మగ వాళ్లకి ప్రవేశం లేని దేవాలయాల గురించి ఆశక్తికరమైన విషయాలు... ~ దైవదర్శనం

మగ వాళ్లకి ప్రవేశం లేని దేవాలయాల గురించి ఆశక్తికరమైన విషయాలు...

కొన్ని ఆలయాలలో కేవలం ఆడవాళ్ళకు మాత్రమే అనుమతి, మగవాళ్లకు ఎంట్రీ ఉండదు*. మగవాళ్ళు రాకుండా కాపలాదారులు ఉంటారు.

1). *రాజస్థాన్ లోని పుష్కర్ లో బ్రహ్మ దేవుడు ఆలయం* బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్కన ఉండదు. బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు. అందువలన *సరస్వతి దేవికి ఆగ్రహం వచ్చి, ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని శపిస్తుంది*. అందుకే మగవాళ్ళు వెళ్లరు.

2). *కన్యాకుమారి లో దేవీ ఆలయం* లో ప్రధాన దేవత దుర్గా మాత అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు. ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు. గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.

3). *కేరళలో చెంగన్నూర్ భగవతీ ఆలయం* ఇక్కడ అమ్మవారికి గుడ్డ కప్పినప్పుడు అది ఎర్రగా మారుతుందట. *అమ్మవారు రుతుస్రావం ఆచరించారని తెలుసుకొని గుడిని ప్రతి నెల మూడు రోజుల పాటు* మూసేస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. నాలుగోరోజు ఆడవారు విగ్రహానికి పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత మగ పూజారులు వచ్చి అభిషేకం నిర్వహిస్తారు.

4). *కేరళ లో అట్టుకల్ దేవాలయం లో పార్వతి దేవి* కొలువై ఉంటుంది. ఒక్క మగాడూ కూడా వెళ్లరు... కాదని వెళితే  పాపాలు చుట్టుకుంటాయని వారి భావన. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు.

5). *కేరళ లో దుర్గా దేవి (చక్కులాతుకవు) దేవాలయం*. ప్రతీ సంవత్సరం  వారం రోజులపాటు *అమ్మవారికి నారీ పూజ* చేస్తారు. మహిళలు వారం రోజులపాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు; మగవాళ్ళు ఉండరాదు.

6). *బీహార్ లోముజఫర్ పూర్ పట్టణంలో అమ్మ* వారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు. మగవారిని అనుమతించరు.

 7). At *Sabarimalai Ayappa Temple - Ladies (10 to 50 yrs) are Not Allowed*.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List