ఆలయానికి వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్తాం..కొబ్బరికాయ, పసుపు, కుంకుమ ఇతర వస్తువులను తీసుకెళ్తాం కదా. కాని ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాల్సిన పని లేదు. తమ కోర్కెలు తీర్చాలంటూ భక్తులు వింత పూజలు నిర్వహిస్తారు. భక్తుల కొర్కెలు తీర్చే కొంగుబంగారంగా పిలవడుతున్న ఈ ఆలయం విజయనగరం జిల్లాలో ఉంది. జిల్లాలోని పెదమేడపల్లిలో ఉన్న 'మహంకాళి ఆలయం' పేరుగాంచింది. ఇక్కడకు భారీగానే భక్తులు తరలివస్తారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు మాత్రం వింత పూజలు నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు తమ కోర్కెలు తీర్చాలని 'రాళ్ళ'ను వేస్తుంటారు. దీని ద్వారా తమ కోర్కెలు నేరవేరుతాయని ఇక్కడ భక్తులు పేర్కొంటున్నారు. దేవతకు రాళ్ళను సమర్పించే ఆచారం ఎప్పటి నుండో వస్తోందని, రాళ్ళను గుట్టలుగా వేయడం ఇక్కడ ఆనవాయితీ అని భక్తులు తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగిస్తుండడం విశేషం.
Home »
» మహంకాళి అమ్మకు రాళ్ళను సమర్పించే భక్తులు...
No comments:
Post a Comment