వేంకటేశ్వర చరితం శతానంద భరితం. ~ దైవదర్శనం

వేంకటేశ్వర చరితం శతానంద భరితం.

శతానందుడు జనకునితో 'మహారాజా! నారదమహర్షి చెప్పిన ఈ ఉపాఖ్యానాన్ని వాల్మీకి మహర్షితోపాటు యితర మునులం దరూ విని ఆనందించి వారంతా సంతృప్తులై వేంకటాచలానికి వెళ్ళారు. నేను వారి అను మతి తీసుకొని మిథిలా నగరానికి వచ్చాను. నేను విన్నదంతా మీకు చెప్పాను. ఈ విధంగా శరీరాన్ని పులకరింప జేసే అద్భుతమైన ఈ చరిత్రను విని జనకమహారాజు సంతోషించి తన పురోహితు డైన శతానందునితో 'మహాత్మా మీరు చెప్తున్న కథను వింటుంటే నాకు తృప్తి కలగడం లేదు. కావున మరల ఆ వేంకటె శ్వరుని గురించి చెప్పండి' అని అడిగాడు. అప్పుడు శతానందుడు మిథిలాధిపతియైన జనకమహారాజుతో 'మహారాజా! సవిస్తరంగా చెబుతాను. సావధానంగా వినండి!
పూర్వం నిమిపుత్రుడైన జనక మహారాజుకు వామదేవమహర్షి యజ్ఞం జరుగుచున్నపుడు చెప్పిన కథను నీకు చెబుతాను! అన్నాడు.

భగవదవతారవర్ణన
పూర్వం గంగానదీ తీరంలో వ్రతం పూర్తి చేసు కోనేందుకు అశ్వమేధ మహాయాగ దీక్షను పూని న జనకుని వద్దకు మనులంతా విచ్చేశారు. జన కమహారాజు వారందరినీ పూజించి సంతోషం తో ఆ మహర్షులతో యిలా అన్నాడు- 'మునిశ్రే ష్ఠులారా! ఈ రోజు నా జన్మ సార్థకమైనది నేను చేసిన తపస్సు ఫలించింది. మీరంతా కలిసి మా ఈ యజ్ఞ వాటికకు రావడం మా కెంతో సంతోషం' అనగా విని ముకులందరూ ఎంతో సంతోషించి జనకుని ఆదరానికి సంప్రీ తులై ఆ యజ్ఞశాలలో ఒక రాత్రి గడిపారు.

వారందరూ ఆ రాత్రంతా పరస్పరం అనేక విషయాలు మాట్లాడుకుంటుండగా రాత్రి గడిచి తెల్లారింది.
ఆ మహర్షులంతా ప్రాత:కాల సంధ్యావం దనం చేసి జనకమహార్షి ఉన్న యజ్ఞవాటికకు వచ్చారు. వారంతా శ్రీమన్నారాయణుని కథలను పరస్పరం చెప్పుకొంటూ జనకుని తోపాటు అక్కడ ఆసీనులయ్యారు. అప్పుడు మహాతేజస్సంపన్నుడు, బ్రహ్మర్షి అయిన వామ దేవుడు భూ ప్రదక్షిణం చేస్తూ అక్కడికి వచ్చాడు. వేదపారంగతులైన ఆ మహర్షు లందరూ లేచి నిలబడి నమస్కరించి బ్రాహ్మ ణోత్తముడై ఆ వామదేవునితో మహాత్మా వామదేవా! మిరు ఈ భూమినంతా చుట్టి వచ్చారు. కావున మి ద్వారా శ్రీ మన్నారాయ ణుని పవిత్రమైన దివ్య చరితమును వినాలని కుతూహలపడుతున్నాము. జగత్ప్రభువైన ఆ శ్రీనివాసుడు ఎక్కడ వేంచేసి ఉన్నాడు?

ఈ విషయం తెలుసుకోవటానికై జనక మహా రాజు ఎంతో ఆతురపడుతున్నాడు. కాబట్టి మాకా విషయాన్ని తెలియజేయ వలసింది! అని అడిగారు. ఆ మహర్షలందరూ ఆ విధంగా అడుగగా వామదేవ మహర్షి యిలా చెప్పసాగాడు-

ఇక్కడికి దక్షిణ దిక్కున రెండు వందలయోజనముల దూరంలో నారాయణ పర్వతమనే శ్రేష్ఠమైన పర్వతరాజమున్నది. దాని మీద దేవతలు, గంధర్వులు సిద్ధులు, మహర్షులు ఆహార నియమంతో నివసిస్తు న్నారు. నేను కూడా ఆ వేంకటాచలానికి వెళ్ళాను. అక్కడ అగస్త్యుడు, నారదుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరసుడు, దక్షుడు, జాబాలి మొదలైన మాననీయ మహర్షులందరూ యోగాభ్యాస పరాయణులై తపస్సు చేస్తున్నారు. నేను వారిని దర్శించి వారితో ఓ మహాత్ములారా! మీరందరూ కలిసి ఇక్కడ ఈ పర్వతం మీద ఎందుకు సమావేశమయ్యారు? అని అడుగగా వారంతా నేకేమి సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉన్నారు.

అప్పుడు మహాత్ముడైన అగస్త్యమహర్షి నన్ను పిలిచి యిలా అన్నాడు- 'మేమిక్కడ ఉండటానికి కారణం చెబుతాను విను. యోగులలో శ్రేష్ఠుడైన నారదమహర్షి భగవంతుణ్ణి ఉపాసిస్తూ గోదావరీ తీరంలో కొన్నాళ్ళు ఉన్నాడు. కాని ఆయనకు శ్రీపతి దర్శనం కాలేదు. ఆయన పరలోకమైన వైకుంఠంలో ఆయన కనపడలేదు. దానితో నారదముని ఆందోళన చెంది సనాతనుడైన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి పితామహా! సకల జీవులకు పరమాత్మయైన సనాతనుడైన పరదేవతయైన శ్రీమన్నారాయణుడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి అని అడిగాఉ.
అప్పుడు బ్రహ్మదేవుడు కొంతసేపు ధ్యానం చేసి అంజలిబద్ధుడై నిలిచిన నారదునితో యిలా అన్నాడు- ఓ మహామునీ! భూలోకంలో నారాయణగిరి అనే పర్వతమున్నది. దానిమీద పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో క్రీడిస్తున్నాడు. ఆయనకు ఆ పర్వతంపై ఉండాలని, విహరించాలని చాలా ప్రీతి కలిగింది. కాబట్టి నారదా! నీవా సర్వేశ్వరుడైన జగత్ప్రభువును చూడాలనుకుంటే వేంకటాచలానికి వెళ్ళు!
బ్రహ్మదేవుడు ఈ విధ:గా ఆదేశించగా మునిశ్రేష్ఠుడైన నారదుడు అక్కడి నుంచి బయలుదేరి వేంకటాచలాన్నివస్తున్నాడు. దారిలో మేమందరమూ ఆయనతో కలిశాం మేమంతా కలిసి వేంకటాచలాన్ని చేరాం. ఆ తరువాత చతుర్ముఖబ్రహ్మ దేవతలతో కూడా అక్కడకు వచ్చాడు బ్రహ్మదేవుడు మా అందరితో కలిసి ఆ మహత్తర పర్వతం మీద అవ్యయుడు, నాశరహితుడు అయిన పరమాత్మను వెతుకుతూ సంచరించాడు. కాని ఆ పురుషోత్తముడు కనపడలేదు.

అప్పుడు బ్రహ్మదేవుడు నారదునితోను, మహర్షులమైన మాతోను యిలా అన్నాడు. మహా మునులారా! ఈ పర్వతం మీద ఎన్ని నదులున్నవో ఎన్ని సరస్సులన్నవో శుభప్రదములైన మహా పుణ్య్ర ప్రదములైన పవిత్ర జలములు కల పుష్కరిణులు ఎన్ని ఉన్నవో, చెరువులెన్ని ఉన్నవో, అలాగే బావులు సెలయేళ్ళు, దిగుడు బావులు, మునులు సేవించే పవిత్ర మడుగులు మొదలగునవి ఈ పావనమైన పర్వతం మీద ఎన్నున్నాయో వాటన్నిటిని మీరు సేవిస్తూ ఈ పర్వతమంతా సంచరిస్తూ ఈ పర్వతానికి మీరంతా ప్రదక్షిణం చేయండి. శ్రీహరి మీకు దర్శనమిచేంతవరకూ ఎంతకాలమైనా సరే మిరీ పర్వతంపైనే విహరించండి! అని చెప్పి లోక పితామహుడైన బ్రహ్మదేవుడు తన అనుచరులతో దేవతలతోపాటు అక్కడే అదృశ్యమయ్యాడు.

ఓ జనకమహారాజా! అప్పుడు అగస్త్య మహర్షి యితర మునులతోపాటు అనాది అయిన అపరబ్రహ్మకు నమస్కరించి పరబ్రహ్మస్వరూపుడైన వాసుదేవుని గురించి చింతిస్తూ వృషభాద్రివాసుడైన ఆ దేవదేవులని దర్శించగోరుతూ ఆ పర్వతానికి పశ్చిమ దిక్కుదాటి అక్కడ తపస్సు చేస్తూ దేవదేవుడైన శ్రీమరిని స్మరిస్తూ బ్రహ్మదేవుని పలుకులను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడక్కడ తపస్సుతో పవిత్రులైన బుషులతోను సూర్య సమాన తేజస్సుతో జడలను ధరించిన మునులతో కలిసి ఆ పర్వతం మీద సంచరిస్తూ వాయవ్య దిక్కులో ఒక గొప్ప అద్భుతాన్ని దర్శించాడు.

శుద్ధ స్ఫటికమువలె తెల్లని పాలరాతివలె నున్న ఒక పెద్ద రాయి కనబడింది. అది చూడటానికి ఎంతో అందంగా నున్నగా, విశాలంగా, శుభ్రంగా ఉంది. ఆ రాతిపై ఒక ఆజానుబాహుడు, పర్వతాకారుడు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అతని నేత్రాలు విశాలంగా ఉన్నాయి. భయంకరమైన కోరలు, పెద్దదవడలు, విశాలమైన వక్ష:స్థలం, గొప్ప భుజాలు కలిగి ఉన్నాడు. ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్రని చందనం పూసుకున్నాడు. చంద్రునివలె ప్రకాశిస్తున్న దివ్యమైన రత్న కుండలాలు ధరించాడు. ఎర్రగా మెరుస్తున్న ఆభరణాలను ధరించాడు. అనేక రత్నఖచితాలైన దివ్యాభరణాలతో విరాజిల్లుతున్నాడు. నానాదవిధ రత్నాలతో శోభాయమానమైన కిరీటాన్ని ధరించాడు. మహాభుజ పరాక్రమాలు గల ఆ మహానీయుడు, మహావీరుడు, శ్యామల వర్ణంలో ఉన్నాడు.

అగస్త్య మహర్షి ఆశ్చర్య చకితుడై ఆయనకు మరల మరల తేలిపార చూశాడు. ఆ తరువాత ఆ మహర్షి సత్తముడు సూర్యతేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ దివ్య పురుషునికి (దేవునికి) నమస్కరించి మహాత్మా! ప్రియదర్శనా! మహావీరా! నీవెవరు? ఎవరి పుత్రుడవు? ఎవరివాడవు? మాకు నీ వృత్తాంతాన్ని యథార్థంగా చెప్పు. అబద్ధమాడవదు! అని వినేవారికి ప్రీతికలుగునట్లుగా మధురమైన వాక్కులతో స్తూతిస్తూ తనను ప్రశ్నించిన మహాతేజశ్శాలియైన అగస్త్య మహర్షితో ఆ మహాపురుషుడు ఏమీ మాట్లాడలేదు. ఆయన అగస్త్య మహర్షిని మరల మరల చూశాడు. ఆ మహాత్ములైన మహర్షులందరూ చూస్తుండగానే! మహాతేజశ్శాలియైన ఆ పురుషుడు అంతర్థానం చెందాడు. అది వారికి మహాశ్చర్యం కలిగించింది. అప్పుడు ఆ మునులందరూ ఆశ్చర్యంతో విప్పారిన నేత్రాలు కలవారై ఆహా! ఏమి ఆశ్చర్యం! ఏమి అద్భుతం! మనం ఎటువంటి మహాద్భుత దృశ్యాన్ని చూశాము! సూర్యుని వంటి కాంతికల మహాశ్చర్యకరమైన తన దివ్యరూపాన్ని మనకు దర్శింపజేసి ఆ మహాపురుషుడు తన మాయతో మనలను మోహింప జేసి వెంటనే అదృశ్యమయ్యాడు! అని ఆ మునందరు అనుకుంటూ అద్భుత తేజశ్శాలియైన ఆ దివ్యపురుషునికి, దేవుదేవునికి నమస్కరించి ఆ పర్వతంపై సంచరించసాగారు.

అగస్త్యమహర్షి దేవదేవుడు, సర్వాంతర్యామి, సర్వజీవ హృదయవాసి అయిన ఆ భగవంతుని దర్శించగోరిన వాడై మునులందరితో కూడి నారాయణాద్రి యొక్క విశాలము, నిర్మలమునైన పశ్చిమదిక్కును వదలి ఆ మహర్షి సత్తముడు, బ్రాహ్మణోత్తముడు, మహాత్ముడు ఆ పర్వతం ఉత్తర దిక్కునకు చేరాడు.

భగవదన్వేషణ
మహాతేజశ్శాలియైన అగస్త్య మహర్షి మునులందరితో కూడి ఆ వేంకటాచలంపై సంచరిస్తూ ఆ పర్వతం ఉత్తర భాగంలో ఆశ్చర్యకరమైన అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. అక్కడ నేరేడు వృక్షాల పెద్దపెద్ద కొమ్మలు వ్రేలాడుతున్నాయి. ఆ వృక్షాలు తెల్లగా ఉన్నాయి. అక్కడి చెట్లు, లతలు పండ్లు, తెల్లని పూలతో శోభిస్తున్నాయి. నిర్మలమైన నీటితో కూడిన పవిత్రమైన సరస్సులు, పుణ్య ప్రదములు, సర్వపాప హరములు, దర్శనమాత్రం చేతనే శుభాన్ని కలిగించే పుణ్యనదులలో అగస్త్య మహర్షి ఇతర మునులందరితో పాటు శౌచ విధులను నిర్వర్తించి యథావిధిగా శ్రద్ధతో నిర్మలమైన మనస్సుతో వాసుదేవుడైన శ్రీ మన్నారాణుని, శ్రీహరిని మనస్సులో ధ్యానిస్తూ స్నానం చేశాడు.

ఆ తరువాత సంధ్యాది అనుష్ఠానములనన్నింటిని పూర్తి చేసి జగత్ప్రభువైన ఆ కేశవుణ్ణి నిశ్చల చిత్తంతో ఆరాధించాడు. ఆ దేవదేవుని దర్శించుటకై మునులతోపాటు బయలుదేరాడు. ఆ పర్వతమంతా సంచరిస్తూ ఆగిరికి ఉత్తర దిక్కున నానా విధములైన వృక్షములతో శోభిస్తున్న పర్వతాకారములైన మేఘములతో కూడిన, చూచుటకు సుందరమైన దృశ్యాన్ని చూశాడు. మృగాలు, సర్పాలు, కొండచిలువలు, మహానాగులు, పక్షులతో నిండి అనేక పూల తీగలతో అల్లుకుపోయి ఆ ప్రదేశం సుందరంగా ఉంది.

అక్కడ చల్లని వాయువు సుఖంగా వీస్తున్నది. అక్కడి తటాకాల్లోని నీరు చల్లగా ఉంది. భ్రమరాలు (తుమ్మెదలు) ఝుంకారం చేస్తూ పూలలోని మధువును ఆస్వాదిస్తున్నాయి. ఆ కొండగుహల నుంచి బయటకు వచ్చిన కోకిలలు మధురంగా గానం చేస్తున్నాయి. గంధర్వులు సుస్వరంగా పాడుతున్నారు. నెమళ్ళు పెద్దగా పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. రావి, జువి, మారేడు వృక్షాలు, పాటలి వృక్షాలు నిండుగా పూసి పూలతో శోభిస్తున్నాయి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List