October 2018 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

శ్రీగురుస్తోత్రం.

అఖండమండలాకారం
వ్యాప్తం యేన చరాచరమ్ !!
తత్పదం దర్శితం యేన
తస్మై శ్రీగురవే నమః!!
 || 1 ||

అఙ్ఞానతిమిరాంధస్య 
ఙ్ఞానాంజన శలాకయా !!
చక్షురున్మీలితం యేన
 తస్మై శ్రీగురవే నమః!!
|| 2 ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్దేవోమహేశ్వరః!!
గురురేవ పరంబ్రహ్మ
 తస్మై శ్రీగురవే నమః!!
|| 3 ||

స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్!!
తత్పదం దర్శితం యేన
 తస్మై శ్రీగురవే నమః!!
 || 4 ||

చిన్మయం వ్యాపియత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్!!
తత్పదం దర్శితం యేన
 తస్మై శ్రీగురవే నమః!!
 || 5 ||

త్సర్వశ్రుతిశిరోరత్న
 విరాజిత పదాంబుజః !!
వేదాంతాంబుజసూర్యోయః
తస్మై శ్రీగురవే నమః!!
|| 6 ||

చైతన్యః శాశ్వతఃశాంతో వ్యోమాతీతో నిరంజనః!!
బిందునాద కలాతీతః
 తస్మై శ్రీగురవే నమః!!
|| 7 ||

ఙ్ఞానశక్తిసమారూఢః
 తత్త్వమాలా విభూషితః!!
భుక్తిముక్తిప్రదాతా చ
 తస్మై శ్రీగురవే నమః!!
|| 8 ||

అనేకజన్మసంప్రాప్త కర్మబంధవిదాహినే!!
ఆత్మఙ్ఞానప్రదానేన
 తస్మై శ్రీగురవే నమః!!
 || 9 ||

శోషణం భవసింధోశ్చ
 ఙ్ఞాపణం సార సంపదః!!
గురోః పాదోదకం సమ్యక్
తస్మై శ్రీగురవే నమః!!
 || 10 ||

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః!!
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి
 తస్మై శ్రీగురవే నమః!!
 || 11 ||

మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుఃశ్రీజగద్గురుః!!
మదాత్మా సర్వ భూతాత్మా
తస్మై శ్రీగురవే నమః!!
|| 12 ||

గురురాదిరనాదిశ్చ గురుః
 పరమ దైవతమ్!!
గురోః పరతరం నాస్తి
 తస్మై శ్రీగురవే నమః!!
 || 13 ||

త్వమేవ మాతా చ
 పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ
 సఖా త్వమేవ!!
త్వమేవ విద్యా
 ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం
 మమ దేవ దేవ!!
|| 14 ||

Share:

27 నక్షత్రాలు పేర్లు.

1.అశ్విని
2.భరణి
3.కృత్తిక
4.రోహిణి
5.మృగశిర
6.ఆరుద్ర
7.పునర్వసు
8.పుష్యమి
9.ఆశ్లేష
10.మఖ
11.పూర్వఫల్గుణి
12.ఉత్తర
13.హస్త
14.చిత్త
15.స్వాతి
16.విశాఖ
17.అనూరాధ
18.జ్యేష్ట
19.మూల
20.పూర్వాఆషాఢ
21.ఉత్తరాషాఢ
22.శ్రవణము
23.ధనిష్ట
24.శతభిష
25.పూర్వాభద్ర
26.ఉత్తరాభద్ర
27.రేవతి.
Share:

జ్యోతిషం అంటే ఏమిటి, అది నమ్మకమా శాస్త్రమా..?

గ్రహ గతుల ఆధారంగా మనిషి జీవన విధానాన్ని, ఆనందంగా, ఆరోగ్యంగా సమస్యలు లేకుండా జీవించటానికి మార్గాన్ని తెలిపేది జ్యోతిషం. దాన్ని పాటించటం పాటించక పోవటం అనేది వ్యక్తిగత అంశం. ఒకరికి ఒక సమయంలో మాత్రమె అనుభవం అయితే అది నమ్మకం అవుతుంది కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మందికి అనుభవం అవుతున్నది నమ్మకమో శాస్త్రమో మీరే నిర్ణయించాలి.

ప్రశ్న: నేను జ్యోతిషాన్ని నమ్మను అయినా బాగున్నాను కదా?
సమాధానం: ముందుగా ఒక విషయం జ్యోతిషాన్ని నమ్మటం కాదు ఆచరించటం అని చెప్పండి. అది నమ్మకం కాదు పూర్తి స్థాయి శాస్త్రం. మనం ఆరోగ్యంగా ఉన్నంతకాలం వైద్యాన్ని, సమస్యలు లేనంత కాలం జ్యోతిషాన్ని నమ్మక పోవటం లేదా ఆచరించక పోవటం పెద్ద విషయం కాదు. కాని ఆరోగ్యం చెడిపోగానే డాక్టర్ దగ్గరికి పరుగెత్తటం సమస్య రాగానే జ్యోతిష్కుని దగ్గరికి పరుగెత్తటం చేయకుండా ఉంటాను అనే నమ్మకం ఉంటే జ్యోతిషాన్ని కాని వేరే ఏ ఇతర శాస్త్రాల్ని కాని, నమ్మటం పాటించటం అవసరమే లేదు. జ్యోతిషం బాగున్న వారికొరకు కాదు, బాగుండాలనే వారి కొరకు మాత్రమె.

ప్రశ్న: జ్యోతిషంలో చెప్పేవి అన్ని అవుతాయా, అది ఖచ్చితంగా ఫలిస్తుందా?

సమాధానం: హైదరాబాద్ కు బయల్దేరిన బస్సు హైదరాబాద్ కు చేరుతుందా అంటే చేరుతుంది అనే సమాధానమే వస్తుంది. కాక పొతే చేరటానికి ఎంత ప్రాబబిలిటీ ఉందొ చేరక పోవటానికి కూడా అంటే ప్రాబబిలిటీ ఉంటుంది. బస్సు చెడిపోవచ్చు, పెట్రోల్ అయిపోవచ్చు, దారిలో రోడ్ రిపేర్ ఉండొచ్చు... అలాగే జ్యోతిషం లో కూడా మనం ఇచ్చే వివరాలు చేసే విశ్లేషణ ని బట్టి ఫలితం ఉంటుంది. జ్యోతిషం నూటికి నూరుపాళ్ళు ఫలిస్తుంది కాని పైన చెప్పినట్టు అన్ని సరిగా ఉన్నప్పుడు మాత్రమె అది ఫలిస్తుంది.

 ప్రశ్న: జ్యోతిషం ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చా?

సమాధానం: ఖచ్చితంగా మార్చుకోవచ్చు కానీ జ్యోతిషం ఆధారంగా మన జీవన విధానాన్ని మార్చుకున్నప్పుడే అది సాధ్యం అవుతుంది. అలాగే ఈ మార్పు కూడా ఒక పరిధిలోనే ఉంటుంది. మన కర్మ ను అనుసరించే జ్యోతిషం ఫలిస్తుంది. మనకు రాసి పెట్టిన వాటిలో హెచ్చుతగ్గులుగా ఫలితాన్ని మార్చుకునే స్వేచ్చ మన పురాకృత కర్మ కల్పిస్తుంది. హైదరాబాద్ వెళ్ళే బస్ ఎక్కి విజయవాడకి వెళ్ళాలంటే కుదరకపోవచ్చు కానీ, హైదరాబాద్ బస్ లో మంచి సీట్ లో కుర్చుని మన ప్రయాణాన్ని సమస్యలు లేకుండా సాగేలా చేసుకోవచ్చు. జ్యోతిషం ప్రభావం కూడా ఇలాగే ఉంటుంది మనకు నిర్దేశించిన జీవితం వీలైనంత ఆనందంగా గడపటానికి జ్యోతిషం సహకరిస్తుంది.

ప్రశ్న: నేను హిందువును కాదు, జ్యోతిషాన్ని నమ్మొచ్చా?

సమాధానం: నమ్మొచ్చా కాదు, పాటించోచ్చా అని అడగండి. జ్యోతిషం పూర్తిస్థాయి శాస్త్రం దానికి కుల, మత, జాతి ప్రాంత భేదాలు లేవు. ప్రతి మనిషికి సమస్య ఒకేలా ఉన్నప్పుడు శాస్త్రం వేరు వేరుగా ఉండదు కదా. జ్వరం వస్తే అందరు ఒకే రకమైన మందులు వాడతారు కానీ, మతం వేరైనంత మాత్రాన వైద్యం వేరు కాదు కదా? జీవన విధానంలో మార్పు ఉండవచ్చు కాని సమస్యలలో మార్పు ఉండదు కాబట్టి సమస్యలకు మూలం ఏమిటి దాని పరిష్కారం ఏమిటి అని తెలుసుకోవటానికి నిరభ్యంతరంగా ఎవరైనా జ్యోతిషాన్ని అనుసరించవచ్చు.

ప్రశ్న: జ్యోతిషాన్ని పాటించకుంటే ఏమవుతుంది?

సమాధానం: ప్రళయం రాదు, సునామీ కూడా రాదు. పాటించటం పాటించక పోవటం వ్యక్తిగత విషయం. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుంది, జ్యోతిషం కూడా అంతే పాటిస్తే జీవన ప్రయాణం ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా హాయిగా సాగుతుంది, పాటించక పోయినా సాగుతుంది కానీ...

ప్రశ్న: జ్యోతిషంలో చెప్పే పరిహారాలు నిజంగా ఫలిస్తాయా?

సమాధానం: ఫలానా వ్యాధికి ఫలానా చికిత్స అని వైద్యం చెపుతుంది అలాగే జ్యోతిషం కూడా ఫలానా సమస్యకు ఫలానా పరిష్కారం చేస్తే సమస్య తొలగి పోతుంది అని చెపుతుంది. వైద్యం ఎలా అయితే ఫలితం ఇస్తుందో జ్యోతిషంలో చెప్పే పరిహారాలు కూడా అంటే ఫలితం ఇస్తాయి. మనం వైద్యాన్ని, పరిహారాల్ని ఆచరించే విధానాన్ని బట్టి ఫలితం ఉంటుంది.

 ప్రశ్న: జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది?
సమాధానం: జ్యోతిషం ఏ విషయంలో అయిన సూచన చేస్తుంది. ఇలా చేస్తే మంచి జరుగుతుంది అని. చేయకుంటే మంచి జరగదా అంటే మనం మంచి అనుకునే దాన్ని బట్టి జరుగుతుందా జరగదా అనేది ఉంటుంది. వివాహ విషయంలో జ్యోతిష శాస్త్రకారులు కొన్ని ఖచ్చితమైన నియమాలు పెట్టారు. వివాహం అయిన తర్వాత సమస్యలు రాకుండా ఉండటానికి అలాగే ఆరోగ్యవంతులైన సమాజానికి ఉపయోగపడే సంతానాన్ని పొందటానికి వారు ఈ నియమాలు పెట్టారు. పైన చెప్పినట్టు దేన్నీ అయినా పాటించటం పాటించక పోవటం వ్యక్తిగత విషయం కానీ సమాజ శ్రేయస్సు కొరకు ఏర్పాటు చేయబడిన నియమాలే తప్ప దీనిలో నియమాలు పెట్టిన ఋషుల వ్యక్తిగత స్వార్థం కానీ చెప్పే జ్యోతిష్కుల వ్యక్తిగత స్వార్థం కానీ లేదు అనేది అర్థం చేసుకుంటే మంచిది.

ప్రశ్న: రత్నాలు ధరిస్తే నిజంగా అదృష్టం కలిసి వస్తుందా?

సమాధానం: ముందు అదృష్టం అనే దానికి మీకు సరైన అర్థం తెలిస్తే అది కలిసి వస్తుందో లేదో తెలుస్తుంది. మన శ్రమ లేకుండా అయాచితంగా వచ్చేది ఏది కూడా అదృష్టం కాదు అని గుర్తు పెట్టుకోండి. అడుక్కునే బిచ్చగాడు కూడా కష్టపడి నాలుగు ఇండ్లు తిరిగి అడుక్కుంటాడు అయాచితంగా, శ్రమ లేకుండా అదృష్టం కలిసి రావాలి అనుకోవటం అడుక్కోవటం కంటే హీనం. ఏ రత్నం కూడా అదృష్టాన్ని ఇవ్వదు. రత్న శాస్త్రం చెప్పేది ఏమిటంటే ఒక గ్రహం మనకు అనుకూలంగా ఉండి బలహీనంగా ఉండటం వలన అది కారకత్వం వహించే అంశాలలో పూర్తి స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు కాబట్టి దానికి సహాయకంగా ఫలితాన్ని పెంచుకోవటానికి ఆ గ్రహానికి సంబంధించిన రత్నం ధరించటం మంచిది అని. అంతే కాని రాయి ధరించగానే తెల్లారే సరికి ఏ రాజో, మంత్రో అయిపోరు. అలా అవుతారు అని ఎవరైనా చెపుతున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని గ్రహించండి. అన్నింటికంటే ముఖ్య విషయం అదృష్టాన్ని డబ్బుపెట్టి కొనుక్కోవలనుకోవటం కంటే మూర్ఖత్వం మరోటి ఉండదు.
Share:

శ్రీ హనుమ కధామృతము 8

శ్రీ పరాశర మహ్హర్షి మైత్రేయునికి హనుమ కధ ను వివరించారు .మాఘ మాసం లో రుద్రునికిష్టమైన ఆరుద్రా నక్షత్రం లో ,ఫాల్గుణ మాసం లో పునర్వసు నక్షత్రం లో ,చైత్రం లో పుష్యమి నక్షత్రం లో ,సూర్యుడికిస్తమైన హస్తా నక్షత్రం లో శ్రీ హనుమద్ వ్రతాన్ని చేయాలి .జ్యేష్ట మాసం లో మృగశిర ,ఆరుద్ర ,పునర్వసు ,పుష్యమి ,హస్త నక్షత్రాలలో వ్రతం చేయ వచ్చు .ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి .నేలపై పడుకోవాలి .ఇంద్రియాలను అదుపులో వుంచుకోవాలి .హనుమాన్ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి .అయిదుగురు సద్బ్రాహ్మణులకు  శక్తి కొలది దానం ఇవ్వాలి .అయిదు అప్పాలు ,అయిదు పండ్లు తో వాయనం ఇవ్వాలి .అయిదుగురు బ్రహ్మచారులకు సమారాధన చేయాలి .హనుమద్ వ్రత కధలను పతించాలి .హనుమద్ సహస్రనామ ,అష్టోత్తరాలతో,సువర్చల అష్టోత్తరం తో పూజించాలి .పంపా తీరం లో వ్రతం చేస్తే ఫలితం బాగా వుంటుంది .లేక పొతే ఒక కలశం లో పంపా జలాన్ని ఆహ్వానించి ,పంపానదికి అష్టోత్తర పూజ చేయాలి .కలశం మీద పదమూడు ముళ్ళు గల తోరాలను వుంచి దాని పూజ చేయాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మగవాళ్ళు కుడి చేతికి ,ఆడ వాళ్ళు ఎడమ చేతికి తోరం కట్టుకో వాలి . ”ఏ పుత్ర పౌత్రాది సమస్త భాగ్యం —వాన్చంతి వాయోస్తనయం ప్రపూజ్య —త్రయోదశ గ్రంధి యుతం తదంకం –బద్నంతి హస్తే వర తోర సూత్రం ” అనే మంత్రాన్ని పతిస్తూ భార్య భర్తకు ,భర్తకు భార్య తోరం కట్టాలి .ఆంజనేయుని వాహన మైన ఒంటె ను కూడా పూజించాలి.

”గంధ మాదన శైలాగ్ర –స్వర్ణ రంభా వనాశ్రయం —ఉష్ట్రం ధ్యాయేత్ సదా వంద్యం —హనుమద్ వాహనోత్తమం ”అని ఉష్ట్ర ధ్యానం చేయాలి .

వ్రతం ప్రారంభం లో కలశ ప్రతిష్ట చేయాలి .అష్ట దిక్పాల పూజ చేయాలి .నవగ్రహ పూజ కూడా చేయాలి .అంతా అయిన తర్వాత ప్రసాదం నైవేద్యం పెట్టాలి అందులో అప్పాలు ,పులిహోర పరవాన్నం వుండాలి .నీరాజనం ఇవ్వాలి .తర్వాత మంత్ర పుష్పం ఇవ్వాలి .వ్రతం రోజూ ఇల్లు కాని ,ఆలయం కాని రంభా వనం తో అంతే అరటి పిలకలతో అలంకరించాలి .ఆయన్ను రంభావన విహారి అంటారు కదా అందుకు .పూజ లో తమలపాకులు ఎక్కువ వినియోగించాలి
వీటినే నాగవల్లి దళాలు అంటారు ..చివరికి భక్తీ శ్రద్ధలతో ప్రసాదం తినాలి .అంతకు ముందు తీర్ధం తీసుకోవాలి .శటారి పెట్టిన్చుకోవాలి .ఇలా శ్రీ హనుమద్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే తీరని కోరికలు తీరుతాయి .చివరికి మోక్షం లభిస్తుంది .ఇవన్నీ మన మహర్షులు చెప్పిన మాటలు .కనుక విశ్వాసం తో చేయాలి.
Share:

నాంది శ్రాద్ధ భోజనం.

ఒకసారి పరమాచార్య స్వామివారు చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గరలోని చిన్న తిప్ప సముద్రం అనే ఊళ్ళో మకాం చేస్తున్నారు. అక్కడి ప్రజలు దాన్ని ఊరిపేరుతో కాకుండా సి.టి.యస్ అని పిలిచేవారు. దగ్గరలోనే శంకర జయంతి కూడా ఉండేది. దాన్ని దృష్టిలో ఉంచుకుని మహాస్వామి వారి పరమభక్తులైన శ్రీ కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు, నేను చెన్నై నుండి బస్సులో సి.టి.యస్ కు బయలుదేరాము.

శ్రీ కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు ఆయన సహోదరుడు ఇద్దరూ సంస్కృత పండితులు. వారు ఆంధ్రదేశానికి చెందినవారు. వారి విద్వత్తు మహాస్వామి వారికి బాగా తెలుసు. ఆయన తరుచుగా మహాస్వామి వారి దర్శనానికి వచ్చేవారు.

మేము అక్కడకు వెళ్ళిన రెండు రోజులకు శంకర జయంతి రాబోతోంది. అప్పుడు అక్కడ మహాస్వామి వారి కైంకర్యం చెయ్యడానికి ముగ్గురు మాత్రమే ఉన్నారు. ప్రతిరోజూ దర్శనానికి దాదాపు నలభై మంది దాకా వచ్చేవారు.

ఆ ఊళ్ళో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయనది చాలా పెద్ద కుటుంబం. శ్రీవారికి పరమ భక్తుడు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు అతని ఇంటనే బస చేసి, భోజనాదులు చెయ్యడానికి ఏర్పాటు చేశాడు. శంకర జయంతిని పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. శ్రీ కల్లూరి వీరభద్ర శాస్త్రి గారిని వాక్యార్థం గురించిన ప్రవచనం చెప్పవలసిందిగా ఆదేశించారు స్వామివారు.

భగవత్పాదులకు శంకర అను నామము కటపయాది సంఖ్యాన్ని అనుసరించి పెట్టారని పరమాచార్య స్వామివారే స్వయంగా చెప్పారు. విరై దానంగా వడ్ల ధాన్యాన్ని పంచిపెట్టారు. తరువాత అందరమూ ఆ ధనికుని ఇంటికి వెళ్లి భోజనాదులు ముగించాము.

మరుసటిరోజు ఆ ధనికుని ఇంట్లో ఆయన మనవడి ఉపనయన కార్యక్రమం ఉంది. ఉపనయనం రోజు ఉదయం మహాస్వామివారు వ్యక్తిగత సహాయకులైన రామకృష్ణన్, శ్రీకంఠన్ లను పిలిచి, “వాళ్ళ ఇంటిలో ఈరోజు ఉపనయనం. ఇక్కడకు దర్శనానికి వచ్చిన భక్తులను ఉపనయనం అయిన ఇంటిలో భోజనం చెయ్యకండి అని చెప్పండి. మీరు ఇద్దరూ వండి, అందరికి ఆహారం పెట్టండి” అని ఆజ్ఞాపించారు. ఈ విషయాన్ని ఆ ధనికునికి కూడా తెలపమని ఆదేశించారు.

విషయం విన్న ఆ ధనికుడు హతాశుడయ్యాడు. “మావల్ల ఏ తప్పిదము జరిగింది?” అని అతని వేదన. శంకర భక్తులను ఆకలి తీర్చే పుణ్యాన్ని కోల్పోయాము అని అతని బాధ.

బాధతో దాదాపుగా ఏడ్చే పరిస్థితిలో ఉన్నాడు. అతని బాధని పరమాచార్య స్వామివారికి తెలిపారు. అందుకు స్వామివారు, “ఉపనయనం జరిగే ఇంటిలో నాంది శ్రాద్ధం చేస్తారు. నాంది జరిగిన ఇంటిలో ఇతరులు భోజనం చెయ్యరాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే భోజన ఏర్పాట్లు ఇక్కడ చెయ్యమని మీకు చెప్పాను” అని విశదపరచారు స్వామివారు.

ఈ శాస్త్ర సంబంధిత విషయాన్ని అందరికి స్వామివారు ఇలా తెలియజేశారు. శాస్త్ర సంబంధ విషయాల్లో ప్రావీణ్యం ఉన్నవారికి ఎంతోమందికి ఈ విషయం తెలియదని మనకు స్పష్టమవుతుంది.

“తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యా కార్యా వ్యవస్థితౌ”
Share:

జైన దేవాలయం.

జైన దేవాలయం స్పష్టమైన పాలక్కాడ్ యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే ఒక చారిత్రక స్మారక చిహ్నం.ఇది పాలక్కాడ్ పట్టణం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇక్కడ జైన్మేడు అనే సుందరమైన ప్రదేశం ఉంది.అలాగే ఈ పేరు చంద్రనాథ ఆలయం ద్వారా ప్రసిద్ధి చెందింది. దేశంలో ఉన్న జైన్ ఆలయాలలో అన్నింటిలో కన్నా బాగా పురాతనమైనది.జైనమతం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
జైన దేవాలయం గ్రానైట్ తో మరియు 500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది నమ్ముతారు. ఆలయం 32 అడుగుల పొడవు మరియు 20 అడుగుల వెడల్పు కలిగిన ఈ నిర్మాణం అద్భుతమైన విషయం. చంద్రనాథన్,విజయలక్ష్మి నాథన్,రిషభ మరియుపద్మావతి విగ్రహాలతో పాటు జైన్ తిర్తంకరాస్ మరియు యక్షినిస్ చిత్రాలు ఆలయం లోపల చూడవచ్చు.
ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం కుమరన్ అసన్,అతని పురాణ కవిత వీణా పూవు వ్రాసి ఉంటుంది. అత్యంత ప్రఖ్యాత కవి అతను.జైన్మేడు ఉన్నప్పుడు నుండి కేరళ సాహిత్య చరిత్రలో ఉన్న ఏకైక కవి కుమరన్ అసన్.పరిసర ప్రాంతంలో నివసించిన 400 జైన్ కుటుంబాలు జైన దేవాలయం ఆరాధనలో నిమగ్నమై ఉన్నాయి.చరిత్ర ప్రేమికులకు జైన దేవాలయం ఒక మంచి సందర్శన ప్రదేశం.
Share:

వేద భారతి..

మత సాంస్కృతిక, పునరుజ్జీవ ఉద్యమంలో ఆర్య సమాజ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి పలికిన నినాదం 'గో బ్యాక్‌ టు వేదాస్‌' నేటి స్పీడ్‌ యుగంలో స్వామి దయానంద సరస్వతి అంటే ఎవరో తెలియదు. తెలుసుకోవాలనే జిజ్ఞాస అంతకన్నా లేదు. అందుకే మనం కొంతవరకైనా పిల్లలకు కాస్త తీరిక చేసుకుని హిందూ ఔన్నత్యాన్ని గురించి తెలుపుదాం.
అసలు వేదాలు అంటే ఏమిటి? వేదాలను ఎవరు రచించారు? వాటికి, హిందూ మత సాంప్ర దాయానికి మధ్య సంబంధాలు ఏమిటి? అనే విషయం చాలామందికి తెలియదు అంటే అది అతిశ యోక్తి కాదేమో అన్నది నా అభిప్రాయాయం మాత్రమే.
భారతదేశ పూర్వ చరిత్రను తెలుసుకోవడానికి మనకు లభించిన మొట్టమొదటి లిఖిత పూర్వక ఆధారం. ''వేదాలు'' ఇవి మొదట ఋషుల విరచితాలు. తదుపరి వీటిని సంస్కృత భాషలో రచించారు. ''వేదం'' పదం ''విద్‌'' అనే సంస్కృత భాష నుండి ఉద్భవించింది. ''విద్‌' అనగా జ్ఞానం, వేదం కాలం నాటి జాతిని ఆర్యజాతి అంటారు.
అసలు ఈ ఆర్యులు ఎవరు? ఎక్కడ నుండి వచ్చారు? భారతజాతిలో ఎలా కలిసిపోయారు? అనే ప్రశ్నలకు జర్మన్‌ చరిత్రకారుడు మాక్స్‌ ముల్లర్‌ తన రచనలలో సమాధానం చెెప్పారు. ఆర్యులు సెంట్రల్‌ ఆసియా మయిన్మార్‌ నుండి ఉత్తరాన ఉన్న హిమాలయాలలో ఉన్న కనుమలను దాటి ఉత్తర భారతదేశంలోకి వచ్చినట్లుగా మనకు ఆధారాలు లభించాయి.
ఆర్యులు ముఖ్యవృత్తి పశువుల పెంపకం. ఆ పశువుల మేత కొరకు ఉత్తర భారతదేశంలోకి రావడం జరిగింది. అప్పటికే అక్కడ స్థిరపడి ఉన్న ద్రావిడ జాతి లేదా సింధు ప్రజలను తరిమివేసి ఆ భూ భాగాన్ని ఆక్రమించినట్లుగా మనకు కొంతవరకు ఆధారాలు కన్పించాయి.
ఋగ్వేదంలో విశ్వామిత్రుడు ఇంద్రునితో ''ఈ ద్రోహులను సంహరింపుము'' అన్న వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా ఆర్యుల మాతృభాష సంస్కృతం, సంస్కృతం నుండి పుట్టినవే ఇప్పుడున్న ఉత్తరాది భాషలు. దక్షిణాది భాషలు ద్రావిడము నుండి పుట్టిన భాషలు. అంతెె కాకుండా ఋగ్వేదంలో ఆర్యులు నివసించిన ప్రాతం ''సప్తసింధునదీ ప్రాంతం'' అని ప్రస్తావించడం జరిగింది. అనగా ఉత్తర భారతంలోని సింధునది దాని పరివాహక ప్రాంతంలో ఆర్యులు నివసించి నట్లుగా మనకు తెలుస్తుంది. సింధునది దాని ఉపనదులు ఆరు. రావి, బియాస్‌, సట్లజ్‌, చీలం, చీనాబ్‌ సరస్వతి నది. ఈ సరస్వతి నది తర్వాత అంతర్వాహక నదిగా మారి పోయింది.
వేదాలు నాలుగు: 1. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం
ఋగ్వేదం : ఈ వేద కాలంను తొలివేద నాగరికత అని కూడా పిలుస్తారు. ఈ వేదం క్రీ||పూ 3000 స||ము కాలం నాటిది. దీనిలో 1028 స్తోత్రాలు, 10 మండలాలలో విభజింపబడి ఉన్నాయి. సుప్రసిద్ధ గాయత్రీ మంత్రం కూడా ఋగ్వేదం లోనిదే. ఈ కాలంలో సుప్రసిద్ధ దేవతలు ముఖ్యంగా ఇంద్రుడు (స్వర్గలోకాధిపతి) అగ్ని, రుద్రుడు (శివుడు) సోమదేవుడు
సామవేదం : సామవేదం భారతీయ సంగీతానికి మూలం. దీనిలో ఋగ్వేదంలో ఉన్న స్తోత్రాలకు మంత్రోచ్ఛరణ ఉంటుంది. పూజారులు యజ్ఞ యాగాది సమయాలలోను, క్రతువులలోనూ జపించవలిసిన మంత్రోచ్ఛారణ ఉంటుంది.
యజుర్వేదం: యజ్ఞాలలో, క్రతువులలో బ్రాహ్మణులు లేదా పూజారులు అనుసరించవలసిన నియమాల గురించి, వాటి పవిత్రత గురించి, పూజా కార్యక్రమానికి సంబంధించిన వస్తువులు లేదా సామాగ్రి గురించి తెలుపుతుంది.
అధర్వణవేదం : ఇది భారతీయ వైద్యానికి మూలమైనది. దీనిలో వ్యాధులు, రోగాలు, దెయ్యాలను పారద్రోలే మంత్రాలు ఉంటాయి.
ఋగ్వేదం మినహా మిగిలిన మూడు వేదాలను మలివేద నాగరికత అంటారు. వేదాలు హిందూ మతానికి సంబంధించిన పవిత్రతను గురించి మనకు తెలుపుతున్నాయి. ఈ ఆర్య నాగరికత తర్వాత కాలాన్నెె ఇతిహాస యుగం అంటారు. అనగా రామాయణ మహాభారతాల కాలం.
పవిత్రమైన వేదాలు మనకు అందించిన సంస్కృతీ సాంప్రదాయాలు ఎంతో విలువైనవే కాకుండా ఆచరింప యోగ్యమైనవి, పవిత్రమైనవి. వాటిని అనుసరించి మనం మన జీవితాలను మెరుగుపరుచు కుందాం. దైవ చింతన, దైవభీతి, మనస్సాక్షి ఉన్న ఏ మానవుడు కూడా ఏ రకమయిన తప్పు చేయడు అన్నది మాత్రం అక్షరసత్యం.

Share:

వేంకటేశ్వర చరితం శతానంద భరితం.

శతానందుడు జనకునితో 'మహారాజా! నారదమహర్షి చెప్పిన ఈ ఉపాఖ్యానాన్ని వాల్మీకి మహర్షితోపాటు యితర మునులం దరూ విని ఆనందించి వారంతా సంతృప్తులై వేంకటాచలానికి వెళ్ళారు. నేను వారి అను మతి తీసుకొని మిథిలా నగరానికి వచ్చాను. నేను విన్నదంతా మీకు చెప్పాను. ఈ విధంగా శరీరాన్ని పులకరింప జేసే అద్భుతమైన ఈ చరిత్రను విని జనకమహారాజు సంతోషించి తన పురోహితు డైన శతానందునితో 'మహాత్మా మీరు చెప్తున్న కథను వింటుంటే నాకు తృప్తి కలగడం లేదు. కావున మరల ఆ వేంకటె శ్వరుని గురించి చెప్పండి' అని అడిగాడు. అప్పుడు శతానందుడు మిథిలాధిపతియైన జనకమహారాజుతో 'మహారాజా! సవిస్తరంగా చెబుతాను. సావధానంగా వినండి!
పూర్వం నిమిపుత్రుడైన జనక మహారాజుకు వామదేవమహర్షి యజ్ఞం జరుగుచున్నపుడు చెప్పిన కథను నీకు చెబుతాను! అన్నాడు.

భగవదవతారవర్ణన
పూర్వం గంగానదీ తీరంలో వ్రతం పూర్తి చేసు కోనేందుకు అశ్వమేధ మహాయాగ దీక్షను పూని న జనకుని వద్దకు మనులంతా విచ్చేశారు. జన కమహారాజు వారందరినీ పూజించి సంతోషం తో ఆ మహర్షులతో యిలా అన్నాడు- 'మునిశ్రే ష్ఠులారా! ఈ రోజు నా జన్మ సార్థకమైనది నేను చేసిన తపస్సు ఫలించింది. మీరంతా కలిసి మా ఈ యజ్ఞ వాటికకు రావడం మా కెంతో సంతోషం' అనగా విని ముకులందరూ ఎంతో సంతోషించి జనకుని ఆదరానికి సంప్రీ తులై ఆ యజ్ఞశాలలో ఒక రాత్రి గడిపారు.

వారందరూ ఆ రాత్రంతా పరస్పరం అనేక విషయాలు మాట్లాడుకుంటుండగా రాత్రి గడిచి తెల్లారింది.
ఆ మహర్షులంతా ప్రాత:కాల సంధ్యావం దనం చేసి జనకమహార్షి ఉన్న యజ్ఞవాటికకు వచ్చారు. వారంతా శ్రీమన్నారాయణుని కథలను పరస్పరం చెప్పుకొంటూ జనకుని తోపాటు అక్కడ ఆసీనులయ్యారు. అప్పుడు మహాతేజస్సంపన్నుడు, బ్రహ్మర్షి అయిన వామ దేవుడు భూ ప్రదక్షిణం చేస్తూ అక్కడికి వచ్చాడు. వేదపారంగతులైన ఆ మహర్షు లందరూ లేచి నిలబడి నమస్కరించి బ్రాహ్మ ణోత్తముడై ఆ వామదేవునితో మహాత్మా వామదేవా! మిరు ఈ భూమినంతా చుట్టి వచ్చారు. కావున మి ద్వారా శ్రీ మన్నారాయ ణుని పవిత్రమైన దివ్య చరితమును వినాలని కుతూహలపడుతున్నాము. జగత్ప్రభువైన ఆ శ్రీనివాసుడు ఎక్కడ వేంచేసి ఉన్నాడు?

ఈ విషయం తెలుసుకోవటానికై జనక మహా రాజు ఎంతో ఆతురపడుతున్నాడు. కాబట్టి మాకా విషయాన్ని తెలియజేయ వలసింది! అని అడిగారు. ఆ మహర్షలందరూ ఆ విధంగా అడుగగా వామదేవ మహర్షి యిలా చెప్పసాగాడు-

ఇక్కడికి దక్షిణ దిక్కున రెండు వందలయోజనముల దూరంలో నారాయణ పర్వతమనే శ్రేష్ఠమైన పర్వతరాజమున్నది. దాని మీద దేవతలు, గంధర్వులు సిద్ధులు, మహర్షులు ఆహార నియమంతో నివసిస్తు న్నారు. నేను కూడా ఆ వేంకటాచలానికి వెళ్ళాను. అక్కడ అగస్త్యుడు, నారదుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరసుడు, దక్షుడు, జాబాలి మొదలైన మాననీయ మహర్షులందరూ యోగాభ్యాస పరాయణులై తపస్సు చేస్తున్నారు. నేను వారిని దర్శించి వారితో ఓ మహాత్ములారా! మీరందరూ కలిసి ఇక్కడ ఈ పర్వతం మీద ఎందుకు సమావేశమయ్యారు? అని అడుగగా వారంతా నేకేమి సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉన్నారు.

అప్పుడు మహాత్ముడైన అగస్త్యమహర్షి నన్ను పిలిచి యిలా అన్నాడు- 'మేమిక్కడ ఉండటానికి కారణం చెబుతాను విను. యోగులలో శ్రేష్ఠుడైన నారదమహర్షి భగవంతుణ్ణి ఉపాసిస్తూ గోదావరీ తీరంలో కొన్నాళ్ళు ఉన్నాడు. కాని ఆయనకు శ్రీపతి దర్శనం కాలేదు. ఆయన పరలోకమైన వైకుంఠంలో ఆయన కనపడలేదు. దానితో నారదముని ఆందోళన చెంది సనాతనుడైన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి పితామహా! సకల జీవులకు పరమాత్మయైన సనాతనుడైన పరదేవతయైన శ్రీమన్నారాయణుడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి అని అడిగాఉ.
అప్పుడు బ్రహ్మదేవుడు కొంతసేపు ధ్యానం చేసి అంజలిబద్ధుడై నిలిచిన నారదునితో యిలా అన్నాడు- ఓ మహామునీ! భూలోకంలో నారాయణగిరి అనే పర్వతమున్నది. దానిమీద పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో క్రీడిస్తున్నాడు. ఆయనకు ఆ పర్వతంపై ఉండాలని, విహరించాలని చాలా ప్రీతి కలిగింది. కాబట్టి నారదా! నీవా సర్వేశ్వరుడైన జగత్ప్రభువును చూడాలనుకుంటే వేంకటాచలానికి వెళ్ళు!
బ్రహ్మదేవుడు ఈ విధ:గా ఆదేశించగా మునిశ్రేష్ఠుడైన నారదుడు అక్కడి నుంచి బయలుదేరి వేంకటాచలాన్నివస్తున్నాడు. దారిలో మేమందరమూ ఆయనతో కలిశాం మేమంతా కలిసి వేంకటాచలాన్ని చేరాం. ఆ తరువాత చతుర్ముఖబ్రహ్మ దేవతలతో కూడా అక్కడకు వచ్చాడు బ్రహ్మదేవుడు మా అందరితో కలిసి ఆ మహత్తర పర్వతం మీద అవ్యయుడు, నాశరహితుడు అయిన పరమాత్మను వెతుకుతూ సంచరించాడు. కాని ఆ పురుషోత్తముడు కనపడలేదు.

అప్పుడు బ్రహ్మదేవుడు నారదునితోను, మహర్షులమైన మాతోను యిలా అన్నాడు. మహా మునులారా! ఈ పర్వతం మీద ఎన్ని నదులున్నవో ఎన్ని సరస్సులన్నవో శుభప్రదములైన మహా పుణ్య్ర ప్రదములైన పవిత్ర జలములు కల పుష్కరిణులు ఎన్ని ఉన్నవో, చెరువులెన్ని ఉన్నవో, అలాగే బావులు సెలయేళ్ళు, దిగుడు బావులు, మునులు సేవించే పవిత్ర మడుగులు మొదలగునవి ఈ పావనమైన పర్వతం మీద ఎన్నున్నాయో వాటన్నిటిని మీరు సేవిస్తూ ఈ పర్వతమంతా సంచరిస్తూ ఈ పర్వతానికి మీరంతా ప్రదక్షిణం చేయండి. శ్రీహరి మీకు దర్శనమిచేంతవరకూ ఎంతకాలమైనా సరే మిరీ పర్వతంపైనే విహరించండి! అని చెప్పి లోక పితామహుడైన బ్రహ్మదేవుడు తన అనుచరులతో దేవతలతోపాటు అక్కడే అదృశ్యమయ్యాడు.

ఓ జనకమహారాజా! అప్పుడు అగస్త్య మహర్షి యితర మునులతోపాటు అనాది అయిన అపరబ్రహ్మకు నమస్కరించి పరబ్రహ్మస్వరూపుడైన వాసుదేవుని గురించి చింతిస్తూ వృషభాద్రివాసుడైన ఆ దేవదేవులని దర్శించగోరుతూ ఆ పర్వతానికి పశ్చిమ దిక్కుదాటి అక్కడ తపస్సు చేస్తూ దేవదేవుడైన శ్రీమరిని స్మరిస్తూ బ్రహ్మదేవుని పలుకులను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడక్కడ తపస్సుతో పవిత్రులైన బుషులతోను సూర్య సమాన తేజస్సుతో జడలను ధరించిన మునులతో కలిసి ఆ పర్వతం మీద సంచరిస్తూ వాయవ్య దిక్కులో ఒక గొప్ప అద్భుతాన్ని దర్శించాడు.

శుద్ధ స్ఫటికమువలె తెల్లని పాలరాతివలె నున్న ఒక పెద్ద రాయి కనబడింది. అది చూడటానికి ఎంతో అందంగా నున్నగా, విశాలంగా, శుభ్రంగా ఉంది. ఆ రాతిపై ఒక ఆజానుబాహుడు, పర్వతాకారుడు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అతని నేత్రాలు విశాలంగా ఉన్నాయి. భయంకరమైన కోరలు, పెద్దదవడలు, విశాలమైన వక్ష:స్థలం, గొప్ప భుజాలు కలిగి ఉన్నాడు. ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్రని చందనం పూసుకున్నాడు. చంద్రునివలె ప్రకాశిస్తున్న దివ్యమైన రత్న కుండలాలు ధరించాడు. ఎర్రగా మెరుస్తున్న ఆభరణాలను ధరించాడు. అనేక రత్నఖచితాలైన దివ్యాభరణాలతో విరాజిల్లుతున్నాడు. నానాదవిధ రత్నాలతో శోభాయమానమైన కిరీటాన్ని ధరించాడు. మహాభుజ పరాక్రమాలు గల ఆ మహానీయుడు, మహావీరుడు, శ్యామల వర్ణంలో ఉన్నాడు.

అగస్త్య మహర్షి ఆశ్చర్య చకితుడై ఆయనకు మరల మరల తేలిపార చూశాడు. ఆ తరువాత ఆ మహర్షి సత్తముడు సూర్యతేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ దివ్య పురుషునికి (దేవునికి) నమస్కరించి మహాత్మా! ప్రియదర్శనా! మహావీరా! నీవెవరు? ఎవరి పుత్రుడవు? ఎవరివాడవు? మాకు నీ వృత్తాంతాన్ని యథార్థంగా చెప్పు. అబద్ధమాడవదు! అని వినేవారికి ప్రీతికలుగునట్లుగా మధురమైన వాక్కులతో స్తూతిస్తూ తనను ప్రశ్నించిన మహాతేజశ్శాలియైన అగస్త్య మహర్షితో ఆ మహాపురుషుడు ఏమీ మాట్లాడలేదు. ఆయన అగస్త్య మహర్షిని మరల మరల చూశాడు. ఆ మహాత్ములైన మహర్షులందరూ చూస్తుండగానే! మహాతేజశ్శాలియైన ఆ పురుషుడు అంతర్థానం చెందాడు. అది వారికి మహాశ్చర్యం కలిగించింది. అప్పుడు ఆ మునులందరూ ఆశ్చర్యంతో విప్పారిన నేత్రాలు కలవారై ఆహా! ఏమి ఆశ్చర్యం! ఏమి అద్భుతం! మనం ఎటువంటి మహాద్భుత దృశ్యాన్ని చూశాము! సూర్యుని వంటి కాంతికల మహాశ్చర్యకరమైన తన దివ్యరూపాన్ని మనకు దర్శింపజేసి ఆ మహాపురుషుడు తన మాయతో మనలను మోహింప జేసి వెంటనే అదృశ్యమయ్యాడు! అని ఆ మునందరు అనుకుంటూ అద్భుత తేజశ్శాలియైన ఆ దివ్యపురుషునికి, దేవుదేవునికి నమస్కరించి ఆ పర్వతంపై సంచరించసాగారు.

అగస్త్యమహర్షి దేవదేవుడు, సర్వాంతర్యామి, సర్వజీవ హృదయవాసి అయిన ఆ భగవంతుని దర్శించగోరిన వాడై మునులందరితో కూడి నారాయణాద్రి యొక్క విశాలము, నిర్మలమునైన పశ్చిమదిక్కును వదలి ఆ మహర్షి సత్తముడు, బ్రాహ్మణోత్తముడు, మహాత్ముడు ఆ పర్వతం ఉత్తర దిక్కునకు చేరాడు.

భగవదన్వేషణ
మహాతేజశ్శాలియైన అగస్త్య మహర్షి మునులందరితో కూడి ఆ వేంకటాచలంపై సంచరిస్తూ ఆ పర్వతం ఉత్తర భాగంలో ఆశ్చర్యకరమైన అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. అక్కడ నేరేడు వృక్షాల పెద్దపెద్ద కొమ్మలు వ్రేలాడుతున్నాయి. ఆ వృక్షాలు తెల్లగా ఉన్నాయి. అక్కడి చెట్లు, లతలు పండ్లు, తెల్లని పూలతో శోభిస్తున్నాయి. నిర్మలమైన నీటితో కూడిన పవిత్రమైన సరస్సులు, పుణ్య ప్రదములు, సర్వపాప హరములు, దర్శనమాత్రం చేతనే శుభాన్ని కలిగించే పుణ్యనదులలో అగస్త్య మహర్షి ఇతర మునులందరితో పాటు శౌచ విధులను నిర్వర్తించి యథావిధిగా శ్రద్ధతో నిర్మలమైన మనస్సుతో వాసుదేవుడైన శ్రీ మన్నారాణుని, శ్రీహరిని మనస్సులో ధ్యానిస్తూ స్నానం చేశాడు.

ఆ తరువాత సంధ్యాది అనుష్ఠానములనన్నింటిని పూర్తి చేసి జగత్ప్రభువైన ఆ కేశవుణ్ణి నిశ్చల చిత్తంతో ఆరాధించాడు. ఆ దేవదేవుని దర్శించుటకై మునులతోపాటు బయలుదేరాడు. ఆ పర్వతమంతా సంచరిస్తూ ఆగిరికి ఉత్తర దిక్కున నానా విధములైన వృక్షములతో శోభిస్తున్న పర్వతాకారములైన మేఘములతో కూడిన, చూచుటకు సుందరమైన దృశ్యాన్ని చూశాడు. మృగాలు, సర్పాలు, కొండచిలువలు, మహానాగులు, పక్షులతో నిండి అనేక పూల తీగలతో అల్లుకుపోయి ఆ ప్రదేశం సుందరంగా ఉంది.

అక్కడ చల్లని వాయువు సుఖంగా వీస్తున్నది. అక్కడి తటాకాల్లోని నీరు చల్లగా ఉంది. భ్రమరాలు (తుమ్మెదలు) ఝుంకారం చేస్తూ పూలలోని మధువును ఆస్వాదిస్తున్నాయి. ఆ కొండగుహల నుంచి బయటకు వచ్చిన కోకిలలు మధురంగా గానం చేస్తున్నాయి. గంధర్వులు సుస్వరంగా పాడుతున్నారు. నెమళ్ళు పెద్దగా పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. రావి, జువి, మారేడు వృక్షాలు, పాటలి వృక్షాలు నిండుగా పూసి పూలతో శోభిస్తున్నాయి.

Share:

ద్రౌపదీదేవి – ఆదర్శ భారతనారి.

మహాభారత యుద్ధములో సర్వనాశనమైన కౌరవపతి దుర్యోధనుని సంతృప్తి పఱచుటకై అశ్వత్థామ తన స్వభావానికి భిన్నముగా ప్రవర్తించి అతి కిరాతకముగా ఉపపాండవులను (పాండవుల పుత్రులు) నిద్రిస్తుండగా వధించినాడు. ఆ ఘోరకృత్యం తెలుసుకున్న పాండవులు ద్రౌపదీదేవి దుఃఖానికి అంతులేదు. పసిపాపలైన బాలకులను నెత్తుటి మడుగులో చూసిన వారి గుండెలు పగిలినాయి. తన పుత్రులందఱినీ పోగొట్టుకుని విలపిస్తున్న ద్రౌపదీదేవిని ఓదార్చాడు అర్జునుడు. “ఇంత దారుణమైన పనిచేసిన ఆ అశ్వత్థామను నీ వద్దకు లాక్కువస్తాను” అంటూ పాఱిపోతున్న ఆ ద్రౌణి నెలకాల బడ్డాడు అర్జునుడు. శ్రీకృష్ణార్జునుల రథము తనను త్వరిత గతిలో సమీపిస్తున్నదని తెలిసిన అశ్వత్థామ ప్రాణరక్షణకై బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప అన్యమేదీ తనను కాపాడజాలదు అనుకుని రథమాపి శుచి అయ్యి ఆచమించి మంత్ర ప్రయోగము చేశాడు. ప్రళయకాల రుద్రునిలా సమీపించే ఆ బ్రహ్మాస్త్రాన్ని చూసి శ్రీ కృష్ణుడు ప్రతి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయమని ఆజ్ఞాపించాడు.

అర్జునుడు కూడా శుచి అయ్యి ఆచమించి పరమాత్మకు ప్రదక్షిణము చేసి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ ఱెండు అస్త్రాలు సూర్యాగ్నుల వలె ప్రజ్వరిల్లాయి. వాటి ప్రభావము చతుర్దశ భువనాలను దహింపగలదని తెలిసిన శ్రీ కృష్ణుడు ఆ అస్త్రాలను ఉపసంహరించమనినాడు. అస్ఖలిత బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణుని ప్రియమిత్రుడైన అర్జునుడు శాస్త్రకోవిదుడు. అందుకే గృహస్థుడైనా కూడా బ్రహ్మచర్యమును పాలించుటచే ఆ ఱెండు బ్రహ్మాస్త్రాలనూ ఉపసంహరించ గలిగినాడు. అలా లోకాలను తన బ్రహ్మచర్య శక్తితో కాపాడిన అర్జునుడు ఆ అశ్వత్థామను బంధించి ద్రౌపదీదేవి ముందుకు తెచ్చి పడేశాడు. చిన్న పిల్లల ప్రాణాలు తీసిన ఆ అశ్వత్థామ ద్రౌపదిముందు సిగ్గుతో తల ఎత్తలేకపోయాడు. పరాన్ముఖుడైన గురుపుత్రునికి నమస్కరించి సుగుణవతియైన ద్రౌపదీదేవి ఇలా ధర్మ్యభాషణం చేసింది

“నాయనా! మీ తండ్రిగారైన ద్రోణాచార్యుల వారి వద్ద మా మగవారు విద్యాభ్యాసం చేశారు. పుత్రరూపములో ఉన్న ద్రోణుడవు నీవు. మాకు గురుతుల్యుడవైన నీవు ఇలా నీ శిష్యనందనులను దారుణముగా వధించడం ధర్మమా? తమకి హాని కలిగించినా ఎదుఱుకోలేని పసివాళ్ళను నీకెన్నడూ అపకారము చేయని అందాలు చిందే పాపలను నిదురించి ఉండగా చంపటానికి నీకు చేతులెలా వచ్చాయి? ఓ గురుపుత్రా! ఇక్కడ నేను నా పుత్రులకై ఏడుస్తున్నట్లే అక్కడ నీ తల్లి కృపి నీకోసం ఎంతగా విలపిస్తున్నదో. అర్జునుడు బంధించి తీసుకు పోయాడన్న వార్త వినగానే ఎంత పరితాపమును చెందినదో”. ఇలా అని శ్రీకృష్ణార్జునుల వైపు చూసి
“ద్రోణాచార్యులవారు స్వర్గస్థులైనా ఇతని మీదే ఆశలుపెట్టుకుని జీవిస్తున్నది ఆ సాధ్వి కృపి. నాలాగే పిల్లవాడి కోసం ఎంతో బాధపడుతూ ఉంటుంది. గురుపుత్రుడైన ఈ అశ్వత్థామను వదిలి వేయండి! గురుపుత్రుని వధించుట ధర్మము కాదు” అని అన్నది పరమ పతివ్రత అయిన ద్రౌపదీదేవి.

ఈ ప్రకారం ద్రౌపదీదేవి ధర్మసమ్మతంగా దాక్షిణ్యసహితంగా నిష్కపటంగా నిష్పక్షపాతంగా న్యాయంగా ప్రశంసనీయముగా పిలికినది. పాంచాలి మాటలు విని ధర్మనందనుడు ఎంతో సంతోషించాడు. భగవంతుడైన శ్రీ కృష్ణుడు ఆమెను ఎంతగానో పొగిడినాడు. అక్కడ ఉన్న అందఱూ ఆమె మాటలను సమర్థించారు. కానీ భీమసేనుడు “కన్న కొడుకులను క్రూరముగా చంపినవాడు కళ్ళముందున్నా కోపం తెచ్చుకోకుండా విడవ మంటుందేమిటి? స్వాభావికముగా దయ ఉన్నవాడే బ్రాహ్మణుడు కానీ ఇలా ఘోరకృత్యం చేశిన ఈ అశ్వత్థామ క్షమార్హుడు కాదు” అంటూ ఆ అశ్వత్థామ పైకి దూకాడు.

తొందరలో ఏమి చేస్తాడో అని ఆ గురుపుత్రునికి అడ్డంగా నిలబడినది ద్రౌపదీదేవి!! శ్రీ కృష్ణుడు చతుర్భుజుడై ఱెండు చేతులతో భీమసేనుడిని మిగిలిన ఱెంటితో ద్రౌపదిని వారించి ఇలా ధర్మబోధ చేశాడు “శిశుఘాతకుడూ కిరాతకుడూ అయిన ఈ అశ్వత్థామ ముమ్మాటికీ చంపదగిన వాడే. కానీ గురుపుత్రుడు పైగా విప్రుడు అయినందువల్ల వీనిని చంపకుండా శిక్షించాలి. ఒక వీరునికి తలగొఱగటం కన్నా అవమానకరమైనది ఏదీ లేదు. ఈతని శిరోజాలు ఖండిచి అవమానించి పంపుదాం”. అప్పుడు విశ్వమంతా కొనియాడ తగ్గవాడూ వీరాధివీరుడూ అయిన అర్జునుడు ఆ అశ్వత్థామ శిరోజాలు ఖండించి అతని శిరస్సుమీదనున్న దివ్య (జ్ఞాన) మణిని తీసుకుని అవమానించి బయటికి గెంటివేశాడు. అనంతరం చనిపోయిన బంధువులందఱికీ దహన సంస్కారాలు చేశి గంగాతీరములో పొంగిపొఱలే దుఃఖాన్ని దిగమ్రింగుకుని మరణించిన వారికి తిలోదకాలిచ్చారు పాండవులు. తరువాత శ్రీ కృష్ణుడు పాండవులని గాంధారీ ధృతరాష్ట్రులని ఓదార్చినాడు. ఇలా శ్రీ కృష్ణుడు మహాభారత యుద్ధం ద్వారా దుష్టశిక్షణ చేశి భూభారాన్ని దించాడు.

పుత్రహంతకుడు కళ్ళ ఎదుటికి రాగానే “గురుపుత్ర! నమస్కారం” అని అనగలిగిన ద్రౌపదీదేవి మనస్సు యొక్క సౌందర్యం వర్ణణాతీతం. అంత దుఃఖములో ఉండికూడా ఏది ధర్మం ఏది అధర్మం అని ఆలోచించి మాట్లాడిన ఆమె ధర్మవర్తనం మనకు ఆదర్శప్రాయం. “నా వలె ఆ కృపి పుత్రుని కోసం ఎంతగా ఏడుస్తుందో” అని దయ జాలి కరుణ క్షమ అనే పదాలకు సీమాంతం చూపి మహాపకారికైనా మహోపకారం చేయగల ద్రౌపదీదేవి వంటి ఆదర్శ నారీమణులు పుట్టిన మన భారతదేశం మహోన్నతమైనది.

Share:

అడుగడుగున గుడివుంది.

వరంగల్‌ జిల్లా కేంద్రానికి 75కి.మీ. దూరంలో ఉన్న ఈ పాలంపేటలో హుందాగా నిలచి ఉన్న ఆలయం రామప్ప గుడి. పూజింపబడే దైవం పేరుమీదో లేక కట్టించిన పాలకుడి పేరుమీదో దేవాలయాలు ప్రసిద్ధమవటం పరి పాటి. కానీ దానికి భిన్నంగా అద్భుతమైన ఈ ఆల యాన్ని అందాల ప్రోవులా రూపకల్పన చేసిన ఆ శిల్పకళా చార్యుడు రామప్ప పేరుమీద రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి కెక్కింది ఈ ఆలయం.
ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు ప్రముఖంగా శైవులు అయినా పరమత సహనం మిక్కుటంగా కలవారు. అంత కన్నా ఎక్కువగా భగవత్భక్తులూను. ఆప్రభువులు రాజ్య మేలిన కాలంలో ఎన్నోదేవాలయాలు ఈ తెలుగు గడ్డపై వెలిశాయి. వాటిలో ఒకటి ఈ అపురూప కళా నిలయమైన ఈ రామప్ప దేవాలయం. కాకతీయ రాజు రేచెర్ల రుద్రదేవుడి కాలంలో జరిగిందీ ఆలయ నిర్మాణం. పుష్పాకారంలో ఉన్న ఈ ఆలయంలోని మూలవిరాట్టు శ్రీరామలింగేశ్వర స్వామి. ఈయనే కొంతకాలం రుద్రేశ్వర నామంతో పూజలందుకున్నాడని కూడా చెప్తారు. గర్భాలయానికి కుడివైపు కాళేశ్వరస్వామి ఆలయం, ఎడమ వైపు కామేశ్వరస్వామి సన్నిది, ఎదుట ఉన్న ప్రదేశంలో నందీశ్వరస్వామి నెలవు ఉన్నాయి. గుడిలోని ప్రతి అంగు ళమూ శిల్పకళా విలాసమే. స్తంభాలపై నాట్యభంగిమల్లోని సౌందర్యాలు, పురాణగాధలు, చారిత్రక ఘట్టాలు మనసెంతో ఆకట్టుకుంటాయి. ఈ ఏకశిలా స్తంభాలపై పేరిణి శివతాండవ దృశ్యాలు ఎంతో మంది నాట్యో పాస కులకు నాట్య విద్య నేర్పే విధంగా ఉన్నాయి. పైకప్పులో కూడా ఎంతో శిల్ప విన్యాసం ఉంది.
Share:

ఓంకారంపై మమకారం.



న్యూయార్క్‌, క్యాలిఫోర్నియా, బోస్టన్‌లో ధెరపిస్ట్స్‌ ఓంకార నాదంపై ల్యాబరేటరీలలో పరిశోధనలు చేశారు. కడుపునొప్పి, మెదడు, గుండె సంబంధ వ్యాధిగ్రస్తులు ఓంకారాన్ని చేసి రోగ విముక్తురైనారట. ప్రొ.జె. మోర్గాన్‌ తన ఓంకార పరిశోధనలో మృత జీవకణాలకు మళ్లిd పునరుజ్జీవనం కల్గిందట. ప్రణవ నాదం వల్ల ఉదరం, ఛాతి మెదడులో కదలికలు కల్గి నూతనోత్తేజం కల్గిస్తాయి. నాస్తికులు కూడా ఓంకార్‌ ధెరపీ వల్ల లబ్ది పొందుతున్నారు. నాభి స్థానం నుండి ఉద్భవించే ఓంకార జపం కంప్యూటర్లకు కూడా అందనిది. న్యూయార్క్‌లోని కొలంబియా ప్రెస్బిస్టీరియన్‌ హాల్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ధెరపిస్టులు రోగులను సర్జరీకి ముందు ఓంకార జపం చేయిస్త్తున్నారు. అంతేకాక, సర్జన్లు, నర్సులలో ఓంకార జపం చేసినందువల్ల 'ఆపరేషన్‌ సస్కెస్‌' ధృడ నమ్మకం కలుగుతుందని డా|| నరేష్‌ ట్రెహాన్‌ తెలియ జేశారు.
ప్రణవం-అభయం
శరీరంలో ఒత్తిడి పెరిగితే, స్టెరాయిడ్స్‌ శాతం పెరుగుతాయి. ఆపరేషన్‌కు ముందు, తర్వాత ధ్యానం, ఓంకారం చేస్తే, స్టెరాయిడ్స్‌ శాతం గణనీయంగా తగ్గుతాయి. డా||హెర్బర్ట్‌ గత 40 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు. వారు మైండ్‌, బాడీ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పారు. వారు హార్వర్డ్‌ మెడికల్‌ స్కూలులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. మంత్ర, యోగ, ధ్యానం ఆవశ్యకతను వారి సంస్థ గురించింది. పూజ్యశ్రీ ఆస్రామ్‌ బాపూజీ రోజూ వారి శిష్యులచేవిధిగా ఓంకారాన్ని జపింప చేస్తారు. వారి కీర్తనలలో ఓం కారం తప్పనిసరి వుంటుంది. ఓంకార నినాదం ఫలితం పరిసర ప్రాంతాలలో తప్పనిసరి కానవస్తుంది.
ఆస్రాం బాపూజీ ప్రేరణ
ఆస్రాంబాపూజీ సత్సంగ సమావేశాలలో ఓంకార సాధనను భక్తులతో తప్పనిసరి చేయిస్తారు. ఓం ఓం ప్రభూజీ, మధుర కీర్తన, హరినామ సంకీర్తనలో ఓంకారం వుంటుంది. శ్రీకృష్ణభగవానుడు శ్రీమద్‌
భగవద్గీతలో 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మ శ్లోకంలో ఎవరైతే అంతిమ ఘడియలలో ఓంకారాన్ని జపిస్తారో వారు మోక్షాన్ని పొందుతారన్నారు.
సామవేదంలోని సన్యాస ఉపనిషత్తులో 'ఎవరైతే ఓంకార జపాన్ని 12 నెలలు చేస్తారో వారు భగవంతుని సాక్షాత్కారం పొందుతారన్నది. మహర్షివేద వ్యాసుడు 'మంత్రాణాం ప్రణవసేతు: అంటూ అత్యంత ప్రాధాన్యాన్ని ఓం కారానికి కల్పించారు. గురునానక్‌ 'ఓంకారమే సిసలైన సత్యం అని వక్కాణించారు. యజుర్వేదం ఓంకారంలో బ్రహ్మయిమిడి ఉన్నాడన్నది. మహర్షి పుష్కరుడు 'ఎవరైతే ఓం కారాన్ని నాభివరకూ నీటిలో వుండి జపిస్తారో వారి సర్వపాపాలు హరిస్తాయన్నారు.
ప్రశాంత మంత్రం
మానసిక అశాంతిని తొలగించటానికి ప్రణవ నాదం బాగా పనిచేస్తుందనేది సాధకుల ద్వారా విశ దమైనది. నాభినుండి వచ్చే తరంగాలు మొత్తం దేహంపై ప్రభావాన్ని కలుగ జేస్తాయి. నిర్మలమైన ప్రదేశంలో కూర్చొని ఓంకారాన్ని నినదిస్తే, చక్కటి ఫలితాలు లభిస్తాయనేది పరిశోధకులు తేల్చి చెప్పారు. ముఖ్యంగా బ్రహ్మముహూర్తాన, గోధూళివేళ అనగా సాయం సమయాన, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఓంకారాన్ని జపించాలి. చెన్నైలోని దివ్యజ్ఞాన సమాజం ప్రణవనాదానికి అత్యంత విలువను ఆపాదించింది. వారి గ్రంథా లయంలో 22, 000 ప్రణవనాద శ్లోకాలను భద్రంగా పొందుపరిచింది.

Share:

సలేశ్వరం.

శ్రీశైలం లొని ఒక యత్రా స్థలము.ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, అద్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యత్రస్థలమ. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలి పౌర్ణమికి మొదలగుతుంది. శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరం లో వుంటుంది. అడవిలో నుండి 25 కిలొమిటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు.. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్నా గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవచ్చరం లో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్షకు లు అందరు ముగ్డులు అవుతారు.
నల్లమల అడవులలో వుంది. హైదరాబాద్-- శ్రీశైలం --- హైదరాబాద్ రహదారిలొ 150 కిలోమీటర్ రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో వుంది. ఆటవీ శాఖ వారి అనుమతితో ఆ దారెంబడి పది కిలోమీటర్ల దూరం వెళ్ల గానె రోడ్డు ప్రక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనబడుతుంది.
అక్కడి పకృతి అందాలకు ముగ్దుడైన నిజాం వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అదిప్పుడు శిధిలావస్తలో వుంది. ఆ ప్రదేశానికి ఫరాహబాద్ అనిపేరు. అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం. అంతకు ముందు దాని పేరు' పుల్ల చెలమల'. 1973 లో 'ప్రాజెక్ట్ టైగర్' పేరిట పులలు సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. అది మన దేశంలోనె అతి పెద్ద పులల సరక్షణా కేంద్రం. నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వఎళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి. అక్కడ రెండు పొడవైన ఎత్తైన రెండు గుట్టలు ఒకదాని కొకటి సమాంతరంగా వుంటాయి. మధ్యలో ఒక లోతైన లోయ లోనికి ఆ జలదార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా అర కిలోమీటరు దిగి తరువాత కక్షిణం వైపుకి తిరిగి పస్చ్మ వైపున వున్న గుట్టపైన కిలొ మీటరు దూరమ్ నడవాలి. ఆ గుట్ట కొనను చ్రు కొన్నాక అమల్లీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టాల మధ్య లోయ లోనికి దిగాల ఆ దారిలొ ఎన్నే గుహలు, సన్నలి జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం. గుండం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్చంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది. గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి వున్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనె ప్రధాన దైవ మైన లింగమయ్య స్వామి లింగం వున్నది. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడ లింగమే వున్నది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, -గంగమ్మ విగ్రహాలున్నాయి.
సలేశ్వరం జాతర సంవత్సరాని కొక సారి చైత్ర పౌర్ణ్మికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు "వత్తన్నం వత్తన్నం లింగమయ్యో" అంటు వస్తారు. వెళ్లేటప్పుడు "పోతున్నం పోతున్నం లింగమయ్యొ" అని అరుస్తూ నడుస్తుంటారు.
నాగార్జున కొండలో బయట పడిన ఇక్ష్యాకుల నాటి అనగా క్రీ.శ. 260 నాటి శాసనాలలో మూస:చుళధమ్మగిరి గురించిన పరస్తావన ఉన్నది. ఆ గిరిపై అనాడు శ్రీ లంక నుండి వచ్చిన బౌద్ద బిక్షవులు కొరకు అరామాలు, విహారాలు కట్టించారట. ఆ చుళ దమ్మగిరి ఈ సలేశ్వరమే నని నమ్మకం. కారణం అక్కడ ఇక్ష్యాకుల కాలపు కట్టాడాలు వున్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16"/10"/3" గా వున్నాయి. అలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనె ఉండేది. . "సుళ" తెలుగులో "సుల" అవుతుంది కాబట్టి బౌద్ద క్షేత్రం శైవ క్షేత్ర్తంగా మార్పు చెందాక సులేస్వరం గా చివరగా సులేశ్వరంగా మారి వుంటుంది. ఇక్ష్యాకుల నిర్మాణాలకు అధనంగా విక్ష్ణు కుండినులు క్రీ.శ.. 360 ---370 కాలపు నిర్మాణాలు కూడ వున్నాయి. వీరి ఇటుకల పరిమాణసం 10'"/ 10"/3" . దిగువ గుహలోని గర్బగుడి ముఖ ద్వారం పైన విష్ణు కుండినుల చిహ్నమగు పూలకుండి శిలాఫలకం వున్నది. ద్వార బందంపై గడప మధ్యన గంగమ్మ విగ్రహం వున్నది. ద్వారం ముందర కుడి పక్కన సుమారు రెండున్నర అడుగుల ఎత్తున నల్లసరపు మీసాల వీరభద్రుని విగ్రహం నాలుగు చేతులలలో నాలుగు ఆయుదాలు వున్నాయి. కుడి చేతిలో గొడ్డలి, కత్తి, ఒక ఎడమ చేతిలో డమరుకం, మరొ ఎడమ చేయి కింది వాలి ఒక ఆయుదాన్ని పట్టుకుని వున్నది. బీరభద్రుని కింద కుడి వైపున పబ్బతి పట్టు కున్న కిరీటం లేని వినాయాకుని ప్రతిమ ఉండగా ఎడమ వైపున స్త్రీమూర్తి వున్నది. ద్వారానికి ఎడమ వైపున విడిగా రెండు గంగమ్మ విగ్రహాలున్నాయి. ఇవే పాతవిగా కనబడుతున్నాయి. ఈ విగ్రహాల ముందు ఒకనాటి స్థిర నివాసాన్ని సూచించె విసురు రాయి వున్నది. గుడికి ఎడమ వై పున గల అరాతి గోడకి బ్రంహీ లిపిలో ఒక శాసనం చెక్కబడి వుంది. కుడివైపున గల గోడమీద ఒక ప్రాచీన తెలుగు శాసనం కూడ వున్నది. ఈ రెండూ విష్ణు కుండినుల శాసనాలుగా తోస్తున్నాయి. వీటిని చరిత్ర కారులు చదివి వివరిస్తే విక్ష్ణుకుండినుల జన్మస్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించ వచ్చు. స్థల మహాత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహాత్యం కావ్యం లో సలేశ్వరాన్ని రుద్ర కుండంగా, దీనికి ఈశాన్యన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణు కుండంగా, పశ్చిమాన గల లొద్ది అనగా గుండాన్ని బ్రంహ కుండంగా పేరొన్నారు. పిష్ణు కుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతపు పేరు పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్ర కారుడు బ్.ఎన్ శాస్త్రి నిరూపించారు. క్రీ.శ. పదమూడవ శతాబ్దాంత కాలం నాటి మల్లికార్హ్జున పండితారాద్య చరిత్ర లో శ్రీపర్వత క్షేత్ర మహాత్యంలో కూడ ఈ సలేశ్వర విశేషాలను పాల్కురి సోమనాధుడు విశేషంగా వర్ణించాడు. 17 వ శతాబ్దాంతంలో మహారాష్ట్రకు చెందిన చత్రపతి శివాజి కూడ ఇక్కడ అశ్రయం పొందినట్లు షానిక చరిత్ర వల తెలుస్తున్నది.
సలేశ్వరం లోయ సుమారు రెండు కిలో మీటర్ల పొడవుండి మనకు అమెరికా లోని గ్రాండ్ క్యానన్ను గుర్తు చేస్తుంది. గ్రాండ్ కానన్ అందాలను చాలమంది మెకన్నాస్ గోల్డ్ సినిమాలో చూసి వుంటారు. సలేశ్వరం లోని తూర్పు గుట్ట పొడువునా స్పష్టమైన దారులు వున్నాయి. అవి జంతువులు నీటి కోశం వెళ్లే మార్గాలని స్థానిక గిరిజనులు చెప్తారు. పడమటి గుట్టలో ఎన్నో గుహలున్నాయి. అవన్నీ కాలానుగుణంగా ఒకప్పుడు ఆది మానవులకు, ఆ తరువాత అబౌద్ద బిక్షవులకు, ఆపైన మునులకు, ఋషులకు స్థావరాలుగా వుండేవని అక్కడి ఆదారాలను బట్టి తెలుస్తుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, చరిత్ర పరిశొధకులకు చాల బాగ నచ్చే ప్రదేశం ఇది.

Share:

కార్తీక సోమవారం రోజున ఈ మహ క్షేత్రాన్ని దర్శించినవారికి మృత్యువు సైతం మీదరికి చేరదు..!!



* పాల సముద్రంలోంచి అమృతం ఉద్భవించగానే అమృతాన్నివినాయకుడు
ఎందుకు దొంగలించాడు..?
* యమధర్మరాజు మరణించిన ప్రదేశం గురించి తెలుసా..?
* పార్వతి దేవిని "అభిరామి" అని ఎందుకు అంటారు..??
* 60వ పెళ్లిరోజు (షష్ఠి పూర్తి ) జరుపు కొనే అలమం గురించి విన్నారా..?
* యమధర్మరాజు తిరిగి జీవితుడైన ప్రదేశం చూశార..!!

సదాశివుడు తన భక్తులను సదా కాపాడుతూ ఉంటాడు. నిస్వార్ధంతో నిరంతరం తన నామస్మరణ చేసే భక్తులను మృత్యువు బారిన పడకుండా రక్షిస్తుంటాడు. తిరుక్కడయూర్ పట్టణం లో అమృతఘటేస్వర్ కోవెలలో యమధర్మరాజు మరణించడం , పున్ఃర్జీవితుడవడం జరిగేయి . ఈ తిరుక్కడయూర్ తమిళనాడు రాష్ట్రం లోని నాగపట్నం జిల్లా లో ఉంది. ఈ తిరుక్కడయూర్ "మైలదుత్తురై "(మాయ వరమ్) నుంచి "పోరయార్ "వెళ్ళేదారిలో మైలదుత్తురై కి 22కిమి.. దూరం , పోరయార్ నుంచి 8కిమి.. దూరం లో ఉంది.

అలయ ముఖ్య ద్వారం లో ప్రవేసించగానే రెండు వైపులా పెద్ద పెద్ద మంటపాలు అవి దాటిన తరవాత గర్భ గుడి ద్వారం. ద్వారం దాటగానే పెద్ద ప్రాంగణం. ఆ ప్రాంగణం లో చిన్న చిన్న మంటపాలు వేసి షష్టి పూర్తి మొదలగు పూజలు జరుగుతూ ఉంటాయి.

ఈ కోవెలలో మూలవిరాట్టు ఈశ్వరుడు "అమృత ఘటేశ్వరుడు "అనే పేరుతో పూజింప బడుతున్నాడు.
పాల సముద్రాన్ని మధించేటప్పుడు దేవతలు వినాయకుడిని పూజింప లేదని అలిగిన వినాయకుడు పాల సముద్రంలోంచి అమృతం ఉద్భవించగానే అమృతాన్ని దొంగిలించి ఇప్పుడు మూలవిరాట్టు ఉన్న చోట దాచుతాడు ,దేవతలు తమ తప్పు తెలుసుకొని వినాయకుడికి పూజలు చేసి కుడుములు నివేదించాగా సంతుష్టుడైన వినాయకుడు అమృతాన్ని దేవతలకు తిరిగి ఇచ్చేస్తాడు. అందుకే కుడి వైపున ఉన్న చిన్న కోవెలలో ఉన్న వినాయకుడిని "దొంగ వినాయకుడు" అని పిలుస్తారు.ఆ అమృత భాండం పెట్టినచోట శివుడు స్వయంభు గా లింగాకారం లో ఉధ్భవించేడు అందుకే ఇక్కడ ఈశ్వరుడిని "అమృతఘటేస్వరుడు అని పిలుస్తారు.

అదే ప్రాంగణం లో ఎడమ వైపున మార్ఖండేయుడు శివుని పాదాలని చుట్టుకొని ఉండగా శివుడు యముడిని సంహరిస్తున్న విగ్రహం ఉంటుంది.ఆ విగ్రహానికి ఎదురుగా బాల యముడి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాల వెనుకనున్న కధ ఇలా చెప్తారు.

"మృగాండు "అనే మహర్షి అతని భార్య "మరుదమతి" సంతతి కొరకై పరమ శివుని ప్రసన్నం చేసుకోనడానికై కఠోర తపస్సు నాచరిస్తారు.వారి తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై వారి కోరిక తెలుసుకొని దీర్ఘాయుశ్శు గల వంద మంది కుపుత్రులు కావాలా? ఆయుశ్శు లేని సుపుత్రుడు కావాలా? అని అడుగగా మృగాండు ముని ఆయుశ్శు లేని ఒక సుపుత్రుడిని యివ్వమని కోరుతాడు.

శివుడు అలానే వరమిచ్చి అంతర్ధానమౌతాడు.కాలక్రమం లో మరుదమతి నెలతప్పి , నెలబాలుని వలె ప్రకాశిస్తున్న కుమారుడికి జన్మనిస్తుంది . ఆ కుమారునికి "మార్ఖండేయుడు "అని నామకరణం గావించి అల్లారు ముద్దుగా పెంచు కుంటూ ఉంటారు. ఆ బాలుడు దిన దినాభివృద్ది చెందుతూ సకల విద్యాపారంగతుడై తల్లితండ్రులకు పేరుతెస్తాడు.అందరు అంతటి సుపుత్రుడికి జన్మనిచ్చినందుకు మృగాఁడు మునిని అతని భార్య మరుదమతిని కొనియాడుతారు. పడునారేడ్ల వయసు వాడవగానే మృగాండు ముని అతనికి గల మృత్యువు గురించి చెప్తాడు. అదివిని మార్ఖండేయుడు తన మిగిలిన జీవితం శివ ధ్యానం లో గడపాలని నిర్ణయించు కొని తపస్సు చేయుటకు అనువైన ప్రదేశం కొరకు వెతుకుచూ స్వయంభూ గా వెలసిన "అమృతఘటేశ్వరుని " అనునిత్యం పూజించాలని నిర్ణయించు కొంటాడు మార్ఖండేయుడు.

నిత్యం కావేరిలో స్నానమాచరించి అమృతఘటేశ్వరుని సేవించుకుంటూ వుంటాడు . మొదటి సారి మహా మృతుంజయ మంత్రం మార్ఖండేయుని ద్వారా ఈ ప్రదేశం లో ఉఛ్ఛరించ బడిందని అంటారు. కాలాంతరాన మారఖండేయుని ఆయుశ్శుతీరి అతనిని తీసుకోని పోవుటకు యముడు పాశాన్ని తీసుకొని మార్ఖండేయుని వద్దకు వస్తాడు. అది చూచి మార్ఖండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకొంటాడు.యముడు మార్ఖండేయునికై వేసిన పాశం శివలింగం పైన పడుతుంది. దానికి క్రోధించిన శివుడు తన త్రిశూలంతో యముడిని వధించుతాడు.యముని మరణం తో ముల్లోకాలు అల్లకల్లోలం అవుతాయి. దేవతలు శివుని ప్రార్ధించి యముని తిరిగి పునఃర్జీవితున్ని చేయమని ప్రార్ధిస్తారు . శివుడు దేవతల కోరికని మన్నించి యముణ్ణి పునఃర్జీవితుణ్ణి గావిస్తాడు. యముడు మార్ఖండేయుని చిరాయువుగా ఆశీర్వదిస్తాడు.



అందుకు ఈ కోవేలని యముని మరణ స్థలము మరియు యముని జన్మస్థలంగా వ్యవహరిస్తారు. మార్ఖండేయుడు చిరంజీవిగా వరం పొందిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఆయుశ్శు హోమం చేయించు కుంటే అకాలమృత్యు దోషం పోతుందని భక్తుల నమ్మకం . అయితే యీ పూజాది కార్య క్రమాలు ఎలా చేయించుకోవాలి ? అంటే ముందుగా మనం ముహూర్తం నిర్ణయించుకొని ఆ రోజుకి కోవెలలో పూజకి స్థలం అద్దెకి తీసుకొవాలి , ఆ స్థలం అమృతఘటెశ్వరునికి యెదురుగానా లేక బయటి మంటపం లోనా అనేదాన్ని బట్టి కోవెల యాజమాన్యానికి అద్దె చెల్లించ వలసి వుంటుంది . నాలుగు జాతుల వారు యీ హోమం చేయించుకోవచ్చు . హోమం జరిపే వేద పండితులని మనం కుదుర్చుకోవాలి , యీ పండితులు బ్రాహ్మణులకు రెండురోజుల క్రతువును , మిగతావారికి వొక రోజు క్రతువును జరుపుతారు . కోవేలలోని స్థలం అద్దెకు తీసుకోవాలన్నా , పండితులను బుక్ చేసుకోవాలన్నా ఆన్ లైన్ లో చెయ్యొచ్చు . తమిళనాడు కోవెళ్ళలో కనిపించే మరో ప్రత్యేకత ఏమిటంటే కోవేలకి ప్రదక్షిణం చేసేటప్పుడు ముఖ్య మందిరానికి ఆనుకొని వున్న గోడలకి నాలుగు వైపులా ముందు దక్షిణామూర్తి , లింగోద్భవం , దుర్గాదేవి విగ్రహాలు వుంటాయి . దుర్గాదేవి కి ఎదురుగా చిన్న మందిరంలో "సంధికేశ్వరుడు " వుంటాడు . భక్తులు తమ కోరికలు సంధికేశ్వరునికి విన్నవించుకుంటే అతను స్వామి వారికి చెప్పి మనకోరికలు తీర్చమని చెప్తాడట . అదే అమ్మవారి కోవెలైతే సంధికేశ్వరి కి కోరికలు విన్నవించుకొవాలిట .



గర్భగుడిలోంచి బయటికి వచ్చేక యెడమ వైపు అమ్మవారి కోవెల ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని "అభిరామి దేవి" అని అంటారు.
అభిరామ భట్టారకుడు అనే మహా భక్తునిచే స్తుతింప బడిందికాబట్టి ఇక్కడ పార్వతి దేవిని "అభిరామి" అని అంటారు.

ఈ కధ ఇలా చెప్తారు....
ఒక నాడు పార్వతీదేవి యొక్క పరమ భక్తుడైన అభిరామ భట్టారకుడు పార్వతీదేవి ధ్యానం లో ఉండి ఆ దేశాన్ని పాలించే మహారాజు రాకని పట్టించుకోడు . మహారాజు అభిరామ భట్టారకుని ఆరోజు తిథి ఏమని అడుగగా అమ్మవారి ధ్యానం లో ఉన్న అభిరాముడు ఆరోజు "అమావాస్య "తిథి కాగా "పౌర్ణమి " అని చెప్తాడు , దానికి ఆగ్రహించిన రాజు అభిరామునికి "శశరీర అగ్నిప్రవేశ " దండన విధిస్తాడు. ఆ శిక్ష లో భాగంగా చెక్కలతో బల్ల పైన కట్టిన చెక్క స్తంభానికి అభిరాముని కట్టి కింద ప్రజ్వలిస్తున్న మంటలో మెల్ల మెల్లగా చెక్క బల్ల కిందకి దింపుతూ పూర్తిగా మనిషి కాలిపోయేవరకు ఆ బల్ల పైనే వుంచుతారు . మంటల వేడికి యీ లోకంలోకి వచ్చిన అభిరామ భట్టారకుడు అమ్మవారిని ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటూ అమ్మవారి పై అష్టోత్తరం చదవడం మెదలు పెడతాడు. ఈ అష్టోత్తరం లో ప్రత్యేకత ఏమిటంటే మొదటి నామం యొక్క అంత్యఅక్షరంతో తరవాత నామం మొదలవుతుంది . అలా ఆశువుగా గానం చేస్తూ ఉంటాడు అభిరామ భట్టారకుడు 70వ నామం చదువుతూ ఉండగా అమ్మవారు తన కర్ణాభరణాన్ని ఆకాశంలోకి విసురుతుంది. ఆ కర్ణాభరణం అమావాస్య ఆకాసంలో పూర్ణచంద్రునిలా కాంతిని యిస్తుంది.అది చూసి మహారాజు అభిరామ భట్టారకుని క్షమించమని వేడుకొని అతనిని బంధ విముక్తుడిని చేస్తాడు . తన స్తోత్రం తో అమ్మవారిని మెప్పించేన భక్తుని పేరు చిరస్థాయిగా వుండాలనే తలంపుతో ఆ రోజు నుంచి అమ్మవారిని అభిరామి అని వ్యవహిచాలి అని శాశనం చేస్తాడు . పిమ్మట అమ్మవారి సేవ చేసుకొని కాలాంతరాన శివ సాన్నిధ్యం చేరుతాడు . అభిరామ భట్టారకుడు కుడా అమ్మవారి ధ్యానం చేసుకుంటూ కాలాంతరాన అమ్మవారిలో ఐఖ్యం చెందుతాడు.



ఇవి తిరుక్కడయూర్ లోని అమృతఘటేస్వర్ కోవెల విశేషాలు.ఇక్కడకి రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే ఇక్కడకి దగ్గరగా వున్న రైల్వే స్టేషన్ 22కిమి. . దూరంలో వున్న "మైలదుత్తురై" కుంభకోణం నుంచి , చిదంబరం నుంచి బస్సుల సౌలభ్యం ఉంది. చిదంబరానికి సుమారు నలభై కిలొమీటర్ల దూరం వుంటుంది .

Share:

మీ శక్తి మీకు తెలుసా.?

దేవుడు మనిషిని సృష్టించడం సైన్సు పరంగా తెలుసుకుందాం..

*మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నవి. *మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలెను

* హార్మోనియం లో 45 కీలు, పియానోలో 88 కీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి

* మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళములు కలవు. ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు తయారగుచున్నవి

*మానవుని హృదయము నిముషమునకు 72 సార్లు, రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు, సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది

* మానవుని జీవిత కాలములో హృదయము లోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేయును

*మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వచ్చును

*మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోపపడటానికి 43 కండరములు పనిచేస్తాయి

* మనిషి చర్మములొ 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి

* మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉండును

*మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి *ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును

* మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి

*మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి

*మానవుని పంటి దవడ 276 కేజీ ల కంటే ఎక్కువ బరువు ఆపగలదు

*మానవుని శరీరములో 206 ఎముకలు కలవు

* మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 kgs food తింటారు.

*మనిషి నోటిలో రోజుకు 2 నుండి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది

*మనిషి జీవిత కాలములో గుండె 100 ఈతకోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది

*మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము

*మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి

*మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది

*మానవుని మెదడుకు నొప్పి తెలియదు

*మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది

*మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది

* మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది

*తుమ్ము గంటకు 100 మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది

*చేతి వ్రేళ్ల గోళ్ళు కాలి వ్రేళ్ల గొల్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగును

*స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది.

*స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు అర్పుతారు

* రక్తము నీరు కన్నా కుడా 6 రెట్లు చిక్కగా ఉంటుంది

*మానవుని మూత్రపిండములు నిముషమునకు 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల ముత్రమును విసర్జించును

*స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి

*మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది

*మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన

*ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది

* రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది

*మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి

*మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు

*మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది

*మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేయును

*మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును

*మనిషి ముఖములో 14 ఎముకలు ఉండును

*మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకొనునుv ప్రతి 7 రోజులకు ఒకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడును

*మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేయును

*ఆహారము నోటిలో నుండి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది

*మనిషి శరీరములో 75% నీరు ఉంటుంది

*మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడవచ్చు. Approx 528 megapixel lense.

*ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండి విజయం సాధిస్తాం.

ఇప్పుడు చెప్పండి మీలో ఎమి తక్కువగా ఉంది? .

ఇక నిరాశ , నిస్పృహ వద్దు.
గమ్యం చేరే వరకు ప్రయానించం
Share:

భాగవతం - తృతీయ స్కంధము - 28 వ భాగం

జయవిజయులకు సనకసనందనాదుల శాపము.

శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులని ఇద్దరు పార్షదులు ఉన్నారు. వైకుంఠములో వారిద్దరూ ద్వారం దగ్గర నిలబడతారు. వైకుంఠమునకు ఏడు ద్వారములు ఉంటాయి. ఏడవ ద్వారం దాటి లోపలి వెళితే స్వామి దర్శనం అవుతుంది. జయవిజయులు ఏడవ ద్వారమునకు అటూ ఇటూ నిలబడి ఉన్నారు. అప్పుడు సనకసనందనాదులు స్వామి దర్శనార్ధమై అక్కడికి వచ్చారు. వాళ్ళు మహా జ్ఞానులు. నిరంతరమూ భగవంతుని పాదములయందు భక్తితో ఉండే స్వరూపం ఉన్నవారు. వారు ఏడవ ద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. అపుడు జయవిజయులు వారిని ‘లోపలికి వెళ్ళడానికి వీలు లేదు’ అని అడ్డుపెట్టారు.

అపుడు సనకసనందనాదులు ‘ఇది వైకుంఠము. ఇక్కడ మాత్సర్యము ఉండదు. ఇక్కడ ఎవరికీ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరము ఉండదు. అటువంటప్పుడు లోపలికి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకుందుకు అభ్యంతరము ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఆపినట్లు? లోపల ఉన్న స్వామి భక్త పరాధీనుడు. భక్తులయిన వారు వస్తే చాలు ఆయనే ఆర్తితో ఎదురువచ్చే స్వభావం ఉన్నవాడు. అటువంటి వాడు లోపల ఉంటే వెళ్ళడానికి మేము వస్తే మా హృదయంలో ఆయనను దర్శనం చేయాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డుపెట్టడం మీకు మించిన స్వాతంత్ర్యము. కాబట్టి ఏది ఎక్కడ ఉండకూడదో దానిని మీరు చూడడం మొదలు పెట్టారు. కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలోకమునకు పొండి’ అన్నారు. అనేటప్పటికి జయవిజయులిద్దరూ సనకసనందనాడులు కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలు పెట్టారు.

ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు. ఆయన శరీరం మీద నల్లని పుట్టుమచ్చ ఒకటి ఉంటుంది. ఆ పుట్టుమచ్చను శ్రీవత్సము అని పిలుస్తాము. ఆ పుట్టుమచ్చను చూసి, ఆయన స్వరూపమును చూసి సనక సనందనాదులు పొంగిపోయారు. ‘మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ స్వరూపమును దర్శనం చేయగలిగాము. మా భాగ్యం పండింది’ అని ఆయన పాదముల మీద పడి నమస్కారం చేసి ‘పుష్పములో చేరే గండు తుమ్మెద ఎలా చేరుతుందో నిరంతరమూ నీ పాదములయందు అటువంటి భక్తి మాకు ప్రసాదించవలసింది’ అని ప్రార్థించారు.

అపుడు శ్రీమన్నారాయణుడు – ‘మీ స్తోత్రమునకు నేను చాలా సంతోషించాను. కానీ ఇక్కడ ఏదో చిన్న అల్లరి జరిగినట్లు నాకు అనిపించింది. ఏమయింది?’ అని అడిగాడు.

అపుడు వాళ్ళు – ‘స్వామీ మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు. కానీ మేము లోపలకి వస్తున్నప్పుడు ఏడవ ద్వారం దగ్గర ఈ పారిషదులు మమ్ములను అడ్డుపెట్టారు. మత్సరములు ఉండడానికి అవకాశం లేని వైకుంఠమునందు నీ దర్శనమునకు మమ్మల్ని పంపలేదు కనుక, వారు మాయందు విముఖులయి ఉన్నారు కనుక వారిని భూలోకమునందు జన్మించమని శపించాము. ఇప్పుడు నీవు ఎలా చెపితే అలా ప్రవర్తిస్తాము. ఒకవేళ మావలన అపరాధం అంటే మన్నించవలసినది’ అన్నారు.

అపుడు శ్రీహరి – ‘నా పాదములు మీవంటి బ్రహ్మ జ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు. కనుక ఇంతమంది చేత ఆరాధింపబడుతున్నాయి. మీవంటి వారిచేత పూజించబడి మిమ్మల్ని రక్షించుటకు పూనికతో తిరిగి మీకు దర్శనం ఇస్తాను కనుక, నిత్యాపాయినియై నిరంతరమూ లక్ష్మి నావెంట వస్తోంది. నేను భక్త పరాధీనుడను. భక్తులయిన వారు పిలిస్తే పరుగెత్తుకు వెళ్ళడం నా ధర్మం. ఒకవేళ అలా పరుగెత్తుకు వెళ్ళి వాళ్ళని రక్షించడంలో అడ్డువస్తే నా చేతిని నేను నరికేస్తాను’ అన్నాడు. ఎంతపెద్ద మాటో చూడండి! ఎందుకు అంటే ఆ చేయి లోకములనన్నితిని రక్షించే చేయి. అటువంటి మీరు నిరంతరమూ నన్ను తప్ప వేరొకరిని కొలవని వారు, ఎప్పుడూ నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు,చతుర్ముఖ బ్రహ్మ అంతటి వారు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చేయమంటే చేయకుండా కేవలము నా పాదపంజరము మహాపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వలన నా కీర్తి నశిస్తుంది.’ ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమయిన విషయమును ప్రతిపాదన చేశారు.

‘నేను ఎందుకు మీరు ఇచ్చిన శాపమును అంగీకరిస్తున్నానో తెలుసా! వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి ఈ అధికారం నేను ఇచ్చాను. ఏడవ ప్రాకార ద్వారము వద్ద వుండి వచ్చిన వాళ్ళని లోపలి పంపించండి అని చెప్పాను, లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని తొందరగా ప్రవేశపెట్టాలి అని అంతరము తెలుసుకొని, ముందు వాళ్ళకి నమస్కారం చేసి, లోపలి ప్రవేశ పెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. వీళ్ళు అలా ఉండలేదు. పరమ భాగవతులయిన వారికి కలిగిన మనఃక్లేశము పట్టి కుదిపేస్తుంది. మీలాంటి వారిని కాపాడడానికి నేను లోపల ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు నావద్దకు రాకుండా వీళ్ళు అడ్డుపడ్డారు. తన శరీరమునందు పుట్టిన కుష్ఠు తనని పాడు చేసినట్లు నేను వీళ్ళకి పదవి ఇస్తే ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఈ జయవిజయులు నాకే తప్పు పేరు తీసుకువస్తున్నారు. మీవంటి వారికే వైకుంఠమునందు ప్రవేశము నిరాకరింప బడితే భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? లోకము పాడయిపోతుంది. నేను భక్త పరాధీనుడను. అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు. కాబట్టి వాళ్ళను మీరు శపించడం కాదు నేను చెపుతున్నాను.’
‘వీళ్ళు ఉత్తర క్షణం భూలోకమునకు వెళ్ళి రాక్షసయోని యందు జన్మించి ఉగ్రమయిన రాక్షసులై అపారమయిన లోభత్వమును పొందుతారు’ అన్నాడు.

అప్పుడు జయవిజయులిద్దరు శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి ‘స్వామీ, లోపల ఉన్నవాడి హృదయమును అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. మమ్ములను క్షమించు. మళ్ళా మాకు ఎప్పుడు వైకుంఠమునకు ఆగమనం’ అని అడిగారు. అపుడు స్వామి ‘మీరు మూడు జన్మలలో గొప్ప రాక్షసులు అవుతారు. కానీ మిమ్మల్ని మళ్ళా దునుమాడవలసిన అవసరం కూడా నాదే. అందుకని నేనే మీ కోసం అవతారం స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళా తెచ్చి నా వాళ్ళుగా చేసుకుంటాను’ అని ప్రతిజ్ఞ చేశాడు. అందులో కూడా రక్షణే!

04. యజ్ఞ వరాహ మూర్తి:

ఇప్పుడు అందులో ఒకడయిన హిరణ్యాక్షుడు, పశ్చిమ సముద్రం అడుగున ఉన్న వరుణుడిని యుద్ధమునకు రమ్మనమని పిలుస్తున్నాడు. ఆ సమయమునకే యజ్ఞవరాహ మూర్తి జన్మించాడు. ఆయన అవతారం వచ్చింది. వరుణుడు అన్నాడు – ‘సముద్ర జలముల మీదకు ఒక కొత్త భూతం వచ్చింది. నీవు దానితో యుద్ధం చెయ్యి’ అన్నాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణంగా యజ్ఞవరాహ మూర్తిని ఎక్కడయినాఏదయినా ఫోటో చూసినప్పుడు, ఒక పంది స్వరూపమును వేసి దాని మూపు మీద రెండుకోరల మధ్య భూమిని ఎత్తుతున్నట్లుగా వేస్తారు. కానీ పరమాత్మ అలా ఉండదు. యజ్ఞవరాహ మూర్తి అంటే ఎవరో తెలుసా! యజ్ఞవరాహ మూర్తి వర్ణన విన్నా ఆవిర్భావమును గూర్చి విన్నా, చదివినా, ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమయిపోయి కృష్ణ భక్తి కలుగుతుంది. అటువంటి స్వరూపముతో ఆయన దర్శనం ఇచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఆ హుంకారం అనుకున్నారు. స్వామి వంక చూశారు. ఆయన గుర్ గుర్ అని శబ్దం చేస్తున్నాడు. వ్యాసులవారు అలాగే వర్ణించారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసి అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞ వరాహం. ఇప్పుడు ఆయననను స్తోత్రం చేయాలి. అందుకని ఋషులందరూ నిలబడి ఋగ్వేదములోంచి, యజుర్వేదము లోంచి, సామవేదంలోంచి సూక్తములను వల్లిస్తూ ఆ యజ్ఞవరాహమునకు నమస్కారం చేస్తున్నారు.

అపుడు యజ్ఞవరాహం అడుగులు తీస్తూ అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించి తన నాసికతోటి మూపుతోటి సముద్ర అడుగు భాగమును కెలకడం ప్రారంభించింది. ముఖం అంతా నీటితో నిండిపోతోంది. యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను. ఒక్కసారి తన ముఖమును పైకెత్తి కనురెప్పలను ఒకసారి చిట్లించి మెడను అటూ ఇటూ విసురుతోంది.

అలా విసిరినప్పుడు దాని జూలులోంచి నీళ్ళు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి ఆయన నుండి పడిన నీటికోసమని దానిక్రింద తలపెట్టారు. ఈ కంటితో చూడరాని పరమాత్మ ఇవ్వాళ యజ్ఞవరాహంగా వచ్చారు. ఆ నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి వెతికి భూమిని పట్టుకుని దానిని మూపు మీదకు ఎత్తుకుని రెండు దంష్ట్రల మధ్య ఇరికించి, పైకి ఎత్తి చూపించారు. అలా చూపించేసరికి దానిని చూసి ఋషులందరూ స్తోత్రం చేశారు.

మాఘ కవి తన చివరి రోజుల్లో  ఘూర్జర దేశం నుంచి ధారానగరం చేరాడు.తన తీవ్రమైన అస్వస్థత వల్ల
భోజరాజు ఆస్థానానికి తాను పోలేక  తాళపత్రం మీద ఒక శ్లోకం వ్రాసి తనభార్య చేతికిచ్చి భోజరాజుకు యిచ్చి రమ్మని పంపించాడు. ఆమె భోజుడి సభకు వచ్చి ఆ తాళపత్రం రాజుకు సమర్పించి తనభర్త తీవ్రమైన అస్వస్థత వల్ల రాలేక యిది పంపించారని చెప్పింది.అప్పటికే మాఘ కవి కవిత్వాన్ని  అందరూ పోగుడుతూండే వారు.
రాజు ఆ తాళపత్రం చదివి సభకు వినిపించాడు.అది అద్భుతమైన ప్రభాత వర్ణన.

        కుముద వన మపశ్రీ:, శ్రీమదంభోజ షండం
        త్యజతి ముదములూకః,ప్రీతిమాన్ చక్రవకః !
        ఉదయం-అహిమ రశ్మి: -- ,యాతి శీతాంశు రస్తం
        హతవిధి లలితానాం, హా,  విచిత్రో విపాకః
తా:--ఒకపక్క తెల్ల కలువల గుంపు కళ తప్పి వుంది,మరో పక్క తామరపూల సమూహానికి శోభ హెచ్చింది,
గుడ్లగూబ జోరు కోల్పోతున్నది,చక్రవాక పక్షికి హుషారు పెరుగుతున్నది,వేడి కిరణాల సూర్యుడు ఒక పక్క వుదయిస్తూవుంటే,మరోపక్క చల్లని కిరణాల చంద్రుడు క్రుంకుతున్నాడు,ఈ పాడు విధిలీల లలితమైన ప్రభావం  వస్తువులమీద ఎంత విచిత్రంగా వుంటుంది.ఒకరికి మాలినది యింకొకరికి చేటు అవుతున్నది.
  ఈ అద్భుతమైన వర్ణన విని భోజరాజు ఆనందం తో పొంగిపోయాడు.మాఘ పత్నికి మూడు లక్షలిచ్చి
అమ్మా!ఈ సొమ్ము ప్రస్తుతానికి మీ భోజనాదికాలకు మాత్రమే.రేపు ఉదయం నేను స్వయంగా వచ్చి మాఘకవిని దర్శించుకొని సత్కరిస్తాను అన్నాడు.
ఆ సొమ్ము తెసుకొని ఆమె యింటికి బయల్దేరింది.దోవలో ఎందరో యాచకులు కనిపించారు.వారంతా మాఘకవి కావ్యాల గొప్పతనం గురించి పొగుడుతున్నారు.మాఘుడి భార్య రాజు తనకిచ్చిన సొమ్మంతా వాళ్లకు దానం చేసేసి వట్టి చేతులతో యిల్లుచేరింది.స్వామీ! మీ శ్లోకం చదివి సంతోషించి చాలా సొమ్ము
బహూకరించాడు.కానీ అది నేను దోవలోనే యాచాకులకిచ్చి వేశాను.అని చెప్పింది అందుకు మాఘుడు
మంచిపని చేశావు.కానీ ఒకటే చిక్కు యింకా యాచకులు వస్తూ వుంటారు కదా!వాళ్ళకేమి యిచ్చేది?అన్నాడు.అంతలోనే  ఒక యాచకుడు వచ్చిమాఘుడి దగ్గర కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదని గ్రహించి
యిలా శ్లోకం చెప్పాడు.

                          ఆశ్వాస్య పర్వత  కులం తపనోష్ణ తప్తం -
                          ఉద్ధామ దావ విధురాణి చ కాననాని
                          నానానదీ నద శతానిచ పూరయిత్వా
                          రిక్తోస్తి యత్, జలదః సైవ తవోత్తమశ్రీ:(సా-యేవ-తవ-వుత్తమశ్రీ:)
తా:-- ఓ! మేఘుడా! సూర్యుడి వేడికి మాడిపోయిన కొండల గుంపునూ,దావాగ్ని తో కాలి చెడిపోయిన  అడవులనూ చల్లబరిచి, ఓదార్చి,అనేక నదీ నదాలను నీటితో నింపి వేసి నువ్వు వట్టిపోతే మాత్రం ఏమయింది?అదే నీకు అసలైన ఘనత
ఎంతటి పేదరికం లోవున్నా మాఘుడు వదాన్యుడు, సాహిత్యాభిమాని అంత  చక్కని  శ్లోకం  చెప్పిన కవిని
సత్కరించాలని వుబలాటం వున్నా చేతిలో సొమ్ము లేదు.బాధపడుతూ యిలా అన్నాడు.

                      అర్థాః న సంతి, న ముంచతి మాం దురాశా!
                      త్యాగే రతిం మహతి దుర్లలితం మనః మే
                      యాచ్నా చ లాఘవకరీ, స్వవధే చ పాపం
                      ప్రాణాః స్వయం వ్రజత!కిం పరిదేవనేన
తా:-- చేతిలో ధనం లేదు కానీ నన్ను ఈ దురాశ వదలకున్నది.నా పాడు మనసుకు దానం మీదే ఆసక్తి.
యాచన చేసినా దానం చేద్దామనుకుంటే చులకన  అయిపోతాను.ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం కదా!
ఓ!ప్రాణము లారా!మీ అంతట మీరే నన్ను విడిచి వెళ్ళిపొండి విచారమెందుకు?ఈ స్థితిలో మాఘుడిని చూసి వచ్చిన యాచకులు వచ్చిన త్రోవనే వెళ్ళిపోయారు.మాఘుడికి చాలా దుఖం కలిగింది.

         వ్రజత వ్రజత ప్రాణాః! అర్థిభి: వ్యర్థతాం గతాః
         పశ్చాదపి చ గంతవ్యం ; కవ స్వార్థః పునరీ దృశః
తా:--ఓ ప్రాణము లారా!యాచకులకు పనికి రాకుండా పోయిన నన్ను విడిచి ఆ యాచాకుల్లాగే వెళ్ళిపొండి
తర్వాతయినా పోవాల్సిందే కదా?అని విలపిస్తూనే మాఘుడు ప్రాణాలు వదిలాడు.
భోజరాజుకు ఈ విషయం తెలిసి రాత్రికి రాత్రే నూర్గురు బ్రాహ్మణులతో సహా మాఘుడి వసతి గృహానికి వచ్చి
చూశాడు.మరుదినం ఉదయమే మాఘుడికీ ఆయనతో బాటు ప్రాణాలు వదిలిన ఆయన భార్యకూ స్వంత
కొడుకు లాగా అంత్యక్రియలు యధావిధిగా జరిపించాడు.ఇది భోజ ప్రబంధము లోని కథ.
"శిశుపాలవధ"మహా కావ్యాన్ని, భారవి వ్రాసిన "కిరాతార్జునీయం"ని మించిన కావ్యాన్ని వ్రాయాలనే పట్టుదలతో 20 సర్గల కావ్యాన్ని  వ్రాశాడు.మాఘుడు  "శిశుపాలవధ"కూడా పంచమహా కావ్యాలలో  ఒకటి.ఈ కావ్యం లో తొమ్మిది సర్గలు చదివితే,యిక ఆ పాఠకుడికి సంస్కృత భాషలో కొత్త పదం అంటూ కనపడదని నానుడి.
"నవ సర్గ గతే మాఘే నవశ బ్దః  నవిద్యతే". ఆ కావ్యానికి వ్యాఖ్యానం వ్రాసిన మల్లినాథ సూరి "మాఘే,మేఘే
గతం వయః"అన్నాడు.(నా జీవిత మంతా మాఘ కావ్యాన్నీ,మేఘదూతం కావ్యాన్నీ  అధ్యయనం చేయటం తోనే గడిచి పోయింది అని చెప్పుకున్నాడు).
Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List