చేతులతో ఆహారాన్ని తినటం వలన లాభాలు. ~ దైవదర్శనం

చేతులతో ఆహారాన్ని తినటం వలన లాభాలు.

మన పూర్వీకుల ప్రవర్తనల వెనుక విస్తారమైన జ్ఞానం ఉందని తెలుస్తుంది.మీ చేతులతో తిన్నఆహారం శరీరమునకే కాక మనస్సుకి కూడా మేత.
చేతులతో తినడం వెనుక ఒక కారణం ఉంది. చేతులతో తినడం అభ్యాసం ఆయుర్వేదిక బోధనల నుండి ఉద్భవించింది. వేదాల ప్రకారం శక్తి అనేది చేతిలో వుంటుంది. చేతులతో ఆహారం తినడం ఒక పురాతన హిందూ స్థానిక సంప్రదాయం లో ప్రబలంగా ఉన్న ఒక ముద్ర నుండి తీసుకోబడింది. ముద్రలు అనేవి ధ్యాన సమయంలో లేదా భారత నృత్య శాస్త్రీయ రూపమైన భరతనాట్యంలో చాలా ప్రముఖమైనవి.

చేతులు అనేవి చర్యలు నిర్వహించడానికి అత్యంత విలువైన అవయవాలుగా భావిస్తారు. ఈ విషయం ఒక వేద ప్రార్థనతో ముడిపడి ఉంది "కరగ్రే వసతే లక్ష్మీ కరములె సరస్వతి కరమధ్యేతు గోవిందః ప్రభతె కరదర్శనం" (మీ వేళ్ల చివర సరస్వతి దేవి, మధ్యలో గోవిందుడు, మరియు కొన వద్ద లక్ష్మీదేవి ఉంది అని అర్ధం); మన అరచేతులు చూసి వర్ణించు శ్లోకం ఇది. దైవత్వం మానవ ప్రయత్నంలో ఉంది అని సూచిస్తుంది ఈ శ్లోకం.
మన చేతులు మరియు కాళ్ళు ఐదు మూలకాల గొట్టాలుగా చెప్పబడినవి. ఆయుర్వేద గ్రంథాలు, ప్రతి వేలు ఐదు మూలకాల యొక్క పొడిగింపుగా భోదిస్తుంది. బొటనవేలు (అగ్ని) ( మీరు చిన్న పిల్లలని వారి బొటనవేలు చప్పరించ్డం చూసి ఉండవచ్చు, వారికి జీర్ణక్రియ భౌతికంగా సాధ్యపడనప్పుడు, ప్రకృతి చేసే సహాయం), చూపుడు వేలు (గాలి), మధ్య వేలు (ఈథర్- మానవ శరీరంలో చిన్న కణ ఖాళీలు), ఉంగరం వేలు (భూమి) మరియు చిటికెన వేలు (నీరు) సూచిస్తాయి.

ఆహారం తినటప్పుడు అంతర్గత జీర్ణక్రియలో వెళ్ళే ముందు ప్రతి వేలు ఆహారం తాకటం వల్ల రూపాంతరం చెందుతుంది. వేళ్లనందు ఆహరం తీసుకోవడం వలన ఐదు అంశాలు ఉద్దీపన కావింపబడి అగ్ని చేత జీర్ణ కారి ఆహ్వానింపబడుతుంది. జీర్ణక్రియ అభివృద్ధితో పాటు రుచి, వాసనల ద్వారా మనసు చేతన అవుతుంది మరియు ఇది తినడం యొక్క ఆనందం పెంచుతుంది.

పూర్వం పెద్దలు, ఆహార పదార్ధాలు కొలవడానికి పాత్రలను వాడేవారు కాదు. పాత్రలకు బదులుగా పరిమాణం కొలిచెందుకు వారి చేతులు ఉపయోగించడానికి ఇష్టపడేవారు. ఇది ఎందుకంటే, ఒక చేతిలో పట్టే ఆరహం శరీరానికి తగిన శక్తి అందించడానికి సరిపోతుంది. మొత్తం 6 విధములైన కొలతలు ప్రాచురణ వున్నవి. ఇవి ఆహార , పిండి మరియు వితానల యొక్క నిర్దిష్ట కొలత కొలిచేందుకు సరిపోతాయి.

హిందూ మత సంస్కృతిలో ఇలాంటి ఒక ప్రధాన ఉదాహరణ అసాధారణంగా అనిపించవచ్చు, కాని ఇలా అనేక విషయాలను విసదీకరిస్తే, మన పూర్వీకుల ప్రవర్తనల వెనుక విస్తారమైన జ్ఞానం మొత్తం తెలుస్తుంది.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive