మూక పంచశతి లో పాదారవిందశతకం. ~ దైవదర్శనం

మూక పంచశతి లో పాదారవిందశతకం.

వెనకటికి ఒక మూగవాడు కామాక్షి దేవి ఆలయంలో కూచొని తదేకంగా అమ్మవారిని ధ్యానిస్తున్నాడు. అదే మంటపంలో మరొక వ్యక్తి కూడ అమ్మవారిని గూర్చి ధ్యానం చేస్తున్నాడు. ఆయన గొప్ప పండితుడు. అమ్మవారికి దయ కలిగింది. ఆమె స్త్రీ రూపంలో ప్రత్యక్షమయి నోరు తెరువు. నీ నోటిలో వుమ్మివేస్తానని ముందు పండితునితో అన్నదిట. ఆవిడెవరో, ఆవిడ ఉచ్చిష్టం వల్ల తన శౌచానికెక్కడ భంగం కల్గుతుందోనన్నట్లు ముఖం పెట్టాడు. పక్కనే వున్న మూగవాడు ఆవిడే అమ్మవారని గ్రహించి, తన అదృష్టం పండిందని వెంటనే నోరు తెరిచాడు. అమ్మవారతని నోట వుమ్మివేసిందిట. అంతే! శ్రీకరమైన అంబ తాంబూలోచ్చిష్టం తగలగానే ఆ మూగవాడు మహాకవి అయినాడు. అమ్మవారి ప్రభావాన్ని ఆర్యాశతకంగా రచించాడు. కండ్లు అమ్మ పాదాలపై పడగా పాదారవింద శతకం గానం చేశాడు. అమ్మ దయను గురించి స్తుతి శతకం చెప్పాడు. ఆమె కటాక్షం చూసి కటాక్ష శతకం వినిపించాడు. ఆ మూగవాని అనర్గళ కవితా ప్రవాహాన్ని వింటూ ఆనందించి చిరునవ్వు నవ్విన అమ్మవారి మందహాసం చూసి మందస్మిత శతకం గడగడా చదివాడు. అట్లా ఆశువుగా చెప్పిన అయిదు శతకాల సంపుటి అయిన అత్యంత సుందర కావ్యమే మూక పంచశతి.

అమ్మవారి కర్పూర తాంబూల ఖండోత్కరి యొక్క ఉచ్చిష్టంలోంచి పుట్టిన ఆ అద్భుత కావ్యం అమ్మవారి అనుగ్రహాన్ని పొందదలచిన వారు తప్పక పారాయణ చేయదగ్గ గ్రంథం.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List