శ్రీరామసేతుకు ఆరంభ కేంద్రం.. ధనుష్కోడి ~ దైవదర్శనం

శ్రీరామసేతుకు ఆరంభ కేంద్రం.. ధనుష్కోడి


దక్షిణ భారతదేశంలో అత్యంత పేరెన్నికగన్న తమిళనాడులోని రామేశ్వరానికి దగ్గరల్లో... శ్రీలంకకు వారధి పట్టణంగా ప్రసిద్ధిగాంచిన ధనుష్కోడి ఓ చిన్నగ్రామం. కానీ పర్యాటకంగా ఈ గ్రామానికి ఎంతో ప్రత్యేకత ఉంది.
ధనుష్కోడి, పాంబన్‌ వంతెనకు ఆగ్నేయంగా ఉన్నది. రామేశ్వరం నుండి ధనుష్కోడి వరకూ ఉన్న రైల్వే లైను 1964లో సంభవించిన పెనుతుఫానులో, ప్రయాణీకులతో సహా కొట్టుకుపోయింది.
ఆ తరువాత రైల్వే లైనును పునరుద్ధరించినా, ఆరు పెద్ద ఇసుక తిన్నెలు పట్టాలను కప్పివేయగా దాన్ని ఉపయోగించడం నిలిపివేశారు.
ప్రస్తుతం ధనుష్కోడికి సముద్రతీరం వెంట కాలినడకన లేదా ఇసుకతిన్నెలపై జీపు ద్వారా చేరుకోవచ్చు. పూర్వం కాశీ తీర్ధయాత్ర, రామేశ్వరాల్లో పూజచేసి, ధనుష్కోడి వద్ద మహోదధి (బంగాళాఖాతం), రత్నాకర (హిందూ మహాసముద్రం) ల సంగమస్థలంలో పవిత్రస్నానం చేయనిదే పూర్తికాదని భావించేవారు.
సేతు ధనుష్కోడి నుండే ప్రారంభమవుతుంది. సంస్కృతంలో సేతు అనగా వంతెన. ఇప్పుడు సేతు అనగా రామాయణంలో రాముడు లంకను చేరుటకు నిర్మించాడని భావిస్తున్న వారధి అనే ప్రత్యేకార్ధం కూడా వచ్చినది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List