మహా మహిమాన్విత మైన పురాతన మంగళ దేవి ఆలయం. ~ దైవదర్శనం

మహా మహిమాన్విత మైన పురాతన మంగళ దేవి ఆలయం.

వరాలిచ్చే దేవత మంగళదేవి..కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా... అష్ట లక్ష్ముల్లో ఒకరిగా... స్త్రీల నోముల పంటగా... విరాజిల్లుతోంది మంగళదేవి. ఆ తల్లిని నిండు మనసుతో ధ్యానించి... పూజిస్తే... సకల కోరికలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. మంగళదేవి ఇంకెవరో కాదు... సకల ఐశ్వర్యాలకు అధిదేవత అయిన మంగళదేవే.
ఆకాశాన్ని తాకుతున్నట్లుండే ఎతె్తైన పర్వతశ్రేణులు... కనుచూపుమేర పరుచుకున్న పచ్చదనం... అక్కడ అడుగుపెట్టగానే చల్లని పిల్లతిమ్మెరలు ఒడలికి ఒక విచిత్ర అనూభూతిని కలిగిస్తాయి... చల్లని వాతవరణం... చుట్టూ పచ్చని చెట్లు... రంగురంగుల పక్షుల కిలకిలరావాలు... ఆ అనుభూతే వేరు. పచ్చని అడువులు, ఔషధ గుణాలు కల చెట్లుతో అలరారుతోంది. ఆహ్లదకర వాతావరణం, ప్రకృతి సౌందర్యం కేరళ ప్రత్యేకతలు. ఇక్కడికి వేళ్ళే కొండ దారి.. వంకలు తిరిగి ఎంతో అందంగా వుంటుంది. రెండువైపులా నీలగిరి వంటి అనేక జాతుల చేట్లు, కొండ చుట్టూ అడవులు, కం టికి ఇంపుగా కనిపించే సువిస్తారమైన పచ్చదనం మదిని పులకరింప చేస్తాయి.
సువాసనలను వెదజల్లే సంపంగి పూలకు ప్రసిద్ది. సంపెంగ సువాసనలతో .. ఘమఘమలు పర్యాటకులను మరో ప్రపంచం లోకి తీసుకేళ్తాయి. వీటితోపాటిగా చందనం, కలప, రీటా, శీకా కాయ, ఉసిరిగ చెట్లు ఇక్కడ కోకొల్లలుగా వున్నాయి. చల్లని పిల్లగాలులు శరీరాన్ని తాకుతూ వేళ్తుంటే ఆ అనుభూతే వేరు. చల్లటిగాలిలో తేలుతూ వచ్చే సంపెంగల సువాసనలు భక్తులను ఈ ప్రాంతానికి మళ్ళీమళ్లీ రప్పిస్తాయి. దట్టమైన చెట్లు, విస్తారమైన పచ్చిక బయళ్లు జనాన్ని అకర్షిస్తాయి. ఇలా వివిధ రకాల చెట్లు, చేమల మధ్య చెంచుజాతి కి చెందిన వారు ఈ ప్రాంతలో జీవనం సాగిస్తున్నారు.
కేరళ రాష్టం, తేక్కడి జిల్లా లోని మంగళ దేవి ఆలయం. తేక్కడి నుండి 15 కిమీ దూరంలో ఉంది. మంగళ దేవి ఆలయం ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. ఆలయం సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తులో మరియు చుట్టూ ఉన్న కొండల మరియు దట్టమైన అడవులు చుట్టూ,ఒక శిఖరం పైన ఈ ఆలయాన్ని చూడవచ్చు. ఈ పురాతన ఆలయం భక్తులను నిజంగా మంత్రముగ్దులను చేస్తుంది. ఈ అద్భుతమైన స్టోన్ టెంపుల్ నిర్మాణం సంప్రదాయ పాండియన్ నిర్మాణ శైలి లో జరిగింది. ఈ ఆలయం లో దేవత మంగళ. మే నెలలో వచ్చే చిత్ర పౌర్ణమి రోజున మాత్రమే చూడటానికి అనుమతి ఉంది. అయితే అటవీ సంరక్షణ ముఖ్యాధికారి నుండి ముందు అనుమతితో, ప్రయాణికులు ఇతర రోజుల్లో ఈ ఆలయంను చూడవచ్చు. మంగళ దేవి ఆలయం 2000 సంవత్సరాల పురాతన ఆలయము. కుమిలీ నుంచి ఈ ఆలయమునకు వెళ్ళటానికి అద్దె కు జీప్లులు ఉంటాయి. ఆలయం సందర్శకులకు అందమైన మరియు ప్రశాంత వాతావరణం అందిస్తుంది.

Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...