2019 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

భారతదేశంలోనే అతిపెద్ద బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం.


రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణం లో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ.
.
అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె వున్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.
.
తమిళనాడు లోని తంజావూరు లోని బృహ దీశ్వరాలయం చాల ప్రసిద్ది చెందినది. దీనిని చోళ రాజు రాజ రాజ చోళుడు నిర్మించాడు. ఇది చాల ప్రసిద్ది చెందిన ఆలయం. ఇది చాల పెద్ద ఆలయం.. పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తున్నది. పైన 80 టన్నుల బరువున్న నల్లరాతి తో శిఖారాగ్రాన్ని నిర్మించారు. ఇంత బరువున్న ఆ పెద్ద రాయిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఎవ్వరికి అర్థం కాని విషయం. ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ల దూరం నుండి ఏట వాలుగా ఒక రాతిమ్ వంతెన కట్టి దాని పైనుంది ఏనుగులతో అతి భరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని తెలుస్తున్నది. రాజ రాజ చోళుడు క్రీ.శ్. 985 నుండి 1012 వరకు రాజ్యం చేశాడు. చరిత్రను బట్టి ఈ ఆలయాన్ని రాజు తన 19 వ ఏటనే ప్రారంబింఛాడని తెలుస్తున్నది. గర్బ గుడి లోని శివ లింగం 13 అడుగుల ఏక శిలా నిర్మితం. ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు..


https://www.facebook.com/rb.venkatareddy
Share:

హోయసలేశ్వరాలయం.

12 - 13 శతాబ్ధి మధ్యకాలంలో హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇదే సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు నిర్మించాడని అంటారు. ఈ నిర్మాణంలో తన మంత్రి కేతనమల్ల తోడ్పడినాడని, ఇతనితో పాటూ కేసరశెట్టి అను శివభక్తుడు కూడా తోడ్పడినట్టు తెలుస్తుంది. ఈ నిర్మాణం 1160 ప్రాంతంలో పూర్తైంది. ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో మాలిక్ కాఫర్ దాడులను ఈ ప్రాంతం చవి చూసింది. అనేక శిథిలాలు ఇక్కడ మిగిలిపోయాయి. అందుకే దీనికి హలెబీడు (శిథిల నగరమని, పాత నివాసమని) అనే పేరు స్థిరపడిపోయింది.
ఇక్కడ ప్రధానాలయం హొయసలేశ్వరాలయం. ఇది ద్వికూటాలయం. ఇందులో రాజా హోయసల పేరు మీదుగా ఒకటి, రాణి శాంతలదేవి పేరు మీదుగా మరొకటి, రెండు శివలింగాలను ప్రతిస్ఠించారు. వీటికి హోయసలేశ్వరుడని, శాంతలేశ్వరుడని పేరు. ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెందు పెద్ద నందులు ఏర్పాటు చేశారు. వీటి చుట్టూ మండపాలు ఉన్నాయి. ఈ నందులు రకరకాల అలంకరణలతో అందంగా చెక్కబడినవి. ఇవి దేశంలో అతి పెద్ద నందులలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నవట.
గర్భగుడి ముఖద్వారం, నంది, బృంగీ విగ్రహాలు, ఆలయంలోపల పై కప్పుపై, వెలుపల ఆలయ గోడలపై హిందూ పూరాణ గాథలను స్ఫురింపజేసే శిల్పాలు, జంతువులు, పక్షులు, నర్తకిల శిల్పాలు బహు సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. ఇక్కడి శిల్పాలు, కళాకృతులు, హోయసల శిల్ప శైలికి నిలువుటద్దాలు. ఈ దేవాలయాల నిర్మాణానికి సబ్బురాతిని/బలపపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం తూర్పు ముఖమై ఉంటుంది. ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. రెందు ద్వారాలు తూర్పు వైపు, ఒకటి ఉత్తరం వైపు, మరోటి దక్షిణం వైపునూ. ఉత్తరం ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలక విగ్రహం ఆకర్షణియంగా ఉంటుంది. ఆలయం వెలుపల ఉద్యానవనంలో గోమఠేశ్వరుడి విగ్రహం ఉంది. ఈ దేవాలయ సముదాయంలో పురావస్తు శాఖ వారి మ్యూజియం, దగ్గరలోనే ఓ పెద్ద సరస్సు ఉన్నాయి. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
హళేబీడు కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. హళేబీడు, బేలూరు, శ్రావణబెళగొళను కర్ణాటక పర్యాటక శాఖవారు స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. హళేబీడును, బేలూరును, హోయసలుల జంట పట్టణాలుగా పిలుస్తారు. హళేబీడు మరియు బేలూరు జిల్లా కేంద్రమైన హాసన్‌కు అతి సమీప చిన్న పట్టణాలు. దీనికి పూర్వం దొరసముద్ర, ద్వారసముద్ర అని పేర్లు ఉండేవి. అనగా సముద్రానికి ద్వారం వంటిదని. ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో మాలిక్ కాఫర్ దాడులను ఈ ప్రాంతం చవి చూసింది. అనేక శిథిలాలు ఇక్కడ మిగిలిపోయాయి.
హళేబీడుకు బెంగళూరు,మైసూర్, మంగళూరు, జిల్లా కేంద్రమైన హాసన్ నుండి, మరో చారిత్రక ప్రాంతం బేలూరు నుండి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. బేలూరుకు 16 కిలో మీటర్ల దూరంలోనూ, హాసన్‌కు 31 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. హాసన్ నుండి ప్రతి 15 నిమిషాలకో బస్సు ఉంటుంది.


Share:

నీటితో నిర్మితమైన మహిమాన్విత స్వయంభు శివలింగం క్షేత్రం.

ఈ ఆలయం శ్రీ రంగం లొ ఉన్న రంగనాథేశ్వర స్వామి ఆలయం కన్నా పురాతన మైనదని తెలుస్తోంది. క్రీ.శ. 11 వ శతాబ్ధములొ చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆ తరువాత ఆలయ నిర్వహణ పల్లవ రాజులు, పాండ్యులు విజయనగర రాజులు చేసినట్లు తెలుస్తోంది. ఆలయం స్వామి దీపధుపాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు మణిమాన్యాలు ఏర్పాటు చేసి నట్లు తెలుస్తోంది. నాయనార్ల లొ ప్రసిద్ధులైన సుందరర్ సంబంధర్ మొదలైనవారు స్వామిని సేవించి తరించారు.
కొంత కాలం క్రితం వరకు ఈ ఆలయనిర్వహణ బాధ్యతలు కంచి కామకోటి మఠం వారు నిర్వహించారు.
శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తుండేవాడు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు శివుని పూజించందే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు. కాలం గడుస్తూ వుండగా ఒకసారి శంభుడికి శివున్ని ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది. ఆ విధంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయనారంభించాడు. శివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షం అయి వరం కోరుకోమనగా శంభుడు తన అభీష్టం అయిన ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకొన్నాడు. భోళా శంకరుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపములొ వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపంలో ఉండి నన్ను పూజించెదవు అని చెప్పి అంతర్థానం అవుతాడు. శివుడు శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భించగా శంభుడు జంబు వృక్షమై శివుని అర్చిస్తుంటాడు. ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబువృక్షమే శంభుడి గా ఇక్కడి భక్తుల నమ్ముతారు.
మరో ఇతిహాసం ప్రకారం :....
ఇక్కడ స్వామి వారిని ఏనుగు, సాలిపురుగు పోటి పడి పూజిస్తుండేవి. ఆ శ్రీకాళహస్తి స్థలపురాణానికి సన్నిహితంగా ఉండే ఇతిహాసం ఇక్కడ కూడా వినిపిస్తుంది. జంబుకేశ్వరం పవిత్ర కావేరి నది ఒడ్డున ఉన్నది. స్థానికులు ఈ నదిని పొన్ని అని పిలుస్తారు. తమిళం లో పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరి నది లో స్నానం ఆచరించడం జంబుకేశ్వరుడిగా వెలసిన శివుడిని కొలవడం చాలా శ్రేష్ఠం అని ఇక్కడి స్థానికుల నమ్మకం.
ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాక్రారాలతో ఎత్తైన గోపురాలతో ఉన్నది. దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో, ఐదు ప్రాకారాలు కలిగి ఉన్నది. ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి. జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు. గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉన్నది. ఆలయప్రాకారములొ జంబుకేశ్వర స్వామి ఆలయం, అఖిలాండేశ్వరి ఆలయమే కాకుండా అనేక ఉపఆలయాలు, అనేక మండపాలు ఉన్నాయి.
జంబుకేశ్వరుడిగా పేరుపొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితో నిర్మితమైంది కాని నీటిలో లేదు. లింగం పానపట్టం నుండి ఎల్లకాలము నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టం పై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడి లో గవాక్షానికి "నవద్వార గవాక్షం" అని పేరు. గర్భాలయం లో ఉన్న జంబుకేశ్వరుడినే అప్పులింగేశ్వరుడు, నీర్ తిరళ్‌నాథర్ అని కూడా పిలుస్తారు.
అఖిలాండేశ్వరి ఆలయం :.....
జంబుకేశ్వరస్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు.అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు, నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకొన్నట్లు, క్రింది చేతులు అభయ హస్తం తో వరద ముద్ర తో ఉన్నారు. అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్ర రూపంగా ఉండేవారని శంకరాచార్యులు ఈమె ఉగ్ర రూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగ మార్చారని చెబుతారు. అమ్మవారి ముందు కనిపించే శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని , అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యులవారే సమర్పించారని చెబుతారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారని ఇక్కడి వారి నమ్మకం.
వివరణ ....
పంచభూత క్షేత్రాలలొ రెండవది జంబుకేశ్వరం. జంబుకేశ్వరం తమిళనాడు రాహ్స్ట్రములొని తిరుచ్చి 11 కి.మి దురములొ ఉన్నది. జంబుకేశ్వరానికి తిమేవకాయ్ మరియు తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రము అని అర్థం. పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. జంబు వృక్షాలంటే తెల్లనేరేడు వృక్షాలు.

Share:

శ్రీ సద్గురు దత్తాత్రేయ నరసింహ సరస్వతి పుణ్యక్షేత్రం.

నారద మహర్షి అనసూయ "పాతివ్రత్యాన్ని" (భర్త పట్ల భక్తిభావం) గురించి బ్రహ్మ-విష్ణు-శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు, దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది. ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ నాధులను వేడుకున్నారు. అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్లి, తమకు భోజనం పెట్టమని అడిగారు. ఆమె అందుకు అంగీకరించగానే, ఆమె దుస్తులు ధరించకుండా నగ్నరూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు.
.
అనసూయ దీంతో సందిగ్ధతలో చిక్కుకుంది. పరపురుషుల ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది. ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిధులను అగౌరవపర్చినట్లవుతుంది అప్పుడు వారు అత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు. తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కులో పడవేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది. అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకుని, తాను కాముకత్వ ప్రభావానికి గురి కాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది. అతిథులు ఆమెను "భవతీ బిక్షాం దేహి" (ఓ మాతా! మాకు భిక్ష ప్రసాదించు) అని కోరుతూ ఆమెను తల్లీ అని పిలిచారు. అందుకని ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది.
.
ఆమె గొప్పతనం మరియు ఆమె ఆలోచనల కారణంగా, ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్లు చిన్న పిల్లలుగా మారిపోయారు, ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి. తర్వాత ఆమె వారికి పాలు కుడిపి ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది. తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగివచ్చి జరిగిన కథను అనసూయనుంచి తెలుసుకుని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించాడు. వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశలతో దూర్వాసుడు, దత్తాత్రేయ మరియ వెన్నెల దేవుడు చంద్రుడుగా జన్మించవలసిందిగా వరమడిగింది. మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్యతిథి. దీనిని దత్త జయంతి గా వ్యవహరిస్తారు.
.
హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరు ల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది.
.
ఉత్తరాది సాంప్రదాయంలో, దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా, మరియు నాథ యొక్క అధినాథ్ సంప్రదాయానికి సంబంధించిన ఆది-గురు (ఆది గురువు)గా గుర్తిస్తున్నారు. దత్తాత్రేయ మొట్టమొదటిలో యోగదేవుడుగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ, తర్వాత అతడు మరింత భక్తి (సంస్కృతం: భక్తి) కి సంబంధించిన వైష్ణవ పూజావిధానాలను పుణికి పుచ్చుకుని, సంలీనమయ్యాడు; ఇతడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే, భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు. దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు, అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు.
.
రెండవ కలియుగ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు శ్రీ కృష్ణ సరస్వతి స్వామి వారి దగ్గర సన్యాసం స్వీకరించిన తారువాత వారు దేశాటనలో భాగంగా అనేక ప్రాంతాలను తమ పాద స్పర్శతో పునీతంచేస్తూ దాదాపుగా తమ 47వ ఏటా అష్టతీర్ధములతో కూడిన భీమ-అమరజ నదీసంగమ ప్రాంతమైన గంధర్వపురము (గాణుగాపురము/గాణ్గాపూర్) లో అడుగు పెట్టారు. ఆ ప్రాంత మహిమను లోకానికి వెల్లడించడం కోసం అక్కడ ఒక మఠమును కుడా స్థాపించారు. అది మొదలు వారు తమకు 70 సంవత్సరాలు వచ్చేవరుకు గంధర్వపురము లోనే ఉన్నారు. శ్రీపాద శ్రీ వల్లభుల వారికి కురువపురం ఎలాగో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి గంధర్వపురము అలాగే (యోగ /తపోభూమి) అని చెప్పవచ్చు. ఇచ్చట నుండే శ్రీ గురుడు (శ్రీ నృసింహ సరస్వతి స్వామి) అనేక లీలలను చేసి చూపారు. ఎటుచూసినా దత్త భక్తులతో, దత్తాశ్రమాలతో, గోవులతో, దత్తశునకాలతో నిండి ఉన్న గాణ్గాపూర్ సందర్శన దత్త భక్తులందరికీ మంచి అనుభూతిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
.
ఘనగాపుర క్షేత్ర ఉంది (పుణ్య క్షేత్రము లో) శ్రీ నరసింహ సరస్వతి స్వామి, దత్తాత్రేయ రెండవ అవతారం. శ్రీ గురుచరిత్ర పుస్తకం ప్రకారం, అతను ఘనగాపుర వద్ద ఎప్పటికీ నివాసం ఉంటనని వాగ్దానం చేసారు.అతను ఉదయం భీమ మరియు అమ్రాజ నదుల సంగమం వద్ద స్నానం చేస్తారు. మధ్యాహ్నం సమయంలో, అతను భిక్ష (ఆహారం భిక్ష) కోరుతూ గ్రామం లోకి వెళ్ళి వెళతారు, మరియు ఆలయం వద్ద నిర్గుణ పాదుకా రూపంలో పూజలు అందుకొంటారు. భక్తులు సంగమం వద్ద స్నానం ఆచరించి, ఘనగాపుర కనీసం ఐదు గృహాల నుండి భిక్ష యాచించడం ద్వారా, మరియు ఆలయం వద్ద పాదుకా పూజా మరియు దర్శనం ద్వారా, వారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి అనుగ్రహం పొందుదురు. దాని ద్వార పాపముల నుండి విముక్తి పొందుదురు.
.
ఘనగాపుర (కొన్నిసార్లు శ్రీ క్షేత్ర ఘనగాపూర్ పిలుస్తారు) భారతదేశం లోని కర్ణాటక రాష్ట్రము లో అప్జల్ పూర్ తాలూకా గుల్బర్గా జిల్లా లో కలదు. ఈ గ్రామం, గురు దత్తాత్రేయ ఆలయం గా ప్రసిద్ధిచెందింది. గురు దత్తాత్రేయ భీమ నది ఒడ్డున పరిపూర్ణత పొందారని చెబుతారు.

Share:

స్వయంభు భీమేశ్వరలింగం.

పూర్వము కుంభకర్ణునికి కర్కటి అనే రాక్షసికి పుట్టినవాడే భీమాసురుడు. తన తండ్రిని నారాయణుని అంశకల శ్రీరామచంద్రుడు సంహరించెనని తెలుసుకుని నారాయణునిపై పగ సాధించదలచి బ్రహ్మదేవుని గురించి వెయ్యి సంవత్సరముల ఘోర తపస్సు చేసెను. అంత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భీమాసురుని వరం కోరుకోమనెను. ఆ రాక్షసుడు ఈ బ్రహ్మాండములో ప్రత్యక్షమై భీమాసురుని వరం కోరుకోమనెను. ఆ రాక్షసుడు ఈ బ్రహ్మాండములో తనతో సమానమైన బలవంతుడు వుండరాదని కోరుకొనెను. బ్రహ్మదేవుడు అటులనే అని వరమిచ్చెను. తదుపరి భీమసురుడు, ఇంద్రుడు మొదలగు దేవతలను జయించి నారాయణుని కూడా జయించెను. భీమాసురుడు మూడు లోకములలో ఎచ్చట యజ్ఞయాగాదులు జరుగకుండా చేయుచూ అందరూ తననే పూజించవలెనని భక్తులందరిని బాధించుచుండెను. కాని కామరూపేశ్వరుడు, అతని భార్యయైన సుదక్షిణాదేవి మానసపూజా విధమున పరమేశ్వరుని ప్రణవ సహిత శివపంచాక్షరితో పూజించుచుండెను.
పరమేశ్వరుడు కామరూపేశ్వర దంపతుల వద్ద పార్ధివ లింగ రూపములో వుండి వారి పూజలను స్వీకరించసాగెను. రోజురోజుకీ పాతాళరాజు పూజలు అధికమైనవి. అది చూసి భీమాసురుడు నీవు చేయు పూజలు ఆపెదవా లేక శివ లింగమును భిన్న మొనర్చెదనని అనగా పాతాళరాజు భయపడక పరమేశ్వరునిపై నమ్మకముతో నీ చేతనైనని చేసుకొమ్మని పూజలు కొనసాగించెను. భీమాసురుడు తన చేతిలోని ఖడ్గముతో శివ లింగమును తాకెను. రాక్షసుని కత్తి తగిలిన వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఓరీ అసురా! నా భక్తులను రక్షించుటే నా కర్తవ్యమని భీమాసురుని సంహరించెను. భీమాసురుని తల్లి కర్కటి తన కుమారుని శరీరము పాతాళము నుండి భూమి మీదకు వచ్చి శివుని గురించి దీనాతిదీనంగా ప్రార్ధింప స్వామి దర్శనమిచ్చి వరము కోరుకోమనెను. అప్పుడు ఆమె తనయుడి పేరు చిరస్థాయిగా వుండునట్లు అదే ప్రదేశములో జ్యోతిర్లింగముగా వెలయునని కోరుకొనెను. అంతట పరమేశ్వరుడు ఆమె కోరికను మన్నించి భీమశంకర జ్యోతిర్లింగముగా ఆ సహాద్రి పర్వతములలో వెలసెను. కృష్ణానది ఉపనది అయిన భీమనది ఇచటనే పుట్టి స్వామివారి సేవకు ఉపయోగపడుచున్నది.
ఈ క్షేత్రము రాష్ట్రలోని భీమశంకర్‌లో కలదు. పూణు నుండి భీమశంకర్‌ 120 కి.మీ. దూరములో వున్నది.

Share:

శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి.

బ్రహ్మం గారు సాక్షాత్ దైవ స్వరూపులు.రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానం లో సుస్పష్టంగా వివరించి, జనులన్దరిని సన్మార్గం లో నడువమని బోధించిన మహిమాన్వితుడు., చరితకారుల కాలజ్ఞాన పరిశోధన పలితంగా, బ్రహ్మం గారు చిన్నతనములోనే తల్లిదండ్రులను కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమం లో చేరుకున్నారు. కర్ణాటక లోని పాపాగ్ని మఠాధిపతి యనమదల వీరభోజయచార్యులు, సతీ సమేతంగా సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటారు. సంతాన ప్రాప్తి కై పరితపుస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు, దైవ స్వరూపులు అయిన బ్రహ్మం గారిని అత్రి మహాముని అందజేస్తారు.వీరభోజయాచార్య, ఈ బాలుడు, మహిమాన్వితుడు, మునుముందు, ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుడుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తారు.ఆ విధంగా బ్రహ్మం గారు పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తారు. (ఈనాడు కర్ణాటక లోని పాపాగ్ని మఠం బ్రహ్మం గారి ప్రథమ మఠం గా పేరు గాంచి దివ్య క్షేత్రం గ వెలుగొందుతున్నది.)అతి చిన్న వయసులోనే,బ్రహ్మం గారు కాళికాంబ పై సపతశతి రచించి అందరిని అబ్బురపరుస్తారు. బ్రహ్మం గారి పదవ ఏట వీరభోజయచార్యులు స్వర్గాస్తులవుతారు. అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరబోతు తన తల్లి ఆశీర్వాదాలు కోరతారు.అందుకు, వారి తల్లి, నాయన, వీరంభోట్లయ్య(బ్రహ్మం గారు చిన్న నాడు వీరంభోట్లయ్య గా పిలువబడ్డారు, పాపాగ్ని ప్రస్తుత మఠాదిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు వున్నాయి), మాతదిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి పెట్టి దేశాటనకు బయల్దేరితే ఎలాగంటూ శోక సంద్రం లో మునిగి పోతుంది. అప్పుడు బ్రహ్మం గారు, తన తల్లి గారికి సృష్టి క్రమాన్ని వివరించారు. స్త్రీ పురుషుల సంభోగం పవిత్ర కార్యమని, శుక్లాశోనితం తో స్త్రీ గర్భ ధారణ గావిన్చాక, గర్భం ధరించిన ప్రతి నెలలో, కడుపులో శిశువు ప్రాణం పోసే విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు బ్రహ్మం గారు.ఆగామి,ప్రారబ్ద,సంచిత కర్మ సిద్దాంత గురించి వివరించి ఆమెకు మాయ తెరను తొలగించి, లోక కళ్యాణ నిమిత్తమై దేశాటనకు బయల్దేరతారు బ్రహ్మం గారు.
కర్నూలు జిల్లాలొని బనగానపల్లె మండలం లో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా వుంటు రవ్వలకొండలో కాలజ్ఞానం వ్రాశారు.ఆవుల చుట్టూ గిరి గీసి రవ్వల కొండ లో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మం గారు. ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాన్నీ చూచి భయపడి పరుగు పరుగున, అచ్చమ్మ గారికి ఈ విషయాని చేరవేస్తారు.మరుసటి రోజుగా యథావిధిగా ఆవులను తీసుకుని వెళ్లి చుట్టూ గిరి గీసి రవ్వలకొండ లో కాలజ్ఞాన రచన గావిస్తూ వున్న బ్రహ్మం గారిని చూసి ఆశ్చర్య పోతుంది అచ్చమ్మ.(ఆచమ్మ బ్రహ్మం గారిని దర్శించుకున్న రవ్వలకొండ లో ఈనాడు సుందరమైన బ్రహ్మం గారి దేవాలయం వున్నది). బ్రహ్మం గారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ ప్రుట్టు గుడ్డి వాడిన తన కొడుకు బ్రహ్మానంద రెడ్డి కి చూపు ప్రసాదించమని ప్రార్తిస్తుంది. బ్రహ్మం గారు తన దివ్య దృష్టితో, బ్రహ్మానంద రెడ్డి గత జన్మ పాపాలను దర్శించి, అతనికి చూపు ప్రసాదించి, పాప నివృత్తి గావించారు. గుహలో కూర్చుని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికీ భద్రంగా ఉన్నాయి. కాలజ్ఞానం వ్రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లాయపల్లె చేరి వడ్రంగి వృత్తిచేస్తూ గడిపారు. తనవద్దకు వచ్చినవారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమసమాజం బాటన నడవాలని బోధించారు.

జననం
బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు మరియు తల్లి పోతులూరి ప్రకృతాంబ. ఆయన జీవితకాల నిర్ణయం సరిగా లేకున్నా క్రీస్తు శకం 1608 లో జన్మించారు అని కొందరి అంచనా. క్రీస్తు శకం 1518 లో జన్మించారు అని మరి కొందరి అంచనా . ఆయన ను పెంచిన తండ్రి పేరు వీర భోజయాచార్యులు మరియు పెంచిన తల్లి పేరువీరపాపమాంబ. ఆయనకు చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన మితభాషణం అలవడింది. ఆయన వీర భోజయాచార్యులు మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన ఎనిమిదవ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానభోద చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని దానిని వదలమని తల్లికి హితవు చెప్పి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు.
తల్లికి చేసిన జ్ఞానబోధ
బ్రహ్మంగారికి ఆదిశంకరులులా దేశాటన ద్వారా జ్ఞాన సంపాదన చేసి దానిని ప్రజల వద్దకు చేర్చడం అంటే మక్కువ ఎక్కువ. ఆయన తన మొదటి జ్ఞానబోధ తల్లితో ప్రారంభించాడు. శరీరం పాంచభౌతికమని ఆకాశం, గాలి, అగ్ని, పృధ్వి, నీరు అనే అయిదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాలద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని వీటి ద్వారా నేను అనే అహం జనిస్తుందని ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని బుద్ధి జీవుని నడిపిస్తుందనీ బుద్ధిని కర్మ నడిపిస్తుందని దానిని తప్పించడం ఎవరికీ సాద్యపడదనీ, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద శలవు తీసుకుని దేశాటనకు బయలుదేరాడు.
అచ్చమాంబకు జ్ఞానబోధ
బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకై తిరుగుతూ బనగానపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒకైంటి అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారిన తరవాత ఇంటి యజమానురాలైన అచ్చమ్మ ఆయనను ప్రశ్నించి ఆయన ఏ దైనా పని కోసం వచ్చానని చెప్పటంతో ఆమె ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించింది. పశువులను కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన ఆయన అక్కడి ప్రశాంత వాతావరణంచే ఆకర్షించబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకుని కాలజ్ఞానం [2] వ్రాయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో ఆయన గోవులకు ఒకావలయం ఏర్పరిచి దానిని దాట వద్దని ఆజ్ఞాపించడంతో అవి ఆవలయం దాటకుండా మేతమేస్తూ వచ్చాయి. ఒక రోజు ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమాంబ ఆయన ఏకాగ్రతగా వ్రాయడం పశువుల ప్రవర్తన గమనించి ఆయన ఒక జ్ఞాని అని గ్రహించింది. అచ్చమ్మ ఇన్ని రోజులు ఇది గ్రహించకుండా ఆయన చేత సేవలు చేయించుకున్నందుకు మన్నించమని వేడగా ఆయన నాకు దూషణ భూషణలు ఒకటేనని నీవైనా అయినా తల్లి అయినా తనకు ఒకటేనని ప్రంపంచంలోని జీవులన్నీ తనకు ఒకటేనని చెప్పాడు. ఆ తరువాత అచ్చమ్మ తనకు జ్ఞానభోద చేయమని కోరగా ఆమెకు యాగంటిలో జ్ఞానభోద చేసాడు. ఆయన అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తారు.
ఆ సందర్భంలో అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు అడిగింది.
అచ్చమ్మ:- పరమాత్మ ఎక్కడ ఉన్నాడు?
బ్రహ్మంగారు:- పరమాత్మ నీలో నాలో ఈ పశువులలో అన్నిటా ఆయన ఉనికి ఉంటుంది.
అచ్చమ్మ:- ఆయనను ఎలా తెలుసుకోగలం?
బ్రహ్మంగారు:- అనేక మార్గాలున్నప్పటికీ భక్తి, ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే పరమాత్మను తలచుకుంటూ గడపడం. ధ్యానమార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మను గురించి తెలుసుకోవడం.
అచ్చమ్మ:- ఆయన స్త్రీయా పురుషుడా?
బ్రహ్మంగారు:- ఆయన నిరాకారుడు, నిర్గుణుడు వర్ణనకు అతీతుడు. ఇలా చెప్పి వీటిని ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి తరవాత కాలజ్ఞానం గురించి చెప్పాడు.
బనగానపల్లె నవాబుకు జ్ఞానభోద
బనగానపల్లె నవాబు బ్రహ్మంగారి గురించి విని ఆయన నిజంగా మహిమాన్వితుడో కాదోనని స్వయంగా తెలుసుకోవాలని ఆయనను తన వద్దకు పిలిపించాడు.వారు రాగానే స్వయంగా స్వాగతంచెప్పి ఆయనను ఆసీనులను చేసారు. స్వామివారికి ఫలహారాలు తీసుకురమ్మని సేవకుని ఆజ్ఞాపించాడు.అయినా ఆయనకు మాంసాహారం తీసుకురమ్మని సేవకునికి ముందుగానే సూచన చేసాడు.నవాబు ఆదేశానుసారం సేవకుడు మాంసాహారం నింపిన పళ్ళెరాన్ని బ్రహ్మంగారి ముందు ఉంచాడు.ఆయన పళ్ళెరం పైనున్న వస్త్రాన్ని తొలగిస్తే ఫలహారం స్వీకరిస్తానని చెప్పగా సేవకుడు అలాగే చేసాడు.ఆపళ్ళెంలోని మాంసాహారం పుష్పాలుగా మారటం అక్కడి వారిని ఆశ్చర్యచకితులను చేసింది.ఈ సంఘటనతో నవాబుకు ఆయన మహిమలపై విశ్వాసంకుదిరి ఆయనను పలువిధాల ప్రశంసించారు.ఆ సందర్భంలో బ్రహ్మంగారి నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు.ఆతరవాత నవాబు ఆయనకు డెబ్బై ఎకరాల భూమిని దానంచేసి దానిని మఠం నిర్వహణకు ఉపయోగించవలసినదిగా కోరి ఉచిత మర్యాదలతో సత్కరించి సాగనంపారు.
విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది.అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది.అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.
ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి.ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు.జనులు అరచి అరచి చస్తారు.
కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు.
బనగాన పల్లె నవాబు పాలనకూడా క్రమంగా నాశనమౌతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.
దేశాటన
ఆపై ఆయనకు దేశాటన చేయాలని కోరిక కలగటంతో శిష్యులకు నచ్చచెప్పి దేశాటనకు బయలుదేరాడు. ఆసమయంలో కడప జిల్లాలో పర్యటిస్తూ కందిమల్లయ పాలెం చేరుకున్నాడు. ఆ ఊరు ఆయనను ఆకర్షించడంతో అక్కడ నివాసం ఏర్పరుచుకుని మామూలు వడ్రంగిలా జీవించడం ప్రారంభించారు. గ్రామంలో అమ్మవారి జాతర కొరకు చందా ఇవ్వమని పెద్దలు ఆయనను కోరగా తాను పేదవాడినని ఏమీ ఇవ్వలేనని బదులిచ్చాడు.వారు ఆయనను చులకనచేసి మాట్లాడగా ఆయన తాను ఏదైనా ఇస్తానని కానీ అమ్మవారి గుడిదగ్గర ప్రజల సమక్షంలో మాత్రమే తీసుకోవాలని కోరాడు. వారు అందుకు సమ్మతించి అమ్మవారి గుడి దగ్గరకు అందరూ చేరారు.అందరి మూదు గుడి ముందు నిలబడి ఒక చుట్ట చేత పట్టుకుని అమ్మవారిని ఉద్దేశించి 'పోలేరీ చుట్టకు నిప్పు పట్టుకునిరా ' అని కోరగానే అదృశ్యరూపంలో అమ్మవారు ఆయనకు నిప్పు అందించగా ఊరివారు దిగ్భ్రాంతి చెంది ఆయనను గౌరవించడం మొదలుపెట్టారు.ఆయన వారికి ధర్మబోధ చేయడం మొదలు పెట్టారు.ఇలా ఆయన గురించి చుట్టూ ఉండే ప్రదేశాలకు తెలిసి రావడంతో వారు ఆయనకోసం తరలి రావడం మొదలుపెట్టారు.
కొంతకాలం తరవాత బ్రహ్మంగారి కందిమల్లయపాలెం విడిచి తిరిగి దేశాటన సాగించాడు.అలా పెద కామెర్ల అనే ఊరు చేరుకుని అక్కడ నివసించసాగారు. ఆయన అక్కడ సామాన్య జీవితం ప్రారంభించారు.ఆ ఊరిలో ఒక భూస్వామి వ్యాధి బారినపడి మరణించగా ఆయనను శ్మశానానికి తీసుకు వెళుతున్న సమయంలో బ్రహ్మంగారు తన ఇంటి ముంగిట నుండి చూసి 'ఏమైందని' అని అడిగాడు.వారు 'అతడు మరణించాడు స్మశానానికి తీసుకు వెళుతున్నాం ' అని బదులు చెప్పారు.కానీ బ్రహ్మంగారు 'ఇతడు మరణింలేదుకదా ఎందుకు తీసుకు వెళ్ళడం ఇతనిని దింపుడు కళ్ళెం వద్ద దించండి' అని చెప్పి వారి వెంట వెళ్ళాడు.వారు ఆయనపై అవిశ్వాసంతోనే దింపుడు కళ్ళం వద్ద దింపారు.అప్పుడు బ్రహ్మంగారు భూస్వామి శరీరాన్ని తల నుండి పాదం వరకు చేతితో స్పృసించగానే ఆయన జీవించాడు.అది చూసిన వారంతా ఆయనపట్ల భక్తి ప్రదర్శించడం మొదలు పెట్టారు.
బ్రహ్మంగారు చేసిన మహిమలను విశ్వసించని కొందరు ఆయనను ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో సజీవంగా ఉన్న వ్యక్తిని పాడె మీద తీసుకు వచ్చి 'ఇతనికి ప్రాణం పోయండి 'అని వేడుకున్నారు.బ్రహ్మంగారు ధ్యానంలో నిజం తెలుసుకుని 'మరణించిన వ్యక్తికి ఎలా ప్రాణం పోయగలను' అని బదులిచ్చాడు. వెంటనే పాడె మీదున్న వ్యక్తి మరణించడం అందరిని ఆశ్చర్యచకితులను చేసింది.వారు బ్రహ్మంగారిని మన్నించమని వేడగా ఆయనవారికి బుద్ధిమతి చెప్పి మరణించిన వ్యక్తి తలని చేతితో స్పృజించి ఆతనిని సజీవుని చేశారు.ఆతరవాత అక్కడి ప్రజలు ఆయనను దేవుడిలా కొలవసాగారు. ఊరి ప్రజల కోరికపై ఆయన వారికి జ్ఞానబోధ చేయడం ప్రారంభించారు.
వివాహం
బ్రహ్మంగారి బోధలు విని కందిమల్లయపాలెంలోని ప్రజలు ఆయన అనుచరులుగా మారారు.ఆ ఊరిలోని కోటా చార్యులనే విశ్వబ్రాహ్మణుడు ప్రారంభంలో బ్రహ్మంగారిని నమ్మకపోయినా తరవాత నమ్మకం ఏర్పడి తనకుమార్తెను ఆయనకు ఇచ్చి వివాహం చేస్తానని కోరాడు.అందుకు బ్రహ్మంగారు అంగీకారం తెలపాడు.వివాహానంతరం కొంతకాలం ఆయన భార్యతో జీవిస్తూ శిష్యులకు జ్ఞానబోధ చేసాడు.
కొంత కాలం తరవాత ఆయన తిరిగి దేశాటనకు బయలుదేరాడు.ఆయన ముందుగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించి రాజమండ్రి వరంగల్ లో పర్యటించి హైదరాబాదు చేరాడు.
హైదరాబాదు పర్యటన
హైదరాబాదు నవాబు బ్రహ్మంగారిని గురించి తెలుసుకొని ఆయన కొరకు కబురు పంపగా బ్రహ్మంగారు నవాబు వద్దకు వెళ్ళాడు.మొందుగా నవాబు ఆయనతో 'మీరు జ్ఞాని అయినా దైవాంశసంభూతుడుగా నమ్మలేనని ఏదైనా మహిమ చూపితే విశ్వసించగలనని 'అని పలికాడు.బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్ళు తెప్పించమని కోరాడు.సేవకుడు తీసుకువచ్చిన నీటితో దీపం వెలిగించాడు.అది చూసిన నవాబు విశ్వాసం కుదిరిందని జ్ఞానబోధ చేయమని కోరాడు.నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధ చేసాడు.
సిద్దయ్య
బ్రహ్మంగారు వైదిక మతావలంబీకులైనా కులమతాలకు అతీతంగా వ్యవహరించాడు.స్త్రీల పట్ల ఆదరణను ప్రదర్శిస్తూ తన భావాలను వెలిబుచ్చాడు.అలాగే దూదేకుల కులానికి చెందిన సైదులను తనశిష్యునిగా చేసుకున్నాడు.ఆయన ఉన్నత భావాలను భక్తి శ్రద్ధలను మెచ్చుకుని తన ప్రీశిష్యుని చేసుకుని ఆయనకు అనేక ఉన్నత భోదలు చేసాడు.ఆయన జ్ఞానంలభించినవాడని ప్రశంశించి జ్ఞానంసిద్దించింది కనుక సిద్దయ్యగా నామకరణం చేసాడు."సిద్ధా" అనే మకుటంతో కొన్ని పద్యాలను అసువుగా చెప్పాడు.
బ్రహ్మంగారి శిష్యులకు సిద్ధయ్యపై కించిత్తు అసూయ ఉండటం గ్రహించి దానిని పోగొట్టి సిద్దయ్య గురుభక్తిని చాటటానికి ఒక సారి తన శిష్యులందరిని పిలిచి చనిపోయి కుళ్ళి దుర్గంధ భరితమైన కుక్క మాంసాన్ని తినమని శిష్యులందరికి ఆదేశించాడు మిగిలిన శిష్యులందరూ దానికి నిరాకరించగా సిద్దయ్య మాత్రం భక్తిగా దానిని భుజించాడు.ఆ తరవాత బ్రహ్మంగారు మిగిలిన శిష్యులకు సిద్ధయ్య భక్తి ఎలాంటిదో వివరించాడు.అనేక విశిష్ట జ్ఞానబోధలు సిద్దయ్యకు ప్రత్యేకంగా చేసాడు.
తిరుగు ప్రయాణం
బ్రహ్మంగారు హైదరాబాదులో కొంతకాలం ఉండి తిరుగు ప్రయాణానికి ఆయత్తమయ్యారు.శిష్యబృదంతో రోజంతా ప్రయాణించి అలసిపోయి ఒక ప్రదేశంలో విశ్రమించారు.ఆయన తన సిశిష్యుడైన వెంకటయ్యనుద్దేశించి 'కొంత సమయంలో ఒక అద్భుతం జరగపోతుంది' అని యదాప్రకారం సంభాషించసాగారు. అక్కడికి కొంత దూరంలో ఏవోమాటలు వినిపించగా అది ఏమిటో తెలిసుకొని వద్దాం రమ్మని శిష్యులతో అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్టువ్యాధిగ్రస్తుడైన భర్త శరీరాన్ని ఒడిలో పెట్టుకొని రోదిస్తూ కనపడింది.బ్రహ్మంగారు ఆమెనడిగి వ్యాధి వివరాలు కనుక్కొని ఆ స్త్రీకి ఊరట కలిగిస్తూ 'మీ గత జన్మ పాపం వలన ఇది సంక్రమించింది నేను మీకు పాపవిముక్తి చేస్తానని చెప్పి బ్రాహ్మణ యువకుని చేతితో తడిమాడు.వెంటనే అతనికి వ్యాధి మాయం అయింది.వారు ఆయనను కొనియాడి తమ ఊరికి వచ్చి జ్ఞాన బోధ చేయమని కోరగా ఆయన తగిన సమయం వచ్చినప్పుడు వస్తానని వారిని పంపి వేసాడు.
బ్రహ్మంగారిపై ఆరోపణ
ఒకరోజు బ్రహ్మంగారికి కడపనవాబు నుండి ఒక లేఖ వచ్చింది. అందులో పేరు సాహెబ్ తనకుమారుడైన సిద్దయ్యను బ్రహ్మంగారు ప్రలోభపెట్టి హిందుగా మార్చాడని ఆరోపణ చేసినందువలన విచారణ నిమిత్తం బ్రహ్మంగారిని రమ్మని నవాబు పంపిన ఆదేశం ఉంది. బ్రహ్మంగారు ఒంట్రిగా నవాబును కలుసుకునేందుకు బయలు దేరగా సిద్దయ్య ఇది తనకు సంబంధించిన విషయంకనుక తాను వెళతానని చెప్పి తాను సేవకులతో బయలుదేరాడు. మార్గమద్యంలో సేవకులకు తెలియకుండా బయలుదేరి ముందుగా కడపచేరుకుని ఊరి బయట బసచేసాడు.అక్కడ ఆయన ధ్యానంచేస్తూ తనదగ్గరకు అధికంగా వచ్చే మహమ్మదీయ భక్తులకు జ్ఞానబోధచేస్తూ వారి వేషధారణ మార్చి కాషాయ దుస్తులు రుద్రాక్షలు తిలకధారణ చేయిస్తూ వచ్చాడు.ఇది తెలుసుకున్న నవాబు కుపితుడై సిద్దయ్యను తన వద్దకు రమ్మని ఆదేశం పంపాడు.ఆదేశంపై వచ్చిన సిద్దయ్య నిర్భయత్వానికి నవాబు ఆగ్రహించి 'మహమ్మదీయుడివై హిందువుని ఆశ్రయించి నీ మతన్ని అవమానించావు కనుక నీవు శ్క్షార్హుడివి ఇందుకు నీ జవాబేమిటి 'అని గద్దించాడు.జవాబుగా సిద్దయ్య చిరునవ్వు నవ్వగా అది చూసి నవాబు మరింత ఆగ్రహించి 'నీకు మహిమలు తెలుసుకదా అవి చూపు లేకుంటే కఠిన శిక్ష వేస్తాను 'అన్నాడు.జవాబుగా సిద్దయ్య 'గురువుగారి ఆజ్ఞ లేనిదే మహిమ చూపకూడదు కాని తప్పని సరి పరిస్తితిలో గురువుగారి మహిమ చూపటానికి ఒకటి ప్రదర్శిస్తాను. మీరు పెద్ద బండ రాయిని తెప్పించండి' అన్నాడు.సిద్దయ్య అక్కడి వారికి ఆపద కలగకూడదని ఖాళీ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆబండను పెట్టించి గురువుగారిని తలచుకుని సలాం చేశాడు.వెంటనే ఆబండ ముక్కలైంది.నవాబు తన తప్పు తెలుసుకొని జ్ఞానబోధ చేయమని కోరగా సిద్దయ్య అది తనపని కాదని తన గురువుగారు తగిన సమయం వచ్చినప్పుడు చేస్తారని చెప్పి తిరిగి వెళ్ళాడు.
కక్కయ్య
బ్రహ్మంగారు తనశిష్యుడు సిద్దయ్యకు యోగవిద్య కుందలినీశక్తి శరీరంలోని యోగచక్రాలు గురించి వివరిస్తూ శరీరం ఒకదేవాలయమని అందులో దేవతలుంటారని కుండలినీ శక్తిని జాగృతం చేయడం ద్వారా వారిని దర్శించవచ్చని వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా విన్నాడు.కక్కయ్య శరీరంలోని అద్భుతాలు చూడాలన్న ఆతురతతో ఇంటికి వెళ్ళాడు.ఇంట్లో అతని భార్య నింద్రించడం చూడగానే ఆమె శరీరంలో దేవతలను చూడాలని ఆమెను ముక్కలుగా నరికి వేశాడు.అయినా ఆమెశరీరంలో రక్తమాంసాలు తప్పఏమీ కనిపించకపోవడంతో తానను బ్రహ్మంగారి మాటలు మోసపుచ్చాయని విలపించాడు.ఆయన మాటలు నమ్మి భార్యను నరికివేసానని బ్రహ్మంగారు దీనికంతా కారణమని ఆయన దొంగ అని అందరికీ చెప్పాలని అనుకున్నాడు. ముందుగా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను అడగాలనుకుని బ్రహ్మంగారి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పి ఆయనను దూషించడం మొదలుపెట్టాడు. బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి వెంటనే 'కక్కా నేను చెప్పింది అసత్యం కాదు నేను అసత్యం పలకను నిదర్శనంగా నీ భార్యను బ్రతికిస్తాను ' అనిచెప్పి అతని వెంట అతని ఇంటికి వెళ్ళి అతనిభార్య శరీరంపై మంత్రజలం చల్లగానే ఆమె నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి కూర్చుంది.కక్కయ్య బ్రహ్మంగారి మహిమ తెలుసుకుని ఆయనను మన్నించమని పలు విధాల వేడుకుని తనను శిష్యుడిగా చేర్చుకొనమని తాను వెంట నడుస్తానని బ్రహ్మంగారిని వేడుకున్నాడు.బ్రహ్మంగారు ఎవరూ 'నన్ను పూజించవద్దు నాశిష్యులెవరూ నన్ను పూజించరు దేవుడిని అన్వేషిస్తారు అదే అందరికి ఆమోదయోగ్యము నువ్వు కూడా అదే పని చెయ్యి ' అని చెప్పి తిరిగి వెళ్ళాడు.
విశ్వబ్రాహ్మణులకు తత్వోపదేశం
బ్రహ్మంగారు యధావిధిగా దేశాటనకు బయలుదేరి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ నండ్యాల సమీపంలోని ఒకగ్రామంలో భోజనార్ధం విశ్రాంతి తీసుకుంటూ దాహం కోసం ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటి ముంగిట నిలబడి మంచి నీళ్ళు ఇమ్మని అడిగాడు.అతను పనిమీద నిమగ్నమై నీళ్ళు ఇవ్వడం కుదరదని ప్రక్కనే ఉన్న బావిలో చేదుకుని త్రాగమని చెప్పాడు.బ్రహ్మంగారు వినకుండా నీళ్ళు కావాలని తిరిగి అడిగాడు.విశ్వబ్రాహ్మణుడు ఆగ్రహించి కరుగుతున్న లోహం తీసుకువచ్చి త్రాగమని అన్నాడు.బ్రహ్మంగారు మారు పలుకక ఆలోహ ద్రవాన్ని త్రాగి వేసాడు.అది చూసిన విశ్వబ్రాహ్మణుడు భయపడి తాను అపరాధంచేశానని క్షమించమని వేడుకున్నాడు.అందుకు బ్రహ్మంగారు "నాకు అజ్ఞానం మీద తప్ప ఎవరిమీద కోపం లేదు" అని చెప్పాడు.ఆతరవాత ఆ విశ్వబ్రాహ్మణుని కోరికపై ఆతిధ్యం స్వీకరించి బయలుదేరి కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని నంద్యాల చేరుకున్నాడు.నంద్యాలలోని ప్రజలు బ్రహ్మంగారికి బోజనవసతులు కల్పించి ధర్మ బోధవిని ఆనందించారు.నంద్యాలలో విశ్వబ్రాహ్మణులను పంచాననం అనేవారు.వారు ఆ కాలంలో కొంత అహంభావంతో ప్రవర్తించేవారు.వారి సహాయార్ధం వచ్చేవారిని చులకనచేసి ఎగతాళి చేసేవారు.బ్రహ్మంగారు వారి వద్దకు వెళ్ళి తమకు ఆహారాన్నిచ్చి క్షుద్భాధ తీర్చమని అడిగాడు.వారు ఆయనను ఎంత అన్నం అవసరమౌతుందని పరిహసించారు.బదులుగా బ్రహ్మంగారు "మాకు ఎంత అవసరములే మాకడుపు నిండినంత చాలు" అన్నారు.వారు బ్రహ్మంగారిని అవమానించాలని "అలాకాదు మీరు తక్కువ తింటే ఎలా ఒకపుట్టి బియ్యం వండి వడ్డిస్తాం మీరు అంతా తిని మమ్ములను సంతృప్తి పరచండి" అన్నారు.అందుకు బ్రహ్మంగారు సమ్మతించగా వారు పుట్టెడు బియ్యం వండించి భుజించమని చెప్పారు.అందుకు బ్రహ్మంగారు ఈ పనికి తాను అవసరంలేదని తనశిష్యుడు సిద్దయ్య చాలని అన్నాడు.బ్రహ్మంగారు ఒక్క ముద్ద అన్నం తీసుకుని మిగిలినదానిని తినమని సిద్దయ్యను ఆజ్ఞాపించాడు.సిద్దయ్య అలాగే ఆన్నమంతా తిని ఇంకా కావాలని సైగ చేసాడు.ఇది చూసిన విశ్వబ్రాహ్మణులు నిర్గాంతపోయి తమని క్షమించమని బ్రహ్మంగారిని వేడుకున్నారు.ఆయన చిరునవ్వుతో తనచేతిలోని అన్నాన్ని సిద్దయ్యకు అందించగా అది ఆరగించిన తరవాత అతని ఆకలి తీరింది.విశ్వబ్రాహ్మలు బ్రహ్మంగారికి పూజలు చేసి తత్వబోధ చేయమని కోరారు.ఆయన వారికి జ్ఞానబోధ చేసి అక్కడి నుండి బయలుదేరి అహోబిలం చేరారు.

సమాధి తర్వాత దర్శనం
సిద్దయ్యను పూలు తీసుకురమ్మని బనగాన పల్లెకు పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళాడు. సిద్ధయ్య తిరిగి వచ్చి గురువు కోసం విపరీతంగా విలపించ సాగాడు.బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించమని ఆదేశించి రాతిని తొలగించిన తరవాత బటికి వచ్చి సిద్ధయ్యను ఓదార్చాడు. ఆ పై సిద్దయ్య కోరికపై పరిపూర్ణం ను బోధించాడు. ఆ తరవాత సిద్ధయ్యకు దండం, కమండలం, పాదుకలు మరియు ముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలో ప్రవేసించాడు.
కందిమల్లయపాలెం చింతచెట్టు
కందిమల్లయ పాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు ఆయనచే వ్రాయబడిన 14,0000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచాడు. ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు, ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింతచెట్టు పూలు అన్నీ రాలిపడతాయని అక్కడి ప్రజల విశ్వాసం. ఆచెట్టు పంగలలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరినప్పుడు కుంకంలా ఉంటుంది. వ్యాధులు మరియు ప్రమాదాలు నివారణ కొరకు దానిని స్వీకరిస్తుంటారు. ఆ చెట్టు అక్కడి ప్రజలందరికీ సుపరిచితమే. ఆ చింతచెట్టుకు నిత్యదీపారాధన చేస్తూ ఉంటారు. ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికిరానివై ఉంటాయి

బ్రహ్మంగారి మఠం
బ్రహ్మంగారి మఠం ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. కర్ణాటక, తమిళనాడులతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రం కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో భాగంగా ఉంది. ప్రస్తుతం బి.మఠం మండల కేంద్రం కూడా. బ్రహ్మం రు కులాలను రూపుమాపి సమసమాజ నిర్మాణానికి కృషి చేశాడు. ఈయన శిష్యులలో ముఖ్యుడైన దూదేకుల సిద్దయ్య దూదేకుల కులానికి, మరొక భక్తుడు మాదిగ కక్కయ్య పంచముడు అవడమే ఇందుకు తార్కాణము. ఈ చర్యలను నిరసించిన స్థానికులు బ్రహ్మంగారిని వెలివేశారు. నిప్పు, నీరూ ఇవ్వలేదు. నీటి అవసారాలు తీర్చుకోవడానికి రాత్రికి రాత్రే తన నివాసములో జింక కొమ్ముతో బావిని త్రవ్వుకున్నారు.

.......ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ: ....... అని నిరన్తరమ్ జపిచది.
వారసులు
బ్రహ్మంగారి కుమార్తె వీరనారయణమ్మ సంతతికి చెందిన (ఏడవ తరం)వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి ప్రస్తుత 11వ మఠాధిపతి. ఈయన బ్రహ్మంగారి సాహిత్యం, సారస్వతాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. మఠంలో నిత్యాన్నదానం జరుగుతుంది. బ్రహ్మంగారి పేరుతో పలు విద్యాసంస్థలు వెలిశాయి. ఇంజినీరింగ్ కళాశాల, జూనియర్ కళాశాల, వేద పాఠశాల (తమిళనాడు భక్తుడు పట్నాల సన్యాసి రావు గారి ఏర్పాటు) నడుస్తున్నాయి.
విశేషాలు
ప్రముఖ నటుడు, ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు రాజకీయాలలోనికి రాకముందు మఠంలో 14 రోజులున్నారు. బ్రహ్మంగారి చరిత్రను కూలంకషముగా తెలుసుకొని "శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి" చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుగంగ పధకానికి శంకుస్థాపన చేసి మఠమును ఆనుకొనియున్న జలాశయానికి 'బ్రహ్మం సాగర్' గా నామకరణం చేశారు.

Share:

సర్వదోష నివారణా మహిమాన్విత క్షేత్రం.

సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు అశ్వత్థ నారాయణుడిగా కొలువులందుకుంటున్న మహిమాన్విత క్షేత్రం విదురాశ్వత్థ. దేశంలోనే ఓ విలక్షణమైన పుణ్యక్షేత్రంగా అలరారుతున్న ఈ దివ్యథామం స్వామి లీలా విశేషాలతో మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. విదురాశ్వత్థ క్షేత్రం మహిమాన్వితమైనది. అటు చారిత్రకంగానూ, ఇటు పౌరాణికంగానూ విశేషమైన ప్రాశస్త్యాన్ని తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది.
విదురాశ్వత్థ క్షేత్రం ఓ చిన్ని గ్రామం. మహాభారతంలో ధర్మజ్ఞుడ్నిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న విదురుడు ఈ క్షేత్రంలో కొంతకాలం నివసించడంవల్ల ఈ క్షేత్రానికి విదురాశ్వత్థ అనే పేరు వచ్చింది. అలాగే ఆ స్వామి ఇక్కడ ఒక అశ్వత్థ వృక్షం నాటి శ్రీహరి సేవలో తరించడంవల్ల ఈ క్షేత్ర ప్రాశస్త్యం మరింత పెరిగింది.
విదురాశ్వత్థ క్షేత్రంలోకి అడుగుపెట్టగానే ఆలయ ద్వారం కనువిందు చేస్తుంది. ఈ ద్వారం మీద అశ్వత్థ నారాయణస్వామివారి మూర్తి భక్తుల చూపు మరల్చనీయదు. ఈ ఆలయ ప్రాంగణం విశాలమైనది. ఈ ప్రాంగణమంతా నాగ శిలాప్రతిమలతో అదో నాగ లోకాన్ని తలపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయం ముందు వినాయకుని చిన్ని మందిరం ఉంది. అశ్వత్థవృక్షం త్రిమూర్త్యాత్మకమైనది. ఆ వృక్ష రాజంలో త్రిమూర్తులు మమేకమై ఉంటారు. దానిని స్ఫురణకు తెచ్చే విధంగా ఇక్కడ ప్రాకారాల మీద త్రిమూర్తుల మూర్తులను పొందుపరిచారు. గర్భాలయం ముందు భాగంలో పంచలోహ సమన్విత నాగ సర్పం ఉంది. స్వామి ఇక్కడ సర్ప రూపంగా కొలువై ఉండడంవల్ల ఇక్కడ నాగ సర్పాన్ని ఉంచారని చెబుతారు. గర్భాలయంలో ఒక పక్క విఘ్న నాయకుడు వినాయకుడు కొలువుదీరగా, మరోపక్క కుమారస్వామి, పరమేశ్వరులు ఆశీనులయ్యారు. ఈ మూర్తులకు సమీపంలో ఎతె్తైన పీఠం శ్రీ అశ్వత్థ నారాయణస్వామి శిలామూర్తి ఉంది. ఇదే ఆలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి వెనుక భాగంలో అశ్వత్థ వృక్షం కానవస్తుంది.
సాక్షాత్తు విదురుడు నాటిన వృక్ష రాజంగా దీనిని చెబుతారు. అయితే ఈ వృక్షరాజం 2001వ సంవత్సరంలో పక్కకు ఒరిగిపోవడంతో దానిని జాగ్రత్తగా కాపాడడానికి తగు చర్యలు చేపట్టారు. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వృక్షం నీడలో నారాయణ స్వామివారి మూర్తి ఒకటి కానవస్తుంది. ఈ వృక్ష రాజాన్ని దర్శించినంత మాత్రంచేతనే అనంతకోటి పుణ్యఫలాలు సొంతమవుతాయని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయ ప్రాంగణంలో కుడివైపు భాగంలో అభయాంజనేయస్వామివారి మందిరం ఉంది. ఇందులో కొలువుదీరిన ఆంజనేయస్వామివారు సింధూర వర్ణ శోభితంగా దర్శనమిస్తారు. తిరునామధారియైన అభయాంజనేయస్వామి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావించి కైమోడ్పులర్పిస్తారు.
దీనికి సమీపంలోనే ముడుపుల చెట్టు ఉంది. ఈ ఆలయానికి వచ్చిన కొంతమంది భక్తులు ఇక్కడ ముడుపులు కడతారు. స్వామివారి లీలా విశేషాలకు ఇది తార్కాణంగా నిలిచింది. దీనికి సమీపంలోనే పూర్వకాలం నాటి శివాలయం ఉంది. శివాలయంలో ఉన్న పరమేశ్వర లింగ దర్శనం మాత్రం చేతనే పంచపాతకాలు సైతం మటుమాయమవుతాయంటారు. ఇక్కడ స్వామికి చేసే అర్చనాది కార్యక్రమాలన్నీ విశేష ఫలితాలనిస్తాయంటారు.
ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న మరో ఆలయం శ్రీ నవగ్రహాలయం. నవగ్రహాది దేవతలు కొలువుదీరిన ఈ ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నవగ్రహ దోష నివారణ పూజలు చేయించుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామివారి మందిరం ఉంది. ఈ మందిరంలో వెంకటేశ్వరస్వామి తన ఇరు దేవేరులతో కలసి కొలువుదీరాడు.
విదురాశ్వత్థ శ్రీ అశ్వత్థ నారాయణస్వామి క్షేత్రం సర్వదోష నివారణా క్షేత్రంగా కూడా విరాజిల్లుతోంది. అలాగే వివాహం కానివారు, సంతానం లేనివారు ఇక్కడ ఈ ప్రాంగణంలో నాగదేవత శిల్పాన్ని ప్రతిష్టించి పూజిస్తే, వెంటనే అభీష్ట సిద్ధి కలుగుతుందన్న నమ్మకం భక్తుల్లో ప్రబలంగా ఉంది. ఈ కారణంగానే భక్తులు ప్రతిష్టించిన వేలాది నాగ శిల్పాలు ఇక్కడ ఈ ప్రాంగణంలో దర్శనమిస్తాయి. అలాగే పర్వదినాలు, పండుగలపుడు ఈ ఆలయంలోకి సర్పాలు వచ్చి భక్తులను కటాక్షిస్తాయని భక్తులు చెబుతారు. విదురాశ్వత్థ క్షేత్రం చారిత్రకంగా కూడా ప్రసిద్ధిచెందింది.
దక్షిణ భారత దేశపు జలియన్‌వాలాబాగ్ జరిగిన ప్రదేశంగా దీనిని చెబుతారు. స్వాతంత్య్ర సమరంలో భాగంగా జరిగిన మారణకాండలో ఈ గ్రామానికి చెందిన పది మంది స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడ అశువులు బాశారని ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఉదంతానికి గుర్తుగా ఇక్కడ ఒక స్మారక స్థూపాన్ని కూడా నెలకొల్పారు. కర్ణాటక రాష్ట్రం, చిక్‌బళ్ళాపూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం గౌరిబిదనూర్ పట్టణానికి సుమారు పది కిలోమీటర్లు దూరంలో ఉంది. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి బెంగళూరునుంచి నేరుగా చేరుకోవచ్చు. అలాగే హిందూపురం వరకూ వచ్చి అక్కడ నుంచి గౌరీబిదనూరు మార్గంలో ఉన్న ఈ క్షేత్రాన్ని సులువుగా చేరుకోవచ్చు. విదురాశ్వత్థ క్షేత్రం చిన్న గ్రామం. కేవలం స్వామివారి లీలా విశేషాలతో మాత్రమే ఇది ఖ్యాతికెక్కింది. ఇక్కడ ఈ క్షేత్రంలో బసచేయడానికి ఎలాంటి సదుపాయాలు లేవు. అలాగే భోజన సదుపాయం కూడా ఇక్కడ అంతంత మాత్రంగానే ఉంటుంది. అందువల్ల ఈ క్షేత్రాన్ని సందర్శించాలనుకునే వారు వారివారి ఏర్పాట్లను చేసుకుని మరీ వెళ్ళాల్సి ఉంటుంది.
Share:

సిద్ధనాథ్ మహదేవ్ - అతి పురాతన శివాలయం.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని దేశంలోని వాణిజ్య ప్రాంతాల్లో ఒకటిగా వున్న నాభివూర్‌కు ప్రాంతానికి సమీపంలోని నేమవర్ అనే పట్టణనికి దగ్గర నర్మదా తీరంలో వెలసివున్న సిద్ధనాథ్ మహాదేవ్ ఆలయ ప్రాశస్త్యాం తెలుసుకుందాం. ఈ ఆలయం నర్మదా తీరంలోని అతిపురాతనమైన ఈ శివాలయం సిద్ధనాథ్ పేరుతో భక్తులకు సుపరిచితం. . ఈ ఆలయంలోని శివలింగాన్ని సనంద్, సనక్, సనాతన్, సనాత్ కుమార్ అనే నలుగురు సిద్ధ ఋషులు ప్రతిష్టించడం వల్ల ఈ ఆలయాన్ని సిద్ధనాథ్ ఆలయం అనే పేరు వచ్చినట్టు భక్తులు అభిప్రాయపడుతారు.
ఈ శివాలయాన్ని క్రీ.పూ.3094 సంవత్సరంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెపుతున్నాయి. ఆరంభంలో ఆలయ ముఖద్వారం తూర్పు దిశగా ఉండేదని, పంచపాండవుల్లో ఒకరైన భీముడు పశ్చిమవైపుకు తిప్పినట్టు చెప్పుకుంటారు.
ప్రతి రోజు ఉదయం.. నదీతీరంలోని ఇసుక మేటలపై అతిపెద్ద పాదముద్రికలు కనిపిస్తుంటాయి. ఇవి నలుగురు సిద్ధ ఋషుల పాద ముద్రలుగా ఇక్కడికి వచ్చే భక్తులు భావిస్తుంటారు. అంతేకాకుండా.. చర్మ వ్యాధులు ఉన్న వారు ఈ ఇసుకలో అంగప్రదక్షిణం చేస్తే వ్యాధి పూర్తిగా నయమవుతుందని భక్తులు భావిస్తుంటారు.

Share:

చతుర్ముఖ లింగం క్షేత్రం ... పశుపతినాథ్ ఆలయం.

ఈ ఇతిహాసం ప్రకారం శివుడు ఒకప్పుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు, శివుడు తన స్వరూపంలో చూడలని కోరికతో దేవతలు శివుడు జింక అవతారంలో ఉన్నప్పుడు అతని కొమ్ముని పట్టుకొన్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగి పోయి ఇక్కడ ఖననం చేయబడింది.శతాబ్ధాల తరువాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఈ లింగం పడిన ప్రాంతంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని త్రవ్వగా శివ లింగం బయట పడింది.
ఇంకో కథ ప్రకారం నేపాల మహత్యం మరియు హిమవత్‌ఖండం ప్రకారం ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రుస్తుండగా దేవతలు శివుడిని కాశి తిరిగి తీసుకొని పోవడానికి జింకని లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. ఈ నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగం గా ఉన్నదని ఇతిహాసం చెబుతారు.
ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన అధారాలు లేవు. గోపాలరాజ్ వంశవలి అనే చారిత్రాక పత్రిక ప్రకారం లించచ్చవి రాజు శుశూపదేవ క్రీ.శ.753 సంవత్సరంలో ఈ ఆలయనిర్మాణం జరిపాడని, పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తొంది.. తరువాతి కాలంలో 1416 సంవత్సరం రాజా జ్యోతి మల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని,1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయానికి పునఃనిర్మించాడని తెలుస్తోంది.
దేవాలయం పగోడ వలె ఉంటుంది. రెండు పైకప్పులు రాగి మరియు బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి.నాలుగు ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయబడి ఉంటుంది.పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఈ నంది విగ్రహం 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల చుట్టుకొలత కలిగి ఉన్నది. ఇక్కడ పూజలు చేసే పూజారులను భట్ట అని , ప్రధాన అర్చకుడిని మూల భట్ట లేదా రావల్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ.దీనిని బట్టి ఈ ఆలయం ప్రాముఖ్యత మరియు ప్రధాన అర్చకుల అధికారాలు విఫులం అవుతాయి. మూల భట్ట(ప్రధాన అర్చకుడు) అప్పుడప్పుడు ఆలయ విశేషాలు నేపాల్ రాజుకి తెలియజేస్తుంటాడు. ఈ దేవాలయం తూర్పున వాసికినాథ్ దేవాలయం ఉన్నది.
నేపాల్ దేశ రాజధాని కాఠ్మండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేర్లలో బాగమతి నది ఒడ్డున ఉన్నది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు.భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం, వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు. ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉన్నది.
శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ మరియు జంతు బలిని నిషేధించారు. దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశము సంతాప సముద్రములో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు, పశుపతినాథ్ కి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశార్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు.

Share:

తిరుమల వెంకేశ్వరస్వామి దేవాలయాన్ని పోలి ఉండే క్షేత్రం.

విశాఖ పట్టణము జిల్లలోని , నక్క పల్లిమండలములో, ఉపమాక గ్రామములో వెలసిన స్వామి వారి కోవెల పావనమైన పుణ్య నిలయము. తూర్పు గోదావరి జిల్లాలోని కాండ్రేగుల సంస్తానమున కు అధిపతి ఐన శ్రీ కృష్ణ భూపాలుడు.శ్రీ వెంకటేశ్వర స్వామి కోవెలను నిర్మించెను. ఉత్తరాంధ్రవాసుల ఆరాధ్య దైవమైన ' ఉపమాక వెంకన్న' 'గా పిలువ బడే వేంకటేశ్వరస్వామి ఆలయం యలమంచిలి కి 20 కి.మీ.దూరంలో కల ఉపమాక గ్రామం లో వెలిసింది. ఈ దేవాలయం తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఈ క్షేత్రం క్రీ..శ. ఆరవ శతాబ్దంలో వెలిసినట్లు తెలస్తుంది.
వెంకటేశ్వర స్వామి వెలసిన పర్వతాన్ని గరుడాద్రి పర్వతమని పిలుస్తారు. గరుక్మంతుడు, విష్ణుమూర్తిని ఎల్లవేళలా తన వీపు పై కూర్చుండునట్లు వరం కోరగా, దక్షిణ సముద్ర తీరమందు నీవు కొండగా ఆవిర్భవిస్తే, తిరుపతి నుండి వచ్చి నీ పై అవతరించి పూజలందుకొంటానని విష్ణుమూర్తి తెలపగా గరుక్మంతుడు గరుడాద్రి పర్వతంగా వెలిశాడని స్థలపురాణం. ఇక్కడ ఆలయంలో స్వామి గుర్రం పై కూర్చున్నట్టు లక్ష్మిదేవి క్రింద వెలసినట్లు దర్శనమిస్తారు.
కొండ దిగువన విశాలమైన మరొక ఆలయంలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దర్సనమిస్తాడు. ఆలయాన్ని ఆనుకొని రెండు పుష్కరుణులు క్షేత్రానికి ప్రత్రేక శోభను చేకూర్చుతున్నాయి. ఎత్తయిన పర్వతం, సుందరమైన ఆలయ బేడామండపం, ఇతర కట్టడాలు ఆనాటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటి చెపుతాయి. ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కల్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి .ప్రస్తుతం దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనం లో ఆలయం నడుస్తోంది.

Share:

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో పునర్నిర్మించిన శ్రీ సోమనాథ జ్యోతిర్లింగ ఆలయం.

దక్షప్రజాపతి తన 27 మంది కుమార్తెలను (27 నక్షత్రాల పేర్లు వారివే) చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు. కాని చంద్రుడు మాత్రం అందరికంటే అందమైన రోహిణి పైననే ప్రేమ చూపి తక్కినవారిని నిర్లక్ష్యం చేస్తాడు. మిగతా 26 మంది తండ్రి దక్షప్రజాపతి వద్దకు వెళ్లి తమకు జరుగుతున్నా అన్యాయాన్ని విన్నవించుకుంటారు. చంద్రున్ని పిలిచి అందర్నీ సమానంగా ఆదరించమని చెపుతాడు. అయినా చంద్రుడు రోహిణి పైననే తన ప్రేమంతా కురిపిస్తుంటాడు, దాంతో ఆగ్రహం చెందిన దక్షుడు చంద్రున్ని క్షయ వ్యాధి గ్రస్తుడివికా అని శపిస్తాడు. శాప నివారణకు దేవతలా నెవరి నాశ్రయించినా దక్షుని శాపం నుండి కాపాడగలవాడు శివుడొక్కడే అని, శివునికి తపస్సు చేసి మెప్పించమని సలహా ఇస్తారు. చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వచ్చి ఘోర తపస్సు నాచారిస్తాడు, ప్రత్యక్షమైన పరమేశ్వరుడు, దక్షుని శాపానికి తిరుగుండదని అయినా నీ భక్తికి మెచ్చి నెలలో 15 రోజులు క్షయం, 15 రోజులు వృద్ది అయ్యేలా చేస్తానని చంద్రుని శాపాన్ని మారుస్తాడు. చంద్రునికి శాప విమోచనం చేసిన పరమేశ్వరుడు ఇక్కడ సొమనాథునిగా వెలిశాడు. చంద్రుడు కృతజ్ఞతగా సొమనాథునికి బంగారు ఆలయాన్ని నిర్మిస్తాడు.
గుజరాత్ రాష్ట్ర ప్రభాస క్షేత్రంలో సోమనాథ దేవాలయం కలదు. అతి పురాతనమైనది ఈ దేవాలయం. భారత దేశంలో ఈ దేవాలయం దోపిడీకి గురైనంతగా మరే దేవాలయం గురి కాలేదు. క్రీ.శ.722 లో సింధూ ప్రాంత అధిపతి అయిన జునాయిద్ తన సైన్యాన్ని పంపి ఆలయాన్ని ద్వంసం చేయించాడు. భారత దేశపు రాజులు, భక్తులు ఆలయాన్ని పునర్నిర్మించారు. కాగా క్రీ.శ.1026 లో ఘజనీ మొహమ్మద్ తన సైన్యంతో దండ యాత్ర చేసి ఆలయాన్ని ద్వంసం చేసి ఆలయంలో కల అపార సంపదనంతా దోచుకెళ్ళాడు. ముస్లీం పాలనలో ఆలయం పలు మార్లు దాడులకు గురయింది. క్రీ.శ.1297, 1394, 1607 ల్లో ద్వంసం చేసి దోపిడీ చేశారు. స్వాతంత్ర్యం లభించాక సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఆలయ పునర్నిర్మాణం చేయబడింది. ఎన్ని కాలాలు గడిచినా చెరగని, తరగని భక్తి ప్రపత్తులతో అశేష జనం అనుదినం సొమనాథున్ని దర్శించి తరిస్తున్నారు.
ఎక్కడా లేని విధంగా ఇక్కడ గర్భాలయం, సభా మండపం, నృత్య మండపం గోపురములు 150 అడుగుల ఎత్తుతో విరాజిల్లుచున్నది. గర్భాలయపు శిఖర కలశం 10 టన్నుల బరువు కలిగి ఉంది, శిఖరద్వజమ్ 27 అడుగులతో చూపరులను ఆకట్టుకొనును. శ్రీ కృష్ణుని నిర్యాణం కూడా ఇక్కడికి సమీపంలోనే జరిగిందని చెపుతారు. అరేబియా సముద్రం ప్రక్కన ఉండే ఈ క్షేత్రం కడు రామనీయస్థలం.

Share:

దేవతలు నిర్మించిన శ్రీ సిద్ధి వినాయకస్వామి ఆలయం.

పచ్చని కోనసీమ అందాలు, విశాలంగా పరుచుకున్న సుందర దృశ్యాల నడుమ అలరారుతున్న ‘అయినవిల్లి’ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా ముక్తేశ్వరానికి సమీపంలో ఉంది. పవిత్ర గోదావరి నదీమతల్లి పాయ ఒడ్డున అలరారుతున్న అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయకస్వామివారి ఆలయాన్ని తొలుత దేవతలు నిర్మించారని ఇక్కడి స్థల పురాణాలు చెప్తాయ. సర్వశుభ కార్యాలలోనూ విఘ్నేశ్వరునికే అగ్ర పూజ. దేవతాసమూహంలో గణపతికి విశిష్టస్థానముంది.
విష్ణువు ఆయనే…ఓంకారం ఆయనే… సిద్ధిని, బుద్ధినీ ఇచ్చేది ఆయనే…అలాంటి మహిమాన్విత దైవం విఘ్నవినాయకుడు కొలువైన దివ్యథామం అయినవిల్లి. అనంతరంతర కాలంలో ఆలయ పునర్నిర్మాణాలు, అభివృద్ధి పనులు పెద్దాపురం సంస్థానాదీశులు నిర్వహించినట్లు చారిత్రక ఆధారాల తెలుపుతున్నాయ. ఈ క్షేత్రానికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో చేసిన దక్షయజ్ఞం నిర్వహించేముందు విఘ్నవినాయకుడైన అయినవిల్లి వినాయకుని పూజించి పునీతుడైనట్లు క్షేత్ర పురాణం ద్వారా తెలుస్తోంది. అలాగే వ్యాస మహర్షి దక్షిణయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుడ్ని ప్రతిష్టించాడని మరో కథ ప్రచారంలో ఉంది. సిద్ధివినాయక స్వామి ఆలయంతోపాటు కొన్ని ఉపాలయాలతో ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ దివ్యాలయం ఆధ్యాత్మికానురక్తిని ద్విగుణీకృతం చేస్తుంది.
ఈ సృష్టిలో ప్రప్రథమంగా పూజలందుకునే స్వామి విఘ్నేశ్వరుడు. తనలో ఈశ్వర అంశను పుణికిపుచ్చుకున్న ఆ స్వామి తనను నమ్మి దర్శించే భక్తుల మనోభిష్టాలు నెరవేరుస్తాడని భక్తులు దృఢంగా నమ్ముతారు. ఆ కారణంగానే భక్తులు సర్వప్రాపంచిక విషయాలు పక్కనపెట్టి, నిర్మల చిత్తంతో దక్షిణ ముఖంగా ఉన్న సిద్ధివినాయక స్వామిని మనసావాచా కొలుస్తారు. అలాగే ఇక్కడ కొలువైన స్వామిని దర్బ గడ్డితో పూజిస్తే, మనోవాంచలన్నీ నెరవేరుతాయన్న నానుడి ఉంది. భక్తజన సందోహంతో సందడిగా ఉండే ఈ ఆలయంలో స్వామికి నిత్య పూజలు, అర్చనాభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే ఆలయ ప్రాంగణంలో అన్నపూర్ణ సమేత విశే్వశ్వరస్వామి దర్శనమిస్తారు. సాక్షాత్తు విఘ్నవినాయకుడికి తల్లిదండ్రులైన ఆ తేజోమూర్తుల దర్శనం శుభదాయకం.
అయినవిల్లి శ్రీ సిద్ధివినాయక క్షేత్రం శివకేశవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఒకపక్క కాశీ విశే్వశ్వరస్వామి కొలువై ఉంటే మరోపక్క శ్రీదేవిభూదేవి సమేత కేశవస్వామి నయనానందకరంగా దర్శనమిస్తారు. అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయకస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. శివ అంశతో ఉదయించిన ఆ స్వామి దర్శనం సదా మంగళకరం. అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క అయ్యప్పస్వామి, ఇంకో పక్క గంగామాతలు దర్శనమిచ్చి, భక్తులను నిత్యమూ అనుగ్రహిస్తూ ఉంటారు. నిత్యమూ భక్తులతోనూ, వారి అర్చనలు, అభిషేకాలతోనూ ఓ ఆధ్యాత్మిక లోకాన్ని తలపించే ఈ దివ్యధామంలో కొలువైన శ్రీ సిద్ధివినాయకస్వామి దర్శన భాగ్యం పూర్వజన్మల సుకృత ఫలంగా పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతి పురుషులకు పూర్వమే ఉద్భవించిన విశ్వవ్యాప్తమైన ప్రణవ స్వరూపమే గజాననుడు. ఆ స్వామి యోగులకు పరబ్రహ్మ, నర్తకులకు నాట్యాచార్యుడు, భాగవతులకు గానమూర్తి, విద్యాకాంక్ష గలవారికి విద్యాగణపతి. సామాన్య మానవులకు సంకటహరుడు, సర్వసిద్ధి ప్రదాత. ఏకాత్మకు సంకేతమయిన వినాయకుడు విశ్వజన ప్రియుడు.

Share:

పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలో మెరిసిపోతూ అమావాస్య నాడు గోధుమ వర్ణంలోకి మారిపోతూన్న శివలింగం.

దక్షారామం కుమారారామాలలోని లింగస్వరూపాలతో పోల్చితే సోమారామంలోని లింగస్వరూపం చిన్నది. చంద్రుడు ప్రతిష్టించి పూజించిన లింగం కాబట్టి సోమేశ్వరుడన్నారు.పరమశివుడికున్న అనేక నామాల్లో భీమ ఒకటి. ఆ పేరు మీదనే ఒక్కప్పుడు ఈ ప్రాంతం భీమపురంగా పిలవబడేదని, కాలక్రమేణా అదే భీమవరంగా మారిందని చెబుతారు. దానికి తగ్గట్లుగానే పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలో మెరిసిపోతూ అమావాస్య నాడు గోధుమ వర్ణంలోకి మారిపోతూ నేత్రానందం కలిగిస్తారు స్వామి వారు. దేవాలయానికి అభిముఖంగానున్న సోమకుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి. దేశంలో మరో శివాలయంలోనూ లేని విధంగా, ఆలయానికి ఎదురుగా ఎత్తైన స్తంభం మీద కూర్చున్న నందీశ్వరుడూ ఇక్కడే కనిపిస్తాడు. స్వామి వారి ఆలయంపైనే అన్నాపూర్ణాదేవి కొలువై ఉండటం మరో విశేషం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడైన జనార్దన స్వామి పశ్చిమం లో తూర్పు ముఖం గా ఉంటాడు అందువల్ల ఇక్కడ వివాహాది శుభ కార్యాలు చేసుకో వచ్చు .
.
1434 లోదేవకుమారుడు శింగన అనే భక్తుడు గునుపూడి భీమవరం సోమేశ్వర స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు .ఒక సారి జటాజూట రాజుకు ఓంకార స్వామి ప్రత్యక్షమై గునుపూడిలో సోమ రామం లో శివుని అమృత లింగ శకలం పడి ఉందని ,అక్కడికి వెళ్లి చంద్ర పుష్కరిణి లో స్నానం చేసి అన్న పూర్ణా సమెత సోమేశ్వర దర్శనం చేస్తే మూగతనం పోతుందని చెప్పాడు .అలాగే మాటలు వచ్చాయి రాజ్యానికి చేరాడు రాజుగా పట్టాభి షిక్తుదయ్యాడు.
.
దక్షిణం లో సూర్య నారాయణుడు ఉత్తరం లో సుబ్రహ్మణ్య స్వామి ,ఈశాన్యం లో నవ గ్రహాలూ చూసి ధ్వజ స్తంభం దాటి తూర్పు ముఖం లో గణపతి ,ఉత్తరాన కుమార స్వామి ,సభా మండపం దాటి అంతరాలయం చేరితే దక్షిణ ముఖం గా ఉత్తరం వైపున్న పార్వతీ అమ్మ వారు కోటి కాంతులతో విరాజిల్లుతూ దర్శన మిస్తారు .గర్భాలయం లో సోమేశ్వర లింగం రెండు అడుగుల ఎత్తునకన్పిస్తాడు .దక్షిణ ద్వారం గుండా బయటికి వచ్చి మెట్ల మీదుగా రెండో అంతస్తు చేరితే సోమేశ్వర స్వామి శిరసు పై రెండో అంతస్తులో నాలుగు అడుగుల ఎత్తున్న అన్న పూర్ణ అమ్మ వారు దర్శన మిస్తారు .దక్షిణాన కళ్యాణ మండపం ఉంది .
.
రోహిణి మీద అధిక ప్రేమతో చంద్రుడు మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేస్తే దక్షుడు కోపగించి శపిస్తాడు శాప విమోచనం తెలప మంటే చంద్ర పుష్కరిణి లో స్నానం చేసి అక్కడి శివుడిని అషె కిస్తే .విమోచనం జరుగుతుందని చెప్పాడు అలాగే చేశాడు.అందుకే అది చంద్ర పుష్కరిణి అని పేరొచ్చింది స్వామిని కి సోమేశ్వర స్వామి అని పేరొచ్చింది .

Share:

ఒకే శివ లింగానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సూర్య అని పేర్లు గల ఆలయం.

ఎతైన కోండల నుండి విచే చల్లని గాలి పిట్టల కిలకిల రావలు పింఛాలు విప్పి ఆనంద నర్తనం చేసే నెమళ్ళు అన్ని ఇన్ని కావు ఆశ్చర్యముగా చూడవలసినవి మరేన్నోకలవు. రాజస్థాన్ లో ఉదయ పూర్ కు దగ్గర లో ‘’ఏక లింగ జీ ‘’ఆలయం గొప్ప శైవ క్షేత్రం .గర్భాలయానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉండటం వింత .శివ లింగం నల్లని రాతితో మలచ బడింది .దీనికి నాలుగు ప్రక్కలా నాలుగు ముఖాలు ఉండటం విచిత్రం ఈ ముఖాలకు బ్రహ్మ విష్ణు మహేశ్వర సూర్య అని పేర్లు .ఆదిశంకరులు పూజించిన లింగం అవటం మరో విశేషం .స్వామిని ఏక లిగాజీ అని అమ్మ వారిని ఏక లింగేశ్వరి అని అంటారు ఈ ఆలయం ఖాట్మండు లోని పశు పతి నాద దేవాలయాన్ని పోలి ఉండటం మరో విశేషం .అక్కడ ఊర్ధ్వ ముఖం కూడా ఉంటుంది.దానికి యజమాని లింగం అని పేరు.

Share:

సర్పముచే ప్రతిష్ఠించబడిన నారాయణ స్వామి.

.
కశ్యప, కద్రువ దంపతులకు చాలామంది సర్పరూప సంతానం ఉంటారు. జనమేజయుడనే చక్రవర్తి చేస్తున్న సర్పయాగంలో వారందరూ ఆహుతి కాబోవుచున్న సమయంలో వారిలో అనంతుడనే సర్పము విష్ణుమూర్తిని గురించి తపస్సుచేసి ఆ ఆపదనుంచి రక్షించబడతాడు. అనంతుడు తపస్సు చేసిన ఆ చోటనే విష్ణుమూర్తిని మూల భావనారాయణ స్వామి గా ప్రతిష్ఠ చేశాడట. ఇది పురాణాలలో చెప్పిఉన్నందున, ఈ ప్రతిష్ఠని పురాణవ్యక్తమైన మూర్తి అంటారు. ఒక సర్పముచే ప్రతిష్ఠించబడిన మూర్తి గల క్షేత్రం కనుక ఈ ఊరిని సర్పవరం అని పిలుస్తారు.
ఒకసారి నారద మహర్షి దేవతలసభలో 'విష్ణుమాయను తెలుసుకోవడం నిరంతర నారాయణ జపం చేసే తనకు సాధ్యమని ' పలికెనట. తరువాత కొంతకాలానికి ఆయన భూలోక సంచారంచేస్తూ ఒక సుందరమైన సరస్సు చూసి, అక్కడ స్నానము చేయవలెనని తలచి, ఆసరస్సులో మునిగి తేలేసరికి విష్ణుమాయ వలన స్త్రీ రూపం పొదుతాడు.స్త్రీరూపంలో ఉన్న నారదుడిని నారదస్త్రీ అని వ్యవహరిస్తారు.
ఆమె పీఠికాపుర మహారాజుని వివాహమాడి 60మంది సంతానాన్ని కంటుంది.వారి పేర్లే 60 తెలుగు సంవత్సరాలపేర్లని చెబుతారు.పొరుగు రాజ్యంతో జరిగిన యుద్దంలో నారదస్త్రీ యొక్క భర్తా, 60మంది సంతానమూ మరణిస్తారు. అప్పుడు ఆమె ఆకలిబాధతో తనవారినిపోగొట్టుకొన్న దు:ఖ్ఖాన్ని కూడా మరచి అలమటిస్తుండగా ఒక బ్రాహ్మణుడు అక్కడ ఉన్న సరస్సులో ఆమె ఎడమచేయి తడవకుండా స్నానం చెయ్యమని చెబుతాడు.
అతనుచెప్పిన విధంగానే సరస్సులో స్నానం చేసి భయటకు వచ్చేసరికి ఆమెకి అసలు రూపం వస్తుంది కానీ ఎడమచేతికి ఉన్న గాజులు అలానే మిగిలిపోతాయి. బ్రాహ్మణుడు ఎక్కడా కనిపించడు. నారదమహర్షి విష్ణుమూర్తిని గురించి తపస్సుచేసి వాటిని వదిలించుకొంటాడు. అప్పుడు నారద మహర్షి రాజ్యలక్ష్మీ సమేత శ్రీ భావన్నారాయణ స్వామిని ప్రతిష్ఠిస్తాడు. నారదుని గర్వమనే భవరోగాన్ని వదిలించినస్వామి కనుక ఈయనను భావన్నారాయణ స్వామి అంటారు. ఋషిచే ప్రతిష్ఠించబడినది కావున ఈ క్షేత్రాన్ని ఆౠషం అంటారు.
ఇక్కడ స్వయంభూగా వెలసిన పాతాళ భావనారాయణ స్వామికూడా ఉంది. ముగ్గురు మూర్తులున్న దీనిని త్రిలింగ క్షోణి వైకుంఠము అంటారు. శ్రీ కృష్ణదేవరాయల తండ్రి వసంతభోగరాయలు నిర్మించిన మండపం ఈ దేవాలయంలో ఉంది. ఈ విషయం ఇక్కడి శాశనాల వల్ల తెలుస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడంవల్ల 108 నారాయణ క్షేత్రాలు దర్శించిన ఫలితం వస్తుందని చెబుతారు.
కాకినాడలో, సర్పవరం జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైనదని చెప్పబడుతున్న ఒక దేవాలయం ఉంది! అదే సర్పవరం శ్రీభావనారాయణ స్వామి దేవాలయం. ఎత్తైన గాలిగోపురం, విశాలమైన ప్రాంగణం, పురాతనంగా కనిపించే మండపమూ, ప్రవేశద్వారాలూ, నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంబమూ… మనకి ఒక కొత్త అనుభూతి కలుగజేస్తాయి. గాలిగోపురానికి ఎదురుగా రోడ్డుకి అవతలివైపు నారదుడు స్నానం చేశాడని చెప్పబడే కొలను ఉంది.
మాఘమాసంలో నాలుగు ఆదివారాలూ తిరుణాళ్ళు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కల్యాణం ఘనంగా జరుగుతుంది.

Share:

యమ తీర్థం శివాలయం.


ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణంలో నెలకొంది. ఇది ద్రావిడ నిర్మాణ శైలి కలిగిన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయాన్ని 12 వ శతాబ్దంలో రాజరాజ చోళుడు II నిర్మించాడు. ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తంజావూరులోని బృహదీశ్వర ఆలయం మరియు చోళపురం లోని గంగైకొండ చోళీశ్వర దేవాలయాలతోపాటు గుర్తించబడినది. ఈ దేవాలయాలు చోళుళ నిర్మాణ శైలికి తార్కాణాలు.
ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శివాలయం. ఈ దేవాలయంలోమూలవిరాట్టు మహాశివుడు. ఈ దేవాలయం లోని ప్రధాన దైవాన్ని దేవతల రాజైన ఇంద్రుని యొక్క ఐరావతం పూజించినట్లు పురాన గాథ. పురాణాల ప్రకారం ఐరావతం దాని వాస్తవ రంగు తెలుపును దుర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఈ దేవాలయం లో శివుని అర్చించి అచట గల కోనేరులోని నీటిలో స్నానమాచరించినపుడు దాని పూర్వపు రంగును పొందినది. ఈ ఇతిహాసం దేవాలయం లోని అంతర్గత మందిరంలో ఇంద్రుడు ఐరావతంతో కూర్చుని ఉండే చిత్రం ద్వారా తెలుస్తుంది. ఈ గాథ కారణంగా ఈ దేవాలయాన్ని ఐరావతేశ్వరాలయం అని పిలుస్తారు. .
పురాణాల ప్రకారం నరకాధిపతి యముడు కూడా శివుణ్ణి ఇచట అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఒక మహర్షి శాపం మూలంగా తన శరీరమంతా మంటలతో మండుతున్నట్లు అనిపించి ఆ బాధను పోగొట్టుకొనడానికి ఈ దేవాలయంలో అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఈ దేవాలయ కోనేరులో స్నానమాచరించి శరీర మంటలను పోగొట్టుకున్నాడని తెలుస్తుంది. ఈ కారణంగా ఈ సరస్సును "యమ తీర్థం" అని పిలుస్తారు.
దేవతలు
ఈ దేవాలయానికి ఉత్తర దిశగా పెరియ నాయకి అమ్మన్ దేవాలయం విడిగా ఉన్నది. బయటి భాగంలో ప్రాకారాల నిర్మాణం తర్వాత ఇది ప్రధాన దేవాలయంలో ఒక భాగంగా నెలకొంది. ప్రస్తుతం ఆలయంలో దెవత నిలబడి ఉండేటట్లు ఉండే దేవాలయంగా వేరుగా నెలకొంది.
ఈ దేవాలయం అనేక శిల్పాల సమాహారం. ఇందులోఅనేక రాతి శిల్పాలు నెలకొన్నవి. ఈ దేవాలయం బృహదీశ్వరాలయం లేదా గంగైకొండ చోళీశ్వర దేవాలయాల కంటే కొంచెం చిన్నది. శిల్పకళలో వాటికంటే విశిష్టమైనది. ఎందుకంటే ఈ దేవాలయం నిత్య వినోదం, శాశ్వత వినోదం కోసం నిర్మించబడినట్లు తెలుస్తుంది.
ఈ దేవాలయం యొక్క మహద్వారం తూర్పు వైపున కలదు. ఈ వేవాలయ విమానం (టవర్) 24 మీ (80 అడుగులు) ఎత్తులో ఉంటుంది. ఈ దేవాలయం లోని గర్భగుడి అక్ష మంటపాలతో మరియు పరివృత్త మార్గంతో గాని కూడుకొని లేదు. దాని దక్షిణ వైపు గల మంటపం పెద్ద రాతి చక్రాలు మరియు గుర్రాలతో కూడుకొని ఉన్న రథం ఆకారంలో ఉంటుంది. ఈ దేవాలయం మంటపాలు అత్యంత శోభాయమానంగా అలంకరింపబడి ఉంటాయి. అన్ని శిల్పాలు నిర్మాణం యొక్క సొగసును ద్విగుణీకృతం చేస్తున్నాయి. అంతర్భాగంలో తూర్పు వైపు చెక్కబడిన నిర్మాణాల సముదాయం కలిగి ఉంది. వాటిలో "బలిపీఠం" కలదు. దాని పీఠములో చిన్న గణేషుని విగ్రహం కలిగి ఉంది. ఈ బలిపీఠం యొక్క పీఠములో దక్షిణ భాగంలో మూడు అందముగా చెక్కబదిన మెట్లు కలవు. ఈ మెట్లను తాకినపుడు సంగీతంలోని సప్తస్వరాల శబ్డం వినబడుతుంది.
నైరుతి మూలలో గల మంటపం లో నాలుగు విగ్రహాలున్నాయి. ఇందులో ఒకటి యముడు విగ్రహం. ఈ విగ్రహంతోపాటు అతి పెద్ద రాళ్లపై "సప్తమాతలు" యొక్క శిల్పాలు చెక్కబడినవి. విడిగా నిర్మించబడిన దేవీ యొక్క దేవాలయం ప్రధాన దేవాలయం కంటే తరువాత నిర్మించబడినది. హిందూ దేవాలయ సంస్కృతిలో అమ్మవారి విగ్రహం ఉండటం అత్యవసరమైనదైనందున దీనిని నిర్మించినట్లు తెలుస్తుంది.
ఈ దేవాలయంలో వివిధ శాసనాలున్నాయి. ఇందులో "కుళుత్తుంగ చోళుడు (రెండవ)" దేవాలయాన్ని పురరుద్దరించినట్లు తెలుస్తోంది.
వరండా యొక్క ఉత్తర గోడకు 108 విభాగాల శాసనాలున్నాయి. ఇందులో 63 శైవాచార్యుల యొక్క చిత్రం మరియు వివరాలు ఉన్నవి. వారి జివితంలో ప్రధాన ఘట్టాలు అందులో ఉన్నవి. హిందూ మతంలో శైవం యొక్క మూలాలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ దేవాలయంలో రాజరాజ II కాలంలో దేవాలయంలో గానం చేసిన 108 మంది దేవర ఓతువర్స్ యొక్క ముఖ్యమైన శాసనాలున్నవి. కావేరి, గంగ, యమున, గోదావరి మరియు నర్మద వంటి నదీమ తల్లుల గూర్చి శాసనాలు కూడా ఇక్కడ ఉన్నవి.
ఈ దేవాలయం చోళుల యొక్క ప్రసిద్ధ దేవాలయాల జాబితాలో స్థానాన్ని 2004 లో సంపాదించింది. చోళుల విశిష్ట దేవాలయాలలో తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురం లోని చండైకొండ చోళీశ్వరాలయం మరియు దారసురంలోని ఐరావతేశ్వరాలయం లు ప్రసిద్ధమైఅంవి. ఈ దేవాలయానన్నీ 10వ మరియు 12 వ శతాబ్దముల మధ్య చోళుల కాలంనాటివి. మీ మూడు దేవాలయాలకొ అనేక పోలికలున్నాయి.

Share:

నేడే ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణం.

* రాయలసీమ అయోధ్య ఒంటిమిట్ట కోదండ రామాలయం ...
* జాంబవంతుడు ప్రతిష్టించింన సీతారాముల విగ్రహాలు..
* శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చిన స్థలం...
.
.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లాకు చెందిన ఒక ఒంటిమిట్ట ఒక మండలము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉంది సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడినది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.
.
ఒక మిట్ట పైన ఈ రామాలయం నిర్మించబడింది. అందుకని ఒంటిమిట్ట అని ఈ రామాలయానికి, గ్రామానికి పేరు వచ్చింది. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయితీ గా బ్రతికారని, వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని ఇంకొక కథనం కూడ ఉంది. మిట్టను సంస్కృతంలో శైలమంటారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశైలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే.
.
ఈ గ్రామాన్ని గురించి తొలి తెలుగు యాత్రాచరిత్రయైన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. ఆ గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రలో భాగంగా మజిలీలైన అత్తిరాల నుంచి భాకరాపేట వెళ్ళే మార్గమధ్యలో ఒంటిమిట్టను దాటి వెళ్ళారు. దీనివల్ల 1830 నాడు గ్రామ స్థితిగతులు తెలియవస్తున్నవి. అప్పటికి గ్రామంలో నాల్గుపక్కల కొండలే కలిగిన భారీ చెరువున్నది. చెరువు కట్టమీద ఉన్న బాటపైనే వారి ప్రయాణం సాగింది. ఆ ఒంటిమిట్టలో చూడచక్కనైన గుళ్ళు ఉన్నాయన్నారు. గ్రామంలో ఓ ముసాఫరుఖానా(యాత్రికుల నిలయం) ఉండేదని, అప్పటికే అది బస్తీ గ్రామమని పేర్కొన్నారు.
.
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.
.
ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (1863 - 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకట కవి, వర కవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.
.
చోళ, విజయనగర వాస్తు శైలులు కనిపించే ఈ ఆలయ స్థంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. చరిత్ర మధ్యయుగాల్లో మన దేశాన్ని దర్శించిన ప్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ తాను చూసిన గొప్ప ఆలయాల్లో ఇది ఒకటిగా అభివర్ణించాడు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపైన ”శ్రీ రఘువీర శతకాన్ని” రచించాడు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక తెలుగు వారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ, సరళ కవి బమ్మెర పోతన, జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ, ఆయన రచించిన భాగవతాన్ని అంకిత మిచ్చింది మాత్రం కోదండరాముడికే. ఈ సహజకవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీప వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి.
.
ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధి తో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇక్కడి విశేషం. పుట్టపర్తి కి వచ్చే ఎంతో మంది విదేశీయులు కూడా ఈ ఆలయ సందర్శన కోసం ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఆలయ శిల్ప సంపద చూసి ముచ్చటపడిపోతుంటారు.
.
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. 2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

శివలింగం చుట్టూ సంచరిస్తున్ననాగుపాములు.

మహబూబ్‌నగర్ జిల్లా, బల్మూరు మండలంలోని కొండనాగుల సమీపంలో ఉన్న గుడిబండ శివాలయం. ఈ ఆలయం, శ్రీశైలంకు దాదాపుగా ఒకే రకమైన్న పోలికెలు కన్పిస్తా యి. కాకతీయ రాజుల కాలంలో నాగేశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది. కొండపై నాగుపాములు శివలింగం చుట్టూ సంచరించడంతో ఇది నాగలింగేశ్వర ఆల యంగా ప్రసిద్ది చెందిందట.
రానురాను ఆలయం రామలింగేశ్వర ఆలయంగా మారిందని స్థానికులు చెబుతరు. కర్నాటక, మహారాష్ట్ర, తదితర దూర ప్రాంతాల నుం చి వచ్చే భక్తులు ఈమార్గాల నుంచి శ్రీశైలం వెళ్లే వా రు. అటవీ మార్గం ద్వారా వెళ్లే భక్తులకు ఈఆలయం ఆ రోజుల్లో సేద తీరడానికి ఎంతో ఉపయోగపడేదని గ్రామస్తులు తెలిపారు.
శివలింగంపై పడనున్న సూర్యకిరణాలు....
ఈ ఆలయంలో ప్రతి మహాశివరాత్రికి రెండు రోజుల పాటు ఉదయం సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడుతాయి. ఆ సందర్భంగా భక్తులు అధికసంఖ్యలో పూజ లు చేస్తుంటారు. ఆ రోజుల్లో బో ళాశంకరుడు సాక్షాత్తు ఇక్కడ దర్శనమిస్తారని ప్రజ ల విశ్వాసం. శివరాత్రికి ఆలయంలో జరిగే కాల్యాణ మహోత్సవానికి ఈచుట్టు పక్కల ప్రజలు అధిక సం ఖ్యలో తరలివస్తారు.
శ్రీశైలంలో గర్భాలయానికి మొ దటి పూజలు అందుకునే వినాయకుడు దర్శనమివ్వ గా ఇక్కడ ఆలయ గర్భగుడికి వినాయక విగ్రహం ద ర్శనమిస్తుంది. గర్భగుడిలో స్వామి వారితోపాటు భ్ర మరాంబికదేవి, సూర్య భగవానుల విగ్రహాలు ఉన్నా యి. శ్రీశైలానికి నాలుగు వైపుల ద్వారాలు ఉన్నట్లుగా ఈ ఆలయానికి మూడువైపుల ద్వారాలు ఉన్నాయి. కోనేరు పక్కనే స్వామి వారి పాదాలు వెలిశాయి.
చెంచులే ధర్మకర్తలు..
ప్రస్తుతం ఆలయానికి ఇక్కడి చెంచులే ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఆలయంలో కొన్ని సంవత్సారాల కిందట గుప్తనిధుల కోసం కొంత మంది దుండగులు తవ్వాకాలను జరిపారు. ఆలయం చుట్టూ కొండ ఉండడంతో బ్లాస్టింగ్ చేసి కొండను పగులకొట్టి రాళ్ల కోసం ప్రయత్నాలు చేయగా ఆలయం చుట్టూ పగుళ్లతో నెర్రెలు ఏర్పడ్డాయి. ఆలయాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖకు 2006లో నమోదు చేయించారు. ప్రతి వహాశివరాత్రికి ఆలయంలో స్వామి వారికి కల్యాణ మహోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చెంచులే తమ సొంత ఖర్చులతో నిర్వహిస్తారు.

Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List