నమః పార్వతి పతియే హర హర మహాదేవ్...
సర్వం శివ మయం జగత్ శివం శివోహం....
శివుడు సర్పభూషితుడు. నాగం పవిత్రతకు చిహ్నం . శివుని తలపై ఒకటి ,కంఠం లో ఒకటి , భుజాలకు రెండు, చేతులకు రెండు , కాళ్ళకు రెండు, నడుముకు ఒకటి అంటు మొత్తం తొమ్మిది స్థానాలలో తొమ్మిది నాగ సర్పాలు ఉంటాయి.
శివలింగాన్ని పరివేష్టించి ఉన్న మూడున్నర చుట్ల నాగం మనువులలో కుండలిని శక్తిని సూచిస్తుంది. శరీరంలోని ఐదు వాయువులు ఐదు నాగులను సూచిస్తున్నాయి. మిగిలిన నాలుగు వాయువులు ఆధ్యాత్మిక ఉన్నతిని అందుకున్న సాధకులకు సాధ్యం. సర్పం ప్రాపంచిక విషియాలకు ప్రతీక. పాముకి కోరలను పీకేస్తే ఎలా హాని చేయజాలదో, అలాగే నిర్విష విషియాలు కుడా హానికరాలు కావు. కామ , క్రోధ , లోభ మోహ, మద, మాత్సర్యాలన్న ఈ వికారాలు పోయెవికావు. వాటిని అదుపులో ఉంచుకోవాలి. అలాగ అదుపులో ఉంచుకొగలిగితే అవి ఎటువంటి హానిని తలపెట్టవు......హర హర మహా దేవ శంభో శంకర !
No comments:
Post a Comment