పంచవింశ బ్రాహ్మణం. ~ దైవదర్శనం

పంచవింశ బ్రాహ్మణం.

వేదసంహిత లోని మంత్రమును, శాస్త్రవిధిని వివరించేది మరియు యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. ఇది గృహస్తులకు ఎక్కువగా వినియోగపడుతుంది. ఋగ్వేదం లో ఐతరేయ బ్రాహ్మణము, సాంఖ్యాయన బ్రాహ్మణము అనే రెండు విభాగాలున్నాయి. అలాగే శుక్ల యజుర్వేదంలో శతపథబ్రాహ్మణము, కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ బ్రాహ్మణము, మైత్రాయణ బ్రాహ్మణములు ఉన్నాయి. సామవేదంలో ఛాందోగ్య బ్రాహ్మణము, తాండ్య (పంచవింశ) బ్రాహ్మణము, ఆర్షేయ బ్రాహ్మణము, షడ్వింశ బ్రాహ్మణము, అదభుత బ్రాహ్మణము, ఉపనిషత్ బ్రాహ్మణములు ఉన్నాయి. అధర్వణ వేదం లోని బ్రాహ్మణమును గోపథ బ్రాహ్మణము లోని అంటారు.

తాండ్య బ్రాహ్మణా న్ని పంచవింశ బ్రాహ్మణం లేదా ప్రౌఢ బ్రాహ్మణం అని కూడా వ్యవహరింతురు. ఇది సామవేదము నకు చెందిన ఇరవైఅయిదు ప్రపాఠకాలు (అధ్యాయాలు) కలిగి ఉన్న బ్రాహ్మణం. ఇది కౌతుమ మరియు రణయణీయ అనే రెండు శాఖ లకు చెందినది. సాధారణంగా ఇది ఉద్గతారుల బాధ్యతలు, మరీ ముఖ్యంగా వివిధ రకాల శ్లోకాలు యొక్క బాధ్యతల గురించి వ్యవహరిస్తుంది (తెలియజేస్తుంది).

విషయాలు
భరతుడు పురోహితులు వశిష్టగణం, (పం.విం.బ్రా.15.4.24)
విశ్వామిత్రుడు ఋషిత్వము సంపాదించారు. (పం.విం.బ్రా.14.3.12)
తాండ్యబ్రాహ్మణంలో కుసురబిందు (22.15.10) బహుభావ ఫలమును సాధించే దశరాత్రయాగం చేసి భాగ్యాన్ని పొందాడు అని ఉటంకించ బడ్డది..

విభాగాలు
పంచవింశ బ్రాహ్మణం 25 ప్రపాఠకాలు గా విభజించబడింది, ఆ తదుపరి ఇవి తిరిగి 347 ఖండాలు (ఖండికలు)గా విభజింప బడ్డాయి. ఈ క్రింద సూచించిన పట్టిక ద్వారా మనము తెలుసుకోవచ్చును.

ప్రపాఠకం I : యజుస్సుల సేకరణ
ప్రపాఠకం II-III : విస్తుతులు
ప్రపాఠకం IV–IX.2: వివిధ ఆచారాలు (జ్యోతిష్టోమ, ఉక్థ్య, అతిరాత్రం,, ప్రకృతి యొక్క ఏకాహాలు మరియు ఆహ్నలు),
ప్రపాఠకం IX.3–IX.10: సోమప్రాయశ్శ్చిత్తాలు
ప్రపాఠకం X–XV: దాదశాంశ కర్మ(లు)
ప్రపాఠకం XVI–XIX: ఒక రోజు కర్మ(లు)
ప్రపాఠకం XX–XXII: ఆహ్నికర్మలు
ప్రపాఠకం XXIII–XXV: దీర్ఘకాలం కర్మ(లు)
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List