ప్రాణశక్తి - భావనలు - వైజ్ఞానిక విశ్లేషణ. ~ దైవదర్శనం

ప్రాణశక్తి - భావనలు - వైజ్ఞానిక విశ్లేషణ.

పూర్ణాత్మ గురించీ, అతీంద్రియ శక్తుల గురించీ తెలుసుకోవాలని ప్రయత్నించే ముందు మనం మొట్టమొదటగా ’మానవుని నైజం’ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ’మానవుని ప్రకృతి’ అంటే అది పురుషుడికీ స్త్రీకీ కూడా సమానంగానే అని అర్థం చెప్పుకోవాలి. నిజానికి పురుషుడి కన్నా స్తీలకే ఎక్కువ కాంతివంతమైన తేజశ్శరీరం ఉంటుంది. వాళ్ళు ఆధ్యాత్మిక తత్త్వాన్ని కూడా పురుషుడి కన్నా మెరుగ్గానే గ్రహించగలిగే నేర్పుని కలిగి ఉంటారు. ఈ విధంగా స్త్రీలు పురుషుల కన్నా ఆధిక్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇద్దరూ సమానులేనని ముందుగా మనం నిర్ధారించి చెప్పుకుని తరువాత ప్రకృతి మర్మాల గురించీ, అతీంద్రియ శక్తుల గురించీ మాట్లాడుకుందాం.

సృష్టిలో నిజానికి మొత్తం ఉన్నదంతా ’ప్రాణమే’. మనం మామూలుగా చనిపోయింది అని అనుకునే కళేబరంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది. ’నిస్తేజంగా నిశ్చలంగా’ ఉన్నది కనుకే ఆ జీవి మరణించిందని మనం చెప్పుకుంటాం, మామూలు మాటల్లో నిజానికి ఆ శిధిలమవుతున్న శరీరంలో నుంచి మరో క్రొత్త ప్రాణి రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తుంది.

                           సృష్టి మొత్తం అనంతమైన నిరంతరం చైతన్యంతో నిండి వుంది. ’అచలం’, ’జడం’, ’కదలకుండా ఉంది’ అనని మనం అనుకునే పదార్ధాలలో అణువుల్లో ఎల్లప్పుడూ భ్రమణం కనిపిస్తూనే ఉంటుంది. ఈ గ్రంథం పదార్ధ విజ్ఞానశాస్త్రం గురించీ, రసాయన శాస్త్రం గురించీ కాదు కనుక స్థూలంగా ’అణువులు’ అనే పదాన్నే మనం ఉపయోగిద్దాం, అనవసరంగా ’పరమాణువులు’, న్యూట్రాన్లూ, ’ఎలక్ట్రాన్లూ’ లాంటి పదాలను ఉపయోగించకుండా ’జగత్తు’ అనే చిత్రం స్తబ్ధంగా కనిపించినా నిరంతర భ్రమణమే దాని అసలు స్వరూపం.


మనం అణువుల గురించీ, పరమాణువుల గురించీ కూడా కొంత చర్చించుకుంటే మంచిదేమో! లేకపోతే పదార్ధ విజ్నానశాస్త్రం గురించి మనకేమీ తెలియదనుకుని కొంతమంది మేధావులు మనకు తెలిసిన విషయాలనే మళ్ళీ మళ్ళీ వ్రాసి మనకే బొధించే ప్రయత్నం చేసే అవకాసం వుంది. వాళ్ళ జిజ్నాసని కూడా గుర్తిస్తూ ఆ మాటలని మనమే అనుకుంటే వాళ్ళకి కూడా తృప్తిగా అనిపిస్తుంది; ఔనా? ’అణువులు’ అంటే ఓ పదార్థపు లక్షణాలని కోల్పోని అతిచిన్న తునకలన్నమాట. ఇవి ఎంత చిన్నవంటే వీటిని కంటితో చూడాలంటే కుదరదు. ఎలక్ట్రాను మైక్రోస్కోపు లనైనా ఉపయోగించాలి. లేకపోతే దివ్యదృష్టిని సమకూర్చుకున్న యోగులను అడిగైనా తెలుసుకోవాలి.

                           అణువులను నిశితంగా పరిశీలిస్తే అణువులు చిన్నవైనా అవి ఇంకా చిన్నవైన కొన్ని పరమాణువుల సముదాయంతో ఏర్పడి ఉన్నాయనే సత్యం గొచరిస్తుంది.


ఓ పరమాణువు చూడటానికి ఓ చిన్నసైజు సూర్య కుటుంబంగా ఉంటుంది. పరమాణువు మద్యలోఉన్న భాగం సూర్యుడిలాగా, ఆ మధ్యభాగం చుట్టూ కొంత దూరంలో ప్రదక్షిణ చేస్తూన్న ఎలక్ట్రానులు భూమి, శుక్రుడు, అంగారకుడు లాంటి గ్రహాల లాగా మనకి గోచరిస్తాయి. ఓ సూర్యకుటుంబంలో ఖాళీ స్థలమే ఎక్కువగా ఉంటుందని మనకి తెలుసు. అలాగే ఓ అణువు లోపల కూడా చాలా భాగం ఖాళీ స్థలమే.


                కార్బన్ అణువులతోనే మన విశ్వం మొత్తం ఏర్పడింది. ప్రతి పదార్థంలోనూ మధ్యలో ఉండే న్యూక్లియస్ చుట్టూ విభిన్న సంఖ్యలో ఎలక్ట్రానులు గిర్రున పరిభ్రమిస్తూ ఉంటాయి. ఉదాహరణకి : కార్బన్ అణువులో ఆరు ఎలక్ట్రానులు న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. (యురేనియం అణువులో తొంబై రెండు ఎలక్ట్రానులు పరుగులు పెడుతూ ఉంటాయి.) ఇక ఈ న్యూక్లియస్ లోని ప్రోటాన్లు, న్యూట్రాన్ల గురించీ, ఎక్కువగా చుట్టూ దూరంగా భయభక్తులతో ప్రదక్షిణలు చేస్తున్న ఎలక్ట్రాన్ల గురించీ మాట్లాడడం తగ్గించి మామూలుగా ’అణువులు’ అనే చెప్పుకుందామా?       

                             మానవుడు కూడా అనేకమైన అణువుల సముదాయమె. చూడటానికి ఓ ఘనపదార్థంలాగా, విగ్రహంలాగా మనం కనిపిస్తున్నాం. మన ఎముకల గూటి లోచి, కడుపు మీద కండరాల లోచి ఓ వ్రేలును ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి వెళ్ళేలా చేసేందుకు మనం ప్రయత్నిస్తే అదంత సులభం కాదని మనకి అర్థమౌతుంది. మనం మనుష్యులం కనుక మనవాళ్ళకి మన శరీరం ఓ ఘన పదార్థంలాగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఇది మన మీద రుద్దబడిన ఓ భ్రమ మాత్రమే. మన శరీరాన్ని అత్యంత సూక్ష్మమైన ఓ క్రిమి తగినంత దూరంలో నిలబడి చూస్తూందని అనుకోండి. ఆ క్రిమికి మన శరీరం అనేక గ్రహాల సముదాయం లాగా, ఓ విశ్వ కాయంలాగా, అనేక నదుల సంగమంలాగా, అనేక సూర్యుళ్ళ, నక్షత్రాల కుప్పల్లాగా, మబ్బుల్లాగా, జలపాతాలలాగా కనిపిస్తుంది. మన ఎముకలు ఉన్నచోట్లలో గుత్తులు గుత్తులు గానూ, మాంసం ఉన్నచోట్లో కాస్త చెల్లాచెదురు మబ్బుల్లాగానూ మన శరీరం ఆ సూక్ష్మజీవికి కనిపిస్తుంది.   

  
                   నక్షత్రాలు స్పష్టంగా కన్పిస్తున్న ఓ రాత్రివేళ ఓ పెద్ద కొడమీద మీరు నిలబడి ఆకాశం వంక చూస్తూ వున్నారనుకోండి. సిటీ (city) లోని దీపాల కాంతి ఆకాశంలోని పొగమంచు తెరల మీద పరావర్తనం చెంది ఆకాశంలోని నక్షత్రాలు కనిపించకుండా పోయే పరిస్థితి లేదనుకోండి ( అలాంటి పరిస్థితి రాకూడదనే నక్షత్రశాలల్ని సిటీలకు చలా, చాలా దూరప్రాంతాల్లో నిర్మిస్తారు.) ఆకాశంలో దూరం దూరంగా విసిరి వేయబడినట్లు ఉండే నక్షత్రాలు తోరణాలుగా, గుంపులుగా మీ కళ్ళముందు నెమ్మదిగా కదుల్తూ మీకు కనిపిస్తాయి. అనేక విశ్వాలు మీ కళ్ళ ముందు మిణుకు మిణుకు మంటూ వెలుగుతూంటే ఆ కనిపించే రోదసి వైశాల్యాన్ని మీరు గమనించకుండా మీరు ఉండలేరు. నక్షత్రాలు, ప్రపంచాలు, గ్రహాలు, అణువులు! ’ఇందాక మనం అనుకున్న సూక్ష్మజీవికి మన శరీరం కన్పించే విధంగానే మనకు ఈ రాత్రి ఈ ఆకాశ చిత్రం కన్పిస్తోంది’ అని అనిపించటం లేదూ?

                             నక్షత్రాల మధ్య అనూహ్యమైన ఖాళీ ఆకాశం ఉంది. మీరు ఓ పెద్ద రోదసీ నౌకలో కూర్చుని ఏ నక్షత్రానికీ, గ్రహానికీ తగలకుండా చాలా సులభంగా ఖాళీ ఆకాశంలో విహారాలు చెయ్యొచ్చు. ఈ ఖాళీ స్థలంలో కూడా ఏదయినా పదార్థం ఉండి ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆకాశం అప్పుడు ఎలా కనపడుతుంది! మన సూక్ష్మజీవి కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటుందా? ’ ఆసూక్ష్మజీవికి కనిపించే అణువుల సముదాయం మనమే’ అని మనకు తెలుసు. కానీ దానికి తెలీదు. అలాగే మనకు కన్పించే ఈ విశ్వపు పూర్తి స్వరూపం నిజంగా ఎలా ఉంటుందో మనకు తెలీదు. ప్రతి మనిషీ ఓ విశ్వం లాంటి వాడే. ఈ విశ్వంలో గ్రహాలు సూర్యుళ్ళ చుట్టూ, ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ ల చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. రాతిలోనూ, ఓ చెట్టుకొమ్మలోనూ, ఓ నీటి చుక్కలోనూ ఈ నిరంతరం భ్రమణం అనిశ్రాంతంగా జరుగుతూనే ఉంటుంది.

                            మానవులలోని అణువులలోని పరిభ్రమణం ఓ విధమైన ’విద్యుత్’ ను సృష్టిస్తుంది. ఈ విద్యుత్ పైనున్న ’పరమాత్మ’ అందించే విద్యుత్’తో కూడి "ప్రాణశక్తి’ అనే పేరుతో పిలువబడుతుంది. ఈ ప్రాణశక్తితోనే ఈ ప్రపంచంలో జీవితం సాగుతోంది. మన భూమ్మీది ఉత్తర, దక్షిణ దృవప్రాంతాల్లో అయస్కాంత క్షేత్రాల తీవ్ర శక్తివల్ల మనకి ’అరోరా బొరియాలిస్’ అని పిలువబడే కాంతి రేఖలు కన్పిస్తూటాయి. ప్రతి మనిషి ఓ ప్రత్యేక లోకంలాగా విడిగా ఉండిపోలేడు. మిగతా, మనుష్యుల, జంతువుల, వృక్షాల, క్రిమికీటకాల ప్రాణశక్తి విన్యాసాల లీలల మధ్య తాను కూడా వెలుగుతూ ప్రకాశిస్తూ ప్రవర్తిస్తూ ఉండాల్సిందే. ఈ లోకంలో మానవుడి జీవితం మిగతా జీవరాశుల ఉనికి మీదే ఆధారపడి వుంది. మిగతా జీవరాశులు లేకపోతే మనిషి లేడు. ఇతర జీవరాశుల ఉనికి లేకపోతే ఏ జీవి చిరకాలం జీవించి ఉండే అవకాశం లేదు. జీవులన్నింటికీ ’సహజీవనం’ అనివార్యం.

                            ఆకాశంలో నక్షత్రాలు ఓ చోటులో ఒత్తుగా సాంద్రంగా కన్పిస్తాయి; మరో చోట విసిరేసినట్లు దూరంగా కన్పిస్తాయి. అలాగే ఓ రాతిలో అణువులు దగ్గర దగ్గరగా కూడి ఉంటాయని అనుకోవచ్చు. ఓ గాలి అణువును తీసుకుని పరీక్షిస్తే వాటి అణువులు దూరం దూరంగా జరిగిఉన్నట్టు కనిపిస్తాయని గ్రహించవచ్చు. గాలి అణువులు సులభంగా మన శరీరంలోకి దూసుకెళ్ళి ఊపిరితిత్తుల్లోంచి నేరుగా రక్తంలోకి వెళ్ళగలుగుతాయి. భూమిని ఆవరించి ఉన్న గాలి పొరని దాటి ఉన్న రోదసీ ప్రదేశం ఖాళీగా ఉందని మనకు కనిపించవచ్చు. కానీ నిజంగా అందులో దూరం దూరంగా విసిరివేయబడిన హైడ్రోజన్ అణువులు ఉన్నాయి. ఈ హైడ్రొజన్ అణువులు పిచ్చిపిచ్చిగా పరిభ్రమిస్తూ ఉంటాయి, ఓ తీరూ తెన్నూ లేకుండా.


                            ఒక శరీరంలో అణువుల సాంద్రత ఎక్కువ కనుక మరో జీవి ఈ శరీరంలోనికి చొచ్చుకుపోవడం జరగని పని అని మనకు తెలుసు. కాని, ఓ గోడ లోంచి ఓ దెయ్యం సులభంగా దూరి వెళ్ళిపోతుందనే విషయం మనం వినే వుంటాం. దానికి కారణం దెయ్యం శరీరంలోని అణువులు గోడ అణువుల కన్నా అతి తక్కువ సాంద్రంగా ఉండటమేనని సులభంగా ఊహించవచ్చు. గాలి ఓ జల్లెడలో నుంచి ఎలా ఆ వైపుకు పోగలుగుతుందో అదే విధంగా ఎక్కువ సాంద్రత గల గోడ లోంచి తక్కువ సాంధ్రత గల దెయ్యం ఆ వైపుకు ఏ అణువుకూ కొట్టుకోకుండా సులభంగా వెళ్ళిపోగలదని మనం ఊహించడం అంత కష్టమేమీకాదు. ఈ జగత్తు సాపేక్షంగా ఘన, ద్రవ, వాయు రూపాల్లో గోచరిస్తూ ఉంటుంది. ఈ జగత్తును పరిశీలించే జీవి సైజుని బట్టి అణువుల పొందికను బట్టి ఈ జగత్తులో కనిపించే దృశ్యాలు మిధ్యాసదృశ్యాలు. ఘన పదార్థం నిజంగా ఘనపదార్థం కాదు. ద్రవ పదార్థం నిజంగా ద్రవ పదార్థం కాదు. మన కంటికి రాతి గోడలాగా కనిపించే వస్తువు ఓ ఏకకణ జీవికి జల్లెడలా కన్పిస్తే ఏమీ ఆశ్చర్యం లేదు. ఓ దెయ్యానికి గానీ, మరో లోకం నుంచి వచ్చిన మరో జ్యోతి స్వరూపానికి కానీ మన ప్రపంచం నక్షత్రాల సముదాయాలలాగా కానీ, విరజిమ్మబడిన ఇసుక రేణువుల్లాగా గానీ కనిపించడం నిజంగా సాపేక్షతే కానీ మరొకటి కాదు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List