కార్తీక మాసం పరమ పవిత్రం..శ్రీకరం.. శుభకరం.. ~ దైవదర్శనం

కార్తీక మాసం పరమ పవిత్రం..శ్రీకరం.. శుభకరం..


కార్తీక మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవీ పూజ..
.
కార్తీకమాస ఉత్సవాలకు సిద్దమయ్యాయి శివకేశవుల దేవాలయాలు. కార్తీక మాసం సందర్భంగా… ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జామునుంచే పవిత్ర స్నానాలు ఆచరించి… ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. శివనారాయణుల స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.
.
సర్వమంగళకరమాసం కార్తీకం. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో ఏ పనిచేసినా మంచి ఫలితాలు కలుగుతాయయని భక్తుల నమ్మిక. అందుకే ఈ మాసంలో భక్తులు ఉదయాన్నే నదీ స్నానాలు చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి హరిహరులకు పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి సోమావారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులను పరమపవిత్రమైన దినాలుగా భావిస్తారు భక్తులు.
.
దీపం అంటే లక్ష్మీదేవి. ఆ దేవికి సంప్రదాయబద్దంగా పూజలు చేయడం ఆనవాయితి. సర్వసంపదలు అందించే లక్ష్మీదేవిని అనేక రూపాల్లో పూజిస్తారు. ఆమె ఎవరింట్లో ఉంటే ఆ ఇల్లు సర్వశుభ లక్షణాలతో, సర్వసంపదలతో దేదీప్యమానంగా వెలుగొందుతుంది.లక్ష్మీదేవిని అనేక రూపాల్లో పూజిస్తారు. అష్టలక్ష్మీ రూపాల్లో కొలుస్తారు. దీపావళినాడు శ్రీమహాలక్ష్మీ పూజ అత్యంత విశేష ఫలితాలు ఇస్తుంది. పండుగనాటి రాత్రి శ్రీమహాలక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. లక్ష్మీదేవికి గురు, శుక్రవారాలు ప్రీతికరమైనవి. అమ్మను ప్రతిరోజూ ధ్యానిస్తే మనోవాంఛితాలు నెరవేరుతాయి. రోజూ కుదరనివారు కనీసం వారంలో ఆరెండు రోజులైనా అష్టోత్తర, సహస్ర నామాలతో ధ్యానించాలి.
.
నిప్పు, నూనె, వత్తి....
నూనె, నిప్పు, వత్తి కలిస్తే దీపం అవుతుంది. మూడు విడివిడిగా ఉంటే మూడింటికి పరస్పరం విరోధమే. తైలానికి అగ్నితో, వత్తితో అలాగే అగ్నికి, వత్తికి కూడా విరోధం. మూడు కలిస్తేనే దాని ఉపయోగం. విడివిడిగా ఉంటే విరోధపడేవి మూడూ కలిసి ప్రమిదలో ఉన్నప్పుడు చుట్టూ ఎటు చూసినా కాంతిని నింపుతాయి.
.
సృష్టి ...
దీనిలోని జీవకోటి రాజస, సాత్విక, తాపన గుణాలతో కూడికున్నవి. ప్రమిదలో వత్తిలాంటిది సత్వగుణం. నూనె లాంటిది తమోగుణం. మంట లాంటిది సత్వగుణం, నూనెలాంటిది తమోగుణం. మంటలాంటిది రజోగుణం. ఇవన్నీ ఒకటికొకటి గిట్టని గుణాలు. కాని మూడూ కలిస్తే కాంతి నిండుతుంది. మంచిమనిషిగా ఉండాలనుకున్న వారు రజస్, తమో గుణాలని అణచివేసి సత్త్వగుణం ఎక్కువుగా అలవరుచుకోవాలి. అప్పుడా వ్యక్తి జీవితం కాంతిమయమవుతుంది. రాగద్వేషాల్ని ఎప్పటికప్పుడు వదిలించుకుంటే రజోగుణం నశిస్తుంది.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List