తేనీరు బోధి ధర్మ షావోలిన్ పర్వతం పైన ఒక గుహలో తొమ్మిది సంవత్సరాలు ధ్యానం లో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఒక గోడను తదేకంగా చూస్తూ ధ్యానాభ్యాసం చేసేవాడు. ఆ సమయంలో ఆయనకు నిద్ర మత్తు వచ్చి కనురెప్పలుమూసుకు పోయేవి. దీనిని నివారించ దానికి ఆయన కను రెప్పలను కోసి పారవేశాడు. అవి నేలపైన పడిన చోట తేయాకు మొక్క పుట్టింది. అందువల్లనే తేనీరు త్రాగితే నిద్ర రాదు. ఇది చైనాలో ప్రచారంలో ఉన్నటువంటి ఒక గాథ. ఇందులోని నిజా నిజాలను ప్రక్కన ఉంచితే, ఈనాటికీ జెన్ ఆశ్రమాలలో సన్యాసులు ధ్యానంలో కలిగే నిద్రను ఆపుకోనడానికి తేనీరు సేవించటం ఒక ఆచారంగా వస్తున్నది. ఆశియా దేశాలలో దొరికే దామో బొమ్మకు అందుకే కనురప్పలు ఉండవు. బోధిధర్మనే సంక్షిప్త రూపంలో దారుమ అని దామో అని జపాన్ లో పిలుస్తారు. ఆయనకు కల ఇంకొక పేరు ధర్మ తిష్య. దీనినే జపాన్ లో దారుమ తైషి అని అంటారు. నిద్రను జయించి తదేక దృష్టి తోతొమ్మిది ఏళ్ళు ధ్యానం లో ఉన్న కారణం చేత బోధి ధర్మ చిత్రాలకు మిడి గుడ్లు ఉంటాయి. కనురెప్పలు ఉండవు. ఇంకొక గాధ ప్రకారం, అన్ని ఏళ్ళు కదల కుండా కూర్చొనుట వల్ల ఆయన కాళ్ళకు పక్షవాతం వచ్చింది. కనుక ఆయన బొమ్మలకు కాళ్ళు కూడా ఉండవు. ఇది నిజం కాక పోవచ్చు. ఎందుకంటే ఆయన మరణం తర్వాత మూడేళ్ళకు ఆయనమంచులో నడుస్తూ భారత దేశానికి పోవటం సరిహద్దు సేనాని చూస్తాడు. కనుక ఈ గాధలను ప్రతీకాత్మకం గానే తీసుకోవాలి. తదేక ధ్యాన నిష్ఠకు సూచకంగా కనురెప్పలు లేకపోవటం, తొమ్మిదేళ్ళు కదలకుండా కూచోవటం సూచనకు కాళ్ళు లేకపోవటం అనేవి ప్రతీకలుగా (symbols) తీసుకోవాలి. ఆయన కూర్చొని ఉన్న గుహలోని గోడ మీద ఆయన నీడ ఏళ్ళ తరబడి పడి అది చాయా చిత్రంగా మారింది. ఇది ఈనాటికీషావోలిన్ ఆలయంలో గల బోధి ధర్మ గుహలో గోడమీద చూడవచ్చు. తదేకధ్యాన నిష్ఠకు ప్రతీకగా బోధి ధర్మచరిత్ర పుటలలో నిలిచి పోయాడు.
జెన్ మహా గురువు బోధి ధర్మ
బోధి ధర్మ -1
బోధి ధర్మ -1
జెన్ సాంప్రదాయానికి చైనాలో మొదటి గురువుగా బోధి ధర్మ ఈనాటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు. ఆయన చైనాకు ఈ జ్ఞానాన్ని అందించటం వల్ల ఎన్ని వేల మంది జిజ్ఞాసులు సంసార సాగరాన్ని దాటి బుద్ధత్వాన్ని పొందారో లెక్కలేదు. ప్రపంచానికి గొప్ప మేలు చేసిన వారిలో తప్పక ఈయన పేరు ఉంటుంది.
ఈయన తమిళ నాడుకు చెందిన పల్లవ రాజు సుగంధుని మూడవ సంతానం గా చరిత్ర కారులు భావిస్తున్నారు. ప్రపంచం మీద విరక్తి చెందిన ఈయన ధ్యాన బౌద్ధ సాంప్రదాయానికి చెందిన ఇరవై ఏడవ గురువైన ప్రజ్ఞా తార కు శిష్యుడైనాడు. తరువాత గురువు గారి ఆజ్ఞా మేరకు ధ్యాన బౌద్ధాన్ని చైనాలో ప్రచారం చెయ్యడానికి సముద్ర మార్గంలో చైనా చేరాడు.
ఈయన తమిళ నాడుకు చెందిన పల్లవ రాజు సుగంధుని మూడవ సంతానం గా చరిత్ర కారులు భావిస్తున్నారు. ప్రపంచం మీద విరక్తి చెందిన ఈయన ధ్యాన బౌద్ధ సాంప్రదాయానికి చెందిన ఇరవై ఏడవ గురువైన ప్రజ్ఞా తార కు శిష్యుడైనాడు. తరువాత గురువు గారి ఆజ్ఞా మేరకు ధ్యాన బౌద్ధాన్ని చైనాలో ప్రచారం చెయ్యడానికి సముద్ర మార్గంలో చైనా చేరాడు.
అక్కడ దక్షిణ చైనాను వు అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన బౌద్ధ మతానుసారి. దాన ధర్మాలు చేసినవాడు. ఎన్నో బౌద్ధ ఆరామాలు కట్టించిన వ్యక్తి. కాని బోధి ధర్ముని మాటలు ఆయనకు నచ్చలేదు. అప్పటి వరకూ ఆయన చూచిన బౌద్ధ భిక్షువుల తీరుకూ బోధిధర్మ తీరుకూ బోలెడంత తేడా ఉంది. బోధి ధర్మ బుద్ధత్వాన్ని పొందిన వాడు. శాస్త్ర చర్చలకూ,ఆచారాలకు, క్రియా కలాపాలకు భిన్నమైన ధ్యాన బౌద్ధ శాఖకు చెందిన వాడు. వారిద్దరి మధ్యన జరిగిన చర్చ ఇప్పటికీ ఒక శిలా శాసనంలా నిలిచి పోయింది.
బోధి ధర్మను ఆహ్వానించ టానికి వు చక్రవర్తి వచ్చాడు. కాని ఆయన అప్పటి వరకు చూచిన బుద్ధ ధర్మం కంటే భిన్న మైన ధర్మాన్ని బోధి ధర్మలో చూచాడు. చక్రవర్తి అప్పటి వరకూ చేసిన పుణ్య కార్యాలకు ఏమీ విలువ లేదని తేల్చి చెప్పాడు బోధి ధర్మ. బుద్ధుని అత్యున్నత బోధన శూన్యత్వం అని, దానిలో ఏ ప్రత్యేకతా లేదు అని చెప్పాడు. కోపం వచ్చిన చక్రవర్తి " అంతా శూన్యం అయితే మీరు ఎవరు " అని బోధి ధర్మను అడుగుతాడు. దానికి బోధి ధర్మ " నాకు తెలియదు " అని జవాబు చెబుతాడు. ఈ సంభాషణ అంతా చక్రవర్తికి కోపం విసుగు తెప్పిస్తుంది. బోధి ధర్మ ఆయనకు ఒక పిచ్చి వాడిగా, అహంకారిగా అగుపిస్తాడు.
తన మాటలు చక్రవర్తికి అర్థం కాలేదని గ్రహించిన బోధి ధర్మ , నదిని దాటి ఉత్తర చైనాను చేరతాడు. అక్కడ షావోలిన్ మఠం లో తొమ్మిదేళ్ళు ఉండి నలుగురు శిష్యులకు తన బోధనల సారాన్ని తెలిపి అక్కడే మరణిస్తాడు. ఆయనను అక్కడికి దగ్గరలో గల ఒక గుహలో పూడ్చి పెడతారు.
మూడు ఏళ్ల తరువాత, ఒక సరిహద్దు సేనానికి, బోధి ధర్మ ఉత్త కాళ్ళతో మంచులో నడుస్తూ భారత దేశానికి పోతూ కనిపిస్తాడు. ఆయన చేతిలో ఒక పాదరక్ష ఉంటుంది. సేనానిని త్వరగా వెనక్కు పొమ్మని , తానూ తన దేశానికి పోతున్నానని, చక్రవర్తి త్వరలో మరణించ బోతున్నాడని చెబుతాడు. సేనాని వెనక్కు వచ్చి బోధి ధర్మ సమాధిని తెరిపించి చూస్తాడు. అందులో బోధి ధర్మ శవం ఉండదు. కాని ఒక పాదరక్ష మాత్రం ఉంటుంది. బోధి ధర్మ చెప్పినట్లే చక్రవర్తి త్వరలో మరణిస్తాడు.
బోధి ధర్మ బోధనలు తరువాత చూద్దాము.
బోధి ధర్మ- ఓషో గారి పూర్వ జన్మలు
బోధి ధర్మ దాదాపు క్రీ.శ 530 ప్రాంతం లోని వాడు. ఓషో రజనీష్ బోధి ధర్మ మీద ఇచ్చిన ఉపన్యాసాలలో తనకు బోధిధర్మకు వ్యక్తి గత పరిచయం ఉందన్న విషయాన్ని ప్రపంచానికి వెల్లడి చేసాడు. ఓషో గారికి సాధనా క్రమంలో తన పూర్వ జన్మలు గుర్తుకు వచ్చాయి. విపస్సాన ధ్యానములో లోతులు అందుకున్న వారికి ఎవరికైనా పూర్వ జన్మలు గుర్తుకు రావటం జరుగుతుంది.
గౌతమ బుద్ధుడు సమ్యక్ సంబోది ని పొందిన నాటి రాత్రి ఆయనకు తన 500 గత జన్మలు పూర్తి వివరాలతో సహా గుర్తుకు వచ్చాయి. అవే తరువాతి రోజులలో జాతక కథలుగా గ్రంధస్తం కాబడ్డాయి. అదే విధం గా ఓషో గారికి కూడా జరిగింది. కాని ఓషో గారు తన పూర్వ జన్మలు అన్నింటినీ వెల్లడి చేయలేదు. ప్రసంగ వశాత్తూ కొన్నింటిని మాత్రం సందర్భానుసారంగా వివరించారు.
తాను బోధి ధర్మతో కలసి రెండు మూడు నెలలు హిమాలయ పర్వతాలలో ప్రయాణం చేసానని ఆయన చెప్పాడు. అది బోధి ధర్మ చైనాకు పోయేటప్పుడా లేక చైనా నుంచి వచ్చేటప్పుడా అనే విషయం ఆయన చెప్పలేదు. ఓషో గారిని చూచి బోధి ధర్మ ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే ఆ రెండు మూడు నెలలు ఆయన బోధి ధర్మతో ఏమీ మాట్లాడ లేదు. మౌనంగా ఉండి ప్రయాణం చేసాడు.
బోధి ధర్మను అందరూ ఎన్నో సందేహాలు అడిగేవారు. ఓషో గారు ఏమీ అడుగక పోవటం చూచి బోధి ధర్మ అదే విషయం ఓషో గారిని అడిగాడు. దానికి ఈయన " నా కేమీ సందేహాలు లేవు. మీకుంటే చెప్పండి. జవాబు చెబుతాను." అంటాడు. బోధి ధర్మ ఆశ్చర్య చకితుడై ఈయనను తనతో కలసి రావలసిందిగా అడుగుతాడు. దానికి ఓషో గారు నిరాకరించి తన మార్గం వేరే అని చెప్పి మంచు కొండలలో ఒక చోట శెలవు తీసుకొని తన దారిన ప్రయాణం కొనసాగించాడు.
No comments:
Post a Comment