద్ర లోకి జారుకుంటున్నారు. మూలామాత్రం శివలింగం కేసే తదేకంగా అలా చూస్తూ కూర్చుండిపోయాడు.

గర్భగుడిలో చిన్నదీపం, అర్థరాత్రి కావడం, భక్తులంతా నిద్రపోవడంతో కొన్ని ఎలకలు వచ్చి శివుడికి నివేదించిన ప్రసాదాలను ఆరగించాయి. శివలింగంపైనా, పానపట్టుపైనా ఎలుకలు నిర్భయంగా పరుగులు తీస్తుంటే మూలా ఆశ్చర్యపోయాడు.సర్వశక్తి సమన్వితుడైన శివుడిపై ఎలుకలు ఎక్కితొక్కుతున్నా శివుడు ఏమీ అనడేం? ప్రశ్న మొదలయ్యింది.

పక్కనే పడుకున్న తండ్రిని లేపాడు.

'నాన్నగారూ... మీరు నాకు చెప్పిన మహాదేవుడు ఇదేనా? లేక - ఈ లింగం మరేదైనా పదార్థమా?' ప్రశ్నించాడు.మంచి నిద్ర మధ్యలో లేపి ఇలాంటి ప్రశ్న వేస్తున్న కొడుకుపై తండ్రికి తెగ కోపం వచ్చేసింది. 'నువ్వు నాస్తికుడు మాదిరిగా మాట్లాడితే నీ నోరు పడిపోతుంది. ఈ శివలింగమే మహాశివుడు. అంతే !' అని చిరాగ్గా చెప్పి మళ్ళీ నిద్రపోబోయాడు.

- అయినా - మూలా వదలకుండా - 'అదికాదు నాన్నగారూ.. మీరు చెప్పే శివుడు జీవశక్తియే... కానీ, - ఈ శివలింగం మాత్రం ఏకదలికా లేని, ఏ స్పందనాలేని జడపదార్థమే కదా...!? మళ్ళీ ప్రశ్నించాడు. తండ్రి కోపం రెట్టింపయ్యింది. కానీ - ఒక్కక్షణం ఆలోచిస్తే - కొడుకు చెబుతున్న దానిలో తర్కం ఉంది. అంతర్లీనంగా నిజమూ ఉంది. అందుకే - 'నిజమే ... ఇది శివుని విగ్రహమే గాని శివుడు కాదు' అంగీకరించాడు.

'నాన్నగారూ - మరయితే - శివుడికి బదులుగా ఈ విగ్రహాన్ని మనమెందుకు పూజించాలి? మూలా మళ్ళీ మరో ప్రశ్న వేశాడు. అందుకు తండ్రి సమాధానమిస్తూ... 'నువ్విలా అడగడం సమంజసమే! అయితే - ఈ కలియుగంలో శివుణ్ణి యదార్థరూపంలో మనం చూడలేము కదా! అందుకనే - ఈ విగ్రహంలోనే శివుడు ఉన్నాడని నమ్ముతూ ఆయన్ని ఆరాధిస్తాం. ఆయన సంతోషించి మనకు మోక్షం ప్రసాదిస్తాడు' అని చెప్పారు.

మూలాకి ఇది మరీ విచిత్రంగా అనిపించింది.

'అలాగైతే - శివుడిని పూజించామని భావిస్తే కూడా సరిపోతుంది కదా - విగ్రహాన్ని పూజించడం దేనికి? అంటూ కుమారుడు మళ్ళీ ప్రశ్నించాడు.

తండ్రికి సమాధానం దొరకలేదు.

కుమారుడికి సందేహం తీరలేదు.

ప్రశ్నగా ప్రారంభమై...

సమాధానాలు పొందుతున్న దశలో మరిన్ని సందేహాలకు ఊపిరి పోసుకుంటూ సత్యశోధనలో నిరంతర ప్రయాణం సాగించారు దయానంద సరస్వతి.ఒక విషయం మీద సమగ్ర సమాచారం పొందాలంటే - ముందుగా మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి.

జీవితంలో మనం ఎదగాలంటే...

సమాచారం సంపూర్ణంగా తెలియాలంటే...

అది ప్రశ్నించడం ద్వారానే సాధ్యమౌతుంది

దొరికిన సమాధానంతో సంతృప్తి పడుతూ అదనపు సమాచారం సేకరించలేనినాడు ఆ వ్యక్తి అభివృద్ధి ఆగిపోతుంది.

21 సంవత్సరాల వయసులో సత్యాన్వేషణకోసం ఇల్లు విడచిన మూలశంకరుడు స్వామి పూర్ణానందుడిద్వారా సన్యాసదీక్ష స్వీకరించాడు. దీంతో అతను దయానంద సరస్వతిగా మారాడు.

సమర్థుడైన గురువుకోసం సుమారు 15 సంవత్సరాలపాటు అన్వేషించిన దయానంద సరస్వతీ స్వామి విరజానందుని దర్శనంతో, శిష్యరికంతో పరిపూర్ణుడయ్యాడు. మహర్షిగా రూపుదిద్దుకున్నాడు.హైందవ సంస్కృతీ సంప్రదా యాల విలువల్ని చాటిచెప్పడమే కాకుండా తన పర బేధం లేకుండా అన్ని మతాలనూ పరిశీలిస్తూ, అన్ని మతగ్రంథాలనూ అధ్యయనం చేస్తూ, మత గ్రంథాల మాటున సాగుతున్న మూఢ నమ్మకాలను తూర్పారబెట్టి, మతం కన్నా మనిషి ప్రధానం అంటూ చాటిచెప్పిన గొప్ప మానవతావాది దయానందసరస్వతి.

1857లో భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రా మం వైఫల్యం కావడంతో చెల్లా చెదురైపోతున్న భారతజాతిని సమైక్యపరచడంలో దయానంద సరస్వతి తీసుకున్న చొరవ బ్రిటీష్‌వారిని సైతం అప్రమత్తుల్ని చేసింది. సాయుధ విప్లవం ద్వారా భారతావనికి త్వరితగతిన స్వాతంత్య్రం రాగలదని నమ్మేవారాయన. స్వాతంత్య్రం ఒకళ్ళు ఇచ్చేది కాదు... మనకై మనం సాధించుకోవాలని చెప్పేవారాయన !

ఆయన ప్రసంగాలలో నర్మగర్భంగా సాగే స్వాతంత్య్రేచ్ఛ క్రమక్రమంగా ప్రజలలో చైతన్యజ్వాలను రగిలింపచేసింది. అందుకే - స్వామీజీ ఎక్కడికెళ్ళినా - బ్రిటీష్‌ గూఢచారులు వెన్నంటే ఉండేవారు. స్వామీజీపై జరిగిన విషప్రయోగంలో బ్రిటీష్‌వారి హస్తం ఉన్నట్లు కూడా రుజువయ్యింది. అనంతరకాలంలో - 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పడటం, స్వాతంత్య్రపోరాటం ఉధృతం కావడం జరిగింది.

పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అభివృద్ధి చెందాలనీ, స్త్రీ పురుష బేధం లేకుండా అందరికీ విద్యావకాశాలు కల్పించాలనీ అభిలషించే వారాయన. ఈ లక్ష్య సాధనకోసం పలుచోట్ల గురుకులాలు స్థాపించారు. కాంగడీ గురుకులం ఈనాటికీ తన విజ్ఞాన జ్యోతుల్ని ప్రసరింపచేస్తూనే ఉంది. అలాగే - 1975లో దయానంద సరస్వతి స్థాపించిన 'ఆర్యసమాజ్‌' నేడు ఒక మహాసంస్థగా దేశవిదేశాలలో హైందవ సంస్కృతీ సౌరభాలను వెదజల్లుతూనే ఉంది. తన సత్యాన్వేష యాత్రలో తాను నమ్మినదీ, ప్రజలకు మేలు కలుగచేసేదీ ఏమైనప్పటికీ, అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిర్భయంగా ప్రకటించే స్వామీజీకి ఆత్మీయులతోబాటే వ్యతిరేకులు కూడా అధిక మయ్యారు. స్వామీజీ జోథ్‌పూర్‌ సంస్థాన పర్యటనలో ఉండగా - విషప్రయోగం జరగడం తో తీవ్ర అస్వస్థ తకు గురై 1883 అక్టోబర్‌ 31న పరమపదించారు. పేరులోనే కాదు, వ్యక్తిత్వంలో కూడా పోతపోసుకున్న దయాస్వరూపం స్వామీజీ. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం కావాలి..!

https://www.facebook.com/rb.venkatareddy
Share:

తిరుమల వెంకటేశ్వరుని విగ్రహాన్ని పోలివుండె వాసుదేవుని విగ్రహం.

ఆంధ్ర ప్రదేశ్ శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని ప్రాచీన దేవాలయం.సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మితమయినదిగా భావిస్తున్న ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభ్యం కానప్పటికీ సుమారు 266 సంవత్సరాలక్రితం ఇది పునర్నిర్మితమయినట్టు ఇక్కడ లభించిన ఆధారాలబట్టి తెలియవచ్చింది. ఎర్రని ఇసుక రాయితో ఒరిస్సా శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్పసంపద వర్ణనాతీతం. ఆలయంలో నెలకొని ఉన్న నిలువెత్తు సాలగ్రామ మూలమూర్తి తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహాన్ని పోలివుండి చూపరులను కట్టిపడేస్తుంది. గత శతాబ్ధము చివర వరకు ఇది మంచి వేదాధ్యయన కేంద్రముగా విలసిల్లినట్లు కూడా తగిన ఆధారాలు లభించినాయి.
ఆ కాలంలో మందసా రామానుజులను ప్రసిద్ధ వేదవిద్వాంసులు ఈ ఆలయ ప్రాంగణంలోనే వేదవిద్యను నేర్పుతూ కాశి వరకు కూడా పర్యటించి పలువురు వేద విధ్వాంసులను వేదాంత చర్చలలో ఓడించి పలు సన్మాన పత్రములను పొంది ఉన్నారట. మందసా రామానుజుల కీర్తిని గురించి తెలుసుకున్నచిన్నజీయరు స్వామివారి గురువు పెద్ద జీయరు స్వామి వారు, వారి మిత్రులు గోపాలాచార్యస్వామివారితో కలసి నేటి రాజమండ్రి నుంచి శ్రీభాష్యం అధ్యయనం చేయడానికి కాలినడకన మందసకు వేంచేయడం జరిగింది. వారిని ఆదరించిన మందసా రామానుజులు వారిచే శ్రీభాష్యం అధ్యయనం చేయించడానికి అంగీకరించారు. నాటి రాత్రి ఆలయప్రాంగణంలో నిద్రించిన శిష్యులిద్దరికీ వారు రాజమండ్రి వద్ద దాటి వచ్చిన గోదావరి వంతెన విరిగి వరదలో కొట్టుకుపోయినట్లు కల వచ్చినది. అది అపశకునంగా భావించిన శిష్యులిద్దరు తమ విద్యాభ్యాసానికి ఆటంకము కలుగుతుందేమోనని భయపడుతూ గురువు గారివద్దకు వెళ్ళి కల సంగతి చెప్పారు. గురువుగారు వారిని ఊరడించి ఆలయంలో వేంచేసియున్నశ్రీ వాసుదేవ పెరుమాళ్ వద్దకు వారిని తీసుకుని వెళ్ళి స్వామికి సాష్టాంగ నమస్కారము చేయించి, వారు కూడా చేసినారట. ఆ సమయంలో వాసుదేవుని విగ్రహం నుండి ఓ దివ్యమయిన కాంతి ప్రసరించినదట. వాసుదేవుని అనుగ్రహం వల్ల శిష్యులిద్దరు సుమారు 2 సంవత్సరాలలో పూర్తికావలసిన శ్రీభాష్యం అధ్యయనాన్ని కేవలం 6 నెలలలోనే పూర్తి చేసుకుని తిరుగుప్రయాణం అయ్యారట. అందుకని ఇక్కడి దేవుని జ్ఞానప్రదాతగా, అభయప్రదాతగా భక్తులు కొలుస్తారు.
కాలాంతరంలో దివ్యమైన ఈ ఆలయం పాలకుల నిరాదరణకు గురి అయ్యి పూర్తిగా శిధిలావస్థకు చేరుకుంది. ఆలయానికి చెందిన అపూర్వ శిల్పసంపద చాలావరకు ఆకతాయి చేష్టలకు నాశనం కాబడింది.సుమారు 1683 ఎకరాలు మాన్యం ఉన్నప్పటికీ ఈ ఆలయం మనిషి స్వార్థానికి ప్రతీకగా శిథిలమయ్యింది. ప్రస్తుతం కేవలం 3 ఎకరాల భూమి మాత్రమే రెవెన్యూ రికార్డుల ప్రకారం అందుబాటులో ఉంది. ఆలయ గోడలమీద పిచ్చిమొక్కలు పెరిగి విషజంతువుల సంచారంతో సుమారు 50 సంవత్సరాల కాలం ఈ అపురూప ఆలయం జనబాహుళ్యానికి దూరంగా ఉండిపోయింది.
1988 లో ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్న చిన్నజీయరు స్వామి వారు ఆలయసందర్శనార్ధం మందసకు వేంచేసి, ఖర్చుకు వెరవకుండా ఆలయ ప్రాచీనతకు భంగం కలుగకుండా పునర్నిర్మించాలని సంకల్పించారు. అన్ని ప్రభుత్వ లాంచనాలు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారినుండి ఆలయాన్ని స్వాధీనం చేసుకుని, ఒరిస్సా నుంచి శిల్పులను రప్పించి యదాతధంగా ఆలయాన్నిపునర్నిర్మింపచేసారు. గురువు పెద్దజీయరు స్వామివారి విద్యాభ్యాసానికి గుర్తుగా వారి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయరు స్వామివారు 2009 ఫిబ్రవరి నెలలో పూర్తిగా శిథిలమయిన ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రస్తుతం గుడి మాన్యం తిరిగి దేవునికే చెందేలా చర్యలు తీసుకోబడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాలు అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం మొదలగు వాటికి సమానంగా ఈ ఆలయం కూడా క్రమేపి ప్రాధాన్యత పొందుతున్నది. జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచే కాకుండా ఇతర జిల్లాలు మరియు ఒరిస్సా నుండి కూడా అనేకమంది భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అనగా ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ఈ ఆలయం తప్పక సందర్శించతగినది.

Share:

మహిమాన్వితమైన శివలింగ పుష్పం.


శివలింగ వృక్షం శివుడి జఠాఝూఠ ఆకృతిలో, వెండ్రుకలు విప్పారినట్లుగా ఉంటాయి. పుష్పాలు కొమ్మలకు పూయకుండా వెంట్రుకల లాంటి జడలకు పూస్తాయి. పైభాగాన నాగ పడగ కప్పి ఉన్నట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి. శివలింగపుష్పాల్ని నాగమల్లి పుష్పాలుగా, మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు. ఇవి అద్భుత సుగంధ పరిమళాలు వెదజల్లుతుంటాయి. దక్షిణ భారత దేశంలోను కనిపిస్తుంది. వీటి పుష్పాల మధ్య భాగం పడగ విప్పిన సర్పం వలె ఉంటుంది.
.
హిందువులు శివలింగపుష్ప రూపంలో, వృక్షరూపంలో శివుడు కొలువై ఉన్నాడని బావిస్తారు. శివలింగపుష్పాలు సర్వదేవతలకు ముఖ్యంగా శివునికి ప్రీతికరం. ఈ పుష్పాలతో శివపూజ చేయడం ప్రతి శివభక్తునికి నిజంగా ఒక వరం. శివలింగపుష్పాలతో శివపూజ చేసిన వారికి జన్మరాహిత్యాన్ని పొంది, అంత్యమున కైవల్యం పొందునని శివపురాణంలో ఉన్నది. ఏ దేవునికైనా ఈ పుష్పం సమర్పించినప్పుడు, తప్పనిసరిగా ఆ దేవతల శిరస్సుపై లేదా భుజస్కందాలలో మాత్రమే అలంకరించాలి. పాదాలదగ్గర వేయరాదు. పార్వతికి మాంగల్యంలో అలంకరించాలి.


https://www.facebook.com/rb.venkatareddy
Share:

శ్రీముఖ మధుకేశ్వరాలయం.

శ్రీముఖ లింగం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో వుంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి. ఇక్కడ లభించిన అధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో వుంది.
ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. ఇప్ప చెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయం గా పేరొచ్చిందని అంటారు. ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి, సప్త మాతృకలలో ఆమె వొకరు . మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం వుండటం విశేషం. భీమేశ్వరాలయం శిధిలావస్థలో వుంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి.
సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే , మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి.
ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కొమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా వున్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ ఆలయం శిధిలావస్థలో వుంది.
ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడ దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడ తెలుస్తోంది.



Share:

ప్రపంచంలోనే ఏకైక పదమూడు అంతస్థుల కైలాష్ నికేతన్ ఆలయం.


ఉత్తరాఖండ్ లో హిమాలయాల దిగువ ప్రాంతంలో ఉన్న రిషికేశ్ పూజింపబడిన పుణ్యక్షేత్రం. ఆరాధనాభావం గంగా దాని అత్యద్భుతమైన ఆకర్షణ జోడించడం ద్వారా ప్రవహిస్తుంది. రిషికేశ్ ప్రపంచ యోగ కాపిటల్ మరియు ధ్యానం ఒక అద్భుతమైన ప్రదేశం. తేరా మంజిల్ (పదమూడు అంతస్థుల నిర్మాణం) శివుడు మూడు కళ్ళు హిందూ మత దేవాలయం మరియు దీనిని త్రిమ్బకేస్వర్ అని పిలుస్తారు. ఇతర సాధారణ దేవాలయాలు నుండి అసమాన దాని ఏకైక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆలయ అన్ని హిందూ మతం దేవతలు మరియు దేవుళ్ళ శిల్పాలు ప్రతిష్టించారు. లక్ష్మణ్ జూలా సమీపంలో ఉన్న తేరా మంజిల్ ఆలయం ఈ ఆలయ పదమూడు అంతస్థుల నుండి సూర్యాస్తమయం వీక్షణ అద్భుతం. ఆలయం గంగా నది ఒడ్డున అందమైన మనోహరంగా హిమాలయ శ్రేణులు బ్యాక్డ్రాప్లో ఉన్న. కొంతమంది పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకటిగా ఈ ఆలయ భావిస్తారు. దేవాలయం చుట్టూ అద్భుతమైన సహజ అందం మంది భక్తులు పాటు పర్యాటకులను ఆకర్షిస్తుంది.

Share:

బ్రహ్మ ప్రతిష్టించిన బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం.

విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం మండలానికి చెందిన బలిఘట్టం గ్రామము బ్రహ్మచే ప్రతిష్టింపబడిన శివలింగం బలిఘట్టం బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయానికి చారిత్రాత్మకతను తెచ్చిపెట్టింది. లోక కళ్యాణార్ధం తలపెట్టిన యజ్ఞానికి శివారాధన నిమిత్తం బలిచక్రవర్తి బ్రహ్మను ప్రార్ధించి శివలింగాన్ని భూవికి రప్పించారు. కృతయుగంలో జరిగిన ఈసంఘటనతో ఈ ప్రాంతానికి చరిత్రలో స్థానం లభించింది. అందుకే ఈప్రాంత బలిఘట్టంగా పేరుగాంచింది.
హిందూ మహారాజు శివునికి నిత్యం పూజలు చేసేవాడని, ఒక సందర్భంలో శివార్చనకు నీరు లేకపోవడంతో విష్ణుమూర్తి కోసం తపస్సు చేయగా వరాహావతారంలో దర్శనం ఇచ్చిన ఆయన నీటిని సమకూర్చడంతో ఈ ప్రాంతంలో ప్రవహించే నదికి వరాహానది అని పేరువచ్చింది. ఈనది ఉత్తర దిక్కుగా ప్రవహించడంతో ఉత్తరవాహినిగానూ, ఈ ప్రాంతం దక్షిణ కాశీగానూ చరిత్రలో నిలిచింది.
బ్రహ్మచే ప్రతిష్టింపబడిన ఈశివలింగానికి ప్రతీ ఏటా మహాశివరాత్రి పర్వదినాన్న పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. జిల్లాలోని దూర ప్రాంతాల నుండి సైతం వేల సంఖ్యలో భక్తులు బ్రహ్మలింగేశ్వరస్వామిని దర్శించుకుని పునీతులవుతారు. ఉత్తర వాహినిలో స్నానం ఆచరించడం సర్వ పాప పరిహారంగా భక్తులు భావిస్తారు. బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం పూర్తిగా రాతితోనే నిర్మితమైంది. రాతి స్తంభాలు , పై కప్పులు సైతం రాతితోనే నిర్మించారు. వేల సంవత్సరాల క్రితమే ఈదేవాలయం పూర్తి స్థాయిలో నిర్మితమైనట్లు స్థానికులు చెబుతుంటారు.
దేవాలయానికి గల ఆస్తులతోనే నిత్య ధూప,దీప,నైవేధ్యాలను సమకూర్చుతున్నారు. శివరాత్రి పర్వదినం రోజున వచ్చే వేలాది మంది భక్తులు తమకు తోచిన రీతిలో కానుకలు సమర్పించుకుంటారు. మహాశివరాత్రి మూడు రోజుల పాటు ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే రుద్రాభిషేకాలు, ఏకవారాభిషేకాలు కూడానిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

Share:

నల్లమల అటవి ప్రాంతాంలోని నిదానంపాటి శ్రీలక్ష్మమ్మ అమ్మవారు క్షేత్రం.


గుంటూరు జిల్లా అడిగొప్పుల గ్రామం సమీపంలో ఉన్న నిదానంపాటి అమ్మవారి క్షేత్రం నల్లమల అటవి ప్రాంతానికి సమీపాన ఉంది. ఈ క్షేత్రానికి సుమారు 700 వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫాలుణమాసంలో పౌర్ణమి రోజున తిరునాళ్ళు నిర్వహించెదరు. ఈ తిరుణాళ్ళకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు. ఆదివారం ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. 'అడిగొప్పుల' గ్రామంలో గల ఈ అమ్మవారి సన్నిధిలో ఒక రాత్రి నిద్ర చేస్తుంటారు.
ఇక్కడి అమ్మవారి సన్నిధిలో నిద్రచేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందనే విశ్వాసం భక్తులలో బలంగా కనిపిస్తుంటుంది. ఈ కారణంగా సంతాన భాగ్యాన్ని ఆశించి ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారిగా శిలారూపంలో ఇక్కడ పూజలు అందుకుంటోన్న యువతి, శాపవశాత్తు మానవ జన్మయెత్తిన పార్వతీదేవి అని స్థలపురాణం చెబుతోంది.
ఒకసారి కైలాసంలో ప్రమథ గణాలు నాట్యం చేస్తూ ఉండగా పార్వతీ పరమేశ్వరులు తిలకించసాగారట. నందీశ్వరుడు నాట్యం చేసే తీరు అమ్మవారికి హాస్యంగా అనిపించడంతో నవ్వుతుంది. ఆ విషయాన్ని నందీశ్వరుడు పెద్దగా పట్టించుకోడు కానీ ఆయన తండ్రి 'శిలాదుడు' కి కోపాన్ని కలిగిస్తుంది. తన కుమారుడిపట్ల అవమానకరంగా ప్రవర్తించిన ఆమె ప్రతిఫలాన్ని అనుభవించా లనుకుంటాడు.
భూలోకంలో మానవ దంపతులకు జన్మించి ... ఒకానొక సంఘటన కారణంగా అనుమానించబడి ఆ కారణంగా తనువు చాలించి ఆ తరువాత శిలారూపంలో పూజలు అందుకోమని శపిస్తాడు. అలా శిలాదుడి శాపం కారణంగానే అమ్మవారు ఇక్కడ ఇలా ఆవిర్భవించిందని అంటారు. లక్ష్మీ పేరుతో జన్మించిన పార్వతీదేవి కనుక, ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఇద్దరి అమ్మవార్లను సేవించిన ఫలితం దక్కుతుందని అంటారు.
ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే సంపదలు ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు. అటు పురాణ సంబంధమైన కథనం ... దానితో ముడిపడిన జానపదుల కథనం ... వాటిని నిజం చేస్తూ ఇక్కడి అమ్మవారు చూపే మహిమలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అందువలన ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా చెప్పబడుతోంది.

Share:

అరుదైన త్రేతేశ్వర శివలింగం.

కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళకు అత్తిరాల బాహుదానది ఒడ్డున అతి పురాతన కాలం నాటి అరుదైన శివలింగం దొరికింది. ఏకముఖ రుద్రాక్షపై శివలింగం, పాము పడగ, అన్నీ కలిసి ఒకే రుద్రాక్షలో ఉండటంతో ఇదో ఎంతో పవిత్రమైనదనీ, అత్యంత పురాతన కాలం నాటిదనీ గ్రామస్థులు, అక్కడి వేద పండితులు చెప్పారు.

Share:

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చింతమాను మఠం.

* గరిమిరెడ్డి అచ్చమాంబ నివాసం - కాలజ్ఞాన తత్వ ప్రభోదం..

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (1608-1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. సత్యం, త్యాగం, ధర్మము, భక్తీ ప్రపత్తులు భోధించి, ఆత్మజ్ఞానము కలిగించి మానవులకు ఎన్నో జన్మల పుణ్యఫలము వాళ్ళ ప్రాప్తించిన వారి మానవ శరీరాలతోనే రాజయోగము ద్వారా ముక్తిని సులభముగా పొందే మార్గమును సర్వ మతాల వారికి అందించుటకు, నిరాకార నిర్గుణ స్వరూపుడైన శ్రీ విరాట్ విశ్వబ్రహ్మ సాకారరూపుడై, సర్వతేజోశక్తుల యుక్తముగా, భూమిపై సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు అంశతో సద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిగా అవతరించినారు.
.
ప్రకృతి ధర్మాన్ని అనుసరించి 12 సంవత్సరముల వయస్సు వచ్చువరకు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు యోగాలు సమస్త విద్యలు అభ్యసించి దేశాటనకు బయలుదేరునప్పుడు తల్లి వీరపాపమాంబకు తారకమును, సృష్టి క్రమమును భోధించి, శ్రీ కృష్ణుడు అర్జునకు చూపించినట్లు విశ్వరూప దర్శనము తల్లికి చూపించి, జ్ఞానోదయము కలిగించినారు. శ్రీ కృష్ణునిలాగానే గోపాలకుడై గారిమి రెడ్డి అచ్చమాంబ ఇంటియందు గోవులు కాయుటకు గోవుల కాపరిగాయుండి బనగాను పల్లెలోని రవ్వలకొండ గుహలయందు తాళపత్రాలపై నవగ్రహాల నడక వల్ల, పంచభూతాల ప్రతిక్రియ వల్ల ప్రకృతి వైపరీత్యాలను భూత - భవిష్యత్ వర్తమాన విషయాలతో కాలజ్ఞాన - ఆత్మజ్ఞాన, భక్తిమార్గము - ముక్తిమార్గము వ్రాసినారు, శ్రీ స్వాములవారు గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంటియందు ఉన్నంతకాలము గరిమిరెడ్డి అచ్చమ్మగారి సేవలకు మెచ్చి గరిమిరెడ్డి అచ్చమాంబను ఆశీర్వదించారు.
.
కర్నూలు జిల్లాలొని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు. బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు ఆయనచే వ్రాయబడిన 14,0000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టిన దానిపై ఒక చింతచెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు..? ఇలా ఎందుకు చేశారు..? అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు. అచ్చమ్మ ఇంట్లో యధాప్రకారం కాలజ్ఞానాన్ని వ్రాసి, ఒక చోట పాతిపెడుతూ ఉండేవారు పోతులూరి. బ్రహ్మం గారు నివసించిన గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇల్లు. ఇక్కడ చెట్టు కిందే కాలజ్ఞాన తాళపత్రాలు నిక్షిప్తం చేశారు. ఇంటిని మ్యూజియంగా మార్చారు. బ్రహ్మం గారి జీవితానికి సంబందించిన విశేషాలు ఇక్కడ చూడొచ్చు. బ్రహ్మం గారు ఇక్కడ నుంచే రోజు రవ్వలకొండకు ఆవులను తోలుకు వెళ్ళి అక్కడ వాటిని కట్టి, అక్కడి గుహలో కాలజ్ఞానం రాసేవారు. ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు, ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింతచెట్టు పూలు అన్నీ రాలిపడతాయని అక్కడి ప్రజల విశ్వాసం. ఆచెట్టు పంగలలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరినప్పుడు కుంకంలా ఉంటుంది. వ్యాధులు మరియు ప్రమాదాలు నివారణ కొరకు దానిని స్వీకరిస్తుంటారు. ఆ చెట్టు అక్కడి ప్రజలందరికీ సుపరిచితమే. ఆ చింతచెట్టుకు నిత్యదీపారాధన చేస్తూ ఉంటారు. ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికిరానివై ఉంటాయి.
.
సేకరణ…
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి
భారతీయ సనాతన హిందూ ధర్మ సంరక్షణ సమితి
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy
Share:

ఓం నమో వేంకటేశాయ .. శ్రీ వేంకటేశ్వర స్వామి చరిత్రామృతం.


* బ్రహ్మాండ నాయకుని వివాహం ఎలా జరిగింది ...
* సమస్త బ్రహ్మాండం అంతా తిరుమలకు పయనం ...
* శ్రీనివాసుడు మహా శక్తిమంతుడు ...
.
మాకు వార్షికం ఇస్తే వస్తాం అంటారు దేవతలు. అంటే పారితోషికం, ఇంగ్లీష్‌లో బోనస్ అన్నమాట. దేవతలకు డబ్బు వార్షికం కాదు, పుణ్యం మొదలైనవి వార్షికం. ప్రతి ఏటా వీటిని బ్రహ్మదేవుడు దేవతలకు ప్రసాదిస్తాడని చెప్తారు.కలికాలంలో మానవులతో ఏదైనా కార్యం చేయలాంటే, వారికి ఎంతో కొంత మూటజెప్పాల్సి ఉంటుంది. అధికశాతం మంది ఏ పని చేస్తున్నా, 'అయితే నాకేంటీ? ఇందులో నాకు లాభమేమిటి?' అన్న ధోరణితోనే చేస్తారు. దానికి సంకేతంగానే ఈ సన్నివేశం. బ్రహ్మ ఆదేశాల మీద ముక్కోటిదేవతలు కదిలి వస్తారు. గరుడుని వార్తతో యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మునులు, ఋషులు అంతా బయలుదేరతారు. పురాణం ఆ సన్నివేశాన్ని అద్భుతంగా వివరిస్తుంది. బ్రహ్మ పరివారమంతా కలిసి 10 లక్షల మంది ఉంటారు. 3 యోజనాల దూరం ఉంటుంది ఆ గుంపు. వీరు ఒక్కో లోకాన్ని దాటుతున్న సమయంలో, ఆయా లోకాలవారు కూడా వీరిని కలుస్తారు. అందరూ దివ్యతేజో మూర్తులు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలన్నీ ఒక చోట చేరితే ఎలా ఉంటుందో, గుంపుగా వస్తుంటే ఎలా ఉంటుందో, అలా ఉంది సన్నివేశం. ఈ పరివారం మధ్యలో గంధర్వులు గానంచేస్తున్నారు, నాట్యం చేసేవారు నాట్యం చేస్తున్నారు. అందరి ముఖాలలో ఆనందం తాండవిస్తోంది. వీళ్ళందరి సంగతి అటుంచితే, ఇక్కడ శ్రీనివాసుడికి ఆతృత పెరిగిపోతోంది. ఏంటో, వీళ్ళు ఇంకా రాలేదు, ఎప్పటికి వస్తారో, అసలు బయలుదేరారో లేదో, సమయానికి చేరుకుంటారా? ..... ఇలా ఆయనలో అనేక ఆలోచనలు కలుగుతున్నాయి. బయటకు, లోపలికి తిరుగుతున్నారు. ఇంతలో గరుత్మంతులవారు, ఆదిశేషులవారు బ్రహ్మాది దేవతల ప్రయాణ వివరాలు చెప్తుంటారు. మీరేం కంగారు పడకందీ స్వామి, దేవతలు ఇప్పుడే హిమాలయాలు దాటారనీ, కాసేపాగి, గంగా దాటారనీ, గోదావరీ నదిని దాటి కృష్ణానదిని సమీపించారని చెప్తుంటారు. అంటే ఎప్పటకప్పుడు 'లైవ్ అప్‌డేట్స్' ఇస్తుంటారనమాట.
.
దేవతలందరితో కలిసి బ్రహ్మ తుంబుర తీర్దం చేరి అక్కడ స్నానం చేసి, అక్కడి నుంచి తిరిగి బయలుదేరుతారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసుడు ఇక ఆగలేక, ఎదురువెళ్ళి బ్రహ్మదేవుని ఆలింగనం చేసుకుంటాడు. శివుడి తలపై నిమురుతాడు. కొందరికి కరచాలనం చేస్తాడు, కొందరికి చేయి ఊపి, ఇంకొందరిని మందహాసంతో, కొందరికి కనుసైగలతో పలకరిస్తాడు. వాయుదేవుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఇలా ఇంద్రుడు, అగ్ని, యముడు మొదలైన దేవతలందరినీ ఆదరంతో ఆహ్వానిస్తున్న శ్రీనివాసుడు దృష్టి విశ్వకర్మపై పడుతుంది. "ఇంత మంది నా దగ్గరకు వచ్చినా, నువ్వు మాత్రం గర్వంతో దూరంగా ఉన్నావు" అని పలికి, "ఇతనిని విశ్వకర్మ పదివి నుంచి తొలగించి, నా యందు భక్తిప్రపత్తులు కలిగిన వానిని నియమించు" అని ఇంద్రునితో పలుకుతాడు. వర్ధకి అని పేరుగల ఈ విశ్వకర్మ క్షమించమని స్వామి పాదాలపై పడతాడు. మొత్తం వేంకటాచలం అంతా అతిధులతో నిండిపోయింది. ఎక్కడ చూసిన పండుగ వాతావరణం, కోలాహలం, సందడి, ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటున్నారు, దీవెనలు తీసుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్ళి కళ వచ్చేసింది వేంకటాచలంలో. ఇంతమంది అతిధులు రావడం ఒక ఎత్తైతే, ఇంతమందికి వసతి భోజన ఏర్పాట్లు చేయడం మరొక ఎత్తు కదా. అందుకే శ్రీనివాసుడు ఇంద్రునితో "ఇంత మంది దేవతలు, ఋషులు, బ్రాహ్మణులు వచ్చినపుడు వారికి తగిన సదుపాయాలు చేయాలి కదా, అందుకని 50 యోజనాల పొడవు, 30 యోజనాల వెడల్పు గల ఒక మనోహరమైన సభాభవనం ఏర్పాటు చేయమంటాడు. విశ్వకర్మతో క్షణాల్లో అలాంటి భవనం నిర్మాణం చేయిస్తాడు ఇంద్రుడు. ఇంత మంది అతిధులతో మనం నారాయణ వనం వెళితే, అక్కడ విడిది ఏర్పాటు చేయడంలో ఆకాశరాజు గారికి ఇబ్బంది కలగవచ్చు. అక్కడ కూడా విడిది భవనాలు, సభాభవనాలు ఏర్పరచాలి. ఆకాశరాజు వద్దకు విశ్వకర్మను పంపించి, మాట్లాడి తగిన విధంగా నిర్మాణం చేయించి అని ఇంద్రునితో అంటాడు శ్రీనివాసుడు. అలా నారయణవనం సమీపంలో ఒక మహానగర నిర్మాణమే జరుగుతుంది.
.
బాధ్యత అంతా ఒక్కడే మోయడం కష్టం కనుక, ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పజెప్పాడు శ్రీనివాసుడు. ఋషులకు, మునులకు సదుపాయాలు కల్పించడం శివుడికి, మర్యాదలు, పిలుపుల బాధ్యత షణ్ముకుడికి, వంటావార్పు అగ్నిహోత్రునికీ, నీటి సదుపాయం వరుణునికి, ఆకులుదొన్నెలు తయారీ నవగ్రహాలకు, పాత్రల శుద్ధి (ఒకరకంగా క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ అనుకోండి) వసువులకు, పౌరోహిత్యం వశిష్టునికి, బ్రాహ్మణులకు దానాలిచ్చే బాధ్యత కుబేరునికి, వెలుగుకి (లైటింగ్ అర్రెంజ్మెంట్) చంద్రునికి అప్పగించారు. బయటకు ఇంతమంది దేవతలు పెళ్ళి పనుల్లో మునిగిపొయినట్టు కనిపించినా, అంత ఒకటే తత్వం. వీళ్ళంతా పరబ్రహ్మం యొక్క ప్రతిరూపాలే. ఒకే భగవంతుడు, అనేక రూపాల్లో, అనేక కార్యాలు చేస్తున్న అద్భుత సన్నివేశం ఇది. వచ్చిన అతిధులందరికీ స్వాగతం పలికిన స్వామి ఒక్కసారిగా డీలాపడిపోతాడు. ఎందుకో ఎవరికి తెలియదు. కారణం అడిగిన బ్రహ్మతో ' ఎంతమంది వస్తే ఏంటి? నా మహాలక్ష్మీ రానంతవరకు ఎవరూ రానట్లే ' అంటాడు. ఇంకా శ్రీనివాసుడు 'ఆమెను ఎవరు పిలుస్తారు? పిలిస్తే వస్తుందా? అంటారేమో, సూర్యుడిని పంపుదాం, సూర్యుడంటే ఆమెకు చాలా అభిమానం, ప్రీతి అని నాకు తెలుసు' అని అంటాడు. ఈ విషయం విన్న సూర్యుడు భయంతో ఒణికిపోతాడు. పెద్దల వ్యవహారం, అందునా భార్యాభర్తల మధ్య తగాదా, ఏమంటే ఏమవుతుందో, అసలేం జరుగుతుందో అని తన భయాన్ని వ్యక్తం చేస్తాడు. తన మాట విని విష్ణుమూర్తితో ప్రణయకలహం ఆడిన లక్ష్మీదేవి తిరిగి వస్తుందన్న నమ్మకం సూర్యునికి ఏ మాత్రం లేదు. సూర్యుడి మాట విన్న శ్రీనివాసుడు 'నువ్వెళ్ళి పిలిస్తే తప్పక వస్తుంది' అంటాడు. వెళ్ళడం తప్పదు అనుకున్న సూర్య్డు ఏం చెప్పాలని నసుగుతాడు.
.
నాకు అనారోగ్యం చేసిందని చెప్పు. ఒక చేయి బ్రహ్మపైన, మరొక చేయి శివుడి పైన వేసి, ఎంతో కష్టపడితే కానీ, నడవలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పు అంటాడు శ్రీనివాసుడు. స్వామి దోషరహితుడు, సర్వమంగళకారుడు, నిరామయుడు, ఎటువంటి వికారానికి లోను కానివాడు. అందరి రోగాలను నయం చేసేవాడు, ధన్వంతరీ కూడా ఆయనే, అటువంటి స్వామికి జబ్బు చేయడం అసాధ్యం. లక్ష్మీదేవికి ఈ విషయం తెలుసు. సూర్యుడికి కూడా ఈ అనుమానం వచ్చి 'ఆమె నమ్ముతుందా?' అంటాడు. నా మాయతో ఆమె కూడా మొహితురాలవుతుంది. నువ్వు వెళ్ళిరా అంటాడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడు మాట విన్న సూర్యుడు లక్ష్మీదేవిని తీసుకురావడానికి కరివీరపురం (కొల్హాపూర్) వెళతడు. మొదట ప్రణయకలహ గుర్తుకొచ్చి రానన్న, తరువాత స్వామికి అనారోగ్యం చేసిందనేసరికి పరుగుపరుగున బయలుదేరుతుంది. ఆమెకు నిజం తెలియదా అంటే ఆమె సర్వజ్ఞురాలు, అంతటా వ్యాపించి ఉన్న శక్తి తత్వం, పైగా విష్ణుమూర్తి హృదయంలోనే ఉంటుంది, నిజానికి వారిద్దరికి బేధం కూడా లేదనే చెప్పాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి స్వరూపం. కానీ కలియుగంలో భక్తజనాన్ని అనుగ్రహించడం కోసం, తాము ఆడుతున్న లీలానాటకాన్ని రక్తి కట్టించడం కోసం అమ్మ ఏమి తెలియనట్లు, అబద్ధం నమ్మినట్లు నటించింది. మొత్తానికి లక్ష్మీదేవి కూడా వేంకటాచలం చేరుకుంది. దాంతో పెళ్ళిపెత్తనమంతా లక్ష్మీదేవిది, వకుళాదేవిది అయ్యింది. పెళ్ళిపనులు చకచకా చేయడం మొదలుపెట్టింది. శ్రీవారి మంగళస్నానానికి ఏర్పాట్లు చేసింది. చక్కగా ముత్తైదువలంతా కలిసి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో, శ్రీనివాసుడి ఒంటికి నూనె పట్టించి, నలుగు పెట్టి హారతి ఇచ్చారు. తరువాత అభ్యంగనస్నానం చేయించి, మళ్ళీ హారతులిచ్చారు. మరీ చల్లటి నీరు పోస్తే జలుబు చేస్తుందేమొ అని భయంతో, 'గోరు వెచ్చటి నీరు మాత్రమే పోయొండమ్మా మా ఆయనకు' అంటూ లక్ష్మీదేవి తన స్వామి పట్ల విశేష శ్రద్ధ తీసుకుంది. అసలే జగన్మోహనాకారుడు, పెళ్ళి కళతో మరింత మెరిసిపోతున్నాడు, దానికితోడు ఈ క్రతువుతో శ్రీనివాసుడు ఎంత అందంగా, సమ్మోహనంగా కనిపిస్తున్నాడో మాటల్లో చెప్పలేం. అందరి కళ్ళు ఆయన మీదే. వైభవంగా మంగళస్నాన ఘట్టం ముగిసింది.
.
తరువాతి కార్యక్రమం పుణ్యావచహనం, అటు తరువాత కులదేవత స్థాపనం, కులదేవతను పూజించడం. దేవతా సార్వభౌముడైన స్వామికి కులదేవత ఎవరుంటారు? ఇదే పెద్ద సందేహం. దానికి సమాధానం స్వామియే చెప్తారు. 'శమీవృక్షమే మా కులదైవం' అని చెప్పిన స్వామి, కూమారధారలో ఉన్న శమీవృక్షానికి కులదేవత పూజ చేస్తారు. మరి ప్రతిష్ట ఎక్కడ చేయాలని అడుగుగా, వరాహస్వామి వారి నివాస ప్రాంగణంలో చేద్దాం అంటారు. అప్పుడు స్వామికి తాను మర్చిపోయిన ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుకువస్తుంది. అంతా చేశాం, అంతా పిలిచాం కానీ వరాహస్వామికి ఆహ్వానపత్రిక ఇవ్వడం మరిచాం, పత్రిక సంగతి తరువాత, కనీసం కబురు కూడా చేయలేదన్న సంగతి శ్రీనివాసుడికి గుర్తుకువస్తుంది. స్వయంగా తానే వెళ్ళి వరాహస్వామిని ఆహ్వానిస్తాడు. వరాహస్వామి మాత్రం తాను పని ఒత్తిడి వల్ల పెళ్ళికి హాజరు కాలేనని, తన పంటలపై తరుచూ రాక్షసులు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని, పంటలను కాపాడడం కోసం ఇక్కడే ఉండాలసిన అవసరం ఉంది అని వరాహస్వామి అంటారు. అలాగే తాను ముసలివాడినయ్యానని, ఓపిక లేదని చెప్పి, తన తరుఫున వకుళమాత వస్తుందని చెప్తారు. "మీరు అందరూ వెళ్ళి శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని రండి, నా ఆశీర్వాదం మీ వెంట ఎప్పుడు ఉంటుంది" అంటారు. తరువాత కులదేవత స్థాపన, పూజ ముగుస్తాయి. ఇక అందరం పెళ్ళికి బయలుదేరుదాం అంటాడు స్వామి. ఇంతలో బ్రహ్మదేవుడు కలుగజేసుకుని ఆక్షేపిస్తాడు. "కులదేవతను ఆహ్వానించి పూజించిన తరువాత అన్నసంతర్పణ చేయకుండా ఎలా వెళతాం? బంధువులు, ఋషులు, బ్రాహ్మణులు, పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు. ప్రయానం చేసి అలసిపోయారు. అందరికి కడుపునిండా తృప్తిగా భోజనాలు పెట్టకా, అప్పుడు బయలుదేరితే బాగుంటుంది" అంటారు. సమంజసమే కానీ, ఇంతమందికి విందు ఏర్పాటు చేయడానికి నా దగ్గర డబ్బేది? అంటాడు శ్రీనివాసుడు. డబ్బు లేదని చెప్పి పదిమంది ముందు పరువు పోగొట్టుకోమంటామా? డబ్బు లేకపోతే అప్పోసొప్పో చేసైనా శుభకార్యం జరిపంచాలి" అంటాడు శివుడు. తనకు అప్పు ఎవరిస్తారన్నది శ్రీనివాసుడు సందేహం. అలకాపురీ అధిపతి అయిన కుబేరుని పిలిపించండి అంటారు బ్రహ్మ. అలాగే కుబేరుని పిలిపిస్తారు. కుబేరుడు కొంత ఆలస్యంగా రావడంతో శ్రీనివాసుడు మందలిస్తాడు.
.
అందరి ముందు అప్పు తీసుకుంటే ఏం బాగుంటుందని శ్రీనివాసుడు, కుబేరుడు, బ్రహ్మ, శివుడు కలిసి తిరుమల పుష్కరిణికి పడమర దిక్కున గల అశ్వత్థవృక్షం (రావి చెట్టు) వద్దకు వెళతారు. అక్కడికి వెళ్ళాకా, నాకు కొంచం డబ్బు కావాలి అని అడుగుతారు. "స్వామి, మీరిలా నన్ను అడగడమేమిటి? ఇదంతా మీ ఐశ్వర్యమే. మీ తరుపునే నేనీ ధనాన్ని సంరక్షిస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి" అంటాడు కుబేరుడు. యుగధర్మాన్ని అనుసరించి ఇవ్వమంటాడు శ్రీనివాసుడు. కలియుగంలో అప్పుకు పత్రం రాసి, చక్రవడ్డీ కట్టాలనీ, ఇదే కలియుగంలో కనిపిస్తుందని, కనుక ఆ ప్రకారమే పత్రం రాయమని చెప్తాడు కుబేరుడు. అప్పు ఇస్తాను సరే, నీవు తిరిగి ఇస్తావన్న నమ్మకం ఏంటి? ఇది కలియుగం, కలియుగ ప్రజలు మాట మీద నిల్చునే రకం కాదు. కనుక నీవు నా దగ్గర అప్పు తీసుకున్నట్టుగా సాక్షులు కావాలి అంటాడు కుబేరుడు శ్రీనివాసుడితో. పక్కనే ఉన్న బ్రహ్మ సాక్షి సంతకం పెడతానంటాడు. బ్రహ్మ విష్ణుమూర్తి కుమారుడు కనుక, పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉన్నదని, అప్పు చెల్లించకుండా మాట మార్చే సమయంలో శ్రీనివాసుడికి సాయం చేయవచ్చునని అనుమానపడి, ఈయన ఒక్కడితోనే కుదరదు అంటాడు కుబేరుడు. శివుడు సంతకం పెడతానంటాడు. నీవు ఎప్పుడు కైలాసపర్వతం మీద ధ్యానంలో కూర్చుంటావు. నీకు కోపం ఎక్కువంటారు. కోపం తో మూడవకన్ను తెరిచి అంతా బూడిద చేస్తావు. అమ్మో! నీ దగ్గరకు రావాలంటేనే నాకు భయం, కనుక మరొక సాక్షి కావాలి అంటాడు కుబేరుడు. అప్పుడు తమ పక్కనే ఉన్న ఆ రావి చెట్టు పేరు చెప్తారు. సరే అయితే, నేమి సాక్షి సంతకం పెడతా అంటుంది ఆ రావి చెట్టు. ముగ్గురు సాక్షులు వచ్చారు కనుక, అప్పు పత్రం రాసుకుందాం అంటారు. అప్పు పత్రం ఈ విధంగా రాస్తారు.
.
అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు. అప్పు ఇచ్చినవాడు కుబేరుడు. అతని వివాహం కొరకు కలియుగంలో, వైశాఖమాస శుక్లపక్ష సప్తమినాడు పదునాలుగు లక్షల రామముద్ర గల సువర్ణ నాణేములు వడ్డీనిచ్చు షరతుతో ఇవ్వబడినవి. వడ్డితో కలిపి మూలము చెల్లించుటకు శ్రీనివాసునిచే అంగీకరించబడినది. వివాహమైన సంవత్సరము నుంచి వెయ్యి సంవత్సరముల తరువాత ఈ మొత్తం ఇవ్వబడును. ఇది కుబేరునికి శ్రీనివాసుడు రాసిచ్చిన అప్పు పత్రం. దీనికి మొదటి సాక్షి చతుర్ముఖుడు. రెండవ సాక్షి రుద్రుడు మూడవ సాక్షి అశ్వత్థరాజము. అప్పు ఎలా తీరుస్తాడో కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్తాడు. 'భవిషత్తులో నా భక్తులు మంచిదో, పాపిష్టిదో, చాలా కానుకలు నా హుండీలో వేస్తారు. ఆ డబ్బుతో నీ అప్పు తీరుస్తాను' అంటాడు. అందరికి అన్నీ ప్రసాదించగలవాడు, కుబేరునికి ధనాధిపత్యం ఇచ్చినవాడు కుబేరుడి దగ్గర అప్పు అడగడం ఒక దివ్యలీల. డబ్బి మీ దగ్గరే ఉంచి, ఖర్చు చెయ్యి అని కుబేరునితో శ్రీనివాసుడు పలుకుతాడు. ఇదంతా మనకు ఒక సందేశం ఇవ్వడానికి స్వామి ఆడిన దివ్యలీల. ఇంటికి వచ్చిన అతిధులకు సంతృప్తిగా భోజనం పెట్టాలి, పెద్దపెద పూజలు, వ్రతాలు, నోములు చేసినప్పుడు, కులదేవత ఆరాధన చేసినప్పుడు వచ్చిన అతిధులకు తప్పక భోజనం పెట్టి పంపించాలి, తీసుకున్న అప్పు సకాలంలో తీర్చాలి వంటివి అనేకం కనిపిస్తాయి. కుబేరుడు కూడా 'ఇదంతా నీదే స్వామి. ఇదంతా నీవు ప్రసాదించిందే అంటాడు.' ఎవరి దగ్గర ఏ ఐశ్వర్యం ఉన్నా, అది డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, తెలివితేటలు, కళలు, ఇలా ఏవైనా కావచ్చు, ఇవన్నీ ఆయన అనుగ్రహించినవే. అన్నీ ఆయన ఇచ్చినవే కనుక, అహకారం లేకుండా, ఉన్న ధనాన్ని మంచి పనులకు వాడడం వలన దానికి సార్ధకత లభిస్తుంది. ఇదే కుబేరుడి మాటలలోని అంతరార్ధం. అప్పు అయితే తీసుకున్నాం కానీ, ఇంకా చేయాల్సిన పెళ్ళి పనులు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తారన్నది శ్రీనివాసుడికి వచ్చిన ఇంకో సందేహం. ఇంతలో శివుడు కలుగజేసుకుని 'ఓ తాతాయ్య! ఆపవయ్యా నీ లీల. ఇక్కడ ఉన్నవారంతా నీ సేవకులే కదా. నీవు ఆజ్ఞ చేయి, అందరూ నీవు చెప్పినట్టుగాన్ చేస్తారు' అంటాడు. విష్ణువు నుంచి బ్రహ్మ ఉద్భవిస్తే, ఆయ్న నుంచి రుద్రులు పుట్టడం వలన, రుద్రుడికి విష్ణువు తాతయ్య అవుతాడు. మరొక రకంగా చూస్తే, శివకేశవులు బావ, బావామరిదులు. కానీ నిజానికి శివుడు అనాది, ఆయన ఎప్పుడు ఉండేవాడు, ఎప్పటికి ఉండేవాడు. శివుకేశవులు ఇద్దరూ ఒక్కటే తత్వం. కాని సృష్టి నడవడం కోసం, వేర్వేరు పాత్రలు పోషిస్తూ, వేర్వేరు రూపాల్లో లీల చూపిస్తున్నారు. అంతే.
.
అందరు దేవతలకు వారివారి శక్తినిబట్టి, యోగ్యతను అనుసరించి పని అప్పహించబడింది. వంటపని అంతా అగ్నిదేవునికి, మర్యాదలు, పిలుపులు ఆరుముఖాల షణ్ముఖుడికి, వచ్చినవారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం విశ్వకర్మకు, వీటన్నిటికి డబ్బులు సర్దడం కుబేరుని బాధ్యత. పిల్లగాలులు వీస్తూ వచ్చినవారికి ఆహ్లాదం కలిగించడం వాయుదేవుని పని. ఎవరి పనులు వారి చేస్తుంటారు. ఇంతలో అగ్నిదేవుడు, వంట చేయడానికి పాత్రలు లేవంటాడు. నిజమే మీ ఇంట్లో శుభకార్యానికి అయితే అన్నీ ఉంటాయి. నా పెళ్ళికి మాత్రం ఏమీ ఉండవు. అయినా పాత్రలెందుకు, వేంకటాచలం మీదనున్న తీర్ధాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు. నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం. వందల్లో వస్తే పెద్దపెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండం అంతా దిగివస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి. పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్ధాలు తిరుమలలో కొలువై ఉన్నాయి. ఒక్కో తీర్ధంలో సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు. స్వామి పుష్కరిణిలో అన్నం, పాపనాశనంలో పప్పు, ఆకాశగంగలో బెల్లం వేసి చేసిన పరమాన్నం, కూరలకు,, నెయ్యి కాచడానికి దేవతీర్ధం, తుబురతీర్ధంలో పులిహోర, కుమార తీర్ధంలో వివధ రకాలైన భక్ష్యాలు, పాండుతీర్ధంలో పులుసు, ఇతర తీర్ధాల్లో లేహ్యాలు మొదలైని తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజపిస్తాడు. దేవతలందరూ చక్కగా ఆటపాటలతో, కబుర్లతో, భజనలతో, భక్తిపారవశ్యతంతో, తమ ఇఛ్ఛాశక్తి చేత పంచభక్ష్యపరమాన్నాలతో భోజనం సిద్ధమైంది. వంటకాలు గుమగుమలు బ్రహ్మండమంతా వ్యాపిస్తున్నాయి. ఎప్పుడు రుచి చూడాలో అన్న కోరిక పెంచే విధంగా ఉన్నాయి. అంతా సిద్ధం అయిన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు. "నైవేద్యం పెట్టిన తరువాతే అథిదలందరీకి వడ్డన. నువ్వే భగవంతుండివి, ముందు నువ్వు భోజనం చేయి" అని శ్రీనివాసునితో బ్రహ్మదేవుడంటాడు. "నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు" అంటాడు స్వామి. మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి. మరి నివేదన చేయని పదార్ధాలను అతిధులెవ్వరూ ముట్టుకోరు, మరి నివేదన ఎవరికి చేయాలి? అంటాడు బ్రహ్మ.
.
నేను ఇంకో రూపంలో ఇదే కొండ (శేషాచలం) మీద, అహోబలంలో (ఈనాడు అహోబిలం) నరసింహునిగా వెలసి ఉన్నాను. ఆ అహోబిల నరసింహస్వామికి నివేదన చేసి అందరీకి నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు. సాక్షాత్తు బ్రహ్మ అహోబల నరసింహస్వామికి నివేదన చేస్తారు. (తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉంది. శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిప్సితాయి. శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లావరకు వ్యాపించి ఉన్నాయి. ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడి, నడుమ భాగాన అహోబిల నృసింహుడు, తోకభాగాన శ్రీశైలంలో మల్లిఖార్జునుడు భ్రమరాంభ సమేతంగా వెలసి ఉన్నారు. కర్నూల్ జిల్లా నంద్యాలకు దగ్గరలో ఉన్న అహోబిల క్షేత్రంలోనే హిరణ్యకశిపుడుని నరసింహస్వామి సంహరించారట. ఆ సమయంలో మహోగ్రంగా ఉన్నారు స్వామి. ఆయన బలం చూసిన దేవతలు 'అహో బలం, అహో బలం' అంటూ ఆయన శక్తిని కీర్తించారు. అదే అహోబల క్షేత్రంగా విరాజిల్లింది. అక్కడే నృసింహుడు వెలిశారు. కాలక్రమంలో అది అహోబిలంగా మారింది.) నివేదన చేశాక వైశ్వదేవం చేశారని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఇది అగ్నిదేవుడి ఆరాధన. అగ్నిహోత్రం పెట్టి చేసేది. వైశ్వదేవం మిగిశాకా అందరూ భోజనాలకు సిద్ధమయ్యారు. చక్కగా శివుడు అతిధులందరినీ కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు. పాండు తీర్ధం (గోగర్భం డ్యాము నుంచి దక్షిణగా కొద్ది రూరంలో ఉంది. ఇప్పటికి చూడవచ్చు) నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళను (ఆకులను) పరిచి, వారివారి పెద్దతనానాన్ని అనుసరించి ఆశీసులు చేశాక అందరికి ఒకేసారి వడ్డించారు. వడ్డించడంలో కూడా శాస్త్రం కొన్ని నియమాలను విధించింది. ఆకులో ఏది ఎక్కడ వడ్డించాలి, ఏలా వడ్డించాలన్నది చెప్పింది. ఇవన్నీ ఎంతో శాస్త్రీయమైనవి. వాటి ముందు ఈనాటి పాశ్చ్యాత ఆహారనియమాలు, భుజించే విధానం ఎంత మూర్ఖమైనవో అర్ధం అవుతుంది. భవిషోత్తర పురాణం కూడా ఎలా వడ్డించాలి, గృహస్తు మర్యాదలు ఏ విధంగా చేయాలన్న విషయాన్ని విపులంగా వివరిస్తుంది. దాన్ని అనుసరించి వేంకాటాచలంలో కూడా వడ్డన జరిగింది. ముందు విస్తళ్ళపై నీరు చల్లి, ఉడిచి, పాత్రశుద్ధికి కొంత నెయ్యి వడ్డించి, సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారం ఇతర పదార్ధాలు వడ్డించారు. వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయ్యిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా, అందరూ కలిసి ముక్తకంఠంతో విష్ణువును స్మరించారు.
.
అంతటా వ్యాపించిన ఒకే తత్వము, చిన్న దేహములు కలిగిన అనేక జీవులయందూ కూడా ఉండి, మూడులోకములు వ్యాపించి సమస్త విశ్వాన్నే భుజించగల సామర్ధ్యం కలిగి, చిన్నచిన్న జీవుల దేహమందూ వాసము చేస్తూ వారూ తిన్న ఆహారమను స్వీకరిస్తున్నది, ఆని ప్రార్దించి. భోజన ప్రారంభకాలే భగవన్నామస్మరణ గోవిందా అని శ్రీనివాసుడనగా గోవిందా ఆని అందరూ పలికి ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. భోజన ప్రారంభానికి ముందు శ్రీనివాసుడు ఒక పాత్ర నిండుగా నీరు తీసుకుని, అతిధులందరికి నమస్కరించి, మీ వంటి జనపూర్ణులైనవారికి ఈ కొద్దిపాటి అన్నమూ, నీరుచే ఏ మాత్రము తృప్తి కలుగదు. అయినా తపోధనులారా! మీరు కరుణ కలిగినవరు కనుక నీ పెట్టిన ఈ కాస్త ఆహారమునూ, అధికంగా, ఎన్నో రకాలుగా భావించి నన్ను కృతార్ధుడిని చేయండి అన్నాడు. చివరగా సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ అంటూ ముగించాడు. నువ్వు పెట్టిన అన్నము ముక్తిని సాధించే అమృతము అను చెప్పి అతిధులు భుజిస్తారు. భోజన మధ్యకాలంలోనూ, ఆఖరునా గోవింద నామం మళ్ళీ చెప్తారు. మనం తినే ఆహారంలో ఆరవవంతు మనసుగా మారుతుంది. మనం ఆహారం తినే సమయంలో ఏం చూస్తామో, ఏమి ఆలోచిస్తామో, ఏది మాట్లాడుతామో, అది మన మనసులో తీవ్రప్రభావం చూప్సితుంది. అదే భోజన సమయంలో భగవన్నామం చెబితే, మన మనసులో భగవన్నామం మంచి ఆలోచనలకు ప్రేరకం అవుతుంది. అందరి భోజనాలు ముగిశాకా, అందరికి దక్షిణతామ్మూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణం. అది కూడా వారివారి పాండిత్యాన్ని, యోగ్యతను అనుసరించే. శ్రేష్టులైన ద్విజులకు ఒక రామటెంక (నాణెము), వేదాంతులకు అందులో సగము, బ్రహ్మచారులకు వేదాంతుల దక్షిణలో సగమూ, ఇలా ఇచ్చడు స్వామి. అందరి భోజనాలు మిగిశాకా శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, లోకపాలురు, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు. వీరి భొజనాలు మిగిసేసరికి సూర్యాస్తమయం అయిందని పురాణంలో కనిపిస్తుంది. అలా అందరి భోజనాలు పూర్తయ్యాక, ఆ రాత్రికి అక్కడే గడిపేసి, తెల్లవారుఝామునే మంగళవాయిద్యాల నడుమ మగపెళ్ళివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది. మంగళవాయిద్యాలు, కబురులు, సబరాల నడుమ సరదాగా నడిచిపోతున్న బృందం పద్మసరోవరం చేరుకుంది. ఇక్కడే శ్రీ శుకాచార్యులవారి ఆశ్రమం ఉంది. పద్మసరోవరం సమీపిస్తున్న సమయంలో శుకుడు శ్రీనివాసుని చేరి, తన ఆశ్రమానికి విచ్చేసి, ఆతిధ్యం స్వీకరించవలసిందిగా కోరుతాడు.
.
"కోట్లాదిమందితో ఉన్నాను, నేను ఒక్కడినే రాలేను, ఇంతమందిని తీసుకువస్తే నీకు ఇబ్బంది. అందరం ఆకాశరాజు ఆతిధ్యం స్వీకరించాలనుకుంటున్నాం" అంటాడు శ్రీనివాసుడు. "నువ్వు ఒక్కడివి తింటే చాలు, అందరు తిన్నటే" అని శుకుడు శ్రీనివాసుడిని బ్రతిమాలుతాడు. "నాన్నా! నీ పెళ్ళికి శుకబ్రహ్మ చాలా సహాయం చేశాడు. కనుక ఆయన చేసిన సాయానికి గుర్తుగా, ఆయన ఆతిధ్యం అంగీకరించి, భోజనం చేయి" అంటుంది వకుళమాత. అమ్మ మాట కాదనలేని స్వామి సరేనంటాడు. శుకుడు కుటీరంలోనికి ప్రవేశిస్తాడు. చింతతొక్కుల పచ్చడి, పులుసులతో స్వయంగా శుకుడే శ్రీనివాసుడికి భోజనం వడ్డించడని భవిష్యోత్తర పురాణం చెప్తున్నది. ఇంతవరకు బాగానే ఉంది, భక్తుని కోరిక మన్నించిన భగవంతుడు, భక్తుడి ఇంట భోజనం చేయడం. కానీ లోకులు అలా ఆలోచించరు కదా. బయట ఉన్నవారు శుకమహర్షి గురించి నానారకాలుగా అనుకొవడం మొదలుపెట్టారు. ఇంతమంది ఉండగా, ఒక్క శ్రీనివాసుడికే భోజనం పెట్టడమేంటి? ఇదేం వింత? శుకుడికి బాగా గర్వం పెరిగిపోయింది, మదంతో ఈ చర్యకు పూనుకున్నాడు. అందరూ ఉన్నప్పుడు ఒక్కడినే పిలిచి భోజనం పెట్టడం భావ్యమా? అందరిని అవమానిస్తున్నాడు. ఇలా రకరకాల మాటలు మొదలుపెట్టారు. శుకుడికి కీడు చేయాలని తలచారు. లోపల భోజనం చేస్తున్న స్వామికి ఈ విషయం తెలిసింది. భక్తుడి రక్షణ భగవంతుని బాధ్యత. అందుకే భోజనం చివరిలో సంతృప్తిగా శ్రీనివాసుడు త్రేనుస్తాడు. అంతే! బయటనున్న అందరికి ఆకలి ఒక్కమాటున తీరిపోతుంది, కడుపు నిండిపోతుంది. అందరికి శుకుడి భోజనం తిన్న భావన కలుగుతుంది. సర్వజీవలయందూ ఆకలిరూపంలో ఉంటూ ఆహారం జీర్ణం చేసే పరమాత్మ, అందరి ఆకలిని తీర్చడం వింత ఏమీ కాదు. ఇది జరిగింది వైశాఖ శుక్ల పక్ష అష్టమి నాడు. ఆ రాత్రికి అక్కడే గడపాలని నిశ్చయించుకుంటారు. నవమినాడు శ్రీనివాసుడితో సహా అందరూ నారాయణపురం చేరుకుంటారు. శ్రీనివాసుని స్వాగతించడానికీ ఎదురువచ్చిన ఆకశరాజుతో స్వామి, అతిధులందరూ ఆకలితో ఉన్నారు, భోజనాలకు ఏర్పాట్లు చేయండని ప్రత్యేకంగా చెప్పినట్టు పురాణంలో కనిపిస్తుంది. దశమినాటి ఉదయమే శ్రీనివాసుడు మంగళస్నానం చేశాడు. పురోహితుడైన వశిష్ఠునితో లోకరీతిని తెలుపుతూ "ఈనాటి రాత్రియే వివాహమూహుర్తం కనుక మనం ఐధుగురం, నేను, లక్ష్మీదేవి, వకుళాదేవి, బ్రహ్మ, మీరు (వశిష్ఠుడు) భోజనం చేయకూడదు. అలాగే ఆకాశరాజు, ధరణీదేవి, తొండమానుడు, పద్మావతీదేవి (పెండ్లికూతురు), వారి పురోహితుడు భోజనం చేయకూడదు" అని చెప్పి, కుబేరునితో "కుబేరా! బ్రాహ్మణభోజనానికి ఆకాశరాజును తగిన ఏర్పాట్లు చేయమని చెప్పు, ముహూర్తం రాత్రి 13నాడులకు, ఆ తరువాత బ్రాహ్మణులు భోజనం చేయడం నిషేధం" అని చెప్తాడు. శ్రీనివాసుని విడిది ఇంటి నుంచి వివాహవేదికకు ఆకాశరాజు ఎంతో ఘనమైన ఏర్పాట్ల మధ్య తీసుకువెళ్ళాడని పురాణం చెప్తోంది. విశ్వకర్మ నిర్మించిన సభలో మునిశ్రేష్టులతో శాస్త్రచర్చ చేస్తున్న శ్రీనివాసుని రాజగృహానికి తీసుకువెళ్ళడం కోసం ఇంద్రుడి ఐరావతం తీసుకువస్తాడు ఆకాశరాజు. ధరణీదేవి కూడా ఆకాశరాజు వెంట వస్తారు. ఐరాతవతంపై శ్రీనివాసుని కూర్చొబెట్టి, లక్ష్మీదేవి, బ్రహ్మ, రుద్రుడు, కుబేరుడు, యముడు, ఇంద్రుడు, ఇలా అందరి సమేతంగా తీసుకివెళతాడు ఆకాశరాజు.
.
శ్రీనివాసుడు రాజగృహానికి చేరుకోగానే తొండమానుడి భార్య కుంకుమ కలిపిన ఎర్రని నీటితో కుంభహారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించిందట. శ్రీనివాసుడి పాదాలు కడగటానికి స్వామి పుష్కరిణి జలాలు తెప్పించాడు ఆకాశరాజు. బ్రహ్మ కడిగిన పాదాలకు ఆకాశరాజూ, ధరణీదేవి కడిగే అదృష్టం పొందారు. ఏ స్వామి పాదాల దర్శనం కనిపిస్తే చాలు ధన్యమనీ, ఎందరో తపస్సులు చేస్తున్నారో, ఏవరి పాదదూళి సోకితే పరమదరిద్రుడు కూడా అత్యంత ధనవంతుడవుతాడో, ఏ పాదాలను నిత్యం లక్ష్మీదేవి, బ్రహ్మ, ఇతర దేవతలు కొలుస్తూ ఉంటారో అటువంటి స్వామి పాదోదకం (కాళ్ళు కడిగిన నీటిని) రాజ్యమంత ప్రోక్షణ చేయించాడు (చల్లించాడు). ముహూర్తం సమీపించగా, కోటి సువర్ణనాణేములు కానుకగా ఇచ్చాడు ఆఖశరాజు. నాకీ డబ్బు ఎందుకు, నవరత్నఖచితమైన ఆభరణాలు ఇవ్వండి అంటాడు శ్రీనివాసుడు. అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసుడికిచ్చిన ఆభరాణాల గురించి భవిష్యోత్తర పురాణం ప్రస్తావించింది. 100 తులాల బంగారు కీరీటం, అంతే బరువుగల నడుముపట్టీ, భుజకీర్తులు, నూపురములు, 2 నాగ భుజ భూషణములు, భుజాల వరకు వేళాడే ముత్యాలతో చేయబడిన కర్ణభూషణములు (చెవికి పెట్టుకునే ఆభరాణాలు), 32 తులాల బరువుగలిగిన నవరత్నఖచిత కంకణాలు, నాగభూషణాలు రెండు, 111 తులాల బరువు కలిగిన, వజ్రాలు పొదిగిన బంగారు కటిసూత్రము, పాదుకలు, 64 తులాల బంగారు భోజనపాత్ర, చెంబు, పంచపాత్రలు, పంచపాత్రలు, 64 పట్టువస్త్రాలు, ఇలా శ్రీనివాసుడికి శరీరమంతా ఆభరణాలు సమర్పించాడు ఆకాశరాజు. వధూవరుల ప్రవరలు చెప్పించి, బృహస్పతి, వశిష్ఠులు కన్యాదానం చేయించారు. ' అత్రిగోత్రమున జన్మించిన సువీరుని మునిమనుమరాలు, సుధర్ముని మనుమరాలు, ఆకాశరాకు పుత్రిక అయినా పద్మావతీదేవిని యయాతి మునిమనుమడు, శూరశేనుని మనుమడు, వసుదేవుని కుమారుడు, వశిష్ఠ గోత్రములో పుట్టిన వేంకటేశ్వరునకిచ్చి వివాహాం చేయదలిచారానీ చెప్తూ, కన్యాదానం పూర్తి చేశారు. కంకణధారణ చేయించడం దగ్గరి నుంచి మొత్తం వివాహవేడుకను అధ్భుతంగా వర్ణిస్తుంది పురాణం. మంగళసూత్రధారణ చేసిన తరువాత నవరత్నాలను అక్షింతలుగా వేసి, ఆశీర్వదించారు మునీశ్వరులు. అటు తరువాత వచ్చిన అతిధులందరికీ దక్షిణతాంబులాలు ఇచ్చాడు ఆకాశరాజు. కోటిసహస్ర గోవులను బ్రాహ్ముణలకు దానం ఇచ్చాడు ఆకాశరాజు. అంతా ముగిశాకా కొత్త దంపతులతో కలిసి అందరూ భూరిభోజనాలు చేశారు. మొత్తం 5 రోజుల పెళ్ళి జరిగిందని పురాణం చెప్తోంది. ఐదవరోజు అప్పగింతలు జరిగాయట. అపగింతల్లో నాభికి పాలు అద్ది, ఆకాశరాజు, ధరణీదేవి పద్మావతీదేవిని శ్రీనివాసునికి అప్పగించారు. పద్మావతీదేవి శ్రీనివాసునితీ అత్తారింటికి వెళ్ళిపోతోందన్న బాధతో భోరున ఏడ్చారు ఆకాశరాజు దంపతులు, పద్మావతీదేవి సోదరుడు వసుద, ఆమె పినతండ్రి తొండమానుడు. అప్పటివరకు ఉస్తాహంతో, కోలాహలంతో నిండిన పెళ్ళిమండపం ఒక్కసారిగా దుఃఖంలో మునుగిపోయింది. ఇదంతా చూస్తున్న మునులు కూడా దారుణంగా ఏడ్చారట. తన విడిచికి పద్మావతీదేవిని తీసుకువెళ్ళి శ్రీనివాసుడు గృహప్రవేశం చేశాడు. అటు తరువాత గరుత్మంతునిపై కూర్చోబెట్టుకుని తన నివాసానికి తీసుకువెళతాడు శ్రీనివాసుడు. ఇలా అమ్మవారిని పంపుతూ, ఆకాశరాజు పద్మావతీదేవికి మూదువందల పుట్ల పెసలు, ఎంతో బరువున్న బెల్లం, అధికంగా చింతపండు, వెయికడవల పాలు, నూరుకుండ పెరుగు, పదిహేనువందల చర్మపాత్రల నిండ నెయ్యి, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఉప్పు, పాత్రల నిండ నూనె, రెండువందల కుండల నిండా పంచదార, దోసపండ్లు, మామిడిపండ్లు, అరటిగెలలు, గుమ్మడికాయలు, కందమూలాలు, మిరియాలు, ఉసిరికాయలు, రెండువందల కుండల నిండుగా తేనె, లెక్కలేనన్నని అరటికాయలు ఇచ్చారాని, వాటిని 10,000 గుర్రాలు, 1,000 ఏనుగులు, 5,000 ఆవులు, 100 మేకలు, 200 మంది దాసీజనం, 300 దాసజనం, రకరకాల వస్త్రాలు, రత్నాలు పొదిగి తయారు చేసిన మంచం, పరుపులు, దిండ్లను సారెగా ఇచ్చాడు. శ్రీనివాసుడు ఆకాశరాజు భక్తికి మెచ్చి సాయుజ్యమోక్షాన్ని ఇచ్చాడని పురాణం. స్వామి వివాహం జరిగిన నారాయణపురం తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. పద్మావతీదేవి కల్యాణానికి వడ్లు విసిరిన పెద్ద తిరగలి కూడా ఇక్కడ మనం ఈరోజుకి చూడచ్చు. వివాహం జరిగిన తరువాత 6 నెలల వరకు కొండ ఎక్కనని దీక్ష తిసుకున్నానని, అందువల్ల, అగస్త్యుని ఆశ్రమంలో 6 నెలలు ఉండడానికి నిశ్చయించుకున్నానని చెప్పిన శ్రీనివాసుడు, తన పెళ్ళికి హాజరైన దేవతలకు, ఋషిమునులకు వస్త్రాలు, కానుకలు వారీవారీ యోగ్యతను అనుసరించి ఇచ్చి పంపుతాడు. ఇది జరిగాక మహాలక్ష్మీ కరివీరపురం (కొల్హాపూర్) వెళ్ళిపోయిందట. ఈ అగస్త్యాశ్రమం తొండవాడ, శ్రీనివాసమంగాపురానికి దగ్గరలో ఉండిందని భావిస్తున్నారు. ఇక్కడే అగస్త్యుడు ప్రతిష్టించి పూజించిన శివలింగం మనం ఇప్పటికి దర్శించవచ్చు. స్వామి నివసించిన చోటనే శ్రీనివాసమంగాపురంలో ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న స్వామి కల్యాణ వేంకటేశ్వరుడు. ఈయన్ను దర్శించి, ఇక్కడ పద్మావతీ శ్రీనివాసుల వివాహం జరిపిస్తే తొందరగా వివాహం అవుతుంది. ఈ విధంగా శ్రీనివాసుని కల్యాణ కధను జనకమహారాజుకు శతానందుడు చెప్పాడని, శౌనకాది మునులకు సూతమహాముని చెప్పాడు. శ్రీ వేంకటేశ్వర కల్యాణగాధకు ఫలస్తుతి కూడా చెప్తూ పురాణం కోటి కన్యాదానలు చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో, భూమి మొత్తాన్ని దానం చేయడం వలన ఎంత ఫలం లభిస్తుందో, ఈ కధ చదివినా, విన్నా అంతే ఫలితం కలుగుతుంది. ఎవరు శ్రీనివాసుని కల్యాణం చేయిస్తారో, వారి ఇంట్లో కూడా త్వరలోనే అటువంటి ఉత్సవం జరుగుతుంది. నీ కోసం ఈ శ్రీనివాస మహాత్యాన్ని చెప్పాను. ఎవరు శ్రీనివాసుని వివాహ చరితాన్ని, మహాత్యంతో కలిపి చెప్తారో, ఎవరు వింటారో, ఎవరు పారాయణ చేస్తారో, వారికున్న అన్ని కోరికలు నెరవేరుతాయి. విన్నమాత్రం చేతనే సుఖం కలుగుతుంది. ఇది ఎప్పుడు మంగళప్రదము అని శతానందుడు జనకమహారాజుతో చెప్పాడు.

Share:

అడవారు మాత్రమే జరుపుకునే నందమ్మ పండగ.

ప్రకృతితో మమేకమయ్యే సంప్రదాయాలు భలే విచిత్రంగా ఉంటాయి... అనుభవించే వారికి మాత్రం అంతులేని ఆనందాన్ని కలిగిస్తాయి. పంచభూతాల్లో అతి కీలకమైన నీటితోనే బతుకును ముడివేసుకున్న మత్స్యకారుల ఆచార వ్యవహారాలు.. ఇలాంటివే. వీరి సంప్రదాయాలను బయటి నుంచి చూసే వారికి భలే ఆసక్తిని కలిగిస్తాయి.
ఆంధ్రా-ఒరిస్సా బెస్తల వేలుపు నందీశ్వరుడు.. నందమ్మగా మారాడు..!
సముద్రం తప్ప మరో గమ్యం తెలియని.. జలధే తప్ప మరో జీవన మర్మం ఎరుగని మత్స్యకారులు ఆచరించే సంప్రదాయాల్లో కీలకమైనది నందమ్మ ఉత్సవం. మహేశ్వరుని వాహనం నంది.. మత్స్యకారుల ఉత్సవాల్లో నందమ్మగా మారిపోయాడు. నంది పుంలింగమైతే.. గోవు స్త్రీ లింగం కావాలి. కానీ ఇవేవీ వీరికి పట్టవు. పార్వతీ పరమేశ్వరులను మోసుకు వచ్చే నందీశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని మత్స్యకారులు నందమ్మగా పూజిస్తారు. ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్‌లలోని మత్స్యకారులు ఈ పండుగను అత్యంత వేడుకగా జరుపుకుంటారు.
మత్స్యకారులు ఈ నందమ్మ ఉత్సవాలను పదకొండు రోజుల పాటు జరుపుకుంటారు. పండుగ పదకొండు రోజులూ తమకు తోచిన రీతిలో ఉమా మహేశ్వరులను పూజిస్తారు. చివరి రోజున నందీశ్వరుడి విగ్రహంపై, పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. ఆదిదంపతుల ఉత్సవమూర్తులను గూడెం నడిబొడ్డున ప్రతిష్ఠించుకుని విశిష్ట పూజలు జరుపుతారు. ఆరోజున నిరాహారులై.. సముద్రపు అలలతో ఆటలాడి.. సంద్రపు నీటిలో స్నానమాడి.. ప్రకృతితో మమేకమై సంబరాన్ని విభిన్నంగా జరుపుకుంటారు.
ఒరిస్సాలో కార్తీక మాసానికి ముందు వచ్చే పౌర్ణమి రోజుతో ఈ నందమ్మ ఉత్సవాలు ముగుస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ సముద్ర తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు ఈ పౌర్ణమి రోజుతో మొదలు పెట్టి పదకొండు రోజులు పండుగ చేసుకుంటారు. ఈ పౌర్ణమిని గౌరీ పౌర్ణమిగా భావిస్తారు. వేడుకల చివరి రోజున అంటే పదకొండో రోజున నందమ్మను (నందీశ్వరుని) సముద్రంలో నిమజ్జనం చేస్తారు. అంతటితో ఉత్సవం పరిసమాప్తమవుతుంది.
కోస్తా తీరం వెంబడి ఉన్న 60 వేల దాకా మత్స్యకారులు ఈ పండుగను అత్యంత సంబరంగా జరుపుకుంటారు. నిత్యం చేపల వేటలోనే నిమగ్నమయ్యే వీరు.. నందమ్మ పండుగ నాడు మాత్రం ఆటవిడుపుగా గడుపుతారు. పిన్నా పెద్దా, ఆడా మగా భేదం లేకుండా, ఆడీపాడీ, ఉత్సాహంగా సంబరం చేసుకుంటారు. చివరి రోజున నిష్టగా ఉపవాసం ఉండి భక్తి భావంతో సముద్ర స్నానాలు చేస్తే.. అవివాహితలకు పెళ్లిళ్లు అవుతాయని, సంసారంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయని మత్స్యకారులు నమ్ముతారు. ఈ నమ్మకాల వెనుక వాస్తవాలను వెతకడం కన్నా.. విభిన్నంగా, ఎవరికీ ఇబ్బంది కలిగించని రీతిలో ఉన్న వీరి ఆచారాన్ని మనమూ మనస్ఫూర్తిగా ఆస్వాదిద్దాం.

Share:

సహస్రలింగేశ్వరస్వామి.

చుట్టూ ఎత్తెన కైలాసగిరి కోండలు సహజ సిద్దమైన జలపాతం, ప్రకృతి సౌందర్యంతో పర్యాటకులను వేయిలింగాలకోన (సహస్ర లింగేశ్వరాలయం) ఇట్టే అకర్షిస్తుంది. శ్రీకాళహస్తీ పట్టణం నుంచి వేడాం మార్గంలో ఎనిమిది కిలో మీటర్ల దూరంలో వేయిలింగాలకోన ఉంది.రెండు గంటలకో బస్సు ఉంది. నిత్యం అటోలు ఈ మార్గంలో తిరుగుతుంటాయి. వేయిలింగాలకోనకు వేళ్లె మార్గంలోనే దక్షణకాళికా దేవి అలయం ఉంది. దట్టమైన కైలాసగిరి కోండల్లో వేయిలింగాల కోన ఉంది. వేయిలింగాలతో ఉన్న సహస్రలింగేశ్వరస్వామిని ఇక్కడ దర్శంచుకోవచ్చు.అలయానికి చేరుకోవాలంటే 300 మెట్లు ఎక్కాలి.అక్కడికి చేరుకుంటే సహస్రలింగేశ్వరాలయం,దుర్గాదేవి సన్నిది, నవగ్రహల సన్నిది, జలపాత లు,మునేశ్వరుని విగ్రహలు,చక్కటి సౌందర్యంతో కూడిన ప్రకృతిఅందాలును తిలకించవచ్చు.
పూర్వం దేవతలకు, రాక్షసులకు జరిగిన యుద్దంలో దేవతలు ఓడిపోతారు. అనంతరం రాక్షసులు దేవతలను తరుముతూండగా,శివుని కృపతే దేవతలకు ఊహించని శక్తి వచ్చి రాక్షసులపై విజయం సాదిస్తారు. దీనికి చిహ్నంగా వెయ్యి మంది దేవతలు శివలింగంపై కోలువుతీరుతారు.పార్వతి దేవి ఈకైలాసగిరి కోనలోనే తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి తిరిగి పోందిందని ప్రతీతి.ఈప్రాంతంలో పెద్ద బండరాయిపై దుర్గాదేవి విగ్రహం ఉంది. అమ్మవారు మహిమాన్వితురాలని,నిష్టతో పూజలు చేసి కట్టుకున్న దుస్తులు వదిలితే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం,దీంతో దుర్గాదేవి విగ్రహం సమీపంలో ఎటు ,చూసినా భక్తులు వదిలిన దుస్తులే దర్శనమిస్తాయి.దుర్గాదేవికి రక్షక భటులుగా వానరాలు వందల సంఖ్యలో కనిపిస్తాయి.అంతే కాకుండా ఇక్కడ ఉన్న నవగ్రహలకు పూజలు చేస్తే తప్పకుండా దోషాలు తోలిగి పోతాయని భక్తు నమ్మకం. అలాగే చాలా మంది మునీశ్వరుల విగ్రహలు కూడా ఇక్కడ కోలువై ఉన్నాయి.
కైలాసగిరి కోండలపై ఉన్న వేయిలింగాల కోనలోని సహస్రలింగేశ్వరాలయాన్ని కుళోంత్తుంగ చోళుడు నిర్మించినట్లు చెబుతారు. దేవతల యుద్ద విజయం,పార్వదేవి,మునీశ్వరుల తపస్సుతో ఈప్రాంతం పవిత్రమైందని భావించి చోళరాజైన మూడవ కుళోంత్తుంగుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు కధనం.
వేయిలింగాలకోన శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్దానానికి అనుబంధంగా ఉంది, ముఖ్యంగా తమిళ నాడు,కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. కైలాసగిరి పర్వతంపైనుంచి జాలువారే రెండు జలపాతాలు భక్తులను భాగా అకర్షిస్తాయి. వర్షాకాలంలో కన్నా భక్తులు వేసవికాలంలో అధికంగా వస్తుంటారు.

Share:

అద్భుత కోపేశ్వర దేవాలయం.


మహారాష్ట్రలోని మరుగున పడ్డ మహనీయ క్షేత్రమిది..ఇక్కడి శిల్పకళారా మమైన కోపేశ్వర మందిరం ప్రతి ఒక్కరూ చూడవలసినది. దీన్ని శిలాహర్‌ వంశానికి చెందిన గండరాది త్యుడు, రెండో భోజుడు క్రీ.శ. 1109-1180 మధ్యలో నిర్మించినట్లు తెలిపే శాసనాలు దొరికాయి.దగ్గర దగ్గర 104 ’పొడవు, 65’ వెడల్పు. 55’ ఎత్తుతో ఉన్న ఈ బృహన్మందిరంలో ప్రధానంగా నాలుగు భాగాలు ఉన్నాయి.
.
స్వర్గమంటపం, సభామంటపం, అంతరాళ కక్ష్య, గర్భగృహం అడుగడుగునా కళ్లు చెదిరేలా శిల్పసంపద నిక్షిప్తమై ఉంది. స్వర్గ మంటపం గుండ్రంగా 36 వ్యాసంతో ఉంది. చుట్టూ కప్పుకి ఆధారంగా పన్నెండు స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం మీదా రాజవంశీయుల శిల్పాలు అందంగా అమర్చారు. మంటపం మధ్యలో 14 వ్యాసం కలిగిన నల్లని శిల ఉంది. తలపైకెత్తి గోపుర గవాక్షం చూస్తే అద్భుతంగా ఆకాశం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసపు తొలిరోజు (ఉగాదినాడు) ఈ గవాక్షంలోంచి సూర్యకిరణాలు నేరుగా కోపేశ్వర స్వామిని సృ్ఫశిస్తాయి.
.
ఇంత అద్భుతంగా దేవాలయ గవాక్షాన్ని మలచిన మధ్యయుగాల నాటి ఆలయ నిర్మాతలు ఎంతటి విజ్ఞనవంతులో! దీని తర్వాతది సభామంటపం-యాభై అడుగుల చదరం. లోపలి కక్ష్యలో 12, బయటి కక్ష్యలో 20 స్తంభాలున్నాయి. 20 నుంచీ 25 పొడవుండే ఏకశిలా స్తంభాలివి. వీటికి అనేక పార్శ్యాలు న్నాయి. సభామండపం పై కప్పు మీద విరిసిన పద్మం 3డి పద్ధతిలో ఆవిష్కృతమై అద్భుతంగా ఉంది. ఈ మండపం అంతా ఫలపుష్పాలతో, పూర్ణకుంభాలతో నిండి శిలాహార రాజవంశీయుల కళాభిరుచికి అద్దం పడుతోంది. గాలి వెలుతురుల కోసం ఎక్కడికక్కడ గవాక్షాలు ఉన్నాయి.
.
20 చదరపు అంతరాళ కక్ష్య దాటి వెళ్లితే గర్భగృహం ఉంది. అందులో దక్షిణాముఖుడైన ఈశ్వరుడు కంచు సర్వభూషణంతో దర్శనమిస్తాడు. ఇంతటి మహోన్నత ఆలయాన్ని మరుగున పడనీయకుండా బ్రతికించుకోవాడానికి పదుగురినీ తీసుకువెళ్లి పరిచయం చేస్తే ఆలయానికి భక్తులు పెరుగుతారు, భక్తుల రాకపోకతో ఆలయన్ని ఆదరించి నిలపాలన్న ఆరాటమూ పెరుగుతుంది.

Share:

కోట్ల వానర సైన్యం లంకని ఎలా చేరింది.?

సముద్రుడు రాముడికి నమస్కరించి " మీరు నా మీద సేతువుని నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగముల చేత తేలేటట్టు చేస్తాను. నాలొ ఉన్న ఏ క్రూర మృగము వల్ల వారధిని దాటేటప్పుడు వానరములకి ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడతాను. సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి" అన్నాడు. అప్పుడు అక్కడున్న వానరులందరూ సంతోషపడిపోయి పర్వతాలు, కొండలు ఎక్కి పెద్ద పెద్ద శిలలు మోసుకొచ్చి వాటిపైన 'శ్రీ రామ్' అని రాసి సముద్రంలో పడేస్తున్నారు. ఆ సమయంలో ఎవరినోట విన్నా ' సీతారామ ప్రభువుకి జై ' అంటూ, ఉత్సాహంగా రకరకాల చెట్లని తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. మొత్తం అయిదు రోజులలో 100 యోజనముల సేతువు నిర్మాణం అయిపోయింది. చివరికి అన్ని కోట్ల వానర సైన్యం లంకని చేరుకుంది.

Share:

శివ తాండవ స్తోత్రము.

శివ తాండవ స్తోత్రము రావణాసురుడి చే విరచించబడిన శివస్తోత్రం. రావణాసురుడు భారత దేశాన్ని ఆక్రమించి బల గర్వముతో పార్వతి తో కూడి ఉన్న శివుడు నివాసమైన కైలాస పర్వతాన్ని తన ఇరవై బాహువులతో పెకిలిస్తుండగా శివుడు ఉగ్రుడై వచ్చినప్పుడు శివుని శామ్తింపజేయడానికి శివుని స్తుతిస్తూ సామవేద పూరితంగా శబ్ధాలంకారాలతో కూడిన శివస్తోత్రము.
రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతూ మహాదేవుని ఆశువుగా చేసిన స్తోత్రం.
జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకారచండతాండవంతనోతునశ్శివశ్శివం
జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధని
ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే
కిశోరచంద్రశేఖరేరతి:ప్రతిక్షణంమమ
ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర
స్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసే
కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తునీ
జటాభుజంగపింగళ స్ఫురత్ఫనామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిహ్వధూముఖే
మదాంధసింధురస్ఫుర త్వగుర్తరీయమేదురే
మనో వినోదమద్భుతంభిభర్తుభూతభర్తరి
సహస్రలోచన ప్రభుత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూ:
భుజంగరాజమాలయానిబద్ధజాటజూటక:
శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖర:
లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా
నిపీతపంచసాయకంనమన్నిలింపనాయకం
సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తున:
కరాళ ఫాలపట్టికా దగద్ధగద్ధగజ్జ్వల
ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే
ధరాధరేంద్రనందినీ కుచాగ్రచిత్రపత్రక
ప్రకల్ప నైకశిల్పిని త్రిలోచనే రతిర్మమ
నవీన మేఘమండలీ నిరుద్ధధుర్ధరస్ఫురత్
కుహూ నిశీధినీ తమః ప్రబంధ బద్ధకంధరః
నిలింపనిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః
ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా
వలంబి కంఠకందలీ రుచుప్రబద్ధకంధరం
స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే
అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతం
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే
జయత్వదభ్రవిభ్రమ భ్రమద్భుజంగ మశ్వస
ద్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళఫాలహవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగతుంగమంగళ
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః
దృషద్విచిత్రతల్పయో ర్భుజంగమౌక్తికస్రజో
ర్గరిష్ఠరత్న లోష్టయోః సహృద్విపక్ష పక్షయో:
తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః
సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్
కదానిలింపనిర్ఝరీ నికుంజకోటరేవసన్
విముక్తదుర్మతిః సదాశిరఃస్థమాంజలింవహన్
విలోలలోలలోచనో లలామఫాలలగ్నకః
శివేతిమంత్రముచ్ఛరణ్ సదాసుఖీ భవావ్యహం
నిమగ్ని నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్ స్మరన్ బృవన్ నరో విశుద్ధమేతిసంతతం
హరేగురౌ సుభక్తిమాశుయాతినాం యధాగతిం
విమోహనం హి దేహినాంసు శంకరస్య చింతనం
ఫలస్తుతి
పూజావసానసమయే దశవక్తంగీతం
యః శంభుపూజనపరం పఠతిః ప్రదోషే
తస్యస్థిరాం రదగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీంసదైవసుముఖీం ప్రదదాతి శంభుః

Share:

శివుడి జటాజుటం నుంచి జలపాతం... లంకమల్లేశ్వర క్షేత్రం.

రాయలసీమ, కడప జిల్లా, మైదుకూరు.... కు అటవీ సంపదకు పెద్ద దిక్కుగా ఉన్న నల్లమల అడవుల్లో.....
ఎత్తైన కొండలు, లోయలు...
పెద్ద పెద్ద చెట్లు...
వాటి నడుమ సవ్వడులు చేస్తూ...
జల జల పారుతున్నచిన్న సెలఏర్లు...
భారీ ఎత్తున హోరు చేస్తూ...
వందల మీటర్ల ఎత్తు నుంచి జాలు వారు తున్న జలపాతాలు...
నలమలలో అడవుల్లో లంకమల్లేశ్వర క్షేత్రం నేడు లక్షలాది మంది భక్తులని ఆకర్షిస్తూ...
శివయ్య అలరిస్తునే ఉన్నాడు...
ఈ కొండకోనల్లో కొలువై ఉన్న శివయ్యను దర్శించుకోవటమంటే, భారత దేశ సరిహద్దులో అమర్‌నాథ్‌ యాత్ర చేసి అక్కడి హిమ లింగాన్ని దర్శించుకోవటమేనన్న నమ్మ కం భక్తజనాళి లో నెలకొనటమే... ఏటా లంకమల్లేశ్వర క్షేత్రం యాత్రకి వచ్చేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది....
దట్టమైన అడవులు....
రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు...
చిన్న చిన్న బాటలు..
పక్షుల కిలకిలా రావాలు...
కౄర మృగాల గర్జింపులు...
ఏనుగుల ఘీంకారాలు...
వందల అడుగుల ఎత్తు నుండి జారే జలపాతాలు...
కాలు జారితే అధ:పాతాళానికే అనిపించేలా భీతిని గొలిపే లోయలు...
పచ్చదనం పరచుకున్న ప్రకృతి ...
అమర్‌నాథ్‌ యాత్రని తలపించే రీతిగా సాగే మరో అద్భుతం....
నల్లమల్ల అడవుల్లో కొలువై ఉన్న శివయ్య దర్శనం....
కాకులు దూరని కారడవి... చీమలు దూరని దట్టమైన చిట్టడవులుగా నల్లమల అటవీప్రాంతం బహుప్రసిద్థి చెందింది. విరబూసిన పూలు, రంగు రంగుల పక్షులు, పురివిప్పి ఆడే నాట్య మయూ రాలు.. పచ్చని చెట్లు , వాటిని వాటేసుకుని ప్రకృతితో ఎలా కలసి ఉండాలో చెప్పే అనేక రకాల లతలు, తీగలు, పొదలు వాటిని మించి కోటలకు దీటుగా చీమలు కట్టిన పుట్టలు.. సమాజంలోని దౌర్జన్యకారుల్లా వాటిని ఆక్రమిం చుకుని బుసలు కొట్టే విషసర్పాలు... ఇలా ప్రకృతి అంతా ఒక్కదగ్గరే దర్శనమిస్తూ... కనువిందు చేసే ఈ ప్రాంతాన్ని చూస్తు, మైమరచి పోవాల్సిం దే ఎవరైనా... ఇంత అందమైన అందాలనా,మనం ఇష్టానుసారంగా నరి కేస్తూ... పర్యావరణకి ముప్పుతెస్తునే.. మానవ జాతి మనగడపై ప్రభావం చూపేతీరుగా మనిషి చేస్తున్న తీరుతెన్నుల పట్ల ఏవగింపు కలగక మానదు...
ఇంతటి అద్భుత అందాల నడుమ.. ప్రకృతిని పాలిస్తున్న తీరుగా... కొండకోనల్లో నెలకొన్న గుహల్లో కొలువైన శివయ్య దర్శనం నిజంగా అద్భుత అనుభూతుల్ని మిగిలిస్తుందనే చెప్పక తప్పదు.
త్రేతా, ద్వాపరయుగాలలో...
నల్లమల అటవీ ప్రాంతం శైవ క్షేత్రాలకు ప్రసిద్దిగా చెప్పొచ్చు. ఈ క్షేత్రా లలోని మూల విరాట్టు అయిన శివుడికి ప్రతిరూపమైన లింగాలను దేవుళ్లే ప్రతిష్టించారన్నది ఈ ప్రాంత ప్రజల విశ్వాసం...
త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా, లక్ష్మణుడితో కల్సి వన వాసం చేసిన సమయంలో వారికి ఈ నల్లమల ఆతిథ్యమిచ్చిన ట్లు చెప్తారు. ఈ సమయంలోనే శ్రీరాముడు నల్లమలలో పలు ప్రాంతాలలోని గిరిసీమల్ని దర్శించి... అక్కడక్కడా శివలింగాలు ప్రతిష్టించారని... స్థానిక కథనాలు బోలెడు వినిపిస్తాయి.
ఇక ద్వారపయుగంలోనూ పాండవులు ద్రౌపదీ సమేతులై... అరణ్య వాసంలో ఇక్కడికి వచ్చినప్పుడు వారిని సాదరంగా నల్లమల అక్కున చేర్చుకుని వారికి అన్ని వసతులూ కల్పించిం దని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతారు. ఇలా తమ ప్రాంతంలో వనవాస కాలంలో గడిపిన పాండవులు సైతం ఉమామహేశ్వ రం... శ్రీశైలం... మల్లెల తీర్థం ఇలా పలు చోట్ల లింగాలు ప్రతిష్టిం చారని... ఆ క్రమంలోనే లంకమల్లేశ్వర క్షేత్రం లో కూడా లింగాన్ని త్రేతాయుగంలోనో.. ద్వాపర యుగంలోనో ప్రతిష్టించి ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం.
అద్భుత జలపాతం..
శివయ్య కొలువుదీరిన గుడి పాదాలను తాకేలా వందల అడుగుల ఎత్తులో శివుడి జటాజుటం నుంచి ఎగిసిపడుతూ... ఉరకలేస్తూ... దూకుతున్న దృశ్యం ఓ మహాద్భుతం. పున్నమి రోజుల్లో చంద్రుడు విరజిమ్మే వెన్నెల పెరుగు తున్న కొలదీ ఈ జలపాతం ధారకూడా పెరుగుతూ ఉంటుందని వచ్చే యాత్రీకులు చెప్తారు.
అద్భుత జల పాతాల నుంచి వచ్చిన ఔషధగుణాలున్న నీటితో ఏర్పడ్డ గుండంలో పున్నమి నాడు రాత్రి వేళ చంద్రకాంతి పడుతున్న సమయాన స్నానమా చరిస్తే... సర్వ వ్యాధులు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇలా స్నానమాచరించి లింగమయ్యని దర్శించుకుంటే కోరుకున్న కోర్కెలు తీరటంతో పాటు పాపాలు తొలగిపోతాయన్నది విశ్వాసం ప్రబలంగా భక్తుల్లో నేటికీ ఉంది.
ఎలా వెళ్లాలి....
కడప జిల్లా, మైదుకూరు నుంచి బద్వేలుకు పోవు దారి రాణిబావి దగ్గర కు 16 కిలోమీటర్ల అక్కడ నుండి అడవి మార్గన 14 కిలోమీటర్ల వాహనాలు లేక కాలినడక ద్వార అలయానికి చేరవచ్చును.
బద్వేలు నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని లంకమల్ల అడవుల్లో లంకమల్లేశ్వర క్షేత్రం ఉంది. సరైన దారి సౌకర్యం లేదు. దాదాపు 12 కిలోమీటర్లు అడవి మార్గాన ప్రయాణం చేయాల్సి ఉంది.

Share:

ఇంద్రుడు ప్రతిష్టించిన కుంతీ మాధవ దేవాలయం.

మన దేశంలో కృష్ణుడి ఆలయాలకు కొదవే లేదు. వెన్నదొంగకి ఊరూరా ఆలయాలే. అయితే పిఠాపురంలో ఉన్న కుంతీ మాధవ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. కొందరు ఈ ఆలయం ఇంద్రుడు ప్రతిష్టించాడని అంటారు, మరికొందరు కుంతీ దేవి ప్రతిష్టించిందని అంటారు.
.
ఒకానొకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరిస్తాడు. వృత్తాసురుడు అసురుడైనా పుట్టుకతో బ్రాహ్మణుడు అందువల్ల బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకోవడానికి ఇంద్రుడు ఈ భూమి పైన ఐదు వైష్ణవాలయాలను నిర్మించాడు... అవే "పంచ మాధవ క్షేత్రాలు"గా ప్రసిద్ధి చెందాయి. అవే బిందు మాధవ ఆలయం - వారణాసి, వేణీ మాధవ ఆలయం - ప్రయాగ, కుంతీ మాధవ ఆలయం - పిఠాపురం, సేతు మాధవ ఆలయం - రామేశ్వరం, సుందర మాధవ ఆలయం - తిరువనంతపురం.
.
కాకినాడకు దగ్గరలో ఉన్న పిఠాపురంలో ఉన్న ఈ ఆలయం చరిత్ర చూసినట్లయితే వేదవ్యాస మహార్షి పిఠాపురం లోని కుక్కుటేశ్వర స్వామిని దర్సిన్చుకోవటానికి ఇక్కడికి వచ్చి దర్శనం పూర్తీ చేసుకుని తిరిగి వెళుతూ ఈ కుంతీ మాధవ ఆలయానికి వస్తాడట. తన దివ్య దృష్తితో ఈ ఆలయం ఇంద్రుడు నిర్మించాడని, పాండవ వనవాస సమయంలో పాండవులు ఇక్కడకి వచ్చి ఉన్నారని, ఆ సమయంలో కుంతీదేవి ఈ మాధవునికి విశేష పూజలు చేసిందని చెప్పారట. కుంతీదేవి వనవాస కాలంలో నిరంతరం ఈ స్వామిని పూజించటం వలన ఈ ఆలయానికి కుంతీ మాధవ ఆలయంగా పేరు వచ్చిందని చెపుతుంటారు.
.
కుంతీ మాధవుడి పట్టపురాణిని రాజ్యలక్ష్మి అమ్మవారట. ఈవిడకి ప్రతి శుక్రవారం విశేష పూజలు చేస్తారట. ఈ ఆలయంలోని స్వామివారి లీలలు ఎంతో మంది ప్రత్యక్షంగా చూసారని చెపుతుంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా రావు గంగాధర రామారావుగారికి స్వామివారు కలలో కనిపించేవారని ప్రతీతి.ఏ రోజైనా ఆలయంలో ప్రసాదం రుచిగా లేకపోతే కృష్ణుడు ఈయన కలలో కనిపించి ప్రసాదం ఏమి బాలేదని చెప్పేవారట. రాజా వారు మరునాడు ఆలయానికి వెళ్లి ప్రసాదం ఎంతో రుచిగా వచ్చేటట్టు జాగ్రత్తలు తీసుకునేవారట.
.
ఇక ఈ అమ్లొ జరిగే ఉత్సవాల విషయానికొస్తే మాధవస్వామికి మాఘశుద్ధ ఏకాదశి నాడు కళ్యాణోత్సవం జరుపుతారట. చతుర్దశి నాడు రథోత్సవము కూడా అత్యంత వైభవంగా జరుగుతుందిట. మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసం నెలరోజులు భక్తులు తిరుప్పావై విన్నవిన్చుకుంటారని ఆలయ వర్గాలు చెప్పాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ గోదామ్మవారు, లక్ష్మీ అమృతవల్లి తాయారు, ఆళ్వారుల సన్నిధి ఉన్నాయట.
ఆ మాధవుడి కరుణా కటాక్షాలు మీ మీద కూడా పడాలంటే సామర్లకోట, కాకినాడ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా కుంతీ మాధవుడిని దర్శించి తరించండి.

Share:

హిందూవుల పూజా విధానంలోని అంతరార్థం.

1. గంటలు :
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.
.
2.దీప హారతి:
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. ” స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి” అని.
.
3. ధూపం
భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.
.
4. కర్పూర హారతి
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు.
.
5. గంధపు సేవ
ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం.
.
6. పూజ
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కాని భగవంతునికి వీటితో పనిలేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.
.
7 పత్రం(శరీరము)
ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.
.
8 పుష్పం (హృదయము)
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.
.
9 ఫలం (మనస్సు)
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.దాన్నే త్యాగం అంటారు.
.
10. తోయం(నీరు)
భగవంతుని అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి.
.
11 కొబ్బరికాయలు
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
.
12. నమస్కారము
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.
.
13. ప్రదక్షిణము
ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.

Share:

మహిమాన్వితమైన రామ నామ మంత్రం..!!


* రాముడికన్నరామనామమే గొప్పది ..
* హనుమంతుడిని రాముడు ఎందుకు చంపబోయడు .??
* రామ నామ జపం లోను అంతులేని విజ్ఞానం ...
రావణ వధానంతరం సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యానగరానికి విచ్చేసిన రాముడు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలన సాగిస్తున్నాడు. ప్రతిరోజూ సభ ఏర్పాటు చేయడం, ఆ సభకు సామాన్యప్రజానీకంతో సహా పెద్దలు, మునులు విచ్చేసి ధార్మిక విషయాల మీద చర్చలు చేయడం నిత్యకృత్యం.
.
ఓ రోజు అలాగే సభ జరుగుతోంది. ఆ సభకు నారద, వశిష్ట, విశ్వామిత్రులు కూడా విచ్చేశారు. ముందుగా నారద మహర్షి సభలో ఒక సందేహం లాంటి ప్రశ్నను సంధించాడు. భగవంతుడు గొప్పవాడా, భగవంతుడి నామం గొప్పదా అన్నదే ఆ సందేహం. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం అందరూ మల్లగుల్లాలు పడ్డారు. ఎన్నో తర్జన భర్జనలు చేశారు. ఆఖరికి వశిష్ట విశ్వామిత్రులకు కూడా సరైన సమాధానం ఇదీ అంటూ ఇదమిత్థంగా తేల్చి చెప్పడం సాధ్యం కాలేదు. దాంతో అందరూ కలసి నారదుణ్ణే అడిగారు, ‘ఆ ప్రశ్నకు సమాధానం మీరే చెప్పండి మహర్షీ!’ అని.
.
‘‘రాముని కన్నా, రామనామమే గొప్పది. ఇందులో సందేహించవలసిన పనిలేదు.’’ అని చెప్పాడు నారదుడు. ‘‘కావాలంటే నిరూపిస్తాను’’ అంటూ హనుమను పిలిచి, ‘‘హనుమా! సభానంతరం నువ్వు ఒక్క విశ్వామిత్రుడికి తప్ప సభలోని అందరికీ నమస్కారం చేయి’’ అని చెవిలో చెప్పాడు.
.
సరేనన్నాడు హనుమ.
సభముగిశాక నారదుడు చెప్పినట్లుగానే హనుమ సభలోని పెద్దలందరికీ భక్తి గౌరవాలతో వినయంగా నమస్కరించాడు. విశ్వామిత్రుడి వద్దకు వచ్చేసరికి ఆయనకు నమస్కరించ కుండానే వెనుదిరిగాడు.
.
కాసేపయ్యాక నారదుడు విశ్వామిత్రుని వద్దకెళ్లి, ‘‘చూశావా విశ్వామిత్రా, ఆ హనుమకు ఎంత పొగరో! అందరికీ నమస్కరించి, నిన్ను మాత్రం విస్మరించాడు.’‘ అన్నాడు రెచ్చగొడుతున్నట్లుగా.
.
విశ్వామిత్రుడు కోపంతో మండిపడ్డాడు. రాముడి వద్దకెళ్లి, ‘‘రామా! మదాంధుడైన ఆ హనుమను రేపు సూర్యాస్తమయంలోగా సంహరించు! ఇది నా ఆజ్ఞ.’’ అన్నాడు.
.
ఆ మాటలకు నిర్ఘాంతపోయాడు రాముడు. ‘‘ఎంతటి విపత్కర పరిస్థితి! నాకు ఎంతో ఇష్టుడైన హనుమను నా చేతులతో నేను చంపుకోవడమా!? అదీ నిష్కారణంగా! చంపనంటే గురువాజ్ఞ మీరినట్లవుతుంది. ఇప్పుడేమిటి దారి?’’ అంటూ తలపట్టుకు కూర్చున్నాడు.
.
ఈలోగా హనుమను రాముడు చంపబోతున్నాడనే వార్త క్షణాలలో రాజ్యమంతా వ్యాపించింది. ఈ వింత సంఘటన గురించి ప్రజలందరూ కథలు కథలుగా చెప్పుకోసాగారు.
.
హనుమ వెంటనే నారదుడి వద్దకెళ్లాడు. ‘‘మహర్షీ మీ మాట వినే కదా, నేను ఈ పని చేశాను. దానికి ఇంతటి దారుణమైన శిక్షా?’’అని వాపోయాడు.
.
అందుకు నారదుడు ‘‘నీకేం భయం లేదు హనుమా! నేనున్నాను కదా, నువ్వు ఒక పని చెయ్యి, సూర్యోదయానికన్నా ముందే సరయూనదిలో స్నానం చేసి, ‘శ్రీరామ జయరామ జయజయ రామ’ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చలించకు’’ అని చెప్పాడు.
.
నారదుడు చెప్పిన విధంగానే హనుమ తెల్లారేలోగా సరయూనదిలో స్నానం చేసి, భక్తిశ్రద్ధలతో నారదుడు చెప్పిన మంత్రాన్ని జపించసాగాడు. తెల్లవారగానే ఏం జరుగుతుందో చూడాలన్న ఆసక్తితో నగర ప్రజలంతా గుంపులు గుంపులుగా సరయూనది ఒడ్డుకు చేరుకోసాగారు.
.
రాముడు ఒకసారి తన ప్రేమపూర్వక నయనాలతో తనకెంతో ఆప్తుడు, నమ్మిన బంటు, సఖుడు అయిన హనుమను చూస్తూ, నదిలో నడుము లోతు నీటిలో నిలిచి, రామమంత్రాన్ని తదేక దీక్షతో పఠిస్తున్న హనుమపై బాణాన్ని వదిలాడు. ఆశ్చర్యం! ఆ బాణం హనుమను ఏమీ చెయ్యలేకపోయింది. అలా సంధ్యా సమయం వరకు నిర్విరామంగా బాణాలు వదులుతూనే ఉన్నాడు రాముడు. ఆ బాణాలన్నీ ఒక్కొక్కటిగా నేలరాలిపోతున్నాయి కానీ, హనుమకు మాత్రం కించిత్తు కూడా హాని కలగడంలేదు. ఇలా లాభం లేదనుకుని చివరకు బ్రహ్మాస్త్రాన్ని సంధించడానికి సిద్ధమయ్యాడు రాముడు. దాంతో ప్రకృతి మొత్తం కంపించిపోసాగింది. ప్రజలంతా హాహాకారాలు చేయసాగారు.
.
ఇంతలో నారదుడు విశ్వామిత్రుని వద్దకెళ్లి, ‘‘మహర్షీ! చూశారా, రామ నామ మహిమ ఎంత గొప్పదో! ఆ మహిమకు రాముడు కూడా తలవంచక తప్పడం లేదు. బ్రహ్మాస్త్రం గనక నిర్వీర్యం అయిపోయిందంటే ఎన్నో ఉత్పాతాలు జరుగుతాయి. అన్నింటికీ మించి అది నీకూ, నీ శిష్యుడికీ కూడా ఎంతో అవమానకరం. హనుమ నీకు నమస్కరించకపోతే ఏమైంది చెప్పు. నీవే ఇక ఈ అస్త్రప్రయోగం చాలించమని నీ శిష్యుడికి చెప్పు’’ అని సలహా ఇచ్చాడు.
.
విశ్వామిత్రుడు ‘‘ఇక ఆపు రామా!’’ అనడంతో రాముడు ధనుర్బాణాలు కిందపడవేసి, హనుమను ప్రేమతో కౌగలించుకున్నాడు.

Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List