పక్షవాతం - పేకముక్కల చికిత్స ~ దైవదర్శనం

పక్షవాతం - పేకముక్కల చికిత్స

ఒక పెద్దాయనకు పక్షవాతం వల్ల కుడిపక్కన అవయవాలన్నీ చచ్చుబడిపోయి చలనం లేకుండా పోయింది. వైద్య చికిత్స వల్ల ఫలితం అంతగా కనిపించడం లేదు. అతనికి మాటలు రాక జ్ఞాపకశక్తి కూడా నశించిపోయింది. వారి భార్య పరమాచార్య స్వామి వారి వద్దకు వెళ్ళి కళ్ళ నీరు కారుస్తూ తన గోడు చెప్పుకుంది.

“మహాస్వామి వారు కరుణించి నా భర్తను మళ్ళా మామూలు మనిషిని చేయవలసినది” అని ప్రార్థించింది.

స్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.

”అతను కోలుకోవడానికి ఏమైనా చెయ్యడానికి సిద్ధమా?” అని అడిగారు

”ఎంత ఖర్చైనా పర్లేదు పెరియవ” అన్నది ఆవిడ.

”నా ఆంతర్యం అది కాదు. నేను చెప్పిన విషయం తేలికగా తీసుకోరు కదా?” అని అడిగారు.

”లేదు పెరియవ మీరు చెప్పినట్టే చేస్తాను”

“రెండు కట్టల పేకముక్కలు తీసుకుని ఎల్లప్పుడూ అతని కంటికి కనబడేట్టు పెట్టండి. నిదానంగా అతని జ్ఞాపకశక్తి పెరిగి మాటలు వస్తాయి” అని సెలవిచ్చారు.

ఆ వచ్చినావిడ తెల్లబోయింది. కాని అది సరైన వైద్యమే అని నిర్ధారించుకుంది. కాని ఒక్క విషయం ఆవిడకి అర్థం కాలేదు. “నా భర్త పేకాటకు బానిస అని స్వామి వారికి ఎలా తెలుసు” అని అనుకుంది. కాని రోజంతా పేకముక్కలు చూసినంతమాత్రాన తన భర్త పక్షవాతం నుండి బయటపడతాడా?

పరమాచార్య స్వామి ఆజ్ఞప్రకారం ఆవిడ అలాగే చేసింది. కొద్దిరోజులలోనే ఆ పెద్దమనిషి కోలుకోవడం ప్రారంభించాడు. అతని జ్ఞాపకశక్తి పుంజుకోవడం ప్రారంభించింది. కొద్దిరోజుల తరువాత పూర్తిగా కోలుకున్నాడు.

మనవళ్ళతో పేకాట ఆడటం మొదలుపెట్టాడు. పిల్లలు తప్పు చేస్తే ప్రేమతో మందలిస్తూ, “నువ్వు ఇప్పుడు స్పేడ్ వెయ్యలి హార్ట్స్ కాదు” అనేవాడు. పడిపోయిన నోరు కూడా బాగుపడి మాట్లాడడం మొదలు పెట్టాడు.

ఎంటువంటి పరిహారం సూచించారు మహాస్వామి వారు? ఇంటి వైద్యమా? పేక వైద్యమా? ఏదేమైనా గెలుపు ముక్క ఉన్నది వారిచేతుల్లోనే.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List