కాశీ ఖండం -43 ~ దైవదర్శనం

కాశీ ఖండం -43


సప్తర్షి యాత్ర... ప్రతి నెల పంచమి తిది నాడు సప్తర్షి యాత్ర చేస్తే ధర్మబుద్ధి ,వృద్ధి అవుతుంది .

జంగం వాడీ దగ్గర కశ్యాపెశ్వరుడు  ,కాదయాకీ చొక్ వద్ద అత్రీశ్వరుడు (ఇప్పుడిది లేదు ),నాగ కూపం దగ్గ్గర మరీచీశ్వరుడు ,గోదేలియా కాశీ నరేష్ సమీపం లో గౌత మేశ్వరుడు ,మణికర్ణికా స్వర్గ ద్వారం వద్ద పులస్త్యేశ్వరుడు ,సంకట ఘాట్ వద్ద వసిష్టేశ్వరుడు ,,అరున్ధతీశ్వర దర్శనం తో సప్తర్షి యాత్ర పూర్తీ

నవ దుర్గా యాత్ర

ప్రతినెలా అష్టమి లేక నవమి తిధులలో ఈ యాత్ర చేయాలి తొమ్మిది రోజుల్లో తొమ్మిది దుర్గ లను సందర్శించాలి ఇదే చండీ యాత్ర అనీ అంటారు

 వరుణా నది ఒడ్డున –శైల పుత్రీ దుర్గా దేవి ,పంచ గంగా ఘాట్ వద్ద –బ్బ్రహ్మ చారిణీ దుర్గా దేవీ ,చందూకీ వద్ద –చిత్ర ఘంటా దుర్గా దేవి ,దుర్గా కుండం అంటే ప్రసిద్ధి వద్ద –కూష్మాండ దుర్గా దేవి ,జిత పురా లో స్కంద మాతా లేక వాగీశ్వరి దుర్గా దేవి ,ఆత్మ వీరేశ్వర మందిరం లో కాత్యాయినీ దుర్గా దేవి ,కాళికా గల్లి లో –కాల రాత్రీ దుర్గా దేవి పంచ గంగ దగ్గర మహా గౌరీ దుర్గా దేవి లేక మంగళ గౌరీ దుర్గా దేవి ,సంకట దేవి, దుబులా వాలాలో సిద్ధి ధాత్రి దుర్గా దేవిల సందర్శనమే నవ దుర్గా యాత్ర .

ఏకా దశ మహా రుద్రులు

శివుడికి పద కొండు సంఖ్య చాలా ఇష్టమైనది .పద కొండు సార్లు రుద్ర మంత్రాలతో అభి షెకిస్తి మహా ప్రీతీ చెందుతాడు .కనుక ఏకాదశ రుద్ర దర్శన ,ప్రార్ధన ,పూజలు శివసాయుజ్యాన్నిస్తాయి

ఇసర్ గంగీ జాగేశ్వార్ –అగ్నీద్రేశ్వర లింగం ,ఔసాన్ గంజ్ లో ఊర్వశీశ్వర లింగ్సం ,విశ్వనాధుని దగ్గర హనుమాన్ మందిరం లో నాకు లేశ్వర లింగం ,కాశీ పురా రాజా బెంతియా ఆవరణ లో ఆశాఢేశ్వర లింగం ,రాజా దర్వాజా లో భార భూతేశ్వర లింగం ,కొనా బజార్  లో –లాంగీశ్వర లింగం ,బోలా లో ఉన్న త్రిపురాన్తకేశ్వర లింగం ,సాఖీ వినాయకుడి దగ్గరున్న –మనః ప్రకామేశ్వర లింగం ,కాళికా గల్లీ లో ప్రీతీ కేశవర లింగం ,మదాలసేశ్వర లింగం ,దుర్గా కుండం దగ్గర–తిల వర్నేశ్వర లింగ దర్శనమే ద్వాదశ మహా రుద్రా దర్శనం

వార యాత్రలు

ఆదివారం –సూర్య యాత్ర –లోలార్క ,ఉత్తరార్క ,సామ్బాదిత్య ,ద్రౌపదాదిత్య మయూఖాదిత్య ,ఖఖో లాదిత్య ,అరునాదిత్య ,వ్రుద్దాదిత్య ,కేశవా దిత్య ,విమలాదిత్య ,గంగా దిత్య ,యమాదిత్య లను శాస్తి సప్తమి ,లేక ఆదివారం చేస్తే పద్మక యోగం లభిస్తుంది

సోమ వారం –జ్ఞాన వాపీ స్నానం చంద్రేశ్వర దర్శనం చేయాలి సోమవారం ,అమా వాస్య కలిస్తే సోమవతీ అమా వాస్య అంటారు

 మంగళ వారం –దుర్గా దేవి భైరవుడు ,వందీ దేవి ,అంగారకేశ్వర ,హనుమాన్ లను దర్శించాలి

అష్ట భైరవులు –హనుమాన్ ఘాట్ లో రురు భైరవ ,దుర్గాజీ ఆవరణ లో –చండా భైరవ ,వృద్ధ కాళేశ్వర్ వద్ద –అసితాంగా భైరవ ,ప్రసిద్ధం లో –కపాల భైరవ ,కామక్షా లో –క్రోధ భైరవ ,భీమ చండీ దగ్గర –ఉన్మత్త భైరవ ,త్రిలోచన గంజ్ వద్ద–సంహార భైరవ ,కాశీ పురాలో –భీషణ లేక భూత భైరవ లను దర్శిస్తే యే భయమూ ఉండదు .

 బుధ వారం –బుదేశ్వర లేక ఆత్మా వీరేశ్వర దర్శనం అధిక ఫలితాన్నిస్తుంది .బుధ వారం అస్టేమి  తిదితో కలిస్తే విశేషం

గురువారం –శుక్రేశ్వర దర్శనం చేయాలి .కాని ఇప్పుడు అందరు శ్రీ మహా లక్ష్మీ ,సంకట దేవి ,వాగీశ్వరీ దేవి లను శ్రావణ శుక్ర వారం దుర్గా దేవిని దర్శించి తరిస్తున్నారు .

శని వారం –విశ్వనాదాలయం దగ్గరున్న శనైస్చర్య దర్శనం చేయాలి శని వారం ప్రదోష కాలం లో త్రిలోచన కామేషుని ,నక్షత్రేశ్వర దర్శనం పుణ్యం

 సూర్య ,చంద్ర గ్రహణాల సమయం లో గంగా స్నానం స్నానం మోక్ష దాయకం .ఈ శ్లోకాన్ని చదువు కోవాలి

‘’కురుక్షేత్ర సమా గంగా –యత్రా కుత్రావ గాహితా –కురుక్షేత్రా ద్దశ గునా –యాత్ర విందయె న సంగాతః

తస్మాత్ సహస్ర గుణ ప్రోక్తా –యాత్ర పశ్చిమ వాహినీ –తస్మాత్ సహస్ర గుణితా –కాశ్యాం ఉత్తర వాహినీ ‘’

           దశాశ్వ మేధ ఘాట్ లో యమునా ,గంగా సంగమం జరుగుతుంది .మణి కర్ణికా కుండం లో బ్రహ్మ నాశం నుండి బ్రహ్మ ద్రవ జలం గోముఖీ ద్వారా వస్తుంది .దత్తాత్రేయ మందిరం అడుగు నుండి బయల్దేరి గంగలో కలుస్తుంది పంచ గంగా ఘాట్ లో గాభాస్తేశ్వర లింగం అడుగు నుండి ఒక జల ధార వచ్చి లీన మవుతుంది అదే కిరణా నదీ అంశ అంటారు .
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List