இ మునులచే ప్రతి నిత్యం పూజలు అందుకుంటున్న పరమశివుడు..
இ సర్వపాపములు హరించి అష్టైశ్వర్యములు ప్రసాదించే గవిమల్లేశ్వరడు..
இ ప్రపంచానికి తెలియని వెయ్యి పడగల గుహ..
இ సర్పదోషాలు తొలగించి మృత్యుంజేయునిగా చేసే శ్రీ గవిమల్లేశ్వరస్వామి..
இ నల్లమల అభయారణ్యంలో అద్భుత గుహలు..
.
Sri Gavi Malleswaraswamy Temple, Mydukur Mandal, Cuddapah District - AP

ఈ విశ్వం.. ఓ రహస్యాల పుట్టుక. అందులో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్న సంగతి ఎంతమందికి తెలుసు!! ఆకాశంలో చందమామ మినుమినుకుమనే తారలతో విశ్వం ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే అవేకాదు.. ఈ భూమండలంలో కొన్ని వింతైన నిజాలు కూడా ఉన్నాయండోయ్.. ఈ బ్రహ్మదేవుడి సృష్టిలో ఎన్ని చిత్రాలో.. ఇంకా ఎన్నెన్ని వింతలు.. సృష్టిలో ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు.. మనిషి ఊహకందని ఎన్నో అద్భుతాలు.. మనిషి మేధస్సుకు కూడా అందని వింతలు, విశేషాలు.. నిత్య పరిశోధనలలో వెలువడుతున్న నూతన సంగతులు.. యివి మన సృష్టి అద్భుతాలు..
.
ఈ విశ్వమంతా ఓ అద్భుతమైన, విచిత్రమైన సృష్టి. అందులో ఎన్నో వింతలు, విశేషాలు మనకు తెలిసినవి, తెలియనివి ఉన్నాయి. ఈ క్రమంలో సృష్టిలో ఉన్న ఒక్కో రహస్యాన్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా ఇంకా మనకు తెలియనివి చాలానే ఉన్నాయి. అయితే గుహల విషయానికి వస్తే అందులోనూ మనకు లెక్కకు మించిన విచిత్రాలు ఎల్లప్పుడూ దర్శనమిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి గవిమల్లేశ్వరస్వామి ఆలయం. అవును, గుహే. ఇంతకీ అందులో ఏం విషయం ఉందీ అంటారా..? అదే తెలుసుకుందాం రండి..!
.
కడప జిల్లాలోని నల్లమల అభయారణ్యంలో మనకు, ప్రపంచానికి తెలియని గుహలు అనేకం కలవు. చుట్టూ కొండలు ఎత్తైన ప్రదేశం లో ఈ గుహలు కలవు. సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. ప్రకృతి సహజంగా ఏర్పడిన ఈ గుహలో రాతి బండలు పడగల రూపంలో ఉండుట వలన ఈ గుహను వెయ్యి పడగల గుహగా అభివర్ణిస్తారు. ఈ గుహలో స్వయంభువుగా వెలసిన మల్లేశ్వరస్వామి శివలింగంనకు మునులచే నిత్యం పూజలు జరుగుతున్నవని ఈ ప్రాంతవాసుల విశ్వాసం. ఈ గుహ లోపల మల్లేశ్వరస్వామి శివలింగంతో పాటు రాజరాజేశ్వరిదేవి, కనకదుర్గాదేవి, అన్నపూర్ణాదేవి మరియు కాళభైరవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇరుకుగా ఉన్న ఈ గుహలోనికి భక్తులు వెళ్ళేటప్పుడు పడగల కిందుగా తల వంచుకుని వెళ్ళి స్వామి వారిని దర్శించి పూజించుట వలన సర్పదోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. మృత్యుంజయ గుహగా పేరు పొందిన ఈ గుహ లోని శివలింగంపై వర్షపు నీరు, చంద్ర, సూర్య కిరణములు ప్రసరించును. ఈ గుహలోని స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు సర్వపాపములు హరించి అష్టైశ్వర్యములు పొందుదురని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఇక్కడికి దగ్గరలో 8రకాల గుండాలు ఉన్నవి అవి ఇంద్ర, సూర్య, వ్యాస, వాల్మీకి, విష్ణు, గణేష, పుత్ర, శివతీర్ధంములుగా అక్కడ వారు వివరించారు. ఈ గుహ లోపలి భాగం అంతా చీకటిమయంగా ఉండి దారి ఉన్నట్లు కనపడదు. అక్కడ వందల సంఖ్యలో మనకు గుహలు కన్పిస్తాయి.. శ్రీ గవిమల్లేశ్వరస్వామి ఆలయం యొక్క ప్రధాన గుహ ముఖద్వారం చిన్నదిగా ఉన్నప్పటికీ లోపలికి వెళ్లితే.. చాలా పెద్దవిగా కన్పిస్తుంది. ఒక్క మనిషి నిలబడి నడిచినంత రంధ్రంతో మనకు కనిపిస్తుంది. గుహలోనికి వెళ్లేకొద్ది మసకచీకటిగా ఉంటుంది దాదాపు 100 అడుగులు వరకు గుహలోనికి వెళ్ళగలము. ఈ గుహలోపల మరో 10 గుహలదాక కలవు ఇందులో ప్రధానమైన గవిమల్లేశ్వర గుహలో పరమేశ్వరు శివలింగంపై నీటి బిందువు పడుతుఉంటాయి. గుహలో కొలువైవున్న ఈశ్వరుని గవి మల్వేశ్వరుడిగా నల్లమల చుట్టుపక్కల గ్రామాల ప్రజలచే కొలువబడుతున్నాడు. ఈ మహిమాన్వితమైన శ్రీ గవిమల్లేశ్వరస్వామి ఆలయాన్ని చూడడానికి మేము వంకలు, వాగులు, చెరువులు, దట్టమైన అడవులు దాటుకోని చాల కష్టం మీద గుహలను చూడడం జరిగింది. కాని ప్రధానమైన గవిమల్లేశ్వరస్వామి గుహ నిండ నీరు నిండి వుండడంతో లోనికి పోవడాని సహసం చేయలేక వేనుతిరిగి వచ్చాము.
.
కడప జిల్లా, మైదుకూరు నుండి జీవీసత్రం కు 8 కిలోమీటర్లు. జీవీసత్రం నుండి యర్రబల్లె గంగాయపల్లె మీదుగా జొన్నచెరువు నుండి 5 నుండి 8 కిలోమీటర్లు వాగులు, వంకలు, చెరువులు, దట్టమైన అడవులు దాటుతూ వెళ్లితే గవిమల్లేశ్వరస్వామి ఆలయాన్ని, ఆగుహలు చూడవచ్చు.
.
సేకరణ…
రచన...
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి
భారతీయ సనాతన హిందూ ధర్మ సంరక్షణ సమితి
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy

గత రెండు నెలల నుండి గవి మల్లయ్య సమాచారం కోసం అనేక విధాల ప్రయత్నించారు మీరు పూర్తి సమాచారం అందించారు కృతజ్ఞతలు
ReplyDelete