మహిమాన్వితమైన శివదీక్ష. ~ దైవదర్శనం

మహిమాన్వితమైన శివదీక్ష.


* శివ దీక్షలు స్వీకరించండి... అద్భుతమైన ఫలితాలను పొందండి..
* శివ దీక్షతో మనసుకు ప్రశాంతత ...
.
మానవుడి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని సంసార బంధంలో చిక్కి ఈదలేకపోతున్నాడు. అనుక్షణం మానసిక ఆందోళనతో సతమతమవుతున్నాడు. ఎన్నో రకాల వ్యసనాలతో.. చేడు అలవాట్లు.. కుటుంబ కలహాలతో విసిగిపోతున్నాడు.. ఇలాంటి అన్ని సమస్యలను దూరం చేయాలంటే భక్తి ఒక్కటే మార్గం.. మనిషిలో మార్పు తెచ్చేందుకు మాలాధరణ చేస్తే అన్ని సమస్యలు దూరమవడంతోపాటు మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. దీనికితోడు మన సంస్కృతి, సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. మానవుడు భగవత్ దీక్ష కలిగి ఉంటే కామక్రోదాది అరిషడ్మార్గాలను జయించడంతోపాటు సన్మార్గంలో నడిపించి మోక్షం లభిస్తుంది. అందుకనే భగవంతుడిపై లీనమై ఉండేందుకు భక్తులు మాలధారణలు చేస్తుంటారు. అందులో అత్యుత్తమైనది శివదీక్ష.
.
ఈ ప్రపంచములో సృష్టిస్థితిలయములకు సకలచరాచర జీవకోటిని సంరక్షించుటకు కైలాసములో పార్వతీ పరమేశ్వరులుగా, శ్రీశైలములో భ్రమరాంబ మల్లిఖార్జునులుగా, కాశీలో విశాలాక్షి విశ్వనాధలింగేశ్వరులుగా, సోమేశ్వర, మల్లిఖార్జున, మహాకాళేశ్వర, అమరేశ్వర, వైద్యనాథేశ్వర, భీమేశ్వర, రామేశ్వర, నాగేశ్వర, విశ్వేశ్వర, త్రయంబకేశ్వర, కేదరేశ్వర, ఘృశ్వేశ్వర అను ద్వాదశ జ్యోతిర్లింగములుగా వివిధ పుణ్యక్షేత్రములలో ప్రసిద్ధి చెందినారు. ఆ జగద్రక్షకుడైన జగదీశ్వరుని ఎంత పొగిడినా తనివితీరదు. ఓం నమః శ్శివాయ అను పంచాక్షరి మంత్రమును నియమ నిష్ఠలతో పఠించిన శివకోటి భక్త జనులకు సర్వపాపములు పటాపంచలు అయి ముక్తి మోక్షఫల ప్రదంబుల నొసంగి జన్మ తరింపజేయును.
.
శివదీక్షను, నిష్ఠ నియమాలతో ఆచరించిన, దేహపీడలు అకస్మాత్ కలహములు తొలగి ఆయురారోగ్యములు, అష్ట్యైశ్వర్యములతో శుభ ప్రదముగా జీవించునట్లు ఆశీర్వదించును. దేవతలందరిలో శివుడు దయారస హృదయుడు. భక్తుల మొరలాలించి వరాలిచ్చే బోళాశంకరుడు. శివ అంటే శుభము అని అర్థము. ఇతర దేవతలవలె శివుడు అవతారము లెత్తుటకై మహా శివుడు ఎవరి గర్భమున జన్మింపలేదు. అవతారము, అవతార సమాప్తి, అన్నియు లీలలే, శివుడు నిర్మలుడు, నిర్గుణుడు, నిష్కలంకుడు, నిటాలాక్షుడు, నిరంజనుడు. అట్టి ఆదిదేవుడు శివుని ఆలంబనముగా జేసుకొని ఆచరించబడేదే శివదీక్ష జగన్మాతయైన పార్వతీదేవి కఠోరమైన శివదీక్ష చేసి, ఆ పరమశివుని అనుగ్రహము వలన నిజమైన అర్థాంగియైనది. శివుని శరీర మందు అర్థభాగము స్వీకరించుటచే పరమేశ్వరుడు కూడా అర్థనారీశ్వరుడైనాడు.
.
శ్రీరామచంద్రుడు శ్రీరామలింగేశ్వరుని, శ్రీకృష్ణుడు శివదీక్షను, అర్జునుడు పాశువత దివ్య దీక్షను స్వీకరించి తరించునట్లు చెప్పబడుచున్నది. మనకు తెలిసినంత వరకు శివదీక్ష పట్టిన వారిలో మొట్టమొదటి భక్తురాలు పార్వతీదేవి. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భక్త కన్నప్ప నుండీ, పర్వతుడు, భక్త సిరియాలుడు మొదలైనవారు శివదీక్షను పాటించినట్లు విక్రమాదిత్యుని తామ్రశాసనం వలన తెలుస్తుంది. కార్తికేయుడు కూడా శివదీక్షను పూని దేవతాసిన్యాలకు అధిపతి అయినాడు. ఇంతటి దివ్య మహిమగల శివదీక్ష ఎంతో ప్రాచీనమైనది.
.
మాఘమాసంలోని మహాశివరాత్రితో మండలకాలం అనగా 40 రోజుల్లో ముగియునట్లుగా ఆచరించుట మంచిది.
.
40 రోజులు పూర్తయి 41వ రోజున దీక్ష విరమించవలెను. మాఘమాసములోని మహాశివరాత్రితో గాని, కార్తీక మాసములోని మహాశివరాత్రితో గాని, కార్తీక మాసములోని మాస శివరాత్రితోకాని దీక్ష పూర్తి అయ్యే విధముగా ఆచరించవచ్చును.
.
మండలకాలం పూర్తి అయిన తరువాత జ్యోతిర్ముడితో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి మల్లిఖార్జున స్వామికి నమస్కరించి శ్రీశైల మహాక్షేత్రము నందు గల త్రిఫల వృక్షము క్రింద ఈ దీక్షా విరమణ చేయుట మిక్కిలి శ్రేష్ఠము. ఇది చేయలేని వారు అర్థ మండలం అనగా 20 రోజులు శివ దీక్షవహించిన 21 వ రోజులో దీక్షావిరమణ చేయవలెను. ఈ శివదీక్షను స్థానిక శివాలయములోని శివార్చకునితో కాని ఇంతకు పూర్వము శివదీక్షను స్వీకరించిన వారితోకాని మూలాధారణను చేయించుకొనవలెను.
.
ఇట్టి మహత్తరమైన శివదీక్షను నియమానుసారము ఆచరించిన వారికి భూత, ప్రేత, పిశాచ, శత్రు బాధలు, గ్రహారిష్టములు తొలగిపోవును. సర్వ సంపదలు కలిగి ఐహికాముషిక సుఖబీమమీలు పొందెదరు.
.
శంకరాచార్యుల వారు తన శివానందలూ ఓ పరమేశ్వరా ! ఈ జగత్తులో సహస్రార్థిలో దేవతలు ఉన్ననూ శాశ్వత మోక్ష ఫలమును ప్రసాదించువాడవు నీవే సుమా ! కనుక నీ పాదద్మములే నాకు శరణ్యము.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List