ఆయువు, ఐశ్వర్యాలిచ్చే ‘‘మరకత లింగేశ్వరుడు’’ ~ దైవదర్శనం

ఆయువు, ఐశ్వర్యాలిచ్చే ‘‘మరకత లింగేశ్వరుడు’’


(రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, చందిప్ప గ్రామంలో మూసీనది సమీపంలో కొలువై వుంది ఈ మరకత మహాదేవుని ఆలయం)
.
ఈ లింగానికి జ్యోతిర్లింగాలల్లోని ‘వైద్యనాథుని’ పోలిక ఉంది. అలాగే ఉమామహేశ్వరుని ఆలయం (శ్రీశైలం వద్ద) కొండపై ఉన్న లింగంపై ఉన్న నామం చందిప్పలోని మరకత శివలింగంపై ఉన్న నామం ఒక్కటే! పొడుగ్గా ఉన్న నామాన్నిబట్టి శ్రీరాముడు ప్రతిష్ఠించినట్లుగా పండితులు చెబుతున్నారు. ఈ లింగానికి నిష్ఠతో 5 సోమవారాలు కాని, 5 పున్నమి రోజులు కాని, మాస శివరాత్రుల్లో కాని పూజలు అభిషేకాలు చేస్తే శక్తి-పుష్ఠి లభిస్తుందని ‘‘శివపురాణం’’ చెబుతోంది.
‘‘మరకత మహాదేవ రక్ష రక్ష - మరకత శివలింగ రక్ష రక్ష’’ అంటూ మూల మంత్రాన్ని పఠించినంతమాత్రం చేతను ఇక్కడ కొలువైన పరమేశ్వరుడు కోరిన వరాలిస్తాడు. ఒక్కసారి దర్శించినంతమాత్రం చేతనే హృదయమంతా భక్త్భివంతో పులకించిపోతుంది. ఆకర్షణీయంగా లేతపచ్చరంగులో అత్యంత ప్రకాశవంతంగా ఉంటుందీ శివలింగం! అదే మరకత మహాదేవ సోమేశ్వరస్వామి! ప్రాతఃకాలంలో సూర్యుని కిరణాలు ఇక్కడి శివలింగంపై పడి అత్యద్భుతంగా మరకతమణులతో ఆవిర్భవించిన లింగంగా మహా శివుడు దర్శనమిస్తాడు.
ఈ మరకత మహాదేవుని దర్శించగానే పులకించిన మనస్సులతో భక్తులు పారవశ్యంతో ‘హర హర మహాదేవ... మరకత శివా పాహి పాహి’ అనే నినాదాలతో శివాలయం మారుమోగుతుంది. రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, చందిప్ప గ్రామంలో మూసీనది సమీపంలో కొలువై వుంది ఈ మరకత మహాదేవుని ఆలయం. ఆకుపచ్చని రంగులీనే ఈ శివలింగాన్ని మరకత శివలింగంగా భక్తులు కొనియాడుతారు. నవరత్నాలల్లోని బుధుని రూపం, చంద్రుని నక్షత్రం కూడా కలగలసి ఉందని భక్తులు విశ్వసిస్తూ, ఈ మరకత శివ లింగాన్ని కొలిస్తే చంద్రబుధులు సంతోషిస్తారని నమ్ముతారు.
ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 1076-1126 పశ్చిమ చాళుక్య వంశంలోని రాజుల్లో 6వ చక్రవర్తి విక్రమాధిత్యుడు పవిత్రమైన ముచుకందానది ఒడ్డున అంటే ఇప్పటి మూసీనది ఒడ్డున శంకర్‌పల్లి పట్టణానికి సమీపంలో ఉన్న చందిప్ప గ్రామంలో ఈ మరకత శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. విక్రమ శకం క్రీ.శ.1101 సం. కార్తికమాసం గురువారం (అక్టోబర్ 23) శుద్ధ పంచమి పౌర్ణమి రోజున ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చారిత్రికాధారాలున్నాయి.
ఇక్కడి క్షేత్రపాలకుడు కాలభైరవుడు! ఆలయ ప్రాంగణంలో గల ‘కాలభైరవుడు’ ఈ లింగాన్ని వెయ్యి సంవత్సరాలు భద్రంగా కాపాడుతున్నట్లు చెబుతారు. ‘కాలభైరవ నమస్తుతే’, ‘కపిలేశ్వరా నమస్తుతే’, ‘కాశీవిశే్వశ్వరా నమస్తుతే’ అనే పలుకులతో ఆదివారం పూజలుచేస్తే దోషాలు పోయి శుభం కలుగుతుందని స్థలపురాణం వక్కాణిస్తోంది. అయతే పండుగలప్పుడు తప్ప ఈ లింగానికి పూజలు జరిగేవిన ఆనవాళ్లు లేవు. కొనే్నళ్లు ఈ ఆలయం అలా చీకట్లోనే ఉండిపోయంది. అయతే 2007 మహాశివరాత్రినాడు సాయులు అనే భక్తుడి చిన్న కుమారుడు సతీష్‌కుమార్ (నరేష్) లింగాన్ని చూడాలన్న ఆశతో వెతుక్కుంటూ చందిప్పకు వెళ్ళి లింగాన్ని చూశాడు. పాడుపడ్డ చిన్న ఆలయం, రోడ్డుమార్గం సరిలేదు. ఆలయం ప్రాంతంలో పశువులను కట్టేసి, చెత్తాచెదారం నిండివుంది. అలాంటి దుస్థితిలో ఉన్న ఆలయంలోని శివలింగాన్ని దర్శించి అభిషేకం చేస్తుండగా సూర్యుని కిరణాలు ‘లింగంపై’ పడుతున్నప్పుడు ప్రతిబింబం కనిపించడంతో ఇది మరకత శివలింగంగా గుర్తించాడు.
శివుని అభిషేకాలు - ఫలాలు....
ఈ మరకత శివలింగానికి ఆవు నెయ్యితో ఐశ్వర్యం, కుంకుమతో అర్చిస్తే ధనం, రుద్రాక్షలతో కనకం, చెరుకు రసంతో సుఖాలు, మామిడి పండ్ల రసంతో దీర్ఘవ్యాధులు, నల్లద్రాక్షతో కార్యసిద్ధి, దానిమ్మ రసంతో లాభం, పనసరసంతో మోకాళ్ళ బాధ నివారణ, కస్తూరితో అధికారం, పుష్పజలాలతో భోగాలు, ఆవనూనెతో శత్రునాశనం, కొబ్బరి నూనెతో కలహాల నివారణ, వివాహానికి మిస్రీ- పటిక బెల్లం, శ్రీగంధంతో సంతానం, సపోట రసంతో వీర్యవృద్ధి, బంగారంతో వ్యాపార వృద్ధ్ధి జరుగుతాయని ఇక్కడి గ్రామస్థుల నమ్మకం. బుధవారం శివాభిషేకం చేసినవారికి విద్యాప్రాప్తి కలుగుతుంది.
ఆలయంలోని వృక్షాలు....
‘నాగపుష్పం’ వృక్షం, పానవట్టం, లింగం, నాగాభరణం, శివలింగ రూపంలతోఅలరారేఈ నాగపుష్ప వృక్షం ఇక్కడ ఉంది. ఈ శివలింగం ఆకారంలో ఉంటే ఈ నాగపుష్పాలతో 41వ రోజులు శివుడ్ని అర్చిస్తే వారి కోరిక ఇట్టే తీరుతుంది! శివునకు ప్రీతికరాలైన ఉసిరి, బిల్వ వృక్షాలున్నాయ. చుట్టూ పచ్చని ప్రకృతితో నయనానందకర పరిసరాలతో ఈ శివాలయం చూపురులను ఆకర్షిస్తుంది.
ఇక్కడి ఇంకో ప్రత్యేకత శివుని కుమారుడుగా మనం భావించే సుబ్రహ్మణ్యస్వామి నాగుపాము రూపంలో ఇక్కడే ఎన్నో ఏళ్లుగా నివాస ముంటున్నాడు. అప్పుడప్పుడు ఈ ఆలయంలోకి వచ్చి శివుని పూజించి వెళ్తున్నట్టు ఇక్కడి నివాసితులు చెప్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఇతర విగ్రహాలుకూడా చెల్లాచెదురుగా కనిపిస్తాయ.
‘పౌర్ణమి’నాట మరకతశివుడు....
ఈ మరకత శివలింగానికి బ్రహ్మీ ముహూర్తం 3 గంటల నుండి 5 గంటల లోపు అభిషేకం చేస్తే కార్యసిద్ధి జరుగుతుందని భక్తులు చెబుతారు. పౌర్ణమినాడు మరకత శివునకు అభిషేకించిన జలాలతో స్నానం చేసినవారికి ఆరోగ్యం లభిస్తుంది.
రాజుల చరిత్ర....
పశ్చిమ చాళుక్య వంశ రాజులలో సుప్రసిద్ధ చక్రవర్తి శ్రీత్రిభువన మల్లబిరుదాంకింతుడైన ఆరవ విక్రమాధిత్యుడు క్రీ.శ.1076 నుండి 1126 వరకు పరిపాలించాడు. అప్పుడు ఈ సోమేశ్వర మరకత శివలింగం ఆలయ స్థాపనకు, ఆ దేవుని అంగరంగ భోగములకు, విశేష పూజలకు, శివరాత్రి కార్యక్రమాలకు 254 ఎకరాల గుడిమాన్యాన్ని ప్రకటించారు. పశ్చిమ దిశలో హెబ్బిహోలు పేరుగల పొలంలో 153 ఎకరాలు నల్లరేగడి భూమిని, నైవేద్యమునకు తూర్పు దిశగ 2-20 ఎకరాలు, వరికి, పూల తోటకు 54 ఎకరాలు, తాటివనం, ఇలా రాజులు అగ్రహారం కింద దైవ పూజలకోసం, అన్నదానం కోసం కేటాయించినట్లు ఇక్కడ లభ్యమైన శాసనం వెల్లడిస్తోంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List