తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయో తెలుసా? ~ దైవదర్శనం

తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?

నారదుడు ఒకనాడు విష్ణు మాయని, సంసార బంధాన్ని తెలుసుకోవాలని భావించి విష్ణువుకి తనకోరికని వెల్లడించాడు. విష్ణువు నారద మహర్షి కోరికని మన్నించి భూలోకంలో ఒక కొలను దగ్గరికి వచ్చి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు తన మహతిని విష్ణువుకి ఇచ్చి కొలనులో దిగి స్నానం చేసి స్త్రీ రూపం పొంది తాను నారదుడిని అనే సంగతి మరచిపోయాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదిని అటుగా వెళుతున్న ఒకరాజు చూసి మోహించాడు.


ఓ జగన్మిహిని ఎవరు నీవు? ఎక్కడి నుండి వచ్చావు? మీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగగా ఏమి గుర్తులేని నారది బిత్తర చూపులు చూస్తూ నిలుచుంది. ఆమె అందాన్ని చూసి మోహించిన రాజు ఆమెను వివాహం చేసుకుంటాడు. కాలక్రమంలో వారికి 60మంది సంతానం కలుగుతుంది. వారే ప్రభవ, విభవ అని పిలుచుకునే సంవత్సరాల పేర్లు కలిగిన సంతానం. ఈ సంతానం కలిగిన తరువాత కొన్నాళ్ళకి అనావృష్టి కారణం చేత లేక యుద్ధంలో రాజుతో సహా సంతానం కూడా మరణిస్తారు. మరణించిన వార్త విన్న నారది భర్త మరియు సంతానానికి క్రియలు నిర్వహించి మునుపు ఎక్కడైతే మునిగి నారదుడు నారదిగా మారాడో సరిగ్గా అదే కొలను వద్దకు వచ్చి ఏడుస్తూ కూర్చుంటాడు. ఇదంతా చూస్తున్న విష్ణువు నారది దగ్గరికి వచ్చి కొలనులో స్నానం చేసి రమ్మని చెబుతాడు.


నారది వెంటనే వెళ్లి కొలనులో స్నానం చేసి నారదుడి వలె మారిపోతాడు. ఎదురుగ విష్ణువుని చూసి నమస్కరించి లీలగా స్మురిస్తున్న "తాను నారదిగా మారిన విషయం, రాజు వివాహం చేసుకున్న విషయం, 60మంది సంతానం కలిగిన విషయం" తెలుసుకొని నిజమేనా అని అడుగుతాడు. విష్ణువు జరిగింది చెప్పి అంతా నిజమే అంటాడు. విష్ణు మాయ చేత ఆవరించి ఉన్న నారదుడు సంతానం మీద మోహం వీడలేక చింతిస్తుంటే.. విష్ణువు ఒక వరం ఇస్తాడు.


నీ సంతానం ఆచంద్రార్కం జనులు తలచుకునేలా సంవత్సరాల పేర్లుగా మారతారు. నిరంతరం నీసంతానం యొక్క పేర్లు ప్రజలలో ఏ-ఎప్పటికీ నిలిచి ఉంటాయి అని వరం ఇస్తాడు. ఆ వర ఫలితమే మనం పిలిచే ప్రభవ విభవ అనే సంవత్సరాల పేర్లు.  నారదుడి పుణ్యాన మనకి ఇలా వచ్చాయి మనకి సంవత్సర నామధేయాలు

 ఆయాణముల గురించి....

మన పూర్వికులు సూర్య భగవానుని గమనం ప్రకారం యుగాలుగానూ, యుగాలను సంవత్సరములుగానూ, సంవత్సరములను మాసములుగానూ, మాసములను వారములుగానూ, వారములను రోజులుగానూ, రోజులను జాములుగానూ, జాములను ఘడియలుగానూ కాల గమనాన్ని తెలుసుకోవటానికి విభజించారు. సంవత్సరంలో ఉన్న 12 మాసములను రెండు ఆయనాలుగా విభజించారు.

సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయణం ఏర్పడతాయి. ఒక్కో అయనం ఆరు నెలల పాటు ఉంటుంది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం క్యాలండర్ ప్రకారం ప్రతి జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం అని జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయణం అని అంటారు.దక్షిణాయనంలో దేవతలునిద్రిస్తారు . ఆ సమయంలోనే ఎక్కువ పండుగలు వస్తాయి. ఆ సమయంలో మనం చేసే పూజల కారణంగా దేవతలకు శక్తి లభిస్తుంది.

ఉత్తరాయణంలో దేవతలు మేల్కొంటారు. ఈ సమయం చాలా మంచిది. ఈ సమయంలో శుభకార్యాలు చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఉత్తరాయణంలో దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి వివాహాలు చేయటానికి కూడా మంచి సమయం.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List