ఆగమశాస్త్రానుసారం స్వామిని పత్ని, పుత్ర పరివార సహితంగానే ఆరాధన చేయాలి అదేవిధంగా వాహనం కూడా తప్పనిసరి. అందువలనే నిత్య బ్రహ్మచారి అయిన హనుమంతునికి కూడా భార్య, కుమారుడు, వాహనం, ద్వారపాలకులు, సైన్యాధిపతి, అంగరక్షకులు ఉన్నారని చెప్పడం ఆరాధన కోసం ఏర్పరిచనది మాత్రమే. ఆంజనేయునికి ఒంటె వాహనం అనడంలో ఒక వైశిష్ట్యం ఉంది. తాగిన నీటిని ఆరు నెలలు తన కడుపులోనే దాచుకోగల నైపుణ్యం ఒంటెకు ఉంది. అనగా మనకు లభించిన దానినంతా ఒకేసారి అనుభవించకుండా అవసరమున్నంత మేరకే వాడుకోవాలి అన్న సందేశం ఒంటె ద్వారా తెలుసుకోవచ్చు. ఒంటె నందికి మారు రూపు. శివుడు హనుమంతుడైతే నంది ఒంటెగా అవతరించి హనుమకు వాహనం అయ్యింది.
తెలియని కొత్త విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు
ReplyDelete