అంకాల‌మ్మ చ‌రిత్ర‌. ~ దైవదర్శనం

అంకాల‌మ్మ చ‌రిత్ర‌.


క‌డ‌ప జిల్లా, ఖాజీపేట మండ‌లం, బి.కొత్తప‌ల్లె గ్రామంలో పురాత‌న మైన మ‌హిమ గ‌ల గ్రామదేవత అంకాల‌మ్మ గుడి క‌ల‌దు. గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదులనుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత - గ్రామదేవత అంకాల‌మ్మ.
అంకాల‌మ్మ పూజావిధానం తరతరాలుగా వస్తున్న గ్రామీణ సంప్రదాయం. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్ఠికి మూల కారకురాలు మాతృదేవత అంకాల‌మ్మ అని గ్రహించిన గ్రామస్తులు ఆమెను భ‌క్తి శ్ర‌థ్ద‌ల‌తో పుజ‌లు చేస్తారు.
పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది. అందుకని ఈపంచభూతాలకి ప్రతీకలుగా ఐదుగురు అవ‌తారాల గ‌ల గ్రామదేవత అంకాల‌మ్మ ఎలిసిన‌ది.
పృధ్వీ దేవతఫ‌....
పృధ్వీ అంటే నేల, ఇది పంటకి ఆధారము,కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన ప్రుధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర,గోగునార...ఇవే వారి జీవనఆధారము కాబట్టి ఆపేరుతో గోగులమ్మ ని యేర్పాటు చేసారు.జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండేప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము,అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను ఇస్తూవుండడము, దాన్నేసొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము ... ఇలా సాగుటతూవుండేదీ వ్యవస్థ. పంటవేసేటప్పుడుకూడా ఈతల్లిని ఆరాదిస్తేగాని చేనుకి వెల్తూండేవారుకాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది. ఇక పంటలన్నీ చేతికందినాక సుఖసంతోషాలతో జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.
జల దేవత.....
జలానికి సంభందించిన తల్లి గంగమ్మ--గంగానమ్మ. ఈ తల్లి భూమి మీదకాక భూమిలోపల ఎంతో లోతుగావుంటుంది. గుడిఎత్తుగాకట్టినా తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.
అగ్ని దేవత.....
మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మ నూ, రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. సూరమ్మను ప్రతీ అమావస్యనాడు,పున్నమ్మ ను ప్రతీ పౌర్ణమినాడు పూజించే విదముగా ఏర్పాటు చేసుకొని తమ కులవ్రుత్తిని ఆరోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడికన్నుసూర్యుడుగానూ ఎడమకన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళమ్మ (సూర్య,చంద్రుల కల వున్న అమ్మ).
వాయు దేవత....
నాలుగవది వాయువు కరువలి అంటే పెద్దగాలి. కొండప్రాంతములోవుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ వుపద్రవము వుండకుండా రక్షించేందుకు కరువలమ్మ ను యేర్పాటు చేసుకున్నారు.
ఆకాశ దేవత....
ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు,మెరుపులు,గాలివాన..ఇలాంటివాటినుండి రక్శించేందుకు ఈ తల్లి ని యేర్పాటు చేసుకున్నారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List