November 2022 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

కాలభైరవాష్టమి పుట్టుక




 * నేడు మార్గశిర శుద్ధ అష్టమి విశిష్టత ఏమిటి.? 

శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం చెబుతుంది. ఒకసారి శివబ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. 

ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు 'నేను సృష్టికర్తను... పరబ్రహ్మ స్వరూపుడను... నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు. దింతో వారి మధ్య వాదం పెరిగింది. సమస్య పరిష్కారం కొరకు శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు.


ఋగ్వేదం:-


అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్ట మొదట నారాయణుడు జన్మించాడో ఎవరు చిట్ట చివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమ శివుడు పర బ్రహ్మము అంది.


యజుర్వేదము:-


తరువాత యజుర్వేదమును పిలిచారు. అసుర శక్తులు పోయి ఈశ్వర శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞము నందు ఆరాధింప బడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది.


సమవేదము:-


తరువాత సామ వేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది.


అధర్వణవేదము:-


పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది.


🌿అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నాయి.


ప్రణవం:-


ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో శక్తీశ్వరులై వారున్నారో అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు.  జ్యోతి సాకారం అయింది. సకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు.


బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. శంకర ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రమ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను తీసివేయి అన్నాడు.అప్పుడు ఈశ్వర రూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై రూపంతో బ్రమ్మ అయిదవ తలను గోటితో గిల్లేసింది. ఇలా జరిగే సరికి బ్రహ్మ భయపడి పోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఈ రోజు నుండి కాలభైరవ అని పిలుస్తారు. కాలభైరవ నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. 


ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. అని చెప్పాడు. బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు.


కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు కాలభైరవా నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు... కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది అని సలహా యిచ్చాడు.


విష్ణుమూర్తి సలహా మేరకు కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని ''కపాల మోక్షతీర్థం''.కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్నిభక్తితో పూజించి తరించాడు. విశ్వనాధుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్ఛాడు.


కాలభైరవ ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని 'భైరవ యాతన' అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసివేయి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను 'అమర్దకుడు' అని పిలుస్తారు. ఇక నుండి నీవు నా దేవాలయలలో క్షేత్ర పాలకుడిగా ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు 'పాప భక్షకుడు' అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు. మీనల్ని కాశీ క్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా' అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుండి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తారు. భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.


ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవయాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి.


ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. 'మేము కాశీ వెళ్ళాము మాకు ఇంట ఏ భయమూ లేదు అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు.


కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.

కాశీ క్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీకాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీ నుండి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారం అయింది. కాశీ క్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతోపాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజానంతరం శునకమునకు పసుపు, కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు.


ఆ ఆచారాలు శ్రీ కాలభైరవ స్వామి వారి మాహాత్మ్యానికి నిదర్శనం. ఈ కాలభైరవుని జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్నిలదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలతోను, అష్టోత్తరాలతోను శ్రీ కాలభైరవ స్వామిని పూజిస్తారు. మినప వడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకపూట ఉపవాసం చేస్తారు.


ఈ మార్గశిర అష్టమి కాలభైరవజన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన కాలభైరవాష్టకం ను పారాయణ చేస్తారు. ఇలా కారభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని స్మరించడం పూజించడం వలన సకల పుణ్య ఫలాలు కలుగుతాయి. శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్నభయాలు దూరమవుతాయ. గ్రహదోషాలు తొలగిపోతాయి..

Share:

అమ్మని అమ్మాళ్ (అమ్మని అమ్మన్).


అరుణాచలేశ్వరుని ఉత్తర గోపురం పూర్తి చేసిన కారణ జన్మురాలు"అమ్మని అమ్మాళ్/అమ్మని అమ్మన్" తల్లిదండ్రులు; గోపాల పిళ్ళై, అలు అమ్మాళ్.. సోదరుడు: తాండవ పిళ్ళై..
జన్మస్థలం: చెన్న సముద్రం గ్రామం,చెంగమ్ దగ్గర ,తమిళనాడు

అమ్మని జీవిత విశేషాలు..
అమ్మని కి తమ తల్లిదండ్రులు పెళ్ళి చేయాలని ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో ఆమె ఇల్లు వదిలి అదేవూర్లో ఒక కొలను దగ్గర కూర్చుని ఉండి పోతుంది అప్పుడు అమ్మని స్వయంగా తన పూర్వ జన్మ వివరాలు తెలిపింది "పూర్వం తాను శివలోకంలో ఉన్న పరాశక్తి ని అని పరమేశ్వరుని పట్ల తాను చేసిన అపరాధం కారణం గా ఈ మానవ జన్మ ఎత్తినట్లు తెలిపింది ముందు జన్మలో అదే చెన్న సముద్రంలో "చెన్నమ్మ"అనే పేరుతో జన్మించి తనను కామించిన తురక రాజు నుండి  వెల్లియప్ప సిద్దార్ అను వారి సహాయంతో సప్త మాతృకలు రక్షణలో ఉన్న గుహ లోకి ప్రవేశించి జన్మ సమాప్తి గావించింది.

రెండవ జన్మలో; అమ్మని అమ్మాళ్ గా జన్మించిన తాను అరుణాచలేశ్వరుని క్షేత్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన శ్రీ వల్లాల మహారాజు గారి ద్వారా ప్రారంభం చేయబడి అసంపూర్తిగా ఉన్న ఉత్తర రాజ గోపురాన్ని పూర్తి చేయడమే తన కర్తవ్యంగా భావించి అరుణాచలం వచ్చి జోలి పట్టి యాచించి ఉత్తర గోవురాన్ని పూర్తి చేసింది
గోపురం చివరి దశలో పైకం లేనప్పుడు సర్వేశ్వరుడు ఆమెకు విభూతిని మంత్రించి ఇవ్వు అదే వారికి పైకంగా మారి పని పూర్తి అవుతుంది అని స్వప్నం లో అదేశమిస్తారు అలా ఈశ్వర ప్రేరణ అనుగ్రహం తో గోవురాన్ని పూర్తి చేసింది అమ్మని ,తనకు సహాయం చేసేందుకు ముందుకు రాని వారి వద్ద ఎంత డబ్బు ఉందొ చెప్పి వారికి కళ్ళు తెరిపించేది అమ్మని అలా ఉత్తర రాజగోపురం ఇప్పుడు "అమ్మని అమ్మాళ్"గోపురం గా పిలువబడుతు ఉంది అమ్మని ఈ కార్యం పూర్తి అయ్యాక జీవ సమాధి ప్రవేశం చేసింది ఈ తల్లి అధిష్టాన మందిరం ఈశాన్య లింగం దగ్గర ,ఈశాన్య దేశికుల మఠం పక్కనే ఉంటుంది అరుణాచలం వెళ్లేవారు తప్పకుండా దర్శించుకోగలరు.

అరుణాచల శివ శివ.. అరుణాచల శివ..
 

Share:

కటాస్ రాజ్ ఆలయం.





* పాకిస్తాన్ లో శిథిలావస్థకు చేరిన మహాభారత కాలం నాటి హిందూ ఆలయం...

మన దాయాది దేశం పాకిస్తాన్లో హిందూ దేవాలయాలు చాలా అరుదు. అలాంటి అరుదైన దేవాలయాల్లో చారిత్రక విశిష్టత కలిగిన దేవాలయం కటాసరాజ ఆలయం. పాకిస్తాన్ లో శిథిలావస్థలో ఉన్న ఆలయాల్లో కటాస్ రాజ్ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం ఎంతో విశాలంగా, అద్భుతంగా ఉంటుంది. అయినా ఈ ఆలయాన్ని పట్టించుకునే నాథుడే లేడు.పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈ ఆలయం చక్వాల్ జిల్లాలోని కటాస్ గ్రామంలో ఉన్నది. ఇది ఒక శివాలయం. మహాభారతకాలంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ ప్రదేశంలో గడిపినట్టు భావిస్తారు.


దక్ష యజ్ఞసమయంలో, సతీదేవి ప్రయో ప్రవేశం చేసినదన్న వార్త తెలిసినపుడు శివుని కంటి నుండి రెండు కన్నీటిబొట్లు రా లాయి. అవి భూమి మీద పడినపుడు, ఒకటి ఇక్కడి కటాసక్షేత్రంలోని అమృతకుండ్ తీర్థం గానూ, రెండవది భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని అజమేరు (అజ్మీర్)లోని పుష్కర రాజ్ తీర్థంగానూ మారాయి. మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తాను అగ్నిని మధించే ఆరణిని ఒక చెట్టు కొమ్మలో దాచా ననీ, అప్పుడే వచ్చిన ఒక దుప్పి ఆ కొమ్మను రాచుకోన్నందున ఆరణి దాని కొమ్ములలో చిక్కుకొని పోయినదని దానిని తెచ్చి ఇవ్వవల సినదిగా కోరగా ధర్మరాజు నలుగురు తమ్ము లతో లేడిని పట్టుకోవడానికి బయలుదేరుతా రు. కొంతసేపటికి ఆ లేడి మాయమవుతుంది.

వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపగా... అతను ఎంత కూ రాకపోవడంతో సహదేవుని పంపుతారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరారు. చివరకు ధర్మరాజు బయలుదేరి మంచినీటి కొలను ప్రక్కనే పడివున్న నలుగు రు తమ్ములను చూసి దుఃఖంతో భీతిల్లుతా డు. అంతలో అదృష్యవాణి ఇలా పలుకుతుం ది. ‘‘ధర్మనందనా నేను యక్షుడను. ఈ సర స్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభా వంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో’’ అన్నా డు యక్షుడు. దానికి సరే అన్నాడు ధర్మరాజు. వీటినే, యక్షప్రశ్నలుగా హిందువులు చెప్పు కుంటూ ఉంటారు. ఇది కటాసక్షేత్రంలోని అమృతకుండ్ వద్దనే జరిగింది.


చరిత్ర...

ఇక్కడ 100కి పైగా ఉన్న ఆలయాల్లో ఎక్కువ శాతం 900 సంవత్సరాలు లేదా అంతకన్నా పూర్వానివేనని చరిత్రకారుల ఉద్దేశ్యం. కటా సక్షేత్రం ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు విశ్వవిద్యాల యంగా కూడా భాసిల్లినది. ఎందరో దేశీ, విదే శీ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తూ ఉండే వారు. ప్రముఖ గణితజ్ఞుడు ఆల్బెరూనీ ఈ విశ్వవిద్యాలయంలో సంస్కృత అధ్యయనం చేస్తూ, భూమి చుట్టుకొలతను లెక్కించాడు. 1947 కాలంలో ఇక్కడి హిందువులందరూ భారతదేశంలోని పంజాబ్కు వెళ్లిపోయారు.

Share:

శ్రీ హరిహర క్షేత్రం.





మహా పుణ్యక్షేత్రంగా వెలుస్తున్న చీమకుర్తి హరిహర క్షేత్రం: అపూరమైన శిల్పకళా నైపుణ్యంతో, శాస్త్రోక్తమైన ప్రతిమా శైలితో, దేవాలయ నిర్మాణంలో సుప్రసిద్ధులైన పద్మశ్రీ గణపతి స్థపతి నేతృత్వంలో కంచి కామకోటి జయేంద్ర సరస్వతి ఆశీస్సులతో శిద్దా వారు నిర్మిస్తున్న చీమకుర్తి హరిహర క్షేత్రం మహ పుణ్యక్షేత్రాల కోవలో రూపుదిద్దుకొని జగ్గత్ ప్రఖ్యాతి కాంచనున్నది.


చీమకుర్తి 'హైవే రోడ్డుపై, రోడ్డుకి 6 అడుగుల ఎత్తులో ఈ క్షేత్ర నిర్మాణం సాగుతున్నది. శిద్దా వెంకటేశ్వర్లు శ్రీ వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ వారి నేతృత్వంలో దేవాలయం నిర్మితమవుతున్నది. దేవాలయ నిర్మాణకులైన తమిళనాడు కంచి పుర వాస్తవ్యులు గణపతి స్థపతి వారి గూర్చి తెలియని వారుందరు.


భద్రాచలంలోని సీతారాముల ఆలయం కళ్యాణ మండపం, బిర్లామందిర్, హైదరాబాద్, సంఘీ టెంపుల్, అమెరికా న్యూయార్కులోని గణపతి దేవాలయాలు, స్విస్ బర్గ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం మొదలగు నిర్మించిన ఘణత వారిదే అటువంటి పద్మశ్రీ గణపతి స్థపతి ఆధ్వర్యంలో ఒకేచోట 4 ఆలయాలు నిర్మాణం చేపట్టారు.


ప్రతి దేవాలయాన్ని పరిపూర్ణంగా అంటే ప్రతి గుడిలో గర్భగుడి, అర్థమండపం, మహమండపం ద్వజస్తంభం, రాజగోపురం, పరివారాలయంతో సహ సంపూర్ణంగా మలవడం ఈ క్షేత్రం గొప్పతనం, ఒకేచోట ఇన్ని దేవాలయాలు రూపుదిద్దుకోవడం ఆంధ్రప్రదేశ్లోనే అద్భుతమైన విషయం.


హరిహర క్షేత్రంలోని దేవాలయలు..


1) అయ్యప్ప దేవాలయం: 

కేరళ శైలితో రూపుదిద్దుకుంటున్న ఈ దేవాలయం శబరి మలైలో ఏమేమి ఆలయాలు ఉన్నాయో, అలాగే శబరి మలై దేవాలయం లాగానే 18 మెట్లతో, మాళికాపురత్తమ్మ, వినాయకుడు, నాగరాజు, పెరియకరప్పన్, చిన్న కరప్పన్ దేవాలయాలతో అద్భుతంగా నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో అయ్యప్పస్వామి మాల వేసుకునే వారికి ఫ్రీ భోజనం ఫ్రీ టిఫిన్ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.


2) శ్రీవెంకటేశ్వర దేవాలయం : 

చోళ, పల్లవ నాయక శైలిలో నిర్మిస్తున్నారు. ఒకే నల్లరాయితో 6 అడుగుల ఎత్తున స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ దేవాలయంలో పద్మావతి, ఆండాళ్ , గరుత్మంతుల ఆలయాలు కూడా ఉంటాయి.


3) శివాలయం : చోళ, పల్లవ, నాయకశైలిలతో శాస్త్రోక్తంగా నిర్మిస్తున్నారు. ఈ గుడి ముందలి గాలి గోపురం 40 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు. ఈ దేవాలయంలో ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, పార్వతి, వాసవి కన్యకా పరమేశ్వరి, భైరవుడు, చండకేశ్వరుడు, నందీశ్వరుడులతో నిర్మితమవుతున్నది.


4) శ్రీ ప్రసన్నాంజనేయ దేవాలయం : 

చోళ, పల్లవ, నాయిక శైలితో, ఒకే రాయితో 16 '/ అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ ట్రస్ట్ నేతృత్వంలో ఆలయ నిర్మాణమే గాక అనేక సేవా కార్యక్రమాలు అమలు జరుపుచూ ఎందరో దీనులకు, అన్నార్తులకు ఆలంబనగా నిలుస్తున్నది.


ఈ ట్రస్ట్ వారు వృద్ధుల ఆశ్రమం నెలకొల్పారు. ఎన్నో కంటి ఆపరేషన్లు శిబిరాలు ఏర్పరచి సదా ప్రజా సేవాలో పునీతం అవుతున్నారు.


(ప్రకాశం జిల్లా, చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రం)


Share:

సుబ్రహ్మణ్యుడి కావడి ఉత్సవం విశిష్టత.





కుమారస్వామి శిష్యుల్లో అగస్త్య మహాముని ఒకరు. పూర్వం దేవదానవ యుద్ధంలో చాలా మంది దానవులు చనిపోయాక వారిలో ఒకడైన ఇడుంబన్‌ అనే రాక్షసుడు బతికి తన అసుర గణాలను వదిలి అగస్త్యుడి శిష్యునిగా కూడా మారతాడు. అయితే ఇడుంబన్‌లోని రాక్షస భావాలను పూర్తిగా తొలగించాలని భావిస్తాడు అగస్త్యుడు. *‘నాయనా , నేను కైలాసం నుంచి శివగిరి , శక్తిగిరి అనే రెండు కొండలను తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నా. ఎలాగైనా వాటిని ఒక కావడిలో పెట్టుకుని రా’* అని ఆజ్ఞాపిస్తాడు. ముని చెప్పినట్టే కైలాసం వెళ్లి కొండలను కావడిలో పెట్టుకుని బయలుదేరుతాడు ఇడుంబన్‌. 


ఆ రాక్షసుడి అసురత్వాన్ని సుబ్రహ్మణ్యుడే పోగొడతాడని శివుడు అందుకు అడ్డు చెప్పడు. అలా కొండల్ని మోసుకుని కొంతదూరం వెళ్లిన ఇడుంబన్‌ పళని ప్రాంతంలో వాటిని కింద పెట్టి సేదతీరతాడు. కాసేపటికి లేచి కావడి ఎత్తుకుంటే ఒకవైపు బరువుగా , ఇంకోవైపు తేలిగ్గా ఉండటం గమనిస్తాడు. కావడిని దించి చూస్తే బరువున్న కొండపైన సుబ్రహ్మణ్య స్వామి చిన్న పిల్లాడి రూపంలో ప్రత్యక్షమై పకపకా నవ్వుతూ కనిపిస్తాడు. ఆ చర్యకి కోపమొచ్చిన ఇడుంబన్‌ స్వామిని వధించాలని కొండపైకి వెళతాడు. ఆగ్రహించిన సుబ్రహ్మణ్యుడు అతడిని సంహరిస్తాడు. విషయం తెలిసిన అగస్త్యముని ఇడుంబన్‌ను బతికించమని వేడుకుంటాడు. శిష్యుడి కోరికను మన్నించిన స్కందుడు ఇడుంబన్‌ను బతికించి... తన కొండ కిందకొలువై ఉండమనీ , భక్తులు ముందుగా అతడిని దర్శించుకున్నాకనే తన సన్నిధికి రావాలనీ వరమిస్తాడు.


అలానే షష్ఠినాడు పాలు , విభూతి , పూలు , తేనె , నెయ్యి... వీటిలో ఏదో ఒకటి కావడిలో పెట్టుకుని పాదచారులై కొండకొస్తే తనని ఆరాధించిన  ఫలితం దక్కుతుందని చెప్పి సుబ్రహ్మణ్యస్వామి అదృశ్యమవుతాడు. అప్పట్నుంచీ పళని కొండకి ఇడుంబన్‌ అనే పేరు వచ్చింది. స్వామి వారి మెట్ల మార్గం దగ్గర ‘ఇడుంబన్‌’ గుడి ఉంటుంది. భక్తులు ఆ మూర్తిని దర్శించుకున్నాకే వల్లీదేవసేన సమేతుడైన కుమారస్వామి సన్నిధికి వెళతారు.  ఈక్షేత్రం మదురైకి 120 కి.మీ దూరంలో ఉంది. 


హైదరాబాద్‌ నుంచి మదురైకి విమానంలో వెళ్లి అక్కణ్నుంచీ రోడ్డు లేదా రైలు మార్గంలో వెళ్లొచ్చును. రైల్లో అయితే హైదరాబాద్‌ నుంచి మదురైగానీ , చెన్నై సెంట్రల్‌ వరకూగానీ వెళ్లి అక్కణ్నుంచీ చెన్నై సెంట్రల్‌ - పళని ఎక్స్‌ప్రెస్‌లో పళని చేరుకోవచ్చును. రైల్వే స్టేషన్‌ నుంచి దేవాలయానికి ఆటో , బస్సుల సౌకర్యం కూడా ఉంటుంది.

 

Share:

నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి.





కర్నాటక రాష్ట్రము నందు, మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది సుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య) , మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక (పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య)) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు. ఈ ప్రదేశం ఆనాడు విజయనగర రాజుల ఆస్థానానికి చెందినదని అంటారు.


శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో నాగలమడకలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.  శ్రీరాముడు ఈప్రదేశం వదలి కామనదుర్గ (నీళ్లమ్మనహళ్ళి) కాకాద్రి కొండకు ప్రయాణ మైనట్లు చెబుతారు. ఈ కొండనే కామిలకొండ అని పిలుస్తారు.ఈ కొండపై శ్రీ రామచంద్ర స్వామి వారి గుడి ఉన్నది.


నాగలమడకలో అన్నంభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవారని ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడిగా వుంటూ దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం కాలి నడకన హాజరయ్యేవారని అంటారు. 


ఒకసారి వృద్ధాప్యంలో అన్నంభట్టు గారు కుక్కేలో రథం లాగే సమయానికి చేరుకోలేక పోయారని, అయితే భక్తులు ఎంతమంది లాగినా కూడా రథం ముందుకు కదలక అలాగే నిలిచి పోయిందని అన్నంభట్టు గారు అక్కడకు చేరుకొని రథం పగ్గాలపై చేయి వేసిన వెంటనే రథం కదిలిందని పూర్వీకులు చెబుతారు.



నాగాభరణం..


వృద్ధాప్యంలో ఇక్కడకు రాలేవని అందువల్ల నాగలమడకలోనే ఉంటూ సేవ చేయమని చెప్పి నాగాభరణంను అన్నంభట్టుకు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చినట్లు పెద్దలు పేర్కొంటున్నారు. ఆ నాగాభరణంను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం వల్లనే నాగలమడక అని పేరు వచ్చిందంటారు. 


అది కూడా స్వామి కలలో కన్పించి పెన్నానది పరివాహకం వద్దనే ప్రతిష్ఠించమని చెప్పడంతో నాగుల కోసం వెతుకుతున్న సందర్భంలో ఒక రైతు పొలంలో నాగలితో దున్నుతుండగా ఆ సమయంలో నాగులను పోలిన రాళ్ళు లభ్యం కావడంతో ఆ రాళ్ళనే ప్రతిష్ఠించినట్లు చెబుతారు. 



ప్రారంభంలో కేవలం నాలుగు స్తంభాలు నిలబెట్టి రాతిబండపరచి మంటపాన్ని నిర్మించారని రొద్దంకు చెందిన బాలసుబ్బయ్య అనే వ్యక్తి ఈ మంటపంలో వ్యాపారంకు సంబంధించిన సరుకులు పెట్టుకుని నిద్రిస్తుండగా స్వామి కలలో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పడం తో ఆయన ఆలయ నిర్మాణానికి కృషి చేసి సఫలీకృతుడైనట్లు తెలిసింది. కావున ఆ వంశానికి చెందిన వ్యక్తులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథోత్సవంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.


నాగలమడకలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉండే శిల్పం సుందరంగా మూడుచుట్లు చుట్టుకుని ఏడు శిరస్సు లు కల్గిన మూడు అడుగుల నాగప్పస్వామి శిల్పం చూసిన భక్తులకు తక్షణం భక్తి భావన కలుగుతుంది.పుల్లివిస్తర్ల విశిష్టత…

  

ప్రతి ఏడాదికి ఒకసారి నిర్వహించే బ్రహ్మ రథోత్సవంలో లక్షలాది మంది తమ మొక్కుబడులు తీర్చడానికి ఈ ప్రాంతానికి వస్తువుంటారు. అందులో విశిష్టమైనది పుల్లివిస్తర్లు (బ్రాహ్మణులు భోజనం చేసి వదిలిన ఆకులు) తలపై పెట్టుకుని పినాకిని నదిలో స్నానం చేయడం.


స్వామి రథోత్సవం తర్వాత బ్రాహ్మణులు భోజనం పిదప విడిచిన పుల్లివిస్తర్లు ఏరుకుని వాటిని తలపై పెట్టుకుని నీరున్న చోట తలంటుస్నానాలు చేస్తే చేసిన పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తులు భావించడం విశేషం. అప్పటి వరకు వున్న ఉపవాస దీక్షను విరమించడం భక్తులు అనవాయితీ.

  

ఈ జాతరలో రైతులకు ఈ ఎద్దుల పరుష ప్రత్యేక ఆకర్షణ. కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో అతి పెద్ద ఎద్దుల పరుష ఇక్కడ జరుగుతుంది. ఇక్కడకు తుముకూరు జిల్లా మరియు ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులు చేరుకుని దాదాపు 10 రోజులపాటు ఎద్దుల అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయి. అంత్య సుబ్రహ్మణ్యం పేరుతో వెలసిన ఈ స్వామి ఆలయానికి విశిష్ట ఖ్యాతి నెలకొనివుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతోంది.


  🔱 ఓం శరవణ భవ..

Share:

నేడు సంతానం లేనివారు, పెళ్లి కానివారు సుబ్రహ్మణ్య షష్టి రోజు స్వామిని పూజించండి..

మాసానాం మార్గశీర్షోహం.. అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ మాసం ఎంతో విశిష్ఠతను సంతరించుకుందని అర్థం. ఇది సంవత్సరంలో తొమ్మిదవ మాసం. 


మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమే ఈ మార్గశీర్షం. ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాస శుక్ల షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. తారకాసుర సంహారం కోసం , దేవతల కోరిక మేరకు పరమశివుని అంశతో మార్గశిర శుధ్ధ షష్టినాడు సుబ్రహ్మణ్యస్వామి జన్మించారు.


సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు. తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెబుతున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు. హిరణ్యకశ్యపుని కుమారుడు *‘నీముచి’. ‘నీముచి’* కొడుకు తారకాసురుడు. 


తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సుచేసి ఆయన ఆత్మ లింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందుతాడు. వర ప్రభావంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు. 


అతడితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోతారు. ఇక తమ వల్లకాదనుకుని తారకుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని శివుడ్ని వేడుకున్నారట. వారి కోరిక మేరకు శివాంశతో కుమారస్వామి జన్మించాడు. 


కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుడ్ని సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరుకూడా వుంది.


సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి , సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. 


సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. మన శరీరంలో ఉండే కుండలినీ శక్తికి సుబ్రహ్మణ్యస్వామి అధిదైవం. పురుషుల్లో ఉండే శుక్ర కణాలకు కూడా సుబ్రహ్మణ్యస్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలినికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసినవారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని , ప్రకృతిని కాపాడడం కోసం ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి.


కొంతమంది ఈ రోజు బ్రహ్మచారులను పూజిస్తారు. కుజుడు మనిషికి శక్తి , ధనాన్ని , ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడం వల్ల , సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం , సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి , రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది. పెళ్ళికాని వారు , పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. 


అంతే కాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా , కావడి సమర్ఫించినా సత్సంతాన ప్రాప్తి. రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. 


తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్టి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ , పాలతోనూ నింపుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారు ఝూమున లేచి తలస్నానమాచరించి పాలు , పంచాదారలతో నిండిన కావడిలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తి శ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార , పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయి.


మంగళవారం , శుద్ధ షష్టి , మృగశిర , చిత్త , ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి , సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం , కుజ మంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర , శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ , పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. ఇందువల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.


కాలసర్పదోషం ఉన్నవారికి సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం.. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు,కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది, అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్ర్తీలు పూజలు చేయడం మనం చూస్తూ వుంటాం. సంతానప్రాప్తిని కోరే స్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108 మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి,సర్వశక్తుల్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.

Share:

కుమారస్వామి లీల

తిరుచెందూర్ లో నివసించే ఒక సాధువు వద్ద సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రతిమ ఒకటి వున్నది. ఆ సాధువు నిత్యమూ సముద్ర స్నానం చేసి అడవిలో పూచే రక రకాల పుష్పాలు  కోసుకుని వచ్చి  పూజలు చేస్తూండేవాడు.


ఆ సాధువు  దీర్ఘదర్శి.తనకు అంత్యకాలం ముందే  తెలుసు.  అందువలన తాను మరణించడానికి ముందే  తన దగ్గరున్న మురుగన్ ప్రతిమను  వేరెవరైనా భక్తుడి ఇవ్వాలని కుమారస్వామి  అనుగ్రహించాలని మనసారా ప్రార్ధించాడు.


ఆనాటి రాత్రి కుమారస్వామి ఆ సాధువు కలలో ఒక వృధ్ధునిగా అగుపించి ఆ సాధువుని కొండల్లో గుట్టల్లో ,అడవుల్లో  త్రిప్పాడు . ఒక ఉద్యనవనంలో  ధ్యానంలోవున్న ఒక వ్యక్తిని  చూపి, అతనికి ఆ  దేవుని విగ్రహాన్ని అప్పగించమని చెప్పి అదృశ్యమైపోయాడు.


స్వప్నం లో మురుగన్ తీసుకువెళ్ళిన దిశలో పయనించిన సాధువు కలలో కనిపించిన వ్యక్తిని కలుసుకున్నాడు. తను పూజిస్తున్న పంచలోహ విగ్రహాన్ని అతనికి యిచ్చి  భక్తితో పూజించమని చెప్పాడు.


ఆ వ్యక్థి ఓ పూతోటలో కుమారస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి  పూజించసాగాడు. ఆరంభంలో ఆ తోటలోని చిన్న కుటీరంలో ప్రారంభమైన ఆ ఆలయం కాలక్రమేణా అభివృద్ధి చెంది పెద్ద ఆలయంగా రూపొందింది.


ఈ విధంగా మురుగనే భక్తులకు స్వయంగా స్వప్నంలో ఆనతి యిచ్చి నిర్మించబడిన ఆలయమే  తంజావూరు 

పూక్కారతెరు అనే వీధిలో నిర్మించబడిన సుప్రసిధ్ధ మురుగన్ ఆలయం.


ఈ ఆలయంలోని మురుగన్ కి విశాఖ నక్షత్రం రోజున అభిషేకం చేసి పూజించిన కార్యసిద్ధి లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ధృఢంగా నమ్ముతారు.

Share:

వల్లీ సుబ్రహ్మణ్యుల కళ్యాణం




ఒకానొక సమయంలో నారదమహర్షి కైలాసపర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్న సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్ళారు. లోకములలో తాను చూసిన విశేషములను చెప్పడం మొదలు పెట్టాడు. నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు. ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజయై ఒకపిల్ల అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక భిల్లు నాయకునికి దొరికింది ఆ పిల్లను తీసుకు వచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల పేరు వల్లి. ఆమె రాశీభూతమయిన సౌందర్యము. అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక. ఎప్పుడూ ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి. నువ్వు చూసి భయపడకూడదు సుమా! ఎవరు ఆ పిల్ల వొంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యమును చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు. ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు భిల్లపురానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడికి భిల్లరాజు ఎదురువచ్చాడు. మంచి మంచి పువ్వులు, తేనే, పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు. నారదుడు భిల్లరాజుతో “నీకొక శుభవార్త చెప్తాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్ళి చేసుకో బోయేవాడు లోకంలో యౌవనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో, జగదంబ అందాలు పోసుకున్నవాడు, పరమ సౌందర్యరాశియైన శంకరుని తేజమును పొందిన వాడు, గొప్ప వీరుడు, మహాజ్ఞాని, దేవసేనాధిపతి అయినటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. నీ అదృష్టమే అదృష్టం అన్నాడు. భిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు.


కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీ దేవి వంక చూసి బహుశః బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమునంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు. ‘లతాంగీ నన్ను చేపట్టవా?” అని అడిగాడు. ఆవిడ ఈయన వంక చూసి ‘అబ్బో ఇతడు ఎంత అందగాడో’ అనుకుని నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు.


ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కానీ నా మనస్సు నందు పాపపంకిలమయిన భావం కలుగరాదు. నేను సుబ్రహ్మణ్యుడికి చెందినదానను అనుకుని ‘ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఏదయినా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువల్ల నా మనస్సు ఆయనకు అర్పించబడిందని చెప్పింది. ఆమె అలా చెప్పగానే సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపమును చూపించాడు. ఆ తల్లి పొంగిపోయింది. ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనస్సులో ఎక్కడ ఆ మహానుభావుడు? నేను ఒక్కమాట నోరు తెరిచి చెప్పలేదని ఏడుస్తోంది. చెలికత్తె ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు. ఒక ఆకుమీద ఉత్తరం రాసి ఇవ్వు. నేను పట్టుకుని వెళ్లి ఆయనకు ఇస్తాను అన్నది.


సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు. చెలికత్తె వెళ్లి పత్రం చూపించింది. ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళదామని అన్నాడు. చెలికత్తె అలా వద్దు నేను పిల్లను తీసుకువస్తానని చెప్పి వెళ్లి వల్లీదేవిని తీసుకువచ్చింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా తెల్లారిపోయింది. పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనపడ్డారు. భిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు. వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు. సుబ్రహ్మణ్యుడు హేలగా నవ్వుతూ వాటినన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు. అందరూ క్రిందపడి స్పృహ తప్పిపోయారు. వల్లీ దేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చింది. స్వామివారు అనుగ్రహించేసరికి మరల వారందరికీ స్పృహ వచ్చి లేచారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలివాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు. ఆ భిల్లులందరూ నేలమీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు.


నారదుడు దేవసేనతో, పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వచ్చాడు. నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది. సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో, దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామివారు తిరుత్తణియందు వెలసి ఉన్నారు. సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే మన పాపములన్నీ దగ్ధమయిపోతాయి. వంశాభివృద్ధి జరుగుతుంది.

Share:

అత్తిలి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం






ఏకశిలపై శ్రీ వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహర విగ్రహం. పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడుగా చెప్పుకునే కుమారస్వామి, భూలోకంలోని అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి తన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. వేలాయుధాన్ని ధరించి నెమలి వాహనంతో స్వామి దర్శనమిస్తుంటాడు. కొన్ని ప్రాంతాల్లో ఇలా దర్శనమిచ్చే స్వామి, కొన్ని ప్రదేశాల్లో సర్పాకారంలోనూ..లింగాకారంలోనూ..పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగుబంగారంగా కొలువై ఉంటారు. అందుకు పూర్తి భిన్నంగా స్వామివారి స్వయంభువుమూర్తి కనిపించే క్షేత్రం ఒకటుంది. అదే 'అత్తిలి' సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం.



భక్తుల కొంగు బంగారం.. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధి చెందిన అత్తిలి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి మూర్తి బయటపడిన తీరును ఇక్కడ వారు ఆసక్తికరంగా చెబుతుంటారు.  మరో విశేషం ఏమిటంటే రోజూ గర్భాలయంలోకి సోమసూత్రం గుండా సర్పం స్వామి మూల విరాట్‌ వద్దకు వస్తుందని, అది మరుసటి రోజు ఉదయం బయటకు వెళ్తుందని ఆలయ అర్చకులు చెబుతుంటారు. ప్రతీనెలా ఈ సర్పం గర్భగుడిలో గానీ, చెరువు గట్టుపై గానీ కుబుసం విడిచి వెళ్తుందని, దానిని స్వామి పాదాల వద్ద ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారాని అంటుంటారు. ఇంతటి విశిష్టత ఉన్న ఆలయం.


స్థలపురాణం;-


చాలాకాలం క్రిందట ఇక్కడి చెరువు సమీపంలో ఒక పెద్ద పాముపుట్ట ఉండేదట. దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్లడం .. రావడం చాలామంది చూసేవాళ్లు. అయితే దానిని చూడగానే పవిత్రమైన భావన కలగడం వలన, ఎవరూ కూడా దానికి హాని తలపెట్టలేదు. కాలక్రమంలో చెరువులో నీరు పెరగడం వలన ఆ పుట్ట కరిగిపోయింది.. ఆ పాము విషయాన్ని కూడా అంతా మరిచిపోయారు. కొంతకాలం తరువాత చెరువుకి సంబంధించిన మరమ్మత్తులు చేపట్టగా, గతంలో పుట్ట వున్న ప్రదేశంలో నుంచి ఏకశిలపై శ్రీ వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహర విగ్రహం బయట పడింది అని చెబుతారు. ఈ విగ్రహం సుమారు రెండు అడుగుల ఎత్తుతో స్పష్ట ఆకృతితో తేజరిల్లుతుంటాడు .


అది స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు, ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు. శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ వుంటుంది. స్వామివారి దేహం సర్పంవలె పొలుసులతో కూడి వుండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు.  ఇక్కడ వల్లీ,దేవసేన సమేతంగా చాలా చిన్న విగ్రహ రూపంలో దర్శనం ఇస్తారు. ఆలయ ఆవరణలో స్వామి వారితో పాటు రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి, గణపతి విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి. స్వామి వారికి రోజు చేసే పూజా కార్యక్రమాలతో పాటు షష్టి రోజు చేసే వివిధ రకాల సేవలు ఎంతోగాను ఆకట్టుకుంటాయి. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని స్థానికులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు..


(అత్తిలి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం - అత్తిలి, పశ్చిమ గోదావరి జిల్లా)

Share:

పళని దండాయుధ పాణి స్వామి





🌷పర్వతీనందనా...సుబ్రహ్మణ్యా🌷


శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆరు ప్రఖ్యాతక్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో , మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్యక్షేత్రం పళని.


దండాయుధపాణి..


ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళం వాళ్ళు ఈయనను “పళనిమురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని , కౌపీన ధారియై , వ్యుప్తకేశుడై నిలబడి , చిరునవ్వులొలికిస్తూ ఉంటారు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణమహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్యఅవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” -  అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్ధం. అంటే ఈ పళనిక్షేత్రము జ్ఞానమును ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని ఇక్కడ పళని మందిరంలోని గర్భగుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడినది. ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు. 


ఈ మూర్తిని సిద్ధ భోగార్ అనే మహర్షి చేశారు. తొమ్మిదిరకాల విషపూరిత పదార్ధాలతో (వీటిని నవపాషాణములు అంటారు) చేశారు. పూర్వ కాలంలో ఇక్కడ పళనిస్వామివారి మూర్తిలో ఊరు (తొడ) భాగము వెనుకనుండి స్వామివారి శరీరంనుండి విభూతి తీసి కుష్ఠరోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే , వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా ఇవ్వగా , స్వామివారి తొడభాగం బాగా అరిగి పోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామివారిని వెనుకనుండి చూస్తే ఇది కనబడుతుందని పెద్దలు చెప్తారు. కాని మనకి సాధారణంగా ఆ అవకాశం కుదరదు


ఇక్కడ స్వామివారిని ఈ క్రింది నామాలతో స్తుతిస్తూ ఉంటారు. కులందైవళం , బాలసుబ్రహ్మణ్యన్ , షణ్ముఖన్, దేవసేనాపతి , స్వామినాథన్ , వల్లిమనలన్ , దేవయానైమనలన్ , పళనిఆండవార్ , కురింజిఆండవార్, ఆరుముగన్ , జ్ఞానపండిత , శరవణన్ , సేవర్ కోడియోన్ , వెట్రి వేల్ మురుగా ...మొదలైన నామాలు ఎన్నో ఉన్నాయి స్వామికి ఇక్కడ ఇప్పుడు ఉన్న మందిరం సామాన్య శకం ఏడవ శతాబ్దంలో కేరళరాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పండ్యులకాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధిచేయబడింది. ఇంకొక విషయం ఏమిటంటే,పళనిలో కొండపైకి ఎక్కడానికి రెండుమార్గాలు ఉంటాయి. 


ఓపిక ఉన్నవారు మెట్లమార్గంలో వెళ్లడం ఉత్తమం. మెట్లు కాకుండా , రోప్ వే లాంటి చిన్న రైలుసౌకర్యం కూడా ఉంది. దీనికి టికెట్ యాభైరూపాయలు. ఒక సారి వెళ్ళడానికి బావుంటుంది. (ఓపిక లేకపోతే ప్రతీ సారి)..


పళనిక్షేత్ర స్థలపురాణము:..


పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని , పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మన బొజ్జవినాయకుడిని , చిన్ని సుబ్రహ్మణ్యుడిని పిలిచి ఈ భూలోకం చుట్టి ( అన్ని పుణ్య నదులలో స్నానం ఆచరించి  ఆ క్షేత్రములను దర్శించి రావడం) ముందుగా వచ్చిన వారిని విఘ్నములకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెప్తే , 


అప్పుడు పెద్దవాడు , వినాయకుడు యుక్తితో ఆదిదంపతులు , తన తల్లిదండ్రులు అయిన ఉమామహేశ్వరుల చుట్టూ మూడుమార్లు ప్రదక్షిణ చేస్తారు. మన బుజ్జిషణ్ముఖుడు తన యొక్క

నెమలివాహనముపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. కాని , వినాయకుడు


“తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణచేస్తే సకలనదులలోనూ స్నానంచేసిన పుణ్యం వస్తుంది” అనే సత్యము తెలుసుకుని , కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల , సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు  వెళ్ళినా , అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈ కథ మనకు అందరకూ తెలిసినదే కర్తికేయుడు శివకుటుంబంలో చిన్నవాడు కదా , దానితో కాస్త చిన్నమొహం చేసుకుని, అలిగి ,కైలాసం వదిలి , భూలోకానికి వచ్చి ఒక కొండశిఖరంమీద నివాసం ఉంటాడు . ఏ తల్లిదండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదా , అందులోనూ చిన్నవాడు, శివపార్వతుల అనురాగరాశి గారాలబిడ్డ అయిన కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా!శివపార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండశిఖరం వద్దకు వస్తారు*. ఆ కొండశిఖరం ఉన్న ప్రదేశమును తిరుఆవినంకుడి అని పిలుస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని , “ నువ్వే సకలజ్ఞానఫలానివి నాన్నా” అని ఊరడిస్తారు. 


స్కలజ్ఞానఫలం (తమిళంలో పలం), నీవు (తమిళంలో నీ) – ఈ రెండూ కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడు అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతముగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తారు. సుబ్రహ్మణ్యక్షేత్రాలలో జరిగే “కావడి ఉత్సవం” మొట్టమొదట ఈ పళని లోనే ప్రారంభం అయ్యింది కావడిఉత్సవము..


ఇడుంబన్ వృత్తాంతం..


సుబ్రహ్మణ్యస్వామివారి యొక్క గొప్ప శిష్యులలో అగస్త్యమహాముని ఒకరు  అగస్త్యమహాముని స్వామి దగ్గరనుండి సకలజ్ఞానము పొందారు అగస్త్యమహర్షికి ద్రవిడ వ్యాకరణము సుబ్రహ్మణ్యస్వామివారే నేర్పారు. పూర్వము                      దేవదానవయుద్ధములో చాలామంది దానవులు నిహతులైపోయారు. కాని అందులో ఇడుంబన్ అనే ఒక రాక్షసుడు మాత్రం అగస్త్యమహర్షిపాదములు పట్టుకున్నాడు.


అగస్త్యుడు సంతోషించి , వీడిలో మిగిలిపోయిన కొద్ది రాక్షసభావాలు తొలగించాలి* *అనుకున్నారు. సాధారణంగా ఎవరైనా పెద్దలు తనవల్ల కాని పని ఉంటే , తన గురువుకి అప్పచెప్తారు. వడు రాక్షసుడు కదా అని సంహరించడం కాదు , వీడిలో ఉన్న ఆసురీగుణములను తీసివేయాలి అని తలచి , లోకంలో ఆదిగురువు దక్షిణామూర్తి , శంకరుడు ఉండేది కైలాసంలో కదా , అందుకని ముందు అక్కడికి పంపిద్దాము అనుకుని ఇడుంబుడిని పిలిచి ,


“ఒరేయ్ నేను కైలాసంనుండి రెండుకొండలు తెద్దామని చాలాకాలంనుండి అనుకుంటున్నాను , వాటిని శివగిరి , శక్తిగిరి అంటారు. నువ్వు వెళ్లి ఆ రెండుకొండలను , ఒక కావిడిలో పెట్టుకుని నేను ఉన్న చోటికి తీసుకురా” అని ఆజ్ఞాపించారు సరే ఇడుంబుడు , వంట్లో ఓపికుంది కదా , కైలాసం వెళ్లి ఆ రెండుకొండలను తన కావిడిలో పెట్టుకుని బయలుదేరతాడు. ఈ రాక్షసుడి ఆసురీత్వం పోగొట్టడం , జ్ఞానరాశి అయినటువంటి మా సుబ్రహ్మణ్యుడు చేస్తాడులే అనుకుని శంకరుడు ఇడుంబుడిని వెళ్ళనిస్తాడు. ఇక్కడ స్వామి పళనికొండమీద చిన్నపిల్లవాడిగా ఉన్నారు , ఇడుంబుడు దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళనిదగ్గరకి వచ్చేసరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి , కాసేపు క్రిందపెట్టి సేదదీరాడు.


మళ్ళీ కావిడి ఎత్తుకుందామని క్రిందకి వంగి కావిడిబద్ద భుజంమీద పెట్టుకుని లేచి నిలబడి , రెండు వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుదామని చూస్తే ఒక వైపు ఎక్కువ బరువు , ఇంకో వైపు తేలిక అవుతోంది కాని , సమానంగా ఎంతసేపటికీ కుదరట్లేదు. ఇంక విసుగొచ్చి , ఏమిటిరా ఈ కావిడి అనుకుని , అలా పైకి చూస్తాడు ఇడుంబుడు. పైకి చూడగానే అక్కడ సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో పకపక నవ్వుతున్నారు.  ఇది చూసి  ఇడుంబుడికి కోపం వచ్చింది. ఇదే రాక్షస ప్రవృత్తి అంటే , ఏదో చిన్న పిల్లవాడు నవ్వుతున్నాడులే అనుకోవచ్చు కదా. స్వామికేసి తిరిగి “ఏమిటా నవ్వు , నేనేమైనా ఈ కావిడి ఎత్తలేనని అనుకుంటున్నావా ? కైలాసం నుంచి తీసుకొచ్చాను. ఏమిటా వెర్రి నవ్వు , నిన్ను చంపేస్తాను ఇవ్వాళ అని ఆ కొండ మీదకి పరిగెత్తాడు. తెలిసి పరిగెత్తాడో , తెలియక పరిగెత్తాడో పళనికొండ మీదకి పాదచారియై వెళ్లాడు. పైకి వెళ్ళాక , స్వామి రెండుగుద్దులు గుద్దారు , ఇంక ప్రాణం వదిలేస్తున్నాను అన్నప్పుడు వాడికి తెలిసింది  ఈ పిల్లవాడు సామాన్యుడు కాదురా , మా గురువుగారికి (అగస్త్యుడు) గురువు , సాక్షాత్తు ఈశ్వరపుత్రుడు అని అప్పుడు “ఈశ్వరా తెలుసుకోలేక పోయాను , మీ చేతి గుద్దులు తిన్నాను , నాకు వరం ఇవ్వండి” అని వేడుకున్నాడు. ఏమిటో అడుగు అన్నారు స్వామి.


ఇడుంబుడు  “స్వామీ , నేను ఈ పళనిలోనే కదా , కావిడి ఎత్తలేకపోయాను , ఈ కావిడి వల్లనే కదా , మిమ్మల్ని చేరడానికి మార్గం అయ్యింది ,  అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుడిని ఏ ఆరాధనా చెయ్యకపోయినా , ఒక్క సారి కావిడి పాలతో కాని ,  విభూతితో కాని , పూలతో కాని , తేనెతో కాని , నేతితో కాని భుజం మీద పెట్టుకుని , మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరకి వెళ్ళిపోతున్నాం అని పాదచారులై నీ గుడికి వస్తే , అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన , శాస్త్రంలో ఎన్ని విధాలుగా చెయ్యాలని ఉందో , అంత ఆరాధనా చేసిన ఫలితం వాళ్లకి ఇచ్చేసేయ్యాలి” అన్నాడు.. స్వామి అనుగ్రహించి సరేనని ఆ కోరికని కటాక్షించి , ఇక పై నా దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా ముందు నీ దర్శనం చేసి నా వద్దకు రావాలని వరం ఇచ్చారు అందుకే అప్పటి నుంచి అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో (ప్రత్యేకం గా తమిళనాడులో) స్వామి వారిని చేరే మార్గంలో ఇడుంబుడి మూర్తి ఉంటుంది , అక్కడ ఆయనకు నమస్కరించిన తరువాతే , సుబ్రహ్మణ్యుని దర్శనము చేసుకుంటారు సుబ్రహ్మణ్య కావడిలు..

అప్పటి నుంచి , తమిళదేశం వాళ్ళు సుబ్రహ్మణ్యకావిళ్ళు ఎత్తి సుబ్రహ్మణ్యుడిని తమ దైవంచేసేసుకున్నారు. 


అంతే కాక , ప్రతీ ఏటా స్కందషష్ఠి ఉత్సవాలలో ఏ దంపతులైతే , భక్తితో , పూనికతో స్వామికి నమస్కరించి ఈ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్లకి తప్పక సత్సంతానప్రాప్తి కలుగుతుంది. వారి వంశంలో సంతానము కలగకపోవడం అనే దోషం రాబోయే తరాలలో ఉన్నా కూడా ఆ దోషపరిహారంచేసి స్వామి అనుగ్రహిస్తారు అని పెద్దలు చెప్తారు.


అంతటి శక్తివంతమైన క్షేత్రం , తప్పకుండా అందరూ చూడవలసిన క్షేత్రము పళని. పళని దండాయుధపాణిస్వామివారి దర్శనం చేసి , జీవితంలో ఒక్క సారైనా సుబ్రహ్మణ్య కావిడి ఎత్తి సుబ్రహ్మణ్య అనుగ్రహమును పొందగలమని ఆశిద్దాం..

Share:

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలు







శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలతో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషం.


ఆంద్రప్రదేశ్ లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖల స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది.


తిరుచందూర్..

సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్ లో ఉంది. సరన్ అనే రాక్షస రాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్ లో కొలువై నిలిచారట. తిరుచందూర్ లోని సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రహం కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం.


స్వామిమలై..

స్వామి మలై అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రమణ్యస్వామి జ్ఞానోపదేశము చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు.


పళని..

ఆంద్రప్రదేశ్ లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి వుందో తమిళనాడులో పళవి క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళవిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.


తిరుత్తణి..

తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రంలోనూ విశేషమైన దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లిని సుబ్రమణ్యస్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి.


పరిముదిర్ చోళై..

దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన ఈ క్షేత్రం కూడా సుబ్రమణ్యస్వామి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. పైన పేర్కొన్న క్షేత్రాలే కాకుండా తమిళనాడులోని చాలా ప్రదేశాల్లో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.


తిరువరన్ కున్రమ్..

తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు కొలువైన మధురైకు సమీపంలోనే ఈ తిరుపరన్ కున్రమ్ క్షేత్రం కూడా కొలువై ఉంది. తన ఇద్దరూ భార్యలలో ఒకరైన దేవసేనను సుబ్రమణ్యస్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే తిరుపరన్ కున్రమ్.

 

Share:

నేడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి (కుక్కీ సుబ్రహ్మణ్య షష్ఠీ)


శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు అనే మొదలగు పేర్లుతో పిలవబడుతున్నాడు.


తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్దషష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. 


ఈ మార్గశిర షష్టినే సుబ్రహ్మణ్య షష్టి లేదా స్కంద షష్టిగా పిలుస్తారు. చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, అని కూడా అంటారు. 


*దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గాను వ్యవహరిస్తారు. ఆ రోజు శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు, కావడి ఉత్సవం అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.*


పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావు లేని వరం పొందాడు. దీంతో తాను అజేయుడునని, అమరుడునని వర గర్వంతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు. వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుని వల్లే తారకాసురుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవుని వద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకోమని సెలవిచ్చారు. అంతట దేవతలు పరమశివుని వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులయ్యారు.


*_పురాణగాథల ప్రకారం.._*


కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు. కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది.


పూర్వం మూడులోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న"తారకా సురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు విష్ణువును శరణువేడారు.


అప్పుడు ఆ విష్ణువు వారితో ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి, ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు.


దేవతలు శివున్ని ఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్నసమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు.దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన తేజము ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు అంతట ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు.


ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు


కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.


అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి ఆరు రోజుల పాటు 

భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు.


సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి తలంటు స్నానమాచరించి పాలు, పంచాదారలతో నిండిన కావిడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తిశ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడులో విశేషంగా ఆచరణలో ఉన్నది.


స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్ఫించినా సత్సంతాన ప్రాప్తి. రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం.


అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శిస్తుంటారు. ఈ రోజు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం. స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకలశుభాలు కలుగుతాయని ప్రతీతి.


సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం లో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది.


మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని,ఆర్ధిక స్తోమతలేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని, దానం చేయమని సందేశం ఇస్తుంది.


ఈ దానాలు చేసిన వారికి గ్రహ భాదలు తోలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా "పరోప కారం మిధం శరీరం" అని భావించి పేదవారికి స్వేటర్లు, కంబళ్ళు, దుప్పట్లు మొదలగు చలి నుండి రక్షించే దుస్తులను, తిను బండారాలను దానం చేయాలని తెలుపుతున్నాయి.


ॐ _ఓం శ్రీ శరవణభవ..🙏

Share:

నేడు నాగ పంచమి






ఈ సంవత్సరం నవంబర్ 28వ తేదీన అంటే సోమవారం నాడు మార్గశిర శుద్ధ నాగ పంచమి వచ్చింది. ఇంతకు పూర్వం నాగుల చవితి రోజున ఎవరైతే పూజలు చేయలేకపోయారో అలాంటి వారంతా ఈ పవిత్రమైన రోజున నాగ దేవతలకు పూజలు చేస్తే కాలసర్ప దోషం నుంచి కచ్చితంగా విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. పురాణాల ప్రకారం, నాగ పంచమి రోజున ఆది శేషుడిని బ్రహ్మదేవుడు ఆశీర్వదించిన రోజుగా పరిగణిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ మాసం నుంచే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలోనే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ కాలం ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ సందర్భంగా మార్గశుద్ధ పంచమి రోజున నాగ దేవతలకు పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. ఈ సందర్భంగా ఆ విశేషాలేంటో మీరూ చూసెయ్యండి.


హిందూ క్యాలెండర్ ప్రకారం, మార్గశిర శుక్ల పంచమి తిథి నవంబర్ 27వ తేదీ ఆదివారం సాయంత్రం 4:25 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి మరుసటి రోజు అంటే నవంబర్ 28వ తేదీన మధ్యాహ్నం 1:35 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం సోమవారం నాడు మార్గశిర నాగ పంచమిని జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున ఏదైనా శుభకార్యాలు ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.


ఈ పవిత్రమైన రోజున తెలుగు రాష్ట్రాల ప్రజలు శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు గ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల కాల సర్పదోషాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయని భక్తులంతా విశ్వసిస్తారు. మరోవైపు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి వారికి అభిషేకాలు, అలంకారాలు చేయించిన వారికి డబ్బుల బాధ నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది విశ్వసిస్తారు.


* మార్గశిర శుద్ధ నాగ పంచమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి.

* స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజా గదిలో లేదా ఏదైనా దేవాలయానికి వెళ్లి దీపారాధన చేయాలి.

* ఈ పవిత్రమైన రోజున శివలింగానికి జలాభిషేకం చేయాలి.

* అనంతరం నాగ దేవతలను పూజించాలి. నాగ దేవుళ్ల(సర్పాల)కు పాలు సమర్పించాలి. చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి.


నాగ పంచమి రోజున పగలంతా ఉపవాసం ఉండాలి. నాగ దేవతలకు ఇంట్లో గోధుమలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. ఇలా చేసిన వారికి సకల బాధల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సంతాన సమస్యలతో బాధపడే వారు నాగ పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు రావడంతో పాటు నాగ దోషాలన్నీ తొలగిపోతాయి. రాహు, కేతు ప్రభావం కూడా తగ్గుతుంది.

Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List