November 2018 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

మహిమాన్విత సంగమేశ్వర స్వామి..


ద్వాపర యుగములో కౌరవులు పన్నిన మాయా జూదములో పాండవులు పరాజితులైరి. తత్ఫలితముగ పరిసర అరణ్యములో ఆశ్రమము నిర్మించుకొని నివసించుచుండిరి. వారిని మరింత మనస్తాపాలకు గురిచేసి అవమాన పరచాలని, కనివిని ఎరుగని, అట్టహాసాలను తమ భోగ భాగ్యములను వారి ముందు ప్రదర్శించాలనే తలంపుతో ‘‘ఘోషయాత్ర’’ నెపముతో బయలుదేరిరి. మార్గమధ్యములో గంధర్వులు, కౌరవులను తమ శత్రువులుగా భావించి సంగ్రామ మొనరించి కురువీరులందరినీ పట్టి బంధించిరి.
దుష్ట చతుష్టయమును (దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసన) రథములకు కట్టి గంధర్వ లోకమునకు కొనిపోవుచుండ, విషయము తెలిసిన పాండవాగ్రజుడు అక్కడనే యున్న భీమార్జునులను కౌరవ వీరులందరిని బంధవిముక్తులను గావించిరండని ఆనతిచ్చెను. తత్ఫలితముగ కురువీరులు చెరనుండి వీడి ఘోర పరాభవముతో హస్తినాపురికి చేరిరి.
విషయము తెలిసిన వాసుదేవుడు, పాండవులను చేరి మీరు ఇక్కడ నుంచి బహుదూరములో నున్న దండకారణ్యములో కొంతకాలము గడిపిరండని ఆదేశించాడు. మురారి కోరిక మేరకు దండకారణ్యములో ప్రవేశించిరి. ఆ దండకారణ్యము భయంకర క్రూర జంతు సమూహములతో, మిక్కిలి భయంకరమైన వృక్షావరణతో, వివిధ రకములైన దృశ్యాలతో, మనస్సుయ్యాలలూగు శోభలతో తన్మయపరచు శక్తి సామర్థ్యములు ఆ అటవి ప్రాంతమునకు కలదు. గలగల పారు జలపాతములు, హృదయానందమును కలిగించును. ఇట్టి ప్రాంతము రాక్షసులకు నిలయము. అట్టి అరణ్య ప్రాంతములో సంచరిస్తు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు. అక్కడి ప్రజలను ఆదరిస్తూ, వారి వారి మన్ననలను పొందుతూ సంచార జీవితము గడుపుతున్నారు. అలా సంచరిస్తూ మనసులను ఆహ్లాదపరచే జల విన్యాసములతో అలరారుచున్న కృష్ణ, తుంగభద్రల సంగమము (కూడలి) చేరుకున్నారు.
ప్రకృతి సుందర దృశ్యములు, వివిధ చిత్ర విచిత్ర జీవరాసులు స్వేచ్ఛగా తిరుగుతూ, పరస్పర చెలిమి కలిగి సంచరించుచుండెడివి. ఆ ప్రదేశము వారిని తన్మయులను చేసింది. తాత్కాలిక పర్ణశాల నిర్మించుకొని కృష్ణ తుంగభద్రల కూడలిలో నిష్కాములై ఆనంద పారవశ్యములో తమకు సంభవించిన కష్టములను, బాధలను, అవమానములను సర్వమును మరచి సుఖ జీవితమును సాగించారు పాండవులు. కాలచక్రము తిరుగుచుండ ఒకనాడు ధర్మరాజు పత్నీ సమేతుడై, సోదరులను కూర్చుండబెట్టుకుని, ఇంత సుందర ప్రదేశము మన జీవితములో సుస్థిరముగా నిలిచిపోతుంది. ఇక్కడ రెండు నదుల సంగమము (కూడలి) కావున సంగమేశ్వరుని ప్రతిష్టించి పూజలు చేసి తరించాలని కోరికను వెల్లడించాడు. అగ్రజుని కోరిక నెరవేర్చదలచిన భీమసేనుడు, శక్తిసామర్థ్యములతో కాశి క్షేత్రము చేరి అన్నపూర్ణ, విశ్వనాథస్వాముల ప్రార్థన చేసి అక్కడనున్న ఒక పవిత్ర శివలింగమును తీసుకొని ఆఘమేఘాలమీద కృష్ణా, తుంగభద్రల సంగమమునకు చేరుకున్నాడు. పాండవులు సకల పూజా ద్రవ్యాలు సేకరించి రెండునదుల కలయిక గట్టుపై ఆ శివలింగమును ప్రతిష్టించి, పూజా కార్యక్రమములు సాగించిరి. కొంతకాలము పాండవుల పూజలందుకున్నాడు ఆ సంగమేశ్వరుడు. మీకు విజయములే కాని అపజయములుండవని ఆ సంగమేశ్వరుడు వక్కాణించాడు. పాండవులు అక్కడి నుంచి శ్రీశైల క్షేత్రము వెళుతూ, సంగమ దేవా- ఈ సంగమములో స్నానము చేసి మిమ్ముల దర్శించిన వారినందరిని కాపాడుము. వారి వారి కోరికలను తీరుస్తూ జీవితములు ధన్యము చేయమని ప్రార్థించిరి. తథాస్తు అంటూ పలికాడాభక్త సులభుడు ఈశుడు. అట్టి సమయంలోనే బసవేశ్వరుడను మహాను భావుడు ఉదయంచి అంతరించిపోతున్న మానవ సంస్కా రాలను,్ధర్మాన్ని ప్రోది చేయనారంభించాడు
ఆ తరువాత ఆ సంగమేశ్వరుని చాళుక్యరాజులు కృష్ణా, తుంగభద్రల సంగమమును దర్శించినారు.
తన్మయులైనారు. ఆనంద పారవశ్యులైనారు. ప్రకృతి సుందర దృశ్యాలు ఆ నదులు ఏకమై ఒకే నదిగా ప్రవహిస్తూ అలరింపజేస్తున్న ఆ సుందర దృశ్యములకు ముగ్ధులైనారు. ఆ స్థల విశిష్టతను వౌఖికముగ ప్రచారములోనున్న పురాణ, జానపదుల కథలను విన్నారు. సంగమేశ్వరుని చూడాలని ఆయన అనుగ్రహం పొందాలని వారు తహతహలాడారు.
వారు కోరుకున్న విధంగానే ఆ సంగమేశ్వరుడు వారి స్వప్నములో సాక్షాత్కరించి శాశ్వత గుడి నిర్మాణము చేయమని ఆదేశించారు. ఆ దేవ దేవ సంకల్పమే చాళుక్యులు స్థిరమైన ఆలయము నిర్మించి, పూజలు, వ్రతాలు, దీక్షలు చేసి తమ జన్మలు ధన్యము చేసుకున్నారు. ఆ సంగమేశ్వరుని నిత్య పూజ దూప దీప నైవేద్యములకు భూదానాలు చేసినట్లు చారిత్రక ఆధారములున్నవి.
నాటి నుంచి నేవరకు భక్త జన సందోహము శివ శివ నామస్మరణతో, వీరభద్రుని ఖడ్గాలతో వివిధ మంగళ వాయిద్యాలతో సంగమేశ్వరుడు సర్వజనా హృదయాలలో తేలియాడేవారు. కూడలిలో పవిత్ర స్నానాదులు చేసి, ఉపవాసము చేస్తూ, రాత్రి అంతయు శివకీర్తనలు, నాటకములు, కోలాటములతో తన్మయులై జాగరణ చేసి, తిరిగి స్నానములు చేసి దూప దీప నైవేద్యములు సమర్పించి తమతమ జీవితములు ధన్యము చేసుకొంటున్నారు.
పురావస్తుశాఖవారు సంగమేశ్వరాలయాన్ని కడు జాగ్రత్తతో ఆలయ శిలలను తొలగించి తమ చాకచక్యముతో అలంపుర క్షేత్రములో కూడలి దగ్గర (సంగమము) ఎలా యున్నదో అలానే చూడముచ్చటగా నిర్మించి, వేద పండితులతో సంగమేశ్వరుని పునఃప్రతిష్టించారు.
ఇప్పుడు కూడ ఆనాటివలె జంగమయ్యలు నిత్య దూప దీప నైవేద్యములతో పూజలాచరిస్తున్నారు. బాలబ్రహ్మేశ్వరుని, జోగుళాంబ దేవాలయాల ప్రతిష్ట కూడా అక్కడే జరిగాయ. కాని కిటకిటలాడే భక్తజనసందోహం తగ్గింది. అయనప్పటికీ కొద్ది మంది మాత్రమే నిత్యము దర్శించుకుంటూ తమ జీవనము ధన్యము చేసుకుంటున్నారు. సర్వా భీష్టప్రదాకుడైన ఈశ్వరుడిని ప్రతివారూ దర్శించి పునీతులు కావాలి.
ఎలా చేరుకోవచ్చు..???
కర్నూలు నుండి అలంపురం బస్సులో ప్రయాణించాలి. పిమ్మట అక్కడినుండి కాలినడకన లేక గుఱ్ఱము బండ్ల మీద ప్రయాణించి నేరుగా సంగమేశ్వరము చేరుకోవచ్చును.
పాలమూరువాసులు వయా నాగర్‌కర్నూలు ద్వారా కొల్లాపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలి. తర్వాత చెల్లెపాడు బస్సులో ప్రయాణించి అయ్యవారిపల్లెలో దిగాలి. అక్కడి నుంచి కాలినడకన లేక బాడుగ ఎద్దుల బండ్లు కట్టించుకొని 2 కిలోమీటర్లు దూరము పయనించి సంగమేశ్వరం చేరుకోవచ్చును.
కర్నూలు జిల్లాలో ప్రసిద్ధిపొందిన ఆత్మకూరు, తాలూక, నందికొట్కూరు తాలూక ప్రజలు సమీపంలో నెహ్రూనగర్ లేక నాటూరు కొణిదేలకు చేరుకుని, అక్కడి నది ఒడ్డునుంచి పడవలలో ప్రయాణించి చేరవచ్చును. వేసవి కాలంలో అయితే పాద నడకన నదిని దాటి ఆ క్షేత్రాన్ని దర్శించవచ్చు.

Share:

గంధర్వపురి దేవాలయ అద్భుతం.


గంధర్వసేన సామ్రాజ్యంలోని గంధర్వపురిలోని ఈ దేవాలయం గంధర్వసేను దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ గంధర్వసేనుడు ఉజ్జయిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన విక్రమాదిత్యుని తండ్రి.
ఈ దేవాలయంలో ఓ పవిత్ర పాము గర్భగుడి కింది భాగంలో నివసిస్తుండగా, ప్రతి రాత్రి కొన్ని ఎలుకలు ఆ పాము చుట్టూ తిరుగుతున్నాయి. ఇలా చేయడం ద్వారా అవి పాముకు పూజలు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ దృశ్యాన్ని ఎవరూ ప్రత్యక్షంగా చూడనప్పటికీ, ప్రతిరోజూ ఉదయం పాము మలం పక్కనే ఎలుకల మలం ఉండటాన్ని చూస్తున్నారు. దీనికి కారణమేమిటనే విషయం ఇంతవరకు వెలుగు చూడలేదు. ఈ ప్రదేశాన్ని పలు పర్యాయాలు శుభ్రపరిచినప్పటికీ, మళ్లీ అదే రీతిలో అక్కడ మలం చేరుతోంది.
ఈ దేవాలయంలో గంధర్వసేనుడి విగ్రహం ఏర్పాటు చేశారు. మాల్వా ప్రాంతంలో ఆయనను గార్ధభిల్‌గా పిలుస్తున్నారు. అయితే రాజుకు సంబంధించి భిన్న కథనాలు విన్పిస్తున్నా, ఈ ప్రాంతానికి సంబంధించిన కథ మాత్రం కొంత అసాధారణంగా ఉంది. ఈ దేవాలయాన్ని ఏడెనిమిది ఉప భాగాలుగా విభజించారని ప్రజలు విశ్వసిస్తున్నారు. దేవాలయ మధ్య భాగంలో రాజు విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రధాన దేవాలయం మినహా ఇందులో పలు భాగాలు కాలంతో పాటు దెబ్బతిన్నాయి.
పూజారి మహేష్ కుమార్ కథనం ప్రకారం... దేవాలయంలో పురాతన కాలంలో పుట్ట ఉండేదని, ప్రజలు కూడా ఇక్కడికి సమీపంలోని నది వద్ద, గుడి పక్కన అడవిలోనూ పాములు చూశారని తెలిపారు. అయితే దేవాలయ ప్రాంగణంలోనే ఎలుకలు ఉండటం ఆశ్చర్యకరంగా ఉంది. ఆ పాము దేవాలయ సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తోందని తమ ముత్తాతల ద్వారా తెలుసుకోగలిగామని వారు చెబుతున్నారు. చిన్న తనం నుంచే ఈ అద్భుతం చూస్తున్నామని స్థానికులైన కమల్‌సోని, కేదార్‌నాథ్‌సింగ్‌లు చెబుతున్నారు. ఈ పసుపు రంగు పాము పన్నెండు అడుగుల పొడవు కలిగి ఉందన్నారు. మరో గ్రామస్తుడైన రమేష్ చంద్ర జాలాజీ దఈ పాము తమకు గర్వకారణంగా ఉంటోందని చెప్పారు.
ఎలుకలలాగే ఈ దేవాలయ ప్రాంగణాన్ని సోమావతి నది కూడా చుట్టుముడుతోంది. గ్రామ పెద్ద విజయ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఈ సంప్రదాయం వేల సంవత్సరాల నుంచి వస్తోందన్నారు. దేవాలయ ప్రాంగణంలో అడుగుపెడితే బాధలు, పాపాల నుంచి ప్రతి ఒక్కరికీ విమోచనం లభిస్తుందన్నారు. ఈ దేవాలయ ధ్వజస్తంభం పార్మార్ హయాంలో నిర్మించగా, దేవాలయ ఆధారం బుద్ధుడి కాలంలోనే ఏర్పాటు చేసినట్టు విశ్వసిస్తున్నారు.

Share:

కాకతీయుల ఇలవేల్పు...శ్రీ భద్రకాళి..


వరంగల్‌-హన్మకొండ ప్రధాన రహదారిపై పాలి టెక్నిక్‌ కాలేజీ నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరాన... గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంత మైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది భద్రకాళీ అమ్మవారు. ఈ దేవాలయంలో దేవి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండు వగా అలరారుతూ, భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు ప్రేతా సనాసీనయై ఉన్నది. కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గం, ఛురిక, జపమాల, డమ రుకం... ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలం, ఛిన్నమస్తకం, పానపాత్రలు ధరించి... 8 చేతులతో... అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయం.
కాకతీయ రాజు ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగార మై వారి కోర్కెలను తీరుస్తూ ఉన్నట్లు... ‘పతాపరుద్ర చరిత్రము’, ‘సిద్ధేశ్వర చరిత్రము’ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఒకనాడు సుదర్శనమిత్రుడనే పండితుడు నూరుగురు విద్వాంసులు కొలువగా ఏనుగుమీద ఎక్కి ఏ కశిలానగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువు కూటానికి వచ్చానని చెప్పాడట. అది విన్న వి ద్వాంసులు అతనిని అవమానపరచి పంపివే శారు. దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు, ఆ వి ద్వాంసులను ఎలాగైనా జయించాలనే ఉద్దేశం తో ఈ వేళ కృష్ణచతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా? అని ప్రశ్నించాడట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకం టే, ఔనంటే సుదర్శనమిత్రుని వాదం అంగీక రించినట్లు అవుతుంది.
కాదంటేనే అతనిని ఓ డించినట్లవుతుంది అని నిర్ణయించి, రేపు పౌర్ణమి అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండిది. ఆ సంకట స్థితి నుంచి తమ ను రక్షించుకోటానికి ఆ విద్వాంసుల లో ప్రధానుడైన శాఖవెల్లి మల్లికార్జు న భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళీదేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటనే నిలుపుతానని వరమిచ్చిందట. మరునాటి రా త్రి నిండు పు న్నమిలాగా వెలుగొందిన చం ద్రుని చూసి, సు దర్శనమిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట. ఇది కేవలం దైవీశక్తి కాని, మానవశక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయా డట. ఆ విధంగా శ్రీ భద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం ఆనాటి నుంచే కనిపిస్తుంది. ఈ వృత్తాంతంలో పేర్కొన బడిన శాఖవెల్లి మల్లికా ర్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోనివా డు. కనుక ప్రతాపరుద్రుని కాలంనాటికే భద్ర కాళీ దేవాలయం ప్రసిద్దమై ఉండినట్లు స్పష్టమవుతుంది.
క్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంత రం ఈ దేవాలయం ప్రాభవాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. అదీ కాక హైదరాబాదు సంస్థానంలో సాగిన గో ల్కొండ నవాబుల పాలన, రజాకార్ల దుశ్చర్య ల ఫలితంగా దాదాపు క్రీ.శ. 1950 వరకూ ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు. 1950లో ఒకరోజు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేష్‌ శాస్ర్తి, స్థానిక శ్రీవైష్ణవ పం డితులు శ్రీమాన్‌ ముడుంబై రా మానుజా చార్య నగరంలో ఉ న్న ఒక ప్రముఖ వ్యాపారి మగన్‌లాల్‌ సమేజా గారి వ ద్దకు ఆలయ పునరుద్ధర ణకు సహకరించవలసిం దిగా కోరడానికి మరునాడు ఉదయం వెళ్దామ ని నిశ్చయించుకున్నారు.
అదే రాత్రి శ్రీమగన్‌ లాల్‌ సమేజా గారికి అమ్మవారు కలలో కనప డి రేపు నీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు వా రితో పాటు నువ్వు నా దేవాలయానికి వచ్చి న న్ను సేవించు అని అమ్మవారు ఆదేశించిందటమరునాడు ఉదయం తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులను దేవదూతలుగా భావించి ఆ వ్యాపారి ఆలయానికి వచ్చి అమ్మ వారిని దర్శిం చి నా కుమార్తెకు పడిపోయిన మాట తిరిగి వస్తే ఆలయ పునురుద్దరణకు నావంతు సహ కారం అందిస్తానని శాస్ర్తి గారికి మాట ఇవ్వగా శ్రీ గణేశ శాస్ర్తి గారు ప్రతిని త్యం అమ్మవారికి అభిషేకించిన జలాన్ని ఒక మాసం వరకు క్ర మం తప్పకుండా శ్రీమగన్‌ లాల్‌ సమేజా గారి కూతురికి తీర్థం పెట్టడం ద్వారా ఆమెకు పో యిన కంఠస్వరం తిరిగి వచ్చింది.
అమ్మవారి కి మహిమకు ముగ్ధుడైన శ్రీమగన్‌లాల్‌ సమే జా ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకు న్నారు. ఆ సందర్బంలో ఆయనకు శ్రీ విద్యా నిధియైన బ్రహ్మశ్రీ హరి రాధాకృష్ణమూర్తి, తాండ్ర వెంకటరామనర్స య్య, అడ్లూరి సీతా రామశాస్ర్తి, వంగల గురువ య్య, టంకసాల నరసింహారావు, మహాతపస్వి ని మంగళాంబి క ఇలా ఎంతోమంది మహనీ యులు ఎందరో చేసిన సహకారం చిరస్మరణీయం.
ఆలయ నిర్మాణ విశేషాలు...
శ్రీ భద్రకాళీ దేవాలయము క్రీ.శ.625 లోనే నిర్మించిపబడిందని స్థానికుల కథనం. వేంగీ చాళుక్యులపైన విజయం సాధించటానికి, ప శ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి ఈ ఆ లయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించి నట్లు చెబుతారు. అందుకు ఆధారం అమ్మవా రి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిలమీద చెక్క బడి ఉండటమే. ఈ విధంగా ఏకాండ శిలలో విగ్ర హం చెక్కటం చాళుక్య సంప్రదాయంలో కనిపి స్తుంది. రెండవది ఈ ఆలయ నిర్మాణా నికి నిలిపిన మూలస్తంభాలు చతురస్రాకారం లో ఉన్నాయి. కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకా రంలో కనిపిస్తుంది. ఆ కారణాల వల్ల ఈ దే వాలయం చాళుక్యుల కాలంలో నిర్మింపబడిం దని కొందరి ఊహ.
అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానం, ఆ స్తంభా లను నిలబెట్టిన విధానం, విశాలమైన ముఖ ద్వారం అన్నీ కాక తీయుల కాలంలో నిర్మింప బడిందేనని అనిపి స్తుంది. అంతేకాక దేవాల యంలోని అంతరాళ స్తంభాలలో ఒకదాని మీ ద... ‘మహేశశ్చారు సంధత్తే మార్గణం కొనకా చలే! మంత్రి విఠన ఎఱ్ఱస్తు మార్గణే కనకాచల మ్‌!!’ అనే శ్లోకం కన్పిస్తుంది. ఈ శాసనపా ఠం పురాతత్త్వ శాఖ వారు ప్రచురించిన వరం గల్‌ జిల్లా శాసనాల్లో (పు.307) ఉన్నది. ఈ శ్లోకం లోని ఎఱ్ఱన క్రీ.శ.10వ శతాబ్దిలో కాకతిపురా న్ని పాలించి నట్లు గూడూరు శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. ఈయన తండ్రి విఠనామాత్యు డని, ఆయనకు మీసరగం డడనే బిరుదు ఉండే దని ఈ శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. ఇదే విషయం దేవాలయంలోని మరొ క స్తంభం మీద కూడా కొంచెం భేదంతో ఉన్నది.
ఈ రెండు స్తంభశాస నాలను బట్టి ఈ దేవాలయం క్రీ.శ.10వ శతాబ్దంలో నిర్మింప బడి ఉంటుందని ఊ హించవచ్చు. లేదా కాకతి ప్రతాపరుద్రుని సర్వసైన్యాధిపతియైన ఆడిదం మల్లుకు కూడా మీసరగం డడనే బిరుదు కన్పిస్తుంది. కనుక ప్రతాపరుద్రుని కాలంలో నిర్మింబడిం దో సరిగ్గా చెప్పలేం. ఏమైనప్పటికీ కనీసం వెయ్యు సంవత్సరాల చరిత్రగలది ఈ శ్రీ భద్రకాళీ దేవాలయం.
1950లో పునరుద్ధరించే సమయం వరకూ అమ్మవారు వ్రేలాడుతున్న నాలుకతో రౌద్రర సం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది. ప్రా చీనకాలంలో కూడా అట్లాగే భయంకరంగా ఉండేదనటానికి - తనరు భద్రేశ్వరి యనంగ భయదంబుగాగ - అన్న సిద్ద్శ్వరచరిత్ర (పు.24) లోని మాటలే నిదర్శనం! అలాంటి రౌద్రస్వరూపిణిని నోటిలో అమృత బీజాలు వ్రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మా ర్పించారు. (దక్షిణాచార సంప్రదాయం ప్రకా రం అర్చింపబడే మూర్తి శాంత స్వరూపంగా ఉండాలనేది శాస్త్ర విధి). అంతేగాక అమ్మవారి గుడిలో శ్రీచండీయంత్ర ప్రతిష్ఠ చేసి, ప్రతి సంవత్సరమూ శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ప్రతి నిత్యం దూపదీప నైవేద్యా దులు అనే సంప్రదాయాలను పునరుద్ధరించారు.
గర్భాలయానికి రెండువైపులా రెండు చిన్న గదులు ఉన్నాయి. ఆవి బహుశా యోగులో సిద్ధులో తపస్సు చేసుకోటానికి ఉపయోగించే వేమో అనిపిస్తుంది. అమ్మవారి దేవాలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉన్నది. అందులో యోగులు తపస్సు చేసుకుంటూ ఉండేవారని ప్రతీతి. అమ్మవారి గుడికి వెళ్ళేదారిలో, చెఱవు ప్రక్కన ఉన్న ఒక పెద్ద కొండమీద గణపతి విగ్రహం ఒకటి ఉండేది కొండతో పాటు అది కూడా అంతరించిపోయింది. 1966లో వరంగల్‌-ఖాజీపేట ప్రధాన రహ దారిగుండా శ్రీ భద్రకాళీ దేవాలయానికి బీటీ రోడ్డు, వీది దీపాలు ఏర్పాటు చేయబడినాయి. ఆంధ్రప్ర దేశ్‌ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశా ఖ స్థపతి పద్మశ్రీ గణపతి స్థపతి గారి నేతృ త్వంలో దక్షి ణభారత దేవాలయ సంప్రదాయా నికి అనుగుణంగా ఆలయ శిఖరం, మహా మండపం, శాలాహారదులు నిర్మించారు.
ఆమ్మవారికి ఎదురుగా పెద్ద చెఱవు ఒకటి ఉన్నది. దానినే భద్రకాళీ చెఱవు అంటారు. వరంగల్‌ నగర ప్రజలకు తాగునీటి సరఫరా ఈ చెఱవు నుండే జరుగుతుంది.

Share:

భారతీయ హిందూ గురు సంప్రదాయం.


* గురువు అవసరం ఏమిటి...? గురువు విశిష్టత ...
* భారతీయ గురు సంప్రదాయంలో ఏన్నివిధాల గురువులున్నారు..??
* గురువు యెడల పాటించవలసిన నియమాలు ...
* సరైన గురువులను ఏ విధంగా కనుగొనాలి ..?? గురువులు ఇచ్చే దీక్ష ఎన్నిరకాలు..??
.
.
గోరుముద్దలు తినిపించే అమ్మ, వేలుపట్టి నడిపించే నాన్న తరువాత జీవనపయనాన్ని ముందుకు నడిపించేవాడు, శాసించేవాడు గురువు. అటువంటి గురువు లభించని జీవితం అగమ్యగోచరం అవుతుంది. లౌకిక జీవితానికి ఉపయోగపడే నాలుగుముక్కలూ నేర్చేసుకున్నాక ఆధ్యాత్మిక ప్రగతికి మనసు ఆరాటపడుతున్నవేళ మార్గనిర్దేశనం చేసే గురువు కావాలి. ఎక్కడ దొరుకుతాడు. వేదాంతం చెప్పడానికి ప్రతివాడూ పండితుడే. ఆధ్యాత్మికం నాకు తెలీదన్నవాడు కనబడడు. ఎందరి మాటలని వినగలం? ఎవరిలో ఏముందో ఎలా నమ్మగలం? ప్రతివారూ అనుమానించదగినవారే. దైవం, ఆధ్యాత్మిక మార్గాలపై అపనమ్మకాలతో పెరిగే ఆధునిక మానవుడికి ఆధ్యాత్మిక గురువు వెతికి పట్టుకోవడం గొప్ప ప్రయాస.
.
అజ్ఞానమనే చీకట్లు కమ్ముకున్నప్పుడు జ్ఞానమనే అంజనం కళ్లకు పూసి వెలుగుచూపేవాడు గురువు. భారతీయ గురువులే ప్రపంచ గతినే నిర్దేశిస్తున్నారని అధ్యాత్మ విధులు చెబుతారు. మహాయోగులు, తపస్సంపన్నులు ఎందరో ఈ పుణ్యభూమిపై ఉన్నారు. అయితే అటువంటి పరమగురువులను కలుసుకోవడం అందరికీ సాధ్యపడుతుందా.?
.
వివేకానందుని అన్వేషణ కంటే ముందుగానే రామకృష్ణుల అన్వేషణ మొదలైందట. వివేకానందుని చూడగానే రామకృష్ణులు గుర్తుపట్టి ఒక్కసారి దక్షిణేశ్వరానికి రమ్మని పిలిచారట. కానీ వివేకానందులు దాదాపు అయిదేళ్లవరకూ రామకృష్ణుల వద్దకు వెళ్లనే లేదు. అంటే గురువు సంకల్పమే కాదు.. శిష్యుని అర్హత కూడా జతపడాలి. లాహిరీ మహాశయులను కేవలం మనస్సంకల్పంతో ఆకర్షించారు మహావతార్ బాబా.
అన్నీ అర్ధమయ్యేలా చెప్పేవారే కాదు. మౌనంగా ఉండేవారూ మహాగురువులే. నోరువిప్పి మాటలే మాట్లాడని రమణ మహర్షి వద్దకు ఎందరో విదేశీయులు వచ్చేవారు. గురోర్మౌనం సంశయచ్ఛేదః అన్నట్లు ఆయన మౌనం నుంచే శిష్యులకు కావలసిన సమాధానాలు దొరికేవి. మెహర్ బాబా ఏదైనా మాట్లాడవలసి వస్తే రాసి చూపించేవారు. కుర్తాళ పీఠస్థాపకులు మౌనస్వామి. ఏ మహనీయుని దగ్గరకు వెళ్లగానే సందేహాలు నివృత్తి అవుతాయో, ఏ వ్యక్తి దగ్గర ప్రశాంతత, ఆనందము కలుగుతాయో, ఏ వ్యక్తిమీద నమ్మకము, గురి కలుగుతాయో, ఆ మహనీయుడే నీకు గురువు అని గుర్తుపట్టాలంటారు.
.
.
భారతదేశంలో ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రుల తరువాత గురువు అంతటివాడని మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తి చెబుతుంది. గురువును ప్రత్యక్ష దైవముగా పూజించుట ఒక ఆచారము. విద్యాభ్యాసం తరువాత గురుదక్షిణ ఇవ్వడం కూడా సనాతన కాలంలో ఆచారంగా ఉంది. నిత్య ప్రార్ధనలలో గురువును, గురుపరంపరను స్తుతించడం ఒక ఆచారం.
భారతదేశంలో అనాదిగా గురు పరంపర వస్తూనే ఉంది. గురు సంప్రదాయానికి మూల పురుషుడు సదాశివుడు. ఆయనను దక్షిణామూర్తి అన్నారు. కుమారస్వామి కూడా గురువు. విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులు, సాందీపుని వద్ద బలరామకృష్ణులు, పరశురాముని వద్ద భీష్ముడు, ద్రోణుని వద్ద అర్జునుడు, గోవింద భగవత్పాదాచార్యుని వద్ద ఆదిశంకరులు, వీరబ్రహ్మంగారి వద్ద సిద్దయ్య, రామకృష్ణ పరమహంస వద్ద వివేకానంద స్వామి - ఇలా ఎందరో గురుకృపతో ధన్యజివులైనారు. దత్తాత్రేయుని, షిర్డీ సాయిబాబాను "గురువు" అని ప్రస్తావించడం సాధారణం.
.
.
* గురువు విశిష్టత:..
శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు.
.
.
* గురువు యెడల పాటించవలసిన నియమాలు:...
గురువు నిల్చుకొనిన శిష్యుడు కూర్చొని ఉండరాదు గురుశిష్యులొకశయ్య గూర్కరాదు..
ముందుగా దనయంత భుజియింపగారాదు పోరి దొంగత్రోవల బోవరాదు..
గురునింద చేయరాదు వినరాదు గురునికప్రియమును గూర్చరాదు..
గురువు ఆజ్ఞను మీరరాదు..
గురుడు బోధింపనెంచిన నురుగరాదు అతడు బోధింపకుండిన నడుగరాదు..
శ్రీగురుమూర్తి చూసినవెంటనే నమస్కారము చేయవలయును...
కులము,ధనము తారత్తమ్యము వీడి గురువును ఆశ్రయించాలి...
సుతుడైన హితుడైన సోదరుడైనను గులహీనుడైన కొలువవలయును..
గురునాజ్ఞ అనుసరించి గురువిచ్చుతృణమైన మేరువుగా భావించవలయాను..
గురువును స్వామి దేవర అనుచు లోభ గుణములు వీడి సేవించవలయాను..
.
.
* సరైన గురువులను ఏ విధంగా కనుగొనాలి:...
ఏ మహాత్ముని రూపం నీకు మదిలో నిలిచిపోతుందో,
ఏ సన్యాసి నీకు స్వప్నంలో కూడా కనిపించి సన్మార్గాన్ని బోధిస్తాడో,
ఏ సాధువు చెప్పిన ధర్మసూత్రాలు నీ మదిలో నిలిచిపోతాయో,
ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ సందేహాలు నివృత్తి అవుతాయో,
ఏ వ్యక్తి దగ్గర నీకు ప్రశాంతత, ఆనందము కలుగుతాయో,
ఏ వ్యక్తిమీద నీకు నమ్మకము, గురి కలుగుతాయో ఆ మహనీయుడే నీకు గురువు...
.
.
* గురువులు ఇచ్చే దీక్ష నాలుగు రకాలని చెబుతారు:...
(1) స్పర్శదీక్ష (2) ధ్యాన దీక్ష (3) దృగ్దీక్ష (4) మంత్రదీక్ష.
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.
.
.
* భారతీయ గురు సంప్రదాయంలో ఏడువిధాల గురువులున్నారు:...
సూచక గురువు – చదువు చెప్పేవాడు
వాచక గురువు – కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు
బోధక గురువు – మహామంత్రాలను ఉపదేశించేవాడు
నిషిద్ధ గురువు – వశీకరణ, మారణ ప్రయోగాలు నేర్పేవాడు
విహిత గురువు – విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు
కారణ గురువు – జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు
పరమ గురువు – జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాన్ని కలిగించేవాడు.
ఏ గురువూ తానెవరో చెప్పలేడు. తన గురువు తనకెవరో తెలియాలంటే తాను ఒక్కొక్కమెట్టుగా ఎదగాలి. అతి ఆరాటం, సంశయం శుశ్రూష చేసే శిష్యునికి తగనివి. మర్మం విడిచిపెట్టే గురువు కోసం చేసే అన్వేషణం ఆగకూడనిది.

Share:

కైలాస మానస సరోవర యాత్ర..

ॐ భూలోక కైలాసం అతి పరమ పవిత్రమైన ‘‘మానస సరోవరం’’.
ॐ కైలాస పర్వతం మానస సరోవరం .. ఆది యోగి పరమ శివుడి నివాసం..
ॐ కళ్ళారా చూడాల్సిన క్షేత్రం కైలాస-మానస సరోవరం..
ॐ మానస సరోవరంలో స్నానం చేయాలనిఉందా..!!
.
Kailash Mansarovar Yatra - Himalaya Mountain
కైలాసశిఖరే రమ్యా పార్వత్యా సహితః
ప్రభో అగస్త్యదేవ దేవేశ మద్భక్త్యా చంద్రశేఖరః
సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. సాక్షాత్తు పరమశివుని నివాసం కైలాసం. బ్రహ్మదేవుడు మనస్సంకల్పంతో సృష్టించిన మహాద్భుత సరస్సు మానససరోవరం. భూమండలానికి నాభిస్థానంలో ఉన్నట్లు భావించే కైలాసపర్వతం హిందువులకే కాక, బౌద్ధులకు, జైనులకు, టిబెట్ లో ప్రాచీనమైన 'బొంపో' మతానుయాయులకు కూడా ఇది అతిపవిత్రం, ఆరాధ్యం. మామూలు కళ్ళకు ఇది మట్టిగా కనిపిస్తుంది. కానీ యోగదృష్టితో చూసినవారికి దివ్యశక్తే ఇక్కడ పృథివీ రూపం ధరించిందని తెలుస్తుంది. పరమశివుడు పురుషుడు, పరమేశ్వరి ప్రకృతి అతడు శివుడు, ఆమె శక్తి. ఆ శివశక్తుల భవ్యలీలాక్షేత్రం కైలాసమానససరోవరం. రజకాంతులతో వెలిగిపోయే కైలాస శిఖరం సచ్చిదానందానికి నెలవు. లలితాదేవి కాలి అందెల రవళులలో ఓంకారం, నటరాజు తాండవంలో ఆత్మసారం ధ్వనిస్తుంది. సాక్షాత్తూ పరమ శివుడి నివాసమని కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకాలు ఇవి. అందుకే జీవితంలో ఒకసారైనా- మానస సరోవరంలో స్నానం చేయాలని.. కైలాస పర్వతాన్ని దగ్గరగా చూసి ప్రదక్షిణం చేయాలని కోట్లాది మంది భావిస్తూ ఉంటారు. కాని సముద్రమట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తున ఉన్న మానస సరోవరాన్ని.. దానికి సమీపంలో ఉన్న కైలాస పర్వతాన్ని అధిరోహించటం అంత సులభం కాదు. అందుకే చాలా మందికి కైలాస యాత్ర ఒక కల. తీరని కోరిక. కాని ఇప్పుడు చైనా ప్రభుత్వం అక్కడికి సులభంగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. భారీ వాహనాలు సైతం సునాయాసంగా ప్రయాణించటానికి వీలుగా రోడ్లు.. కొండ చరియలు విరిగి పడకుండా ఇనుప కంచెలు.. హఠాత్తుగా వరదలు వచ్చి రోడ్డు కొట్టుకుపోకుండా పక్కనే కాలువలు వంటి అనేక సదుపాయాలను కల్పిస్తోంది. వచ్చే ఒకటి రెండేళ్లలో ఈ యాత్రను సులభంగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
.
ప్రపంచంలో అత్యంత కఠినమైన యాత్రలలో కైలాస యాత్ర ఒకటి. వేల అడుగుల నుంచి జారిపడే జలపాతాలు, పెట్టని కోటల్లా ఎటువైపు చూసినా కనిపించే పర్వతాలు, అడుగు జారితే ఎముకలు కూడా దొరకవనే భయం కలిగించే లోయలు- ఇవన్నీ కైలాస యాత్రలో భాగాలు. ఒక విధంగా మానస సరోవరానికి, కైలాస పర్వతానికి ఆకర్షణను కలిగించేవి కూడా ఇవే. హిందూ పురాణాలలోను, కావ్యాలలోను ఈ ప్రదేశాల గురించి సవివరమైన వర్ణనలు ఉన్నా, అనుభవైక్యం అయితే తప్ప వాటి గొప్పతనం అర్థం కాదు. చైనా అధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో మానస సరోవరం, కైలాస పర్వతం రెండూ ఉన్నాయి. ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచి నీటి తటాకం మానస సరోవరం.
.
దీనికి పశ్చిమంగా రాక్షసతాల్ అనే సరోవరం, ఉత్తర భాగంలో కైలాస పర్వతం ఉంటాయి. సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరోవర చుట్టుకొలత దాదాపు 88 కిలోమీటర్లు ఉంటుంది. లోతు దాదాపు మూడు వందల అడుగుల దాకా ఉంటుంది. బ్రహ్మ మదిలో ఈ సరోవరం పుట్టిందని.. బ్రహ్మే దీనిని భూమిపైకి తీసుకువచ్చాడని హిందూపురాణాలు చెబుతాయి. బ్రహ్మ మానసంలో(మనసు) పుట్టింది కాబట్టి దీనికి మానససరోవరం అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఈ సరోవరంలో స్నానం చేస్తే వంద జన్మల్లో చేసిన పాపాలన్నీ పోతాయనేది హిందువుల నమ్మకం.
.
బౌద్ధ జాతక కథలలోను, ఇతర గ్రం«థాలలోను కూడా ఈ సరోవరం ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. ‘అనవతప్త’ అని బౌద్ధులు పిలుచుకొనే ఈ సరోవరం ఒడ్డున ‘చూ గంప బౌద ్ధఆరామం’ ఉంది. బుద్ధుడు భూమిపై ఉద్భవించటానికి బీజం ఈ సరోవరం ఒడ్డునే పడిందనేది బౌద్ధుల నమ్మ కం. నిజానికి ఎన్ని వేల ఏళ్ల నుంచి ఇక్కడ జనసంచారం ఉందనే విషయాన్ని చెప్పటానికి కచ్చితమైన ఆధారాలేమీ లేవు. కొన్ని వేల ఏళ్ల నుంచి భారత ఉపఖండంలో నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తున్నారనే విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.
.
రెండు మార్గాలు..
ఒకప్పుడు ఈ ప్రదేశాలను సందర్శించటానికి ఒకే ఒక మార్గం అందుబాటులో ఉండేది. మన దేశం నుంచి ఆ ప్రాంతానికి వెళ్లి తిరిగి రావడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టేది. పర్వతాలలో కాలిబాటలు తప్ప వేరే మార్గమే ఉండేది కాదు. యాత్రకు వెళ్లాలనుకొనేవారు ముందు నేపాల్ చేరుకొనేవారు. ఖాట్మండులోని పశుపతినాథుడి ఆలయాన్ని సందర్శించుకొని.. అక్కడి నుంచి కాలినడకన మానస సరోవరానికి బయలుదేరేవారు. వెంట పశువుల్ని తీసుకెళ్లి పర్వత సానువుల్లో పెరిగే గడ్డిని తినటానికి ముందుగా వాటిని వదిలేవారు. ఆ పశువులు వెళ్లే మార్గాన్ని గమనిస్తూ వాటి వెనకే వెళ్లేవారు. ఎముకలు గడ్డకట్టే చలిలో ఆహారం దొరకక, ఆక్సిజన్ సరిగ్గా అందక మరణించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉండేది.
.
అందుకే ఒకప్పుడు మానస సరోవర యాత్రకు వెళ్లి వచ్చిన వారిని ప్రజలు మృత్యుంజయులుగా చూసేవారు. వారిని అమితంగా గౌరవించేవారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత కూడా టిబెట్‌లోను, అక్కడి మౌలిక సదుపాయాల విషయంలోను ఎటువంటి మార్పు రాలేదు కాని భారత్, చైనాల మధ్య కొన్ని వివాదాలు చెలరేగాయి. దీనితో 1954లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని సందర్శించటానికి భారత యాత్రికులకు అనుమతి ఇవ్వటం మానేసింది. ఆ సమయంలో కూడా కొందరు నేపాల్ చేరుకొని అక్కడి నుంచి రహస్యంగా కైలాస పర్వతాన్ని సందర్శించటానికి వెళ్లేవారు. అదెలాగున్నా 24 ఏళ్ల తర్వాత- 1978లో చైనా సర్కారు మళ్లీ భారత యాత్రికులను ఈ ప్రాంతానికి అనుమతించటం ప్రారంభించింది.
.
ప్రతి ఏడాది దాదాపు వెయ్యి మందిని మాత్రమే అనుమతించేవారు. అతి తక్కువ మందిని అనుమతించటం కూడా ఈ యాత్రకు అదనపు ఆకర్షణగా తయారయింది. 1990ల తర్వాత టిబెట్ పట్ల చైనా ప్రభుత్వ వైఖరి మరింత కఠినమయింది. ఇదే సమయంలో- ఈ ప్రాంతంలోకి యాత్రికులను అనుమతించటం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా చైనా గుర్తించింది. దీనితో 1995 తర్వాత ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు పథకాలు సిద్ధం చేయటం మొదలుపెట్టింది. ఒకప్పుడు కేవలం పర్వత మార్గం ద్వారానే యాత్రికులకు అందుబాటులో ఉండే కైలాస పర్వతం దగ్గరకు హెలికాప్టర్ సర్వీసు కూడా ప్రారంభమయింది. దీనితో కైలాస పర్వతం సందర్శించటానికి రెండు మార్గాలు ఏర్పడ్డాయి.
.
అయితే ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేం. ఏ నిమిషంలో వాన పడుతుందో.. ఏ నిమిషంలో ఎండ వస్తుందో కనుగొనటం చాలా కష్టం. అంతే కాకుండా కొన్ని సార్లు పర్వతాలలో విపరీతమైన మంచు కురుస్తుంది. కొన్ని రోజుల పాటు సూర్యకాంతి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్‌లలో ప్రయాణం చాలా ప్రమాదం. పైగా ఖర్చు ఎక్కువ. దీనితో ఎక్కువ మంది యాత్రికులు రోడ్డు మార్గంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మూడేళ్ల క్రితం టిబెట్‌లోని కొందరు బౌద్ధ బిక్షువులు చైనా ప్రభుత్వంపై తిరగబడడంతో దాన్ని వెంటనే అణచి వేసినప్పటికీ చైనా ఆలోచనల్లో మార్పు వచ్చింది. తమ సైన్యం టిబెట్‌లోని మారుమూల ప్రాంతాలకు సైతం త్వరగా చేరుకోవటానికి వీలుగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే మానస సరోవరం, కైలాస పర్వతానికి రోడ్ల నిర్మాణం ప్రారంభించింది.
.
70 శాతం పూర్తి..
మానస సరోవరానికి, కైలాస పర్వతానికి చేరుకోవటానికి రోడ్డు ద్వారానే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది- నేపాల్ నుంచి టిబెట్‌లోకి ప్రవేశించి జాంగ్ము, సాగాల మీదుగా మానససరోవరం చేరుకోవటం. ఖాట్మండు నుంచి టిబెట్ సరిహద్దుల్లో ఉండే ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్‌కు చేరుకోవటానికి కనీసం ఆరు గంటలు పడుతుంది. వేల అడుగుల లోతైన లోయల పక్క నుంచి.. హఠాత్తుగా విరిగి పడే కొండచరియలతో ఈ ప్రయాణం అత్యంత కఠినంగా ఉండేది. ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు. ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జి దాటిన తర్వాత జాంగ్మూకు చేరుకోవటానికి ఒకప్పుడు 12-14 గంటలు పట్టేది. ఒకప్పుడు మట్టి రోడ్లు మాత్రమే ఉండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి ఏ మాత్రం తగ్గని తారురోడ్లు వచ్చేసాయి.
.
అందువల్ల ఇప్పుడు ఏడెనిమిది గంటల్లో వెళ్లిపోగలుగుతున్నారు. అయితే వీటితో పాటు ప్రతి ఇరవై కిలోమీటర్లకు ఒక సైనిక శిబిరం కూడా వచ్చింది. జాంగ్మూ నుంచి సాగాకు, సాగా నుంచి మానస సరోవరానికి వెళ్లే రోడ్లు, ఆ దారిలోని మౌలిక సదుపాయాలు కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయి. సాగా నుంచి మానస సరోవరానికి గత ఏడాది 30 శాతం మాత్రమే తారు రోడ్డు ఉంటే.. ఈ సారి అది 70 శాతానికి పెరిగింది. దీని వల్ల పన్నెండు నుంచి పదహారు గంటలు పట్టే ప్రయాణ సమయం ఎనిమిది గంటలకు తగ్గిపోయింది. ఈ ప్రాంతంలో మిగిలిన చోట్ల కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం ప్రారంభమయింది.
.
వచ్చే ఏడాది మానస సరోవర యాత్ర ప్రారంభమయ్యే నాటికి సాగా నుంచి మానస సరోవరానికి ఆరు గంటల్లో వెళ్లిపోవచ్చంటే అతిశయోక్తి కాదు. మానస సరోవరం నుంచి కైలాస పర్వతం బేస్‌క్యాంపు దాకా కూడా చైనా ప్రభుత్వం రోడ్ల నిర్మాణం ప్రారంభించింది. ఈ ఏడాది బేస్‌క్యాంపు నుంచి కైలాస పర్వతం కింది దాకా జీపులపై వెళ్లటానికి కూడా కొందరికి అనుమతులు ఇచ్చింది. ఇదే ఒరవడి ఇంతే జోరుగా కొనసాగితే- కైలాస పర్వతానికి నేరుగా జీపుల్లో వెళ్లే అవకాశం ఏర్పడవచ్చు. అంటే వచ్చే రెండు,మూడేళ్లలో- మానస సరోవర యాత్ర- చాలా మందికి ఒక పిక్నిక్‌గా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అదనంగా ఐదు వేల యువాన్‌లు- అంటే 40 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.
.
ఉక్కు కవచం..
ఒక పక్క వేల మంది యాత్రికులు సునాయాసంగా కైలాస్ మానససరోవర యాత్రకు రావటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న చైనా ప్రభుత్వం.. మరోవైపు వారిపై అంతే కఠినమైన ఆంక్షలు కూడా విధిస్తోంది. ఉదాహరణకు ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జి దాటడానికి (అంటే టిబెట్‌లో ప్రవేశించటానికి) ఎంత సమయం పడుతుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కొందరు యాత్రికులకు రెండు రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే విధంగా దలైలామా గురించి కాని.. టిబెట్ స్వాతంత్య్ర పోరాటం గురించిగాని పుస్తకాలు పట్టుకెళితే – వారికి టిబెట్‌లో ప్రవేశం ఉండదు.
.
జాంగ్ము, సాగా వంటి పట్టణాలలో ఫోటోలు తీయటాన్ని కూడా చైనా సైన్యం నిషేధించింది. సాగాలో బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన స్థలమని హిందువుల, బౌద్ధుల ఇద్దరి విశ్వాసమూ. అందువల్ల చాలామంది ఈ నదీ తీరాన ప్రార్థనలు చేయటానికి ప్రయత్నిస్తూ ఉం టారు. అయితే ఈ నదీతీరానే చైనా సైనిక శిబిరం కూడా ఉంది. అందువల్ల ఇక్కడ ప్రార్థనలు చేయటాన్ని.. ఫోటోలు తీయటాన్ని ఈ ఏడాది కొత్తగా నిషేధించారు. ఇక మానససరోవర ప్రాంతంలోని గుడారాలలో నివసించే వారిని చైనా సైన్యం అనుక్షణం గమనిస్తూ ఉంటుంది. ఇవన్నీ కలిసి తీర్థయాత్రలోని ఆనందాన్ని మనకు తగ్గించేస్తున్నాయని చైనావాళ్లు గుర్తిస్తున్నట్టు లేరు.
.
ఎవరూ అధిరోహించని కైలాస పర్వతం
కైలాసపర్వతాన్ని టిబెటన్ భాషలో రిన్‌పోచి అని పిలుస్తారు. ప్రతి ఏడాది వేల మంది హిందూ భక్తులు కైలాస పర్వత ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. టిబెటన్లు కూడా ఈ పర్వతాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. ఈ పర్వతంపై పాదం మోపటం పాపంగా భావిస్తారు. అందువల్ల వీరు మోకాళ్లపై కైలాస పర్వతాన్ని ఎక్కుతారు. హిందువులు ఎక్కువగా కైలాస పర్వతం చుట్టూ 52 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తారు కాని పర్వతాన్ని అధిరోహించరు. అయితే పాశ్చాత్య దేశాలకు చెందిన అనేక మంది సాహసికులు కైలాస పర్వతాన్ని అధిరోహించటానికి గతంలో ప్రయత్నించారు. అయితే ఏదో ఒక కారణం వల్ల ఈ ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. 1926లో హ్యుగ్ రటిల్ఎడ్జ్ అనే బ్రిటిష్ సాహసికుడు చేసిన ప్రయత్నం చరిత్రలో నమోదు అయిన తొలి ప్రయత్నం. 1936లో హ్యుబర్ట్ టిచి అనే వ్యక్తి కూడా ఈ పర్వతాన్ని అధిరోహించటానికి ప్రయత్నించాడు.
.
అయితే చివరి నిమిషంలో అతను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 1950 నుంచి 80 దాకా చైనా ప్రభుత్వం ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. 1980లో రిన్‌హోల్డ్ మెస్‌నర్ అనే వ్యక్తికి ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే మెస్‌నర్ ఈ అవకాశాన్ని ఎందుచేతో ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత 2001 దాకా కైలాస పర్వతాన్ని అధిరోహించటానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదు. 2001లో స్పెయిన్‌కు చెందిన జీసస్ మార్టినిజ్ నోవాస్ నేతృత్వంలోని ఒక బృందానికి చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కైలాస పర్వతం హిందూ మత విశ్వాసాలతో ముడిపడి ఉందని.. అందువల్ల దానిని అధిరోహించటానికి అనుమతి ఇవ్వకూడదంటూ అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చింది. దీనితో చైనా ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంది. ఈ పర్వతాన్ని అధిరోహించటానికి ఎవరికీ అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది.
.
అతి పవిత్రం మానస సరోవరం..
* బ్రహ్మపుత్ర, కర్ణాలి (గంగ), సింధు, సట్లజ్ నదులు మానస సరోవరం నుంచి పుట్టాయని భక్తుల భావన. అయితే దీనికి ఖచ్చితమైన ఆధారాలేమీ లేవు.
* సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులను బౌద్ధ పూర్ణమి నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు. కొన్నిసార్లు వాతావరణాన్ని బట్టి ఇది మారుతుంది కూడా. ఆ కాలంలో కూడా ఉష్ణోగ్రత కొన్నిసార్లు మైనస్‌కి వెళ్లిపోతుంది.
* భారత ప్రభుత్వం ఏడాదికి 750 మందిని మాత్రమే ఈ యాత్రకు పంపిస్తుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. వారు నేరుగా చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు.
* మానస సరోవర ప్రాంతంలో తెల్లవారు జాము రెండున్నర నుంచి నాలుగున్నర వరకూ ఆకాశంలో విచిత్రమైన కాంతి కనిపిస్తుంది. ఈ సమయంలో దేవతలు స్నానం చేయటానికి ఆ సరోవరానికి వస్తారనేది భక్తుల నమ్మకం. ఈ కాంతిని చూడటానికి భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు.
* చైనా ప్రభుత్వం మానస సరోవర ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు చేపట్టింది. ఒక ప్రైవేట్ సంస్థ ఇక్కడ ఒక హోటల్‌ను కూడా నిర్మిస్తోంది. ఇటువంటి నిర్మాణాల వల్ల మానస సరోవర పవిత్రత దెబ్బతింటుందని.. పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
.
ఈ ప్రాంతమంతా శక్తిమయం....
సైన్స్ ప్రకారం- కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న పరిస్థితుల వల్ల ఎక్కువ శక్తి (ఎనర్జీ) ఉంటుంది. దానిని ఉపయోగించుకోగలిగితే అనేక లాభాలు ఉంటాయి. మానస సరోవరం, కైలాస పర్వతం అలాంటి ప్రాంతాలు. నేను ఈ ప్రాంతానికి గత ఏడేళ్లుగా వస్తున్నాను. వచ్చిన ప్రతి సారి ఒకో విధమైన అనుభూతి ఏర్పడుతూ ఉంటుంది. దానిని నేను మాటల్లో వర్ణించలేను. మానస సరోవరంలో రాత్రి వేళ అనేక కాంతులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకు కనిపించే శక్తిరూపాలు. ఇక కైలాస పర్వతం గురించి చెప్పాలంటే ఆదిముని- ఈశ్వరుడు మానవ ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించటానికి మొదట ఈ ప్రాంతానికే వచ్చాడు. మూడు నాలుగు నెలల పాటు కదలకుండా మెదలకుండా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. ఈశ్వరుడిని చూడటానికి పెద్ద గుంపు తయారయింది. ధ్యానంలో ఉన్న యోగి ఏవో అద్భుతాలు చేస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు.
.
రోజులు గడుస్తున్నాయి. ఎటువంటి అద్భుతాలు జరగటం లేదు. గుంపు పలచబడింది. ఏడుగురు మాత్రం మిగిలారు. ఈశ్వరుడు కళ్లు విప్పాడు. ఆ ఏడుగురు తమకు జ్ఞానం ప్రసాదించమని ప్రార్థించారు. తమ ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డారు. ఈశ్వరుడు అప్పుడు ప్రసాదించిన విజ్ఞానం- ఈ పర్వత సానువుల్లో ఉంది. ఈ విజ్ఞానం శక్తి రూపంలో ఉంటుంది. ఒక ఇల్లు కట్టినప్పుడు దానిని నిలబెట్టడానికి కొన్ని కర్రలు అవసరమవుతాయి. ఈ పర్వత శ్రేణులు కూడా అలాంటివే. అమూల్యమైన విజ్ఞాన భాండాగారాన్ని తమలో దాచుకున్నాయి. ఈ విజ్ఞానాన్ని అందుకోవాలంటే క్రమశిక్షణ అవసరం. నిబద్ధత అనివార్యం. ఈ రెండు ఉన్నవారు మాత్రమే ఈ ప్రాంతానికి రాగలుగుతారు. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఈ ప్రాంతానికి వచ్చే సమయానికి ‘నేను’ అనే అహం చచ్చిపోతుంది. అహం చనిపోయినప్పుడు మానవుడు విజ్ఞానాన్ని అందుకోగలుగుతాడు. అందుకే నిష్ఠగా, ఏకాగ్రతతో ఈ ప్రాంతానికి వచ్చినవారికి అనేకమైన అలౌకిక, ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతాయి.

Share:

చక్కని తల్లికి చాంగుభళా!

తిరుమల కొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారు. ఈ అమ్మ తిరుపతి సమీపంలోని తిరుచానూరు (అలిమేలి మంగాపురం)లో కొలువుదీరివున్నారు. ప్రతీ ఏటా తిరుమల శ్రీనివాసునికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగానే, తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా ప్రతీ సంవత్సరం కార్తీకమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగం ఆ చివరిరోజు పంచమితీర్థం కూడా ఉంటుంది. కార్తీక బ్రహ్మోత్సవాలలో ఈ ఉత్సవానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. లక్షలాది భక్తులు ఈ రోజున అమ్మవారిని దర్శించి ఆశీస్సులు అందుకుంటారు. అయితే ఈ కార్తీక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఒక పురాణ గాథ ఉంది.

పూర్వం నైమిశారణ్యంలో మునులందరూ కలసి యజ్ఞాలు చేస్తుండగా, అక్కడికి నారదమహర్షి వచ్చి, “ఈ యాగం ఎవరికోసం చేస్తున్నారు” అని అడిగి, “చేస్తే చేశారు గానీ, దేవతలలో గొప్పవారు ఎవరో ముందుగా తెలుసుకుని, ఈ యాగఫలాన్ని వారికి అర్పించండి” అని చెప్పి వెళ్ళిపోయాడు. అందుకు భృగుమహర్షి, ఎవరు గొప్పో తేల్చాలని ముందుగా బ్రహ్మలోకానికి, ఆ తరువాత కైలాసానికి వెళ్ళి బ్రహ్మదేవుడు, శివుడు గొప్పవాళ్ళి కాదని నిర్ణయించి చివరకు వైకుంఠానికి వెళ్ళి అక్కడ కూడా నిరాశకు లోనై, కోపం పట్టలేని భృగుమహర్షి శ్రీమహావిష్ణువు వక్షస్థలం మీద కాలితో తన్నుతాడు. అది చూసిన శ్రీమహాలక్ష్మీ ఆవేశంతో అలిగి భూలోకానికి వెళ్ళిపోయి కొల్హాపురం చేరుకుంది. ఆమెను వెదుక్కుంటూ విష్ణుమూర్తి కూడా భూలోకానికి వచ్చి కొల్హాపురంలో శ్రీమహాలక్ష్మీ ఉందని తెలుసుకుని అక్కడుకు వెళ్ళి తపస్సు చేసినా, ఆమె దర్శనం లభించలేదు. ఇంతలో “ఓ శ్రీనివాసా! నీకు ఇక్కడ దర్శనం లభించదు. స్వర్ణముఖీతీరంలో ఒక సరోవరాన్ని ఏర్పాటుచేసి, అక్కడ తపస్సు చేస్తే లక్ష్మీదేవి దర్శనమిస్తుంది” అంటూ ఆకాశవాణి చెబుతుంది. వెంటనే శ్రీనివాసుడు శుకముని ఆశ్రమానికి చేరుకొని, అక్కడ ఒక చెరువు త్రవ్వి, అందులో స్వర్గలోకం నుంచి తెచ్చిన పద్మపుష్పాలను నాటుతాడు. ఆ పుష్పాలు ఎల్లప్పుడూ వికసించి ఉండాలని, అందుకోసం సూర్యదేవుడునికూడా ప్రతిష్టించి పన్నెండేళ్ళ పాటు తపస్సు చేయగా, శ్రీమహాలక్ష్మి పద్మసరోవరంలో బంగారుపద్మంలో పదహారేండ్ల యువతిగా అవతరించింది. పద్మంలో అవతరించినందువల్ల శ్రీమహాలక్ష్మీని పద్మావతిగా పిలుస్తూ దేవతలందరూ ఎన్నోవిధాలుగా స్తుతించి ప్రార్థించారు. మరొక కథ ప్రకారం, ఆకాశరాజు కూతురు పద్మావతీదేవిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్న తరవాత, నూతన దంపతులు పర్వతారోహణం చేయరాదని ఆగస్త్యమహాముని చెప్పగా, కోంతకాలంపాటు ఆ కొత్త దంపతులు అగస్త్యమహాముని ఆశ్రమంలోని గడిపారు. అదే శ్రీనివాసమంగాపురం అని చెప్పబడుతోంది. ఆ తదనంతరం కొంతకాలానికి పద్మావతీదేవి తాను తన భర్తతో కలసి వేంకటాచలానికి వెళ్తున్నట్లుగా తన తండ్రికి కబురు చేయగా, ఆకాశరాజు తన కుమార్తెకు వివిధ వస్తువాహనాలను, వస్త్రాభరణాలను, దాసదాసీజనాలను, సారెను ఇచ్చి అల్లుడి వెంట పంపాడు. అలా ఆ నూతనదంపతులు కొండనెక్కుతుండగా, కోంత దూరం ప్రయాణించిన అనంతరం శ్రీనివాసుడు, పద్మావతిని “కరివేపాకు తెచ్చావా?” అని అడిగాడు. ఆమె తేలేదని చెప్పగా, శ్రీనివాసుడు తిరుమలలో కరివేపాకు దొరకదనీ, వెనుకకు వెళ్ళి కరివేపాకును తీసుకుని రమ్మని చెబుతాడు. వెంటనే కరివేపాకు కోసం పద్మావతీదేవి తిరుచానూరు వెళ్ళింది. అక్కడ కరివేపాకు చెట్లు చిన్నవిగా ఉన్నాయి. ఫలితంగా పద్మావతీదేవి కరివేపాకు పంటను పండించడానికి తిరుచానురులోనే కొలువై ఉందట.
తిరుచానూరులో శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించబడుతుంటాయి.

Share:

చెర్లోపల్లి "రెడ్డెమ్మ తల్లి".


సంతానం లేని స్త్రీలు రెడ్డెమ్మ తల్లికి సాగిలపడి మూడు ఆదివారాలు, గుడిలో ఉన్న కోనేట్లో స్నానం చేసి, సంతానం ఇవ్వమని కోరుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా చేయలేని పనిని రెడ్డెమ్మ తల్లి కరుణతో చేస్తుందంటుంటారు ఇక్కడి ప్రజలు.
ఇలా రెడ్డెమ్మతల్లి దీవెనలతో సంతానం పొందినవారు కుల, మత, వర్గ, వర్ణ, భాషాభేదాలు లేకుండా వారి పిల్లలకు విధిగా పేరుకుముందు రెడ్డి శబ్దం వచ్చేలాగా పిలుచుకుంటుంటారు. అందుకే రెడ్డి పంతులు, రెడ్డి నాయుడు, రెడ్డెయ్య, రెడ్డి ఖాదర్, రెడ్డి జోసఫ్, రెడ్డెప్పరెడ్డి, రెడ్డెన్న శెట్టి లాంటి పేర్లు అక్కడ వినిపిస్తుంటాయి.
చిత్తూరు జిల్లాలోని మదనపల్లె నుండి కడప వెళ్లే మార్గంలో గుర్రంకొండ అనే ఊరు దాటిన తరువాత వస్తుంది "చెర్లోపల్లె" గ్రామం. పాడిపంటలకు, పాడి ఆవులకు ఆలవాలమైన ఆ గ్రామంలోని ఒక పల్లెపేరు "యల్లంపల్లె". ఈ పల్లెలో యల్లం రెడ్లు ఎక్కువగా జీవిస్తుంటారు.
ఈ యల్లంపల్లెలో రామిరాడ్డి అనే మోతుబరి రైతు, ఆయన భార్య నాగమ్మ పేదసాదలను ఆదరించి ఆదుకుంటూ ఉండేవారు. వారికి ఇద్దరు కుమారులు... ఒక అందాల భరిణె, అపరంజి బొమ్మ అయిన కూతురు ఉండేది. ఆమె పేరే రెడ్డెమ్మ. చిన్నప్పటినుంచీ ఆ గ్రామ ప్రజలంతా రెడ్డెమ్మను చాలా ప్రేమగా, గౌరవంగా చూసుకుంటూ ఉండేవాళ్లు.
తల్లిదండ్రులు పొలంపనుల్లో, అతిథుల ఆదరణలో మునిగి తేలుతుంటే... ఏమీ తోచని చిన్నారి రెడ్డెమ్మ ఊరిపక్కనే పండిన జొన్నచేను వద్దకెళ్లి... మంచమీదికెక్కి "వడిసెల" తిప్పుతూ పక్షులను పారద్రోలేది. అలా ఒకరోజు వడిసెల తిప్పుతూ పక్షులను పారద్రోలుతున్న రెడ్డెమ్మను గుర్రంకొండ పాలకుడు తన సైనికులతో వస్తూ... చూశాడు.
అద్భుత సౌందర్యరాశి అయిన రెడ్డెమ్మను ఎలాగైనా సరే పొందాలనే దురుద్దేశ్యంతో సైనికులకు హుకుం జారీ చేశాడు. నవాబు ఆజ్ఞ మేరకు ఆఘమేఘాలపై వస్తున్న సైనికులను గమనించిన రెడ్డెమ్మ కంచెపైనుండి దూకి కొండవైపు పరుగెడుతూ పారిపోయింది. పంటచేలలో పడుతూ, లేస్తూ పరుగులెడుతున్న రెడ్డెమ్మకు ఏంచేయాలో బోధపడక... "పరమశివా, పార్వతి మాతా నన్ను కాపాడు తల్లీ..." అంటూ బిగ్గరగా వేడుకుంది.
వెంటనే భూమి కంపించేలా భయంకరమైన శబ్దంతో రెడ్డెమ్మకు ఎదురుగా ఉండే కొండ నిట్టనిలువునా చీలిపోయింది. వెంటనే ఆ కొండ చీలికలోకి ఆమె దూరిపోయింది. అప్పటికే అక్కడికి చేరిన సైనికులు ఆ శభ్దానికి గుర్రాలపైనుంచి కిందపడిపోయారు. ఇదంతా గమనించిన నివ్వెరబోయిన సైనికుడొకడు నవాబుకు విషయం చేరవేయగానే గుట్టుచప్పుడు కాకుండా కోటలోకి పారిపోయాడు గుర్రం కొండ నవాబు.
ఇదంతా విన్న రెడ్డెమ్మ తల్లిదండ్రులు, ఊరి ప్రజలు భోరున విలపిస్తూ ఆ రాత్రంతా నిద్రపోలేదు. అయితే ఆమె తల్లి నాగమ్మ కలలోకి వచ్చి తనగురించి బాధపడవద్దంటూ ఓదార్చింది. ఇదంతా విన్న ప్రజలంతా తెల్లవారగానే కొండవద్దకు వెళ్ళి "రెడ్డెమ్మతల్లీ మమ్మల్ని కాపాడు తల్లీ" అంటూ వేడుకున్నారు.
ఇక అప్పటినుంచి బాలరెడ్డెమ్మ "దేవత"గా వెలిసింది. కోరిన కోర్కెలు తీరుస్తూ, ప్రజలను ఆదుకుంటూనే ఉంది. ఇది జరిగి ఇప్పటికి మూడు వందల సంవత్సరాలు దాటినా, రెడ్డెమ్మ తల్లి మాత్రం "సంతాన దేవత"గా ప్రజల నిత్యపూజలను అందుకుంటూనే ఉంది. ప్రతి ఆదివారం వేలసంఖ్యలో సంతానం లేని స్త్రీలు రెడ్డెమ్మకు సాగిలపడుతున్నారు. వారి కోర్కెలూ తీరుతున్నాయి.

Share:

నాగులకే కాదు... తేళ్లకు కూడా పూజలు..


భారతదేశం విభిన్న సంస్కృతి సాంప్రదాయాల సంగమం. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజల కట్టుబొట్లు, ఆచార వ్యవహారాలు వేరైనా ఆయా రాష్ట్రాల ప్రజలు జరుపుకునే పండుగలు మాత్రం ఒక్కటే. దసర, దీపావళి, సంక్రాంతి, ఉగాది, క్రిస్‌మస్‌, రంజాన్‌ ఇలా ప్రతీ పండుగను దేశవ్యాప్తంగా అందరు జరుపుకోవడం సహజం. కాని పండుగల్లోనూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ సంప్రదాయానికి పెద్దపీఠ వేసే గ్రామాల ప్రజలు నేటికి ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. నాగపంచమి... అంటే నాగుపాముల నుంచి రక్షణ పొంది, నాగదోషం కలగకుండా పిల్లలను కాపాడుకునేందుకు చేసేపూజ. ఈ నాగుల పంచమి రోజున మహిళలు పుట్టలో పాలు పోసి నాగదోషం లేకుండా చేయాలని మొక్కుతారు. ముఖ్యంగా రాష్ట్రంలో నాగుల పంచమి పండగా ప్రతిఏటా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. కాని సరిగ్గా ఇదే... నాగపంచమి రోజున పాములకు బదులు తేళ్లకు నైవేద్యాలు పెట్టి వాటిని దేవుళ్లుగా భావించి తేళ్ల పండగ జరుపుకోవడం కర్నాటక రాష్ట్రం యాద్గీర్‌ తాలుకా కందుకూరు గ్రామస్థుల సాంప్రదాయం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సరిహద్దున గల యాద్గీర్‌ తాలుకా కందుకూరు గ్రామమది. రెండువేల జనాభా ఉంటుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట డివిజన్‌ కేంద్రానికి సరిగ్గా 25కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ గ్రామం. ప్రతి ఏటా నాగుల పంచమి రోజున దేశవ్యాప్తంగా అందరు పుట్టలో, నాగుల విగ్రహాలకు పాలుపోసి నైవేద్యాలు పెట్టి మొక్కులు తీర్చుకుంటే కందుకూరు గ్రామంలో మాత్రం తేళ్ల విగ్రహాలకు నైవేద్యాలు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. మొక్కులు తీర్చుకుంటే పర్వాలేదు. తేళ్లను ఒంటిపై పెట్టుకొని, మెడలో, నోట్లో వేసుకొని వాటితో ఆటలాడుతుంటారు. కందుకూరు గ్రామ శివారులోని కొండెమ్మ గుట్టపై ప్రతి ఏటా నాగుల పంచమి రోజున ఈ తేళ్ల పంచమి పండుగను గ్రామస్థులు పసికందు నుంచి కుటుంబ సభ్యులంతా వెళ్లి ఘనంగా జరుపుకుంటారు. పంచమి రోజున ఆ గుట్టపై ఏ రాయిని కదిలించి చూసినా తేళ్లు బయటకు వస్తాయి. వాటిని చిన్నచిన్న పిల్లలు చేతులపై, శరీరంపై వేసుకుంటూ వాటితో ఆటలాడుతారు. పంచమిరోజు తమను తేళ్లు కరవవని వారి నమ్మకం. ఒకవేళ కరిచినా ఆదారం (కుంకుమ) వేసుకుంటే సరిపోతుందని గ్రామస్థులు చెబుతున్నారు. తేళ్లూ... దేవుళ్లని నమ్ముతున్న ఆ ఊరి జనం తేళ్ల విగ్రహాలకు ఏకంగా గుడిని కూడా కట్టారు. గుడిలో కొండ మహేశ్వరి దేవత (తేళ్లు) విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రతిఏటా నాగుల పంచమి రోజు ఆ విగ్రహాలకు నైవేద్యాలు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. తాజాగా శనివారం అందరు పుట్టలో పాలుపోసి నాగుల పంచమిని జరుపుకుంటే ఈ గ్రామస్థులు తేళ్ల పంచమిని జరుపుకున్నారు.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

రావణుడిని పూజించే గ్రామం.


అవును ఆ ఊరిలో రావణుని పూజించకపోతే ఊరు మొత్తానికి అరిష్టం దాపురిస్తుందని ఆ గ్రామ ప్రజలు నమ్ముతారు. మధ్యప్రదేశ్‌కి చెందిన ఉజ్జయిని జిల్లాలోని ఈ గ్రామం పేరు చిక్కాలి.
సాంప్రదాయం ప్రకారం ప్రతి చైత్ర నవరాత్రులలో దశమి నాడు ఈ గ్రామస్తులు రావణుడిని పూజిస్తుంటారు. ఈ సమయంలో రావణుడి గౌరవార్థం ఒక జాతర కూడా చేస్తారు. ఆ రోజు ఊరి ప్రజలంతా రామ రావణ యుద్ధంపై నాటకం కూడా వేస్తారు. ఈ జాతర ఎంత పేరు పొందిందంటే, ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి భారీ సంఖ్యలో జనం వస్తుంటారు.
ఈ ఆలయ పూజారి బాబూభాయ్ రావణ్. రావణుడికి సమర్పించే పూజలన్నింటిని ఈయన నిర్వహిస్తుంటారు కాబట్టి తన పేరు కూడా బాబుభాయ్ రావణగా మారిపోయింది. తనకు రావణుడి ఆశీర్వాదం ఉందని ఆయన నమ్మకం. ఊరికేదయినా సమస్య వచ్చిందంటే ప్రజలు అతని వద్దకు వెళ్లి పరిష్కారం అడుగుతారు.
అప్పుడు రావణుడి విగ్రహం ముందు బాబూభాయ్ రావణ కూర్చుని ప్రజల కోరిక తీరేంతవరకు నిరాహార దీక్షలో కూర్చుంటారు. ఒకసారి ఈ గ్రామం, చుట్టుపక్కల ఊర్లు నీటి కొరతతో సతమతమయినప్పుడు బాబుబాయ్ రావణుడి విగ్రహం ముందు కూర్చుని పూజ ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా 3 రోజుల తర్వాత ఆ ప్రాంతంలో కుంభవృష్టి కురిసింది.
ఈ ప్రాంతంలో రావణుడిని మాత్రమే కొలుస్తారని, చాలా సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోందని కైలాష్ నారాయణ వ్యాస్ అనే భక్తుడు చెప్పారు. ఒకసారి ఏదో కారణంగా ఊరి ప్రజలు చైత్ర దశమి రోజున రావణుడికి జాతర, పూజలు చేయకుండా ఉండిపోయారట. తర్వాత అగ్నిప్రమాదంలో చిక్కుకుని ఊరంతా తగలబడి పోయిందట. గ్రామస్తులు అందరూ కలిసి మంటలార్పడానికి ప్రయత్నించినా ఒకే ఒక్క ఇంటిని మంటల్లో చిక్కుకుపోకుండా కాపాడారట.
పద్మా జైన్ అనే మరో మహిళ కూడా ఈ నమ్మకాన్ని బలపరుస్తుంది. రావణుడిని చైత్ర దశమి రోజున పూజించకపోవడంతో ఆ ఊరు రెండు సార్లు తగలబడిపోయిందని చెబుతుంది. ఒకసారి రావణుడి జాతర జరుపకుండా, జాతర నిర్వహించకుండా ఊరు ఎలా మంటల్లో తగులబడుతూందో రికార్డు చేయాలని ప్రయత్నించారు కాని అదేసమయంలో పెను తుఫాను వచ్చి మొత్తాన్ని ఊడ్చేసింది.
రావణుడిని పూజించడం వింతేమీ కాదు. ఎందుకంటే భారతదేశంలోని పలు ప్రాంతాల్లో, శ్రీలంకలోను రావణుడి ఆలయాలు చాలానే ఉన్నాయి. అయితే రావణుడికి పూజలు చేయకపోతే గ్రామం తగులబడిపోయే విచిత్ర సంఘటనను మాత్రం మీరు ఇంతవరకు ఎక్కడా చూసి ఉండరు.

Share:

పొలతల మల్లేశ్వర క్షేత్రం.

* శేషాచల అభయారణ్యంలో అద్భుత పొలతల మల్లేశ్వర క్షేత్రం...
* పునితలు పొలతలగా ప్రసిద్ధి చెందిన మహిమాన్వతమైన ఆలయం..
* సీతమ్మరాకను అన్వేషిస్తు రామలక్ష్మణులు వచ్చి పూజలు నిర్వజహించిన క్షేత్రం..
* సాంబశివ అన్నయ్య, బండెన్న అంటూ పరమశివుని స్మరిస్తున్న క్షేత్రం..
* 101 కోనేర్లు గల ఏకైక ఆలయం..
* సర్వాంగ సుందరంగా ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి పరచిన ఏకల వీరులు ..
.
శేషాచల దట్టమైన పర్వతశ్రేణుల్లో పచ్చని చెట్లు, సేలయేళ్ల మధ్య ఈ పొలతద క్షేత్రం వెలసింది. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో పరుచుకున్న పచ్చదనం.. గలగలపారే సెలయేరు.. నింగికి నిచ్చెన వేసినట్లున్న కొండలు.. కనువిందు చేసే కమనీయ దృశ్యాలు.. జంతువుల ఘీంకారాలు.. మేను పులకరించే ప్రకృతి అందాలు.. ఆస్వాదించడానికి ఈ ప్రకృతి సౌందర్యం.. ఇది అందరికీ ఓ ఆనంద వరం.. వికసించి విరబూసే రంగురంగుల పుష్పాలు.. ఆలపిస్తూ, ఆకృతినిచ్చే అందమైన కొనలలు.. ప్రకృతినే మురిపించే పచ్చని చెట్లు.. శేషచల అడవి సౌందర్యం, మదిలో ఓ ఆనందం... శేషాచల అడవుల్లో ఉన్న పొలతల ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఈ క్షేత్రంలో మల్లేశ్వరస్వామి, పార్వతీదేవి, సుబ్రహ్మణ్యస్వామి, వినాయకుడు, అక్కదేవతలు, బండెన్నస్వామి ఆలయాలు ఉన్నాయి.
.
‘ఓం నమశ్శివాయః .. హరహర మహాదేవ.. శంభో శంకర..హరోం హరా’..అంటూ శైవ క్షేత్రం మార్మోగుతుంది. భక్తుల పంచాక్షరి మంత్రోచ్చాటనతో ప్రతిధ్వనిస్తుంది. సాంబశివ అన్నయ్య, బండెన్న అంటూ పరమ శివుని స్మరిస్తూ పూనకంతో ఊగిపోతు అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో పొలతల క్షేత్రం కిటకిటలాడుతుంటుంది.
.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప జిల్లా, పెండ్లిమర్రి మండలంలో గల శేషాచల అభయారణ్యంలో మహా మహిమాన్వితమైన అద్భుత పొలతల మల్లేశ్వరుడు క్షేత్రం కలదు. ప్రతి రోజు ఉదయం స్వామివారికి గణపతి పూజ, మహాన్యాస రుద్రాభిషేకం, మహామంగళ హారతి, అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తురు. భక్తులు కోనేర్లలో స్నానాలాచరించి మల్లేశ్వరస్వామిని, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యంస్వామి, అక్కదేవతలు, బండెన్నస్వామిని దర్శించుకుంటారు. జిల్లా నలుమూలల నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు.
.
పోలతల క్షేత్రం చరిత్ర:..
.
రాయలసీమ జిల్లాల్లో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన క్షేత్రం పొలతల. కడపజిల్లా పెండ్లిమర్రి మండలంలోని గంగనప్లలె పంచాయతీ పరిధిలోని శేషాచల పర్వతశ్రేణుల్లోని కొండ కోనల నడుమ ఈ పోలతల క్షేత్రం విరాజిల్లుతోంది. ఈ శివక్షేత్రంలో శ్రీ పొలతల మల్లికార్జునస్వామి వెలసివున్నారు ఇంకా అక్కదేవతలు, పులిబండెన్నలు కూడా వెలసి ఉన్నారు. ఈ క్షేత్రంలో సీతమ్మరాకను అన్వేషిస్తు ఇచ్చట రామలక్ష్మణులు కొలనులో స్నానం చేసి శివుని దర్శించి పునీతులైనారని పురాణాలు చెప్తున్నాయి. తర్వాత పాండవులు వనవాస కాలంలో అర్జునుడు కందమూలములతో, మల్లెపూలతోను పూజించినందున మల్లికార్జును ప్రసిద్ధి పొందారని పురాణాలు చెబుతున్నాయి. ఇచ్చట కొలువైన మల్లికార్జునికి లోక కల్యాణార్థం శివపార్వతులు సంచరిస్తూ ఇచ్చట కాలుమోపగా కొతం భూమి కుచించు పోయిందని భక్తులు చెబుతుంటారు. కావున పునితలు పొలతలగా ప్రసిద్ధి చెందినది.
.
ఈ పొలతల మల్లికార్జునస్వామి దేవస్థానానికి ఎంతో మహనీయమైన ధార్మిక చరిత్ర వుంది. దాదాపు 800 సంవత్సరాల క్రితం పొలతల గ్రామం దాన్ని చుట్టుపక్కల ఏడు చిన్న ఊర్లు వుండేవని, ప్రజల జీవనం పంటసిరి, పాడిసిరితో సాగేదని పెద్దలు చెబుతుంటారు. ఈ ఊర్లకు చెందిన ఆవుల మందను కాసే ధార్మిక మానవుడు రామయ్య. ఆయనకు ఒక శిష్యుడు. ఆయన పేరు పిలకత్తు. తాము కాసే ఆవుల మందలో ఒక ఆవు శూలుకట్టడం కానీ, ఈనడం కానీ లేకుండా చాలా ప్రత్యేకంగా ఉండేది. ఆ విషయం గుర్తించి దాని రాక పోకలపై దృష్టి పెట్టాడు పిలకత్తు. ఒకరోజు అందరి కన్ను గప్పి ఆవు మందకు అడ్డంగా బిగించిన కంచెను అవలీలగా ఎగిరి అవతలికి దూకింది. వడివడిగా ఎక్కడికో పోసాగింది. పిలకత్తు దాని వెనుకగా చేత గొడ్డలి పట్టుకుని అనుసరించాడు. అలా ఆవు కొంతదూరం వెళ్లింది. ఓ ముళ్లపొద గొడుగులా పైకి లేచింది. దాని కింద ఒక దివ్యపురుషుడు పరుండి ఉన్నాడు. ఆ ఆవు తన పొదుగునుంచి క్షీరాన్ని ఆ దివ్యపురుషుని నోటి లోనికి వదలసాగింది. ఈ ఘటన చూసిన పిలకత్తు అగ్రహోదగ్రుడై ఎవరో అగంతకుడు ఆవుపాలు ఇలా దొంగచాటున జుర్రుకుంటున్నాడని తలపోశాడు. ముందు వెనుక ఆలోచించకుండా చేతిలోని గొడ్డలితో ఆ దివ్య పురుషుని మడిపై మోదాడు. చివ్వున రక్తం పైకి చిమ్మింది. నెత్తురు చూసిన పిలకత్తు కంగారుపడి పోయాడు. తన గురువు రామయ్య వద్దకు పరుగున వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. రామయ్య వృత్తాంతం అంతా విని జరిగిన పొరబాటు విని ఎంత బలీయమైనదోనని ఆందోళన చెందుతుండగానే పిలకత్తు క్షణాలలో పూనకం వచ్చినట్లు వూగిపోయాడు. వెంటనే పిలకత్తును ఆవహించింది సాక్ష్యాత్తు పరమశివుడే అన్నది తెలిసిపోయింది. అనంతరం జరిగిన అపరాధాన్ని క్షమించమని పరిహారంగా గుడికట్టి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటామని కన్నీరు మున్నీరై సాష్టాంగ దండ ప్రమాణాలు చెల్లించాడు రామయ్య. అనంతరం ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి మల్లికార్జునస్వామి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు. అక్కదేవతలు- పులిబండెన్నల ఆగమనం ఒకప్పుడు పొలతల ప్రాంతంలో 101 కోనేర్లు పులివింజ మానులు, విశాలమైన ప్రకృతి పచ్చదనాలతో అలరారేది.. ఆ ప్రశాంత ప్రకృతి వాతావరణంలో మహిమాన్విత మధుర జలాలతో ప్రాణకోటికి జీవనాధారమైన 101 కోనేర్లకు సమీపంలోనే మబ్బుకోన అనే ఒక గని ఉండేది. ఆగనిలో దివ్య పురుషుడు అయిన తులశ బ్రహ్మ తపోదీక్షలు ఉండేవారు. అలాగే గనిలో పునీత మహిమలైన అక్కదేవతలు ఏడుగురు కూడా ఉండేవారు. అక్కదేవతల బాషణలు లేని తులశ బ్రహ్మకు అవరోధంగా మారాయి. కన్నీయమనులైన అక్క దేవతలను తులశబ్రహ్మ తన తపోసమాధికి ఎదురవుతున్న ఆటంకాన్ని తెలిపి సమీపంలోని కోనేర్లకు ఆధార భూతంగా చేసుకుని జీవించమని కోరారు. మేని మాటలను మన్మించి ఆ కన్నియలు గవి విడచి కోనేరు వద్దకు చేరి జలక్రీడలలో ఆనందించసాగారు. ఒకరోజు ఒక ఓం కారశద్దంతో ఒక సుడి తాటిచెట్టంత ఎత్తులేచింది. దీంతో ఆ కన్నియలు పారిపోయి బంగాళా బోడు దగ్గర వెలిసివున్న శివుని గుడిలో ప్రవేశించి శివుని శరణువేడారు. పరమశివుడు ప్రత్యక్షమై కన్యకలను దుమ్ము, ధూలి రూపంలో వెంబడిస్తున్న శక్తిని నిలువరింపచేశారు. శివుని దర్శనంతో ఆ అప్రకటిత శక్తి తన నిజస్వరూపంలో శివుని ఎదుట నిలువక తప్పిందికాదు. నీవు ఓం శక్తివి కావు పులి బండైవున్న నీ శక్తి యుక్తులు ఇకపై లోక కళ్యాణార్థమై వెచ్చించు. అలాగే మహిమాన్వితులైన ఈ ఏడుగురు కన్నేలు కూడా భక్తాదుల మనో కామి తలను సిద్దింప చేస్తారు. ఇకపై మొదటిపూజ అక్కదేవతలైన కన్నేలకు, పిమ్మట తనకు ఆ తరువాత పులిబండెన్నకు పూజలు జరుగుతాయని చెప్పి పరవ శివుడు అదృశ్యమయ్యాడు. అదేవిధంగా నేడు కూడా తొలి పూజలు అక్కదేవతలకు జరుగుతున్నాయి.
.
కదిరిలోని నరసింహస్వామి దేవాలయ గోపురర శిఖరం ఒకసారి ఉన్న ఫలంగా ఒక వైపునకు ఒరిగింది. ఈ పరిస్థితిని గుర్తించిన ధార్మిక జనులైన భక్తాదులు అపచారం జరిగిందని ఏదో అరిష్టం ముంచుకుని రాబోతుందని తీవ్ర ఆందోళన చెందారు. ఆలయ శిఖరం ఒక వైపునకు ఒరిగిపోయిన విషయం తెలిసి అరవై ఆరు మంత్రవేత్తలైన పూజారులు తమ శక్తి యుక్తులను ప్రయోగించారు. కాని వారి మంత్రాలకు వొరిగిన ఆలయ శిఖరం ఎంత మాత్రం సరికాలేదు. ఈ పరిస్థితి ఆనోటా ఈ నోటా విన్న పొలతల లోని మల్లికార్జున ఆలయ పూజారి రామయ్య తన వద్ద ఉన్న దేవర ఎద్దును మరో వంద మందిని వెంటబెట్టుకుని కదిరి నరసింహస్వామి ఆలయానికి వెళ్లాడు. దేవరఎద్దు ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేసి మంత్ర మహిమాన్వితమైన తన కొమ్ముతో ఆలయాన్ని కుమ్మింది. మరుక్షణం ఒరిగిన శిఖరం సరిగా కుదురుగా నిలబడింది. అయితే గోపురం పై నుంచి ఒక కప్పు దేవర ఎద్దుపై పడటంతో ప్రాణాలు వదిలింది. ప్రతిఫలంగా ఇరవై ఎకరాల మాన్యాన్ని పొలతల మల్లికార్జునస్వామి ఆలయానికి కదిరి నరసింహ ఆలయం వారు ఇచ్చారు.
.
పొలతల ప్రాంత ప్రజలు తరచు దివిటి దొంగల బారిన పడేవారు. దివిటీ దొంగలు సర్వం దోచుకుని వెళ్లేవారు. అంతేగాక కలరా వ్యాధితో చాలామంది మృత్యువాత పడ్డారు. ఈ కారణాలతో పొలతల ప్రాంతంలోని ప్రజలు గ్రామాలు వదలిపెట్టి వెళ్లడం ప్రారంభించారు. దీంతో చాలాకాలం మల్లికార్జున స్వామికి ధూప దీప నైవేద్యాలు కరువయ్యాయి. ఇదిలా వుండగా వేంపల్లె తూర్పున గండి ఆంజనేయ క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి మూడు మైళ్ల దూరంలో ఏక దంతనాయుడు కోట ఉండేది. ఆ కోటలో దొంగతనాలు చేసి జీవించే 50 కుటుంబాల వారు జీవించేవారు. వీరు పరాక్రమవంతులు. వీరిని ఏకల వీరులు అని కూడా పిలిచేవారు. ఏకదంత నాయుడితో పాటు ఏకల దొరలు కొందరు ఒకరోజు వేటకు వెళ్లి పొలతల ప్రాంతాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ పిమ్మట పొలతల మల్లికార్జున స్వామి ఆలయాన్ని బంగాళా బోడు నుంచి పక్కనే గల మరోబోడు పైకి మార్చి సర్వాంగ సుందరంగా ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి పరచి తమ భక్తి ప్రవుత్తులను చాటుకున్నారు. దివిటి దొంగలలో మానసిక మార్పు తెచ్చి భక్తి మార్గానికి మల్లించిన పొలతల మల్లికార్జునస్వామి మహిమలు అనంతం..ఇక్కడికి వచ్చే స్త్రీ , పురుషులు తమ కోర్కెలు తీరాలని ముడుపులు కడుతుంటారు. ఇక్కడ స్వామికి కొబ్బరికాయ కొట్టినా ఇక్కడే వదలిపెట్టి వచ్చే సంప్రదాయం ఉంది.
.
మహాశివరాత్రి, కార్తీకమాస, వారోత్సవాలకు జిల్లా నుంచే కాక ఇతర రాష్టాల్ర నుంచి వేలాది వాహనాల్లో భారీగా భక్తులు తరలివస్తారు. ప్రతి సోమవారం జిల్లాతోపాటు దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పొలతల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ఆర్టీసీ యాజమాన్యం ప్రతి రోజు ప్రత్యేక బస్సును కూడా పొలతల క్షేత్రానికి నడుపుతున్నారు.
.
రచన..
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి .
Share:

పురాతన బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం.


విశాఖజిల్లా నర్సీపట్నానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బలిఘట్టంలో శివాలయం 16వ శతాబ్థంలో చోళులు నిర్మించినది. ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉండి పక్కన ఉన్న వరాహానది ఉత్తరంగా ప్రవహించడం వల్ల దక్షిణకాశీగా ఈ క్షేత్రం గుర్తింపు పొందింది. బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఇక్కడ శివలింగం స్థాపించినట్టు, దీంతో బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందినట్టు కథనం. ఆలయానికి సమీపంలో వరాహానది ఉత్తర వాహినిగా పేరుపొంది విష్ణుదేవుని ప్రసాదంగా వినుతికెక్కింది.
హిరాణ్యాక్షుని వెంటాడుతూ విష్ణువు వరాహారూపంలో భూమిని చేరుకుని పయనించడం వల్ల ఆ సమయంలో బలిచక్రవర్తి తపస్సుకు వెచిచ బ్రహ్మ ప్రసాదించిన శివలింగానికి అభిషేకం నిమిత్తం నీరు కావాలని విష్ణుమూర్తిని కోరగా వరాహా రూపంలో ఉన్న విష్ణు ఈ మార్గం గుండా నదిని ఏర్పరడంతో వరాహానదిగా పేరుగాంచినట్టు చెబుతున్నారు. త్రిశూల పర్వతంపై ఇక్కడి ఆలయం ఉంది. సమీపంలో విభూది గనులు ఉన్నాయి. ఈ ప్రాంతం కార్తీకమాసంలో, శివరాత్రి ఉత్సవాల్లో భక్తులతో కోలాహలంగా ఉంటుంది. శివరాత్రి పర్వదినాల్లో లక్షమంది భక్తులు వస్తుంటారు.

Share:

పిల్లలమర్రిలో పురాత‌న శివాల‌యం.

చారిత్రాత్మక ఈ గ్రామాన్ని కాకతీయ రాజులు పరిపాలించారు. వారి హయాంలో అనేక దేవాలయాలు అప్పటి శిల్పశైలిని అనుసరించి నిర్మించారు. ఈ దేవాలయాలలో ఉన్న శిలాశాసనాలు అప్పటి చరిత్ర తెలుపుతున్నాయి. శాలివాహన శకం 1130 (క్రీ.శ. 1208)లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు కన్నడ, తెలుగు భాషలలో వేయించిన శిలాశాసనం ఉన్నది. గణపతి దేవుడు కంటే మునుపు పరిపాలించిన కాకతీయ చక్రవర్తి, రుద్రదేవుడు శాలివాహన శకం 1117 (క్రీ.శ.1195) సంవత్సరములో వేయించిన శిలాశాసనం కూడా ఉన్నది. కాకతీయుల కాలం నాటి నాణెములు కూడా ఈ గ్రామములో లభించాయి. కాకతీయుల తరువాత పిల్లలమర్రి రేచర్ల రెడ్డి రాజులకు రాజధానిగా విలసిల్లినది. ప్రఖ్యాత తెలుగు కవి పిల్లలమర్రి పిన వీరభద్రుడు జన్మస్థలము పిల్లలమర్రి.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

వెయ్యేళ్ళ చరిత్ర గల అత్తిరాల శ్రీ పరశురామ ఆలయం..


మహా భారత పురాణంలో పేర్కొన్న క్షేత్రం. సుమారు వెయ్యేళ్ళ చరిత్రను సొంతం చేసుకొన్న ప్రాంతం. లోకాలను పాలించే స్థితి లయకారులు, అవతార పురుషులు, మహా మునులు, మహోన్నత వ్యక్తిత్వం గల వారు నడయాడిన పుణ్యభూమి. కలియుగంలో శివ కేశవుల ఉమ్మడి నిలయం. ఆధునిక యుగంలో గత చరిత్రను భావి తరాలకు సవివరంగా తెలియ చెప్పడానికి పరిరక్షిస్తున్న కట్టడాల కేంద్రం.
పురాణ గాధ :
సత్య యుగంలో లో శ్రీమన్నారాయణుని ఆరో అవతారమైన శ్రీ పరశురాముడు, ఇరవై ఒక్క మార్లు భూమండలంలో జరిపిన రక్త పాతం వలన సంక్రమించిన పాపంతో ఆయన గొడ్డలి హస్తానికి అంటుకొని రాలేదు. మహేశ్వరుని ఆజ్ఞ మేరకు పుణ్య నదులలో స్నానమాడుతూ, క్షేత్ర దర్శనం చేస్తూ ఇక్కడికి వచ్చారు. బహుదా నదిలో స్నానమచారించగానే పరుశువు రాలి క్రింద పడిపోయింది. అలా పరశురామునికి చుట్టుకొన్న హత్య పాపం రాలిపోవడంతో "హత్యరాల" అన్న పేరొచ్చింది. అదే నేడు వాడుకలో "అత్తిరాల" గా పిలవబడుతోంది. కురుక్షేత్ర యుద్దానంతరం భంధు మిత్రుల మరణానికి, జరిగిన రక్త పాతానికి తనే కారణం అంటూ ఉదాసీనంగా ఉన్న ధర్మ రాజుకు కర్తవ్యం భోధిస్తూ, రాజ ధర్మాన్ని గురించి తెలియజేసే క్రమంలో శ్రీ వ్యాస భగవానుడు పలికిన పలుకులలో అత్తిరాల ప్రస్తావన వస్తుంది. ( శాంతి పర్వం, ప్రధమాశ్వాశం).
ద్వాపర యుగానికి పూర్వం శంఖుడు మరియు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఈ ప్రాంతంలో ఉండేవారు. సకల విద్యలలో, వేద వేదాంగాలలో నిష్ణాతులు. విడివిడిగా ఆశ్రమాలు ఏర్పాటుచేసుకోని తపస్సు చేసుకొంటూ ఉండేవారు. ఒకనాడు లిఖితుడు అన్నను చూడాలని వెళ్ళాడు. ఆ సమయంలో శంఖుడు ఆశ్రమంలో లేడు. సోదరుని రాకకు ఎదురు చూస్తూ, అక్కడి చెట్లకు కాసిన ఫలాలను కోసి తినసాగాడు. ఇంతలో తిరిగి వచ్చిన అన్న శంఖుడు తమ్ముని చూసి "ఎవరి అనుమతితో ఫలాలను తింటున్నావు?" అని ప్రశ్నించగా, తన తప్పు అర్ధమైన లిఖితుడు పరిహారం చూపమని అర్ధించాడు.
"ఏదైన, ఎవరిదైన వస్తువు అనుమతి లేకుండా తీసుకుంటే అది దొంగ తనం క్రిందకు వస్తుంది. నువ్వు చేసినది అదే కనుక రాజు వద్దకు వెళ్లి నీ నేరానికి సరియైన శిక్షను అనుభవించు." అన్న మాట శిరసావహించి రాజ భవనానికి వెళ్ళాడు లిఖితుడు. అతని రాక తెలిసిన సుదుమ్న్య రాజు ఘనంగా ఆహ్వానించబోగా తిరస్కరించి, తన నేరం తెలిపి, శిక్షను విధించామని కోరాడు. ఒక మహా తపస్విని చిన్న నేరానికి దండించవలసిన పరిస్థితిని తెచ్చిన రాజాధికారాన్ని నిందించుకొంటూనే, అతని చేతులు నరకమని ఆజ్ఞాపించాడు రాజు. సంతోషంగా శిక్షను స్వీకరించి అన్న వద్దకు వెళ్ళాడు లిఖితుడు. శంఖుడు "నీవు చేసిన నేరాన్ని అంగీకరించి, శిక్షను పొంది పునీతుడవయ్యావు. ఇప్పుడు నీవు నదిలో భగవంతునికి, పిత్రు దేవతలకు అర్ఘ్యం సమర్పించు" అని ఆదేశించాడు. నదిలో మునిగి లేచిన లిఖితునికి చేతులు వచ్చాయి. బాహువులను ప్రసాదించిన పవిత్ర నదికి నాటి నుండి "బహుదా " అన్న పేరొచ్చినది. నాటి బహుదానదే నేటి "చెయ్యేరు".
ప్రజాపతులలో ఒకరైన "పులస్త్య బ్రహ్మ" ఈ పవిత్ర క్షేత్రంలో తపమాచరించి శివ సాక్షాత్కారం పొంది, కోరిన కోర్కె మేరకు సదాశివుడు "శ్రీ త్రేతేశ్వర స్వామి" అన్న నామంతో పర్వతం మీద స్వయంభూగా వెలిశారు. సప్త మహర్షులలో ఒకరైన "భ్రుగు" కూడా ఈ పుణ్య స్థలిలో తపము చేసి శ్రీ హరిని ప్రసన్నం చేసుకొన్నారు. ముని కోరిక మేరకు ఒక పాదాన్ని గయలొను, రెండో పాదాన్ని అత్తిరాలలో ఉంచి "శ్రీ గదాధర స్వామి" గా ప్రకటితమయ్యారు. చెయ్యేరు నదిలో గతించిన రక్త సంభందీకులకు చేసే పిండ ప్రధానము, తర్పణం గయలో చేసిన వాటితో సమానము అని ప్రతీతి. అందుకే అత్తిరాలకు " దక్షిణ గయ" అన్న పేరొచ్చినది.
చారిత్రిక విశేషాలు :

మహా భారతం లోనే ఉదహరించబడినదంటే క్షేత్ర ప్రాముఖ్యాన్ని గ్రహించవచ్చును. ప్రస్తుత పరశురామ ఆలయంలోని నిర్మాణాలను చోళ రాజుల సహకారంతో, ఏకా తాతయ్య దొర సారధ్యంలో పదో శతాబ్దంలో జరిపినట్లు తెలుస్తోంది. చోళులు,పాండ్యులు, శాతవాహనులు, కాకతీయులు, విజయనగర పాలకులు, కాయస్థ వంశం వారు ఇలా ఎన్నో రాజ వంశాలు ప్రాంత అభివృధికి తమ వంతు సహకారం అందించారు. శ్రీ త్రేతేశ్వర, శ్రీ గదాధర, పురాతన ఆలయాలు శిధిలం కావడంతో భక్తుల సహకారంతో పురుద్దరించారు. గదాధర స్వామి ఆలయం వద్ద ఉన్న తూర్పు రాజ గోపురమే నేటికి మిగిలిన నాటి కట్టడం. ప్రాంతమంతా శిధిల విగ్రహాలు, నిర్మాణాలు చాలా కనపడతాయి.
క్షేత్ర విశేషాలు :
చుట్టూ కొండలు, ఒకపక్క చెయ్యేరు ఆహ్లాదకర వాతావరణం, అన్ని పక్కలా ఆలయాలు కనపడుతూ అద్యాత్మికత వెల్లివిరుస్తుంది. మనస్సుకు అనిర్వచనీయమైన శాంతి కలుగుతుంది. కొండ మీద రాజ గోపురం చేరుకోడానికి సోపాన మార్గం. వెనక ఎత్తైన పర్వతం మీద దీపస్తంభం. పైకి చేరుకొంటే శ్రీ త్రేతేశ్వర స్వామి ఆలయం. పడమర ముఖంగా లింగరూపంలో గర్భాలయంలో చందన కుంకుమ లేపనంతో, వీభూతి రేఖలతో, లయ కారకుడు నిరాకారునిగా కనిపిస్తారు. శ్రీ కామాక్షి అమ్మవారికి, వినాయకునికి విడిగా సన్నిధులున్నాయి. కొండ పైనుండే శ్రీ గదాధర స్వామి ఆలయానికి మార్గం ఉన్నది. రెండువేల ఐదో సంవత్సరంలో పునః నిర్మించబడినది ఈ ఆలయం. పురాతనమైన స్వాగత ద్వారం గుండా ప్రాంగణంలోనికి ప్రవేశిస్తే ఉత్తర ముఖంగా ఉన్న ప్రధాన ఆలయ ముఖ మండపం లోనికి తూర్పు వైపు నుండి మార్గం ఉంటుంది. దానికి ఎదురుగా అంజనా సుతుడు దక్షిణం వైపుకు చూస్తూ ప్రసన్న రూపునిగా దర్శనమిస్తారు. ముఖ మండప పై భాగాన శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వేదాంత దేశికులు, ఆళ్వారుల, సప్తఋషుల విగ్రహాలు కనిపిస్తాయి.
ప్రక్కనే ఉన్న పురాతన రాజ గోపురం గుండా కొండ పైనున్న దీప స్తంభానికి చేరే మార్గం ఉన్నది. ముఖ మండపంలో శ్రీ గరుడాల్వార్, శ్రీ గణపతి, శ్రీ రామానుజులు, శ్రీ విశ్వక్సేనులు వేంచేసి ఉంటారు. చిన్న గర్భాలయంలో కొంచెం ఎత్తైన పీఠం మీదస్థానక భంగిమలో శ్రీ గదాధర స్వామి శంఖు, చక్ర, గదాధారులై అభయ ముద్రతో నయన మనోహరంగా దర్శనమిస్తారు. ఆలయ విమానం పైన దశావతారాలను, కృష్ణ లీలలను చక్కగా మలిచారు. ప్రహరి గోడ నలుదిక్కులా వినతా తనయుడు వినమ్ర భంగిమలో ఆలయానికి కావలి అన్నట్లు ఉంటాడు. వైకుంఠవాసుని సేవించుకొని మరో మార్గం ద్వారా నది ఒడ్డుకు, అక్కడి నుండి ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ పరశురామ ఆలయానికి చేరుకొవచ్చును.
శిధిల ప్రధాన ద్వారం దాటగానే తమిళ భాషలో ఉన్నశాసనం ఒకటి, తెలుగు శాసనం ఒకటి కనిపిస్తాయి. ఎదురుగా డెభై స్థంబాల సుందర ఉత్సవ / నాట్య మండపం ఉంటుంది. లభించిన ఆధారాల ప్రకారం ఈ నిర్మాణం పదో శతాబ్దానికి చెందినట్లుగా తెలుస్తోంది. గజ పృష్ట గర్భాలయ పైన సునిశిత చెక్కడాలు చూపరులను ఆకట్టుకొంటాయి. ఆలయ రెండో ప్రాకార గోడల పైనా కొన్ని తమిళ శాసనాలున్నాయి. ముఖ మండపంలో త్రవ్వకాలలో లభించిన విగ్రహాలనుంచారు. గర్భాలయంలో శ్రీ పరశురాముడు స్థానక భంగిమలో ఉంటారు. ప్రస్తావించవలసిన అంశం ఏమిటంటే మనకు తెలిసిన పరశురాముడు, శిఖ, గడ్డం మీసాలతో, నార బట్టలు, రుద్రాక్ష మాలలు ధరించి ఉంటారు. కాని ఇక్కడ ముకుట ధారిగా, స్వర్ణాభరణ భూషితులుగా రమణీయంగా దర్శనమిస్తారు. ఎదురుగా ముఖ మండపంలో ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన మహనీయులు శ్రీ ఏకా తాతయ్య గారు పద్మాసనం వేసుకొని, ధ్యాన ముద్రలో ఉన్నట్లుగా ఉంటారు. ఇక్కడొక చిత్రమైన నమ్మకం ప్రచారంల
తాతయ్య గారి చేతిలో నాణెం పెట్టి ఆయన విగ్రహాన్ని కౌగలించుకొంటే మనోభిస్టాలు నెరవేరతాయట. ఆయన వెనుక గోడకు ఉన్న రంధ్రం గుండా ప్రతి రోజు సాయం సంధ్యా సమయంలో సూర్య కిరణాలు నేరుగా మూల విరాట్టును తాకుతాయి. అరుదైన నిర్మాణ విశేషం.ఈ రెండు ఆలయాల నడుమ ఎన్నో పురాతన నిర్మాణాలు, చెదురుమదురుగా పడిఉన్న విగ్రహాలెన్నో కనిపిస్తాయి. అత్తిరాల లోని మూడో ఆలయం అత్యంత అరుదైనది. బహుశ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఒకే ఒక్క ఆలయంగా పేర్కొనవచ్చును. అదే శ్రీహరి ఆరో అవతారమైన శ్రీ పరశురామ ఆలయం. లభించిన ఆధారాల ద్వారా ప్రస్తుత నిర్మాణం పదో శతాబ్దం నాటిదిగా నిర్ణయించబడినది. ప్రస్తుతం పురావస్తు శాఖ వారి అధీనంలో ఉన్న ఇక్కడ మొత్తం తొమ్మిది శాసనాలున్నాయి.
అందులో ఒకటి మాత్రమే తెలుగులో ఉండగా మిగిలిన ఎనిమిదీ తమిళంలో ఉంటాయి. పడమర దిశగా ఉండే ఈ ఆలయ విమానం గజ పృష్ట విమానం ( శయనించిన ఏనుగు వెనుక భాగాన్ని పోలి ఉంటుంది). ఇలాంటి విమానమున్న ఆలయాలు చోళ రాజులు పాలించిన తమిళ నాడులో ఉన్నాయి. ప్రాంగణంలో డెభై స్థంభాల మండపం ప్రత్యెక ఆకర్షణ. రాజుల కాలంలో ప్రతిష్టించిన మూలవిరాట్టును ముష్కరులు దండయాత్రలో ధ్యంసం చేయగా తరువాత అలాంటిదే మరో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ధ్యంసం అయిన చాలా విగ్రహాలను ముఖ మండపంలో ఉంచారు. మామూలుగా మనకు తెలిసిన పరశురాముడు శిఖ, పెరిగిన గడ్డం మీసాలతో ఉంటారు. కానీ ఇక్కడ రాజకుమారుని మాదిరి శిలా రూపంలో దర్శనమిస్తారు. చక్కని శిల్ప కళకు నిలయం ఈ ఆలయం.
పూజలు - ఉత్సవాలు
రక్షిత నిర్మాణంగా పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నందున ఎలాంటి నిత్య పూజలు శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉండవు. కాని శ్రీ త్రేతేశ్వర స్వామి వారికి, శ్రీ గదాధర స్వామి వారికి ప్రతి రోజు పూజలు, అభిషేకాలు జరుగుతాయి. అత్తిరాలలో మహా శివ రాత్రి పర్వ దినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. జిల్లా నుండే గాక సమీప జిల్లాల నుండి కూడా భక్తులు అసంఖ్యాకంగా తరలి వస్తారు. భారత దేశంలోనే శ్రీ పరశురామ ఆలయాలు అరుదు. మన రాష్ట్రంలోని ఒకే ఒక్క ఆలయం ఉన్న ఈ పరశురామ క్షేత్రాన్ని ప్రచారంలోనికి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంతటి ప్రాధాన్యతలకు నిలయమైన అత్తిరాల కడప జిల్లా రాజంపేటకు అయిదు కిలో మీటర్ల దూరంలో ఉన్నది.
రాజంపేటకు రాష్ట్రంలోని అన్ని నగరాల నుండి బస్సు సౌకర్యం కలదు. సందర్శకులకు కావలసిన వసతి, భోజనాలు రాజంపేటలో లభిస్తాయి. తిరుపతి నుండి కూడా సులభంగా రాజంపేట చేరవచ్చును.

Share:

వర్షం కురిపించే విమల నాద జైన విగ్రహం...


వింత దేవాలయం ..పదమూడవ జైన తీర్ధంకరుడు విమల నాధుని దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరం గ్రామం లో ఉంది .ఈ విగ్రహం రెండు వేల అయిదు వందల ఏళ్ళ నాటిదని చరిత్ర చెబుతోంది .నల్లరాతితో మలచ బడి పద్మాసనం లోనాలుగు అడుగుల ఎత్తు విమల నాధుని విగ్రహం దర్శనమిస్తుంది .
వందేళ్ళ క్రితం పంటపొలాల్లో గోతిలో పడి ఉంది .ఈ విగ్రహం .చాకలి వాళ్ళు దీనిపై బట్టలుతికే వారు .అప్పుడు ఆ వూరిలో కరువు తాండవించింది ,అంటువ్యాధులు ప్రబలాయి .ఒక రోజు ఆ గ్రామ స్త్రీ కలలో అది రాయి కాదని ,దేవుని విగ్రహం అని దాన్ని బయటికి తీసి ప్రతిస్తించమని కోరింది .అప్పుడు అందరుకలిసి బయటకు తీసి ఒక అరుగు కట్టి దాని మీద ప్రతిష్టించారు .ఆ తర్వాతా అరవై ఏళ్ళకు అది జైన విగ్రహం అని తెలిసి భీమ వరం జైనులకు తెలియ జేశారు .వారొచ్చి
అది జైన విగ్రహమే నని తెలుసుకొని దాన్ని పేద తిమిరం గ్రామస్తులను తమకు ఇవ్వమని కోరగా వీరు నిరాకరించారు .అప్పుడు రాజ మండ్రి జైన పెద్దలోచ్చి శ్రీ నందన్ విజయాజ్ మహా రాజ్ ఆధ్వర్యం లో అక్కడే పేద తిమిరం లో అందరి సహకారం తో జైన దేవాలయాన్ని 1965 ఫిబ్రవరి పదిన నిర్మించి విమల నాధుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు .ఉత్తర ,దక్షిణ జైనులకు తీర్ధ స్తలం అయింది .సకాలం లో వర్షాలు కురవక పొతే 108కుండలతో ,108 కొబ్బరికాయలతో అభిషేకం చేస్తే వర్షం తప్పక కురిస్తుంది అని నమ్మకం .ఈ ఆలయం రాజ మండ్రి –నిడద వోలు మార్గం లో ఉంది.

Share:

శత్రుదుర్బేద్యమైన.. దుర్గంకోట...




పాలెగాళ్ల పాలనకు సజీవ సాక్ష్యం (పులివెందుల) చారిత్రక కట్టడాలు.. పురాతనమైన కోటల ు శిధిలావస్థకు చేరాయి. దట్టమైన అటవీ ప్రాంతం, దండకారణ్యాలలో కోటల నిర్మాణం కనిపిస్తుంది. వీటి గురించి పట్టించుకునే నాధుడు కరువైపోవడంతో వాటి స్వరూపాలే మారాయి కేవలం శిధిలావస్థకు చేరిన మొండి గోడలు దర్శనమిస్తాయి. పర్యాటక క్షేత్రాలు వెలసిల్లాల్సిన ప్రాచీన కోటలు, వాటి కట్టడాలు గుర్తిపట్టని స్థితికి చేరాయి. అటువంటి వాటిలో దుర్గం కోట, శత్రుదుర్బేద్యమైన కోటలా కనిపిస్తుంది. పులివెందుల పట్టణానికి సుమారు 15కిలోమీటర్ల దూరంలో పాల కొండలపైన ఈ కోటను నిర్మించారు. ఇప్పటికీ అలనాటి పాలెగాళ్ల పాలనకు ఈ దుర్గం కోట సజీవ సాక్ష్యంగా నిలిచింది. సీనియర్‌ పాత్రికేయులు, రచయిత మరకా సూర్యనారాయణరెడ్డి, మైదుకూరు పంచాయతీ కార్యదర్శి బి మల్లికార్జునరెడ్డిలు పర్యటించి, కోటపై అధ్యయనం చేశారు. దుర్గం కోట వైభవాన్ని చరిత్ర ఆధారంగా వారు విశదీకరించారు. చరిత్ర పూర్వాపరాల వివరాలిలావున్నాయి రాయలసీమలో బ్రిటిష్‌ పాల ప్రారంభమైన తొలిదినాల వరకు సుమారు 80మంది పాలెగాళ్లు పాలన సాగించారు. ఈ పాలెగాళ్ల వ్యవస్థ విజయనగర సామ్రాజ్య పాలనా కాలంలో ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం విజయనగర రాజుల కాలంలో వారి అధీనంలో ఉండేది. సహజంగా ఈ ప్రాంతం అరాచక ప్రాంతం కావడంతో సుస్థిర పాలన కోసం విజయనగర రాజులు స్థానిక యుద్ధవీరులను పాలెగాళ్లుగా నియమించి, వారి ద్వారా కప్పం రాబట్టుకుంటూ పరిపాలించారు. స్థానికంగా పులివెందుల చుట్టూ వంద చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో మీదిపెంట్లకో, దుర్గంకోట, పులివెందుల కోట, కోమన్నూతల, పాలెం ఈ ఐదు ప్రాంతాలలో పాలెగాళ్లు కోటలు నిర్మింతుకుని స్థానికంగా పన్నులు వసూలు చేస్తూ, అరాచకాలను అణచివేస్తూ విజయనగర సామ్రాజ్యానికి అధిపతులై పాలించారు. కడప, అనంతపురం జిల్లా సరిహద్దుల్లో శేషాచలం కొండలు(పాలకొండలు) ఈ పాలెగాళ్ల స్థావరాలుగా ఉండేవి. వీరందరూ పట్ల, ఇకిలి కులానికి చెందినవారుగా చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్‌ పాలనలోకి ఈ ప్రాంతం వెళ్లడంతో ఈ ప్రాంతానికి తొలి కలెక్టర్‌ గా థామస్‌ మన్రో మదరాసు2.4.1800న మదరాసు గవర్నర్‌ నియమించారు. విజయనగర సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత ఈ ప్రాంతం గోల్కొండ సుల్తానులు, నిజాం ప్రభువులు, తర్వా కొన్నాళ్ల పాటు టిప్పు సుల్తాన్‌, మహారాష్ట్రులు, తిరిగి నిజాం ప్రభువులు, వారి తర్వాతకాలంలో ఈస్టిండియా కంపెనీ అధీనంలోకి వచ్చింది.ఈ మధ్య కాలంలో ఈ పాలెగాళ్లు బ లపడి స్థానిక ప్రజలను దోచుకోవడంతో పాటు అరాచకంగా పాలించారు. జిల్లా కలెక్టర్‌ రుగా థామస్‌ మన్రో రావడంతోనే ప్రధానంగా వీరిపైనే దృష్టి పెట్టి, దాదాపు 80మంది పాలెగాళ్లను నిర్ధాక్షిణ్యంగా అణచివేశారు. కొంత మంది లొంగిపోయిన పాలెగాళ్లకు పింఛన్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. దీంతో ఈ పాలెగాళ్ల వ్యవస్థ పూర్తిగా అం తరించింది. ఇందులో భాంగా దుర్గంకోట కూడా అంతరించిపోయింది.
దుర్గం కోట చరిత్రి
ఈ ప్రాంతంలో ప్రముఖ పాలగాడు వేముల మండలంలోని మీదిపెంట్ల పాలెగాళ్లు వీరికి 600మంది సైన్యం, 26 గ్రామాలు వీరి ఏలుబడిలో ఉండేవి, వీరి అధీనంలోపులివెందుల, దుర్గంకోట, నెరుచుపల్లె, లక్కిరెడ్డిపల్లె, కోమన్నూతల, లోపట్నూతల పాలెగాళ్లు ఉండేవారు. దుర్గంకోటను మల్లప్పనాయుడును నిర్మించారు. ఈ కోట పులివెందుల మండలం కనంపల్లె గ్రామ సమీపంలోని పులివెందుల నుంచి కదిరివెళ్లే మార్గంలో నామాలగుండు ఆలయానికి పశ్చిమ దిశలో సముద్రమట్టానికి రెండు వేల ఎత్తులో పాలకొండల మధ్యలో నిర్మించారు. ఈ ప్రాంతం పెనుగొండ నుంచి గండికోట పోవుటకు ప్రధాన మార్గంగా ఉండేది. రెండు కొండల మధ్య పోయే దారిలో మనుషులు, సైన్యం పోయే దారికావడంతో ఈ మార్గం కాపు దారి చేయుటకు కొండపైన కోటను నిర్మించారు. నామాల గుండు వద్ద ఓ కోనేరు వద్ద శివాలయాన్ని నిర్మించారు. దీంతో మల్లప్ప కొండగా పిలుస్తారు. ఈ కోటను ఎత్తయిన కొండ మధ్య నిర్మించారు. ఈ కొండ పైభాగం నుంచి చూస్తే చుట్టు పది కిలోమీటర్ల దూరం నుంచి చూస్తే వచ్చిపోయే వారిని గమనించవచ్చు. దూరం నుంచి శత్రువులను కూడా సులువుగా గుర్తించవచ్చు. అయితే కొండపైన ఉన్న కోటను చాలా కష్టంతో కూడిన పని, కొండపైకి వెళ్లడనికి సరైన దారిలేదు. గుర్రాలు కూడా అక్కడికి వెళ్లడం కష్టమనిపిస్తుంది.
కోట నిర్మాణం
కోట చుట్టూ రక్షణ గోడలు నిర్మించారు. ఈ గోడ కిలోమీటర్ల దూరం వ్యాపించి నేటికి కనిపిస్తోంది. కోట నిర్మాణం మూడంచెలుగా ఉంది. ఇందులో తొలి నిర్మాణంలో సామాన్య ప్రజల కోసం నిర్మించినట్లు తెలుస్తోంది. వీరి నిత్యావసరా కోసం 50 అడుగులవిస్తీర్ణంతో చదరంగా దిగుడి బావిని ఏర్పాటు చేశారు. ఇందులో పది అడుగుల లోతులోనే నీరు నేటికి కనిపిస్తుంది. రెండవ అంచెలో ఇసుక, సున్నం(గార)తో నిర్మించిన గోడలను నేటికి చూడవచ్చు. మూడవ భాగం చుట్టూ బురుజుల లోపలి భాగం ప్రధానమైన వ్యక్తులు ఉండేవారని తెలుస్తోంది. మొత్తం ఈ ప్రాంతంలో నాలుగు అడుగుల బావులు ఉన్నాయి. అవి నేటికి చెక్కు చెదరకుండా ఉపయోగపడుతున్నాయి. తాగునీరు ఉంది. బావులు విశాలమైనవి. అన్ని బావుల్లోనూ పది అడుగుల లోపలే ఉన్నాయి. అలాగే అలనాడు నిర్మించిన చెరువు ఉంది. ఆ చెరువు నేటికి చెక్కుచెదరలేదు. ఇందులో కూడా నీరు ఉంది. మరోవైపు కుంట కూడా ఉంది. పాలెగాళ్లు కొలిచిన గ్రామ దేవత గంగమ్మ ఆలయం శిధిలావస్థలో ఉంది. కోట చుట్టు బురుజులు, బండరాళ్లు చూడముచ్చటగా కనిపిస్తాయి. ఎత్తయిన కొండల్లో నిటారుగా పెరిగిన వృక్ష సంపద నడుమ పక్షుల కిలకిల రావములతో ఈ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
దుర్గంకోట పర్యాటక ప్రాంతం
దుర్గంకోట నేటికి చూడటానికి ఎంతో అద్బుతంగా ఉంది. ఆహ్లాదకరంగా ఉంది. కదిరి, పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉన్నందున ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం గుర్తించాలని, అందుకు నామాలగుండు నుంచి దుర్గంకోటకు దారి ఏర్పాటు చేయాలని, దుర్గంకోటలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నందున ప్రధానంగా అటవీ కాబట్టి అరుదైన మొక్కలు, కనుమరుగవుతున్న చెట్లను గుర్తించి వాటిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రాచీన కట్ట డాలను మరమ్మతులు చేసి, ఈ కట్టడాలను పాడు చేయకుండా బావి తరాల వారికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని పలువురు పర్యాటకలు కోరుతున్నారు. నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. అందువల్ల ఈ ప్రాంతంలో చాలా కట్టడాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుని తవ్వకాలను నిలిపి వేసి పురాతన కోటను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిందిగా ఈ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List