నల్లమల అభయారణ్యలో కాలి నడకన జ్యోతి క్షేత్రం నుండి ఎగువ శ్రీ అహోబిలం నరసింహ స్వామీ వరకు అధ్భుతమైన యాత్ర... ~ దైవదర్శనం

నల్లమల అభయారణ్యలో కాలి నడకన జ్యోతి క్షేత్రం నుండి ఎగువ శ్రీ అహోబిలం నరసింహ స్వామీ వరకు అధ్భుతమైన యాత్ర...



ప్రకృతి అందాలకు పెట్టింది పేరు నల్లమల. అడవి లో ఎటుచూసిన గల గల పారే సెలయేళ్ళు, పక్షుల కిలకిల రావాలు, ఆకాశాన్ని తాకే చెట్లు, పచ్చిక బయళ్ళు కనిపిస్తుంటాయి. నల్లమల ఒక సుందర మనోహర దృశ్యం వర్ణించటానికి మాటలు చాలవు. ప్రకృతి రమణీయ దృశ్యాలు, ఆధ్యాత్మిక దర్శనీయ క్షేత్రాలు, ఎటూ చూసిన పచ్చదనం పరుచుకున్న అరణ్యం, ఆటవిడుపు సందర్శనానికి అనువైన కేంద్రం గా నల్లమల విరాజిల్లుచున్నది. ఈనేలలో కురిసిన వర్షాలకు అడవిఅంత పచ్చబడింది. నిండుపచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంతో యాత్ర ఒక అధ్భుతం...
.
కడప జిల్లాలోని కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రం నుండి కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం ఎగువ శ్రీ అహోబిలం నరసింహ స్వామీ ఆలయానికి దట్టమైన నల్లమల అభయారణ్యం గుండా కాలినడకన సుమారు 28 కిలోమీటర్ల యాత్ర సాగును. అటవి అధికారుల అనుమతితో జ్యోతి క్షేత్రం నుండి కాలినడకన గరుడాద్రి, కాశినాయన త్రిలింగ పిఠం, బ్రహ్మ,విష్ణు, రుద్ర గుండాలు, కోనేర్ల, అంజనాద్రి, నల్లమల జలపాతాలు, పాములేటి నరసింహ స్వామీ ఆలయం, ఎగువ శ్రీ అహోబిలం నరసింహ స్వామీ ఆలయాలను దర్శంచుకొని తిరుగు ప్రయాణం కాలినడకన కాశినాయన జ్యోతి క్షేత్రానికి చేరుకోని జ్యోతి క్షేత్రం లోని శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన దర్శనంతో యాత్ర ముగుస్తూంది.


https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List