భోగినీ ~ దైవదర్శనం

భోగినీ

సుఖ సౌఖ్యముల స్వరూపిణీ శ్రీమాత అని అర్ధము.శ్రీమాత ఆరాధకు లకు సుఖ సౌఖ్య పరంప రలు మెండుగ నుండును. సకల సౌభాగ్యములుండు ను. జీవితమున జీవితమున యోగముతో  పాటు భోగము వైభోగము వుండును. రోగము లుండవు. సంతోషమెప్పు డును వీరినంటి పెట్టు కొని  యుండును.  శ్రీమాత ఆరాధనా బలమున సత్యమును ధర్మమును అప్రయత్నముగ అనుసరింతురు.

మానవ జీవితము మూడు రకముకుగ గోచరించును. యోగ మయము భోగ మయము  రోగ మయము రోగములచే పీడింప బడువారు ప్రయత్నించి  సత్యధర్మముల నిలబడ వలెను. భోగమయ జీవితము వర్ణితము కాదు  యోగులయందు భోగులు కూడా అనేకులు కలరు. యోగము లేని భోగమే రోగములకు యోగమయ జీవితమున యమ నియ
మము లాచరించుట వలన మానసిక సుఖ ముండును. అట్టివారు సంతోషముగ కర్తవ్యము లను నిరవర్తించు చుందురు అంతరంగము న ఆరాధన జరుగు చుండును. అంతరంగము న దైవముతో యోగము చెందుట బహిరంగమున వైభవమున జీవించుట శ్రీమాత అనుగ్రహముగ వీరికి లభించును.జీవితమున కర్తవ్యమును నిర్వర్తించువారు రెండు రకములుగ నుందురు నిర్వర్తిచవలెను కదా అని నిర్వర్తించువారు మెండు.

అట్టివారు కర్తవ్యము తప్పదు గనుక నిర్వర్తింతురు. తప్పుకొనుటకు వీలున్నచో తప్పించు కొందురు. వీరికి సుఖము శాశ్వతము కాదు. తనకున్న పని తీరకున్నా తప్పదు అని చేయు వారు కర్తవ్య నిర్వహణమును మానసికమైన బరువుతో చేయుదురు. తప్పనిపని యైనను ఉల్లాసముగా  చేయుట అను మార్గ మొకటున్నది ఇష్టపడి చేసినచో కష్టమైన పని అయిననూ సంతోషము గ నిర్వర్తించ వచ్చును.

ఇట్లు కర్తవ్యములను ఇష్ట పడి చేయుట ఎవరి కబ్భు నో వారే జీవితమును సుఖమయము గావించు కొనగలరు. ఇట్టివారే జీవితమున సంపద లుండుట,లేకుండుట లతో సంబంధము లేక వైభోగముగ జీవింతురు . వీరు జీవించు విధానము న సత్య ధర్మ వైభవము గోచరించును. వీరియందు గోచరించు వైభోగమే భోగినీ. 
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List