దీపావళి. ~ దైవదర్శనం

దీపావళి.

లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తెల్లని వస్త్రాలను ధరించి దీపావళి పండుగ జరుపుకోండి...
మీ గృహంలోనికి మహాలక్ష్మి కాలిఅందియలతో ఘల్లుఘల్లుమని రావాలని ఉందా..!!
మీ అప్పులు తీరాలంటే.. దీపావళి నాడు లక్ష్మీపూజ చేయండి..!!
భారతీయుల పండుగులలో ముఖ్యమైనది దీపావళి పండుగ. వయోభేదం లేకుండా, కులమతాలకతీతంగా చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా, గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం అనే తారతమ్యం లేకుండా అంతా కోలాహలంగా యావత్భారతదేశం అంతా ఐకమత్యంగా జరుపుకునే ఏకైక పండుగ ఈ దీపావళి పండుగ.
నరకాసురుడు అనే రాక్షసుని సంహారంతో, ప్రజలు ఈతిబాధల నుండి విముక్తి పొందటంవల్ల, ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగే ఈ దీపావళి పండుగ. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీతాసమేతుడై అయోధ్యకు తిరిగి రావటంతో, సీతమ్మ ఒక దీపాన్ని వెలిగించటంతో, ఆ రాజ్యంలోని ప్రతీ ఇంటిలోనూ దీపాలు వెలిగించి అందరు ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ చేసుకున్నారు అని ఒక కథనం. జగతిలోని చీకటిని పారద్రోలి, దీపాలతో అంతటా వెలుగును నింపే పండుగ కనుక ఈ పండుగను దీపావళి పండుగ అని అంటారు. ఈ పండుగను ప్రతీ సంవత్సరము ఆశ్వయుజ అమావాస్య నాడు జరుపుకుంటారు. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి.దీనినే నరక చతుర్థశి అంటారు.
ఈ దీపాలని పెట్టడంలో రెండు అర్థాలు దాగి ఉన్నాయి. చీకటితో నిండి ఉండేది నరకం కాబట్టి, చీకటి నిండియున్న ఈ అమావాస్యలో పితృదేవతలందరికీ త్రోవని చూపించేందుకు దీపాలని పెడతారు అని ఒక విశేషం. ఇక రెండోది -- లక్ష్మీదేవికి దీపాలంటే చాలా ప్రీతి. ఇంటినిండుగా దీపాలున్న గృహమంటే ఆమెకు ఎంతో ఇష్టం.
పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుడు ఇచ్చిన ఆతిథ్యానికి సంతోషపడి, ఒక విలువైన హారాన్ని ప్రసాదించాడు.ఇంద్రుడు దానిని అహంభావముతో తన దగ్గర ఉన్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కినుజ్జు నుజ్జు చేసింది. అది చూసిన దుర్వాసమహర్షి ఆగ్రహముతో దేవేంద్రుని శపిస్తాడు. శాప ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని ఏం చెయ్యాలో పాలుపోక మహావిష్ణువుని ప్రార్థిస్తాడు. విషయం గ్రహించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సలహా ఇస్తాడు.ఇంద్రుడు విష్ణువు చెప్పినట్లే చేయగా, లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. నిన్ను ఏ విధంగా పూజిస్తే నీ కృపకు పాత్రులమవుతాము?? అంతట మహాలక్ష్మి " త్రిలోకాథిపతీ.!. "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి కోర్కెలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, సంతానాన్ని కోరే వారికి సంతానలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలునిఅవుతాను" అని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించి, దిబ్బు దిబ్బు దీపావళి.......మళ్ళీ వచ్చే నాగులచవితి...అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి, లేదా ఆముదం కొమ్మలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి, దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజామందిరంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి, దీపాలకి నమస్కరించి, లక్ష్మీదేవిని శాస్త్రోక్తంగా పూజిస్తారు. (లక్ష్మీదేవికి తెల్లని వస్త్రాలంటే చాలా ఇష్టం. అందుకని దీపావళి నాడు తెల్లని బట్టలని ధరించాలని శాస్త్రం చెబుతున్నది.) పూజానంతరం అందరూ ఉత్సాహంగా రకరకాల బాణాసంచా కాల్చుతారు.ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి మన పురాణాలలో ఒక ప్రయోజనం చెప్పబడింది. ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశించి, వాతావరణం ఆహ్లాదంగా ఏర్పడుతుంది. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి వారు కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు.
మీ అప్పులు తీరాలంటే.. దీపావళి నాడు లక్ష్మీపూజ చేయండి..!!
ఈ జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. అందుచేత దీపావళి రోజున జ్యోతి స్వరూపమైన మహాలక్ష్మిని పూజిస్తే అప్పులు తీరడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.
కాబట్టి దీపావళి నాడు ఐదు గంటలకు నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి తెలుపు దుస్తులను ధరించాలి. పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరములో ముగ్గులు పెట్టుకోవాలి.
పూజకోసం ఉపయోగించుకునే పటములకు గంధము, కుంకుమతో అలంకరించుకోవాలి. పూజమందిరములో కలశముపై తెలుపు వస్త్రమును కప్పాలి. ఆకుపచ్చని రంగు పట్టుచీరను ధరించిన కూర్చుకున్న లక్ష్మీదేవి బొమ్మను లేదా పటాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్ర పద్మములు, తెల్ల కలువపువ్వులు, గులాబిపువ్వులు.. నైవేద్యానికి కేసరీబాత్, రవ్వలడ్డులు, జామకాయలు సిద్ధం చేసుకోవాలి.
పూజకు ముందు శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ మహాలక్ష్మీ అష్టకం, కనకధారాస్తవము, శ్రీ సూక్తము, శ్రీ లక్ష్మీ సహస్రనామములతో లక్ష్మీదేవిని స్తుతించాలి. లేదా.. “ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః” అనే మంత్రాన్ని 108 మార్లు జపించాలి. పూజా సమయంలో తామర మాల ధరించి, ఈశాన్య దిక్కున తిరిగి చేయాలి.
దీపావళి నాడు సాయంత్రం ఆరు గంటలకు పూజ చేయాలి. దీపారాధనకు వెండి దీపాలు, తామరవత్తులు, ఆవునెయ్యిని ఉపయోగించాలి. నైవేద్యము సమర్పించి పంచహారతులివ్వాలి. అలాగే దీపావళి రోజున అష్టలక్ష్మీదేవాలయం, కొల్హపూర్, విశాఖ కనకమహాలక్ష్మీదేవి ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
దేవాలయాల్లో కుంకుమపూజ, శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ, వైభవలక్ష్మీ, లక్ష్మీ కుబేర వత్రము, శ్రీ మహాలక్ష్మికి 108 కలువపువ్వులతో పూజ చేయించేవారికి ఈతిబాధలు తొలిగిపోయి.. సమస్త సంపదలు, వంశాభివృద్ధి వంటి శుభ ఫలితాలుంటాయి.
ఇంకా దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో.. ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని పండితులు చెబుతున్నారు. అటువంటి పుణ్య దిన సాయంసంధ్య కాలమందు లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు తొలుత దీపాలు వెలిగించి.. శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజ చేసి
“చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్ ||”
అని ధ్యానించి.. తులసీ పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయడం వల్ల మహాలక్ష్మి కాలిఅందియలు ఘల్లుఘల్లుమని ఆ గృహంలో నివాసముంటుందని విశ్వాసం.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List