ఈ రోజు రాశిపలాలు. ~ దైవదర్శనం

ఈ రోజు రాశిపలాలు.

నేటి రాశిఫలాలు 15 అక్టోబర్ 2018

*☘️మషం*☘️

అలసట నిస్సత్తువ, బద్దకం ఈ రోజు మీ శత్రువులు అవబోతున్నాయని  అంటున్నా. ముందరే ఉద్రిక్తంగా వున్న మీ శారీరిక, మానసిక పరిస్థితిని మరంత కోపోద్రిక్తం చేసేందుకు తప్ప ఈ పరిస్థితి ఎందుకూ పనికి రాదు. అందుకనే  మీరు ఎవరినీ గాయ పరచవద్దనీ, అనవసరమైన వీడని చిక్కు ముడి లాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని చెపుతున్నారు.
ఏ పరిస్థితులో అయినా సంతులన కోల్పోకుండా తీసుకున్న పనులు సకాలంలో పూర్తి చేసేందుకు సిద్దంగా వుండడి. యాత్రాగత నక్షత్రాలు ప్రకాశవంతంగా వున్నాయి. తీర్ధ యాత్ర చేయవచ్చునేమో చూడండి.
💧 *వృషభం*💧

అనవసరమైన ఆటంకాలు మీ దారిలోకి వస్తున్నందున, మీ కళ్ళు, చెవులు సావధానంగా పెట్టుకుని వుండమని  చెబుతున్నా. మీరు శారీరికంగాను, మానశికగాను సంసిద్దం కాలేదు కాబట్టి ప్రయాణించడానికి, కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది సరియైన సమయం కాదు. పైగా ఆఫీసులో మీ పని మిమ్మల్ని మరింత అలసటకు గురి చేస్తుంది. అందువలన మంచి ఆహారం, నిద్ర, మొత్తం మొత్తంగా మంచి ఆరోగ్యం కలిగి వుండాల్సిందని  సలహ ఇస్తున్నా.కొంచెం విలువైన సమయం తీసుకొని ఏకాంతంగా ధ్యానం చేయడం వలన మీరు ఆత్మ కేంద్రికంగా వుండగలరు.                                                                                               
*🍀మథునం*🍀

ఈ రోజంతా మీరు పసందైన భోజనం, చల్లటి కూల్ డ్రింక్స్, ఆసక్తికరమైన కంపెనీ, ఇంకా చెప్పాలంటే చాలా సరదా. . . . ఎక్కడ వుందా అని వెతుక్కుంటారు. విభిన్న సంస్కృతులతో సంమిళితమై, తోటి కొలీగ్స్ తో అవుటింగ్స్ కు వెళ్ళి గాని, మీ ప్రేయసితో గాని, మి చిననాటి మిత్రులతో గాని కలసి సంతోషంగా గడపగలరు. ఈ రోజు షాపింగ్ కి, రోమాన్స్ కి, మందు పార్టికి, మంచి భోజునానికి. . . . . చెప్పాలంటే జీవితంలో అందురూ కోరుకునే అద్భుతమైన విషయాలన్నీ ఈ రోజు మీకు సొంతం. మీ తారా బల ప్రభావం,   . ఈ రోజు మీకు మంచి నిద్ర మంచి ఆరోగ్యం వుంటాయి.
*🌷కర్కాటకం*🌷

మీ ప్రత్యర్ధుల మీదా, పోటీ దారుల మీద, విజయం, మీ మహిళా స్నేహితులతో మీటింగ్స్ పెరిగిన పరపతి, శక్తి, ఒక మంచి జీవితంలో రావల్సిన బహుమతులు అన్నీ మీకు ఈ రోజు సునాయాసంగా చేతికి అంది వస్తాయి. మీ వృత్తి రంగంలో మీ కఠిన పరిశ్రమకు అదృష్టం, మీ తోటి వారి నుంచీ, మీ ఉద్యోగులు నుండి కూడా మీకు సహకారం. ఇంత ప్రశాంతమైన, ఇంత అనుకూలమైనా ఇలాంటి రోజులు చాలా అరుదు. కాబట్టి మీ కుంటుంబంతో ఎక్కువ సేపు ఈ సంతోషకరమైన క్షణాలను అనుభూతి చెందండి. అలాగే మంచి అరోగ్యం మీ శ్రమకు తగ్గ ఫలం ఆనందించండి.
💧 *సింహం*💧

ఈ రోజంతా సరదా, సంతోషం, సాహితీ పరిశోధనలో సంతోషంగా గడుస్తుదంటున్నా. మీ కల్పన ఉచ్చ స్థితిలో వుంటుంది. అది మిమ్మల్ని ఆధ్యాత్మిక విషయాలను అధ్యయనం చేయడానికి, వ్రాయడానికి కవితా రచన చేయడానికి పురికొల్పుతుంది. మీ మనసుకు దగ్గర అయిన వారితో మీ సాన్నిహిత్యాలు మిమ్మల్ని మీ చైతన్యాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. అవి మీకు లాభసాటిగానూ, ప్రశంసలు కురిపించే విధంగానూ వుంటాయి. మీ పిల్లల నుంచి మంచి వార్త, వారు చేసిన విధ్యా సంభందమైన ప్రయాత్నాలలో త్వరితంగా సాధించిన అనుకూలమైన ఫలితాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. మీతో కలసిపోయే మీ స్నేహితులు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. జీవతమనే ఈ బహుమతి పట్ల మీరు కృతఙ్ఞులై వుండండి. తిరిగి మళ్ళి లోక కళ్యాణ కార్యక్రమాలలో ఈ సమయం వెచ్చించడం ద్వారా ఈ సమాజానికి మేలు చేయండి.
*🍁కన్య*🍁

మీరు ఈ రోజులో ఎక్కువ భాగం చాలా అలసటగా వుదాసీనంగా గడుపుతారు.  ఇది మీకు సాధారణమైన రోజనీ, ఏ మాత్రం ప్రత్యేకత లేదని చెపుతున్నా. తల నొప్పి, ఆందోళన వంటి ఆరోగ్య సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు. లేదా మీ తల్లి గారి ఆరోగ్యం మిమ్మల్ని కలత బార్చవచ్చు. మీ ప్రియమైన వారితో స్వల్ప తగాదా, చికాక పరిచే పబ్లిక్ నిందలు లేదా అనుకోని ఖర్చూ మిమ్మల్ని చికాకు పెడుతుంది. నీటి గండాలకి, అపరిచితులకీ, అందులోనూ మహిళలకూ దూరంగా వుండండి. మీ అస్తులకు, భూములకు సంభందించిన లీగల్ పత్రాల విషయంలో జాగ్రత్త తీసుకోండి.
*🍒తుల🍒*

ఈ రోజు చాలా సంతోషకరమైన, చాలా సౌభాగ్యకరమైన రోజని అంటున్నా. సన్నిహితులతో సంభందాలు, తీర్ధ యాత్ర ప్రయాణానికి సంభందించిన ప్రణాళీకలూ, ఆర్ధిక విషయాలలో అదృష్టం, కొత్త వెంచర్స్ లో ప్రవేశం. . . మీకు అనుకూలతనీ, ఉత్సాహాన్నీ ఇస్తుంది. విదేశాల నుంచి మంచి వార్త అందుకుంటారు. ఆకర్షనియమైన స్కీమ్స్ లో పేట్టుబడులు పెడతారు. మీ సోదరునితో ఇంటికి, కుటుంబానికి సంభందించిన విషయాలలో లోతైన చర్చలు నడుపుతారు. ప్రయాణానికి సంభందించి, తక్కువ టైమ్ లో నిర్ణయం తీసుకుని బయలుదేరినా సరే, బయలుదేరిన పని పూర్తి అవుతుంది. మీ మానసిక, శారీరిక ఆరోగ్యాలకు ఢోకా లేదు.
*⛲️వృశ్చికం*⛲️
వివాధాలకూ, కుటుంభ సభ్యులలోనూ, సోషల్ సర్కిల్ లోను వివాధాలకూ, అపార్ధాలకూ దారి తీసే పరిస్థితులకు దూరంగా వుండండి. వాస్తవానికి అవి మీ దగ్గరకు రాకుండా చూసుకోండి. అటువంటి సంధర్భాలే వచ్చి పడితే వాటి వల్ల స్వల్ప అశ్వస్థతలూ, మానసిక అపరాధ భావనా మిమ్మల్ని వెన్నాడుతుంది కాబట్టి, మీరు అనుకూల వైఖరితో వ్యవహరించండి. అనవసర ఖర్చులకూ, అనైతిక కార్యకలాపాలకూ దూరంగా వుండమని  సలహా ఇస్తున్నా.ఇది సరళమైన రోజు ఈ ప్రత్యేకతలు లేని రోజు. విధ్యార్ధులు ఆటంకాలు ఎదుర్కొంటారు.
💥 *ధనుస్సు*💥
ఆర్ధిక విజయం మిమ్మల్ని అభినంధిస్తుంది. సకాలంలో మీరు తీసుకొన్న కార్యక్రమాలు అన్నీ పూర్తి చేయగలుగుతారు. తీర్ధ యాత్రా క్షేత్రాలకు సంభంధించిన ప్రయాణ నక్షత్రాలు ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. మీ ప్రియమైన వారి ఇంట గానీ, మీ రక్త సంభంధీకుల ఇంట గానీ జరిగే శుభకార్యానికి మీరు వెళతారు. వారిని కలవడం మీకు సంతోషాన్నీ కలుగజేస్తుంది. మీ వైవాహిక జీవితాన్ని వడపోస్తుంది, పసందైన భోజనం, స్థిర చిత్తతా, పెరిగిన సామాజిక పరపతీ. . . మీ ముఖంపై చెదర నివ్వవు. అలాగే మీ నత్య, నైమిత్యక జీవనంలో మీరు ఆహ్లాదకరంగా వుండడంలో ఏమాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకుండా చూచుకోండి.
🌻 *మకరం*🌻

ఈ రోజు స్వల్ప ప్రమాదాలూ, మానసిక ఆందోళనలు మీ చార్ట్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి రోజంతా జాగ్రత్తగా వుండండి. మీ ఆందోళనకి కారణం కూడా మీ వ్యవహారాలలో జోక్యం చేసుకొనే మీ కొలీగ్స్ కావచ్చు, మీ బంధువులతో రేగిన స్వల్ప తగాదాలు కావచ్చు, మీ పిల్లలు గానీ, మీ ఆరోగ్య సంబంధిత సమస్యలు గానీ కావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. మీరు ధార్మిక , సామాజిక లేదా నైతిక సంభంధమైన విషయాలలో సేవా నిమగ్నులై పనిచేస్తుంటారు. యాత్ర జాగ్రత్తగా చేయండి. ఈ రోజంతా కష్టపడి పనిచేయడం మీకు ఉపకరిస్తుంది.
*🌺కుంభం*🌺

లక్ష్మీ దేవి అనుగ్రహం ఈ రోజు మీపై పరిపూర్ణంగా వుంది. ఆమె మీపై భౌతిక సంపదని అపారంగా కురిపిస్తుంది. తద్వారా సామాజికంగా మీ కీర్తి ప్రతిష్టలు మీ హుందాతనం పెరుగుతాయి. ఈ అనుకూల తారా బలం పనిలోనూ, వ్యాపారంలోనూ, హితకారిగా వుంటుంది. ఆఖరికి మీ మహిళా ముత్రులు కూడా మీకు లాభం చేకూర్చేవారై వుంటారు. మీ పిల్లల తో మీకు సత్సంబంధాలు వుండాలనీ, వారి నుండి మీరు మంచి వార్త అందుకుంటారని  మిమ్మల్ని అశీర్వధిస్తున్నా. మీరు ఒక లీజర్ ట్రిప్ కి ప్లాన్ చేయవచ్చు. ప్రేమించడానికి, పెళ్ళి చేసుకోవడానికి ఇది అనువైన సమయం. వివాహ సంభంధాలు కూడా రావచ్చు.
*🌲మనం*🌲

ఉద్యోగ పరమైన విషయాలలో విజయానికి ఈ రోజు విజయం వరిస్తుందని  అశీర్వదిస్తున్నా. కుటుంబ విషయాలలో సంతృప్తి అనంతంగా జరుగుతుంది. మీరు మీ పై అధికారులకూ, లక్ష్మీ దేవికి కూడా దృష్టిలో వున్నారు. అందువల్ల మీ బిజినెస్ వృద్ధి చెందుతుంది. అలాగే మీరు ఋణం ఇచ్చిన సొమ్ము వెనక్కి తిరిగి వస్తుంది. మీ తండ్రి తరుపునుంచి , మీ పెద్దలు తరుపునుంచి లబ్ధి చేకూరుతుంది. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఆరోగ్యం చికాకు పరచదు. అన్ని విధాలా మీరు ఆశీస్సులు పొంది వున్నారు.

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List