కాశీ ఖండం -45(చివరి భాగం ) ~ దైవదర్శనం

కాశీ ఖండం -45(చివరి భాగం )

కాశీ తీర్ధ పూజా విధి... తీర్ధ యాత్ర ,దేవయాత్ర ,గురు యాత్ర అని మూడు రకాల యాత్రలున్నాయి .స్నాన ప్రధానంగా పుణ్య నదీ ప్రవాహాలున్న చోట్లకు వెళ్లటం తీర్ధ యాత్ర..దేవతా ప్రధానం గా ఉన్న క్షేత్ర దర్శనం దేవ యాత్ర .పరబ్రహ్మోప దేశం ,పంచాక్షరీ మంత్రోప దేశం పొంది వేద శాస్త్ర ఇతిహాస గ్రంధాలలోని జీవనో ద్దారక ,జన్మ తరణ సంబంధిత సూక్ష్మ ధర్మ విశేషాలను బోధిస్తూ సన్మార్గం లో నడిపే సద్గురు దర్శన ,సేవనం ,,పూజనంతో  కాలం గడి పితే గురు యాత్ర .

           సద్గురు కటాక్షం ద్వారా తప్ప జ్ఞాన ప్రాప్తి లభించదు .జ్ఞానం లేక పోతే దైవం ,దేవతా స్థలం ,తీర్ధ ,క్షేత్ర యాత్రల గురించి అవగాహన ,శ్రద్ధా ,విశ్వాసం ఏర్పడవు .అందరికి చివరి కాలం లో గురు యాత్ర కావాలి .గురు యాత్ర వల్ల సర్వ యాత్ర సంపూర్ణం గా  పుణ్య ఫలం లభిస్తుంది సర్వ తీర్ధాలలో ప్రయాగ శ్రేష్టం .ఆ ప్రయాగ జలం కాశీ లోనీ గంగా జాలం పంచ గంగా ఘాట్ లో కలుస్తుంది .సమస్త క్షేత్రాలలో, దేవ యాత్రలలో ముఖ్య మైనది కాశీ యాత్ర .కాశీ యాత్ర చేసి వచ్చిన వారు కాశీ పూజ లేక తీర్ధ పూజ చేస్తారు .కాశీ తీర్ధ పూజా విధానం తెలుసు కొందాం

                       కాశీ గంగోదకాన్ని మూడు రాగి కలశాలలో నింపి సీల్ వేసి తెచ్చుకోవాలి ఆ నీటిలో ప్రయాగ సంగమ నీరు ,పంచ గంగానీరు ,మణి కర్ణిక నీరు తప్పక కలపాలి ..ఈ మూడూ కలిసిన జలాన్నే రాగి చెంబుల్లో పోసి సీల్ చేయించి ఇంటికి తెచ్చుకోవాలి .ఇంటి వద్ద ఈ మూడు కళాశాలకు భక్తీ తో పూజ చేయాలి .ఒక ఏడాది లోపు ,లేదా తొమ్మిది నెలల లోపు ,,లేక తొంభై రోజుల లోపు రామేశ్వరం వెళ్ళి ,ఒక కలశం లోనీ నీటిని అక్కడి పూజారికిఇచ్చి రామేశ్వర జ్యోతిర్లింగం పై గోత్ర నామాలు చెప్పించి ,అభిషేకం చేయించాలి ..తర్వాతా రామేశ్వరం లోనీ ఇసుకను ఒక డబ్బాలో పోగు చేసి ,ఏడాది లేక తొమ్మిది నెలలు ,లేక తొంభై రోజులు లోపల ,మళ్ళీ కాశీ చేరి ,ప్రయాగ సంగమ స్థలం లో రామేశ్వరం లోనీ ఇసుకతో శివ లింగాన్ని ఒక పాత్రలో చేసి పూజించి ,దక్షిణ ,వస్త్రాలతో పాటు ఆ పాత్రను దానం చేయాలి .ఆ సేతు శివ లింగాన్ని నిమజ్జనం చేయాలి .

         రెండవ కలశం లోనీ తీర్ధ జలాన్ని పూజ చేసిన తర్వాతా విప్పి ,అందరికి ప్రోక్షణ చేయాలి .తీర్ధం గా కూడా గ్రహించాలి .యజమాని మూడవ కలశం లోనీ తీర్ధాన్ని పూజా గదిలో జాగ్రత్త గా భద్ర పరచి రోజు పూజ చేయాలి .ఆ నిండు కలశం లో కాశీ తీర్ధం మూడు చుక్కలు కలుపు కొని ,తర్వాత దేవుళ్ళను కడగాలి .రోజూ పూజ లో ఉపయోగించాలి .పండుగ రోజుల్లో ,పర్వ కాలాలలో ,గ్రహణ సమయం లో స్నానం చేసే టప్పుడు ఆ జలాన్ని మూడు చుక్కలు కలిపి స్నానం చేస్తే కాశీలో స్నానం చేసిన ఫలితం వస్తుంది .

          తూర్పు లేక పడమర వైపు చుట్టూ స్థలం వదిలి తొమ్మిది ఫీట్ల స్థలాన్ని ఆవు పేడ ,ఆవు మూత్రం ,గంగాజలం తో శుద్ధి చేసి ,అయిదు రకాల రంగులతో ముగ్గు లు వేయాలి .ఆ ముగ్గుల్లో‘’కాశీ విశ్వేశ్వరాయ నమః ‘’అనే అక్షరాలూ కూడా ముగ్గు తో రాయాలి .సరి పడ బల్ల పీటా వేయాలి .ముగ్గు పై ఒక తెల్ల వస్త్రాన్ని మూడు వరుసలుగా పరవాలి .దాని పై తొమ్మిది కిలోల శుభ్రం చేసిన బియ్యాన్ని పోయాలి ..ఆ బియ్యం మధ్య అయిదు పావు సేర్ల బియ్యం ఉడికే ఇత్తడి కలశాన్ని సున్నం రాసి అయిదు పోగుల దారానికి మామిడాకు ,లేక తమల పాకు ను మడిచి కట్టి కలశానికి అయిదు చుట్లు చుట్టి ,,పసుపు ,కుంకుమ తో అయిదు బోట్లు పెట్టి ,అలంకరించాలి .ఈ కలశాన్ని నీతితో నింపాలి .పంచ పల్ల వాలు   అంటే అయిదు రకాల చిగురు టాకులచిన్న కొమ్మలనుదగ్గర గా చేర్చి పచ్చని బట్టతో కట్టి ,కలశం లో ఉంచాలి దాని పై పెద్ద కొబ్బరి కాయను ,అడ్డం గా యజమాని వైపు ముఖం ఉన్దేట్లుఉంచాలి .చుట్టూ ఎనిమిది దిక్కులా ,రెండు తమల పాకుల్లో వక్కలు ,కర్జూర,బాదం వేయాలి .ఈశాన్యం లో నవగ్రహాలను కూడుక లో అమర్చాలి .ఆగ్నేయ ,నైరుతి ,వాయవ్య ఈశాన్య కోణాలలో వరుసగా అష్ట భైరవులను ,56వినాయకులను ,ద్వాదశాదిత్యులను ఏర్పాటు చేయాలి .వీటిలో వక్కలు కర్జూరం ఉంచాలి .ఉత్తరం లో నవ దుర్గలను ,గంగా దేవి మణి కర్ణికా లను ,తూర్పున ఏకాదశ రుద్రులను ,శివలింగాలను ,దక్షిణం లో దండ పాణి ,కాశీ గుహ భావానీలను ,బిందు మాధవుడిని ,పడమరగంగా ఘట్టాలను అమర్చాలి ఇరవై అయిదు కుడుకలు ,రెండు వందల ఎనిమిది పోకలు ,అన్నే కర్జూరాలు ,నూట ఎనిమిది తమల పాకులు కావాలి తొమ్మిది పోగులతో కూడిన కంకణాలను సిద్ధం చేసుకోవాలి .మండపాన్ని కొబ్బరి అరటి లతో అలంకరించాలి మామిడి తోరణాలు కట్టాలి .బంధువు లందర్నీ ఆహ్వానించాలి పైన ఉన్న అందరి దేవతలను ఆహ్వానించి యదా శక్తి గా పూజ చేసి నైవేద్యం పెట్టి హారతివ్వాలి ప్రదక్షిణ నమస్కారం చేయాలి ..ఈ కింది స్తోత్రం చెబుతూ సాష్టాంగ నమస్కారం చేయాలి

‘’జన్మ కారణ మైన కర్మకు –జన్మ మే లేని విధముగా –కర్మ భూమి లో వాసి కెక్కిన శర్మ భూమియే కాశి క్షేత్రము

పంచ భౌతిక దేహమిదియే –పంచ ప్రాణాత్మకము ఇదియే –పంచ క్రోశము తిరిగి నంతనె –పంచ ముఖు నె చేరులే

శక్తి తో అనురక్తి వీడి –యుక్తి తో ఆసక్తి వదిలి –అవి ముక్తమునే గాన్చుమా –ముక్తి పదవినే పొందుమా

ఆశాపాశము ద్రెంచుమా –ఆశను దాసిగా జేయుమా –క్లేశములే యెడ బాపుమా –కాశీ వాసము నీయుమా

దేవ దానవ మానవాళికి –దివ్య ధామము ,పాప నాశము –కవి కేదారుని ప్రాణ సమము –భువి లో వెలసిన భవు నివాసము ‘’

వారణా సీకీ జై –శ్రీ కాశీ విశ్వనాధ భగవాన్ కీ జై అని బిగ్గర అనాలి .

‘’హర హర మహాదేవ సాంబా –కాశీ విశ్వనాధ గంగా –మహాదేవ మహాదేవ విశ్వనాధ శివ శివ

మహా కాల మహా కాల రక్ష హర హర –హర సాంబ హర సాంబ సాంబ  సాంబ హర హర

హర శంభో హర శంభో శంభో శంభో హర హర అని అయిదు సార్లు అనాలి .

 కాశీ అన్న పూర్ణా విశాలాక్షీ సమేత విశ్వేశ్వర భగవాన్ కీ జై ,గంగా మాతకు జై అని గట్టిగా నినాదం చేయాలి .పరమేశ్వరార్పణం అని అక్షతలు నీరు వదలాలి .తొమ్మిది మంది దంపతులకు భోజనం పెట్టాలి

  ఈ విధంగా , విధి విధానం గా పూజ చేసిన వారికీ సర్వ తీర్ధ స్నాన ఫలం ,సమస్త క్షేత్ర దర్శన ఫలం ,కాశీ నివాస ,యాత్రా సంపూర్ణ ఫలం లభిస్తాయి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List