2018 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

నాగ లోకాన్ని తలపించే విదురాశ్వత్థ క్షేత్రం.

* సర్వదోష నివారణా మహిమాన్విత క్షేత్రం..
* త్రిమూర్తులు మమేకమైన ఉన్నఅశ్వత్థవృక్షం..
* భక్తులకు నిత్యం దర్శనం ఇచ్చే నాగ సర్పం..
.
సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు అశ్వత్థ నారాయణుడిగా కొలువులందుకుంటున్న మహిమాన్విత క్షేత్రం విదురాశ్వత్థ. దేశంలోనే ఓ విలక్షణమైన పుణ్యక్షేత్రంగా అలరారుతున్న ఈ దివ్యథామం స్వామి లీలా విశేషాలతో మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. విదురాశ్వత్థ క్షేత్రం మహిమాన్వితమైనది. అటు చారిత్రకంగానూ, ఇటు పౌరాణికంగానూ విశేషమైన ప్రాశస్త్యాన్ని తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది.
.
విదురాశ్వత్థ క్షేత్రం ఓ చిన్ని గ్రామం. మహాభారతంలో ధర్మజ్ఞుడ్నిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న విదురుడు ఈ క్షేత్రంలో కొంతకాలం నివసించడంవల్ల ఈ క్షేత్రానికి విదురాశ్వత్థ అనే పేరు వచ్చింది. అలాగే ఆ స్వామి ఇక్కడ ఒక అశ్వత్థ వృక్షం నాటి శ్రీహరి సేవలో తరించడంవల్ల ఈ క్షేత్ర ప్రాశస్త్యం మరింత పెరిగింది.
.
విదురాశ్వత్థ క్షేత్రంలోకి అడుగుపెట్టగానే ఆలయ ద్వారం కనువిందు చేస్తుంది. ఈ ద్వారం మీద అశ్వత్థ నారాయణస్వామివారి మూర్తి భక్తుల చూపు మరల్చనీయదు. ఈ ఆలయ ప్రాంగణం విశాలమైనది. ఈ ప్రాంగణమంతా నాగ శిలాప్రతిమలతో అదో నాగ లోకాన్ని తలపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయం ముందు వినాయకుని చిన్ని మందిరం ఉంది. అశ్వత్థవృక్షం త్రిమూర్త్యాత్మకమైనది. ఆ వృక్ష రాజంలో త్రిమూర్తులు మమేకమై ఉంటారు. దానిని స్ఫురణకు తెచ్చే విధంగా ఇక్కడ ప్రాకారాల మీద త్రిమూర్తుల మూర్తులను పొందుపరిచారు.
.
గర్భాలయం ముందు భాగంలో పంచలోహ సమన్విత నాగ సర్పం ఉంది. స్వామి ఇక్కడ సర్ప రూపంగా కొలువై ఉండడంవల్ల ఇక్కడ నాగ సర్పాన్ని ఉంచారని చెబుతారు. గర్భాలయంలో ఒక పక్క విఘ్న నాయకుడు వినాయకుడు కొలువుదీరగా, మరోపక్క కుమారస్వామి, పరమేశ్వరులు ఆశీనులయ్యారు. ఈ మూర్తులకు సమీపంలో ఎతె్తైన పీఠం శ్రీ అశ్వత్థ నారాయణస్వామి శిలామూర్తి ఉంది. ఇదే ఆలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి వెనుక భాగంలో అశ్వత్థ వృక్షం కానవస్తుంది.
.
సాక్షాత్తు విదురుడు నాటిన వృక్ష రాజంగా దీనిని చెబుతారు. అయితే ఈ వృక్షరాజం 2001వ సంవత్సరంలో పక్కకు ఒరిగిపోవడంతో దానిని జాగ్రత్తగా కాపాడడానికి తగు చర్యలు చేపట్టారు. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వృక్షం నీడలో నారాయణ స్వామివారి మూర్తి ఒకటి కానవస్తుంది. ఈ వృక్ష రాజాన్ని దర్శించినంత మాత్రంచేతనే అనంతకోటి పుణ్యఫలాలు సొంతమవుతాయని భక్తుల విశ్వాసం.
.
ఈ ఆలయ ప్రాంగణంలో కుడివైపు భాగంలో అభయాంజనేయస్వామివారి మందిరం ఉంది. ఇందులో కొలువుదీరిన ఆంజనేయస్వామివారు సింధూర వర్ణ శోభితంగా దర్శనమిస్తారు. తిరునామధారియైన అభయాంజనేయస్వామి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావించి కైమోడ్పులర్పిస్తారు.
.
దీనికి సమీపంలోనే ముడుపుల చెట్టు ఉంది. ఈ ఆలయానికి వచ్చిన కొంతమంది భక్తులు ఇక్కడ ముడుపులు కడతారు. స్వామివారి లీలా విశేషాలకు ఇది తార్కాణంగా నిలిచింది. దీనికి సమీపంలోనే పూర్వకాలం నాటి శివాలయం ఉంది. శివాలయంలో ఉన్న పరమేశ్వర లింగ దర్శనం మాత్రం చేతనే పంచపాతకాలు సైతం మటుమాయమవుతాయంటారు. ఇక్కడ స్వామికి చేసే అర్చనాది కార్యక్రమాలన్నీ విశేష ఫలితాలనిస్తాయంటారు.
.
ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న మరో ఆలయం శ్రీ నవగ్రహాలయం. నవగ్రహాది దేవతలు కొలువుదీరిన ఈ ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నవగ్రహ దోష నివారణ పూజలు చేయించుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామివారి మందిరం ఉంది. ఈ మందిరంలో వెంకటేశ్వరస్వామి తన ఇరు దేవేరులతో కలసి కొలువుదీరాడు.
.
విదురాశ్వత్థ శ్రీ అశ్వత్థ నారాయణస్వామి క్షేత్రం సర్వదోష నివారణా క్షేత్రంగా కూడా విరాజిల్లుతోంది. అలాగే వివాహం కానివారు, సంతానం లేనివారు ఇక్కడ ఈ ప్రాంగణంలో నాగదేవత శిల్పాన్ని ప్రతిష్టించి పూజిస్తే, వెంటనే అభీష్ట సిద్ధి కలుగుతుందన్న నమ్మకం భక్తుల్లో ప్రబలంగా ఉంది. ఈ కారణంగానే భక్తులు ప్రతిష్టించిన వేలాది నాగ శిల్పాలు ఇక్కడ ఈ ప్రాంగణంలో దర్శనమిస్తాయి. అలాగే పర్వదినాలు, పండుగలపుడు ఈ ఆలయంలోకి సర్పాలు వచ్చి భక్తులను కటాక్షిస్తాయని భక్తులు చెబుతారు. విదురాశ్వత్థ క్షేత్రం చారిత్రకంగా కూడా ప్రసిద్ధిచెందింది.
.
దక్షిణ భారత దేశపు జలియన్‌వాలాబాగ్ జరిగిన ప్రదేశంగా దీనిని చెబుతారు. స్వాతంత్య్ర సమరంలో భాగంగా జరిగిన మారణకాండలో ఈ గ్రామానికి చెందిన పది మంది స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడ అశువులు బాశారని ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఉదంతానికి గుర్తుగా ఇక్కడ ఒక స్మారక స్థూపాన్ని కూడా నెలకొల్పారు. కర్ణాటక రాష్ట్రం, చిక్‌బళ్ళాపూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం గౌరిబిదనూర్ పట్టణానికి సుమారు పది కిలోమీటర్లు దూరంలో ఉంది. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి బెంగళూరునుంచి నేరుగా చేరుకోవచ్చు. అలాగే హిందూపురం వరకూ వచ్చి అక్కడ నుంచి గౌరీబిదనూరు మార్గంలో ఉన్న ఈ క్షేత్రాన్ని సులువుగా చేరుకోవచ్చు. విదురాశ్వత్థ క్షేత్రం చిన్న గ్రామం. కేవలం స్వామివారి లీలా విశేషాలతో మాత్రమే ఇది ఖ్యాతికెక్కింది. ఇక్కడ ఈ క్షేత్రంలో బసచేయడానికి ఎలాంటి సదుపాయాలు లేవు. అలాగే భోజన సదుపాయం కూడా ఇక్కడ అంతంత మాత్రంగానే ఉంటుంది. అందువల్ల ఈ క్షేత్రాన్ని సందర్శించాలనుకునే వారు వారివారి ఏర్పాట్లను చేసుకుని మరీ వెళ్ళాల్సి ఉంటుంది.

Share:

భక్తికి, బట్టలతో పని ఏముంది.?


మనం భగవంతుడు అంటే పలాని విదంగా ఉంటాడు అని మన మనసులో ఫిక్స్ అయిపొతాం. కాబట్టి దానికి బిన్నంగా నేటి తరం వారు దరిస్తున్న వస్త్రదారణ లో వస్తే మనం గుర్తు పడతామా? ఒక వేళ మాయలు మంత్రాలు చేస్తే గారడి మాజిక్ అంటాం. ఒక వేళ సినిమాలో చూపినట్లు ఆ డ్రెస్ లో వస్తే పగటి వేషగాడు అంటాం.మరి ఏ వేషం లో వస్తే మనం ఓ.కె అంటాం. ఇది అవతార పురుషుడ్ని వేదిస్తున్న సమస్య అనుకుంటా.
మొన్న మా ఊరు ఒక స్వామి గారు వచ్చారు. వారి ఆచారం ప్రకారం పూర్తి దిగంబరంగా వచ్చారు. వారికి స్త్రీ, పురుష, వయో బేద తారతమ్యం లేకుండా అందరూ సాగిలపడి మొక్కారు. వాహ్. క్యా బాత్ హై. అయినా నా పిచ్చి ఆలోచన కాని, భక్తికి బట్టల తో పని ఏ ముంది? కాకపోతే ఆయన రావడానికి ముందు బాగా ప్రచారం చేసారు ఆయన భక్తులు. కాబట్టి ఇతర భక్తులుకి గుర్తు పట్టడం లో ఇబ్బంది లేకుండా పోయింది. అందరూ తనివి తీరా దర్శించా రు ఆ దివ్య మంగళ దిగంబర స్వామిని.
అందుకే వీర భొగ వసంత రాయలు గారయినా సరె ప్రజలు కోరుకున్నట్లు రావాల్సిన అవసరం ఏమి లేదు.కాని వచ్చే ముందు ఒక ఫ్రెం వర్ఖ్, టీం వర్క్ ఉంటే చాలు. మరి ఆయన ఆ జగర్తలు తీసుకున్నాడా లేదా?ఆయన బ్రహ్మం గారిలా వస్తారా? యోగి వేమన ల వస్తారా? వస్తే గాని తెలియదు.
Share:

పాతాళేశ్వర్ మహాదేవ్ శివాలయం.



హిమాచల్ ప్రదేశలోని సిర్ మౌర్ జిల్లా,పత్ లియో గ్రామంలో వున్న పాతాళేశ్వరస్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది.ఈ ఆలయంలో వున్న శివలింగం కనీసం పన్నెండు అడుగుల పొడవని చెప్తారు. ఇది భూతలం పైన అయిదు అడుగులుండగా , మిగిలింది భూస్థాపితమైంది . భూమి కోత ఏర్పడగా, అందులో నుండి ఈ లింగం స్వాభావికంగా వెలసిందట. ఇక్కడ స్వామిని భక్తులు పాతాళేశ్వరడని పిలుస్తారు. ఈ ఆలయంలోని శివలింగం దట్టమైన అడవుల మద్య వెలసింది . పంచపాండవులు తమ ఆజ్ఞాతవాస కాలంలో తపస్సు చేసుకుంటూ, అడవుల్లో సంచరిస్తూ ఈ శివలింగానికి పూజలు చేసినట్లు ఐతిహ్యం. ఇక్కడ స్వామివారికి దీపం వెలిగించడం, కొబ్బరికాయ సమర్పిచడానికి బదులు కేవలం ఆయా కాలల్లో లభించే జొన్నలు,బెల్లం ,గోధుమలు నివేదించి , స్వామి వారికి వీటితో అభిషేకం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

ఆదిశంకరాచార్యులు పూజించిన దివ్యక్షేత్రం... పుష్పగిరి..

.
సాధారణంగా శివ, వైష్ణవ ఆలయాలు ఒకే చోట ఉండడం చాలా అరుదైన విషయం. అలాంటి అద్భుత క్షేత్రమే పుష్పగిరి. సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు పూజించిన చం ద్రమౌళీశ్వర లింగం ఈ క్షేత్ర ప్రత్యే త. కడప జిల్లా కేంద్రానికి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం దక్షిణ కాశిగా అత్యంత ప్రసిద్ధి చెందిదినది. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. కడప నుంచి కర్నూ లుకు వెళ్ళే మార్గంలో చె న్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుం ది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్ప గిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది.
.
శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్ర ముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని ‘మధ్య అహోబిలం’ అనీ, శైవులు దీనిని ‘మధ్య కైలా సం’ అనీ అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇదొక్కటే శంకరా చార్య మఠం.
‘పుష్పగిరి’ పేరు వెనుక... ఈ ప్రాంతంలో కాంపల్లె అనే గ్రామం ఉండే ది. గరుత్మంతుడు ఇంద్రుని అమృతభాండాన్ని తీసుకుని వస్తున్నాడు. ఇంద్రుడు అడ్డగించా డు. ఇరువురికీ పోరాటం జరిగింది. ఆ సమ యంలో అమృతభాండం నుంచి కొన్ని చుక్క లు కాంపల్లె సమీపంలోని కోనేటిలో పడ్డాయి. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగేవారికి యౌవ నం లభించేది, అమరత్వమూ సిద్ధించేది.
.
దేవ తలు భయపడి శివుణ్ణి ఆశ్రయించారు. శివు డు వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. వాయువు కై లాస పర్వతం నుంచి ఒక ముక్క ను తెచ్చి ఆ కోనేటిలో వేశాడు. అది కోనేటిలో పుష్పం వలె తేలింది. అదే పుష్పగిరి అయింది. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తారు. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.
.
శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ది చెందిం ది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అలరారుతోంది. పరీ క్షిత్తు వంశాన్ని నిర్వీర్యం చెయడానికి జనమే జయుడు చెసిన సర్పయాగ పాప పరిహారా ర్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. చోళులు, పల్లవులు, కృష్ణ దేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చెశారని చరిత్ర ద్వారా తెలుస్తోంది.
.
కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాల యం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్య లక్ష్మి, రుదప్రాద, యోగాంజనేయ, సాక్షిమల్లే శ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభ వేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము ఈ కొండ మీదనే ఉన్నాయి. పుష్పగిరిలో కింద వైద్యనాదేశ్వర, త్రికుటేశ్వ ర, భీమలింగేశ్వర, కామక్షి అమ్మవారి ఆలయా లున్నాయి. వైద్య నాథేశ్వరుడు, భీమేశ్వరుడు, త్రికూటేశ్వరుడు ఇక్కడ నెలకొని ఉన్నారు. వై ద్య నాథేశ్వరాలయంలో శ్రీ కామాక్షి మందిరం ఉంది. వరదలు వచ్చినప్పుడు పెన్నా నది దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి.
.
పాతాళ గణపతిని దర్శించు కొ ని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తు లు తరలివస్తారు. జగద్గురువు ఆదిశంకరాచా ర్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు. పుష్పగిరి శిల్పకళాసంపదకు పేరు. ఆలయం బయటి గోడలపైన ఉండే శిల్పాలు చూడము చ్చటగా ఉంటాయి. అక్కడ ఏనుగుల వరస లు, గుఱ్ఱాల మీద వీరుల విన్యాసాలు రమ్యం గా ఉన్నాయి. భారత రామాయణాల్లోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. కిరాతార్జున గాథ చిత్రించబడింది. నటరాజ నృత్యం చూసి తీరాలి. ఇక్కడి శిల్పాలలో సౌందర్యం తొణికిస లాడుతూ ఉంటుంది.

Share:

నేడే ‘‘కాలభైరవాష్టమి’’


* సమస్త ప్రాణులను తనలోకి లయం చేసుకొనే శ్రీకాలభైరవుడు....
* పుణ్యాలు కలగడంతోపాటూ... సర్వవిధాలైన భయాలు నశింపజేసే శివ బైరవుడు...
* భయంకరమైన భైరవుని రూపాలు .....
.
.
కాలభైరవుడు అనే పేరులోనే అనంతమైన శక్తి దాగివున్నట్లు అనిపిస్తూ వుంటుంది. ఆయన ప్రతిమలు కూడా కాలాన్ని శాసిస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి. ఆయన రూపం భయంకరంగా కనిపించినా, తనని ఆరాధించిన వారిపట్ల ఆయన రక్షకుడిగా వ్యవహరిస్తూ వుంటాడు. సాధారణంగా కాలభైరవుడి గురించి తెలియని వాళ్లు ఆయనకి కాస్త దూరంగా వుంటారు. నిజానికి ఆయన మహశివుడి మరో రూపంగానే చెప్పాలి. సమస్త ప్రాణులను పరమశివుడు ... భైరవుడి రూపంలోనే తనలో 'లయం' చేసుకుంటూ వుంటాడు.
.
.
కాలము అనబడే కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు కనుక. ఈయనను కాలభైరవుడు అని అంటారు. నుదుటున విభూతి రేఖలను ధరించి, నాగుపాముని మొలత్రాడుగా చుట్టుకుని… గద, త్రిశూలం, సర్పం, పాత్ర చేతబట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తూ పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం. ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ వుంటుంది.
.
.
మార్గశిర మాసంలోని కృష్ణపక్ష అష్టమి- ‘‘కాలభైరవాష్టమి’’. పరమ శివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే ‘కాలభైరవాష్టమి’. లయకారుడైన పరమశివుడివల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడుగా కొలువుదీరిన దేవడు - కాలభైరవుడు. శ్రీకాలభైరవుడు ఆవిర్భవించిన ‘‘కాలభైరవాష్టమి’’ పర్వదినమును జరుపుకుని కాలభైరవుడిని పూజించాలని శాస్తవ్రచనం.
.
.
కాలభైరవస్వామి ఆవిర్భవానికి సంబంధించి ‘‘శివపురాణం’’లో ఆసక్తికరమైన పురాణగాధ వుంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు శివుడివద్దకు వెళ్ళి - ‘‘నేనే సృష్టికర్తను... పరబ్రహ్మ స్వరూపుడను... నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి’’ అని పలికాడు. శివుడు అందుకు వ్యతిరేకించాడు. దీనితో ఇద్దరి మధ్య వాదం ప్రారంభమై చాలాసేపు వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నతకాయముతో... మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే - శ్రీకాలభైరవుడు.
.
.
ఈ విధంగా శివుడి హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యనవున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. అనంతరం శ్రీకాలభైరవుడు లయకారుడైన శివుడి ముందు నిలబడగా- ‘‘నీవు బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడంవల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహాయిచ్చాడు. బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు.
.
.
కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు -‘‘కాలభైరవా! నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు... కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది’’ అని సలహాయిచ్చాడు.
.
.
దీనితో- కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే - నేటి కాశీ క్షేత్రంలోని ‘‘కపాల మోక్షతీర్థం’’. తర్వాత కాశీక్షేత్రంలో శ్రీకాలభైరవుడు కొలువుదీరి క్షేత్రపాలకుడుగా పూజలందుకుంటూ వున్నాడు. కాలభైరవుడిని కాశీలో ముందుగా దర్శించే ఆచారంతోపాటూ... కాశీకి వెళ్ళి వచ్చినవారు ‘‘కాశీ సంతర్పణం’’ కంటే ముందుగా కాలభైరవ సంతర్పణ చేయడం శ్రీ కాలభైరవస్వామి వారి మహత్మ్యానికి నిదర్శనం.
.
.
ఈ విధంగా ఆవిర్భవించిన కాలభైరవ స్వామి వారి జన్మదినమైన ‘‘కాలభైరవాష్టమి’’ నాడు శ్రీకాలభైరవుడిని స్మరించడం, పూజించడంవల్ల సకల పుణ్యాలు కలగడంతోపాటూ... సర్వవిధాలైన భయాలు నశిస్తాయి. కాలభైరవాష్టమి నాడు తెల్లవారుఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. కాలభైరవుడి విగ్రహాన్నిగాని, చిత్రపటాన్ని గానీ పూజామందిరంలో ఏర్పాటుచేసుకుని ముందుగా గణపతిని పూజించి తర్వాత శ్రీకాలభైరవస్వామి వారిని షోడశోపచారము, అష్టోత్తరాలతో పూజించి, శక్తిమేరకు నైవేద్యమును సమర్పించవలెను. ఆ రోజూ మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం వుండవలెను. ఆదిశంకరాచార్యుల వారు రచించిన ‘‘కాలభైరవాష్టకమ్’’ను పారాయణం చేయాలని శాస్తవ్రచనం. ఈ విధంగా కాలభైరవాష్టమిని జరుపుకొనడంవల్ల సర్వవిధాలైన భయాలు తొలగిపోయి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. కాలభైరవాష్టకమును నిత్యం పఠించడం కూడా మంచిదే!
.
.
భైరవుని రూపాలు :...
కాల భైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురు భైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, రుద్ర భైరవ, ఉన్మత్త భైరవ
ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహా భైరవ, చండ భైరవ అనే రూపాలు కుడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం.... ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ 'కాలభైరవాష్టకం' కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.


https://www.facebook.com/rb.venkatareddy
Share:

భగవంతుణ్ణి నిలబెట్టిన భక్తుడు.


భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో దేని విశిష్టత దానికి ఉన్నది. వీటిలో కొన్ని శైవక్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో తిరుపతిలాగా మహారాష్టల్రోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ‘విఠోబా’ పేరుతో వెలసియున్నాడు. విఠోబా లేక వితోబా అనే పేరు పురాణాలలో కూడా ఉన్నది. ఈ పండరినాథ భక్తితత్వాన్ని జ్ఞానేశ్వర్, నామదేవ్, ఏక్‌నాథ్, తుకారాం వంటి సంత్‌లు, సాధువులు ప్రాచుర్యంలోకి తెచ్చారు. మహావిష్ణువు పండరిలో వెలసిన విషయం గురించి రకరకాల గాథలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది పుండరీకుని వృత్తాంతము. (మహారాష్టల్రో పుండరీకుడు అంటారు) పుండరీకుడు ఒక బ్రాహ్మణ యువకుడు. మొదట్లో అతడు పరమవైష్టికుడే. తల్లిదండ్రుల ఎడ పరమభక్తిగలవాడు. ఒక రోజున స్వామి పుండరీకుని ఇంటికి వచ్చాడట. ఆ సమయంలో ఆ భక్త శిఖామణి తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్నాడట. అందువల్ల వాళ్ల సేవకు భంగం కలగకుండా, మాట్లాడకుండా ఒక ఇటుక రాయిని ఆ అతిథి వేపు వేశాడట. దీనిపైన కాసేపు కూర్చోండి అన్న అర్థంతో. స్వామి పుండరీకుని మాతాపితరుల పట్ల దృఢ భక్తికి సంతసించి అక్కడే ఆ ఇటుక రాయిపై నిలబడి అలాగే ఉండిపోయారని అదే క్రమంలో ‘పండరిపురం’ అయిందని ఈ గాథ తెలుపుతున్నది.
మరొక కథలో పుండరీకుడు భార్యను గుర్రంపై ఎక్కించుకొని కాశీకి బయలుదేరాడట. 

తల్లిదండ్రులను మాత్రం నడిపించాడు. వారు అలా వస్తూ వస్తూ కుక్కుటస్వామి ఆశ్రమం చేరుకొంటారు. యాత్రికులు విశ్రాంతి తీసుకోవాలనుకొంటారు. ఆ రోజు రాత్రి పుండరీకునికి నిద్రపట్టలేదు. వేకువ ఝామున అతనికి కొందరు అందమైన యువతులు కనబడ్డారు. కాని వాళ్లు మురికిగుడ్డలు ధరించి ఉన్నారు. వాళ్లు ఆ ఆశ్రమం చేరి దాన్ని శుభ్రపరచి ఆ ఋషి వర్యుని వస్త్రాలు ఉతికి శుభ్రం చేసి, ప్రార్థనలు చేసి తిరిగి వచ్చినప్పుడు చూస్తే వాళ్లు స్వచ్ఛమైన కాంతులీనుతున్న బట్టలతో వెలిగిపోతున్నారు. వాళ్లు వెంటనే మాయమైనారు. ఈ దృశ్యం పుండరీకునిలో కొంతమార్పు తెచ్చింది. మరుసటి రోజు రాత్రి మెళకువతో ఉన్నాడు పుండరీకుడు. నిన్నటిది నిజమో భ్రమో తెలుసుకోవాలని అతనికి అనిపించింది. రెండోరోజున వాళ్లు వచ్చారు. ధైర్యం తెచ్చుకుని మీరెవరు అని వాళ్లను అడిగారు పుండరీకుడు. ‘మేము గంగా, యమున అనే నదులం’’ అని వాళ్లు చెప్పారు. పాపాలు చేసిన వాళ్లు తమలో మునగడం వల్ల వాళ్ల పాపం మాకు చేరి మేము మురికిగా కనిపించాం. కాని ఈ ఋషివర్యుని సేవతో మాకు అంటుకున్న పాపరాశి దగ్ధమై తిరిగి మేము పుణ్యవంతులుగా మారాము. ఈ ఋషి చేసుకొన్న తల్లితండ్రుల సేవే ఇతనికి ఇంతటి శక్తి నిచ్చింది అని చెప్పారు. దాంతో ఈ పుండరీకునికి తాను చేస్తున్న తప్పు తెలిసింది. దాంతో అతనిలో హృదయ పరివర్తనవచ్చింది. ఇక నన్ను పాపం నుంచి రక్షించాల్సింది దేవదేవుడే నని భగవంతుని ప్రార్థించాడు. అప్పట్నుంచి తల్లితండ్రుల సేవ పుండరీకుడు ఏమరలేదు. భగవంతునిపై భక్తినీ మరువలేదు. దానితో మహావిష్ణువు ప్రత్యక్షమై నీకేమి కావాలని అడిగితే నీవే ఈ పండరిపురానే్న వైకుంఠం చేయమని కోరాడాభక్తుడు. భక్తుని కోరికను తీర్చే వికుంఠుడు విఠలనామంతో పండరిలో కొలువైయ్యాడని ఈ కథనం చెప్తోంది. ఇక్కడే నిలబడిపోయిన శ్రీకృష్ణ పరమాత్మ విఠల నామంతో ప్రస్తుతించబడుతున్నారు. ‘విఠల’ అనే పదం ‘విట్టు’ అనే పదం నుండి వచ్చింది. కన్నడంలో మరాటలో ‘విట్టు’ అంటే ‘ఇటుక’ అని అర్థం. ఇటుకపై నిలబడిపోయిన శ్రీమహావిష్ణువే పండరి విఠలనాధుడు. ఇక్కడ స్వామి రుక్మిణి సహితుడై భక్తులకు దర్శనమిచ్చి తరింపచేస్తున్నారు.

తుకారాం చిన్న కొడుకు నారాయణిబాబా పండరిలో పల్లకిసేవ కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పదకొండో రోజున ఎక్కడో పూరి నుండి బయలుదేరిన ఈ పల్లకీలు పండరి చేరుకొంటాయి. భక్తులు ‘జైజై వితాబా రఖూమాయ్’ అని సంతోషంలో ఎలుగెత్తి నినదిస్తూ ఈ ఊరేగింపులో పాల్గొంటారు. (రఖూమాయ్ అంటే మరాటీలో మాతా రుక్మిణి అని అర్థం)

ఈ ఆలయంలో మొదటి మెట్టు ‘నాందేవ్ మెట్టు’. దీని గురించి కూడా ఒక విశేషం చెప్పుకొంటారు. చిన్నప్పటి నుండి నామదేవుడు గొప్ప విష్ణు భక్తుడు. ఒకరోజున వాళ్లనాన్నగారు ఇంట్లో లేకపోవడంతో వాళ్ల అమ్మ ‘‘నీవు నైవేద్యం తీసుకెళ్లు’’ అన్నదట. ఎంతసేపు వేచి చూచినా స్వామి వచ్చి నైవేద్యం భుజించడంలేదు. బాగా విసిగి పోయాడు. నిరాశతో తన తలను స్వామి పాదాలకేసి గట్టిగా కొట్టుకోవడం ఆరంభించారు. స్వామి ఆ అమాయక బాల భక్తుని దృఢదీక్షకు ముగ్ధుడై నిజరూపంలో వచ్చి నైవేద్యం స్వయంగా భుజించి దీవించాడు. ‘స్వామీ! నీవు ఈ మెట్టుపై నిలబడిపో’ అని అర్థించాడు. వచ్చిన భక్తులను దీవించడానికి స్వామి ఆ దేవాలయ మొదటి మెట్టుపై ఉన్నాడని, అందుకే దానికి ‘నాందేమ్ భీపహ్రి’ అని పేరు వచ్చిందని అంటారు. (‘పహ్రి’ అంటే మెట్టు మరాఠీలో). మొదట్లో భక్తులు స్వామి పాదాలను తాకేవారు. కాని అది దెబ్బతింటుందని ఈ పద్ధతి ఆపివేశారు. ఆ భీమా నదే ‘స్వయంభాగా’ నదిగా పిలుస్తారు.

Share:

బడంగ్‌పేట్ వేంకటేశ్వరుడు.


ముడుపు కడితే.. తీరేను కోర్కెలు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారు స్వయంభూగా వెలసిన ఆలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో అత్యంత మహిమ కలిగిన ఆలయంగా రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం బడంగ్‌పేట్ గ్రామ శివార్లలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఈ ఆలయం ‘కాశీబుగ్గ శ్రీ పుష్కరిణి’ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. సువిశాలమైన ప్రాంతంలో ప్రకృతి ఒడిలో ఆలయం అలరారుతోంది. స్వయంభూగా వెలసిన ఈ ఆలయం మహిమ అత్యద్భుతం. విశాలమైన ఏకశిలపై పద్మావతి, అలవేలుమంగ అమ్మవార్లతో కలిసి శ్రీ వేంకటేశ్వరస్వామి వారు స్వయంభూగా ఒక గుహలో వేంచేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. స్వామివారి వరదహస్తం కింద శివస్వరూపం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. శ్రీ వేంకటేశ్వరస్వామి మూలవిగ్రహం ఈ విధంగా ఉండటం చాలా అరుదనే చెప్పుకోవాలి. స్వామి వారి దర్శనం ఒక మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ఆలయ చరిత్రకు సంబంధించి మూడుచోట్ల శిలాశాసనాలు ఉన్నాయి. దీని ప్రకారం దాదాపు అయిదు వందల సంవత్సరాలకు పూర్వమే స్వామి వారు వెలసి ఉండవచ్చని భావిస్తున్నారు.
భక్తుల కోరికలను నెరవేర్చే దేవుడిగా ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి పేరుంది. భక్తులు ఎవరైనా తమ కోరికలను స్వామికి తెలియచేస్తూ, ‘ముడుపు’ కడితే ఏడాది తిరగకుండానే వారి కోరికలు నెరవేరతాయన్నది భక్తుల నమ్మకం. ఈ కారణంగానే చాలా మంది భక్తులు ముడుపులు కడుతూ, ఫలితం పొందుతూ ఉంటారు. అనేక మంది భక్తులు ‘కోరికలు నెరవేరుస్తున్న స్వామి’ అంటూ తమ స్వీయ అనుభవాలను చెబుతూ ఉంటారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రధాన ద్వారం నుండి లోపలకు వెళ్లగానే నాలుగువైపులా మండపాలున్నాయి. ఎడమవైపు గుడిలో ఆళ్వారులు వేంచేసి ఉన్నారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో నెల రోజుల పాటు గోదా ఉత్సవాలు, గోదాకళ్యాణం నిర్వహిస్తారు. అలాగే కార్తీకమాసంలో ఆకాశదీపారాధన, శ్రావణమాసంలో విశేషమైన పూజలు, ఆళ్వారుల తిరునక్షత్రాలు, పెరుమాళ్ల తిరునక్షత్రం తదితర కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతాయి.
ఆలయం ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభానికి ఆనుకుని గరుత్మంతుడి విగ్రహం ఉంది. భక్తులు ఆలయం ప్రాంగణంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభం ప్రదక్షిణ చేసుకుని ఆళ్వారుల దర్శనం చేసుకుంటారు. వేంకటేశ్వరస్వామి గర్భాలయం వెలుపల కుడివైపు ‘వీరాంజనేయస్వామి’ విగ్రహం ఉంది. భక్తులు హనుమంతుడిని దర్శనం చేసుకుని, అక్కడ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వస్వామి దర్శనానికి వెళతారు. ఇక్కడి హనుమంతుడు కూడా చాలా మహిమ కలిగి ఉన్నాడని భక్తుల నమ్మకం. హనుమంతుడిని నమ్మకంతో, భక్తితో పూజించే భక్తుల కోరికలు నెరవేరతాయని భక్తులు చెబుతున్నారు. ఆ తర్వాత హనుమంతుడి దర్శనం చేసుకుని పద్మావతి, అలమేలుమంగ సహిత శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి వెళతారు.
ప్రత్యేకతలు
కాశీబుగ్గ శ్రీ పుష్కరిణి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయం ప్రాంగణం దాదాపు నాలుగు ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రధాన ఆలయానికి తూర్పువైపు ఆరుబయట పెద్ద పుష్కరిణి ఉంది. పుష్కరిణి నిర్మాణం కళాత్మకంగా ఉంది. బడంగ్‌పేట గ్రామం దక్షిణం వైపున కురిసే వర్షపు నీరు ఈ పుష్కరిణిలోకి చేరుతుంది. అధికంగా చేరే నీటిని బయటకు పంపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. సాంకేతికంగా ఇదో అత్యద్భుతమైన కట్టడం. పుష్కరిణి మధ్య భాగంలో చక్రస్నాన మండపం ఉంది. బ్రహ్మోత్సవాల సమయంలో చక్రతీర్థం రోజు చక్రపెరుమాళ్లకు ఈ మండపంలో చక్రతీర్థోత్సవం జరుపుతారు. బ్రహోత్సవాల్లో విశేషమైన ఉత్సవమిది. పుష్కరిణి శిథిలావస్థకు చేరడం వల్ల దీన్ని పునరుద్దరించాల్సిన అవసరం ఉంది. జీర్ణోద్ధరణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం దాతలెవరైనా ముందుకు వస్తే పుష్కరిణిని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు వీలవుతుంది. గతంలో ఆలయానికి వచ్చే భక్తులు తొలుత పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాతే స్వామి దర్శనానికి వెళ్లేవారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. వాస్తురీత్యా పుష్కరిణికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పుష్కరిణిలోకి చేరే నీటిని ఆలయం పూజలకు వినియోగించునేందుకు వీలుంది. భక్తులు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేయవచ్చు. అలాగే ఈ నీటిని విశాలంగా ఉన్న ఆలయ ప్రాంగణంలో పూలు, పళ్ల మొక్కలు పెంచేందుకు ఉపయోగించుకునే వీలుంది. పుష్కరిణికి వాయవ్యం వైపు రామానుజస్వామి మండపం, తూర్పున మృత్సజ్గ్రహణ మండపం, నైరుతీలో కళ్యాణ మండపం ఉన్నాయి. బడంగ్‌పేట గ్రామం నుండి ఆలయానికి వచ్చే దారిలో శ్రీ వేంకటేశ్వరస్వామికి సంబధించిన మరో మండపం, రథశాల ఉన్నాయి.
ఆలయ ప్రాంగణం చుట్టూ భారీ ప్రహరీ ఉంది. ఈ ప్రహరీ వందలాది సంవత్సరాల క్రితం నిర్మించారని తెలుస్తోంది. అందువల్ల ఈ ప్రహరీ చాలా భాగం కూలిపోయి శిథిలావస్థకు చేరింది. ప్రహరీని కూడా పునర్మించాల్సిన అవసరం ఉంది. ఆలయ ప్రాంగణంలో వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. మండువేసవిలో సైతం ఈ ఆలయం ప్రాంగణం చల్లగా ఉండటం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆలయ అభివృద్ధికి అనేక పనులు జరుగుతున్నాయి. ఈ పనులు మరింత వేగంగా కొనసాగేందుకు దాతలు ముందుకు వస్తే బాగుంటుంది. ప్రధానమైన శ్రీవేంకటేశ్వరుడి ఆలయంతో పాటు ఈ ఆలయాన్ని ఆనుకుని శివాలయం ఉంది. ఈ శివాలయాన్ని ‘కాశీబుగ్గ శివాలయం’ అని పిలుస్తారు. కార్తీక మాసంలో దీపాలతో శివాలయం కళకళలాడుతూ ఉంటుంది.
వార్షికోత్సవాలు
ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో 9రోజుల పాటు వార్షికోత్సవాలు నిర్వహిస్తుంటారు. వైశాఖ శుద్ధ తదియ నుండి ఏకాదశి వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగానే ఈ నెల (మే) 13 నుండి 21 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల వేంకటాచార్యులు, అర్చకులు చక్రవర్తుల మదన్ మోహన్ చార్యులు, జగన్ మోహన్‌చార్యులు చెప్పారు. బ్రహోత్సవాల్లో భాగంగా 16న అంకురారోపణ, 18న ఉదయం 11 గంటలకు పద్మావతి, వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవం, 19న హనుమత్‌వాహన సేవ, 20న రథోత్సవం, 21న పండిత సన్మానం ఉంటాయని వేంకటాచార్యులు వివరించారు.
మార్గం
హైదరాబాద్ (కోఠి ఉమెన్స్ కాలేజీ) నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బడంగ్‌పేటకు వెళ్లేందుకు ఆర్టీసి సిటీ బస్సులున్నాయి. కోఠి ఉమెన్స్ కాలేజీ స్టాప్ నుండి బయలుదేరే బస్సుల్లో 203, 102 బి, 479 బస్సులు బడంగ్‌పేట వెళతాయి. పీసల్‌బండ / మిథాని డిపో చౌరస్తా నుండి బస్సులు ఆటోలు అందుబాటులో ఉన్నాయి.

Share:

అసూయను పారద్రోలే ఘృష్ణేశ్వరుడు.


ఆ స్వామిని ఏ పేరుపెట్టి పిలిచినా వచ్చి ఆదుకుంటాడు. భక్తితో ఏది సమర్పించినా అందుకుని కటాక్షిస్తాడు. అందుకే ఆ స్వామి భక్తవశంకరునిగా, భోళాశంకరునిగా పూజలందుకుంటున్నాడు. శివ పూజ అనేది ప్రాప్తంతో కూడుకున్నది. శివానుగ్రహం ఉంటేనే గానీ శివపూజ లభించదు. శివపూజకు ఎలాంటి నియమ నిబంధనలూ లేవు. భక్తితో రెండు చుక్కలు నీరుపోస్తే మహాదేవుడైన ఆ స్వామి పెద్దమనసు చేసుకుని కటాక్షిస్తాడు. అయితే ఉండాల్సిందల్లా భక్తి, విశ్వాసం. శివుడు తన భక్తుల్ని అనుగ్రహించడానికి అనేకచోట్ల వెలిసినప్పటికీ, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలే ఎక్కువగా ప్రసిద్ధిపొందాయి. కారణం ఆయా క్షేత్రాలలో శివుడు భక్తుల అభీష్టంమేరకు లోక కళ్యాణంకోసం వెలిశాడు. అలా శివుడు తనకుతానుగా ఆవిర్భవించిన క్షేత్రాలే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ప్రసిద్ధిపొందాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల మహిమ అపారం. ఆ మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో వెలసిన మరో పుణ్యధామం ‘వెరూల్’. మహారాష్టల్రోని ఔరంగాబాద్‌కు 35 కిలోమీటర్లు దూరంలో ఉందిది. 

శివుడు ఇక్కడ ఘృష్ణేశ్వరస్వామిగా కొలువులందుకుంటున్నాడు. వెరూల్ దివ్యక్షేత్రంలోని శ్రీఘృష్ణేశ్వర స్వామి ఆలయం సుందరమైనది. మనోహరమైన కట్టడాలతో అలరారుతున్న ఈ ఆలయం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ దివ్యాలయాన్ని రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. సాక్షాత్తు మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిసిన వెరూల్ దివ్యక్షేత్రంలో పూర్వం నాగజాతి ఆదివాసులుండేవారు. ‘బాంబీ’ అంటే పాముల పుట్టలని అర్థం. పాముపుట్టలను మరాఠీలో ‘వారుళ్’అంటారు. వారుళే కాలక్రమంలో వెరూల్‌గా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది. అలాగే పూర్వకాలంలో ఈ క్షేత్రాన్ని ‘యెల’అనే రాజు పాలించేవాడు. అతని రాజధాని ‘యేలాపూర్’. ఆ యేలాపూర్ యేలూరుగా, వెరూల్‌గా పేర్గొంచింది. మనోహరమైన కట్టడాలు, ప్రాకారాలతో అందంగా అలరారుతున్న శ్రీ ఘృష్ణేశ్వరస్వామి ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయాన్ని జైజాబాయి, అహిల్యాదేవి హోల్కర్ తదితర భక్తులు పునర్నిర్మించారు. అలాగే ఈ ఆలయ గోపురానికి జయరామ్ భాటియా అనే భక్తుడు స్వర్ణరేకు తాపడంచేశాడు. అలాగే 24రాళ్ళ స్తంభాలతో సభామండపాన్ని కూడా చేయించాడు. అతి పురాతనమైన ఘృష్ణేశ్వరం మహిమాన్వితమైనది. శివుడు ఈ క్షేత్రంలో కొలువై ఉండడానికి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది.
పూర్వం దేవ పర్వతంపై సుదేహ, సుధర్ముడనే బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. సుదేహకు సంతానం కల్గకపోవడంతో తన చెల్లెలు అయిన ధుశ్శను తన భర్తకిచ్చి వివాహంచేసింది. కొంతకాలానికి ధుశ్శ గర్భాన్ని ధరించి ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ కొడుకు పెద్దవాడై సంతోష భాగ్యాలతో ఉండడంతో ద్వేషాన్నిపెంచుకున్న సుదేహ, తన చెల్లెలు ధుశ్శ కొడుకును చంపించి, చెరువులో పడవేయించిందట. శివభక్తురాలైన ధుశ్శ తన కొడుకు మరణించినా చెక్కుచెదరకుండా శివార్చన చేసిందట.

శివుడు అనుగ్రహించి ధుశ్శ కొడుకుకి పునర్జీవితం ప్రసాదించాడు. దీనికి కారణమైన సుదేహను భస్మంచేయడానికి ఉద్యుక్తుడవుతుండగా తన అక్క చేసిన పాపాన్ని క్షమించమని, లోకకళ్యాణం కోసం స్వామిని అక్కడ వెలవమని ప్రార్థించిందట. ధుశ్శ అభీష్టంమేరకు శివుడు అక్కడ ధుశమేశ కామధేయుడై జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అలాగే స్వామి ఇక్కడ వెలవడం వెనుక మరో పురాణ గాథ కూడా ఉంది. ఒకరోజు శివుడు, పార్వతి కామ్యక వనంలో ఏకాంతంలో ఉండగా పార్వతికి దాహం వేసిందట. అపుడు శివుడు పాతాళంనుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడట. అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేర్గాంచింది. పార్వతి మాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ, కేసరిలను శివాలయ తీర్థంలో కలిపిందట. ఆమె చేతిలో కుంకుమతో శివలింగం తయారయ్యిందట. ఆ లింగంనుంచి ఓ దివ్యజ్యోతి ఉద్భవించగా పార్వతిమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో వుంచి, లోక కళ్యాణంకోసం అక్కడ ప్రతిష్టించిందట. ఆనాటినుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడనే పేరొచ్చింది. సాక్షాత్తు పార్వతిమాత ప్రతిష్టించిన జ్యోతిర్లింగం కాబట్టే దీనికి ఇంతటి మహత్తు ఏర్పడిందంటారు. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ఆలయం విశాలమైనది. పూర్తిగా రాతి కట్టడం, ఆలయానికి ముందు భారీ ఆకారంలో ఉన్న రాతి నంది ఉంది. ఈ నంది శిల్పం అందం వర్ణనాతీతం. గర్భాలయానికి ముందు ఎడమవైపు భాగంలో విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. ఆలయ ప్రాంగణంలో పార్వతి మాత ఆలయం ఉంది. గర్భాలయంలో ఉన్న ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శనం సర్వపాప హరణం. ముక్తిదాయకం. భూమిలోకి చొచ్చుకుపోయి ఉన్న ఈ జ్యోతిర్లింగానికి దిన వారాలతో పనిలేకుండా జల, ఫల, పుష్ప, పంచామృతాభిషేకాలు జరుగుతాయి. అలాగే మాఘ, కార్తీక మాసాలలో ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో ఇంకా ఆంజనేయస్వామి, వినాయక మందిరాలు కూడా ఉంది. ఘృష్ణేశ్వరంలో బసచేయడానికి పెద్దగా వసతి సౌకర్యం లేదు. అందువల్ల ఔరంగాబాద్‌లో బసచేసి ఈ స్వామిని దర్శించుకోవచ్చు.

Share:

దుష్టగ్రహ బాధలు నివారించే భీమశంకరుడు.


భోళాశంకరుని లీలలు అనంతం. సర్వవ్యాపకుడైన శివుడు అనంతనామధేయుడు. ఆ దయామయుడ్ని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. భక్తితో ఏది సమర్పించినా ముక్తి ప్రసాదిస్తాడు. కైలాసవాసిగా, మహేశ్వరుడిగా, కాలరుద్రుడిగా ఇలా అనేక పేర్లు కల్గిన ఆ మహాదేవుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపుడై భక్తులను కటాక్షిస్తున్నాడు. ఆ తేజోమయుడు కొలువుదీరిన మరో ప్రసిద్ధ క్షేత్రం ‘్భమశంకరం’. మన దేశంలో ఉన్న శివక్షేత్రాలలో విశిష్టమైనదీ క్షేత్రం.

అలాగే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఆరవదిగా, ఈ క్షేత్రం పేర్గాంచింది. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ శివ సన్నిధి మహారాష్టల్రోని పూణె జిల్లాలో ఖేడ్ తాలూకాలో ఉంది. ‘్భమశంకరం’ సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉంది. కనుక భీమశంకరుడు కొలువుదీరిన ఆలయ పరిసరాలన్నీ ప్రకృతి అందాలతో భక్తుల్ని, పర్యాటకుల్ని అలరిస్తాయి. భక్తులకు కావాల్సినంత ఆధ్యాత్మికానందాన్ని, మానసికానందాన్నిస్తున్న భీమశంకరం ప్రాంతంలో భీమా నది ఆవిర్భవించింది. ఆ కారణంగా ఈ క్షేత్రానికి భీమశంకరం అని పేరొచ్చింది.
సాక్షాత్తు మహేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో కొలువుదీరిన భీమశంకరం దివ్యక్షేత్రం మహిమాన్వితమైనది. ఇక్కడున్న భీమశంకరుడి ఆలయం అతి పురాతనమైనది. అయినప్పటికీ ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు కొదువ ఉండదు. రోజూ వేలాది మంది భక్తులు ఇక్కడ భీమశంకరం జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. అతి పురాతన భీమశంకర ఆలయం కొన్ని వందల సంవత్సరాల నాటిదిగా అవగతమవుతుంది. పూర్వం రఘునాథ్ పీష్వా అనే శివభక్తుడు ఇక్కడొక నుయ్యిని తవ్వించాడు. అనంతరం పీష్వాల దీవాన్ నాడాఫడన్‌వీస్ ఇక్కడొక ఆలయాన్ని నిర్మించాడు. అలాగే పూణెకు చెందిన చిమణ్‌జీ అంతాజీనాయక్ క్రీ.శ.1437లో ఈ ఆలయ ప్రాంగణంలో సభామండపాన్ని నిర్మించాడు.

అతి పురాతన ఈ దివ్యాలయం పాతాళంలో ఉంటుంది. చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు విరబూసుకున్న కొండల మధ్య, లోయ భాగంలో ఈ మందిరం ఉంటుంది. అందువల్ల ఈ మందిరానికి వచ్చిన భక్తులు అక్కడ విధిగా నిర్మించిన మెట్ల మార్గం ద్వారా కిందికి దిగి భీమశంకరుడి ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.
పురాణగాథ: శివుడు ఈ క్షేత్రంలో కొలువుదీరి ఉండటానికి ఇక్కడ రెండు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం త్రిపురాసురుడనే రాక్షసుడు దేవతలను, మునులను, అభాగ్యులను బాధిస్తూ ఉండేవాడు. వాడి ఆగడాలు భరించలేని మునులు, దేవతలు శివుడ్ని శరణువేడగా శివుడు త్రిపురాసురుడ్ని అంతమొందించాడు. శివుడికి, త్రిపురాసురుడికి మధ్య జరిగిన యుద్ధంలో అలసిపోయిన శివుడు శరీరం నుంచి ఓ స్వేద బిందువు పైకి ఉబికి పాయలుగా మారి కొలనుగా మారింది. అక్కడనుంచి భీమానది పుట్టింది. యుద్ధంలో అలసిపోయిన పరమేశ్వరుడు ఈ సహ్రాద్రి పర్వత శ్రేణి ప్రాంతంలో సేద తీరాడట. వారి అభీష్టం మేరకు ఆ మహాదేవుడు ఇక్కడ భీమశంకరుడి నామధేయంతో జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. కుంభకర్ణుడు కర్కటలకు పుట్టిన ‘్భమ’ నామధేయుడైన రాక్షసుడు తన తండ్రి మరణానికి శ్రీరాముడు, మునులు కారణమని భావించి శ్రీహరి సమేతంగా అందర్నీ మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బ్రహ్మ గురించి తపస్సు చేసి, బ్రహ్మ అనుగ్రహంతో అపార బలాన్ని పొందాడు. ఆ వరబలంతో దేవతలను, శ్రీహరిని తన వశం చేసుకున్నాడట. అనంతరం శివభక్తుడైన కామరూపేశ్వరుడ్ని హింసించి కారాగారం పాలుచేయగా, కామరూప్వేరుడు తనను రక్షించమని శివుడ్ని వేడుకున్నాడట. దయామయుడైన శివుడు కామరూపేశ్వరుడి మొర ఆలకించి శివలింగంలోంచి ఉద్భవించి ‘్భమ’ను అంతమొందించాడట. అనంతరం దేవతలు, మునుల అభీష్టం మేరకు భీమశంకర నామధేయంతో శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ వెలిశాడట.

చారిత్రకంగానూ, పౌరాణికంగానూ మహత్తుకల ఈ పుణ్యక్షేత్రం సందర్శనం సర్వపాపాలను హరిస్తుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. ఈ క్షేత్ర మహిమ అపారమైంది. ‘శివలీలామృతం’, ‘గురుచరిత్ర’, ‘స్తోత్ర రత్నాకరం’ వంటి ధార్మిక గ్రంథాలలో భీమశంకరం మహత్తు గురించి ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే ఛత్రపతి శివాజీ, రాజారామ్ మహరాజ్ తదితర మహనీయులు ఈ క్షేత్రంలోని భీమశంకరుడ్ని దర్శించి స్వామి ఆశీస్సులు పొందినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అతి పురాతన ఈ దివ్యాలయంలో స్వామివారికి ఎదురుగా రెండు రాతి నందులుంటాయి. ఇక్కడే మరోపక్క శని దేవుడు కొలువుదీరాడు. ఇంకోపక్క శ్రీరామ మందిరం, ఆంజనేయస్వామి మందిరం, పార్వతి మాత మందిరాలున్నాయి. భీమశంకరం ప్రకృతి అందాలకు వేదిక. ఇక్కడున్న కోకణ్‌గార్ లేదా నాగ్‌ఫణ్ అనే ప్రదేశం చాలా భీతికల్గిస్తుంది. మూడువేల అడుగుల ఎత్తునగల ఈ ప్రదేశంనుంచి చూస్తే కోకణ్ ప్రదేశమంతా కనిపిస్తుంది. ఇక్కడే అతి పురాతన కమలజామాత మందిరం కూడా ఉంది. బ్రహ్మదేవుడు ఇక్కడ అమ్మవారిని కమలాలతో పూజించడం వల్ల అమ్మవారికి కమలజా మాత అని పేరొచ్చింది.

అతి పురాతన భీమశంకరం దివ్యక్షేత్రంలో కార్తీక, మాఘ మాసాలలో అత్యంత ఘనంగా పూజలు జరుగుతాయి. ఆయా పుణ్య దినాలలో భక్తులు పోటెత్తుతారు. అలాగే ఇక్కడ స్వామివారికి నిత్యాభిషేకాలు జరుగుతాయి. భీమశంకరం క్షేత్రం పట్టణ వాతావరణానికి దూరంగా ఉండడంవల్ల ఇక్కడ వసతి సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. భీమశంకరం పూణెకు 125 కిలోమీటర్లు దూరంలో ఉంది. పూణె-ముంబాయి బస్సు మార్గంలో ఉందిది. ఇక్కడ స్వామిని దర్శిస్తే దుష్టగ్రహ పీడ నివారణమవుతుందంటారు.

Share:

అష్ట ఐశ్వర్యాలను సిద్దించే లలితా త్రిపుర సుందరి ..!

త్రిపురు సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి, లలిత మరియు రాజరాజేశ్వరి) రూపాలలో ఒక మహా విధ్యలలో ఒక స్వరూపం. సాక్ష్యాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయస్సు కల పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు.
త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం.
అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో
ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది.
01. స్థూల (భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది.
బహిర్యాగంతో పూజించబడుతుంది.
02. సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది.
03. పర (మహోన్నతం): అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది. దంబవృక్షములు (కమిడి చెట్లు)వనముందు నివసించునదీ, ముని సముదాయమను కదంబవృక్షములను వికసిపంచేయు (ఆనందిప చేయు ) మేఘమాలయైనది, పర్వతముల కంటే ఎతైన నితంబు కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ, తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరిని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే …
పురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవి ఉపసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేవ్వరీ స్వరూపము అమ్మ!
పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహా త్రిపుర సుందరి దేవిని. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు ! చెరుక గడ, విల్లు, పాశాంకుసాలను ధరించిన రూపంలో ,కుడివైపున సరస్వతి దేవి, ఎడమవైపున లక్ష్మీ దేవి , సేవలు చేస్తు ఉండగా, లలితా దేవి భక్తులను అనుగ్రహిస్తుంది.
దారిద్రయ దుఖాలను తొలగించి, సకల ఐష్వర్య అభిష్టాలను అమ్మవారు సీధ్ధింప చేస్తుంది.
ఈమే శ్రీ విద్యా స్వరూపిణి .సృష్టి,స్తితి , సమ్హార స్వరూపిణి ! కుంకుమ తో నిత్య పూజ చేసె సువాసీనులకు ఈ తల్లీ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.
శ్రీచక్ర ఆరధన . కుంకుమ అర్చన ,లలితా అష్టొత్తరముతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతు సువాసీనులకి పూజ చెయ్యాలి.
శ్రీ చక్రం లో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము.
* ఇఛ్ఛా శక్తి: వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి
* జ్ఞాన శక్తి: జ్యేష్ఠాదేవి, విష్ణువు యొక్క దేవేరి
* క్రియా శక్తి: రౌద్రి, శివుడు యొక్క దేవేరి
ఇవన్నీ సాక్ష్యాత్ అంబికా దేవి యొక్క రూపాంతరాలే
లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి, స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు.
మోక్ష దాయకాలైన ఏడు క్షేత్రములలో కంచి క్షేత్రం ఒకటి. ఒకసారి వేదవేదాంగపారంగతుడు అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి , కామక్షి దేవిని పూజించాడు.అనేక సంవత్సరములు తపస్సు చేసాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు అతడికి హయగ్రీవ రూపములో ప్రత్యక్షమై ఎమి కొరిక అని అదగగా, మహర్షి ఆయ్నకు నమస్కరించి ‘పామరులైన ఈ మానవులు అందరికి మోక్షాన్ని పొందతానికి సులభమైన మార్గము ఎదైన ఉంటే, దానిని తెలియచెయ్యవల్సిందిగా ,లోక కల్యాణార్ధం విష్ణువు మూర్తిని ప్రార్థన చేసాడు.
దానికి హయగ్రీవుడు ‘మానవులకు భుక్తిని, ముక్తిని, దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి, లలితా పరాశక్తి మాత్రమే’ అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి వివరముగ తెలియచేసాడు.
అమ్మవారు భండాసురుడు అనే లోకపీడికుడను, పరమకీరతకుదను వధించే ఘట్టంలో దేవతలు అందరు అమ్మని ప్రార్థన చెయ్యగా, వారు చేసిన యాగం నుండి చిదగ్ని సంభుతిగా అమ్మ ఆవిర్భవించింది.
భండాసురుదిని వధించటం కోసమే, సమస్త లోకాలను, దేవజాతులను,ప్రకృతిని, ప్రాణకొటిని, వస్తుజాలాన్ని, మరల సృష్టించటం, సమ్రక్షించుకోవడం కోసమే అమ్మ ఆవిర్భవించింది. ఆ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరము, ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల కాంతి వలే ప్రకాసించింది.
అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికి అవధి ! అమ్మకి మించిన సౌందర్యము లేదు. భండాసురుదిని వధించే కార్యం లో , అద్భుతమైన ఆస్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు ‘కరాంగూళి నఖోత్పన్న నారయణ దశాకృతి ‘ అనే నామం ఏర్పడింది.
అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. దేవి భాగవతం, లలితోపాఖ్యానం నిత్యం పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు.

Share:

శివలింగాన్ని తెల్లని అన్నంతో నిర్మించి పూజలు చేస్తే ఎన్నోలాభాలు.


ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజల చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలు తలతూగుతాయట. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారట. అలాగే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయని, తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయమవుతాయని ఆధ్యాత్మిక పండితులు చెపుతున్నారు. అయితే, ఆయా వారానికి అనుగుణంగా పూజలు చేయాలని కోరారు.
.
ఉష్ణ సంబంధిత వ్యాధులు ఉంటే ఆదివారం చేయాలని, శీత సంబంధిత వ్యాధులు ఉంటే సోమవారం చేయాలన్నారు. అలాగే, రక్తానికి, రక్తపోటుకు సంబంధించిన వ్యాధులు ఉంటే మంగళవారం చేయాలి. బుద్ధికి, నరాలకు సంబంధించిన వ్యాధులు ఉంటే బుధవారం చేయాలి. అన్ని రకాల ఉదర సంబంధ వ్యాధులు ఉంటే గురువారం చేయాలని కోరుతున్నారు. మూత్రకోశ రోగాలు, మూత్రపిండాల సమస్య, డయాలసిస్‌, మూత్ర పిండాల్లో రాళ్లు తదితరాలు ఉంటే శనివారం రోజు సాయంత్రం చేయాలి. ఎముకల సమస్యలు, వెన్నునొప్పి, నడుంనొప్పి, అలసట, కీళ్ల నొప్పులు తదితరాలు ఉంటే శనివారం రోజు సాయంత్రం చేయాలని సూచన చేస్తున్నారు.
.
మనస్సుకు, చిత్తానికి శాంతి కలిగించేందుకు, శాంతి లభించేందుకు బుధవారం రోజు చేయాలి. మంచి జ్ఞాపకశక్తి పొందేందుకు పుణ్యక్షేత్రాల్లో దర్శనం ముక్తి పొందేందుకు శనివారం రోజు చేయండి. చాలా మంచి జరుగుతుందట. తెల్ల అన్నం, శెనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాలా వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయన్నారు.
.
తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీశనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయన్నారు. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుందని ఆధ్యాత్మిక నిపుణులు అభిప్రాయాలు తెలిపారు.


https://www.facebook.com/rb.venkatareddy
Share:

మహంకాళి అమ్మ‌కు రాళ్ళను సమర్పించే భ‌క్తులు...

ఆలయానికి వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్తాం..కొబ్బరికాయ, పసుపు, కుంకుమ ఇతర వస్తువులను తీసుకెళ్తాం కదా. కాని ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాల్సిన పని లేదు. తమ కోర్కెలు తీర్చాలంటూ భక్తులు వింత పూజలు నిర్వహిస్తారు. భక్తుల కొర్కెలు తీర్చే కొంగుబంగారంగా పిలవడుతున్న ఈ ఆలయం విజయనగరం జిల్లాలో ఉంది. జిల్లాలోని పెదమేడపల్లిలో ఉన్న 'మహంకాళి ఆలయం' పేరుగాంచింది. ఇక్కడకు భారీగానే భక్తులు తరలివస్తారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు మాత్రం వింత పూజలు నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు తమ కోర్కెలు తీర్చాలని 'రాళ్ళ'ను వేస్తుంటారు. దీని ద్వారా తమ కోర్కెలు నేరవేరుతాయని ఇక్కడ భక్తులు పేర్కొంటున్నారు. దేవతకు రాళ్ళను సమర్పించే ఆచారం ఎప్పటి నుండో వస్తోందని, రాళ్ళను గుట్టలుగా వేయడం ఇక్కడ ఆనవాయితీ అని భక్తులు తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగిస్తుండడం విశేషం.
Share:

మహిమాన్వితమైన శివదీక్ష.


* శివ దీక్షలు స్వీకరించండి... అద్భుతమైన ఫలితాలను పొందండి..
* శివ దీక్షతో మనసుకు ప్రశాంతత ...
.
మానవుడి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని సంసార బంధంలో చిక్కి ఈదలేకపోతున్నాడు. అనుక్షణం మానసిక ఆందోళనతో సతమతమవుతున్నాడు. ఎన్నో రకాల వ్యసనాలతో.. చేడు అలవాట్లు.. కుటుంబ కలహాలతో విసిగిపోతున్నాడు.. ఇలాంటి అన్ని సమస్యలను దూరం చేయాలంటే భక్తి ఒక్కటే మార్గం.. మనిషిలో మార్పు తెచ్చేందుకు మాలాధరణ చేస్తే అన్ని సమస్యలు దూరమవడంతోపాటు మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. దీనికితోడు మన సంస్కృతి, సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. మానవుడు భగవత్ దీక్ష కలిగి ఉంటే కామక్రోదాది అరిషడ్మార్గాలను జయించడంతోపాటు సన్మార్గంలో నడిపించి మోక్షం లభిస్తుంది. అందుకనే భగవంతుడిపై లీనమై ఉండేందుకు భక్తులు మాలధారణలు చేస్తుంటారు. అందులో అత్యుత్తమైనది శివదీక్ష.
.
ఈ ప్రపంచములో సృష్టిస్థితిలయములకు సకలచరాచర జీవకోటిని సంరక్షించుటకు కైలాసములో పార్వతీ పరమేశ్వరులుగా, శ్రీశైలములో భ్రమరాంబ మల్లిఖార్జునులుగా, కాశీలో విశాలాక్షి విశ్వనాధలింగేశ్వరులుగా, సోమేశ్వర, మల్లిఖార్జున, మహాకాళేశ్వర, అమరేశ్వర, వైద్యనాథేశ్వర, భీమేశ్వర, రామేశ్వర, నాగేశ్వర, విశ్వేశ్వర, త్రయంబకేశ్వర, కేదరేశ్వర, ఘృశ్వేశ్వర అను ద్వాదశ జ్యోతిర్లింగములుగా వివిధ పుణ్యక్షేత్రములలో ప్రసిద్ధి చెందినారు. ఆ జగద్రక్షకుడైన జగదీశ్వరుని ఎంత పొగిడినా తనివితీరదు. ఓం నమః శ్శివాయ అను పంచాక్షరి మంత్రమును నియమ నిష్ఠలతో పఠించిన శివకోటి భక్త జనులకు సర్వపాపములు పటాపంచలు అయి ముక్తి మోక్షఫల ప్రదంబుల నొసంగి జన్మ తరింపజేయును.
.
శివదీక్షను, నిష్ఠ నియమాలతో ఆచరించిన, దేహపీడలు అకస్మాత్ కలహములు తొలగి ఆయురారోగ్యములు, అష్ట్యైశ్వర్యములతో శుభ ప్రదముగా జీవించునట్లు ఆశీర్వదించును. దేవతలందరిలో శివుడు దయారస హృదయుడు. భక్తుల మొరలాలించి వరాలిచ్చే బోళాశంకరుడు. శివ అంటే శుభము అని అర్థము. ఇతర దేవతలవలె శివుడు అవతారము లెత్తుటకై మహా శివుడు ఎవరి గర్భమున జన్మింపలేదు. అవతారము, అవతార సమాప్తి, అన్నియు లీలలే, శివుడు నిర్మలుడు, నిర్గుణుడు, నిష్కలంకుడు, నిటాలాక్షుడు, నిరంజనుడు. అట్టి ఆదిదేవుడు శివుని ఆలంబనముగా జేసుకొని ఆచరించబడేదే శివదీక్ష జగన్మాతయైన పార్వతీదేవి కఠోరమైన శివదీక్ష చేసి, ఆ పరమశివుని అనుగ్రహము వలన నిజమైన అర్థాంగియైనది. శివుని శరీర మందు అర్థభాగము స్వీకరించుటచే పరమేశ్వరుడు కూడా అర్థనారీశ్వరుడైనాడు.
.
శ్రీరామచంద్రుడు శ్రీరామలింగేశ్వరుని, శ్రీకృష్ణుడు శివదీక్షను, అర్జునుడు పాశువత దివ్య దీక్షను స్వీకరించి తరించునట్లు చెప్పబడుచున్నది. మనకు తెలిసినంత వరకు శివదీక్ష పట్టిన వారిలో మొట్టమొదటి భక్తురాలు పార్వతీదేవి. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భక్త కన్నప్ప నుండీ, పర్వతుడు, భక్త సిరియాలుడు మొదలైనవారు శివదీక్షను పాటించినట్లు విక్రమాదిత్యుని తామ్రశాసనం వలన తెలుస్తుంది. కార్తికేయుడు కూడా శివదీక్షను పూని దేవతాసిన్యాలకు అధిపతి అయినాడు. ఇంతటి దివ్య మహిమగల శివదీక్ష ఎంతో ప్రాచీనమైనది.
.
మాఘమాసంలోని మహాశివరాత్రితో మండలకాలం అనగా 40 రోజుల్లో ముగియునట్లుగా ఆచరించుట మంచిది.
.
40 రోజులు పూర్తయి 41వ రోజున దీక్ష విరమించవలెను. మాఘమాసములోని మహాశివరాత్రితో గాని, కార్తీక మాసములోని మహాశివరాత్రితో గాని, కార్తీక మాసములోని మాస శివరాత్రితోకాని దీక్ష పూర్తి అయ్యే విధముగా ఆచరించవచ్చును.
.
మండలకాలం పూర్తి అయిన తరువాత జ్యోతిర్ముడితో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి మల్లిఖార్జున స్వామికి నమస్కరించి శ్రీశైల మహాక్షేత్రము నందు గల త్రిఫల వృక్షము క్రింద ఈ దీక్షా విరమణ చేయుట మిక్కిలి శ్రేష్ఠము. ఇది చేయలేని వారు అర్థ మండలం అనగా 20 రోజులు శివ దీక్షవహించిన 21 వ రోజులో దీక్షావిరమణ చేయవలెను. ఈ శివదీక్షను స్థానిక శివాలయములోని శివార్చకునితో కాని ఇంతకు పూర్వము శివదీక్షను స్వీకరించిన వారితోకాని మూలాధారణను చేయించుకొనవలెను.
.
ఇట్టి మహత్తరమైన శివదీక్షను నియమానుసారము ఆచరించిన వారికి భూత, ప్రేత, పిశాచ, శత్రు బాధలు, గ్రహారిష్టములు తొలగిపోవును. సర్వ సంపదలు కలిగి ఐహికాముషిక సుఖబీమమీలు పొందెదరు.
.
శంకరాచార్యుల వారు తన శివానందలూ ఓ పరమేశ్వరా ! ఈ జగత్తులో సహస్రార్థిలో దేవతలు ఉన్ననూ శాశ్వత మోక్ష ఫలమును ప్రసాదించువాడవు నీవే సుమా ! కనుక నీ పాదద్మములే నాకు శరణ్యము.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

కల్యాణ వరప్రదాత.. ‘శ్రీవిల్లిపుత్తూరు’ గోదామాత.


* ధనుర్మాసం గోదాదేవి భుజంపై దర్శనమిచ్చే రామచిలుక..!
* సదా గోదా, వటపత్ర సాయి నామస్మరణంతో మారుమ్రోగుతున్న మహిమాన్విత దివ్య క్షేత్రం...
.
ఆధ్యాత్మిక ప్రపంచంలో అతిపవిత్రమైన, విశిష్టమైన స్థానాన్ని పొందిన 'తిరుప్పావై' కావ్యాన్ని భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి విరచించి గానం చేసింది. పాండ్యదేశంలో, శ్రీ విల్లిపుత్తూరు అనే పల్లెలో, కర్కాటక రాశిలో, పూర్వఫల్గుణీ(పుబ్బ)నక్షత్రంలో కలియుగం ప్రారంభం ఐన తొంభైమూడవ సంవత్సరంలో, నరనామ సంవత్సరంలో, తులసీవనంలో ఉద్భవించిన గోదాదేవి విష్ణుచిత్తులవారికి దొరికింది. విష్ణు చిత్తులు నేటి తమిళనాడులోనిది, ఆనాటి పాండ్య ప్రభువుల ఏలుబడిలోనిది ఐన శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో జన్మించారు. ఈ గ్రామానికే ధన్వినవ్యపురం అనే పేరుకూడా ఉంది, వైష్ణవసంప్రదాయంలో. ఆ గ్రామంలో వటపత్రశాయి ఐన మహావిష్ణువు దేవాలయం ఉంది. ఆ స్వామిని వైష్ణవ సంప్రదాయంలో వడపెరుంగోయిలాన్ అని పిలుస్తారు.
.
భగవంతుడు ఎప్పుడూ భక్తుల పాలిట పక్షపాతే… వజ్ర వైడూర్యాలు, సిరిసంపదలు, హంగూ ఆర్భాటాలు ఇవేమీ భగవంతునికి అక్కర్లేదు… ఆ జగత్ పాలకుడికి కావల్సింది నిశ్చలమైన భక్తి… పరిపూర్ణమైన విశ్వాసం… అవుంటే శ్రీవైకుంఠంనుంచి కూడా తరలి వచ్చి అనుగ్రహిస్తాడు. అక్కున చేర్చుకుని సేద తీరుస్తాడు. అలా తన నిశ్చలమైన భక్తితో సాక్షాత్తు శ్రీరంగనాధుడ్నే మెప్పించిన మహాభక్తురాలు గోదాదేవి. ఆండాళ్‌గా పూజలందుకుంటున్న ఆ తల్లి ఆవిర్భవించిన పుణ్యధామమే ‘శ్రీవిల్లిపుత్తూరు’. తమిళనాడు రాష్ట్రం మధురై నగరానికి 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రం గోదాదేవి పాద స్పర్శతో, ఆమె శ్రీహరి భక్తితో పునీతమైంది.
.
శ్రీవిల్లిపుత్తూరులో ప్రసిద్ధమైన ఆలయాలలో గోదాదేవి ఆలయం ఒకటి. మహిమాన్విత ఈ దివ్యాలయ ప్రాంగణం సదా గోదా, వటపత్ర సాయి నామస్మరణంతో మారుమ్రోగుతుంది. అణువణువూ ఆధ్యాత్మికానురక్తిని పెంచే గోదాదేవి ఆలయం సొంతం… అపురూప ఈ దివ్యాలయాన్ని 7వ శతాబ్దంలో వల్లభదేవ పాండ్యన్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరంతర కాలంలో ఈ ఆలయాన్ని తిరుమల నాయకర్, చొక్కప్పనాయకర్ అనే రాజులు అభివృద్ధి చేశారు. కాలాంతరంలో ఈ ఆలయంలో అనేక మార్పులు చేర్పులూ జరిగినప్పటికీ, పురాతనత్వాన్ని చెక్కుచెదరకుండా మిగుల్చుకున్న ఆలయమిది. నిత్యం వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయ ప్రాంగణం గోదాదేవి భక్తికి ప్రభల నిదర్శనంగా దర్శనమిస్తుంది.
.
పురాణగాథ :...
పూర్వం విష్ణుచిత్తుడనే పండితుడు శ్రీహరి భక్తుడు. అతడు రోజూ శ్రీహరినే సేవిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఓసారి విష్ణుచిత్తుడు తులసీవనంలో ఉండగా, ఓ ఆడ శిశువు దొరికింది. అది శ్రీమన్నారాయణుడి కటాక్షంగా ఆ శిశువును చేరదీసి గోదాదేవి అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచాడు. ఆ శిశువు పెరిగి పెద్దదవుతూ శ్రీరంగనాధుడ్ని అమితంగా సేవించేది. శ్రీరంగనాధుడే తన ప్రత్యక్ష దైవమని, ఎప్పటికైనా ఆ స్వామిని చేరాలని ఆకాంక్షించేది. రోజూ పుష్పహారాలను చేసి ముందుగా తన మెడలో ధరించి,ఆ తర్వాత స్వామివారి కైంకర్యానికి పంపించేది. స్వామిని ఎప్పటికైనా వివాహమాడాలని తలచేది. ఎప్పుడూ స్వామి సేవలో తరిస్తూ గడిపేది. ఆమె వయస్సు పెరుగుత్నుకొద్దీ స్వామిపై భక్తి విశ్వాసాలను పెరాగాయ. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని ఆచరించేది. భక్తిని మాలగా అల్లి సువాసన భరిత పుష్పాలతో ఆ భగవానుడ్ని సేవించి ముక్తి పొందవచ్చని తలచి తిరుప్పావై ప్రబంధాన్ని రచించి ఆండాళ్‌గా ప్రసిద్ధిచెందింది. ఇందులో 30 పాశురాలున్నాయి. ఆ పాశురాలను భక్తితో గానామృతం చేసి, తన భక్తిప్రపత్తులను చాటుకుని, స్వామిని వివాహమాడి చివరికి శ్రీరంగనాధునిలోనే ఐక్యమైంది. గోదాదేవి ఆవిర్భవించిన స్థలంగా చెప్పబడ్తున్న ఈ ప్రాంగణంలో నిర్మించిన దివ్యాలయమే శ్రీవిల్లిపుత్తూరు శ్రీ గోదాదేవి ఆలయం.
.
మహిమాన్వితమైన ఈ దివ్యాలయ ప్రాంగణంలో గోదాదేవి దొరికిన తులసీవనం ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ తులసీవనంలోనే అమ్మవారికి గుర్తుగా ఓ చిన్న మందిరాన్ని నిర్మించి పూజిస్తున్నారు. గోదాదేవి అమ్మవారి ప్రధానాలయ ప్రాంగణం విశాలమైనది. ఈ ప్రాంగణం లోపలి ప్రాకారంలో ఎడమవైపు లక్ష్మీనారాయణ పెరుమాళ్ మందిరం ఉంది. దీనికి సమీపంలో ఆండాళ్ పూజా మంటపం ఉంది. ప్రధానాలయ లోపల ప్రాకారం కేరళ సంప్రదాయ రీతిలో ఉంది. అమ్మవారి ఆలయానికి ముందు మణిగన్, సుముఖన్, సేనై ఇముదల్వర్‌ల చిన్ని చిన్ని మందిరాలున్నాయి. గర్భాలయం వెలుపల తులసివనంలో బావి ఉంది. అమ్మవారు రోజూ ఈ బావిలోనే తన ముఖారవిందాన్ని చూచుకొనేదంటారు. ఇదే ప్రాంగణంలో ఊంజల్ మంటపం ఉంది. అత్యంత నయన శోభితంగా ఉన్న ఈ ప్రాంగణం చూపరులను అమితంగా ఆకర్షిస్తుంది. గర్భాలయంలో రంగమన్నార్ దర్శనమిస్తారు. స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తర భాగంలో గరుత్మంతుడు కొలువుదీరి ఉన్నారు.
.
ఆలయ బయట ప్రాకారంలో గజలక్ష్మి, ఆంజనేయ మందిరాలున్నాయి. ఈ ప్రాకారంలోని అద్భుత శిల్పాలు భక్తులకు దర్శనమిస్తాయి. అఘోర వీరభద్ర, సరస్వతి, శ్రీరాముడు, లక్ష్మణుడు, వేణుగోపాలస్వామి, విశ్వకర్మ, రంభ, ఊర్వశి, జలంధర్, మోహినీ అవతారం, మన్మధుడు, రతి, ఊర్థ్వవీరభద్ర తదితర అద్భుత శిల్పరాజాలు చూపరుల దృష్టిని మరలనీయవు. అలనాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా ఇవి దర్శనమిస్తాయి. అమ్మవారి గర్భాలయం బయట ప్రాకారంలో తిరుప్పావై పాశురాలకు చెందిన మనోహరమైన చిత్రాలున్నాయి. ఇవన్నీ భక్తులలో భక్త్భివాన్ని ప్రోదిచేస్తాయి. శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి అమ్మవారిని దర్శించుకునే కన్యలకు వివాహయోగం తప్పక కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే భక్తులకు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి సాక్షాత్కారం కలుగుతుంది. ఇక్కడ అమ్మవారిని, స్వామివార్లను తులసి దళాలతో, పుష్పహారాలతోనూ సేవిస్తే ఐశ్వర్యవృద్ధి కలిగి, కోర్కెలు సిద్ధిస్తాయంటారు. అలాగే వివాహం కాని కన్యలు ఇక్కడ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే, వెంటనే వివాహం జరిగి, సౌభాగ్యసిద్ధి కలుగుతుందంటారు. మహిమాన్విత ఈ దివ్యాలయంలో ధనుర్మాసం చివరిరోజున గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తారు. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న శ్రీవిల్లిపుత్తూరులో యాత్రికులకు బసచేయడానికి అనేక హోటళ్ళున్నాయి. భోజనానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మహిమాన్విత ఈ క్షేత్రంలో ఒక రోజు నిద్ర చేస్తే పుణ్య ఫలాలు సిద్ధిస్తాయంటారు.
.
ప్రేమ, అనురాగం, ఆసక్తి, అభిలాష, ఆకాంక్ష... ఇలా ఎన్నో విషయాలు బంధానికి కారణాలవుతున్నాయి. ఆకాశంలో ఎన్నో పక్షులు విహరిస్తుంటాయి. చెట్లమీద వాలి సేదదీరుతుంటాయి. కానీ, రామచిలుకలను చూడగానే మనిషికి దాన్ని పట్టుకోవాలనీ, ఆ తరవాత వాటిని పంజరంలో బంధించి, ఇంట్లో పెట్టుకోవాలనీ అనిపిస్తుంది. దీనికి కారణం రామచిలుక పలుకులు మధురంగా ఉండి, ఆకర్షించడమే. ఈ గుణం కారణంగానే రామచిలుకలు పంజరాల్లో బంధీలవుతున్నాయి.
.
విల్లిపుత్తూరులోని అమ్మవారి ఆలయాన్ని దర్శించినట్టయితే ఈ రామచిలుక తయారీ విషయంలో వాళ్లు ఎంతటి శ్రద్ధ తీసుకుంటున్నది తెలుస్తుంది. సగ్గుబియ్యం ఆకులతో చిలుకను తయారుచేసి దానిమ్మ మొగ్గను దాని ముక్కుగా అమర్చుతారు. నిజంగా రామచిలుకే అమ్మవారి భుజంపై వాలిందా ? అన్నంత సహజంగా అది కనిపిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం ఇలా చిలుకను తయారు చేసి అమ్మవారి ఉత్సవమూర్తి భుజంపై అలంకరిస్తూ ఉంటారు. ఇలా కొలువుదీరిన అమ్మవారిని పూజించడం వలన ధర్మబద్ధమైన కోరికలు తప్పని సరిగా నెరవేరతాయని చెప్పబడుతోంది.


https://www.facebook.com/rb.venkatareddy
Share:

శివాలయంలో పరమేశ్వరుని దర్శిస్తే ముక్కోటి దేవుళ్ళని దర్శించినట్టే.

నమః పార్వతి పతయే హర హర
హర హర శంభో మహాదేవ
హర హర మహాదేవ
హర హర హర హర మహాదేవ
శివ శివ శివ శివ సదాశివ
మహాదేవ సదాశివ
సదాశివ మహాదేవ
.
సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందికే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది. 5 ముఖాల్ని 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు. శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది. కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది.
.
పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది. అలా శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమంవైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని సద్యోజాత శివలింగం అని అంటారు. అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని స్మరించుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం. శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటుంటి శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది. అంటే చీకటిలో ఉంచటం. అది మనల్ని మాయ చేత కప్పి బడేస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది. ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాము. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం. సద్యోజాత ముఖం పూజించ తగినదే. ఏ మాత్రం అనుమానం లేదు. మనల్ని రక్షించినా, శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడేగా.
.
తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు మీద అధిష్ఠానం కలిగి ఉంటాడు. మనకు ప్రతీ శివాలయాల్లోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి. శివాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి. ముఖాలు మనకు 5 ఫలితాలని కలుగజేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము యివ్వబడతాయి. అన్ని ముఖాలు పూజనీయమైనవే. అన్ని ముఖాల్ని మనం పూజించి తీరాల్సిందే. శివలింగం దక్షిణంవైపు చూస్తూ ఉంటే అటువంటి ముఖం దక్షిణామూర్తి స్వరూపం. మనకు శివాలయంలో దక్షిణంని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉండి తీరాలి. అసలు దక్షిణామూర్తి విగ్రహం లేకుండా శివాలయాలు కట్టకూడదు.
.
శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువుపట్ల భయం పోగొట్టేది, మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే. మీరు జాగ్రత్తగా గమనిస్తే చిన్న పిల్లలకు చదువు దగ్గరనుండి, సంపద దగ్గరనుండి, పెద్దలకు మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద, విద్యలేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షానికి అధిష్ఠానం అయి ఉంటాడు. ప్రతిరోజూ ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే మోక్షము కరతళామలకము. వారి అంత్యమునందు సాక్షాత్తు ఈశ్వరుడే గుర్తుపెట్టుకుని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ధ్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.
.
ఉత్తరం వైపు చూసే ముఖాన్ని "వామదేవ'' ముఖం అని అంటారు. ఇప్పటిదాకా 4 దిక్కుల్ని చూస్తున్న, 4 దిక్కులా గురించి తెలుసుకోగలిగాం. ఇక చివరి ముఖం శివలింగంపైన (అంటే ఆకాశంవైపు చూస్తూ ఉండే ముఖం)ఉండే ముఖం. ఆ ముఖాన్ని "ఈశాన ముఖం'' అంటారు. మనం లిగంపైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఈశాన ముఖ దర్శనం మనం మిగిలిన నాలుగు ముఖాల్ని దర్శించిన తరువాతనే దర్శించాలి. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చుని, దక్షిణంవైపు చూస్తూ ఉంటుంది. ఉత్తరం వైపు చూసి "వాసుదేవ ముఖం'' నీటి మీద అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ వాసుదేవ ముఖమే మనకు సమస్త మంగళము ఇచ్చే ముఖం.
.
వాసుదేవ ముఖం అంటే ఏమిటి అనేది మనకు శివపురాణంలో చెప్పబడింది. యదార్తమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే విష్ణువు, శివుడు ఒకరే ... రెండు లేనే లేవు .... శివపురాణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికైనా సంశయం ఉంటే ఒకటి గమనించండి. శివపురాణంని రాసినది వేదవ్యాసుడు. వ్యాసుడే విష్ణువు ... విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ విధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే ... రెండు కాదు. చాలామంది వేరుగా చూస్తూ పొరబడుతున్నారు. కృష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను. ఈ వాసుదేవ ముఖాన్ని ఓం వాసుదేవాయ నమః అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు.
.
అంతేకాక ఈ వాసుదేవ ముఖాన్ని ఓం వాసుదేవాయ నాహం అని అంటే మనకు మూడు ఫలితాలని కూడా ఇస్తుంది. అవి ఒకటి మీ దగ్గర ఏదైతే ఉందొ అది మీ చేయి జారిపోకుండా మీతోనే ఉంచుతాడు. ఉదాహరణకు మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి లేదా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. రెండు ... మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే ఇస్తారు. ఉదాహరణకు ... ఉన్న కోటిని ధర్మబద్ధంగా రెండు కోట్లు చేస్తారు. (ఇది ఉదాహరణ మాత్రమే మీకు ఈజీగా అర్థమవ్వాలని) మూడు ... మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఉదాహరణకు ... ఇప్పుడు తీపి పదార్థాలను కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్థితిలో (షుగర్ ఉందనుకోండి) ఉంటే, అప్పుడు ఉన్న దాన్ని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండా కాపాడతాడు.
.
తురువాత ఈశాన ముఖము. శివాలయంలో లింగ దర్శనం అయ్యాక ఒకసారి పైకి చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఆ ఈశాన ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్ఠానం అయి ఉంటుంది. శివాలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకుని ముందుకు సాగాలి.
.
శివాలయంలో పురుషులకి ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేశించబడింది. పురుషులు కేవలం పంచె మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్వ్యంని నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణాలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వారిపట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ముందుగా చెప్పినట్లు పదఘట్టన వినకూడదు జాగ్రత్త. మీరు శివాలయంలో ఎట్టి పరిస్థితులలోనూ విభూధిని కాని, బిల్వపత్రాలని కాని, కుంకుమను కాని, ప్రసాదాన్ని కాని ఎట్టి పరిస్థితులలో నందీశ్వరుడి మీద పెట్టకూడదు. సాధారణంగా చాలామంది నందిమీద విభూధిని, బిల్వఆకులను వేస్తూ ఉంటారు. అది మహాపాపంగా పరిగణించబడింది.

Share:

శ్రీగురు యోగేంద్ర శిలనాథ్.


ఇప్పటికీ ఆయన వాడిన చెక్క పాదరక్షలు, ఆయన పవళించిన పరుపు మనకు కనబడతాయి. దాదాపు వందేళ్లు దాటినా ఆ ప్రదేశం, అక్కడి గుహలు పరిస్థితి నేటికీ అలానే ఉన్నాయి.
యోగేంద్రబాబా మందిరానికి వెళ్లిన వారు శాంతి, ఆధ్యాత్మిక భావాలకులోనవుతారు. ఎవరైతే యోగేంద్ర శిలనాథుని భక్తితో పూజిస్తారో... వారి జీవితం సుఖసంతోషాలతో నిండుతుంది. అంతేకాదు, విజయం వారిని వరిస్తుంది, అన్ని అడ్డంకులు తొలగి జీవితం సాఫీగా సాగిపోతుంది.
ఈ ప్రాంతానికి వున్న పవిత్రత, ఆధ్యాత్మికతలంటే బాబాకు ఎంతో ఇష్టమని చెపుతారు భక్తులు. ఒకవేళ ఎవరైనా ఈ ప్రదేశంలోని ఆధ్యాత్మికతకు భంగం కలిగించాలని చూస్తే... వారు బాబా ఆగ్రహానికి గురికాక తప్పదు. మల్హార్ ధునిగా పిలిచే వెలుగు వద్ద, సమాధి వద్ద ఆయన శిష్య గణం వుంటారు.
వన్య మృగాల పట్ల బాబా అమితమైన ప్రేమను కలిగి ఉండేవారు. బాబా ధుని సమీపంలో తపస్సు చేస్తున్నప్పుడు అడవిలోని పలు క్రూర మృగాలు ఆయన చుట్టూ
కూర్చుని ఉండేవట. ప్రత్యేకించి ఓ పులి ఆయనను వెన్నంటి ఉండేది. బాబా ఆ పులికి ప్రత్యేకమైన బోనును కూడా ఏర్పాటు చేశారు.
ప్రజల శ్రేయస్సు కోసం బాబా ఎన్నో అద్భుతాలను చేసేవారు. అందుకే ఆయన చరిత్ర అంతా అద్భుతాలమయంగా ఉంటుంది. ప్రతి గురువారం బాబా ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. 1901 నుంచి 1921 వరకూ బాబా ఇక్కడ నివాసమున్నారు. ఆ తర్వాత ఆయనకు రిషికేష్ నుంచి పిలుపు వచ్చిందనీ, తదనుగుణంగా 1977 సంవత్సరంలో చైత్ర కృష్ణ గురువారం 14న ఆయన అవనిని వదిలి అతీత శక్తిని కలిసేందుకు వెళ్లారు.
Share:

శ్రీ రాఘవేంద్రస్వామి.


ఒకప్పుడు ‘మంచాల’ గ్రామంగా ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ రాఘవేంద్రస్వామివారు బృందావన ప్రవేశం చేశారు. ఆ ప్రదేశమే మంత్రాలయం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్న ఈ మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారి లీలా విశేషాలతో పునీతమైంది. శ్రీ రాఘవేంద్రస్వామి జన్మవృత్తాంతానికి సంబంధించి ఓ పురాణగాథ ఒకటి ఉంది. శంఖు కర్ణుడనే పరిచారకుడు తర్వాత జన్మలో ప్రహ్లాదుడిగా జన్మించాడు.
తర్వాత జన్మలో వ్యాసరాయలుగా జన్మించి సన్యాశాస్రమాన్ని స్వీకరించి తన 93వ ఏట ‘హంపి’ క్షేత్రంలో సమాధి పొందాడు.
శంఖుకర్ణుడు మూడవ జన్మగా కాంచీపురం సమీపంలోగల భువనగిరి గ్రామంలో నివసిస్తున్న బ్రాహ్మణ దంపతులైన తిమ్మనభట్టు, గోపమ్మ దంపతులకు మూడవ సంతానంగా 1595లో మన్మధ నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమినాడు జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి వేంకటనాధుడని నామకరణం చేశారు. అతనే మన రాఘవేంద్రస్వామి. వెంకటనాధుడు చిన్నతనంలోనే శబ్దమంజరి వల్లించాడు. అష్టాదశ పురాణాలలోని విశేషార్చనలను అధ్యయనం చేశాడు. అనంతరం ధర్మప్రబోధానికి నడుంకట్టి తంజావూరులో తన గురువు సుదీంద్ర తీర్థులవద్ద 1623లో వేంకటనాధుడు సన్యాసం స్వీకరించాడు. గురువు ఆయనకు ‘వ్రణమంత్రం’ బోధించాడు. మూల రాములవారు స్వప్నంలో ఆదేశించిన విధంగా ‘శ్రీ రాఘవేంద్ర తీర్థ’ అని గురువు ఆయనకు నామకరణం చేశారు.
సన్యాసం స్వీకరించిన శ్రీ రాఘవేంద్రస్వామి లోక కళ్యాణానికి కృషిచేసి 1671 ఆగస్టులో ప్రహ్లాదుడు యజ్ఞం చేసిన తుంగభద్ర నదీ తీరంలో బృందావన ప్రవేశం చేశారు. ఒకప్పుడు ‘మంచాల’ గ్రామదేవతగా మంచాలమ్మవారు ఉండేవారు.
పూర్వం జమదగ్నిమహర్షి భార్య రేణుకాదేవి, మంచాల గ్రామంలో మంచాలమ్మగా వెలిశారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. గురువుకు సిసలైన నిర్వచనంగా నిలిచిన శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయం సదా భక్తజన సందోహంతో దివ్యమైన లోకాన్ని తలపిస్తుంది. శ్రీరాఘవేంద్రస్వామి వారి బృందావనమే ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంది. ప్రాపంచిక విషయాలను సైతం పటాపంచలు చేసే ఈ బృందావన దర్శనంవల్ల సర్వదా శుభం జరుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
శ్రీ రాఘవేంద్రస్వామికి ఎదురుగా ఓ ఆలయంలో ఆంజనేయస్వామివారు కొలువయ్యారు. శ్రీరామభక్తుడైన ఆ స్వామి ఇక్కడ కొలువై ఉండడంవల్ల శ్రీరాఘవేంద్రస్వామివారి బృందావన క్షేత్రం మరింత మహిమాన్వితమైంది. శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంగా, విరాజిల్లుతున్న మఠానికి ముందు కుడివైపుభాగంలో మంచాలమ్మవారు ఆశీనులయ్యారు. లోపల ఆలయంలో పూర్వ మఠాధిపతుల సమాధులు (బృందావనాలు) కనిపిస్తాయి. మరోపక్క నాగేంద్రస్వామి, ముడుపుల చెట్టు దర్శనమిచ్చి పునీతుల్ని చేస్తుంది.

Share:

త్రికాలజ్ఞాని మహిమాన్విత ఆదోని తిక్క లక్ష్మమ్మ.

తెలియని వారికి పిచ్చిది. తెలిసిన వారికి అవ ధూత. భక్తుకు క్పవల్లి, ఆర్తులకు వరదాయిని. జిజ్ఞాసువుకు మహిమ పుట్ట, సిద్ధురాలు తిక్క లక్ష్మమ్మ.
.
కర్నూలు జిల్లా (ఆదవాని) ఆదోని పట్టణానికి ఏడు మైళ్ళ దూరంలోని మూసాను పల్లెకు చెందిన మాదిగ మంగమ్మ, బండెప్ప దంపతులకు జన్మిం చింది లక్ష్మమ్మ. ఆ పుణ్యదంపతు ఎవరేపని చెప్పినా ప్రతిఫం ఆశించక చేసిపెట్టే కర్మయోగు. కూలినాలితో, కువృత్తితో వచ్చే ఆదాయంతో తృప్తిగా బ్రతకడం వారికి దేవుడిచ్చిన వరం. ముగ్గురు కొడుకు తరువాత కలిగిన ముగ్గురు ఆడబిడ్డల్లో 1815లో పుట్టిన తొలిబిడ్డ లక్ష్మమ్మ.
.
బండెప్ప చేతులు కాయకష్టం చేస్తున్నా, మనస్సు, ఆత్మ అనాత్మ విచారంలో లీనమయ్యేది. నాలుక తత్వాలు పాడేది. తండ్రి పాడే తత్వాలు, కోలాట పాటు విని లక్ష్మమ్మ భ్రమర కీటకమైనది.
.
అన్నతో చెల్లెళ్ళతో ఆటపాటు, ఇరుగు పొరుగుతో స్నేహం మాని ఏకాంతంలో కూని రాగాలు తీస్తూ, తనలో తాను గొణుక్కుంటూ తిండి తీర్థా పట్టింపు లేక ఆటపాట పట్ల ఆసక్తి లేని కూతురు విచిత్రమైన వాకం తల్లిదండ్రుకు దిగులైంది.
.
పెళ్ళి చేస్తే బాగౌతుందని పెద్దంటే శిరుగుప్పి గ్రామంలో తగిన సంబంధం చూసి పెళ్ళి చేసి బండెప్ప దంపతు సంతోషించారు. లక్ష్మమ్మకు ఈ పెళ్ళి బలవంతపు మాఘస్నానమైనది. ఆమెకు పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ సమానమే అయినవి. ఆమెకు భర్త, అత్తమాము, తన సంసారం అనే సోయి లేదు సరికదా ఎవరేమి అడిగినా సమాధానం చెప్పకుండా ఒక మూన గంట తరబడి కూర్చుని తనలో తాను గొణిగేది.
.
ఇంటి కోడలి తీరు సరిగా లేక దిగులు చెందిన అత్తమాము ఇరుగుపొరుగు సహాతో రాచ వైద్యును, భూత వైద్యును సంప్రదించారు. వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆమె వెఱ్ఱిచేతకు విసిగి అత్తమాము, భర్త తిట్టినా కొట్టినా లక్ష్మమ్మ మారు మాట్లాడేది కాదు. ఓర్పుతో భరించేది. ఎదురు తిరిగి ఏమీ అనేది కాదు. అన్నింటికీ మౌనమే మంత్రమైంది. ఆకలి దప్పు విషయంలోను అంతే. పెడితే తినేది, లేకుంటే లేదు.
.
విసిగిపోయిన భర్త ఇటువంటి భార్యతో కాపురం చేయనని లక్ష్మమ్మను విడిచిపెట్టాడు. బండెప్పకు ఈ వార్త తెలిసి పరుగెత్తుకు వచ్చి బిడ్డ సంసారం నిలుప ప్రయత్నించాడు కాని ఫలించలేదు. లక్ష్మమ్మకు భర్తతో సంబంధం పోయినది. ఆమె సాధనకు పునాది ఏర్పడినది. ఆమె మెట్టిన ఊరు, పుట్టిన ఊరు రెండూ విడచి ఆదవాని చేరింది.
.
ఆదవాని చేరేనాటికి లక్ష్మమ్మ వయసు 20 ఏండ్లు. ఆదోని పట్టణం ఆమెకు కొత్త. అక్కడ ఆమెను అడిగే వారు, ఆదరించే వారు ఎవరూ లేరు. కనుక సందు గొందుల్లో, మురికి క్వాల్లో, చెత్త కుప్పల్లో, పాడు బావుల్లో ఏదో వెతుకుతున్నట్లు కూనిరాగాలు తీస్తూ, యిష్టం వచ్చినట్లు మెసుతూ నిద్రాహారాలు, ఎండవాను గణించక, దేహాభిమానం వదిలి తిరుగుతుండేది. దయగల తలులు పిలిచి ఇంత పెడితే తినేది. చెత్త కుప్పల్లోని క్రిమికీటకాలు ఆమెను బాధిస్తున్నా ఆమె వాటిని తొగించేది కాదు.
.
ఈ విధంగా అవధూత లక్ష్మమ్మ పుణికి పుచ్చుకున్న లక్ష్మమ్మకు ఒకనాడొక సత్పురుషుడు తారసిల్లి ఆమెను చెట్టు నీడన కూర్చోబెట్టి, హస్తమస్తక యోగం చేసి, చెవిలో ఏమో చెప్పినాడట. వెంటనే ఆమెకు సమాధి స్థితి అబ్బినది. ఇన్నేళ్ళ నుండి వెదకే సద్వస్తువేదో లక్ష్మమ్మకు చిక్కింది. లక్ష్మమ్మ రోజు తరబడి, గంట తరబడి సమాధి స్థితిలో ఉండేది. సమాధి నుండి లేచి పొగాకు కాడలో ఏదో నముతూ వీధువెంట తిరుగుతుండేది.
.
కసవు తొట్ల వద్ద కూర్చుండటం, పరుండటం వ్ల ఆమెకు తొట్టి లక్ష్మమ్మ అని, తిక్కగా మాట్లాడడం వల్ల తిక్క లక్ష్మమ్మ అని ఆదోని వాసు పేరు పెట్టారు. తెలిసిన వారు ఆమెను అవధూత, సిద్ధురాలు అన్నారు. ఆమెకు అన్నమో పండ్లో ఇచ్చి కొందరు సేవించేవారు. ఆమెను అభిమానించి కొందరు భక్తి ప్రేము ప్రకటించేవారు.
.
లక్ష్మమ్మ మహాత్మురానే ఖ్యాతి ఆదోని పట్టణ పొలిమేరు దాటి చుట్టు పక్క జిల్లాకు ప్రాకడంతో, జను ఆమె దర్శనానికి తండోపతండాలుగా రాసాగారు. త్రికాలజ్ఞాని, నిగ్రహానుగ్రహ సమర్థు రాలైన క్ష్మమ్మ భవిష్యత్తు గురించి గూఢోక్తు, మర్మోక్తు పలికేది. దూరదృష్టి, దూరశ్రవణము, పరచిత్తజ్ఞానము, భవిష్యత్‌ జ్ఞానము వంటి శక్తు కలిగిన ఆమె ఆర్తు జిజ్ఞాసువు కొరకు బిగ్గరగా పలికే గూఢోక్తు, మర్మోక్తు ఇతరుకు అర్థమయ్యేవి కావు. ఆమె వాక్కుల్లో సంబంధీకుకు మాత్రము సమాధానాు దొరికేవి.
.
అనావృష్టి సంభవించినపుడు రైతు అమ్మను అంకరించి వైభవంగా ఊరేగింపు జరిపితే వర్షాలుకురిసేవి. అందరి అభిమానము, భక్తిని చూరగొన్న లక్ష్మమ్మ శ్రీముఖ వైశాఖ బహుళ సప్తమి మంగళ వారం1933, మే 16 ఉదయం 5`6 గంట మధ్య తనువు చాలించారు. అమ్మ పార్థివ శరీరాన్ని అలంకరించి మేళతాళాతో ఊరేగించి సమాధి చేసారు. తరువాతి కాలాన అక్కడ నిర్మితమైన మఠంలో ఏటేటా ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List