శివలింగ పూజ (1) ~ దైవదర్శనం

శివలింగ పూజ (1)

శివలింగం అంటే పురుషాంగం లేదా  మర్మాంగం అని, ప్రకృతిలోని పునరుత్పత్తి శక్తికి సంకేతం అని జనబాహుళ్యంలో నమ్మకం ఉంది. ఇది ఉపేక్షింపరాని, తీవ్రమైన పొరపాటు మాత్రమే కాదు, తీవ్రమైన తప్పు కూడా. వేదకాలం తర్వాతి కాలంలో, లింగం అనేది శివుని పునరుత్పత్తి శక్తికి చిహ్నముగా మారింది. లింగం అనేది తారతమ్యము చూపే గుర్తు కావచ్చు, కాని అది కామానికి సంకేతం కాదు. మీరు లింగపురాణంలో చూస్తే, "ప్రధానం ప్రకృతిర్ యదాహుర్-లింగముత్తమం; గంధవర్ణరసైర్హీనం శబ్ద-స్పర్శ-విరాజితం" అని ఉంటుంది. ఆదిలో ఉన్న లింగం ముఖ్యమైనది మరియు వాసన, వర్ణం(రంగు), రుచి, వినికిడి (శబ్దము), స్పర్శ మొదలైనవాటికి అతీతమైనది. దాన్నే ప్రకృతి అనేవారు.

లింగం అంటే సంస్కృతంలో సంజ్ఞ/ గుర్తు/ చిహ్నము. అది ఒక ఉహను/ అనుమానాన్ని వ్యక్తపరిచే చిహ్నము. మీరు నదిలో పెద్ద వరదను చూస్తే, ఆ ముందురోజు భారీవర్షాలు కురిశాయని అనుమానం వ్యక్తం చేస్తారు. మీరు పొగను చూసినప్పుడు, నిప్పు ఉందని అనుమానిస్తారు/ ఊహిస్తారు. అనంతమైన రూపాలతో ఉన్న ఈ సువిశాలమైన ప్రపంచమే సర్వశక్తిమంతుడైన భగవంతుని లింగము (చిహ్నము). శివలింగం అనేది శివునికి చిహ్నము. మీరు ఒక్కసారి లింగాన్ని చూస్తే, మీ మనస్సు ఒక్కసారిగా ఉన్నత స్థితికి వెళ్ళి, మీరు స్వామి గురించి ఆలోచించడం మొదలుపెడతారు.

నిజానికి శివుడు నిరాకారుడు. ఆయనకు తనకంటూ ఒకరూపం లేదు, కానీ అన్నీ ఆయన రూపాలే. అన్ని రూపాల్లో శివుడు వ్యాపించి ఉన్నాడు. ప్రతి ఆకారం లేదా రూపం శివ లింగమే లేదా శివస్వరూపమే.

మనస్సును ఏకాగ్రం చేయటానికి శివలింగంలో అద్భుతమైన, గుహ్యమైన శక్తి ఉంది. అంజనం వేయడంలో మనస్సు ఎలాగైతే సులువుగా కేంద్రీకరించబడి ఉంటుందో, అలానే శివలింగం వైపు చూడగానే మనస్సు ఏకాగ్రతను పొందుతుంది. ఆ కారణంతోనే భారతీయ ప్రాచీన ఋషులు లేదా ద్రష్టలు, శివాలయాల్లో లింగాన్ని ప్రతిష్టించాలని సూచించారు.

శివలింగం తప్పులకు ఆస్కారం లేని మౌనం భాషలో "నేను అద్వీతీయుడను (రెండవది అనేది లేకుండా ఒక్కటైన ఉన్నావాడు), నిరాకారుడను" అని మీకు చెబుతోంది. శుద్ధమైన, పవిత్రమైన ఆత్మలు మాత్రమే ఈ భాషను అర్ధం చేసుకోగలవు. తక్కువ అవగాహన లేదా జ్ఞానం కలిగి కామంతో నిండిన ఉత్సాహంగల, అశుద్ధడైన విదేశీయుడు "ఓహ్! హిందువులు జననాంగాన్ని పూజిస్తారు. వాళ్ళు అమాయకులు, వాళ్ళకు తత్త్వజ్ఞానం లేదు" అని దూషణగా అంటాడు. విదేశీయులు తమిళం కానీ లేదా ఏ ఇతర భారతీయ భాష నేర్చుకున్నా, ముందు అతడు కొన్ని భూతు మాటలను ఏరుకుంటాడు. అది అతని ఉద్రేకమైన గుణం. అలాగే, ఉత్సాహం కల విదేశీయుడు, పూజించే చిహ్నాల్లో కూడా లోపాలు వెతుకుతాడు. లింగం అనేది నిరాకారుడు, అవిభాజ్యుడు, సర్వవ్యాపకుడు, సనాతనుడు, మంగళుడు, నిత్యశుద్ధుడు, ఈ సమస్త విశ్వంలో ఉన్న అమరత్వ సారమైనవాడు, మీ హృదయకుహరంలో కూర్చున్న మరణంలేనివాడు, నీ అంతర్యామి, లోపల దాగున్న ఆత్మ, పరంబ్రహ్మం అయిన పరమశివుని యొక్క బాహ్యచిహ్నము.  
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List