సాధనా విధానము. ~ దైవదర్శనం

సాధనా విధానము.

🌟జఞానోదయము, క్లేశములు క్షీణించిన తరువాత మాత్రమే కలుగుతుంది. మలినమైన చంచల చిత్తములో జ్ఞాన ప్రకాశము కనిపించదు.

🌟పత్రలో మురికి నీరు వున్నప్పుడు, ఆ పాత్రను నిశ్చల స్థితిలో వుంచిన, అందులోని మురికి పాత్ర అడుగు భాగము చేరిన, ఆ మురికిని సులభముగా తొలగించవచ్చును. అలానే ఏకాగ్రత మరియు నిరోధ సంస్కారములు స్థిరము కానంత వరకు చిత్తము తన చంచల స్వభావమును మార్చుకొనదు. నిశ్చల చిత్తములోనే జ్ఞానముదయించును.

🌟 చత్త స్థితులైన; మూర్ఖత సోమరితనములను విద్వత్తత, చురుకుతనము, అభ్యాసం ద్వారా మార్చుకొనవచ్చు. చిత్త నిరోధ స్థితి యొక్క అనుభవముల ద్వారా జ్ఞానము పెరిగి, అవిద్యతో కూడిన క్లేశములు తొలగిపోవును.

🌟 చత్తము కల్యాణ కారిక స్థితులవైపు మరియు పాపము వైపు కూడా ఆకర్షితమవుతుంది. వివేకవంతుడు పాపముల నుండి చిత్తమును తొలగించి, కల్యాణ కారక మార్గమున ప్రవర్తిల్ల జేయును.

🌟 ఏదైన ఒక సాధనలో
చిత్తము నిలిపి ప్రయత్నించుటను అభ్యాసమందురు.

🌟 పరియమైన విషయముల నుండి చిత్తమును మరల్చుటను వైరాగ్యమని అంటారు.

🌟 అభ్యాసము దృఢ పర్చుకొనుటకు దీర్ఘకాలము నిరంతర శ్రద్ధా పూర్వక, నియమబద్ధ సాధన చేయవల్సి వుండును.

🌟సమరి తనము, నిర్లక్ష్యము, పరిమితి లేకపోవుట, జాగరూకత లేకుండుట అనునవి అభ్యాసమునకు మహా శత్రువులు.

🌟 వరాగ్యం అనగా, విషయ భోగములను త్యజించుట కాదు. భోగములు వదిలినా, వాటి పట్ల ఆసక్తి వున్నా అది మిథ్యాచారమే. అందువలన ఆసక్తి కూడా నశించుటే వైరాగ్యము.

🌟 భగముల
పట్ల ఆసక్తి కలిగియుండుట చిత్తము యొక్క స్వభావము. అందువలననే ఇంద్రియములు భోగముల పట్ల ఆకర్షితమవుతాయి.

🌟 మనిషి దుర్వ్యసనముల పట్ల బానిస అయ్యినప్పుడు, చిత్తములో దానికి ప్రతి క్రియగా బాధ ఉత్పన్నమైనప్పుడు, వాటి నుండి బయటపడే ప్రయత్నం చేస్తాడు. ఇది వైరాగ్యము యొక్క మొదటి స్థితి.

🌟 రండవ వైరాగ్య స్థితిలో, కొన్ని వ్యసనముల నుండి బయటపడినా, కొన్నింటియందు చిక్కుకుని ఉంటాడు. విడిచి పెట్టినవి కూడా అప్పుడప్పుడు బయట పడుతుంటాయి.

🌟 అంతిమ వైరాగ్య స్థితిలో వ్యసనములు, మూలముతో సహా అంతమవుతాయి. ఇదే పరమ వైరాగ్య స్థితి.

🌟 పరమ వైరాగ్య స్థితిలో సత్వ రజో తమో గుణములు ఎట్టి ప్రభావమును చూపలేవు. ఇట్టి స్థితి ఆత్మ జ్ఞానము పొందినప్పుడు లభించును.

🌟 పరమ వైరాగ్య స్థితికి మూలము అభ్యాసములో శ్రద్ధ, ఉత్సాహము రోజు రోజుకు పెరుగుతుంది.

🌟 చత్తము ఏకాగ్రమై, నిర్విచార సమాధి స్థితి ఏర్పడిన, ఋతుంబరా ప్రజ్ఞ ఉదయిస్తుంది.

🌟అభ్యాస వైరాగ్యములు తీవ్రమైనప్పుడు, దానితో పాటు అష్టాంగ యోగమును కూడా సాధన చేయవల్సి వుంటుంది.

🌟 అట్టి స్థితిలో ఈశ్వర ప్రణిదానము అనగా ఈశ్వరుని ఆశ్రయించి భక్తి, ధ్యానము, శరణాగతి, జపము మొదలగునవి ఆచరించాలి.

🌟ఈశ్వరుడు సర్వజ్ఞుడగుటచే సమాధి స్థితిలో, సాధకునికి పూర్ణ జ్ఞానము లభిస్తుంది.

🌟ఈశ్వరుడు గురువు రూపములో సాక్షిగా ఉండి, తనలో నామ స్మరణ, ధ్యానము, జపము ద్వారా ప్రత్యక్షమవుతాడు.

🌟 ఈశ్వరునికి అనేక నామము లున్నప్పటికి, యోగ దర్శనములో ప్రణవమునకు అధిక ప్రాధాన్యత ఈయబడినది. దాని ద్వారానే ఆత్మ దర్శనము సులభమవుతుంది. విఘ్నములు తొలగుతాయి.

🌟 యగమునకు చిత్త ప్రసన్నత ముఖ్యము. అట్టి ప్రసన్నత కలగాలంటే, జన సంపర్కము నుండి విడిగా వుండాలి.

🌟 జనాభాలో భోగులు, దుఃఖితులు, పుణ్యాత్ములు, పాపాత్ములు ఉంటారు. వారిఎడ మైత్రి, కరుణ, ప్రసన్నత, ఉపేక్ష వ్యక్తులను బట్టి కలిగి వుండాలి.

🌟 అంతరాయముల ద్వారా చిత్తక్షోభ కలిగినప్పుడు, ధ్యానంలోకి వెళ్ళిన చిత్తము ఏకాగ్రమౌతుంది.

🌟 నసికాగ్రమున ఏకాగ్రత వలన, దివ్య గంధము, నాలుకాగ్రమున దివ్యరుచి, తాలువు నందు దివ్యరూపములు, నాలుక మధ్య దివ్య స్పర్శ, జిహ్వమూలములో దివ్య శ్రవణము యొక్క విశేష జ్ఞానములు కలుగును.

🌟హృదయ కమలమందు చిత్తము నేకాగ్రపరిచిన స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన ఆకాశము, సూర్య చంద్రుల మెరుపులు, నక్షత్రములు, అగ్ని, దీపశిఖలు, మిణుగురులు ఇత్యాదివి ద్యోతకమవుతాయి. అప్పుడు అంతరంగము శాంతించి; సంకల్ప, వికల్ప రహితమై చిత్త నిరోధ వృత్తి ఉదయిస్తుంది.

🌟రగ, ద్వేషములు లేని వీతరాగ స్థితిలో, చిత్తము నేకాగ్ర పరచిన, చిత్తము నిరోధించబడును.

🌟 సవప్న, సుషుప్తుల జ్ఞానముపై చింతన చేయుట వలన చిత్త వృత్తులు నిరోధించబడును.

🌟 ఆత్మ; పరిణామ రహితము, నిత్య చైతన్యము, స్వయం జ్యోతి, ఉపాధి రహితము, శుద్ధము, సంగరహితము అగుటచే ఏదైనా ఉపాధితో కలిసినప్పుడు ద్రష్టగా మారుతుంది. (సాక్షి)

🌟 జగృత స్థితులో వ్యక్తి ఉన్నప్పుడు ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఆయా విషయములలో లీనమైనప్పుడు, ఆత్మ వాటి నుండి వెలువడి సుషుప్తి లేక సమాధి స్థితికి చేరుతుంది. ఆ సమయములో చిత్తములో ఏ వృత్తులు ఉంటాయో వాటిని అతడు చూడగలడు.

  🌟సుషుప్తిలో తమోగుణము, మూర్చలో రజోగుణము, సమాధిలో సత్వ గుణములు వుంటాయి. ఆత్మ కేవలం ద్రష్టగా వుంటుంది.

🌟 తమో గుణము వలన వృత్తుల సంస్కారములు అణగి ఉంటాయి. రజో గుణము వలన స్వప్నములు ఏర్పడి మేల్కొన్న తరువాత స్వప్న సంస్కారములు గుర్తుకు వస్తాయి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List