సంవ‌త్స‌రంలో ఒక‌రోజు మాత్ర‌మే తెరిచే నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం. ~ దైవదర్శనం

సంవ‌త్స‌రంలో ఒక‌రోజు మాత్ర‌మే తెరిచే నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం.

హిందూ ధ‌ర్మంలో పాముల‌ను ఆరాధించే సంస్కృతి అనాదిగా వస్తోంది. హిందూ ధ‌ర్మంలో స‌ర్పాల‌ను దేవ‌త‌ల ఆభ‌ర‌ణంగా భావిస్తారు. మ‌న‌దేశంలో ఎన్నో నాగ దేవాల‌యాలున్నాయి. అందులో ప్ర‌ముఖమైంది, ఇత‌ర ఆల‌యాల‌కంటే భిన్న‌మైంది ఉజ్జ‌యినిలోని నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం. ఉజ్జ‌యినిలోని మ‌హాకాల్ మందిరంలోని మూడో అంత‌స్థులో నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం కొలువై ఉంది. ఈ కోవెల సంవ‌త్స‌రంలో ఒక‌రోజు మాత్ర‌మే అది కూడా శ్రావ‌ణ శుక్ల పంచ‌మి రోజు మాత్ర‌మే తెరిచి ఉంటుంది. ఆరోజు మాత్ర‌మే భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. ఆల‌యం తెరిచి ఉండే ఈ ఒక్క‌రోజున స‌ర్ప‌రాజుగా భావించే త‌క్ష‌కుడు ఆల‌యంలోనే ఉంటాడ‌ట‌. నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలో 11 వ శతాబ్దానికి చెందిన అద్భుత‌మైన ప్ర‌తిమ ఉంది. ఇందులో ప‌డ‌గ విప్పి ఉండే పామునే ఆస‌నంగా చేసుకొని కూర్చొని ఉన్న శివ‌పార్వ‌తులుంటారు. ఈ ప్ర‌తిమ‌ను నేపాల్ నుంచి తెప్పించార‌ని చెబుతుంటారు. ఉజ్జ‌యినిలో త‌ప్ప ఇలాంటి ప్ర‌తిమ ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా ఉండ‌ద‌ట‌. సాధార‌ణంగా అయితే స‌ర్పంపైన విష్ణు భ‌గ‌వానుడు మాత్ర‌మే శ‌యనిస్తాడు. కానీ ప‌ర‌మ‌శివుడు శయ‌నించిన దాఖ‌లాలు ఎప్పుడూ విన‌లేదు. కానీ ప్ర‌పంచంలో మ‌ర‌కెక్క‌డా లేని విధంగా ఉజ్జ‌యినిలోని నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలో భోళాశంకరుడు శ‌య‌నించి ఉండ‌డం విశేషం. ఈ ప్ర‌తిమ‌లో శివ‌పార్వ‌తుల‌తో పాటు వారి ముద్దుల త‌న‌యుడు వినాయ‌కుడు కూడా కొలువై ఉన్న అద్భుత దృశ్యం చూడ‌డానికి రెండు క‌ళ్లూ చాల‌వు నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలోస‌ర్పంపైన ప‌ర‌మ‌శివుడు శయ‌నించి ఉండ‌డం వెన‌క ఒక క‌థ ప్ర‌చారంలో ఉంది.
స‌ర్ప‌రాజు త‌క్ష‌కుడు ప‌ర‌మేశ్వ‌రుడి అనుగ్ర‌హం కోసం కఠోర‌మైన త‌పస్సు చేశాడ‌ట‌. ప్ర‌స‌న్న‌మైన శివుడు త‌క్ష‌కుడికి అమ‌ర‌త్వాన్ని ప్ర‌సాదించాడ‌ట‌. ఇక అప్పటి నుంచి త‌క్ష‌కుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడ‌ని చెబుతారు. నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యానికి శతాబ్దాల చ‌రిత్ర ఉంది. 1050 లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు. ఆయ‌న త‌ర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మ‌హ‌రాజ్ 1732 లో ఆల‌య జీర్ణోద్ధ‌ర‌ణ చేప‌ట్టాడు. ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి ద‌ర్శించుకుంటే చాలు స‌ర్ప‌దోషాల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. అందుకే నాగ‌పంచ‌మి రోజు ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తుతారు. నాగ‌చంద్రేశ్వ‌రుడి ద‌ర్శించుకొని పునీతుల‌వుతారు. ఈ ఒక్క‌రోజే దాదాపు రెండు ల‌క్ష‌ల మంది భ‌క్తులు ద‌ర్శించుకోవ‌డం విశేషం.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List