ఇప్పటికీ ఆయన వాడిన చెక్క పాదరక్షలు, ఆయన పవళించిన పరుపు మనకు కనబడతాయి. దాదాపు వందేళ్లు దాటినా ఆ ప్రదేశం, అక్కడి గుహలు పరిస్థితి నేటికీ అలానే ఉన్నాయి.
యోగేంద్రబాబా మందిరానికి వెళ్లిన వారు శాంతి, ఆధ్యాత్మిక భావాలకులోనవుతారు. ఎవరైతే యోగేంద్ర శిలనాథుని భక్తితో పూజిస్తారో... వారి జీవితం సుఖసంతోషాలతో నిండుతుంది. అంతేకాదు, విజయం వారిని వరిస్తుంది, అన్ని అడ్డంకులు తొలగి జీవితం సాఫీగా సాగిపోతుంది.
ఈ ప్రాంతానికి వున్న పవిత్రత, ఆధ్యాత్మికతలంటే బాబాకు ఎంతో ఇష్టమని చెపుతారు భక్తులు. ఒకవేళ ఎవరైనా ఈ ప్రదేశంలోని ఆధ్యాత్మికతకు భంగం కలిగించాలని చూస్తే... వారు బాబా ఆగ్రహానికి గురికాక తప్పదు. మల్హార్ ధునిగా పిలిచే వెలుగు వద్ద, సమాధి వద్ద ఆయన శిష్య గణం వుంటారు.
వన్య మృగాల పట్ల బాబా అమితమైన ప్రేమను కలిగి ఉండేవారు. బాబా ధుని సమీపంలో తపస్సు చేస్తున్నప్పుడు అడవిలోని పలు క్రూర మృగాలు ఆయన చుట్టూ
కూర్చుని ఉండేవట. ప్రత్యేకించి ఓ పులి ఆయనను వెన్నంటి ఉండేది. బాబా ఆ పులికి ప్రత్యేకమైన బోనును కూడా ఏర్పాటు చేశారు.
ప్రజల శ్రేయస్సు కోసం బాబా ఎన్నో అద్భుతాలను చేసేవారు. అందుకే ఆయన చరిత్ర అంతా అద్భుతాలమయంగా ఉంటుంది. ప్రతి గురువారం బాబా ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. 1901 నుంచి 1921 వరకూ బాబా ఇక్కడ నివాసమున్నారు. ఆ తర్వాత ఆయనకు రిషికేష్ నుంచి పిలుపు వచ్చిందనీ, తదనుగుణంగా 1977 సంవత్సరంలో చైత్ర కృష్ణ గురువారం 14న ఆయన అవనిని వదిలి అతీత శక్తిని కలిసేందుకు వెళ్లారు.
No comments:
Post a Comment