కాలము - కాలగమనము ~ దైవదర్శనం

కాలము - కాలగమనము

కాలము, కాలగమనము రెండూ మనకు పరిచయమే. సమయము అని ఇంకోటి కూడా తెలుసు.
కాని కాలము అనేది లేదు అంటే, అలా అన్నవాడు, పిచ్చివాడు అని తేల్చేస్తాం.

కాని కాలము అనేది లేదండి. కాలము, కలనము, అంటే లెక్కపెట్టడం నుంచి వచ్చింది. కాలములో‌ మనం దేనిని గణిస్తున్నాము? ఒక ఘటన లేక సంఘటన జరిగే సమయాన్ని లెక్కిస్తున్నాము. గడియారాలు, పంచాంగాలు ఇలా ఎన్నో కాలగణన సామగ్రితోటి.

మరి కాలము లేక కాలగణన, కాలగమనము ఏమిటి? ఉన్నవి పదార్థాలు, శక్తి మాత్రమే. పదార్ధము శక్తి సాయంతో స్థితిని మారినా, శక్తి పదార్ధము ద్వారా రూపాంతరము చెందినా కాలము సృజించబడుతుంది.
కాలము అనేది ముందుగా ఏమీ లేదు. మనందరము ఉందనుకుంటున్న కాలము ప్రభావమంటూ మనపై, ఇతర సృష్టిపై లేవు.

జరుగుతున్నదల్లా పదార్ధము లేక శక్తి యొక్క పరిణామము.

కాలః పరిణామః - అని మన పెద్దలు చెప్పారు. కాలః శక్త్యాః పరిణామః అని సిద్ధాంతము. కాలము శక్తి యొక్క (పదార్ధము ద్వారా) పరిణామము. మరియు శక్తి సాయంతో పదార్ధము యొక్క స్థితి పరిణామము.
పదార్ధము లేదా శక్తి యొక్క పరిణామం లేక కాలము, కాలగమనము లేవు. అలాగే శక్తి యొక్క పరిణామం లేక కాలగణన లేదు. కాలః స్పృహ లేవు.

మనకు మెళకువ, కల మానసిక దశలలోనే కాలః స్పృహ ఉంటుంది. గాఢనిద్ర, మెళకువతో కూడిన నిద్ర (జాగ్రత్ సుషుప్తి) దశలలో మనకు కాలస్పృహ కాలగమన స్పృహ లేవు. ఈ చివరి రెండు దశల్లో మనసు విరమింపబడి, పని చేయక దాని మూలంలో పుట్టుక చోటులో లీనమై ఉంటుంది. మనసు పనిచేయక మనకు కాలస్పృహ లేదు. మన కాల, కాలగమన స్పృహలు రెండూ తలపుల రూపమే. భావాత్మకం మాత్రమే.

మనం ఎదగడం, ఇతర ప్రకృతి పరిణామాలు పదార్ధము, శక్తి యొక్క పరిణామం వల్ల జరుగుతున్నాయి గాని మనం గణిస్తున్న కాలగమనం వల్ల కాదు. అలా ప్రవహిస్తోంది అని మనం అనుకునే కాలం, దాని గణన మన కల్పితం. నిజము కాదు. దాని వల్ల, దాని ప్రవాహం వల్ల ఏ ప్రకృతి, విశ్వ, మానసిక పరిణామాలు జరగడం లేదు.

ప్రకృతిలో, విశ్వంలో, మనలో, శక్తి, పదార్ధ పరిణామాలు జరగడం వల్ల కాలము ఏర్పడుతోంది. శక్తి, పదార్థాల యొక్క పరిణామాలు లేక కాలానికి ఉనికి లేదు. అలా మనందరినీ నడిపించే, శాసించే కాలము అంటూ ఏమీ లేదు. కాలః స్పృహ, కాలగమన స్పృహలు మానసిక స్థితి లో జరిగే చిత్ శక్తి (చిదాభాస, మాయ, ప్రణవము, స్పోట దీని అంశలే, అంశాలే, విభూతులే) పరిణామాలే.

కాలము భౌతికము, మానసికము. భౌతిక కాలము మన సృష్టి. మానసిక కాలము మన అనుభూతి. భావము. తలపు. ఆలోచన. పదార్ధ, శక్తి యొక్క పరిణామాలే భౌతిక కాలము. మనసుతో ఈ భౌతిక కాలంతో మనం అహంకార మమకార అహంభావములతో ఏర్పరచుకున్న సంబంధమే మానసిక కాలము.

కాలగమనము నిరపేక్షము, సాపేక్షము అని రెండు విధములు. భౌతిక శాస్త్రం ఈ రెండు కాలగమనముల గురించి చర్చిస్తుంది. వాటి లోతులు, వివరములు భౌతిక శాస్త్రం చదవని వారికి గహనములు.

కాల తత్త్వాన్ని విమర్శించడమూ ఒక ఉపాసనా మార్గమే.

కాలము, కాలాతీతము, వీటి అవగాహన ఒక ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞం.

కృష్ణ పరమాత్మ కాల స్వరూపుడు, కాలాతీతుడూను.

కాలతత్త్వము భగవత్తత్త్వం వలె ప్రియమైనది, పరమైనది, పరమార్థమైనది. మోక్షానికి వీలు కల్పించేది.

కాలము భగవత్స్వరూపము. గుహ్యము.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List