కుండలినీ సిద్ధ మహాయోగం. ~ దైవదర్శనం

కుండలినీ సిద్ధ మహాయోగం.

దైవశక్తి ఊర్ధ్వస్థాయిలలో నుంచి అవరోహణాక్రమంలో క్రమేణా దిగివచ్చి స్థూలంగా మారి కుండలినీశక్తిగా మనిషి వెన్నెముక అడుగున నిద్రాణస్థితిలో ఉంటుంది.కనుక మనిషి ప్రకృతికి,పంచభూతాలకు దాసుడై జీవితం గడుపుతున్నాడు. ఈ శక్తిని ఊర్ధ్వగామిత్వం చెందించి శిరస్సుపైన ఉన్న సహస్రదళపద్మంలోకి తీసుకు వెళ్ళగలిగితే మనిషి ప్రకృతి దాస్యంనుండి విముక్తుడై దైవత్వాన్ని పొందుతాడు.ఈ ప్రక్రియనే కుండలినీయోగం అంటారు.

దీనికి కులంతో, మతంతో పనిలేదు. శరీరం ఉన్న ప్రతి మానవునిలో ఈప్రక్రియ జరిగితేనే దైవత్వం కలుగుతుంది. మనుషులు కల్పించుకున్న కులమతాలతో దీనికి సంబంధంలేదు. ఏ మనిషైనా ఈ ప్రక్రియకు చెందిన నియమనిష్టలను పాటిస్తూ సాధన చెయ్యగలిగితే ఇది సాధ్యం అవుతుంది. ఏ మతానికి చెందిన ప్రవక్తలైనా, మహాత్ములైనా ఈ ప్రక్రియను తెలిసో తెలియకో ఆచరించి, అనుభూతి పొందినవారే. ఆ అనుభూతిని వారివారి భాషలలో, నమ్మకాలలో పొదిగి లోకానికి చెప్పినవారే. అయితే ఇది కూడా ఒక పరిణామ క్రమం. కుండలినీ యోగసాధనలో ప్రతిమెట్టులో కొన్ని ఋజువులు కనిపిస్తాయి.శరీరంలో మనస్సులో అనేకమార్పులు కలుగుతాయి. మన ప్రమేయం లేకుండానే...ఆసనాలు,ముద్రలు,ప్రాణాయామాది క్రియలు...ఇలా...వస్తూంటాయి. హార్మోన్ సిస్టం ఊహించని మార్పులకు లోనవుతుంది. Body Chemistry మొత్తం అతలా కుతలమై కొత్తరూపు దాలుస్తుంది.ఇవి యోగరహస్యాలు.ఎక్కడా పుస్తకాలలో కనిపించవు.గురుశిష్య పరంపరగా వస్తూంటాయి.ఒక సాధకుని చూచి అతనిలోని లక్షణాలను గమనించి అతను ఏ మెట్టుదాకా వచ్చాడో చెప్పవచ్చు.వారిలో కనిపించే లక్షణాలే వారిని పట్టిస్తాయి.ఇదొక అత్యంత రహస్య విజ్ఞానం.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List