అడుగడుగున గుడివుంది. ~ దైవదర్శనం

అడుగడుగున గుడివుంది.

వరంగల్‌ జిల్లా కేంద్రానికి 75కి.మీ. దూరంలో ఉన్న ఈ పాలంపేటలో హుందాగా నిలచి ఉన్న ఆలయం రామప్ప గుడి. పూజింపబడే దైవం పేరుమీదో లేక కట్టించిన పాలకుడి పేరుమీదో దేవాలయాలు ప్రసిద్ధమవటం పరి పాటి. కానీ దానికి భిన్నంగా అద్భుతమైన ఈ ఆల యాన్ని అందాల ప్రోవులా రూపకల్పన చేసిన ఆ శిల్పకళా చార్యుడు రామప్ప పేరుమీద రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి కెక్కింది ఈ ఆలయం.
ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు ప్రముఖంగా శైవులు అయినా పరమత సహనం మిక్కుటంగా కలవారు. అంత కన్నా ఎక్కువగా భగవత్భక్తులూను. ఆప్రభువులు రాజ్య మేలిన కాలంలో ఎన్నోదేవాలయాలు ఈ తెలుగు గడ్డపై వెలిశాయి. వాటిలో ఒకటి ఈ అపురూప కళా నిలయమైన ఈ రామప్ప దేవాలయం. కాకతీయ రాజు రేచెర్ల రుద్రదేవుడి కాలంలో జరిగిందీ ఆలయ నిర్మాణం. పుష్పాకారంలో ఉన్న ఈ ఆలయంలోని మూలవిరాట్టు శ్రీరామలింగేశ్వర స్వామి. ఈయనే కొంతకాలం రుద్రేశ్వర నామంతో పూజలందుకున్నాడని కూడా చెప్తారు. గర్భాలయానికి కుడివైపు కాళేశ్వరస్వామి ఆలయం, ఎడమ వైపు కామేశ్వరస్వామి సన్నిది, ఎదుట ఉన్న ప్రదేశంలో నందీశ్వరస్వామి నెలవు ఉన్నాయి. గుడిలోని ప్రతి అంగు ళమూ శిల్పకళా విలాసమే. స్తంభాలపై నాట్యభంగిమల్లోని సౌందర్యాలు, పురాణగాధలు, చారిత్రక ఘట్టాలు మనసెంతో ఆకట్టుకుంటాయి. ఈ ఏకశిలా స్తంభాలపై పేరిణి శివతాండవ దృశ్యాలు ఎంతో మంది నాట్యో పాస కులకు నాట్య విద్య నేర్పే విధంగా ఉన్నాయి. పైకప్పులో కూడా ఎంతో శిల్ప విన్యాసం ఉంది.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...