వేద భారతి.. ~ దైవదర్శనం

వేద భారతి..

మత సాంస్కృతిక, పునరుజ్జీవ ఉద్యమంలో ఆర్య సమాజ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి పలికిన నినాదం 'గో బ్యాక్‌ టు వేదాస్‌' నేటి స్పీడ్‌ యుగంలో స్వామి దయానంద సరస్వతి అంటే ఎవరో తెలియదు. తెలుసుకోవాలనే జిజ్ఞాస అంతకన్నా లేదు. అందుకే మనం కొంతవరకైనా పిల్లలకు కాస్త తీరిక చేసుకుని హిందూ ఔన్నత్యాన్ని గురించి తెలుపుదాం.
అసలు వేదాలు అంటే ఏమిటి? వేదాలను ఎవరు రచించారు? వాటికి, హిందూ మత సాంప్ర దాయానికి మధ్య సంబంధాలు ఏమిటి? అనే విషయం చాలామందికి తెలియదు అంటే అది అతిశ యోక్తి కాదేమో అన్నది నా అభిప్రాయాయం మాత్రమే.
భారతదేశ పూర్వ చరిత్రను తెలుసుకోవడానికి మనకు లభించిన మొట్టమొదటి లిఖిత పూర్వక ఆధారం. ''వేదాలు'' ఇవి మొదట ఋషుల విరచితాలు. తదుపరి వీటిని సంస్కృత భాషలో రచించారు. ''వేదం'' పదం ''విద్‌'' అనే సంస్కృత భాష నుండి ఉద్భవించింది. ''విద్‌' అనగా జ్ఞానం, వేదం కాలం నాటి జాతిని ఆర్యజాతి అంటారు.
అసలు ఈ ఆర్యులు ఎవరు? ఎక్కడ నుండి వచ్చారు? భారతజాతిలో ఎలా కలిసిపోయారు? అనే ప్రశ్నలకు జర్మన్‌ చరిత్రకారుడు మాక్స్‌ ముల్లర్‌ తన రచనలలో సమాధానం చెెప్పారు. ఆర్యులు సెంట్రల్‌ ఆసియా మయిన్మార్‌ నుండి ఉత్తరాన ఉన్న హిమాలయాలలో ఉన్న కనుమలను దాటి ఉత్తర భారతదేశంలోకి వచ్చినట్లుగా మనకు ఆధారాలు లభించాయి.
ఆర్యులు ముఖ్యవృత్తి పశువుల పెంపకం. ఆ పశువుల మేత కొరకు ఉత్తర భారతదేశంలోకి రావడం జరిగింది. అప్పటికే అక్కడ స్థిరపడి ఉన్న ద్రావిడ జాతి లేదా సింధు ప్రజలను తరిమివేసి ఆ భూ భాగాన్ని ఆక్రమించినట్లుగా మనకు కొంతవరకు ఆధారాలు కన్పించాయి.
ఋగ్వేదంలో విశ్వామిత్రుడు ఇంద్రునితో ''ఈ ద్రోహులను సంహరింపుము'' అన్న వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా ఆర్యుల మాతృభాష సంస్కృతం, సంస్కృతం నుండి పుట్టినవే ఇప్పుడున్న ఉత్తరాది భాషలు. దక్షిణాది భాషలు ద్రావిడము నుండి పుట్టిన భాషలు. అంతెె కాకుండా ఋగ్వేదంలో ఆర్యులు నివసించిన ప్రాతం ''సప్తసింధునదీ ప్రాంతం'' అని ప్రస్తావించడం జరిగింది. అనగా ఉత్తర భారతంలోని సింధునది దాని పరివాహక ప్రాంతంలో ఆర్యులు నివసించి నట్లుగా మనకు తెలుస్తుంది. సింధునది దాని ఉపనదులు ఆరు. రావి, బియాస్‌, సట్లజ్‌, చీలం, చీనాబ్‌ సరస్వతి నది. ఈ సరస్వతి నది తర్వాత అంతర్వాహక నదిగా మారి పోయింది.
వేదాలు నాలుగు: 1. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం
ఋగ్వేదం : ఈ వేద కాలంను తొలివేద నాగరికత అని కూడా పిలుస్తారు. ఈ వేదం క్రీ||పూ 3000 స||ము కాలం నాటిది. దీనిలో 1028 స్తోత్రాలు, 10 మండలాలలో విభజింపబడి ఉన్నాయి. సుప్రసిద్ధ గాయత్రీ మంత్రం కూడా ఋగ్వేదం లోనిదే. ఈ కాలంలో సుప్రసిద్ధ దేవతలు ముఖ్యంగా ఇంద్రుడు (స్వర్గలోకాధిపతి) అగ్ని, రుద్రుడు (శివుడు) సోమదేవుడు
సామవేదం : సామవేదం భారతీయ సంగీతానికి మూలం. దీనిలో ఋగ్వేదంలో ఉన్న స్తోత్రాలకు మంత్రోచ్ఛరణ ఉంటుంది. పూజారులు యజ్ఞ యాగాది సమయాలలోను, క్రతువులలోనూ జపించవలిసిన మంత్రోచ్ఛారణ ఉంటుంది.
యజుర్వేదం: యజ్ఞాలలో, క్రతువులలో బ్రాహ్మణులు లేదా పూజారులు అనుసరించవలసిన నియమాల గురించి, వాటి పవిత్రత గురించి, పూజా కార్యక్రమానికి సంబంధించిన వస్తువులు లేదా సామాగ్రి గురించి తెలుపుతుంది.
అధర్వణవేదం : ఇది భారతీయ వైద్యానికి మూలమైనది. దీనిలో వ్యాధులు, రోగాలు, దెయ్యాలను పారద్రోలే మంత్రాలు ఉంటాయి.
ఋగ్వేదం మినహా మిగిలిన మూడు వేదాలను మలివేద నాగరికత అంటారు. వేదాలు హిందూ మతానికి సంబంధించిన పవిత్రతను గురించి మనకు తెలుపుతున్నాయి. ఈ ఆర్య నాగరికత తర్వాత కాలాన్నెె ఇతిహాస యుగం అంటారు. అనగా రామాయణ మహాభారతాల కాలం.
పవిత్రమైన వేదాలు మనకు అందించిన సంస్కృతీ సాంప్రదాయాలు ఎంతో విలువైనవే కాకుండా ఆచరింప యోగ్యమైనవి, పవిత్రమైనవి. వాటిని అనుసరించి మనం మన జీవితాలను మెరుగుపరుచు కుందాం. దైవ చింతన, దైవభీతి, మనస్సాక్షి ఉన్న ఏ మానవుడు కూడా ఏ రకమయిన తప్పు చేయడు అన్నది మాత్రం అక్షరసత్యం.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List