స్థంబాధ్రి నారసింహాలయము ~ దైవదర్శనం

స్థంబాధ్రి నారసింహాలయము

పూర్వం మౌద్గల మహర్షి ఈ స్థంబాధ్రి ప్రాంతంలో శ్రీ హరి గురించి తపస్సు చేయగా శ్రీహరి లక్ష్మీసమేత నరసింహుడిగా ప్రత్యక్షమయాడు. శ్రీ హరి ముని కోరిక మేరకు ఇక్కడే భక్తుల దర్శనార్థం ఒక గుహలో కొలువు తీరాడని స్థల పురాణం. ఖమ్మం కోట నిర్మాణ సమయంలో కాకతీయ చక్రవర్తి స్వామివారికి ఆలయం నిర్మించాడని చరిత్ర వలన తెలుస్తున్నది.
కొండను తొలచి చేసిన స్థంభాలపై చెక్కిన కాకతీయుల శిల్ప కళాశైలి చూపరులను అబ్బుర పరుస్తుంది. రాతితో నిర్మించిన ఏకశిలా ధ్వజస్థంభం ఇక్కడి ప్రత్యేకత. మరో విశేషమేమంటే స్వామి వారు దక్షిణాభిముఖంగా ఉండటము. గర్బగుడిలో స్వామి వారికి ఎడమవైపున లక్ష్మీదేవి, కుడివైపున అద్దాల మండపం ఉంటాయి. ధ్వజ స్థంబం ప్రక్కనే ఆంజనేయ స్వామి మందిరం, గుట్టపై సుబ్రమణ్యస్వామి , విష్ణుమూర్తి, ఆంజనేయ మందిరం , శ్రీవేంకటేశ్వరాలయం ఉన్నాయి. ఇక్కడున్న స్వామివారి కోనేరులో నీరు అన్ని వేళలా ఉంటుంది. వర్షాకాలంలో నీరు ఎక్కువై ఆలయంలోని స్వామి వారి నాభి వరకు నీరు చేరుతుంది. ఆ సందర్భంలో ఆ నీటిని బయటకు పంపుతారు. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏమంటే నల్లరాతిలో చెక్కిన సాయిబాబా విగ్రహము. నల్లరాతి సాయిబాబా విగ్రహం ఉన్న ఆలయం మన రాష్ట్రంలో ఇదొక్కటే నని చెపుతారు.
స్వామి వారికి మూడు పూటలా పూజలు జరుగుతాయి. ప్రతీ శుక్రవారం లక్ష్మీదేవికి క్షీరాభిషేకము, ప్రతి ఆదివారము అన్నదానము చేస్తుంటారు. నరసింహ స్వామి పానక ప్రియుడంటారు. అందుకే నిత్యం పానకం తోనే స్వామి వారికి అభిషేకము చేస్తుంటారు. ఇక్కడున్న ఆరున్నర అడుగుల ఎత్తుండే నల్ల రాతి సాయి బాబాను భక్తులు శ్రీకృష్ణుని అంశం గా భావించి శ్రీకృష్ణాష్టమి నాడు సాయిబాబాకు విశేష పూజలు నిర్వహిస్తారు. నరసింహ స్వామి అవతరించి నట్లుగా చెప్పే వైశాఖ శుద్ధ చతుర్థశి నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అయిదు రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో స్వామి వారికి పవిత్రోత్సవాలు, అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా దసరా నాడు స్వామిని అశ్వ వాహనంపై ఊరేగిస్తారు. ఇక్కడి మరో ప్రత్యేకత ఏమంటే హిందువులతో పాటు ముస్లిములు కూడ తమ పెద్దల స్మారకార్థం ఏటా ఉగాదినాడు ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించి కానుకలు సమర్పించుకుంటారు. చాలా శతాబ్దాలుగా జరుగుతున్న ఎక్కడా లేని ప్రత్యేకమైన సాంప్రదాయం ఇది.
స్థంబాధ్రి నారసింహాలయం ఖమ్మం జిల్లా ముఖ్య కేంద్రమైన ఖమ్మం పట్టణం మధ్యలోనే ఈ క్షేత్రమున్నది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List