భగవన్నామ సంకీర్తన సమయ వృథా కాదు. ~ దైవదర్శనం

భగవన్నామ సంకీర్తన సమయ వృథా కాదు.

భగవన్నామ సంకీర్తన విలువ తెలియని వారు దానిని సమయం వృథా చేయటం అనుకునే అవకాశం ఉంది. అలాగే.. ‘చిన్న వయసులో వృత్తి వ్యాపారాల్లో నిమగ్నమైనవారికి నామ సంకీర్తన ఎట్లా కుదురుతుంది? రిటైరైన తరువాత, వృత్తి వ్యాపారాలనుంచి వైదొలగిన తర్వాత ఏ బరువు బాధ్యతలూ లేని వయసులో పూజాపునస్కారాలు, నామసంకీర్తన చేసుకోవచ్చు గదా’ అనుకునే వారూ ఉంటారు. కానీ, అది సరైన ఆలోచన కాదు. పదవీ విరమణ చేసే సమయానికి శరీర పటుత్వం తగ్గుతుంది. అవయవాలు సరిగా పనిచేయవు. ప్రతి పనికీఇతరులపై ఆధారపడవలసిరావచ్చు. అపుడు దైవ సన్నిధి, ఆధ్యాత్మిక సాధన ఎట్లా కుదరడం కష్టమవుతుంది.

చిన్ననాటి నుండి మహానగరంలో ఉంటూ గ్రామీణ వాతావరణం, వ్యవసాయ విధి విధానాలు ఏ మాత్రం తెలియని ఒక యువకుడు అవసరార్థం ఒక కుగ్రామానికి ప్రయాణమయ్యాడు. రైలు, బస్సు ప్రయాణాలు పూర్తయ్యాయి కొంత కాలినడక తప్పనిసరి అయ్యింది. పొలాల గట్ల మీదుగా, పనులు చేసుకుంటున్న రైతులు, కూలీలను గమనిస్తూ హుషారుగా నడుసున్నాడు. ఒక చోట ఒక వృద్ధ రైతు నారుమడిని బాగా దుక్కిచేసి ఒక బస్తాధాన్యం గట్టుపై ఉంచి దాని నుంచి బుట్టలో కొంత ధాన్యం తీసుకొని మడిలో చల్లుతున్నాడు. నారుపోయడమంటే ఏంటో తెలియని ఆ యువకుడికి అది ఆశ్చర్యాన్ని కలిగించింది. ధాన్యం వృథాగా మట్టిపాలవుతోందని భావించి రైతు వద్దకు వెళ్లి.. ‘ధాన్యాన్ని అలా మట్టిలో పోస్తున్నారెందుకు?’ అని అడిగాడు. అతను చూసింది తాత్కాలిక సత్యం. అప్పటికప్పుడు ధాన్యం మట్టిలో కలుస్తున్న మాట వాస్తవం. నిజమైన ఫలితం, సత్యం రైతుకు తెలుసు. ఆ బుట్టెడు ధాన్యంతోనే పుట్లకొద్దీ ధాన్యాన్ని పండించవచ్చని తెలుసు. సదా భగవన్నామ సంకీర్తన చేసే భక్తులు ఆ రైతువంటివారు. ఆ విలువ తెలియని వారు ఆ యువకుని వంటివారు. నామ సంకీర్తన విలువ తెలిసిన వారికి అది సమయం వృథా చేయడం కాదు. జీవితాన్ని పండించుకోవడం. ఈ విషయాన్ని ఎంత త్వరగా తెలుసుకుని ఆచరిస్తే అంత మంచిది.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...