ఈ రోజు పంచాంగం ~ దైవదర్శనం

ఈ రోజు పంచాంగం

30.12.2022.        శుక్రవారం

*శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు*

సుప్రభాతం.....

ఈరోజు పుష్య మాస శుక్ల పక్ష *అష్టమి* తిథి సా.05.33 వరకూ తదుపరి *నవమి* తిథి, *ఉత్తరాభాద్ర* నక్షత్రం ప.11.24 వరకూ తదుపరి *రేవతీ* నక్షత్రం, *వరియన* యోగం ఉ.09.46 వరకూ తదుపరి *పరిఘ* యోగం, *భద్ర(విష్టీ)* కరణం ఉ.06.49 వరకూ, *బవ* కరణం సా.06.33 వరకూ, *బాలవ* కరణం రా.రే. తె.06.28 వరకూ తదుపరి *కౌలవ* కరణం ఉంటాయి.
*సూర్య రాశి*: ధనస్సు ( పూర్వాషాడ నక్షత్రం లో), *చంద్ర రాశి*: మీన రాశి.
*నక్షత్ర వర్జ్యం*: రా.11.36.నుండి రా.01.13 వరకూ
*అమృత కాలం*: తెల్లవారు ఝాము 06.40 నుండి 08.15 వరకూ.
(హైదరాబాద్ ప్రాంతం వారికి)
*సూర్యోదయం*: ఉ.06.46
*సూర్యాస్తమయం*: సా.05.52
*చంద్రోదయం*: మ.12.25
*చంద్రాస్తమయం*: రా.12.57
*అభిజిత్ ముహూర్తం*: మ.11.56 నుండి 12.41 వరకూ
*దుర్ముహూర్తం*: ఉ.08.59 నుండి ఉ.09.43 వరకూ మ.12.41 నుండి మ.01.25 వరకూ
*రాహు కాలం*: ఉ.10.55 నుండి మ.12.19 వరకూ
*గుళిక కాలం*: ఉ.08.09 నుండి ఉ.09.32 వరకూ
*యమగండం*: మ.03.05 నుండి సా.04.29 వరకూ

ఈరోజు *మాస దుర్గాష్టమి* సంవత్సరంలో వచ్చే అన్నీ శుక్ల పక్ష అష్టమి తిథులలో దుర్గా దేవి భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, దుర్గాదేవిని అత్యంత భక్తితో పూజిస్తారు.

ఈరోజు *బనదా అష్టమి* శాకంబరీ దేవిని పూజించడానికి  ప్రత్యేకించిన రోజు. శాకంబరీ దేవిని కర్ణాటక ప్రాంతంలో *బనశంకరి దేవి* అని పిలుస్తారు. శాకంబరీ దేవి, భగవతీ దేవి అంశగా భక్తుల విశ్వాసం. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు అధిదేవత గా, కూరలు పండ్లతో అలంకరించిన రూపంగా శాకంబరీ దేవి రూప వర్ణన. పుష్య మాస పూర్ణిమ *శాకంబరీ దేవి జయంతి* గా పురాణ నిర్ణయం. కాబట్టి పుష్య పూర్ణిమను *శాకంబరీ పూర్ణిమ* అని పిలుస్తారు. ఈరోజు నుండి *శాకంబరీ దేవి నవరాత్రులు* ప్రారంభం అయ్యి పూర్ణిమ రోజు ముగుస్తాయి.

*సర్వార్థ సిద్ది యోగం, అమృత సిద్ది యోగాలు* ఈరోజు ఉదయం 11.24 నుండి రేపు సూర్యోదయం వరకూ ఉంటుంది.(శుక్రవారం, రేవతీ నక్షత్రం కలయిక). ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, క్రొత్త పనులు ప్రారంభించడానికి, వైద్యులను సంప్రదించడానికి, నూతన ఔషధాలు వాడటం ప్రారంభించడానికి అత్యంత అనుకూలం.


No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List