కాశీ ఖండం-37 ~ దైవదర్శనం

కాశీ ఖండం-37



  నవ దిన కాశీ యాత్ర...    మనిషి తల్లి గర్భం లో తొమ్మిది నెలలుంటాడు .జన్మ రాహిత్యం ఇచ్చేది కాశి ఒక్కటే .అందుకని వ్యాస మహర్షి కాశీ లో తొమ్మిది నెలలు దీక్ష లో ఉండి ,అ తర్వాతా స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలిఅని చెప్పాడు . .అయితే కలికాలం లో ఇంత శ్రద్ధ తో అంతకాలం ఉండలేమని ఇంకేదైనా ఉపాయం చెప్పమనిసామాన్యులు  కోరారు .దానికి అయన తొమ్మిది రోజులుంటే ఆ ఫలితం ఢోకా లేకుండా వస్తుంది అని చెప్పాడు .అలానే ఇప్పుడు సమయం ఉన్న వారందరూ కాశి లో తొమ్మిది రోజులుండి వస్తున్నారు .మరి ఆ రోజుల్లో ఏం చెయ్యాలి ?విశ్వేశ్వర నామ స్మరణ ,దానాలు చేయటం ,ధర్మ ప్రసంగాలు వినటం , ,ఏక భుక్తం ,ప్రాతఃకాల స్నానం ,ఉదయం రాత్రి విశ్వేశ్వర దర్శనం ,కోపం లేకుండా ఉండటం ,అబద్ధమాడకున్డటం ,అనే ఎనిమిది అంశాలు ఖచ్చితం గాఅమలు చేయాలి

           మొదటి రోజు కార్యక్రమం

‘’ఆగత్య మణి కర్న్యామ్తు –స్నాత్వా దత్పధనంబహు –

  వపనం కారయిత్వాతు –స్నిత్వా శుద్ధాహ్ వయోవ్రతః

  సచేల మభి మజద్యా ధ–కృతా సంధ్యాధిక  క్రియాహ్

  సంతర్ప్య తర్మ్యాద పిత్రూన్ –కుశ గంధ తిలొదకైహ్’’

    మొదటిగా మనసులో ముప్పది మోడు కోట్ల దేవతలు,తీర్ధాలతో సర్వ పరివారం తో సేవింప బడుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వరా !శరణు !అనుజ్న !అని స్మరించుకొని మణి కర్ణికా తీర్దానికి వెళ్ళాలి .దీనికే చక్ర తీర్ధం అంటారు .సాక్షాత్తు శ్రీమన్నారాయనుడే మహా దేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడు శివుడికి పార్వతి తర్వాతా ఇష్టమైన వాడు విష్ణువే .అందుకే ‘’నారాయణీ సహా చరయ నమశ్శివాయ ‘’అన్నారు .విష్ణు సేవా ఫలితం గా ఏర్పడిన మణి కర్ణిక కు గొప్పదనాన్ని ఆపాదించాడు విశ్వేశుడు .

            యాత్రీకులు మణి కర్ణిక లో స్నానం చేయాలి .బ్రాహ్మణులకు దానాలు చేయాలి .కేశ ఖండనం చేసుకొని ,మళ్ళీ స్నానం చేయాలి .మహేశ్వరాదులను అర్చించి మళ్ళీ స్నానం చేయాలి.రుద్రాక్ష మాల ధరించి ఈకింది శ్లోకం చదువు కోవాలి

  ‘’కిము నిర్వాణ పదస్య భద్ర పీతం –మృదులం తల్ప మదోను మోక్ష లక్స్యః

   అధవా మణి కర్ణికా స్థలీ పరమానంద సుకాండ జన్మ భూమి

  చరా చరేషు సర్వేషు-యావంతస్చ సచేతనః –తావంతిహ్ స్నాంతి మధ్యాహ్నే –మణి కర్నీజతే మలే ‘’

‘’ఆ గంగా కేశవస్చైవ –ఆ హరిన్ద్రస్చ మండ పాత్ –ఆ మద్ధ్యా ద్దేవ సరితః స్వర్ద్వారా  న్మణికర్ణికా నమస్తే నమస్తే నమః‘’అని నమస్కరించి అక్కడ నుండి డుంది వినాయకుడిని దర్శించి ఇరవవై ఒక్క గరికలను ,ఇరవై ఒక్క కుడుములను సమర్పించి ,ఇరవై ఒక్క సార్లు గుంజీలు తీసి ఇరవై ఒక్క  రూపాయలు దక్షిణ గా సమర్పించాలి

 ‘’దున్దీ రాజ గణేశాన –మహా విఘ్నౌఘనాశన –నవాఖ్యాదిన యాత్రార్ధం –దేహ్యాజ్ఞానం కృపయా విభో’’అని ప్రార్ధించాలి .తర్వాతా అన్నపూర్ణా దేవిని సందర్శించాలి ఆ తర్వాతా విశాలాక్షి ,జ్ఞాన వాపి ,సాక్షి గణపతులను చూడాలి .ఇది పూర్తీ చేసి నివాసం చేరి భోజనం చేయాలి రాత్రికి విశ్వనాదుడిని దర్శించాలి ఫలాలు పాలు ఆహారం గా గ్రహించాలి

 ‘’హర సాంబ హర సాంబ సాంబ సాంబ హరహర –హర శంభో హర శంభో –శంభో శంభో హరహర

 మహాదేవ మహాదేవ విశ్వనాధ శివ శివ –మహాకారి మహా కారి రక్ష రక్ష హరహర ‘’

 అంటూ పద కొండు సార్లు భజన చేసి నిద్రపోవాలి
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List