మంత్రమునకు మూడు స్థితులు కలవు. 1.చేతన 2. అచేతన 3. మంత్ర చైతన్యము. అచేతన మంత్రం అనగా వాని శక్తి లేక దేవత జాగృతము కాదు. ఈ రకము మంత్రములు కేవలము అక్షర సముదాయములు మాత్రమే అగును. శిష్యులకు అదే మంత్రం ఉపదేశం చేస్తారు. చెవిలో మంత్రం చెప్పబడుతుంది. దానిని జపం చేసుకుంటూ స్వయంగా జాగృతి పొందవలసి ఉంటుంది. ఆ చెప్పిన గురువుకు గానీ, శిష్యునకు గానీ...శక్తి జాగృతి విషయం లో ఏమీ ఆలోచన ఉండదు. అలాగే లక్ష్యం కూడా ఉండదు. మాల తిరుగుతూనే ఉండును. లక్షలలో జపం జరుగుతూనే ఉంటుంది. పంట ఫలించని రైతు మనోస్థితిలా ఉంటుంది. శిష్యునకు ఈ చెప్పిన విషయంలో లక్ష్యము ఉంటే.... అతడు మంత్ర ప్రతిపాదితమైన దేవత లేక చైతన్యము యొక్క జాగృతి సంపాదించుకోగలుగును. అనగా మంత్ర సిద్ధిని పొందును. అప్పుడు మంత్రం పని చేయుట ప్రారంభించిను. ఈ స్థితిలో ఆ మంత్రమును చేతనా మంత్రము అంటారు. అనగా మంత్రం యొక్క రహస్యమైన దేవత లేక చైతన్యము జాగృతమైనచో అప్పుడు ఆ మంత్రము లేక రహస్య దేవత లేక చైతన్యము జాగృతమైనచో...అప్పుడు ఆ జపము లేక ఆ మంత్ర ప్రయోగం చేయుటవలన కోరికలు సిద్ధిస్తాయి. ఈ స్థితిలో ఆ మంత్రమును చేతనా మంత్రము అంటారు. చేతనా మంత్రము జపము చేయుచూ ఉండగా మంత్ర శక్తి జాగృతమై కార్యశీలము అగును. అప్పుడు స్థూల మంత్రము గౌణము అగును. అనగా బాహ్య మంత్రము ఆగిపోవును. మరియూ సంస్కారాల క్షీణత జరుగును. దీనిని కూడా మంత్ర చైతన్యము అంటారు. అచేతనమైన మంత్రమును....చాలా కాలము జపము చేయుట వలన, అది చేతనావస్థను పొందును. అచేతనా మంత్రమును...చాలా కాలము , జపానుష్ఠానములను చేసి, మంత్ర చైతన్యావస్థను పొందుట ఒక ఉపాయము. మంత్ర చైతన్యమునే "కుండలినీ శక్తి జాగృతి" అంటారు. ఈ మంత్ర చైతన్యమును పొందుటకు ,మరొక ఉపాయము...సమర్ధుడైన గురువు యొక్క కృపను పొంది...చేతనా మంత్రమును దానముగా పొందుట.
Home »
» కుండలినీ సిద్ధ మహాయోగము - మంత్ర చైతన్యము - విశ్లేషణ.
No comments:
Post a Comment