సాధన - దివ్యానుభూతులు. ~ దైవదర్శనం

సాధన - దివ్యానుభూతులు.

1. బ్రహ్మ గ్రంధి భేదనము :

అసత్తు నుండి సత్తులోనికి చేర్చుము. అసతోమా సద్గమయ అనగా సగుణాశ్రయమును తప్పించి నిర్గుణముగా నుంచుము అని అర్థము. మూలాధార స్వాధిష్ఠానములను అధిగమించి బ్రహ్మ గ్రంధి భేదనము చేయుము అని అర్థము. ఇది మధుకైటభ వధగా చెప్పబడినది. ఇక్కడ ప్రారబ్ధ కర్మ క్షయమగును. సత్యప్రతిష్ఠ జరుగును. మధుకైటభులనగా విషయానందము, అనేకత్వము. వధ అనగా నిర్విషయము, ఏకత్వము అని అర్థము.

2. విష్ణుగ్రంధి భేదనము :

తమోరూప అంధకారమును అనగా అజ్ఞానాంధకారమును తొలగించి జ్ఞానమయ జ్యోతిస్వరూపము నందు ప్రతిష్ఠింపుము అని అర్థము. తమసోమా జ్యోతిర్గమయ. మణిపూరక అనాహతములను అధిగమించి విష్ణుగ్రంధి భేదనము చేయుము అని అర్థము. ఇది మహిషాసుర వధగా చెప్పబడినది. ఇచ్చట ఆగామి కర్మ నశించును. ప్రాణప్రతిష్ఠ జరుగును. మహిషాసుర వధ అనగా క్రోధము, జనన మరణాది వికారముల నుండి ఉద్ధరించుము అని అర్థము. మృత్యోర్మా అమృతంగమయ. ఆనందమయ అమృత స్వరూపమునందు ప్రతిష్ఠించుము. విశుద్ధ ఆజ్ఞాలను అధిగమించి, రుద్రగ్రంధి భేదనము చేయుము అని అర్థము. ఇది శుంభనిశుంభ వధగా చెప్పబడినది. ఇచ్చట సంచిత రాశి దగ్ధమగును. రజో గుణము రహితమగును.

3. రుద్రగ్రంధి భేదనము :

ఆనంద ప్రతిష్ఠ జరుగును. శుంభనిశుంభులనగా బింబ ప్రతిబింబములు. వధ అనగా ఆ రెండూ పోయి స్వస్వరూపముగా నుండుట.

బ్రహ్మనాదము :

ప్రాణక్రియలు ఎక్కువగా చేయుట వలన మత్తు కలిగి శిరస్సు వెనుక భాగమున శబ్దము వినబడును. దీనిని బ్రహ్మనాదమందురు. అప్పుడు సాధకుడిని నాదబ్రహ్మమని అందురు.

కుండలీ ప్రసాదము :

1. మూలాధారమందున్న దేవీని ప్రార్థించిన వారికి, వారు కోరుకున్న ఇహలోక సుఖములు లభించును.

2. స్వాధిష్ఠానమందున్న దేవీని ప్రార్థించిన వారికి, ఆ దేవీలోక నివాసమునకై తపన కలుగును.

3. మణిపూరకమందున్న దేవీని ఉపాసించిన వారికి ఆ దేవీయొక్క మహానగరము వెలుపల నివాసముండే అనుగ్రహము లభించును.

4. అనాహతమందున్న దేవీని ఉపాసించిన వారికి ఆ దేవీయొక్క మహా నగరము లోపల నివసించే భాగ్యము కలుగును.

5. విశుద్ధమందున్న దేవీని ఉపాసించేవారికి ఆ దేవీ సామీప్యము లభించును.

6. ఆజ్ఞేయమందున్న దేవీయొక్క జ్యోతిర్మయ మంగళ స్వరూపమును ధ్యానించేవారు ఆ దేవితో సమానులగుదురు.

7. సహస్రారమందున్న దేవీ స్వరూపమును ధ్యానించేవారు ఆ దేవితో సాయుజ్యమై నిత్యముక్తులగుదురు.

యోగవిద్యా సాధనలో ప్రగతి :

మొదటి దశ :

లాలాజల రసము అధికముగా ఉత్పత్తియగును. జీర్ణశక్తి పెరుగును. నిద్రలో కలలు రావు. దేహారోగ్యము వృద్ధి చెందును. మానసిక శాంతి లభించును. బుద్ధి మాంద్యము తొలగును.

రెండవ దశ :

ప్రకాశ దర్శనము, వాణీ శ్రవణము మొదలగునవి జరుగును. మధురరసోత్పత్తి యగును. మనశ్చాంచల్యము తొలగును. తన ప్రశ్నలకు తనలోనే సమాధానము లభించును. దేహములో ఉష్ణోగ్రత పెరిగి తపోజ్వాల అనుభవమునకు వచ్చును.

మూడవ దశ :

సమాధి స్థితి కలిగి అమృతరసోత్పత్తి యగును. ఆనందానుభవము కలుగును. తత్త్వజ్ఞుడగుటకు తపన కలుగును. వెనుకటి, ఇప్పటి జన్మకర్మలు తెలియబడును. సృష్టికి ఏది మూలకారణమో అది తెలియబడును. ఆ కారణ దైవమును దర్శించును. పిమ్మట పూర్ణ తృప్తి కలుగును.

నాల్గవ దశ :

ఇతరులకు విద్యోపదేశము చేయగల్గును. దానికి తన గురువు నుండి ఆదేశము వచ్చును.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List